2-October-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 506 / Bhagavad-Gita - 506 🌹 
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 30 , 31 / Vishnu Sahasranama Contemplation - 30, 31 🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 294 🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 15 / Sri Lalita Chaitanya Vijnanam - 15 🌹
5) 🌹. నారద భక్తి సూత్రాలు - 112 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 83 🌹
7) 🌹. శివగీత - 80 / The Shiva-Gita - 80 🌹
8) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 68 / Gajanan Maharaj Life History - 68 🌹 
9) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 62 🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 422 / Bhagavad-Gita - 422 🌹

13) 🌹. మంత్రపుష్పం - భావగానం - 11 🌹 
14) 🌹. శివ మహా పురాణము - 236 🌹
15) 🌹 Light On The Path - 2 🌹
16) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 124 🌹
17) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 66 🌹
18) 🌹 Seeds Of Consciousness - 188 🌹 
19) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 42 📚
20) 🌹. అద్భుత సృష్టి - 43 🌹
21) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 26 / Sri Vishnu Sahasranama - 26 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 506 / Bhagavad-Gita - 506 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ 

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 16 🌴*

16. కర్మణ: సుకృతస్యాహు: సాత్త్వికం నిర్మలం ఫలమ్ |
రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమస: ఫలమ్ ||

🌷. తాత్పర్యం : 
కర్మణ: సుకృతస్యాహు: సాత్త్వికం నిర్మలం ఫలమ్ |
రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమస: ఫలమ్ ||

🌷. భాష్యము :
సత్త్వగుణము నందుండి ఒనరింపబడు పుణ్యకర్మల ఫలితము నిర్మలత్వము లేదా పవిత్రత్వము. కనుకనే మోహరహితులైన ఋషులు సదా ఆనందమునందే స్థితులై యుందురు. కాని రజోగుణమునందు ఒనరింపబడు కార్యములు కేవలము దుఃఖపూర్ణములే.

 భౌతికానందము కొరకు చేయబడు ఏ కర్మకైనను అపజయము తప్పదు. ఉదాహరణమునకు ఆకాశమునంటెడి ఎత్తైన భవంతిని మనుజుడు నిర్మింపదలచినచో ఆ భవన నిర్మాణమునకు అత్యంత ఎక్కువ మానవపరిశ్రమ అవసరమగును. తొలుత అతడు అధికమొత్తములో ధనమును కూడబెట్టవలెను. అంతియేగాక భవన నిర్మాణమునకు మనుష్యుల చమటోర్చి పనిచేయవలసివచ్చును. 

ఈ విధముగా అడుగడుగునా ఆ కార్యమున దుఖమే అధికముగా నుండును. కనుకనే రజోగుణమునందు చేయబడిన ఏ కార్యముమందైనను గొప్ప దుఃఖము తప్పక ఉండునని భగవద్గీత యందు ఇచ్చట పేర్కొనవడినది. “నాకీ గృహమున్నది, ఇంత ధనమున్నది” అనెడి నామమాత్ర మనస్సంతోషము లేదా సౌఖ్యము కలిగనను వాస్తవమునకు అది నిజమైన సౌఖ్యము కాదు.

ఇక తమోగుణమునకు సంబంధించినంత వరకు ఆ గుణమునందు కర్తయైనవాడు జ్ఞానరహితుడై యుండును. తత్కారణముగా అతని కర్మలన్నియును వర్తమానమున దుఃఖమును కలిగించుటయే గాక, పిదప అతడు జంతుజాలమున జన్మించును. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 506 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 16 🌴*

16. karmaṇaḥ sukṛtasyāhuḥ
sāttvikaṁ nirmalaṁ phalam
rajasas tu phalaṁ duḥkham
ajñānaṁ tamasaḥ phalam

🌷 Translation : 
The result of pious action is pure and is said to be in the mode of goodness. But action done in the mode of passion results in misery, and action performed in the mode of ignorance results in foolishness.

🌹 Purport :
The result of pious activities in the mode of goodness is pure. Therefore the sages, who are free from all illusion, are situated in happiness. But activities in the mode of passion are simply miserable.

 Any activity for material happiness is bound to be defeated. If, for example, one wants to have a skyscraper, so much human misery has to be undergone before a big skyscraper can be built. The financier has to take much trouble to earn a mass of wealth, and those who are slaving to construct the building have to render physical toil. 

The miseries are there. Thus Bhagavad-gītā says that in any activity performed under the spell of the mode of passion, there is definitely great misery. There may be a little so-called mental happiness – “I have this house or this money” – but this is not actual happiness.

