వైశాఖ పూర్ణిమ.. మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి.., కూర్మజయంతి శుభాకాంక్షలు , మీ అందరికి.
🌹. వైశాఖ పూర్ణిమ.. మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి.., కూర్మజయంతి శుభాకాంక్షలు , మీ అందరికి. 🌹
ప్రసాద్ భరధ్వాజ
వైశాఖ పూర్ణిమ.. దీనినే మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమిఅని కూడా పిలుస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా అధిక ఫలితాలను పొందవచ్చని చెబుతుంటారు. ఈ రోజున గౌతమ్ బుద్దుడు జన్మించాడని.. అలాగే ఇదే రోజున జ్ఞానోదయం పొందిన రోజు అని చెబుతుంటారు. బుద్దుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు, పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మే 26న బుద్ద పౌర్ణమి.
భారత దేశంలో బౌద్ధమతాన్ని స్కీకరించిన ప్రజలు తెల్లని దుస్తువులను ధరించి.. మాంసాహారం తినరు. ఈరోజున కేవలం ఖీర్ మాత్రమే తింటారు. బుద్దుడికి ఒక మహిళ ఒక గిన్నెలో పాలు మాత్రమే సమర్పించిందని చెబుతుంటారు. ఈరోజున బౌద్దులు చుట్టుపక్కల వర్గాల నుంచి పగోడాల వరకు రంగు రంగుల పల్లకిలలో ఉరేగింపులు నిర్వహిస్తారు. అలాగే బోధి చెట్టు మొదట్లో నీరు పోసి.. నైవేధ్యం సమర్పిస్తారు. అక్కడే ధ్యానం చేస్తారు. బుద్ద పూర్ణిమ సందర్భంగా బీహార్ లోని బోధ్ గయాలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహా బోధి ఆలయాన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తారు. ఇక్కడే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతుంటారు.
🌹 🌹 🌹 🌹 🌹
మహా పర్వదినమైనటువంటి మహా వైశాఖి అని పిలవబడుతున్నటు వంటి మహా పౌర్ణమి శుభ ఘడియలలోనే మహాత్ములైన వేదవ్యాసమహర్షి, అన్నమాచార్యుల వారు, గౌతమబుద్ధుడు జన్మించారు. శంకరాచార్యులవారి యొక్క ఆవిర్భావము యొక్క ప్రాభవము ఈ పౌర్ణమి నుండి బాగా వ్యాప్తి చెందినది.
భూమి మీద ఉన్న ఋషులు, మహర్షులు, అందరూ ఈ భూమిని నడిపిస్తున్నటువంటి దివ్యశక్తి అయిన సనత్కుమార ప్రజ్ఞతో కూడి, ఒక సమావేశమును వైశాఖ లోయలో ఏర్పాటు చేసుకుంటారు. ఈ లోయ మానస సరోవరమునకు, కైలాస పర్వతమునకు ఉత్తరదిశలో ఉన్నటువంటి లోయ. ఈ భూమి మీద ఉన్న మానవులకు, యితర జీవులకు ఏ విధముగా శ్రేయస్సుని కలిగించాలో, దానికి సంబంధించిన ప్రణాళికను సనత్కుమార మహర్షి ఋషులకు, సిద్ధులకు,బ్రహ్మర్షులకు అందించడము జరుగుతుంది.
పౌర్ణమి రోజు సూర్య చంద్రుల మధ్య 180 డిగ్రీలు ఏర్పడి ప్రతిముఖముగా ఉంటారు. ఈ రోజు పరమగురువులు శ్రద్ధాళువులకు, భక్తి, తపన, ఉన్ముఖత కలిగిన వారికి మార్గదర్శకత్వము, సాన్నిధ్యము ఇస్తామని వాగ్దానము చేసి ఉన్నారు. పౌర్ణమి రోజు పౌర్ణమి తిథి అంతమయ్యే ఘడియలు ముఖ్యము. పౌర్ణమి తిధికి ముందు ఆరు గంటల, తరువాత ఆరు గంటలు అంతరంగము నందు దివ్యత్వముతో అనుసంధానము చెందే ప్రయత్నములో సాధకుడు ఉండాలి.
- Master EK
🌹 🌹 🌹 🌹 🌹
26 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment