శ్రీ లలితా సహస్ర నామములు - 89 / Sri Lalita Sahasranamavali - Meaning - 89

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 89 / Sri Lalita Sahasranamavali - Meaning - 89 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀

🍀 409. శివప్రియా -
శివునికి ఇష్టమైనది.

🍀 410. శివపరా -
శివుని పరమావధిగా కలిగినది.

🍀 411. శిష్టేష్టా -
శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము గలిగినది.

🍀 412. శిష్టపూజితా -
శిష్టజనుల చేత పూజింపబడునది.

🍀 413. అప్రమేయా -
ప్రమాణము లేనిది; ప్రమాణములకు లొంగనిది.

🍀 414. స్వప్రకాశా -
తనంతట తానే ప్రకాశించునది.

🍀 415. మనోవాచామగోచరా -
మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప వీలుకానిది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 89 🌹

📚. Prasad Bharadwaj

🌻 89. śivapriyā śivaparā śiṣṭeṣṭā śiṣṭapūjitā |
aprameyā svaprakāśā manovācāmagocarā || 89 || 🌻

🌻 409 ) Shiva priya -
She who is dear to Lord Shiva

🌻 410 ) Shivapara -
She who does not have any other interest except Lord Shiva

🌻 411 ) Shishteshta -
She who likes people with good habits

🌻 412 ) Shishta poojitha -
She who is being worshipped by good people

🌻 413 ) Aprameya -
She who cannot be measured

🌻 414 ) Swaprakasha -
She who has her own luster

🌻 415 ) Mano vachama gochara -
She who is beyond the mind and the word

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

14 Jun 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 40

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 40 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. పుణ్య లక్షణములు 🌻

మహనీయముల పుణ్య లక్షణములను, పవిత్ర వర్తనలను, సమస్తమును గ్రహించు చుండవలెను. తానుగాని, ఇతరులు గాని ఈ గుణములు కలిగియున్నవారు ముఖ్యము కాదు. ఉన్న గుణములు ముఖ్యము.

పువ్వుల నుండి గాలికి వెలువడిన సుగంధమును పూవులతో సంబంధము లేకుండ ముక్కుతో ఎట్లు అనుభవించునో, అట్లే వ్యక్తుల తరతమ భేదదృష్టులు లేక గుణములను అనుభవించి కీర్తించు వాడు కావలెను.

🌹 🌹 🌹 🌹 🌹

14 Jun 2021

శ్రీ శివ మహా పురాణము - 412

🌹 . శ్రీ శివ మహా పురాణము - 412🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 23

🌻. దేవతలు శివుని దర్శించుట - 2 🌻

పార్వతి ఇట్లు పలికెను-

తండ్రీ! పూర్వము మీకు చెప్పియుంటిని. తల్లీ! నీవు మరచితివా యేమి! బంధులారా! ఇప్పుడైననూ నా ప్రతిజ్ఞను వినుడు (11). ఈ మహాదేవుడు విరాగి. ఆయన కోపించి మన్మథుని భస్మము చేసినాడు. భక్త వత్సలుడగు అట్టి శంకరుని తపస్సు చేసి సంతోషపెట్టెదను (12). మీరందరూ ఆనందముగా మీ మీ గృహములకు వెళ్లుడు. శివుడు తప్పక ప్రసన్నుడు కాగలడు. ఈ విషయములో చర్చను చేయ తగదు (13). ఏ శివుడు మన్మథుని, హిమవంతుని వనమును తగులబెట్టినాడో, అట్టి శివుని కేవలము తపః ప్రభావముచే ఇదే స్థానమునకు తీసుకొని వచ్చెదను (14).

గొప్ప తపస్సు యొక్క బలముచే సదాశివుని సులభముగా సేవించవచ్చును. మహాత్ములారా! మీకు నేను ముమ్మాటికీ సత్యమును చెప్పుచున్నాను. తెలియుడు (15). చక్కగా మాటలాడునది, పరమేశ్వరి యగు పార్వతి మేనకను, అన్నగారు అగు మైనాకుని, మందరుని, తండ్రియగు హిమవంతుని ఉద్దేశించి ఇట్లు పలికి మిన్నకుండెను (16). పార్వతి ఇట్లు పలుకగా, మేరుపు మొదలగు విద్వాంసులైన ఆ పర్వత రాజులు విస్మితులై పార్వతిని అనేక విధముల కొనియాడుచూ వచ్చిన దారిని వెళ్లిరి (17).

