🌹 16, MARCH 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 16, MARCH 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
🌹 16, MARCH 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 509 / Bhagavad-Gita - 509 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 20 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 20 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 864 / Sri Siva Maha Purana - 864 🌹
🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 1 / The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 1 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 122 / Osho Daily Meditations  - 122 🌹
🍀 122. ఆనందం మరియు బాధల మధ్య / 122. BETWEEN PLEASURE AND PAIN 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 538-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 538-1 🌹 
🌻 538. 'మేధా’ - 1 / 538. 'Medha' - 1🌻
5) 🌹 సిద్దేశ్వరయానం - 16 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 509 / Bhagavad-Gita - 509 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 20 🌴*

*20. ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి |*
*వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్ ||*

*🌷. తాత్పర్యం : జీవులు మరియు భౌతికప్రకృతి రెండును అనాది యని తెలిసికొనవలెను. వాని యందలి పరివర్తనములు మరియు భౌతికగుణము లనునవి భౌతికప్రకృతి నుండి ఉద్భవించినవి.*

*🌷. భాష్యము : ఈ అధ్యాయమునందు తెలుపబడిన జ్ఞానము ద్వారా మనుజుడు కర్మక్షేత్రము (దేహము) మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞులను (జీవాత్మ, పరమాత్మ) గూర్చి తెలిసికొన వచ్చును.*

*కర్మక్షేత్రమైన దేహము భౌతికప్రకృతినియమమై నట్టిది. దాని యందు బద్ధుడై దేహకర్మల ననుభవించు ఆత్మయే పురుషుడు(జీవుడు). అతడే జ్ఞాత. అతనితోపాటు గల వేరొక జ్ఞాతయే పరమాత్ముడు. కాని ఈ ఆత్మా, పరమాత్మ రూపములు దేవదేవుడైన శ్రీకృష్ణుని భిన్న వ్యక్తీకరణములే యని మనము అవగాహనము చేసికొనవలెను. ఆత్మా ఆ భగవానుని శక్తికి సంబంధించినది కాగా, పరమాత్మ రూపము అతని స్వీయ విస్తృతరూపమై యున్నది*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 509 🌹
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 20 🌴*

*20. prakṛtiṁ puruṣaṁ caiva viddhy anādī ubhāv api*
*vikārāṁś ca guṇāṁś caiva viddhi prakṛti-sambhavān*

*🌷 Translation : Material nature and the living entities should be understood to be beginningless. Their transformations and the modes of matter are products of material nature.*

*🌹 Purport : By the knowledge given in this chapter, one can understand the body (the field of activities) and the knowers of the body (both the individual soul and the Supersoul).*

*The body is the field of activity and is composed of material nature. The individual soul that is embodied and enjoying the activities of the body is the puruṣa, or the living entity. He is one knower, and the other is the Supersoul. Of course, it is to be understood that both the Supersoul and the individual entity are different manifestations of the Supreme Personality of Godhead. The living entity is in the category of His energy, and the Supersoul is in the category of His personal expansion.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 864 / Sri Siva Maha Purana - 864 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 35 🌴*

*🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 1 🌻*

*సనత్కుమారుడిట్లు పలికెను - ఆ రాక్షసరాజు అక్కడ మకాము చేసి, మహాజ్ఞాని యగు ఒక గొప్ప దానవశ్రేష్ఠుని శివుని వద్దకు దూతగా పంపెను (1).*

*ఆ దూత అచటకు వెళ్లి, ఫాలభాగమునందు చంద్రవంక గలవాడు, వట వృక్షమూలము నందు కూర్చున్నవాడు, కోటి సూర్యులతో సమానముగు కాంతి గలవాడు (2), యోగాసనమును వేసి కనులతో ముద్రను ప్రదర్శించువాడు, చిరునగవు మోమువాడు, స్వచ్ఛమగు స్ఫటికమును బోలియున్నవాడు, బ్రహ్మతేజస్సుతో వెలిగి పోవుచున్న వాడు (3), త్రిశూలమును పట్టిశమును పట్టుకున్న వాడు, వ్యాఘ్రచర్మమును వస్త్రముగా దాల్చినవాడు, భక్తుల మృత్యువును పోగోట్టువాడు, శాంతస్వరూపుడు, గౌరీప్రియుడు, ముక్కంటి (4), తపస్సుల ఫలములనిచ్చువాడు, సర్వసంపదలను కలిగించువాడు, శీఘ్రముగా సంతోషించువాడు, ప్రసన్నమగు మోముగలవాడు, భక్తులను అనుగ్రహించువాడు (5) , జగత్తునకు తండ్రి, జగత్తునకు కారణము, జగత్‌ స్వరూపములో నున్నవాడు, సర్వమునుండి పుట్టువాడు,సర్వమును పాలించువాడు, సర్వమునకు కర్త, జగత్తును ఉపసంహరించు వాడు (6), సర్వకారణ కారణుడు, పాపసముద్రమును దాటించువాడు, జ్ఞానమునిచ్చువాడు, జ్ఞానమునకు కారణుడు, జ్ఞాన-ఆనంద స్వరూపడు, అద్యంతములు లేనివాడు (7) అగు శంకరుడు కుమారస్వామితో కూడియుండగా చూచెను. దూతయగు ఆ దానవీరుడు రథమునుండి దిగి ఆయనకు శిరము వంచి ప్రణమిల్లెను (8).*

