మైత్రేయ మహర్షి బోధనలు - 92


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 92 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 76. భావములు - పంచభూతములు - 2 🌻


వన్నెలేని భావములు పతనమునకు ద్వారములు. పంచ భూతములు భావన మాధారముగ వర్తించుచున్నవి. మానవ భావనము అనారోగ్యకరముగ నుండుటచేతనే అతివృష్టి, అనావృష్టి, క్షామము, తీవ్రరోగములు పుట్టుచున్నవి. సంఘటితమగు నిర్మాణాత్మక భావములే సంఘ క్షేమమునకు ప్రధానము. ఒకరిద్దరు సత్పురుషులున్నచో నిర్వీర్యమైన సంఘభావన మార్పు జేయలేరు.

బృందములు బృందములుగ సద్భావనా సంఘములున్నచో సంఘమును పునరుజ్జీవింప చేయవచ్చును. ఇందులకే సద్భావనా బృందముల నేర్పరచుటకొక ప్రయత్నము జరుగుచున్నది. ఈ సంఘముల యందు సద్భావన కొరవడుట వలన వాని అస్థిత్వమే అస్థిరముగ నున్నది. అయినను సద్భావనతో నా కృషిని సాగించుచునే యుందును. వ్యక్తిగత జీవనము, సాంఘిక జీవనము నాణ్యతను చెందవలె నన్నచో భావలోకమందలి మార్పులే ప్రధానమని గుర్తింపుడు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


22 Mar 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 153-2


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 153-2 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఒకసారి ద్వారం గుండా అడుగు పెడితే అన్ని ద్వారాలూ సరయినవే అన్న సంగతి తెలుస్తుంది. అక్కడ అద్భుతాల్లో కెల్లా అద్భుతమయిన విషయమేమిటంటే అందరూ ఒకే తాళం చెవిని ఉపయోగిస్తున్నారు. 🍀


ఒకే కేంద్రంలో బుద్ధుడు, కృష్ణుడు, లావోట్జు, జరతూష్ట్ర అందరూ సమావేశమవుతారు. ద్వారాలు వేరు. ఒకసారి ద్వారం గుండా అడుగు పెడితే అన్ని ద్వారాలూ సరయినవే అన్న సంగతి తెలుస్తుంది. అక్కడ అద్భుతాల్లో కెల్లా అద్భుతమయిన విషయమేమిటంటే అందరూ ఒకే తాళం చెవిని ఉపయోగిస్తున్నారు. కృష్ణుడు శరణాగతి అన్నాడు. లావోట్జు, జరతూష్ట్ర 'మెలకువతో వుండండి' అన్నాడు.

బుద్ధుడు నలభయ్యేళ్ళ పాటు తన శిష్యులకు 'మంచి మనసు'తో వుండండి. అని చెప్పాడు. అది మెలకువకు మరోపేరు. గూర్జిఎఫ్ తనని తాను గుర్తించడం అన్నాడు. అది సూఫీ మాట. కబీర్ 'స్మృతి' అన్నాడు. గుర్తుంచు కోవడం అని అర్థం. నువ్వు గుర్తుంచుకోవడమంటే నీ స్పృహలో నువ్వుండడం నీ కేంద్రంలో నువ్వుండడం. యివి వేరు వేరు పదాలు. కానీ అర్థం ఒకటే అవన్నీ ఒకే తాళం చెవులు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


22 Mar 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 253 - 9. ఉన్నతమైన కారణమే నిజమైన తత్వవేత్త / DAILY WISDOM - 253 - 9. The Higher Reason is the True Philosopher


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 253 / DAILY WISDOM - 253 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 9. ఉన్నతమైన కారణమే నిజమైన తత్వవేత్త 🌻


వర్గ విభజన, వివక్ష చూపడం, మంచి చెడు నిర్ణయించడం, తార్కికంగా తీర్పు చెప్పే లక్షణం ఇలాంటి వాటిని తెలివి లేదా లోక అవగాహన అని పిలుస్తారు. పోల్చడం ద్వారా పరిస్థితుల యొక్క లాభాలు మరియు నష్టాల పరిశీలనపై తీర్మానాలు చేస్తారు. ఇది ఒక విలువకి తగ్గింపుగా లేదా ప్రేరేపకంగా గానీ ఉంటుంది. తక్కువ మరియు ఎక్కువ అనే ద్వంద్వ కోణాన్ని కలిగి ఉన్న లోకమే దీనికీ కారణం. మానవులందరిలో పనిచేసే నిమ్న కారణం ఏమిటంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సు అందించిన నివేదికలు మరియు సాక్ష్యాలను సేకరించి, వాటిని తనకు తెలిసిన సంపూర్ణత యొక్క నమూనాగా అమర్చి, తీర్పును ఇచ్చే స్వభావ ప్రక్రియగా చెప్పవచ్చు.