వారందరు వెళ్లగానే సఖురాండ్రతో గూడియున్న పార్వతి శివదర్శనమునే పరమ లక్ష్యమునందు దృఢమైన చిత్తము గలదై, అంతకంటె అధికమగు తపస్సును చేసెను (18). ఓ మునిశ్రేష్ఠా! స్థావర జంగమములతో, దేవరాక్షసులతో, మానవులతో కూడియున్న ముల్లోకములు ఆ గొప్ప తపస్సుచే తాపమును పొందెను (19). అపుడు దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, చారణులు, సిద్ధులు, సాద్యులు, మునులు, విద్యాధరులు, నాగులు (20), ప్రజాపతులు, గుహ్యకులు మరియు ఇతరులు అందరు తీవ్రమగు కష్టమును పొందిరి. కాని దాని కారణమును వారెరుగరైరి (21).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

14 Jun 2021

గీతోపనిషత్తు -212

🌹. గీతోపనిషత్తు -212 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 4 - 1

🍀 3-1. యజ్ఞము - బ్రహ్మము నుండి వ్యక్తమైన ఆత్మ నుండి అష్ట ప్రకృతులు వ్యక్తము కాగ, అందు ఆత్మ యుండుట వలన పురుషుడగును. ఈ పురుషునకు, అష్ట ప్రకృతులకు మూలము ఆత్మ. అది దైవీ స్వభావమే. అనగా పరతత్త్యమే ఆత్మగను, ప్రకృతుల యందు పురుషుడుగను భాసించు చున్నాడు. ప్రకృతుల నధిష్టించి యున్న పురుషుడుగ అధిదైవముగను, వాని నుంచి నిర్వర్తించు సృష్టికర్మకు అధియజ్ఞముగను తానే భాసించుచున్నాడు. బ్రహ్మము అవరోహణ క్రమమున ఆత్మయగుట వలన ఆధ్యాత్మ మనబడుచున్నాడు. 🍀

అధిభూతం క్షరోభావః పురుషశ్చాధి దైవతమ్ |
అధియజో హమేవాత్ర దేహే దేహభృతాం వర || 4

తాత్పర్యము :

స్వభావము నుండి ప్రకృతి పుట్టుచున్నది. ఈ ప్రకృతి క్షరము. స్వభావము నధిష్టించి అధిదైవతముగ పురుషుడున్నాడు. అట్టి పురుషుడు నిర్వర్తించునది యజ్ఞము.

వివరణము :

బ్రహ్మము నుండి వ్యక్తమైన ఆత్మ నుండి అష్ట ప్రకృతులు వ్యక్తము కాగ, అందు ఆత్మ యుండుట వలన పురుషుడగును. ఈ పురుషునకు, అష్ట ప్రకృతులకు మూలము ఆత్మ. అది దైవీ స్వభావమే. అనగా పరతత్త్యమే ఆత్మగను, ప్రకృతుల యందు పురుషుడుగను భాసించుచున్నాడు.

ప్రకృతుల నధిష్టించి యున్న పురుషుడుగ అధిదైవముగను, వాని నుంచి నిర్వర్తించు సృష్టికర్మకు అధియజ్ఞముగను తానే భాసించు చున్నాడు. బ్రహ్మము అవరోహణ క్రమమున ఆత్మయగుట వలన ఆధ్యాత్మ మనబడుచున్నాడు.

ఆత్మనుండి ఏర్పడిన అష్ట ప్రకృతులతో సృష్టియను పురము నేర్పాటు చేయుచున్నాడు. అందు వసించుటచేత పురుషు డనబడు చున్నాడు. వానిని అధిష్ఠించి యుండుటచేత దైవ మనబడు చున్నాడు. వాని ద్వారా తాను నిర్వర్తించు సృష్టికర్మ యజ్ఞము. అట్టి యజ్ఞమును కూడ తాను అధిష్ఠించి యుండుటచేత 'అధియజ్ఞ' మనబడు చున్నాడు. తననుండి ఏర్పడిన ప్రకృతులను కూడ తానే అధిష్ఠించి యుండుట చేత 'అధిభూత' మనబడు చున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

