శ్రీ లలితా సహస్ర నామములు - 80 / Sri Lalita Sahasranamavali - Meaning - 80

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 80 / Sri Lalita Sahasranamavali - Meaning - 80 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀

🍀 362. చితిః -
కూర్పు, జ్ఞానబిందు సమీకరణ.

🍀 363. తత్పదలక్ష్యార్థా -
తత్ పదముచే నిర్దేశింపబడు లక్ష్యము యొక్క ప్రయోజనముగా నున్నది.

🍀 364. చిదేకరసరూపిణీ - 
జ్ఞానచైతన్యమే ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా స్వరూపముగా గలది.

🍀 365. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః -
తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము - మొదలైన ఆనందముల సమూహము గలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 80 🌹

📚. Prasad Bharadwaj

🌻 80. citistatpada-lakṣyārthā cidekarasa-rūpiṇī |
svātmānanda-lavībhūta-brahmādyānanda-santatiḥ || 80 || 🌻

🌻 362 ) Chithi -
She who is personification of wisdom

🌻 363 ) Thatpada lakshyartha -
She who is the indicative meaning of the word “thath” which is the first word of vedic saying “that thou art”.

🌻 364 ) Chidekara swaroopini -
She who is wisdom through out

🌻 365 ) Swathmananda lavi bhootha brahmadyanantha santhathi -
She who in her ocean of wisdom makes Wisdom about Brahmam look like a wave.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

26 May 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 31

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 31 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణుమాధవ్

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. వైశాఖ పూర్ణిమ 🌻

🌻సంవత్సరమునందు పూర్ణిమ, అమావాస్య పర్వములని పేర్కొనబడుచున్నవి. అమావాస్యనాడు చంద్రుడు సూర్యునివైపు అభిముఖుడై ఉండును. భూమిపై గల జీవులకు కనపడడు.

సాధకుని మనస్సు‌ భౌతికకక్ష్య నుండి మరలి ఆత్మాభిముఖమై యుండుటను అమావాస్య సంకేతించును. పూర్ణిమనాడు చంద్రుడు భూమిపైకి నిండుగా అభిముఖుడై వెన్నెలలను కురిపించును.

అనగా జీవుల మనస్సు అంతర్ముఖమై తాను స్వీకరించిన ఆత్మానుభూతిని, బహిరంగ జీవితమునందు వ్యక్తము చేయుటను పౌర్ణమి సంకేతించును.

కావున పూర్ణిమ, అమావాస్యలు సాధకుడు ఉన్నత దివ్య పథమును చేరుటకు వలయు ద్వారములు. సాధకులెల్లరు పూర్ణిమనాడు ధ్యానము చేసి పరమగురువుల సాన్నిధ్యమున వారి ప్రణాళికలో భాగస్వాములగుటకు సంసిద్ధులు కావలెను.

వైశాఖ పూర్ణిమ విశిష్టమైనది, సూర్యుడు వృషభరాశి యందును, చంద్రుడు వృశ్చికరాశి యందును నెలకొని యుండగా ఈ పూర్ణిమ తటస్థించుచున్నది.

మూలాధారమందు దాగిన కామమను భౌతిక ఆకర్షణ నుండి మరలి సాధకుని మనస్సు సర్వాంతర్యామి యగు పరమేశ్వరుని యందు పొందు ఆకర్షణ అనబడు దివ్యప్రేమ యొక్క ఆవిష్కరణమును వృషభపూర్ణిమ సూచించుచున్నది.

కామము, అసూయ, కాపట్యము స్థానమున ప్రేమ, సహనము, విశ్వాసపాత్రత, సేవానిష్ఠలను వృషభపూర్ణిమా ధ్యానము మనయందు ప్రతిష్ఠించును....

🌹 🌹 🌹 🌹 🌹

26 May 2021

శ్రీ శివ మహా పురాణము - 403

🌹 . శ్రీ శివ మహా పురాణము - 403🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 21

🌻. పార్వతికి నారదుని ఉపదేశము - 2 🌻

ఈ తీరున శంభుని విరహముచే గొప్ప క్లేశమును పొందిన మనస్సు గల ఆ పార్వతి లేశమైననూ సుఖమును పొందజాలక, శివా! శివా! అని పలుకజొచ్చెను (16). వత్సా! ఆ పార్వతి తండ్రిగారి ఇంటివద్ద ఉన్ననూ, ఆమె మనస్సు శివునిపై నుండెను. ఆమె తీవ్రమగు దుఃఖము గలదై అనేక పర్యాయములు స్పృహను గోల్పోయెను (17).