వాస్తవంగా ఈ తీర్పులు అన్నీ జ్ఞానేంద్రియాల యొక్క తీర్పులు మాత్రమే. దీని అర్థం ఏమిటంటే జ్ఞానేంద్రియాల నివేదికల నుండి గుణాత్మకంగా, ప్రస్తుత సామూహిక ఐక్యత, మరియు ప్రత్యేక వ్యక్తిత్వపు అవగాహనలో, సంపూర్ణతకి మానవునిచే ప్రకటించబడుతున్న భావములు మాత్రమే ఇవన్నీ. కానీ, ఉన్నత కారణం ఏమిటంటే, ఏదైతే మానవ వ్యక్తిత్వం మరియు దాని కార్యకలాపాలకు మించిన స్ధాయిలలో పనిచేస్తోందో, మనం అంతః స్పృహగా చెప్పుకునే చైతన్యమే ఆ కారణం. ఈ ఉన్నతమైన కారణమే జీవిత జ్ఞానం యొక్క నిజమైన తత్వవేత్త మరియు భాంఢాగారం.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 DAILY WISDOM - 253 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 9. The Higher Reason is the True Philosopher 🌻


The ratiocinating, discriminating, deciding, and logically judging faculty is at the higher level and is known as the buddhi, or the pure understanding. It is this faculty that draws conclusions on a consideration of pros and cons of situations by inference, either deductively or inductively. This is the realm of reason which has a dual aspect, namely, the lower and the higher. The lower reason, which is the one that mostly operates in all human individuals, is that operation which just collects the reports and evidences supplied by the mind through the sense organs, arranges them into a pattern of wholeness and passes a judgment on the nature of these sensory evidences.

This would mean that the judgment of the lower reason is not qualitatively different from the reports of the sense organs, and its judgment is virtually the judgment of the sense organs arranged into a system of apparent collectivity, totality uniqueness and unity. But, the higher reason is something like an ambassador operating between the consciousness of human individuality and the possibilities ranging beyond the individual and its operations. The higher reason is the true philosopher and repository of the wisdom of life.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


22 Mar 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 23 / Agni Maha Purana - 23


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 23 / Agni Maha Purana - 23 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 9

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. సుందరకాండ వర్ణనము - 2 🌻


హనుమంతుడు పలికెను: ఓ సీతాదేవీ! రామునికి నీ జాడ తెలియలేదు. ఇపుడు తెలిసకొని, సేనాసహితుడైన రావణుని సంహరించి నిన్ను తీసికొని వెళ్ళగలడు. ఓ దేవీ! విచారించకుము. అనవాలుతో కూడిన దేదైన నాకిమ్ము." అపుడు సీత హనుమంతునకు మణిని ఇచ్చెను. " నన్ను రాముడు శీఘ్రముగా తీసికొని వెళ్ళిపోవు నట్లు చేయుము" అని చెప్పెను. అతనికి కాకి కంటి కథను కూడ చెప్పి, "ఓ శోకవినాశకుడా! తిరిగి వెళ్ళుము" అని పలికెను.

అపుడు హనుమంతుడు రావణుని చూచుటకై ఒక ఉపాయమును చేసెను. దంతములు నఖములు మొదలగు వాటితో ఉద్యానపాలకులను చంపి, ఆ ఉద్యానవనమును విరచెను. కింకరులను అందరు రాక్షసులను, ఏడుగురు మంత్రి కుమారులను, రావణుని పుత్రుడైన అక్షకుమారుని కూడ చంపెను. ఇంద్రజిత్తు నాగపాశముచే అతనిని బంధించి రావణునికి చూపెను. " నీవెవ్వడవు?" అని రావణుడు ప్రశ్నింపగా మారుతి రావణునితో ఇట్లనెను.

హనుమంతుడు పలికెను. "నేను రాముని దుతను. సీతను రామున కిచ్చి వేయుము. ఇవ్వకున్నచో, లంకలో నున్న రాక్షసులతో గూడ, రామబాణములచే కొట్టబడి మరణింపగలవు. తప్పదు.

రావణుడు హనుమంతుని చంపుటకు ఉద్యమించగా విభీషణుడు నివారించెను. హనుమంతుని తోకకు నిప్పు అంటింపచేసెను. ఆ హనుమంతుడు మండుచున్న తోకతో లంకను, రాక్షసులను కాల్చి సీతను చూచి నమస్కరించి, సముద్రము దాటి వచ్చి, ' సీతను చూచితిని' అని అంగదాదులుతో చెప్పెను. అంగదాదులతో కలిసి, దధిముఖాదులను ఓడించి, మధువనములోని మధువును త్రాగెను. వారందరును రాముని వద్దకు వెళ్ళి "సీతను చూచితిమి" అని పలికిరి. రాముడు సంతసించి హనుమంతునితో ఇట్లనెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Agni Maha Purana -23 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 9

🌻 Sundar Kand - 2 🌻


11-12. The monkey said to her who was doubtful, “O Sītā! Rāma does not know. Knowing now he will take you away after killing Rāvaṇa along with his army. O Devī (queen)! Do not worry. You get me an identity.” Sītā gave the crest jewel to the monkey.”

13. (And) said, “You do in such a way that Rāma would. take me away quickly. O dispeller of grief! You retell him the story of the removal of the eye of the crow.”

14-15. Getting the jewel and (listening to) the story, Hanumat said, “The Lord will be taking you away. Otherwise, if you feel some hurry, O auspicious one!’ You get on to my back. I shall show you Sugrīva and Rāghava today.” Sītā said to Hanūmat, “Let Rāghava take me away.”

16-18. Then Hanūmat made a stratagem in order to see Daśagrīva (Rāvaṇa). He destroyed the grove, having killed the guards (of the grove) with his teeth and nails, and all the attendants, the sons of seven ministers, prince Akṣa. Śakrajit (Indrajit) (son of Rāvaṇa) bound him with the Nāgapāśa and. took him to the red-eyed Rāvaṇa.

19. Rāvaṇa asked him, “Who you are”. Māruti (Hanū-mat) said to Rāvaṇa, “I am the messenger ofRāma. You return Sītā to him. Otherwise you will certainly die along with the other demons in Laṅkā being hit by the arrows ofRāma.”

20-22. (Hearing these words) Rāvaṇa was intent on killing (Hanūmat) but was prevented by Vibhīṣaṇa. He (Rāvaṇa) made his (Hanūmat’s) tail set fire to. Having burnt Laṅkā. and the demons with the blazing flames Māruti, met Sītā again and saluted her. He crossed the ocean and informed. Aṅgada and others that he had seen Sītā. Having drunk honey in the honey-garden along with Aṅgada and others, overpowering Dadhimukha and other guards, they met Rāma. and told him that Sītā was seen.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


22 Mar 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 574 / Vishnu Sahasranama Contemplation - 574



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 574 / Vishnu Sahasranama Contemplation - 574🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 574. త్రిసామా, त्रिसामा, Trisāmā 🌻


ఓం త్రిసామ్నే నమః | ॐ त्रिसाम्ने नमः | OM Trisāmne namaḥ

దేవవ్రత సమాఖ్యాతైస్సామభిస్సామగైస్త్రిభిః ।
స్తుతోయతస్త్రిసామేతి విష్ణుస్సమభిధీయతే ॥

దేవ వ్రతములు అను సంజ్ఞగల మూడు సామముల ద్వారా సామగుల అనగా సామవేదీయుల చేత స్తుతించబడువాడుగావున ఆ విష్ణు దేవుడు త్రిసామా.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 574🌹

📚. Prasad Bharadwaj

🌻574. Trisāmā🌻


OM Trisāmne namaḥ

देवव्रत समाख्यातैस्सामभिस्सामगैस्त्रिभिः ।
स्तुतोयतस्त्रिसामेति विष्णुस्समभिधीयते ॥

Devavrata samākhyātaissāmabhissāmagaistribhiḥ,
Stutoyatastrisāmeti viṣṇussamabhidhīyate.


The singers of Sāma praised Him by the three Sāmas named Devavrata; hence Lord Viṣṇu is known by the divine name 'Trisāmā'.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


22 Mar 2022

Aloneness - Loneliness

 🌹 Aloneness - Loneliness 🌹

Aloneness is important in our lives. There’s is a difference between aloneness and loneliness. Aloneness, or solitude, is the food and flavour of the mind and soul. Whether it’s a scientist or a painter, they create masterpieces only in solitude. Their single-mindedness no less than meditation. It’s a taste of the soul. In moment of aloneness, peace and happiness replace desires. It’s the result of natural detachment.

Whereas loneliness is just an outburst of emotions, unfulfilled desires, and yearning for worldly pleasures. It leaves us miserable and distraught. It pushes us to seek things/beings for  support. Loneliness closes the doors of our hearts. Aloneness opens the doors. Solitude does mean being alone physically. It means silencing the mind. -Amma

🌹 🌹 🌹 🌹 🌹


22 Mar 2022


22 - MARCH - 2022 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 22, మార్చి 2022 మంగళవారం, భౌమ వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 175 / Bhagavad-Gita - 175 - 4-13 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 574 / Vishnu Sahasranama Contemplation - 574🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 23 / Agni Maha Purana 23 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 253 / DAILY WISDOM - 253 🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 154 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 92 🌹 
🌹 Aloneness - Loneliness 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 22, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : రంగ పంచమి, Ranga Panchami 🌻*

*🍀. అంజని పుత్ర స్తోత్రం - 2 🍀*

*ఉష్ట్ర వాహన హనుమంత*
*ఊహాతీతా హనుమంత*
*జయ బజరంగబలి *
*జయజయ జయ బజరంగబలి*

*రుషిముని వందిత హనుమంత*
*ఏకపాద శివ హనుమంత*
*జయ బజరంగబలి*
*జయజయ జయ బజరంగబలి*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : కోపం రావడమే తప్పు. కోపం వచ్చాక మాటలు తూలడం రెండవ తప్పు. అప్రమేయం, ప్రమేయం లేకుండా ఉండడమే సాధనలోని అప్రమత్తత. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*
🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ చవితి 06:25:32 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: విశాఖ 20:14:03 వరకు
తదుపరి అనూరాధ
యోగం: హర్షణ 13:09:16 వరకు
తదుపరి వజ్ర
కరణం: బాలవ 06:24:33 వరకు
వర్జ్యం: 02:49:48 - 04:20:36 
మరియు 24:00:30 - 25:31:06
దుర్ముహూర్తం: 08:44:32 - 09:33:06
రాహు కాలం: 15:25:14 - 16:56:17
గుళిక కాలం: 12:23:05 - 13:54:09
యమ గండం: 09:20:57 - 10:52:01
అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:47
అమృత కాలం: 11:54:36 - 13:25:24
సూర్యోదయం: 06:18:50
సూర్యాస్తమయం: 18:27:21
చంద్రోదయం: 22:28:34
చంద్రాస్తమయం: 09:08:20
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: తుల
శ్రీవత్స యోగం - ధన లాభం , సర్వ
సౌఖ్యం 20:14:00 వరకు తదుపరి
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత 175 / Bhagavad-Gita - 175 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 13 🌴*

*13. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశ: |*
*తస్య కర్తారామపి మాం విద్ధ్యకర్తారమవ్యయం ||*

🌷. తాత్పర్యం :
*ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మల ననుసరించి మానవసంఘమునందలి చాతుర్వర్ణ్యములు నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడనగుటచే అకర్తగానే నన్ను నీవు తెలిసికొనుము.*

🌻. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడే సమస్తమునాకు సృష్టికర్త. ప్రతిదియు అతని నుండియే సృష్టింపబడి, అతని యందే స్థితిననొంది, అంత్యమున లయము పిమ్మట అతని యందే విశ్రమించును. కనుకనే అతడు సత్త్వగుణమునందు నిలిచి బ్రాహ్మణులుగా పిలువబడు బుద్ధిమంతులైన జనులతో మొదలయ్యెడి చాతుర్వర్ణ్య వ్యవస్థకు సృష్టికర్త అయినాడు. భ్రాహ్మణుల పిదప ఈ వ్యవస్థ యందలి తరువాతివారు రజోగుణమున స్థితిని కలిగి క్షత్రియులుగా పిలువబడు పరిపాలనాదక్షత గలవారు. 