*ఆయనకు ఎడమవైపున భద్రకాళి, ఎదుట కుమారస్వామి ఉండిరి. లోకమర్యాదనను సరించి కాళి, కుమారస్వామి, మరియు శంకరుడు ఆతనిని ఆశీర్వదించిరి (9). గొప్ప శాస్త్రవేత్తయగు, శంఖచూడుని దూత అపుడు చేతులు జోడించి శంకరునకు ప్రణమిల్లి ఈ శుభవచనములను పలికెను (10).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 864 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 35 🌴*

*🌻 The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 1 🌻*

Sanatkumāra said:—
1. Stationing himself there, the lord of Dānavas sent a leading Dānava of great knowledge as his emissary to Śiva.

2. The emissary went there and saw the moon-crested lord Śiva, of the refulgence of a crore suns, seated at the root of the Banyan tree.

3. He saw him sitting in a yogic pose, showing the mystic gesture with his eyes, with a smiling face and body as pure as crystal and blazing with transcendent splendour.

4-7. Śiva held the trident and the iron club. He was clad in the hide of the tiger. The emissary saw the three-eyed lord of Pārvatī, the enlivener of the life of the devotees, the quiet Śiva, the dispenser of the fruits of penance, the creator of riches, quick in being propitiated, eager to bless the devotees and beaming with pleasure in his face. He saw the lord of the universe, the seed of the universe, identical with the universe and of universal form, born of all, lord of all, creator of all, the cause of the annihilation of the universe, the cause of causes, the one who enables devotees to cross the ocean of hell, the bestower of knowledge, the seed of knowledge, knowlege-bliss and eternal.

8. On seeing him, the messenger, the leader of Dānavas, descended from his chariot and bowed to him as well as to Kumāra.

9. He saw Bhadrakālī to his left and Kārttikeya standing before him. Kālī, Kārttikeya and Śiva offered him the conventional benediction.

10. This emissary of Śaṅkhacūḍa, had full knowledge of the sacred texts. He joined his palms in reverence and bowing to him spoke the auspicious words.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 122 / Osho Daily Meditations  - 122 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 122. ఆనందం మరియు బాధల మధ్య 🍀*

*🕉  ఒక వ్యక్తి శాశ్వత నివాసిగా మారగల ఏకైక చోటు ఇది లేదా అది కానిది. 🕉*

*ఈ స్థలంలో నిశ్శబ్దం మరియు ప్రశాంతత యొక్క నాణ్యత ఉంది. నిజానికి, ప్రారంభంలో ఇది చాలా రుచి లేనట్లు అనిపిస్తుంది, ఎందుకంటే నొప్పి లేదు, ఆనందం లేదు. కానీ మొత్తం బాధ మరియు మొత్తం ఆనందం కేవలం ఉత్సాహం. మీకు నచ్చిన ఉత్సాహాన్ని మీరు ఆనందం అంటారు. మీకు నచ్చని ఉత్సాహాన్ని మీరు నొప్పి అంటారు. కొన్నిసార్లు మీరు ఒక నిర్దిష్ట ఉత్సాహాన్ని ఇష్టపడటం ప్రారంభించవచ్చు మరియు అది ఆనందంగా మారవచ్చు మరియు మీరు మరొక ఉత్సాహాన్ని ఇష్టపడటం ప్రారంభించవచ్చు మరియు అది నొప్పిగా మారవచ్చు. కాబట్టి అదే అనుభవం బాధగా లేదా ఆనందంగా మారవచ్చు; ఇది మీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది.*

*ఆనందం మరియు బాధ మధ్య ఖాళీలో విశ్రాంతి తీసుకోండి. అది విశ్రాంతి యొక్క అత్యంత సహజమైన స్థితి. మీరు దానిలో ఉండటం ప్రారంభించిన తర్వాత, అనుభూతి చెందడం మొదలుపెట్టాక, మీరు దాని రుచిని నేర్చుకుంటారు. దాన్నే నేను టావో రుచి అంటాను. ఇది వైన్ లాంటిది. ప్రారంభంలో చాలా చేదుగా ఉంటుంది. మీరు నేర్చుకోవాలి. మరియు అది గాఢమైన వైన్, నిశ్శబ్దం, ప్రశాంతత యొక్క గొప్ప మద్య పానీయం. దానితో మీరు మత్తులోకి వెడతారు. దాని రుచి క్రమంగా మీకే అర్థమవుతుంది. మీ నాలుక చాలా బాధ మరియు ఆనందంతో నిండినందున ప్రారంభంలో అది రుచిగా ఉండదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 122 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 122. BETWEEN PLEASURE AND PAIN 🍀*