దైన్యము నెరుంగని దృఢచిత్తులైన హిమవంతుడు, మేనక, మరియు మైనాకుడు హిమవత్పుత్రులందరు ఆమెను ఓదార్చిరి. కాని ఆమె శివుని మరువలేకపోయెను (18). ఓ దేవర్షీ! ఓ బుద్ధిశాలీ! అపుడు నీవు యథేచ్ఛగా సంచరించుచున్నవాడవై, ఇంద్రునిచే నియోగింపబడి హిమవత్పర్వమునకు విచ్చేసితివి (19).

అపుడు మహాత్ముడగు ఆ హిమవంతుడు నిన్ను పూజించి శ్రేష్ఠమగు ఆసనమునందు గూర్చుండబెట్టి కుశల ప్రశ్నల నడిగెను (20). పార్వతి ప్రారంభము నుండియూ శివుని సేవలో లగ్నమై యుండుట, శివుడు మన్మథుని దహించుట మొదలగు వృత్తాంతమును హిమవంతుడు ఆ తరువాత నీకు వివరించెను (21).

ఓ మహర్షీ! నీవా మాటలను విని హిమవంతునితో 'శివుని సేవింపుము' అని బోధించి, మనస్సులో శివుని స్మరిస్తూ లేచివచ్చితివి (22). ఓ మహర్షీ! లోకములకు ఉపకారమును చేయునట్టియు, శివునకు ప్రీతి పాత్రుడవైనట్టియు, జ్ఞాని యగు నీవు హిమవంతుని విడిచిపెట్టి, వెంటనే ఏకాంతములో పార్వతిని కలుసుకొంటివి (23).

జ్ఞానులందరిలో శ్రేష్ఠుడవగు నీవు పార్వతీ దేవి యొక్క హితమును గోరి ఆమెను ఆదరముతో సమీపించి సంబోధించి సత్యమును ఇట్లు పలికితివి (24).

నారదుడిట్లు పలికెను-

ఓ పార్వతీ! నా మాటము వినుము. దయామయుడనగు నేను నీకు అన్ని విధములుగా హితమును చేగూర్చునది, రాగద్వేషాది దోషములు లేనిది, కోర్కెలనీడేర్చునది అగు సత్యమును చెప్పెదను (25). దీనులను అనుగ్రహించే మహాదేవుని నీవిచట సేవించి యుంటివి. కాని నీవు తపస్సును చేయలేదు. మరియు గర్వమును కలిగియుంటివి. దానితో సర్వము ధ్వంసమాయోను (26).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

26 May 2021

గీతోపనిషత్తు -204

🌹. గీతోపనిషత్తు  -204 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము  📚*
శ్లోకము 45

*🍀 44. యోగ సంసిద్ధి - యోగాభ్యాసము సాగుచుండగ జీవుని అంతఃకరణ బహిఃకరణములు పరిశుద్ధి చెందవలెను. వాని నడుమ సంయమ మేర్పడవలెను. కర్మ; కర్తవ్య కర్మమే కావలెను. కామ్యకర్మ కారాదు. కర్మలందాసక్తి జనించుట కూడ తరింప బడవలెను. అహింస, ఆస్తేయము, అపరిగ్రహము ఆదిగా గల గుణములు సహజమై యుండవలెను. దానధర్మాదులు దినచర్యలో భాగమై పోవలయును. ఇష్టాయిష్టములు కరుగవలెను. ఇత్యాది అంశములు సిద్ధించుటకు జన్మలు పట్టుటలో ఆశ్చర్యము లేదు. 🍀*

ప్రయత్నా ద్యతమానసు యోగీ సంశుద్ధ కిల్బిషః |
అనేకజన్మ సంసిద్ధ స్తతో యాతి పరాం గతిమ్ || 45

యత మానసుడై జన్మల తరబడి ప్రయత్నము చేయుచున్న యోగాభ్యాసి కిల్బిషము లన్నియు హరింపబడగ, సంశుద్ధుడై యోగ సంసిద్ధిని చెంది తరించును. శ్రీ కృష్ణుడు తెలుపుచున్న యోగవిద్య జీవులకు జన్మజన్మల అభ్యాసముగ సాగునని అంతకంతకును స్పష్టమగుచున్నది. క్రమ బద్దముగ నేర్చు యోగవిద్య సిద్ధించుటకు ఎన్ని సంవత్సరములు పట్టినను భయము లేదు. అభ్యాసము ఆరోహణ క్రమమున సాగవలెను.