తరువాతి వారు రజస్తమోగుణముల మిశ్రమము కలిగి వైశ్యులుగా పిలువబడు వ్యాపారస్థులు. ఇక నాలుగవ వర్ణమువారు తమోగుణము నందుండి శూద్రులుగా పిలువబడు శ్రామికవర్గము. మానవసంఘము నందలి ఈ నాలుగువర్ణములను సృష్టించినప్పటికిని బద్ధజీవులలో ఒక భాగమైన మానవసంఘమున తాను ఒక బద్ధజీవిని కానందున శ్రీకృష్ణభగవానుడు ఈ వర్ణములలో దేనికిని చెందినవాడు కాడు. వాస్తవమునకు మానవజాతికి మరియు జంతుజాతికి భేదమేమియును లేదు. 

కాని మానవుని అట్టి జంతుస్థాయి నుండి ఉద్ధరించి, అతని యందు కృష్ణభక్తిరసభావనను వృద్ధిచేయుట కొరకే శ్రీకృష్ణభగవానుడు ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థను సృష్టించినాడు. కర్మ యెడ మనుజుని స్వభావము అతడు పొందియున్నట్టి గుణములను బట్టి నిర్ణయింపబడును. త్రిగుణముల వలన కలిగెడి అట్టి జీవన లక్షణములను (స్వభావమూలను) గూర్చి రాబోవు అష్టాదశాధ్యాయమున వివరింపబడినది. అయినను కృష్ణభక్తిరసభావితుడు బ్రాహ్మణుల కన్నను ఉన్నతుడైనట్టివాడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 163 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 13 🌴*

*13. cātur-varṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma-vibhāgaśaḥ*
*tasya kartāram api māṁ viddhy akartāram avyayam*

🌷 Translation : 
*According to the three modes of material nature and the work associated with them, the four divisions of human society are created by Me. And although I am the creator of this system, you should know that I am yet the nondoer, being unchangeable.*

🌹 Purport :
The Lord is the creator of everything. Everything is born of Him, everything is sustained by Him, and everything, after annihilation, rests in Him. He is therefore the creator of the four divisions of the social order, beginning with the intelligent class of men, technically called brāhmaṇas due to their being situated in the mode of goodness. 

Next is the administrative class, technically called the kṣatriyas due to their being situated in the mode of passion. The mercantile men, called the vaiśyas, are situated in the mixed modes of passion and ignorance, and the śūdras, or laborer class, are situated in the ignorant mode of material nature. In spite of His creating the four divisions of human society, Lord Kṛṣṇa does not belong to any of these divisions, because He is not one of the conditioned souls, a section of whom form human society. 

Human society is similar to any other animal society, but to elevate men from the animal status, the above-mentioned divisions are created by the Lord for the systematic development of Kṛṣṇa consciousness. The tendency of a particular man toward work is determined by the modes of material nature which he has acquired. Such symptoms of life, according to the different modes of material nature, are described in the Eighteenth Chapter of this book. A person in Kṛṣṇa consciousness, however, is above even the brāhmaṇas.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 574 / Vishnu Sahasranama Contemplation - 574🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 574. త్రిసామా, त्रिसामा, Trisāmā 🌻*

*ఓం త్రిసామ్నే నమః | ॐ त्रिसाम्ने नमः | OM Trisāmne namaḥ*

*దేవవ్రత సమాఖ్యాతైస్సామభిస్సామగైస్త్రిభిః ।*
*స్తుతోయతస్త్రిసామేతి విష్ణుస్సమభిధీయతే ॥*

*దేవ వ్రతములు అను సంజ్ఞగల మూడు సామముల ద్వారా సామగుల అనగా సామవేదీయుల చేత స్తుతించబడువాడుగావున ఆ విష్ణు దేవుడు త్రిసామా.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 574🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻574. Trisāmā🌻*

