నిర్మల ధ్యానాలు - ఓషో - 153-2
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 153-2 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఒకసారి ద్వారం గుండా అడుగు పెడితే అన్ని ద్వారాలూ సరయినవే అన్న సంగతి తెలుస్తుంది. అక్కడ అద్భుతాల్లో కెల్లా అద్భుతమయిన విషయమేమిటంటే అందరూ ఒకే తాళం చెవిని ఉపయోగిస్తున్నారు. 🍀
ఒకే కేంద్రంలో బుద్ధుడు, కృష్ణుడు, లావోట్జు, జరతూష్ట్ర అందరూ సమావేశమవుతారు. ద్వారాలు వేరు. ఒకసారి ద్వారం గుండా అడుగు పెడితే అన్ని ద్వారాలూ సరయినవే అన్న సంగతి తెలుస్తుంది. అక్కడ అద్భుతాల్లో కెల్లా అద్భుతమయిన విషయమేమిటంటే అందరూ ఒకే తాళం చెవిని ఉపయోగిస్తున్నారు. కృష్ణుడు శరణాగతి అన్నాడు. లావోట్జు, జరతూష్ట్ర 'మెలకువతో వుండండి' అన్నాడు.
బుద్ధుడు నలభయ్యేళ్ళ పాటు తన శిష్యులకు 'మంచి మనసు'తో వుండండి. అని చెప్పాడు. అది మెలకువకు మరోపేరు. గూర్జిఎఫ్ తనని తాను గుర్తించడం అన్నాడు. అది సూఫీ మాట. కబీర్ 'స్మృతి' అన్నాడు. గుర్తుంచు కోవడం అని అర్థం. నువ్వు గుర్తుంచుకోవడమంటే నీ స్పృహలో నువ్వుండడం నీ కేంద్రంలో నువ్వుండడం. యివి వేరు వేరు పదాలు. కానీ అర్థం ఒకటే అవన్నీ ఒకే తాళం చెవులు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
22 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment