మైత్రేయ మహర్షి బోధనలు - 92


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 92 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 76. భావములు - పంచభూతములు - 2 🌻


వన్నెలేని భావములు పతనమునకు ద్వారములు. పంచ భూతములు భావన మాధారముగ వర్తించుచున్నవి. మానవ భావనము అనారోగ్యకరముగ నుండుటచేతనే అతివృష్టి, అనావృష్టి, క్షామము, తీవ్రరోగములు పుట్టుచున్నవి. సంఘటితమగు నిర్మాణాత్మక భావములే సంఘ క్షేమమునకు ప్రధానము. ఒకరిద్దరు సత్పురుషులున్నచో నిర్వీర్యమైన సంఘభావన మార్పు జేయలేరు.

బృందములు బృందములుగ సద్భావనా సంఘములున్నచో సంఘమును పునరుజ్జీవింప చేయవచ్చును. ఇందులకే సద్భావనా బృందముల నేర్పరచుటకొక ప్రయత్నము జరుగుచున్నది. ఈ సంఘముల యందు సద్భావన కొరవడుట వలన వాని అస్థిత్వమే అస్థిరముగ నున్నది. అయినను సద్భావనతో నా కృషిని సాగించుచునే యుందును. వ్యక్తిగత జీవనము, సాంఘిక జీవనము నాణ్యతను చెందవలె నన్నచో భావలోకమందలి మార్పులే ప్రధానమని గుర్తింపుడు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


22 Mar 2022

No comments:

Post a Comment