యోగాభ్యాసము సాగుచుండగ జీవుని అంతఃకరణ బహిఃకరణములు పరిశుద్ధి చెందవలెను. వాని నడుమ సంయమ మేర్పడవలెను. కర్మ; కర్తవ్య కర్మమే కావలెను. కామ్యకర్మ కారాదు. కర్మలం దాసక్తి జనించుట కూడ తరింపబడవలెను. అహింస, ఆస్తేయము, అపరిగ్రహము ఆదిగా గల గుణములు సహజమై యుండవలెను. దానధర్మాదులు దినచర్యలో భాగమై పోవలయును. ఇష్టాయిష్టములు కరుగవలెను. ఇత్యాది అంశములు సిద్ధించుటకు జన్మలు పట్టుటలో ఆశ్చర్యము లేదు.

పతంజలి మహర్షి తెలిపిన యమ నియమ, ఆసన, ప్రాణాయామాది సూత్రములు, శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన కర్మ జ్ఞాన సన్యాస సూత్రములు సిద్ధించుటకు కొన్ని జన్మల పరంపర సాగవచ్చును. కాని ఇవి యన్నియు యోగ మార్గమున సార్థకత నిచ్చునవి, సాఫల్యతను కలిగించునవే.

జీవుని స్వభావములో అనేకానేక జన్మ పరంపరల వాసన లుండును. అట్టి వాసన లన్నియు ఒక్కమారుగ పోవుటకు వీలు పడదు. క్రమ క్రమముగ శుభవాసన లేర్పడి అశుభ వాసనలు తొలగింపబడి జీవుడు ముందుకు సాగును. అతని యందలి భయము, కామము, క్రోధము, మోహ లోభములు, ఈర్ష్య అసూయలు, మదమాత్సర్యములు ఇత్యాది వాసనలను- యోగ సూత్రములను దీర్ఘకాలము అభ్యసించుట ద్వారా మాత్రమే నిర్మూలింప వచ్చును.

అభ్యాసము సాగుతున్నంత కాలము శుద్ధి ఏర్పడుచు నుండును. అశుద్ధి నుండి బయల్పడును. ఇట్లు సంయత్ శుద్ధిని చేరుసరికి సాధకుడు చాల దృఢచిత్తుడై తన మూలముతో యోగము చెందుటకు సంసిద్ధుడు కాగలడు. కనుక యోగము అనేక జన్మల సంసిద్ధి అని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

26 May 2021

వైశాఖ పూర్ణిమ.. మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి.., కూర్మజయంతి శుభాకాంక్షలు , మీ అందరికి.

🌹. వైశాఖ పూర్ణిమ.. మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి.., కూర్మజయంతి శుభాకాంక్షలు , మీ అందరికి. 🌹

ప్రసాద్‌‌ భరధ్వాజ

వైశాఖ పూర్ణిమ.. దీనినే మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమిఅని కూడా పిలుస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా అధిక ఫలితాలను పొందవచ్చని చెబుతుంటారు. ఈ రోజున గౌతమ్ బుద్దుడు జన్మించాడని.. అలాగే ఇదే రోజున జ్ఞానోదయం పొందిన రోజు అని చెబుతుంటారు. బుద్దుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు, పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మే 26న బుద్ద పౌర్ణమి.

భారత దేశంలో బౌద్ధమతాన్ని స్కీకరించిన ప్రజలు తెల్లని దుస్తువులను ధరించి.. మాంసాహారం తినరు. ఈరోజున కేవలం ఖీర్ మాత్రమే తింటారు. బుద్దుడికి ఒక మహిళ ఒక గిన్నెలో పాలు మాత్రమే సమర్పించిందని చెబుతుంటారు. ఈరోజున బౌద్దులు చుట్టుపక్కల వర్గాల నుంచి పగోడాల వరకు రంగు రంగుల పల్లకిలలో ఉరేగింపులు నిర్వహిస్తారు. అలాగే బోధి చెట్టు మొదట్లో నీరు పోసి.. నైవేధ్యం సమర్పిస్తారు. అక్కడే ధ్యానం చేస్తారు. బుద్ద పూర్ణిమ సందర్భంగా బీహార్ లోని బోధ్ గయాలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహా బోధి ఆలయాన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తారు. ఇక్కడే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతుంటారు.

🌹 🌹 🌹 🌹 🌹

మహా పర్వదినమైనటువంటి మహా వైశాఖి అని పిలవబడుతున్నటు వంటి మహా పౌర్ణమి శుభ ఘడియలలోనే మహాత్ములైన వేదవ్యాసమహర్షి, అన్నమాచార్యుల వారు, గౌతమబుద్ధుడు జన్మించారు. శంకరాచార్యులవారి యొక్క ఆవిర్భావము యొక్క ప్రాభవము ఈ పౌర్ణమి నుండి బాగా వ్యాప్తి చెందినది.