As far as the mode of ignorance is concerned, the performer is without knowledge, and therefore all his activities result in present misery, and afterwards he will go on toward animal life.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 295 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 39
*🌻 Meeting with Nagendra Shastri - 2 🌻*

I am the one Mahaswami, whose lotus feet are worshipped by Kaala Nagus always with their divine gems. These are my divine padukas. You keep worshipping them. People tormented by diseases will come to you.  

If you worship these ‘padukas’ and give them the ‘thirtham’ they will be relieved of their suffering. All types of ‘Naaga Doshas’ will be destroyed.

While Nagadosham is being pacified, the dakshina given should contain the money from wife, husband or parents.  

This rule should be followed meticulously. While a male person is giving dakshina for removal of Naaga dosham, he should take some money from his brother-in-law or father in law and add it to the dakshina.  

If a woman gives dakshina for removal of her Naaga dosham, she should get some money from the people of her husband’s birth house, and add it to dakshina. If wife and husband both donate for the removal of Naaga dosham, the money from the birth houses of both should be added to the dakshina. Husband should give from his own earnings and wife from her ‘stree dhanam’.  

If an unmarried woman donates for removal of her Naaga dosham, she should give money taken from her father and also from her maternal uncles. Only in this way Naaga dosham will be completely removed. Once, tormented by the demons Shumbha and Nishumbha, the Gods reached Himalayas and praised Hymavathi.  

Then from Gouri Devi’s body Goddess Kousiki emerged. When Kousiki left Her body, Parvathi became black and got the name ‘Kaali’. That Kaali wished that She should again change into Gouri.  

Immediately She disappeared. Parameswara asked Narada Maharshi about Her where abouts. Narada said that She was there on the north side of Sumeruvu. On the orders of Siva, Narada Maharshi reached Her and prayed. ‘Amma! You marry Siva and be happy.’ Hearing this marriage proposal, She became angry.  

From her body a different ‘Jaashodasee’ form was expressed. From that, Tripura Bhairavi the form of a ‘Chayavigraham’, got expressed. When Devi is in the form of a destroyer, She cannot perform ‘dampatya dharma’ because, She will be with anger and agitation.  

The Kaala Nagus ruling the ‘Kaalam’ (time) are responsible for causing these anger and agitation. Because I am the form of Maha Vishnu, I have created ‘Naaga Manis’ through the Trishul. I have given boon that those ‘manis’ will be worn by Kaala Nagus. In addition, I have blessed that Kaala Nagus will be there as ornaments on the bodies of Siva and Parvathi.  

Because Hymavathi is my sister, I have made a rule that, unless the money from the birth house is not added, the removal of Naaga dosham will not be complete. My Dear! Nagendra Shastri! Follow my words without fail. Utilize your Naaga Shastra Vidya for the welfare of the world. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 30 and 31 / Vishnu Sahasranama Contemplation - 30 and 31 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 30. నిధిరవ్యయః, निधिरव्ययः, Nidhiravyayaḥ 🌻*

*ఓం నిధయేఽవ్యయాయ నమః | ॐ निधयेऽव्ययाय नमः | OM Nidhaye’vyayāya namaḥ*

(ప్రళయకాలేన అస్మిన్ సర్వం) నిధీయతే ప్రళయకాలమున సర్వమునూ ఇతనియందే ఉంచబడును. ఈ 'నిధి' శబ్ధమునకు 'అవ్యయః' (వినాశనము లేనిది; 13వ దివ్య నామము) అనునది విశేషము. తరగని నిధి.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయం ॥ 18 ॥

పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగిన వాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయియున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 30 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 30.Nidhiravyayaḥ 🌻*

*Nidhaye’vyayāya namaḥ*

The changeless and indestructible Being in whom the whole universe becomes merged and remains in seminal condition at the time of Pralaya or cosmic dissolution.

Bhagavad Gīta - Chapter 9
Gatirbhartā prabhussākṣī nivāsaśśaraṇaṃ suhr̥t,
Prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayaṃ. (18)

I am the goal, the sustainer, the master, the witness, the abode, the refuge, and the most dear friend. I am the creation and the annihilation, the basis of everything, the resting place and the eternal seed.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः ।सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥

సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥

Sarvaśśarvaśśivasthāṇurbhūtādirnidhiravyayaḥ ।Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 31 / Vishnu Sahasranama Contemplation - 31🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 31. సంభవః, संभवः, Saṃbhavaḥ 🌻*

*ఓం సంభవాయ నమః | ॐ संभवाय नमः | OM Saṃbhavāya namaḥ*

స్వేచ్ఛాయా సిద్ధం సమీచీనం భవనం సంభవః అస్య ఇతనికి మన అందరికివలె కర్మవశమున కాక ఆయా అవతారములలో తన స్వేచ్ఛ చేతనే లెస్సయగు ఉనికి కలదు. ఈ అర్థమున 'సం - భవః' అను రెండు శబ్దరూపముల కలయికచే సంభవః ఐనది.

