21-JULY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-67 / Bhagavad-Gita - 1-67 - 2 - 20🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 635 / Bhagavad-Gita - 635 - 18-46🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 457, 458 / Vishnu Sahasranama Contemplation - 457, 458🌹
4) 🌹 Daily Wisdom - 142🌹
5) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 116🌹
6) 🌹. నిర్మల ధ్యానములు - 48🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 292 / Sri Lalita Chaitanya Vijnanam - 292🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 67 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 20 🌴*

20. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయ: |
అజో నిత్య: శాశ్వతో(యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ||

🌷. తాత్పర్యం :
*ఆత్మకు ఎన్నడును జన్మగాని, మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింప బోదు. జన్మ రహితమును, నిత్యమును, శాశ్వతమును, పురాతనమును అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు.*

🌻. భాష్యము :
భగవానుని అణుపరిమాణ అంశయైన ఆత్మ భగానునితో గుణరీతిని సమానమైనది. దేహము వలె అది మార్పునొందదు. కనుకనే అది కొన్నిమార్లు స్థిరము లేదా కూటస్థమని పిలువబడును. తల్లి గర్భము నుండి జన్మించుట, స్థితిని కలిగియుండుట, పెరుగుట, ఇతరములను సృష్టించుట, క్రమముగా క్షీణించుట, చివరికి నశించుట అనెడి ఆరువిధములైన మార్పులు దేహమునందు కలుగుచుండును. 

కాని ఆత్మ ఎన్నడును అటువంటి మార్పుల నొందదు. అనగా జన్మను లేదు. కాని అది దేహమును స్వీకరించుట వలన దేహము జన్మము నొందుచున్నది. అనగా అట ఆత్మ జన్మము నొందుట లేదు. అలాగుననే అది మరణమునకు సైతము గురుకాదు. జన్మించిన ప్రతి దానికి మరణము తప్పదు. కాని ఆత్మకు జన్మము లేనందున భూత, భవిష్యత్, వర్తమానములనునవి దాని లేవు. 

నిత్యమును, శాశ్వతమును, పురాతనమును అగు ఆత్మ యెన్నడు ఆవిర్భవించెనో ఎట్టి చారిత్రిక ఆధారము లేదు. దేహభావన కారణముగా మనము ఆత్మ యొక్క జన్మాది విషయములను గూర్చి ప్రశ్నింపవచ్చను. కాని నిత్యమైన ఆత్మ ఎన్నడును దేహము వలె ముసలితనము నొందదు. కనుకనే ముదుసలి కుడా కుడా తన బాల్యము లేదా యౌవనములో కలిగియున్న ఉత్సాహమునే కలిగియుండును. దేహమునందు కలిగెడి మార్పులు ఆత్మపై ప్రభావము చూపవు. వృక్షముగాని లేదా మరియే ఇతర భౌతికవిషయముల వలె గాని ఆత్మ క్షీణింపదు. ఇతరములను కుడా సృష్టింపదు. 

దేహము ద్వారా సృష్టింపబడు సంతానము వాస్తవమునకు భిన్నములైన జీవత్మలు. కాని దేహము కలిగియున్న కారణముగా వారు ఒక వ్యకికి సంతానముగా గోచరించుచున్నారు. అనగా ఆత్మ యొక్క ఉనికి కారణముననే దేహము వృద్ధినొందుచున్నది. అయినను ఆత్మ యందు మాత్రము మార్పులు లేదా ఇతర సృష్టులు కలుగవు. కనుకనే దేహమునందు కలిగెడి ఆరుమార్పులకు ఆత్మ అతీతమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 67 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

*🌴 Chapter 2 - Sankhya Yoga - 20 🌴*

20. na jāyate mriyate vā kadācin nāyaṁ bhūtvā bhavitā vā na bhūyaḥ 
ajo nityaḥ śāśvato ’yaṁ purāṇo na hanyate hanyamāne śarīre

🌻 Translation :
*For the soul there is neither birth nor death at any time. He has not come into being, does not come into being, and will not come into being. He is unborn, eternal, ever-existing and primeval. He is not slain when the body is slain.*

🌻 Purport :
Qualitatively, the small atomic fragmental part of the Supreme Spirit is one with the Supreme. He undergoes no changes like the body. Sometimes the soul is called the steady, or kūṭa-stha. 