భూమి మీద ఉన్న ఋషులు, మహర్షులు, అందరూ ఈ భూమిని నడిపిస్తున్నటువంటి దివ్యశక్తి అయిన సనత్కుమార ప్రజ్ఞతో కూడి, ఒక సమావేశమును వైశాఖ లోయలో ఏర్పాటు చేసుకుంటారు. ఈ లోయ మానస సరోవరమునకు, కైలాస పర్వతమునకు ఉత్తరదిశలో ఉన్నటువంటి లోయ. ఈ భూమి మీద ఉన్న మానవులకు, యితర జీవులకు ఏ విధముగా శ్రేయస్సుని కలిగించాలో, దానికి సంబంధించిన ప్రణాళికను సనత్కుమార మహర్షి ఋషులకు, సిద్ధులకు,బ్రహ్మర్షులకు అందించడము జరుగుతుంది.

పౌర్ణమి రోజు సూర్య చంద్రుల మధ్య 180 డిగ్రీలు ఏర్పడి ప్రతిముఖముగా ఉంటారు. ఈ రోజు పరమగురువులు శ్రద్ధాళువులకు, భక్తి, తపన, ఉన్ముఖత కలిగిన వారికి మార్గదర్శకత్వము, సాన్నిధ్యము ఇస్తామని వాగ్దానము చేసి ఉన్నారు. పౌర్ణమి రోజు పౌర్ణమి తిథి అంతమయ్యే ఘడియలు ముఖ్యము. పౌర్ణమి తిధికి ముందు ఆరు గంటల, తరువాత ఆరు గంటలు అంతరంగము నందు దివ్యత్వముతో అనుసంధానము చెందే ప్రయత్నములో సాధకుడు ఉండాలి.

- Master EK

🌹 🌹 🌹 🌹 🌹

26 May 2021

26-MAY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 204🌹  
2) 🌹. శివ మహా పురాణము - 403🌹 
3) 🌹 Light On The Path - 150🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -31🌹  
5) 🌹 Osho Daily Meditations - 20🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 80 / Lalitha Sahasra Namavali - 80🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 80 / Sri Vishnu Sahasranama - 80🌹 
8) 🍀. వైశాఖి పౌర్ణమి విశిష్టత 🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -204 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 45

*🍀 44. యోగ సంసిద్ధి - యోగాభ్యాసము సాగుచుండగ జీవుని అంతఃకరణ బహిఃకరణములు పరిశుద్ధి చెందవలెను. వాని నడుమ సంయమ మేర్పడవలెను. కర్మ; కర్తవ్య కర్మమే కావలెను. కామ్యకర్మ కారాదు. కర్మలందాసక్తి జనించుట కూడ తరింప బడవలెను. అహింస, ఆస్తేయము, అపరిగ్రహము ఆదిగా గల గుణములు సహజమై యుండవలెను. దానధర్మాదులు దినచర్యలో భాగమై పోవలయును. ఇష్టాయిష్టములు కరుగవలెను. ఇత్యాది అంశములు సిద్ధించుటకు జన్మలు పట్టుటలో ఆశ్చర్యము లేదు. 🍀*

ప్రయత్నా ద్యతమానసు యోగీ సంశుద్ధ కిల్బిషః |
అనేకజన్మ సంసిద్ధ స్తతో యాతి పరాం గతిమ్ || 45

యత మానసుడై జన్మల తరబడి ప్రయత్నము చేయుచున్న యోగాభ్యాసి కిల్బిషము లన్నియు హరింపబడగ, సంశుద్ధుడై యోగ సంసిద్ధిని చెంది తరించును. శ్రీ కృష్ణుడు తెలుపుచున్న యోగవిద్య జీవులకు జన్మజన్మల అభ్యాసముగ సాగునని అంతకంతకును స్పష్టమగుచున్నది. క్రమ బద్దముగ నేర్చు యోగవిద్య సిద్ధించుటకు ఎన్ని సంవత్సరములు పట్టినను భయము లేదు. అభ్యాసము ఆరోహణ క్రమమున సాగవలెను. 