*🕉  The only state in which one can become a permanent dweller is the space that is neither this nor that.  🕉*

*In this space is a quality of silence and tranquility. Of course, in the beginning it feels very tasteless, because there is no pain and no pleasure. But all pain and all pleasure is just excitement. The excitement that you like, you call pleasure. The excitement that you don't like, you call pain. Sometimes it happens that you can start liking a certain excitement and it may become pleasure, and you can start liking another excitement and it may turn into pain. So the same experience can become pain or pleasure; it depends on your likes and dislikes.*

*Relax in the space between pleasure and pain. That's the most natural state of relaxation. Once you start being in it, feeling it, you will learn the taste of it. That is what I call the taste of Tao. It is just like wine. In the beginning it will be very bitter. One has to learn. And it is the deepest wine there is, the greatest alcoholic beverage of silence, of tranquility. One becomes drunk with it. By and by you will understand the taste of it. In the beginning it is tasteless, because your tongue is too full of pain and pleasure.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 538 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 538 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*
*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*

*🌻 538. 'మేధా’ - 1 🌻*

*సకల శాస్త్రసారమైన శ్రీమాత అని అర్ధము. సర్వ భూతములందు మేధా రూపము ధరించునది శ్రీమాత. వారి యందలి ధీశక్తియే మేధా. ఆకాశమున ప్రకాశముగను, వాయువు నందు బలముగను, అగ్నియందు తేజస్సుగను, జలము నందు తుష్టి గను, పదార్థములయందు పుష్టిగను వుండునది శ్రీమాత. ఉప్పు ఉప్పగ నుండుటకు కారణము శ్రీమాతయే. అట్లే పంచదార యందు తీపిగ యుండును. ఇట్లు ప్రతి వస్తువు నందును దాని గుణముచే ప్రకాశించునది శ్రీమాత. అన్నిటి సారము శ్రీమాత. త్రిగుణము లందలి త్రిశక్తి కూడ ఆమెయే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 538 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*
*svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻*

*🌻 538. 'Medha' - 1 🌻*

*It means Srimata is the essence of all shastras.Shrimata is in the form of intelligence in all the beings. Their strength is their intelligence. Shrimata is the brightness in the sky, the strength in the wind, the radiance in the fire, the thirst in the water and the health in the materials. Srimata is the reason for the saltiness in the salt. She is the sweetness in sugar. Thus Srimata shines in every object by its quality. Srimata is the essence of everything. She is also the trishakti in the trigunas.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 సిద్దేశ్వరయానం - 16 🌹*

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 భైరవనాథుడు 🏵

ఒక నాటి సాయంకాలం జైగీషవ్యేశ్వరునకు పూజ చేసి అర్చకుడు నీరాజనం ఇస్తున్నాడు. ఈ యువకుడు కూడా హారతి కొరకు వచ్చాడు. అదే సమయానికి ఋషివలె జటాజూటముతో ఉన్న ఒక యోగి శిష్యులతో వచ్చి శివునకు నమస్కరించి నిలుచున్నాడు. పెద్దవారువచ్చారని ఒక ఉన్నతాసనం వేసి కూర్చోమని ప్రార్థించారక్కడి భక్తులు. ఆ యోగి శివమహిమ గూర్చి కొద్ది మాటలు చెప్పి కాసేపు భజన చేయించాడు. ఇతడు కూడా సాష్టాంగ నమస్కారం చేసి గుహలోకి వెళ్ళకుండా వారి దగ్గర కూర్చోవాలనిపించి కూర్చున్నాడు. కాసేపయిన తర్వాత జనమంతా వెళ్ళిపోయినారు. వారి శిష్యులు నలుగురు మాత్రం ఉన్నారు. ఆ యోగి వాళ్ళను దూరంగా వెళ్ళి ఉండమని చెప్పి ఈ యువకుని పలకరించాడు. 

