✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 4 - 1
🍀 3-1. యజ్ఞము - బ్రహ్మము నుండి వ్యక్తమైన ఆత్మ నుండి అష్ట ప్రకృతులు వ్యక్తము కాగ, అందు ఆత్మ యుండుట వలన పురుషుడగును. ఈ పురుషునకు, అష్ట ప్రకృతులకు మూలము ఆత్మ. అది దైవీ స్వభావమే. అనగా పరతత్త్యమే ఆత్మగను, ప్రకృతుల యందు పురుషుడుగను భాసించు చున్నాడు. ప్రకృతుల నధిష్టించి యున్న పురుషుడుగ అధిదైవముగను, వాని నుంచి నిర్వర్తించు సృష్టికర్మకు అధియజ్ఞముగను తానే భాసించుచున్నాడు. బ్రహ్మము అవరోహణ క్రమమున ఆత్మయగుట వలన ఆధ్యాత్మ మనబడుచున్నాడు. 🍀
అధిభూతం క్షరోభావః పురుషశ్చాధి దైవతమ్ |
అధియజో హమేవాత్ర దేహే దేహభృతాం వర || 4
తాత్పర్యము :
స్వభావము నుండి ప్రకృతి పుట్టుచున్నది. ఈ ప్రకృతి క్షరము. స్వభావము నధిష్టించి అధిదైవతముగ పురుషుడున్నాడు. అట్టి పురుషుడు నిర్వర్తించునది యజ్ఞము.
వివరణము :
బ్రహ్మము నుండి వ్యక్తమైన ఆత్మ నుండి అష్ట ప్రకృతులు వ్యక్తము కాగ, అందు ఆత్మ యుండుట వలన పురుషుడగును. ఈ పురుషునకు, అష్ట ప్రకృతులకు మూలము ఆత్మ. అది దైవీ స్వభావమే. అనగా పరతత్త్యమే ఆత్మగను, ప్రకృతుల యందు పురుషుడుగను భాసించుచున్నాడు.
ప్రకృతుల నధిష్టించి యున్న పురుషుడుగ అధిదైవముగను, వాని నుంచి నిర్వర్తించు సృష్టికర్మకు అధియజ్ఞముగను తానే భాసించు చున్నాడు. బ్రహ్మము అవరోహణ క్రమమున ఆత్మయగుట వలన ఆధ్యాత్మ మనబడుచున్నాడు.
ఆత్మనుండి ఏర్పడిన అష్ట ప్రకృతులతో సృష్టియను పురము నేర్పాటు చేయుచున్నాడు. అందు వసించుటచేత పురుషు డనబడు చున్నాడు. వానిని అధిష్ఠించి యుండుటచేత దైవ మనబడు చున్నాడు. వాని ద్వారా తాను నిర్వర్తించు సృష్టికర్మ యజ్ఞము. అట్టి యజ్ఞమును కూడ తాను అధిష్ఠించి యుండుటచేత 'అధియజ్ఞ' మనబడు చున్నాడు. తననుండి ఏర్పడిన ప్రకృతులను కూడ తానే అధిష్ఠించి యుండుట చేత 'అధిభూత' మనబడు చున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
14 Jun 2021
No comments:
Post a Comment