The body is subject to six kinds of transformations. It takes its birth from the womb of the mother’s body, remains for some time, grows, produces some effects, gradually dwindles, and at last vanishes into oblivion. The soul, however, does not go through such changes. The soul is not born, but, because he takes on a material body, the body takes its birth. The soul does not take birth there, and the soul does not die. Anything which has birth also has death. And because the soul has no birth, he therefore has no past, present or future. 

He is eternal, ever-existing and primeval – that is, there is no trace in history of his coming into being. Under the impression of the body, we seek the history of birth, etc., of the soul. The soul does not at any time become old, as the body does. The so-called old man, therefore, feels himself to be in the same spirit as in his childhood or youth. The changes of the body do not affect the soul. 

The soul does not deteriorate like a tree, nor anything material. The soul has no by-product either. The by-products of the body, namely children, are also different individual souls; and, owing to the body, they appear as children of a particular man. The body develops because of the soul’s presence, but the soul has neither offshoots nor change. Therefore, the soul is free from the six changes of the body.
🌹 🌹 🌹 🌹 🌹#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 635 / Bhagavad-Gita - 635 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 46 🌴*

46. యత: ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ |
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవ: ||

🌷. తాత్పర్యం : 
సర్వజీవులకు కారణమైనవాడును మరియు సర్వత్ర వ్యాపించియున్నవాడును అగు భగవానుని అర్చించును, తన విధ్యుక్తకర్మను ఒనరించుట ద్వారా మనుజుడు పూర్ణత్వమును బడయగలడు.

🌷. భాష్యము :
ఇంద్రియాధీశుడైన హృషీకేశునిచే తాము ఒకానొక విధ్యుక్తకర్మ యందు నిలిచియున్నామని ప్రతియొక్కరు భావింపవలెను. పిదప తాము నియుక్తులై యున్న కర్మ ద్వారా లభించిన ఫలములతో దేవదేవుని అర్చించవలెను. మనుజుడు ఈ రీతిగా (పూర్ణ కృష్ణభక్తిభావన యందు) సర్వదా ఆలోచించినచో కృష్ణుని కరుణచే సర్వమును అవగతము చేసికొనగలడు. జీవితమునకు పూర్ణత్వమిదియే. 

“తేషామహమ్ సముద్ధర్తా” (భగవద్గీత 12.7) యని శ్రీకృష్ణుడు పలికియున్నాడు. అనగా అట్టి భక్తుని ఉద్ధరించు బాధ్యతను అతడే స్వయముగా స్వీకరించును. అదియే జీవితమందలి అత్యున్నత పూర్ణత్వము కాగలదు. అనగా మనుజుడెట్టి స్వధర్మమునందు నియుక్తుడైనను దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవించినచో అత్యున్నత పూర్ణత్వమును పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 635 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 46 🌴*

46. yataḥ pravṛttir bhūtānāṁ
yena sarvam idaṁ tatam
sva-karmaṇā tam abhyarcya
siddhiṁ vindati mānavaḥ

🌷 Translation : 
By worship of the Lord, who is the source of all beings and who is all-pervading, a man can attain perfection through performing his own work.

🌹 Purport :
Everyone should think that he is engaged in a particular type of occupation by Hṛṣīkeśa, the master of the senses. And by the result of the work in which one is engaged, the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, should be worshiped. If one thinks always in this way, in full Kṛṣṇa consciousness, then, by the grace of the Lord, he becomes fully aware of everything. That is the perfection of life. The Lord says in Bhagavad-gītā (12.7), teṣām ahaṁ samuddhartā. 

The Supreme Lord Himself takes charge of delivering such a devotee. That is the highest perfection of life. In whatever occupation one may be engaged, if he serves the Supreme Lord he will achieve the highest perfection.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 457, 458 / Vishnu Sahasranama Contemplation - 457, 458 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 457. సూక్ష్మః, सूक्ष्मः, Sūkṣmaḥ 🌻*

*ఓం సూక్ష్మాయ నమః | ॐ सूक्ष्माय नमः | OM Sūkṣmāya namaḥ*

శబ్దాదయో హి చ వియదాదీనాముత్తరోత్తరమ్ ।
స్థూలత్వ హేతవ స్తేషామభావాత్ సూక్ష్మతా హరేః ।
సర్వగతం సు సూక్ష్మమిత్యాది శ్రుతి సమీరణాత్ ॥