*OM Trisāmne namaḥ*

देवव्रत समाख्यातैस्सामभिस्सामगैस्त्रिभिः ।
स्तुतोयतस्त्रिसामेति विष्णुस्समभिधीयते ॥

*Devavrata samākhyātaissāmabhissāmagaistribhiḥ,*
*Stutoyatastrisāmeti viṣṇussamabhidhīyate.*

*The singers of Sāma praised Him by the three Sāmas named Devavrata; hence Lord Viṣṇu is known by the divine name 'Trisāmā'.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 23 / Agni Maha Purana - 23 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 9*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. సుందరకాండ వర్ణనము - 2 🌻*

హనుమంతుడు పలికెను: ఓ సీతాదేవీ! రామునికి నీ జాడ తెలియలేదు. ఇపుడు తెలిసకొని, సేనాసహితుడైన రావణుని సంహరించి నిన్ను తీసికొని వెళ్ళగలడు. ఓ దేవీ! విచారించకుము. అనవాలుతో కూడిన దేదైన నాకిమ్ము." అపుడు సీత హనుమంతునకు మణిని ఇచ్చెను. " నన్ను రాముడు శీఘ్రముగా తీసికొని వెళ్ళిపోవు నట్లు చేయుము" అని చెప్పెను. అతనికి కాకి కంటి కథను కూడ చెప్పి, "ఓ శోకవినాశకుడా! తిరిగి వెళ్ళుము" అని పలికెను.

అపుడు హనుమంతుడు రావణుని చూచుటకై ఒక ఉపాయమును చేసెను. దంతములు నఖములు మొదలగు వాటితో ఉద్యానపాలకులను చంపి, ఆ ఉద్యానవనమును విరచెను. కింకరులను అందరు రాక్షసులను, ఏడుగురు మంత్రి కుమారులను, రావణుని పుత్రుడైన అక్షకుమారుని కూడ చంపెను. ఇంద్రజిత్తు నాగపాశముచే అతనిని బంధించి రావణునికి చూపెను. " నీవెవ్వడవు?" అని రావణుడు ప్రశ్నింపగా మారుతి రావణునితో ఇట్లనెను.

హనుమంతుడు పలికెను. "నేను రాముని దుతను. సీతను రామున కిచ్చి వేయుము. ఇవ్వకున్నచో, లంకలో నున్న రాక్షసులతో గూడ, రామబాణములచే కొట్టబడి మరణింపగలవు. తప్పదు.

రావణుడు హనుమంతుని చంపుటకు ఉద్యమించగా విభీషణుడు నివారించెను. హనుమంతుని తోకకు నిప్పు అంటింపచేసెను. ఆ హనుమంతుడు మండుచున్న తోకతో లంకను, రాక్షసులను కాల్చి సీతను చూచి నమస్కరించి, సముద్రము దాటి వచ్చి, ' సీతను చూచితిని' అని అంగదాదులుతో చెప్పెను. అంగదాదులతో కలిసి, దధిముఖాదులను ఓడించి, మధువనములోని మధువును త్రాగెను. వారందరును రాముని వద్దకు వెళ్ళి "సీతను చూచితిమి" అని పలికిరి. రాముడు సంతసించి హనుమంతునితో ఇట్లనెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -23 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 9*
*🌻 Sundar Kand - 2 🌻*

11-12. The monkey said to her who was doubtful, “O Sītā! Rāma does not know. Knowing now he will take you away after killing Rāvaṇa along with his army. O Devī (queen)! Do not worry. You get me an identity.” Sītā gave the crest jewel to the monkey.”

13. (And) said, “You do in such a way that Rāma would. take me away quickly. O dispeller of grief! You retell him the story of the removal of the eye of the crow.”

14-15. Getting the jewel and (listening to) the story, Hanumat said, “The Lord will be taking you away. Otherwise, if you feel some hurry, O auspicious one!’ You get on to my back. I shall show you Sugrīva and Rāghava today.” Sītā said to Hanūmat, “Let Rāghava take me away.”