14 Jun 2021

14-JUNE-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 212🌹  
2) 🌹. శివ మహా పురాణము - 412🌹 
3) 🌹 Light On The Path - 159🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -40🌹  
5) 🌹 Osho Daily Meditations - 29🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 89 / Lalitha Sahasra Namavali - 89🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 89 / Sri Vishnu Sahasranama - 89🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -212 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 4 - 1

*🍀 3-1. యజ్ఞము - బ్రహ్మము నుండి వ్యక్తమైన ఆత్మ నుండి అష్ట ప్రకృతులు వ్యక్తము కాగ, అందు ఆత్మ యుండుట వలన పురుషుడగును. ఈ పురుషునకు, అష్ట ప్రకృతులకు మూలము ఆత్మ. అది దైవీ స్వభావమే. అనగా పరతత్త్యమే ఆత్మగను, ప్రకృతుల యందు పురుషుడుగను భాసించు చున్నాడు. ప్రకృతుల నధిష్టించి యున్న పురుషుడుగ అధిదైవముగను, వాని నుంచి నిర్వర్తించు సృష్టికర్మకు అధియజ్ఞముగను తానే భాసించుచున్నాడు. బ్రహ్మము అవరోహణ క్రమమున ఆత్మయగుట వలన ఆధ్యాత్మ మనబడుచున్నాడు. 🍀*

అధిభూతం క్షరోభావః పురుషశ్చాధి దైవతమ్ |
అధియజో హమేవాత్ర దేహే దేహభృతాం వర || 4

తాత్పర్యము : 
స్వభావము నుండి ప్రకృతి పుట్టుచున్నది. ఈ ప్రకృతి క్షరము. స్వభావము నధిష్టించి అధిదైవతముగ పురుషుడున్నాడు. అట్టి పురుషుడు నిర్వర్తించునది యజ్ఞము.

వివరణము : 
బ్రహ్మము నుండి వ్యక్తమైన ఆత్మ నుండి అష్ట ప్రకృతులు వ్యక్తము కాగ, అందు ఆత్మ యుండుట వలన పురుషుడగును. ఈ పురుషునకు, అష్ట ప్రకృతులకు మూలము ఆత్మ. అది దైవీ స్వభావమే. అనగా పరతత్త్యమే ఆత్మగను, ప్రకృతుల యందు పురుషుడుగను భాసించుచున్నాడు. 

ప్రకృతుల నధిష్టించి యున్న పురుషుడుగ అధిదైవముగను, వాని నుంచి నిర్వర్తించు సృష్టికర్మకు అధియజ్ఞముగను తానే భాసించు చున్నాడు. బ్రహ్మము అవరోహణ క్రమమున ఆత్మయగుట వలన ఆధ్యాత్మ మనబడుచున్నాడు. 

ఆత్మనుండి ఏర్పడిన అష్ట ప్రకృతులతో సృష్టియను పురము నేర్పాటు చేయుచున్నాడు. అందు వసించుటచేత పురుషు డనబడు చున్నాడు. వానిని అధిష్ఠించి యుండుటచేత దైవ మనబడు చున్నాడు. వాని ద్వారా తాను నిర్వర్తించు సృష్టికర్మ యజ్ఞము. అట్టి యజ్ఞమును కూడ తాను అధిష్ఠించి యుండుటచేత 'అధియజ్ఞ' మనబడు చున్నాడు. తననుండి ఏర్పడిన ప్రకృతులను కూడ తానే అధిష్ఠించి యుండుట చేత 'అధిభూత' మనబడు చున్నాడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 412🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 23

*🌻. దేవతలు శివుని దర్శించుట - 2 🌻*

పార్వతి ఇట్లు పలికెను-

తండ్రీ! పూర్వము మీకు చెప్పియుంటిని. తల్లీ! నీవు మరచితివా యేమి! బంధులారా! ఇప్పుడైననూ నా ప్రతిజ్ఞను వినుడు (11). ఈ మహాదేవుడు విరాగి. ఆయన కోపించి మన్మథుని భస్మము చేసినాడు. భక్త వత్సలుడగు అట్టి శంకరుని తపస్సు చేసి సంతోషపెట్టెదను (12). మీరందరూ ఆనందముగా మీ మీ గృహములకు వెళ్లుడు. శివుడు తప్పక ప్రసన్నుడు కాగలడు. ఈ విషయములో చర్చను చేయ తగదు (13). ఏ శివుడు మన్మథుని, హిమవంతుని వనమును తగులబెట్టినాడో, అట్టి శివుని కేవలము తపః ప్రభావముచే ఇదే స్థానమునకు తీసుకొని వచ్చెదను (14). 