పరమాత్మ నుండి ఆకాశము శబ్దమనుగుణముతో జనించెను. అట్లే ఆకాశమునుండి వాయువు శబ్ద స్పర్శములతో, దాని నుండి అగ్ని శబ్దస్పర్శరూపములతో, దాని నుండి జలము శబ్దస్పర్శరూపరసములతో, దాని నుండి పృథివి శబ్ద స్పర్శ రూప రస గంధములతో ఇట్లు జనించెను. ఆయాభూతములయందు గల శబ్దాదిగుణములు అవి ఒకదానికంటె మరియొకటి స్థూలతరమగుటకు హేతువులు. కాని 'అశబ్దమస్పర్శమ్‌' ఇత్యాది శ్రుతిననుసరించి పరమాత్మనందు శబ్దాదులు ఏవియు లేకపోవుటచేతను పంచ భూతములలోను సూక్ష్మతమమగు ఆకాశమునకు కూడ జన్మహేతువగుటచేతను అట్టి ఆత్మ అన్నిటికంటెను సూక్ష్మతమము అనుట సమంజసము. 'సర్వగతం సుసూక్ష్మమ్‌' (ముణ్డకోపనిషత్ 1.1.6) 'ఆత్మ తత్త్వము సర్వత్ర ఉండునదియు, అత్యంత సూక్ష్మమును' అను శ్రుతి ఇందులకు ప్రమాణము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 457🌹*
📚. Prasad Bharadwaj

*🌻 457. Sūkṣmaḥ 🌻*

*OM Sūkṣmāya namaḥ*

Śabdādayo hi ca viyadādīnāmuttarottaram,
Sthūlatva hetava steṣāmabhāvāt sūkṣmatā hareḥ,
Sarvagataṃ su sūkṣmamityādi śruti samīraṇāt.

शब्दादयो हि च वियदादीनामुत्तरोत्तरम् ।
स्थूलत्व हेतव स्तेषामभावात् सूक्ष्मता हरेः ।
सर्वगतं सु सूक्ष्ममित्यादि श्रुति समीरणात् ॥

One who is subtle because He is without any gross causes like sound etc. The causes of the grossness of the succeeding elements from ether/sky downwards to earth are sound, touch, shape, taste and smell. The Lord is without these. 'Sarvagataṃ susūkṣmam / सर्वगतं सुसूक्ष्मम्‌' (Muṇḍakopaniṣat 1.1.6) says He who is very subtle and has entered into everything.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुव्रतस्सुमुखस्सूक्ष्मः सुघोषस्सुखदस्सुहृत् ।मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः ॥ ४९ ॥

సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ ।మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౪౯ ॥

Suvratassumukhassūkṣmaḥ sughoṣassukhadassuhr‌t ।Manoharo jitakrodho vīrabāhurvidāraṇaḥ ॥ 49 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 458 / Vishnu Sahasranama Contemplation - 458🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 458. సుఘోషః, सुघोषः, Sughoṣaḥ 🌻*

*ఓం సుఘోషాయ నమః | ॐ सुघोषाय नमः | OM Sughoṣāya namaḥ*

శ్రీవిష్ణోశ్శోభన ఘోషో యస్య వేదాత్మకోఽస్తి వా ।
మేఘగంభీర ఘోషత్వాద్ వా సుఘోష ఇతీర్యతే ॥

వేదరూపమగు శోభనమూ, మనోహరమూ అగు ఘోష లేదా ధ్వని ఎవనిదో అట్టివాడు. మేఘధ్వనివలె గంభీరమగు శోభన ఘోష కలవాడు అనుటయు తగును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 458🌹*
📚. Prasad Bharadwaj

*🌻 458. Sughoṣaḥ 🌻*

*OM Sughoṣāya namaḥ*

Śrīviṣṇośśobhana ghoṣo yasya vedātmako’sti vā,
Meghagaṃbhīra ghoṣatvād vā sughoṣa itīryate.

श्रीविष्णोश्शोभन घोषो यस्य वेदात्मकोऽस्ति वा ।
मेघगंभीर घोषत्वाद् वा सुघोष इतीर्यते ॥

One whose auspicious sound is the Veda. Or One who has got a deep and sonorous sound like the clouds.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुव्रतस्सुमुखस्सूक्ष्मः सुघोषस्सुखदस्सुहृत् ।मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः ॥ ४९ ॥

సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ ।మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౪౯ ॥

Suvratassumukhassūkṣmaḥ sughoṣassukhadassuhr‌t ।Manoharo jitakrodho vīrabāhurvidāraṇaḥ ॥ 49 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 142 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 21. It is a Mistake made by Many Thinkers 🌻*

The validity of genuine philosophical truths lies in their universality and necessity, and are not in need of any further verification of their tenability. They are illuminated by the torch of intuition, and hence any external verification of their validity is not only unnecessary but meaningless. They are always characterised by immediacy, universality and necessity and, consequently, by infallibility and perfect veracity. They hold good for all minds in all conditions, for they spring from the depths of knowledge. 