16-18. Then Hanūmat made a stratagem in order to see Daśagrīva (Rāvaṇa). He destroyed the grove, having killed the guards (of the grove) with his teeth and nails, and all the attendants, the sons of seven ministers, prince Akṣa. Śakrajit (Indrajit) (son of Rāvaṇa) bound him with the Nāgapāśa and. took him to the red-eyed Rāvaṇa.

19. Rāvaṇa asked him, “Who you are”. Māruti (Hanū-mat) said to Rāvaṇa, “I am the messenger ofRāma. You return Sītā to him. Otherwise you will certainly die along with the other demons in Laṅkā being hit by the arrows ofRāma.”

20-22. (Hearing these words) Rāvaṇa was intent on killing (Hanūmat) but was prevented by Vibhīṣaṇa. He (Rāvaṇa) made his (Hanūmat’s) tail set fire to. Having burnt Laṅkā. and the demons with the blazing flames Māruti, met Sītā again and saluted her. He crossed the ocean and informed. Aṅgada and others that he had seen Sītā. Having drunk honey in the honey-garden along with Aṅgada and others, overpowering Dadhimukha and other guards, they met Rāma. and told him that Sītā was seen. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 253 / DAILY WISDOM - 253 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 9. ఉన్నతమైన కారణమే నిజమైన తత్వవేత్త 🌻*

*వర్గ విభజన, వివక్ష చూపడం, మంచి చెడు నిర్ణయించడం, తార్కికంగా తీర్పు చెప్పే లక్షణం ఇలాంటి వాటిని తెలివి లేదా లోక అవగాహన అని పిలుస్తారు. పోల్చడం ద్వారా పరిస్థితుల యొక్క లాభాలు మరియు నష్టాల పరిశీలనపై తీర్మానాలు చేస్తారు. ఇది ఒక విలువకి తగ్గింపుగా లేదా ప్రేరేపకంగా గానీ ఉంటుంది. తక్కువ మరియు ఎక్కువ అనే ద్వంద్వ కోణాన్ని కలిగి ఉన్న లోకమే దీనికీ కారణం. మానవులందరిలో పనిచేసే నిమ్న కారణం ఏమిటంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సు అందించిన నివేదికలు మరియు సాక్ష్యాలను సేకరించి, వాటిని తనకు తెలిసిన సంపూర్ణత యొక్క నమూనాగా అమర్చి, తీర్పును ఇచ్చే స్వభావ ప్రక్రియగా చెప్పవచ్చు.*

*వాస్తవంగా ఈ తీర్పులు అన్నీ జ్ఞానేంద్రియాల యొక్క తీర్పులు మాత్రమే. దీని అర్థం ఏమిటంటే జ్ఞానేంద్రియాల నివేదికల నుండి గుణాత్మకంగా, ప్రస్తుత సామూహిక ఐక్యత, మరియు ప్రత్యేక వ్యక్తిత్వపు అవగాహనలో, సంపూర్ణతకి మానవునిచే ప్రకటించబడుతున్న భావములు మాత్రమే ఇవన్నీ. కానీ, ఉన్నత కారణం ఏమిటంటే, ఏదైతే మానవ వ్యక్తిత్వం మరియు దాని కార్యకలాపాలకు మించిన స్ధాయిలలో పనిచేస్తోందో, మనం అంతః స్పృహగా చెప్పుకునే చైతన్యమే ఆ కారణం. ఈ ఉన్నతమైన కారణమే జీవిత జ్ఞానం యొక్క నిజమైన తత్వవేత్త మరియు భాంఢాగారం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 253 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 9. The Higher Reason is the True Philosopher 🌻*

*The ratiocinating, discriminating, deciding, and logically judging faculty is at the higher level and is known as the buddhi, or the pure understanding. It is this faculty that draws conclusions on a consideration of pros and cons of situations by inference, either deductively or inductively. This is the realm of reason which has a dual aspect, namely, the lower and the higher. The lower reason, which is the one that mostly operates in all human individuals, is that operation which just collects the reports and evidences supplied by the mind through the sense organs, arranges them into a pattern of wholeness and passes a judgment on the nature of these sensory evidences.*