యోగాభ్యాసము సాగుచుండగ జీవుని అంతఃకరణ బహిఃకరణములు పరిశుద్ధి చెందవలెను. వాని నడుమ సంయమ మేర్పడవలెను. కర్మ; కర్తవ్య కర్మమే కావలెను. కామ్యకర్మ కారాదు. కర్మలం దాసక్తి జనించుట కూడ తరింపబడవలెను. అహింస, ఆస్తేయము, అపరిగ్రహము ఆదిగా గల గుణములు సహజమై యుండవలెను. దానధర్మాదులు దినచర్యలో భాగమై పోవలయును. ఇష్టాయిష్టములు కరుగవలెను. ఇత్యాది అంశములు సిద్ధించుటకు జన్మలు పట్టుటలో ఆశ్చర్యము లేదు. 

పతంజలి మహర్షి తెలిపిన యమ నియమ, ఆసన, ప్రాణాయామాది సూత్రములు, శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన కర్మ జ్ఞాన సన్యాస సూత్రములు సిద్ధించుటకు కొన్ని జన్మల పరంపర సాగవచ్చును. కాని ఇవి యన్నియు యోగ మార్గమున సార్థకత నిచ్చునవి, సాఫల్యతను కలిగించునవే.

జీవుని స్వభావములో అనేకానేక జన్మ పరంపరల వాసన లుండును. అట్టి వాసన లన్నియు ఒక్కమారుగ పోవుటకు వీలు పడదు. క్రమ క్రమముగ శుభవాసన లేర్పడి అశుభ వాసనలు తొలగింపబడి జీవుడు ముందుకు సాగును. అతని యందలి భయము, కామము, క్రోధము, మోహ లోభములు, ఈర్ష్య అసూయలు, మదమాత్సర్యములు ఇత్యాది వాసనలను- యోగ సూత్రములను దీర్ఘకాలము అభ్యసించుట ద్వారా మాత్రమే నిర్మూలింప వచ్చును. 

అభ్యాసము సాగుతున్నంత కాలము శుద్ధి ఏర్పడుచు నుండును. అశుద్ధి నుండి బయల్పడును. ఇట్లు సంయత్ శుద్ధిని చేరుసరికి సాధకుడు చాల దృఢచిత్తుడై తన మూలముతో యోగము చెందుటకు సంసిద్ధుడు కాగలడు. కనుక యోగము అనేక జన్మల సంసిద్ధి అని తెలియవలెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 403🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 21

*🌻. పార్వతికి నారదుని ఉపదేశము - 2 🌻*

ఈ తీరున శంభుని విరహముచే గొప్ప క్లేశమును పొందిన మనస్సు గల ఆ పార్వతి లేశమైననూ సుఖమును పొందజాలక, శివా! శివా! అని పలుకజొచ్చెను (16). వత్సా! ఆ పార్వతి తండ్రిగారి ఇంటివద్ద ఉన్ననూ, ఆమె మనస్సు శివునిపై నుండెను. ఆమె తీవ్రమగు దుఃఖము గలదై అనేక పర్యాయములు స్పృహను గోల్పోయెను (17). 

దైన్యము నెరుంగని దృఢచిత్తులైన హిమవంతుడు, మేనక, మరియు మైనాకుడు హిమవత్పుత్రులందరు ఆమెను ఓదార్చిరి. కాని ఆమె శివుని మరువలేకపోయెను (18). ఓ దేవర్షీ! ఓ బుద్ధిశాలీ! అపుడు నీవు యథేచ్ఛగా సంచరించుచున్నవాడవై, ఇంద్రునిచే నియోగింపబడి హిమవత్పర్వమునకు విచ్చేసితివి (19).

అపుడు మహాత్ముడగు ఆ హిమవంతుడు నిన్ను పూజించి శ్రేష్ఠమగు ఆసనమునందు గూర్చుండబెట్టి కుశల ప్రశ్నల నడిగెను (20). పార్వతి ప్రారంభము నుండియూ శివుని సేవలో లగ్నమై యుండుట, శివుడు మన్మథుని దహించుట మొదలగు వృత్తాంతమును హిమవంతుడు ఆ తరువాత నీకు వివరించెను (21). 

ఓ మహర్షీ! నీవా మాటలను విని హిమవంతునితో 'శివుని సేవింపుము' అని బోధించి, మనస్సులో శివుని స్మరిస్తూ లేచివచ్చితివి (22). ఓ మహర్షీ! లోకములకు ఉపకారమును చేయునట్టియు, శివునకు ప్రీతి పాత్రుడవైనట్టియు, జ్ఞాని యగు నీవు హిమవంతుని విడిచిపెట్టి, వెంటనే ఏకాంతములో పార్వతిని కలుసుకొంటివి (23).