There are certain features of reality pervading even ordinary experience, recognisable through subtle contemplation and reflection. It is the purpose of philosophy to study these pervasive features of reality making themselves felt in experience, so that by means of these visible features man may be in a position to rise directly to an intuition of what they feebly indicate. It is a mistake made by many thinkers to reject all super-rational experience as irrational and to debar it from the field of philosophical studies.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 116 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 93. వైద్య మతములు -2 🌻*

అన్ని వైద్య విధానములు పరిమితములే. పరిపూర్ణములు కావు. ఇవి అన్నియు కలిపినచో పరిపూర్ణమగు వైద్యమేర్పడునని మరియొక మతము. ఈ భావము కూడ పరిమితమైన భావమే. దైవము యొక్క అవగాహనమే, మత మందించ వలసినది. దైవము యొక్క అవగాహన తగ్గి మతవాదములు పెరుగుచున్నప్పుడు మానవ మేధస్సులో దైవమదృశ్యమై వాదములు, వివాదములు విరోధములు, యుద్ధములు పుట్టుచున్నవి కదా! అట్లే వైద్యము కూడ పరిణమించినది. 

వైద్యము ప్రాణశాస్త్రము. ప్రాణము యొక్క తీరుతెన్నులు తెలియక వైద్యము చేసినచో ప్రాణము ఇనుమడింపదు. దేహమునందలి ప్రాణ స్పందనములు, ప్రాణము ప్రవేశించు తీరు ప్రవహించు తీరు, దానికేర్పడు అవరోధములు గ్రహించుట మరచిన వైద్యశాస్త్రములు పరిష్కారము నందించలేక వికారము చెందుచున్నవి. 

మన చుట్టును వాతావరణమున గల ప్రాణము మన యందెట్లు ప్రవేశించునో తెలియవలెను. మన యందు ఎట్లు ప్రవహించునో తెలియవలెను. వాని కవరోధము లెట్లేర్పడు చున్నవో తెలియవలెను. ఆ అవరోధనములనెట్లు నిర్మూలించ వలెనో తెలియవలెను. ఇది వైద్యమునకు మూల సూత్రము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 48 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ధ్యానం గురించి తెలియని మనిషిది నిర్జీవమైన జీవితం. ధ్యానం లేకుండా జీవితం ఎడారిలాగా మారుతూ పోతుంది. 🍀*

ధ్యానం గురించి తెలియని మనిషి నిర్జీవమైన జీవితం గడుపుతాడు. అతను ఎడారిలాంటివాడు. నేనొక అమెరికన్ టూరిస్టు గురించి విన్నాను. స్విమ్ సూట్ లో సముద్రం కేసి పరిగెడుతూ చెమటలు కక్కుతున్నాడు. అతను ఇంకో వ్యక్తిని కలిసి 'ఈ సముద్రం ఎంత దూరముంటుంది?” అని అడిగాడు.
.
ఆ వ్యక్తి అమెరికన్ ని చూసి జాలిపడి దాన్ని అందుకోవడం కష్టం. ఇది సహారా ఎడారి. యిక్కడి నించీ సముద్రం కనీసం ఎనిమిది వందల మైళు ఉంటుంది' అన్నాడు. దానికి అమెరికన్ 'ఐతే నేను ఈ బీచ్లో రెస్టు తీసుకోవాలి' అన్నాడు. నువ్వు నీ ఎడారిని బీచ్ అని నమ్మాలి, జనం అట్లా జీవిస్తున్నారు. వాళ్ళు ఎడారినే వాళ్ళు సముద్రతీరమను కుంటున్నారు. అది ఎడారి మాత్రమే. 