"నాయనా! నాగేశ్వరా ! తపస్సు బాగా సాగుతున్నది గదా! దివ్యానుభవాలు రావటం, శరీరంలోకి శక్తితరంగాలు ప్రసరించడం కూడా మొదలయినది గదా!" యువకుడాశ్చరపడినాడు. “మహాత్మా! ఇక్కడ నాపేరెవ్వరికీ తెలియదు. నా సాధన రహస్యాలతో సహా అన్నీ మీరు తెలుసుకొని చెప్పుతున్నారు. నా భవిష్యత్తు ఏమిటో అవగతం కావటం లేదు. కర్తవ్యోపదేశం చేయమని వేడుకుంటున్నాను” అని ఆ ఋషిపాదములపై పడినాడు. ఆయన లేవనెత్తి ఎదురుగా కూర్చోమని భ్రూమధ్యాన్ని తన వేలితో స్పృశించాడు. తరుణునకు తలగిర్రున తిరగటం మొదలు పెట్టింది. కనులు మూతలు పడినవి. 

అనంతమైన కాంతిపుంజం. కపాలమాలాధరుడు, వజ్రహస్తుడు, నాగాలంకృతుడు అరుణకేశుడు అయిన కాలభైరవుడు సాక్షాత్కరించాడు. యక్షరాక్షసులు, విద్యాధర గంధర్వులు ఆ దేవదేవుని సేవిస్తున్నారు. ఆయన వాహనమైన శ్వానరాజు ప్రసన్నుడై చూస్తున్నాడు. గంధర్వ కిన్నరులు ఆస్వామిని స్తోత్రం చేస్తున్నారు.

భైరవస్వామి దయార్ద్ర దృక్కులతో పలుకుతున్నాడు. “వామదేవా! సరియైన సమయానికి ఈ యువకుని దగ్గరకు వచ్చావు. ఇతనిని సిద్ధాశ్రమానికి తీసుకువెళ్లి తగిన శిక్షణ యిచ్చి ధర్మవీరునిగా తీర్చిదిద్ది కృష్ణభూమిని కాపాడటానికి నియోగించు కర్తవ్యోన్ముఖుని చెయ్యి!” అని యువకుని ప్రసన్నముఖుడై ఆశీర్వదించి అదృశ్యుడైనాడు.

యువకునకు కంటివెంట నీరు కారుతున్నది. “మహర్షీ! మహాను భావులైన మీ కరుణవల్ల భైరవ దర్శనం కలిగింది. స్వామి చెప్పిన కృష్ణభూమి రక్షణ వంటి విషయాలు నాకు అర్థం కాలేదు. గురుదేవులు - మీరు. నేనేం చెయ్యాలో ఆదేశించండి. ఆజ్ఞాపించండి!". మహర్షి "నాగేశ్వరా! ఈ అనుభూతి వల్ల నీ మార్గం నీకు తెలుస్తున్నది. ఇప్పుడు నిశా సమయం. నీకు చెప్పవలసినవి నీవు తెలుసుకోవలసినవి చాలా ఉన్నవి. చేయవలసిన సాధన ముందున్నది. నే నిక్కడే ఈ జైగీషవ్యేశ్వరుని ముందు ధ్యానసమాధిలో ఉంటాను. తెల్లవారుజామున బయలుదేరి నీవు నాతో హిమాలయాలలోని సిద్ధాశ్రమానికి వస్తున్నావు. దానికి సిద్ధంకా!” యువకుడు "మీ ఆజ్ఞ” అని పాద నమస్కారం చేశాడు.
ఉదయం.

* ఉషస్స్యాత్ గార్గ్య సిద్ధాంతం శకునంతు బృహస్పతేః
మనశ్శుద్ధి ర్వ్యాసమతం విప్రవాక్యం హరేర్మతం
అభిజిత్ సర్వసంజ్ఞాతం*.

ఎవరైనా ప్రయాణం పెట్టుకొంటే ఉషఃకాలంలో బయలుదేరితే ఏ ఆటంకాలు లేకుండా సాగుతుందని గార్గ్యవచనం. శకునం చూచుకొని బయలుదేరమని బృహస్పతి పలికాడు. మంచి శకునం ఉంటుందో లేదోనని కొంతమంది ప్రక్క యింటి ముత్తయిదువను పిలిచి "అమ్మా! మా అబ్బాయి కార్యార్థియై బయలుదేరుతున్నాడు ఎదురుగా రా” అని శుభశకునం ఏర్పాటు చేసుకొంటారు. మనశ్శుద్ధి ఉంటే అంతా సవ్యంగా జరుగుతుందని వ్యాసుడు అన్నాడు. 