జ్ఞానులందరిలో శ్రేష్ఠుడవగు నీవు పార్వతీ దేవి యొక్క హితమును గోరి ఆమెను ఆదరముతో సమీపించి సంబోధించి సత్యమును ఇట్లు పలికితివి (24).

నారదుడిట్లు పలికెను-

ఓ పార్వతీ! నా మాటము వినుము. దయామయుడనగు నేను నీకు అన్ని విధములుగా హితమును చేగూర్చునది, రాగద్వేషాది దోషములు లేనిది, కోర్కెలనీడేర్చునది అగు సత్యమును చెప్పెదను (25). దీనులను అనుగ్రహించే మహాదేవుని నీవిచట సేవించి యుంటివి. కాని నీవు తపస్సును చేయలేదు. మరియు గర్వమును కలిగియుంటివి. దానితో సర్వము ధ్వంసమాయోను (26). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 150 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 When the disciple is ready to learn, then he is accepted, acknowledged, recognized. It must be so, for he has lit his lamp, and it cannot be hidden. - 1 🌻*

558. Only if with intense exaltation and bliss there comes at the same time a sense of uttermost calm and peace is one touching higher levels; when there is excitement and disturbance, and a loss of self-control, one is certainly down on a lower level.

560. This is a comforting saying. Disciples are always watched, though many people find difficulty in realizing this. The Great Ones Themselves have explained that when They look over the world the man who has lit his lamp shows out like a great flame in the general darkness. 

They could not miss seeing it. Carefully They are watching wherever the light is beginning to glow and are trying to help each little glow to kindle into flame, so that these also may become bearers of light, to the world.

561. People are apt sometimes to criticize unwisely in this matter. Perhaps it is natural; but it would be better for them if they did not. I have myself known cases in which members – generally keenly intellectual people, who were very sharp in discriminating faults and failings in others – have said: 

“So-and-so is a pupil of the Master; I do not see that he is in any way more fit for such a position than I am myself. I have been so many years in the Society; I have done such-and-such work, and if such-and-such a man with certain obvious failings may be accepted, why should not I?”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 31 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనం : వేణుమాధవ్ 
📚. ప్రసాద్ భరద్వాజ

 🌻. వైశాఖ పూర్ణిమ 🌻

🌻సంవత్సరమునందు పూర్ణిమ, అమావాస్య పర్వములని పేర్కొనబడుచున్నవి. అమావాస్యనాడు చంద్రుడు సూర్యునివైపు అభిముఖుడై ఉండును. భూమిపై గల జీవులకు కనపడడు. 

సాధకుని మనస్సు‌ భౌతికకక్ష్య నుండి మరలి ఆత్మాభిముఖమై యుండుటను అమావాస్య సంకేతించును. పూర్ణిమనాడు చంద్రుడు భూమిపైకి నిండుగా అభిముఖుడై వెన్నెలలను కురిపించును. 

అనగా జీవుల మనస్సు అంతర్ముఖమై తాను స్వీకరించిన ఆత్మానుభూతిని, బహిరంగ జీవితమునందు వ్యక్తము చేయుటను పౌర్ణమి సంకేతించును. 

కావున పూర్ణిమ, అమావాస్యలు సాధకుడు ఉన్నత దివ్య పథమును చేరుటకు వలయు ద్వారములు. సాధకులెల్లరు పూర్ణిమనాడు ధ్యానము చేసి పరమగురువుల సాన్నిధ్యమున వారి ప్రణాళికలో భాగస్వాములగుటకు సంసిద్ధులు కావలెను. 

వైశాఖ పూర్ణిమ విశిష్టమైనది, సూర్యుడు వృషభరాశి యందును, చంద్రుడు వృశ్చికరాశి యందును నెలకొని యుండగా ఈ పూర్ణిమ తటస్థించుచున్నది. 

మూలాధారమందు దాగిన కామమను భౌతిక ఆకర్షణ నుండి మరలి సాధకుని మనస్సు సర్వాంతర్యామి యగు పరమేశ్వరుని యందు పొందు ఆకర్షణ అనబడు దివ్యప్రేమ యొక్క ఆవిష్కరణమును వృషభపూర్ణిమ సూచించుచున్నది. 