అక్కడ సహారా ఎడారిలో కనీసం ఎనిమిది వందల మైళ్ళు దాటాకా నీకు సముద్రం కనిపిస్తుంది. కానీ జీవితంలో ధ్యానం లేకుండా అనంతంగా ఎడారి విస్తరిస్తూ పోతుంది. అక్కడి సహారాకు అంతుండదు.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 292 / Sri Lalitha Chaitanya Vijnanam - 292 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।*
*అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥ 🍀*

*🌻 292. 'పూర్ణా'🌻* 

పూర్ణమైనది శ్రీమాత అని అర్థము. పూర్ణము, శూన్యము అను రెండు పదములను గూర్చి
ఆలోచించినపుడు దృశ్యాదృశ్యములు భావనకు వచ్చును. పూర్ణము కంటికి అగుపడు పూర్ణము. శూన్యము కంటికి అగుపడనిది. ఒకటి ఉన్నట్లుండును. మరియొకటి లేనట్లుండును. ఉన్నట్లు అగుపడుట దృష్టిని బట్టి, ద్రష్టను బట్టి యుండును. కొందరు కనపడునదే చూడలేరు. కొందరు కనుపడునది, కనపడనిది కూడ చూడగలరు.

వీరికి సూక్ష్మదృష్టి యుండును. సూక్ష్మదృష్టి యున్నవారు కూడా తమలోనుండి చూచుచున్న చైతన్యమును చూడలేరు. చైతన్య మాధారముగ సూక్ష్మ దృష్టి, స్థూల దృష్టి ఏర్పడుచున్నవి.
పూర్ణిమ చంద్రుని కన్నులుగల వారందరూ చూడగలరు. అట్టివారు అష్టమి చంద్రుని చూచినపుడు చంద్రుడు సగమే కనపడును. కనపడని భాగము లేదనుట సత్యమా? కాదు కదా! మనకు కనపడదు గాని యున్నది. 

శుక్లాష్టమి నాడు కనపడిన భాగము కృష్ణాష్టమి నాడు కనపడదు. రెండు భాగములు పూర్ణముగా కనుపించునపుడు పౌర్ణమి అందుము. రెండు భాగములు కనుపించనినాడు అమావాస్య అందుము. పౌర్ణమి, అమావాస్య, శుక్లపక్ష తిథులు, కృష్ణపక్ష తిథులు భూమికి, భూమి జీవులకే గాని చంద్రునకు కావు. చంద్రునికి హెచ్చు తగ్గులు లేవు. చంద్రుని చూచుమనకుండును. కారణము మనలోని హెచ్చుతగ్గులే. ఇట్లే సృష్టి ఆది, వృద్ధి, అంతము, ఇవి అన్నియూ జీవులకే గాని శ్రీమాతకు కాదు. ఆమె ఎప్పుడూ పూర్ణయే. అట్టి పూర్ణత్వమును జీవులు కూడ పొందవలెనని శ్రీమాత ఆకాంక్ష. 

అట్టి పూర్ణత్వము పొందుట వలన పొందిన జీవులు శ్రీమాత భక్తులుగా ఇతరులకు ఆదర్శప్రాయులుగ సృష్టి యున్నంత కాలము ఉందురు. సృష్టి శ్రీమాత యందు లయమైనపుడు ఆమెను చేరుదురు. మరల సృష్టి ఆరంభమున ఆమె నుండి పూర్ణులుగనే వెలువడి శ్రీమాత అనుజ్ఞానుసారము సృష్టి నిర్వహణమున పాల్గొందురు. ఈ నామము జీవుల గమ్యమును తెలుపు నామము. మరల మరల సృష్టి నిర్మాణములు చేయుటకు, శ్రీమాత సంకల్పించుటకు, కారణము కూడ జీవులు పూర్ణత్వము పొందుట కొఱకే. ఇది శ్రీమాత సహజ స్థితి.  

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 292 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 69. puruṣārthapradā pūrṇā bhoginī bhuvaneśvarī |*
*ambikā'nādi-nidhanā haribrahmendra-sevitā || 69 || 🍀*

*🌻 Pūrṇā पूर्णा (292) 🌻*

She is the perfect (without blemishes) totality of everything. Bṛhadāraṇayaka Upaniṣad (V.i.1) says

पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्ण्मुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥

pūrṇamadaḥ pūrṇamidaṃ pūrṇātpūrṇmudacyate| pūrṇasya pūrṇamādāya pūrṇamevāvaśiṣyate ॥

“That (the Brahman) is infinite and this (universe) is infinite. One infinite, proceeds to the other infinite. Then taking the infinitude of the infinite (universe), it remains as the infinite (the Brahman) alone”. There is no better verse than this to explain the all-pervading Brahman. She is “That” (the Brahman, as Brahman alone is perfect and complete).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