:: భగవద్గీత - జ్ఞాన యోగము ::
అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ॥ 6 ॥

నేను పుట్టుకలేనివాడను, నాశరహితస్వరూపముకలవాడను, సమస్తప్రాణులకు ఈశ్వరుడను అయియున్నప్పటికి స్వకీయమగు ప్రకృతిని వశపఱచుకొని నా మాయాశక్తిచేత అవతరించుచున్నాను.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ 8 ॥

సాధు సజ్జనులను సంరక్షించుటకొఱకును, దుర్మార్గులను వినాశమొనర్చుట కోఱకును, ధర్మమును లెస్సగ స్థాపించుట కొఱకును నేను ప్రతియుగము నందున అవతరించుచుందును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 31 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 31.Saṃbhavaḥ 🌻*

*OM Saṃbhavāya namaḥ*

One born out of His own will as incarnation. As like us, He does not need to take birth to clear the accumulated Karma; rather He incarnates out of His own will when He needs to.

Bhagavad Gitā - Chapter 4
Ajo’pi sannavyayātmā bhūtānāmīśvaro’pi san,
Prakr̥tiṃ svāmadhiṣṭhāya saṃbhavāmyātmamāyayā. (6)

Though I am birthless, undecaying by nature, and the Lord of beings, (still) by subjugating My Prakr̥ti, I take birth by means of My own Māyā.

Paritrāṇāya sādhūnāṃ vināśāya ca duṣkr̥tām,
Dharmasaṃsthāpanārthāya saṃbhavāmi yuge yuge. (8)

O scion of Bharatha dynasty, whenever there is a decline of virtue and increase of vice, then do I manifest Myself.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः ।सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥

సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥

Sarvaśśarvaśśivasthāṇurbhūtādirnidhiravyayaḥ ।Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 80 / The Siva-Gita - 80 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

దశమాధ్యాయము
*🌻. జీవ స్వరూప నిరూపణము - 6 🌻*

వాలాగ్ర శత భాగస్య - శతధా కల్పిత సయచ |
భాగో జీవ స్స విజ్ఞేయః సచానన్త్యాయ కల్పతే 26

కదంబకు సుమోద్బుద్ద - కేసరా ఇవ సర్వతః |
ప్రసృతా హృదయాన్నానడ్యో - యాభి ర్వ్యాప్తం శరీరకమ్ 27

హితం బలం ప్రయచ్చన్తి - యస్మాత్తేన హితాః స్మృతాః |
ద్వాసప్తతి సహస్రైస్తా - స్సంఖ్యాతా యోగ విత్తమైః 28

హృద యాత్తస్తు నిష్క్రాంతా - యథా ర్కా ద్రశ్మయస్తథా |
ఏకోత్తర శతంతాసు - ముఖ్యా విష్వగ్వి నిర్గతా: 29

ప్రతీంద్రియ దశ దశ - నిర్గతా విషయోన్ముఖాః |
నాడ్యః కర్మాది హేతూత్ధాః - స్వప్నాది ఫలభుక్తయే 30

వెంట్రుక యొక్క కొసభాగమున నూరు భాగములుగా చేసి అందును నొక భాగమును మరో నూరు భాగములు చేసిన అందొక దాని యంశ పరిమాణము కలిగి బీవుడుండును.  

అట్టి జీవుడే యనంతుడ పరి ఛిన్నుడని అందురు. కడిమి పువ్వులో ఆవరించుకొనియున్న కింజల్కములవలె వక్షము నుండి శరీర మంతటను నాడులు వ్యాపించుకొని యుండును, హితమును శక్తిని ఒసగునని కనక హృదయమునుండి అంతట వ్యాపించి వెలువడినవి. 

కర్మము, అదృష్టము, వీటిననుసరించి పుట్టిన నాడులు స్వప్నాది ఫలానుభవము కొరకు ప్రతీంద్రియము నుండి పది పదిగా విషయాభి ముఖములై బయల్దేరు చుండును.      

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 80 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 10 
*🌻 Jeeva Swaroopa Niroopanam -6 🌻*

If the diameter of the tip of a single hair is measured, and that size (diameter) is divided by 100, whatever becomes the resultant size, that is the size of the Jiva seated inside the heart. 