*This would mean that the judgment of the lower reason is not qualitatively different from the reports of the sense organs, and its judgment is virtually the judgment of the sense organs arranged into a system of apparent collectivity, totality uniqueness and unity. But, the higher reason is something like an ambassador operating between the consciousness of human individuality and the possibilities ranging beyond the individual and its operations. The higher reason is the true philosopher and repository of the wisdom of life.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 153-2 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఒకసారి ద్వారం గుండా అడుగు పెడితే అన్ని ద్వారాలూ సరయినవే అన్న సంగతి తెలుస్తుంది. అక్కడ అద్భుతాల్లో కెల్లా అద్భుతమయిన విషయమేమిటంటే అందరూ ఒకే తాళం చెవిని ఉపయోగిస్తున్నారు. 🍀*

*ఒకే కేంద్రంలో బుద్ధుడు, కృష్ణుడు, లావోట్జు, జరతూష్ట్ర అందరూ సమావేశమవుతారు. ద్వారాలు వేరు. ఒకసారి ద్వారం గుండా అడుగు పెడితే అన్ని ద్వారాలూ సరయినవే అన్న సంగతి తెలుస్తుంది. అక్కడ అద్భుతాల్లో కెల్లా అద్భుతమయిన విషయమేమిటంటే అందరూ ఒకే తాళం చెవిని ఉపయోగిస్తున్నారు. కృష్ణుడు శరణాగతి అన్నాడు. లావోట్జు, జరతూష్ట్ర 'మెలకువతో వుండండి' అన్నాడు.*

*బుద్ధుడు నలభయ్యేళ్ళ పాటు తన శిష్యులకు 'మంచి మనసు'తో వుండండి. అని చెప్పాడు. అది మెలకువకు మరోపేరు. గూర్జిఎఫ్ తనని తాను గుర్తించడం అన్నాడు. అది సూఫీ మాట. కబీర్ 'స్మృతి' అన్నాడు. గుర్తుంచు కోవడం అని అర్థం. నువ్వు గుర్తుంచుకోవడమంటే నీ స్పృహలో నువ్వుండడం నీ కేంద్రంలో నువ్వుండడం. యివి వేరు వేరు పదాలు. కానీ అర్థం ఒకటే అవన్నీ ఒకే తాళం చెవులు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 92 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 76. భావములు - పంచభూతములు - 2 🌻*

*వన్నెలేని భావములు పతనమునకు ద్వారములు. పంచ భూతములు భావన మాధారముగ వర్తించుచున్నవి. మానవ భావనము అనారోగ్యకరముగ నుండుటచేతనే అతివృష్టి, అనావృష్టి, క్షామము, తీవ్రరోగములు పుట్టుచున్నవి. సంఘటితమగు నిర్మాణాత్మక భావములే సంఘ క్షేమమునకు ప్రధానము. ఒకరిద్దరు సత్పురుషులున్నచో నిర్వీర్యమైన సంఘభావన మార్పు జేయలేరు.* 

*బృందములు బృందములుగ సద్భావనా సంఘములున్నచో సంఘమును పునరుజ్జీవింప చేయవచ్చును. ఇందులకే సద్భావనా బృందముల నేర్పరచుటకొక ప్రయత్నము జరుగుచున్నది. ఈ సంఘముల యందు సద్భావన కొరవడుట వలన వాని అస్థిత్వమే అస్థిరముగ నున్నది. అయినను సద్భావనతో నా కృషిని సాగించుచునే యుందును. వ్యక్తిగత జీవనము, సాంఘిక జీవనము నాణ్యతను చెందవలె నన్నచో భావలోకమందలి మార్పులే ప్రధానమని గుర్తింపుడు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Aloneness - Loneliness 🌹*

*Aloneness is important in our lives. There’s is a difference between aloneness and loneliness. Aloneness, or solitude, is the food and flavour of the mind and soul. Whether it’s a scientist or a painter, they create masterpieces only in solitude. Their single-mindedness no less than meditation. It’s a taste of the soul. In moment of aloneness, peace and happiness replace desires. It’s the result of natural detachment.*

*Whereas loneliness is just an outburst of emotions, unfulfilled desires, and yearning for worldly pleasures. It leaves us miserable and distraught. It pushes us to seek things/beings for support. Loneliness closes the doors of our hearts. Aloneness opens the doors. Solitude does mean being alone physically. It means silencing the mind. -Amma*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