గొప్ప తపస్సు యొక్క బలముచే సదాశివుని సులభముగా సేవించవచ్చును. మహాత్ములారా! మీకు నేను ముమ్మాటికీ సత్యమును చెప్పుచున్నాను. తెలియుడు (15). చక్కగా మాటలాడునది, పరమేశ్వరి యగు పార్వతి మేనకను, అన్నగారు అగు మైనాకుని, మందరుని, తండ్రియగు హిమవంతుని ఉద్దేశించి ఇట్లు పలికి మిన్నకుండెను (16). పార్వతి ఇట్లు పలుకగా, మేరుపు మొదలగు విద్వాంసులైన ఆ పర్వత రాజులు విస్మితులై పార్వతిని అనేక విధముల కొనియాడుచూ వచ్చిన దారిని వెళ్లిరి (17).

వారందరు వెళ్లగానే సఖురాండ్రతో గూడియున్న పార్వతి శివదర్శనమునే పరమ లక్ష్యమునందు దృఢమైన చిత్తము గలదై, అంతకంటె అధికమగు తపస్సును చేసెను (18). ఓ మునిశ్రేష్ఠా! స్థావర జంగమములతో, దేవరాక్షసులతో, మానవులతో కూడియున్న ముల్లోకములు ఆ గొప్ప తపస్సుచే తాపమును పొందెను (19). అపుడు దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, చారణులు, సిద్ధులు, సాద్యులు, మునులు, విద్యాధరులు, నాగులు (20), ప్రజాపతులు, గుహ్యకులు మరియు ఇతరులు అందరు తీవ్రమగు కష్టమును పొందిరి. కాని దాని కారణమును వారెరుగరైరి (21).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 159 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 But to learn is impossible until the first great battle has been won. The mind may recognize truth, but the spirit cannot receive it. - 1 🌻*

573. The ego sends impressions through to the lower planes as soon as he begins to become awakened, but there are many things that stand in his way. He can do nothing until the astral body is controlled; because if it is a mass of surging emotions, how; can the ego send down through that body any coherent or rational instruction? The first great battle is with the passions, with the senses, and he must conquer them; but when that is done he has still the mind to meet, and it may be that the mind will prove a more formidable adversary even than the astral body.

574. Then the Master goes on to speak about the knowledge which is attained by this intuition. I have already explained that at each Initiation the candidate receives a key of knowledge which puts a different complexion upon life for him, shows him a deeper depth, a fuller unfolding, as it were, of the meaning of the occult teaching.

Each time, as he receives it, it seems to the man to be final. He says: “Now I have all knowledge; this is so satisfying, so complete, it is impossible that there could be more.” There is an infinity yet to be learnt; he is only on the road of learning. As he goes on, more and more will be unfolded before him. The Master knows precisely at what stage it is most useful to give certain information. 

People often think they ought to have it all at once. That is just as foolish as it would be to expect a teacher to explain the differential calculus to a child who was only just learning the multiplication table. He must go through many intervening stages before he can know even remotely what it means.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 40 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. పుణ్య లక్షణములు 🌻*

మహనీయముల పుణ్య లక్షణములను, పవిత్ర వర్తనలను, సమస్తమును గ్రహించు చుండవలెను. తానుగాని, ఇతరులు గాని ఈ గుణములు కలిగియున్నవారు ముఖ్యము కాదు. ఉన్న గుణములు ముఖ్యము.

పువ్వుల నుండి గాలికి వెలువడిన సుగంధమును పూవులతో సంబంధము లేకుండ ముక్కుతో ఎట్లు అనుభవించునో, అట్లే వ్యక్తుల తరతమ భేదదృష్టులు లేక గుణములను అనుభవించి కీర్తించు వాడు కావలెను.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 29 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 Trust 🍀*

*🕉 Always remember that at no cost should you become mistrustful. Even if your trust allows others to deceive you, this is better than not to trust. 🕉*

It is very easy to trust when everybody is loving and nobody is deceiving you. But even if the whole world is deceptive and everybody is bent on deceiving you-and they can only deceive you when you trust-then too, go on trusting. 

Never lose trust in trust, whatever the cost, and you will never be a loser, because trust in itself is the ultimate end. It should not be a means to anything else, because it has its own intrinsic value. If you can trust, you remain open. People become closed as a defense, so that nobody can deceive them or take advantage of them. 