కామము, అసూయ, కాపట్యము స్థానమున ప్రేమ, సహనము, విశ్వాసపాత్రత, సేవానిష్ఠలను వృషభపూర్ణిమా ధ్యానము మనయందు ప్రతిష్ఠించును....
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 20 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 HOLDING BACK 🍀*

*🕉 Why do we hold back? There is some fear that if we don't hold back, if we give all, then we have nothing else to give. So we give only in parts. We want to remain mysterious. 🕉*

When you don't allow the other to enter into your whole being and know it totally, it is because of the fear that once the other knows you totally he or she may become disinterested. You keep a few corners of yourself aloof so that the other goes on wondering, "What are those corners? What more do you have give?" And the other goes on searching and seeking and persuading and seducing.... And in the same way, the other is also holding back. 

There is some animal understanding behind it that once the mystery is known, the thing is finished. We love the mystery, we love the unknown. When it is known, mapped, and measured, it is finished! Then what else is there? The adventuring mind will start thinking of other thing, other issue.They have looked into many things and finished! Now the thing has no soul because the mystery is no longer here-and the soul exists in mystery. This is the logic in it. 

But when you are truly independent, and you are surrendered to the god of love, then you can open yourself totally. And in that very opening you become one with God. When people are open, they are no longer two. When the walls disappear, the room is one. And that is where the fulfillment is. 

That's what every divine lover is seeking for, searching for, hankering after, dreaming about, desiring. But not understanding rightly, you can go on seeking and searching in a wrong direction.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 80 / Sri Lalita Sahasranamavali - Meaning - 80 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।*
*స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀*

🍀 362. చితిః - 
కూర్పు, జ్ఞానబిందు సమీకరణ.

🍀 363. తత్పదలక్ష్యార్థా - 
తత్ పదముచే నిర్దేశింపబడు లక్ష్యము యొక్క ప్రయోజనముగా నున్నది.

🍀 364. చిదేకరసరూపిణీ - జ్ఞానచైతన్యమే ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా స్వరూపముగా గలది.

🍀 365. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః - 
తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము - మొదలైన ఆనందముల సమూహము గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 80 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 80. citistatpada-lakṣyārthā cidekarasa-rūpiṇī |*
*svātmānanda-lavībhūta-brahmādyānanda-santatiḥ || 80 || 🌻*

🌻 362 ) Chithi -   
She who is personification of wisdom

🌻 363 ) Thatpada lakshyartha -   
She who is the indicative meaning of the word “thath” which is the first word of vedic saying “that thou art”.

🌻 364 ) Chidekara swaroopini -   
She who is wisdom through out

🌻 365 ) Swathmananda lavi bhootha brahmadyanantha santhathi -   
She who in her ocean of wisdom makes Wisdom about Brahmam look like a wave.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 80 / Sri Vishnu Sahasra Namavali - 80 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*పూర్వాషాడ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*

*🍀 80. అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః|| 🍀*

 🍀 747) అమానీ - 
నిగర్వి, నిరహంకారుడు.

🍀 748) మానద: - 
భక్తులకు గౌరవము ఇచ్చువాడు.

🍀 749) మాన్య: - 
పూజింపదగిన వాడైన భగవానుడు.

🍀 750) లోకస్వామీ - 
పదునాలుగు భువనములకు ప్రభువు.

🍀 751) త్రిలోకథృక్ - 
ముల్లోకములకు ఆధారమైన భగవానుడు.

🍀 752) సుమేధా: - 
చక్కని ప్రజ్ఞ గలవాడు.

🍀 753) మేధజ: - 
యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు.

🍀 754) ధన్య: - 
కృతార్థుడైనట్టివాడు.

🍀 755) సత్యమేధ: - 
సత్య జ్ఞానము కలవాడు.

🍀 756) ధరాధర: - 
భూమిని ధరించి యున్నవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 80 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Poorvashada 4TH Padam*

*🌻 amānī mānadō mānyō lōkasvāmī trilōkadhṛt |*
*sumedhā medhajō dhanyaḥ satyamedhā dharādharaḥ || 80 || 🌻*

🌻 747. Amānī: 
He who, being of the nature of Pure Consciousness, has no sense of identification with anything that is not Atman.

🌻 748. Mānadaḥ: 
One who by His power of Maya induces the sense of self in non-self. Or one who has regard and beneficence towards devotees. Or one who destroys in the knowing ones the sense of identification with the non-self.

🌻 749. Mānyaḥ: 
One who is to be adored by all, because He is the God of all.

🌻 750. Lokasvāmī: 
One who is the Lord of all the fourteen spheres.

🌻 751. Trilokadhṛt: 
One who supports all the three worlds.

🌻 752. Sumedhāḥ: 
One with great and beneficent intelligence.

🌻 753. Medhajaḥ: 
One who arose from Yaga (a kind of sacrifice).

🌻 754. Dhanyaḥ: 
One who has attained all His ends and therefore is self-satisfied.