పరీక్షలకు, ఉద్యోగాలకు వెళ్ళేవారికి మనస్సు నిర్మలంగా ఎందుకుంటుంది? భయం భయంగా ఉండవచ్చు. అందుకని “విప్రవాక్యం హరేర్మతం"అన్నారు. అంటే పెద్దల ఆశీస్సులు తీసుకొని బయలుదేరాలని అర్థం. మనోబలం ఉంటే చాలునని మాండవ్యుడు అన్నాడు. అభిజిల్లగ్నం అయితే తిథి వార నక్షత్రాలు, శకునాలు ఏమీ చూడనక్కరలేదట! సూర్యుడు నడినెత్తిన ఉండి మన నీడ మన క్రిందనే ఉండే సమయం. పల్లెటూళ్ళలో దీనిని గడ్డపారలగ్నం అంటారు. అంటే గడ్డపార నేలమీద పాతితే దానినీడ అక్కడే ప్రక్కకు పోకుండా ఉండే కాలం.
( సశేషం )
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 222 : 3-30. svasakti pracayo'sya visvam - 4 / శివ సూత్రములు - 222 : 3-30. స్వశక్తి ప్రచయో'స్య విశ్వమ్‌ - 4


🌹. శివ సూత్రములు - 222 / Siva Sutras - 222 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3-30. స్వశక్తి ప్రచయో'స్య విశ్వమ్‌ - 4 🌻

🌴. విశ్వం అనేది అతని స్వంత శక్తి యొక్క ప్రవాహం లేదా విస్తరణ. 🌴


నది యొక్క మూలం శివ మరియు నీరు శక్తి. నది గురించి ఎవరైనా తెలుసుకోగలరు కానీ కొంతమంది మాత్రమే ఈ నది యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. నదిని తెలుసుకోవడం ప్రాపంచిక జ్ఞానం మరియు దాని మూలాన్ని తెలుసుకోవడం అంతిమ జ్ఞానం. నిజమైన యోగి సాధారణ గ్రహణశక్తికి మించిన ఈ నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ రకమైన సంపూర్ణ జ్ఞానాన్ని విశ్లేషణ ద్వారా మాత్రమే పొందవచ్చు. ఒక యోగి తనను తాను శక్తిగా మార్చుకోవడానికి ప్రతి ప్రయత్నం చేస్తాడు. అంతిమంగా శివునితో కలిసిపోయేది శక్తి మాత్రమే అని అతనికి తెలుసు. అంతర్గత శోధన మరియు అన్వేషణ మరియు అతని వ్యక్తిగత అనుభవం ద్వారా అతను ఈ వాస్తవాన్ని తెలుసుకుంటాడు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 222 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3-30. svaśakti pracayo'sya viśvam - 4 🌻

🌴. The universe is the outflow or expansion of his own shaktis. 🌴

The source of the river is Śiva and the water is Śakti. Anyone can know the river but only a select few try to know the source of this river. Knowing the river is mundane knowledge and knowing its origin is the ultimate knowledge. A true yogi has to posses this true knowledge that is beyond perception. This kind of Absolute of knowledge can be attained only by analysis. A yogi makes every attempt to metamorphose himself to become Śakti. He knows that ultimately it is only Śakti who can merge with Śiva. He becomes aware of this fact by internal search and exploration and though his personal experience.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 219 : 6. Everywhere there are Gods / నిత్య ప్రజ్ఞా సందేశములు - 219 : 6. ప్రతిచోటా దేవతలు ఉంటారు



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 219 / DAILY WISDOM - 219 🌹

🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 6. ప్రతిచోటా దేవతలు ఉంటారు 🌻


జీవితపు అస్థిరమైన విషయాల వెనుక ఆధ్యాత్మిక నేపథ్యాన్ని గుర్తించడం నిజానికి ఆరాధన యొక్క ఉద్దేశం. దీనినే వేద సంహితలలో శోభించబడిన దైవాలు లేదా దేవతలు అని పిలుస్తారు. ప్రతిచోటా దేవతలు ఉన్నారు. చెట్టును పూజించవచ్చు, రాయిని పూజించవచ్చు, నదిని పూజించవచ్చు, పర్వతాన్ని పూజించవచ్చు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను పూజించవచ్చు. పూజా వస్తువుగా దేనినైనా పూజించవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలోని బాహ్య రూపానికి సంబంధించిన ఈ చిహ్నం వెనుక, ఈ రూపాల రూపంలో నిగూఢంగా ఒక దైవత్వం ఉంది. ఇది వేద సంహితల ముఖ్య సూత్రం.