Let them take advantage of you! If you insist on continuing to trust, then a beautiful flowering happens, because then there is no fear. The fear is that people will deceive-but once you accept that, there is no fear, so there is no barrier to your opening. The fear is more dangerous than any harm anybody can do to you. This fear can poison your whole life. So remain open, and just trust innocently, unconditionally.

You will flower, and you will help others to flower once they become aware that they have not been deceiving you a bit, but they have been deceiving themselves. You cannot go on deceiving a person endlessly if that person continues to trust you. The very trust will throw you back to yourself again and again.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 89 / Sri Lalita Sahasranamavali - Meaning - 89 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*
*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*

🍀 409. శివప్రియా - 
శివునికి ఇష్టమైనది.

🍀 410. శివపరా - 
శివుని పరమావధిగా కలిగినది.

🍀 411. శిష్టేష్టా - 
శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము గలిగినది.

🍀 412. శిష్టపూజితా -
 శిష్టజనుల చేత పూజింపబడునది.

🍀 413. అప్రమేయా - 
ప్రమాణము లేనిది; ప్రమాణములకు లొంగనిది.

🍀 414. స్వప్రకాశా -
 తనంతట తానే ప్రకాశించునది.

🍀 415. మనోవాచామగోచరా - 
మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప వీలుకానిది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 89 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 89. śivapriyā śivaparā śiṣṭeṣṭā śiṣṭapūjitā |*
*aprameyā svaprakāśā manovācāmagocarā || 89 || 🌻*

🌻 409 ) Shiva priya -  
 She who is dear to Lord Shiva

🌻 410 ) Shivapara -   
She who does not have any other interest except Lord Shiva

🌻 411 ) Shishteshta -  
 She who likes people with good habits

🌻 412 ) Shishta poojitha -   
She who is being worshipped by good people

🌻 413 ) Aprameya -   
She who cannot be measured

🌻 414 ) Swaprakasha -   
She who has her own luster

🌻 415 ) Mano vachama gochara -   
She who is beyond the mind and the word

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 89 / Sri Vishnu Sahasra Namavali - 89 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*ధనిష్ట నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🍀 89. సహస్రార్చిః సప్త జిహ్వః సప్తైధాః సప్త వాహనః !*
*అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః !! 89 !! 🍀*

🍀 826. సహస్రార్చిః - 
అనంతకిరణములు కలవాడు.

🍀 827. సప్తజిహ్వః - 
ఏడు నాలుకలుగల అగ్నిస్వరూపుడు.

🍀 828. సప్తైథాః - 
ఏడు దీప్తులు కలవాడు.

🍀 829. సప్తవాహనః -
ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు.

🍀 830. అమూర్తిః - 
రూపము లేనివాడు.

🍀 831. అనఘః - 
పాపరహితుడు.

🍀 832. అచింత్యః - 
చింతించుటకు వీలుకానివాడు.

🍀 833. భయకృత్ - 
దుర్జనులకు భీతిని కలిగించువాడు.

🍀 834. భయనాశనః - 
భయమును నశింపచేయువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 89 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Dhanishta 1st Padam*

*🌻 89. sahasrārciḥ saptajihvaḥ saptaidhāḥ saptavāhanaḥ |*
*amūrtiranaghōcintyō bhayakṛdbhayanāśanaḥ || 89 || 🌻*

🌻 826. Sahasrārciḥ: 
One with innumerable Archis or rays.

🌻 827. Sapta-jihvaḥ: 
The Lord in his manifestation as Fire is conceived as having seven tongues of flame.

🌻 828. Saptaidhāḥ: 
The Lord who is of the nature of fire has seven Edhas or forms of brilliance.

🌻 829. Saptavāhanaḥ: 
The Lord in the form of Surya or sun has seven horses as his vehicles or mounts.

🌻 830. Amūrtiḥ: 
One who is without sins or without sorrow.

🌻 831. Achintyo: 
One who is not determinable by any criteria of knowledge, being Himself the witnessing Self- certifying all knowledge.

🌻 832. Anaghaḥ: 
One who is without sins or without sorrow.

🌻 833. Bhayakṛud: 
One who generates fear in those who go along the evil path. Or one who cuts at the root of all fear.

🌻 834. Bhaya-nāśanaḥ: 
One who destroys the fears of the virtuous.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