మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 31


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 31 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణుమాధవ్

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. వైశాఖ పూర్ణిమ 🌻


🌻సంవత్సరమునందు పూర్ణిమ, అమావాస్య పర్వములని పేర్కొనబడుచున్నవి. అమావాస్యనాడు చంద్రుడు సూర్యునివైపు అభిముఖుడై ఉండును. భూమిపై గల జీవులకు కనపడడు.

సాధకుని మనస్సు‌ భౌతికకక్ష్య నుండి మరలి ఆత్మాభిముఖమై యుండుటను అమావాస్య సంకేతించును. పూర్ణిమనాడు చంద్రుడు భూమిపైకి నిండుగా అభిముఖుడై వెన్నెలలను కురిపించును.

అనగా జీవుల మనస్సు అంతర్ముఖమై తాను స్వీకరించిన ఆత్మానుభూతిని, బహిరంగ జీవితమునందు వ్యక్తము చేయుటను పౌర్ణమి సంకేతించును.

కావున పూర్ణిమ, అమావాస్యలు సాధకుడు ఉన్నత దివ్య పథమును చేరుటకు వలయు ద్వారములు. సాధకులెల్లరు పూర్ణిమనాడు ధ్యానము చేసి పరమగురువుల సాన్నిధ్యమున వారి ప్రణాళికలో భాగస్వాములగుటకు సంసిద్ధులు కావలెను.

వైశాఖ పూర్ణిమ విశిష్టమైనది, సూర్యుడు వృషభరాశి యందును, చంద్రుడు వృశ్చికరాశి యందును నెలకొని యుండగా ఈ పూర్ణిమ తటస్థించుచున్నది.

మూలాధారమందు దాగిన కామమను భౌతిక ఆకర్షణ నుండి మరలి సాధకుని మనస్సు సర్వాంతర్యామి యగు పరమేశ్వరుని యందు పొందు ఆకర్షణ అనబడు దివ్యప్రేమ యొక్క ఆవిష్కరణమును వృషభపూర్ణిమ సూచించుచున్నది.

కామము, అసూయ, కాపట్యము స్థానమున ప్రేమ, సహనము, విశ్వాసపాత్రత, సేవానిష్ఠలను వృషభపూర్ణిమా ధ్యానము మనయందు ప్రతిష్ఠించును....

🌹 🌹 🌹 🌹 🌹


26 May 2021

No comments:

Post a Comment