మనం వేదాలను చదివితే, ప్రతి మంత్రం, ప్రతి శ్లోకం, పైన పేర్కొన్న వివిధ పేర్లతో నియమించబడిన కొన్ని దైవాలకు ప్రార్థన అని మనం కనుగొంటాము: ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని మొదలైనవాటికి మన స్వంత భాష, శైలి లేదా సాంస్కృతిక నేపథ్యాలకు అనుగుణంగా మనం వాటికి ఏ పేరైనా పెట్టవచ్చు. మనం ఏ పేరు పెట్టాం అనేది కాదు, కనిపించే ఈ విషయాల వెనుక ఏదో ఉంది. మన పైన ఏదో ఉందన్న తృప్తిలో మన హృదయం పులకిస్తుంది. మతం, ఆధ్యాత్మికత లేదా తత్వశాస్త్రం, ఈ పదం యొక్క నిజమైన అర్థంలో, తనకన్నా ఉన్నతమైనది ఉంది అని గుర్తించి దానితోపాటు ఒకరి వ్యక్తిత్వం యొక్క పరిమితిని ఏకకాలంలో గుర్తించడం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 219 🌹

🍀 📖 from Lessons on the Upanishads 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 6. Everywhere there are Gods 🌻


The recognition of a spiritual background behind the transitory phenomena of life is actually the object of worship. This is known as the divinities, or gods, who are adumbrated in the Veda Samhitas. Everywhere there are gods. We can worship a tree, we can worship a stone, we can worship a river, we can worship a mountain, we can worship the sun, the moon, the stars. Anything is okay as an object of worship because behind this emblem of an outward form of things in this world, there is a divinity masquerading as these forms. This is the highlighting principle of the Veda Samhitas.

If we read the Vedas, we will find that every mantra, every verse, is a prayer to some divinity above, designated by various names: Indra, Mitra, Varuna, Agni, etc. We may give them any other name, according to our own language, style or cultural background. The point is not what name we give, but that there is something behind visible phenomena. Our heart throbs in a state of satisfaction of the fact that there is something above us. Religion, spirituality or philosophy, in the true sense of the term, is the recognition of something above oneself and a simultaneous recognition of the finitude of one's personality.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 908 / Vishnu Sahasranama Contemplation - 908


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 908 / Vishnu Sahasranama Contemplation - 908🌹

🌻908. చక్రీ, चक्री, Cakrī🌻

ఓం చక్రిణే నమః | ॐ चक्रिणे नमः | OM Cakriṇe namaḥ


సమస్తలోకరక్షార్థం మనస్తత్త్వాత్మకం సుదర్శనాఖ్యం చక్రం ధత్త ఇతి చక్రీ

చక్రము ఈతనికి కలదు. సమస్త లోక రక్షార్థము మనస్తత్త్వ రూపమగు సుదర్శనమను పేరు కల చక్రమును ధరించువాడు కనుక విష్ణునకు చక్రీ అను నామము కలదు.


:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::

చలస్వరూపమత్యన్తం జవేనాన్తరితానిలమ్ ।
చక్రస్వరూపం చ మనో ధత్తే విష్ణుః కరే స్థితమ్ ॥ 71 ॥

చలించు స్వభావము కలదియు, తన అత్యంతవేగముచే వాయువును కూడ క్రిందుపరచునదియు, చక్రస్వరూపము కలదియు అగు మనసును - విష్ణువు తన కరము నందు ధరించుచున్నాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 908🌹

🌻908. Cakrī🌻

OM Cakriṇe namaḥ


समस्तलोकरक्षार्थं मनस्तत्त्वात्मकं सुदर्शनाख्यं चक्रं धत्त इति चक्री / Samastalokarakṣārthaṃ manastattvātmakaṃ sudarśanākhyaṃ cakraṃ dhatta iti cakrī

He wields the discus known as Sudarśana of the nature of the mind for the protection of all the worlds.


:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::

चलस्वरूपमत्यन्तं जवेनान्तरितानिलम् ।
चक्रस्वरूपं च मनो धत्ते विष्णुः करे स्थितम् ॥ ७१ ॥


Viṣṇu Purāṇa - Part 1, Chapter 22

Calasvarūpamatyantaṃ javenāntaritānilam,
Cakrasvarūpaṃ ca mano dhatte viṣṇuḥ kare sthitam. 71.


Viṣṇu holds in His hands the Cakra or discus representing the unsteady mind, swifter than the wind.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹



కపిల గీత - 315 / Kapila Gita - 315


🌹. కపిల గీత - 315 / Kapila Gita - 315 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 46 🌴

46. యథాక్ష్ణోర్ధ్రవ్యాయవ దర్శనా యోగ్యతా యదా|
తదైవ చక్షుసో ద్రష్టుర్ద్రష్టృత్వా యోగ్యతానయోః॥


తాత్పర్యము : నేత్రములతో వ్యాధి (కామెర్లు మొదలగు రోగముల) కారణముగా వస్తువులయొక్క రూపములను చూచెడి యోగ్యత నశించినప్పుడు నేత్రేంద్రియములకు గూడ చూచెడి యోగ్యత యుండదు. నేత్రములు, నేత్రేంద్రియములు రెండునూ వస్తువులను చూచుటకు అసమర్థమైనచో, ఆ రెండింటికిని సాక్షియైన జీవుని యందు గూడ ఆ యోగ్యత ఉండదు. జీవుని యొక్క జననమరణములు గూడ ఇట్టి ఉపాధి ధర్మములు మాత్రమే.

వ్యాఖ్య : 'నేను చూస్తున్నాను' అని ఒకరు చెప్పినప్పుడు, అతను తన కళ్లతో లేదా కళ్లద్దాలతో చూస్తాడని అర్థం; అతను దృష్టి సాధనంతో చూస్తాడు. దృష్టి సాధనం విరిగి పోయినట్లయితే లేదా వ్యాధిగ్రస్తులైతే లేదా నటనకు అసమర్థంగా మారినట్లయితే, అతను, చూసేవాడుగా కూడా నటించడం మానేస్తాడు. అదేవిధంగా, ఈ భౌతిక శరీరంలో, ప్రస్తుత క్షణంలో జీవాత్మ నటిస్తోంది మరియు భౌతిక శరీరం, దాని పని చేయలేక పోవడం వల్ల, ఆగిపోయినప్పుడు, అతను తన ప్రతిచర్య కార్యకలాపాలను నిర్వహించడం కూడా మానేస్తాడు. ఒకరి చర్య యొక్క సాధనం విచ్ఛిన్నమై పనిచేయ లేనప్పుడు, దానిని మరణం అంటారు. మళ్ళీ, ఒక వ్యక్తి చర్య కోసం కొత్త సాధనాన్ని పొందినప్పుడు, దానిని జన్మ అంటారు. ఈ జనన మరణ ప్రక్రియ ప్రతి క్షణం, నిరంతరం శారీరక మార్పు ద్వారా జరుగుతూనే ఉంటుంది. చివరి మార్పును మరణం అని పిలుస్తారు మరియు కొత్త శరీరాన్ని అంగీకరించడం పుట్టుక అని పిలుస్తారు. అది జనన మరణ ప్రశ్నకు పరిష్కారం. వాస్తవానికి, జీవికి పుట్టుక లేదా మరణం లేదు, భగవద్గీతలో ధృవీకరించ బడినట్లుగా, న హన్యతే హన్యానే శరీరే: (భగవద్గీత 2-20) ఈ భౌతిక శరీరం యొక్క మరణం లేదా వినాశనం తర్వాత కూడా జీవుడు ఎన్నటికీ మరణించడు. జీవుడు శాశ్వతమైన వాడు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 315 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 46 🌴

46. yathākṣṇor dravyāvayava- darśanā yogyatā yadā
tadaiva cakṣuṣo draṣṭur draṣṭṛtvā yogyatānayoḥ

MEANING : When the eyes lose their power to see color or form due to morbid affliction of the optic nerve, the sense of sight becomes deadened. The living entity, who is the seer of both the eyes and the sight, loses his power of vision. The births and deaths of a living being are bodily dharmas only.

PURPORT : When one says, "I see," this means that he sees with his eyes or with his spectacles; he sees with the instrument of sight. If the instrument of sight is broken or becomes diseased or incapable of acting, then he, as the seer, also ceases to act. Similarly, in this material body, at the present moment the living soul is acting, and when the material body, due to its incapability to function, ceases, he also ceases to perform his reactionary activities. When one's instrument of action is broken and cannot function, that is called death. Again, when one gets a new instrument for action, that is called birth. This process of birth and death is going on at every moment, by constant bodily change. The final change is called death, and acceptance of a new body is called birth. That is the solution to the question of birth and death. Actually, the living entity has neither birth nor death, but is eternal. As confirmed in Bhagavad-gītā, na hanyate hanyamāne śarīre: (BG 2.20) the living entity never dies, even after the death or annihilation of this material body.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 15 Siddeshwarayanam - 15

🌹 సిద్దేశ్వరయానం - 15 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 భైరవనాథుడు 🏵


సాధన ప్రారంభమైంది. గంగ ఒడ్డున కూచొని జపం చేసుకొనే వారు చాలామంది పగలు చేసేవారు. రాత్రిపూట కొద్దిమంది ఉండేవారు. ఆరునెలలు గడిచేసరికి రాత్రిపూట కంటిముందు వెలుగులు కనిపించటం మొదలైంది. కాని భైరవ సాక్షాత్కారంలేదు. వ్యాసులవారు పన్నెండు వందల సంవత్సరాల క్రింద పురాణాలు వ్రాశారట! అందులో స్కాందపురాణంలోని కాశీఖండంలో భైరవుని గూర్చి కాశీలో ఆరునెలలు తపస్సు చేస్తే ప్రత్యక్షమై కోరిన వరాలిస్తాడని ఉన్నదని పెద్దలు చెప్పగా విన్నాడు. ఆరునెలలు తపస్సంటే ఏమిటి? ఆహార నిద్రాదులకు కొంత సమయం తప్పుడు గదా! అవి లేకుండా పూర్తి సమయం జపధ్యానములు సాధ్యము కాదు గదా! ఉన్నంతలో భూశయనము, ఏకభుక్తము, వీలైనంత మౌనము పాటిస్తున్నాడు. ఎంతకాలమైనా సరే! భైరవ సాక్షాత్కారము పొంది తీరాలి.