🌻 755. Satyamedhāḥ: 
One whose intelligence is fruitful.

🌻 756. Dharādharaḥ: 
One who supports the worlds by His fractiosn like Adisesha.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వైశాఖ పూర్ణిమ.. మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి.., కూర్మజయంతి శుభాకాంక్షలు , ఆశీస్సులు మీ అందరికి. 🌹*
*ప్రసాద్‌‌ భరధ్వాజ, జ్యోతిర్మయి.* 🙌 🙌 🙌

*Good Wishes and Blessings on Vishakhi Pournami, Bhudha Pournami, Maha Vaisakhi, Koorma Jayanthi to you and All.* 
*Prasad, Jyothirmayi.* 🙌 🙌 🙌

*వైశాఖ పూర్ణిమ.. దీనినే మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమిఅని కూడా పిలుస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా అధిక ఫలితాలను పొందవచ్చని చెబుతుంటారు. ఈ రోజున గౌతమ్ బుద్దుడు జన్మించాడని.. అలాగే ఇదే రోజున జ్ఞానోదయం పొందిన రోజు అని చెబుతుంటారు. బుద్దుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు, పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మే 26న బుద్ద పౌర్ణమి.*

*భారత దేశంలో బౌద్ధమతాన్ని స్కీకరించిన ప్రజలు తెల్లని దుస్తువులను ధరించి.. మాంసాహారం తినరు. ఈరోజున కేవలం ఖీర్ మాత్రమే తింటారు. బుద్దుడికి ఒక మహిళ ఒక గిన్నెలో పాలు మాత్రమే సమర్పించిందని చెబుతుంటారు. ఈరోజున బౌద్దులు చుట్టుపక్కల వర్గాల నుంచి పగోడాల వరకు రంగు రంగుల పల్లకిలలో ఉరేగింపులు నిర్వహిస్తారు. అలాగే బోధి చెట్టు మొదట్లో నీరు పోసి.. నైవేధ్యం సమర్పిస్తారు. అక్కడే ధ్యానం చేస్తారు. బుద్ద పూర్ణిమ సందర్భంగా బీహార్ లోని బోధ్ గయాలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహా బోధి ఆలయాన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తారు. ఇక్కడే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతుంటారు.*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*మహా పర్వదినమైనటువంటి మహా వైశాఖి అని పిలవబడుతున్నటువంటి మహా పౌర్ణమి శుభ ఘడియలలోనే మహాత్ములైన వేదవ్యాసమహర్షి, అన్నమాచార్యుల వారు, గౌతమబుద్ధుడు జన్మించారు.* *శంకరాచార్యులవారి యొక్క ఆవిర్భావము యొక్క ప్రాభవము ఈ పౌర్ణమి నుండి బాగా వ్యాప్తి చెందినది.*

*భూమి మీద ఉన్న ఋషులు, మహర్షులు, అందరూ ఈ భూమిని నడిపిస్తున్నటువంటి దివ్యశక్తి అయిన సనత్కుమార ప్రజ్ఞతో కూడి, ఒక సమావేశమును వైశాఖ లోయలో ఏర్పాటు చేసుకుంటారు. ఈ లోయ మానస సరోవరమునకు, కైలాస పర్వతమునకు ఉత్తరదిశలో ఉన్నటువంటి లోయ. ఈ భూమి మీద ఉన్న మానవులకు, యితర జీవులకు ఏ విధముగా శ్రేయస్సుని కలిగించాలో, దానికి సంబంధించిన ప్రణాళికను సనత్కుమార మహర్షి ఋషులకు, సిద్ధులకు,బ్రహ్మర్షులకు అందించడము జరుగుతుంది.*

*పౌర్ణమి రోజు సూర్య చంద్రుల మధ్య 180 డిగ్రీలు ఏర్పడి ప్రతిముఖముగా ఉంటారు. ఈ రోజు పరమగురువులు శ్రద్ధాళువులకు, భక్తి, తపన, ఉన్ముఖత కలిగిన వారికి మార్గదర్శకత్వము, సాన్నిధ్యము ఇస్తామని వాగ్దానము చేసి ఉన్నారు. పౌర్ణమి రోజు పౌర్ణమి తిథి అంతమయ్యే ఘడియలు ముఖ్యము. పౌర్ణమి తిధికి ముందు ఆరు గంటల, తరువాత ఆరు గంటలు అంతరంగము నందు దివ్యత్వముతో అనుసంధానము చెందే ప్రయత్నములో సాధకుడు ఉండాలి.*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