ఒక రోజక్కడి కెవరో యోగి వచ్చాడు. ఇతనిని చూసి పిలిచాడు. "నాయనా! నిన్ను చూస్తే ముచ్చట వేస్తున్నది. ఇంత చిన్న వయస్సులో కష్టపడి తపస్సు చేస్తున్నావు. నీకు త్వరలో భైరవానుగ్రహం కలుగుతుంది. ఇక్కడకు కొద్దిదూరంలో కాశీలో ఒక అంచున జైగీషవ్యుని గుహఉన్నది. ఆ మహాయోగి పూర్వయుగం నాటివాడు. కైలాసం నుండి దిగి వచ్చిన ప్రమధుడంటారు. ఆ గుహలో తపస్సు చేస్తే నీకు వేగంగా విశ్వనాధుని అనుగ్రహము, భైరవ సాక్షాత్కారము కలుగుతుందని అనిపిస్తున్నది".

ఆ యోగి చెప్పింది బాగానే ఉంది. చేసి చూద్దాము అని అక్కడికి వెళ్ళి సాధన ప్రారంభించాడు. ఆ ప్రదేశంలో గుహకు కొంచెము ముందు శివాలయము నిర్మించబడి ఉంది. దానికి జైగీషవ్యేశ్వర ఆలయమని పేరు. ఉదయం, సాయంత్రం కొద్దిమంది జనం వచ్చి దర్శించి పూజ చేసుకొని వెళుతుంటారు. చీకటిపడితే నిర్మానుష్యం. గుడిలో మాత్రం ఒక ఆముదపు దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ గుడిలో ఒక సౌకర్యం ఏర్పడింది. మధ్యాహ్నం ఎక్కడికి భోజనానికి వెళ్ళవలసిన పనిలేదు. సంపన్నుడొకడు ఒక బండిలో పెద్ద పాత్రలలో రొట్టెలు, కూర తెచ్చి విస్తళ్ళలో పెట్టి యాచకులకు పంచి వెళుతుంటారు. బైరాగులు, సన్యాసులు, పేదవారు ప్రతిరోజు ఆ బండి కోసం ఎదురు చూస్తుంటారు. ఈదాత వంటివారు క్షేత్రాలలో అక్కడక్కడ ఉంటారు. సత్రాలకు వచ్చి అందరూ తినలేకపోవచ్చు.కొందరు సాధకులు ఆశ్రమాలలో కుటీరాలలో ఉంటారు. వారి కోసం ఈ దాతలు ఒక పద్ధతి పెట్టుకొన్నారు. రొట్టెల బండ్లు బయలుదేరి ఈ కుటీరాల ముందు విస్తరిలో పదార్థాలు పెట్టి పైన మరొక విస్తరి కప్పి వెళ్ళిపోతుంటారు.

ఇది చాలా సౌకర్యంగా ఉంది.

ఈ పద్ధతిలో ఆరునెలలు గడిచింది. సాధన సాగుతున్నది. ఈ మధ్యకాలంలో ఒకటి రెండుసార్లు స్వగ్రామానికి వెళ్ళివచ్చాడు. అందరినీ పలకరించి "ఇక నేను ఇదివరకటి వలె రాలేకపోవచ్చు. తపస్సు చేస్తున్నప్పుడు ప్రయాణాలు చేయకూడదని పెద్దలంటున్నారు. కనుక ఎప్పుడిక్కడికి వస్తానో చెప్పలేను" అని చెప్పి పెద్దవారందరికి నమస్కరించి కాశీ వచ్చేశాడు. ఇప్పుడిక అనుబంధాలేవీ లేనట్లే. అప్పుడప్పుడు విశ్వనాధాలయానికి కాలభైరవ మందిరానికి మాత్రమే వెళ్ళి వస్తున్నాడు. నెమ్మది నెమ్మదిగా ఆహారావసరం తగ్గిపోయింది. అంతరిక్షం నుండి అలలుఅలలుగా శక్తి తన శరీరంలోకి అవతరిస్తున్నది. జపం తగ్గింది. మంత్రాక్షరాలు కాంతిమంతంగా మూసిన కన్నుల ముందు కనిపిస్తున్నవి. స్థిరంగా తపస్సు జరుగుతున్నది.

( సశేషం )

🌹🌹🌹🌹🌹