That super micro Jiva himself is the infinite Purusha. From the chest all over the body the nerves remain spread. The nerves from heart are 72,000 in number. 

Out of them only 101 are primary ones which spread outwards all over the body originating from the heart as like as the rays of the sun. 

Following the Karma, Fortune, etc., nadis which originate, they help in the enjoyment of fruits from acts in dreams etc. and hence from every Indriya (organ) they are connected in a group of ten in number and spread.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 112 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 81 - part 2

*🌻 81. త్రి సత్యస్య భక్తిరేవ గరీయసీ, భక్తిరేవ గరీయసీ || - 2 🌻*

ఈ ఐదు విభవాలు భక్తులకు ఆరాధ్యాలు. ఇవి గాక, అంతర్యా మిత్వం కూడా ఆయన యొక్క విభవమే. అంతర్యామి అంటే అగ్నియందు ఉష్ణత్వంగా, జలమందు ద్రవత్వంగా, జడములందు జడశక్తిగా, ప్రాణులందు ప్రాణ శక్తిగా, జీవులందు జీవచైతన్యంగా, మానవులందు “నేను” గా వ్యక్తమయ్యే మూలశక్తి. ఆ మూలశక్తే పరమాత్మ చైతన్యం, ప్రజ్ఞానం. అదే సత్యం. అది నిరాకారం. దీనినే భగవంతునిగా ఆరాధిస్తాం. విగ్రహాల్లో కూడా అంతర్యామిత్వం ఉంటుంది.

అంతర్యామి అంటే లక్ష్మీ సమేతుడై, దివ్య మంగళ స్వరూపుడై భక్తుల హృదయంలో, సర్వత్రా కొలువై ఉన్నవాడు. తెలుసుకోలేని వారిలో, తెలుసుకోగలిగిన వారిలో కూడా ఉన్నాడు. భక్తి సాధనచేత తెలుసుకొని భగవదైక్యం పొందడానికి భక్తులకే సులభం.

అవాజ్మానస గోచరమైన భగవానుడు జ్ఞాన, ధ్యాన యోగాలలో కంటే భక్తి యోగంలో భక్త సులభుడు. అయితే జ్ఞానుల అవగాహనకోసం కూడా భగవంతుడు వ్యూహాలుగా వ్యాపకమై ఉన్నాడు. అవి అయిదు వ్యూహాలు. మొదటిది పరతత్త్వం. 

మిగిలిన నాలుగు (1) వాసుదేవ వ్యూహం (2) ప్రద్యుమ్న వ్యూహం (3) సంకర్షణ వ్యూహం (4) అనిరుద్ధ వ్యూహం.

1. పరతత్త్వం :
 కోటి భాస్కర తేజుడై శ్రీ నీళా భూసమేతుడై, హేమ పీతాంబరుడై, శంఖు చక్ర గదా పద్మ ధరుడై, దివ్యాభరణ భూషితుడై, గరుడ, అనంత, విష్వక్సేనుల వంటి నిత్య సూరులచే సేవింపబడుతూ ఉండే తత్త్వం. ముక్తులకు తప్ప, సాధారణ భక్తులకు, ఇతరులకు దొరకనిదే పరతత్త్వం. ఆయన పరమపదమున అపరిమిత ఆనందభరితుడై ఉన్నాడు.

2. వాసుదేవ వ్యూహం :
 శ్రీకృష్ణుడు అర్జునునితో కూడి నరనారాయణుడై తదీయ ప్రతిజ్ఞా నిర్వహణార్థం వైదిక పుత్ర సవకంబున తీసుకొని వచ్చిన స్థానాన్ని వాసుదేవ వ్యూహమంటారు. ఈ వ్యూహం కేవలం నిత్య సూరులకే తెలియబడుతుంది. 

3. ప్రద్యుమ్న వ్యూహం :
 బ్రహ్మలోకంలో వసించి, బ్రహ్మచేత పూజింప బడుతూ, తద్దేశవాసులను రక్షించే వ్యూహం. 

4. సంకర్షణ వ్యూహం : 
పాతాళంలో వసించి, బలి చక్రవర్తి, తద్దేశ వాసులను రక్షించే వ్యూహం.

5. అనిరుద్ధ వ్యూహం :
 క్షీర సాగరంలో ఒక వైకుంఠాన్ని నిర్మించి, లక్ష్మీ సమేతుడై వసించే వ్యూహం. ఇది పూర్ణావతారాలకు మూల కందం. బ్రహ్మాది మునిపుంగవులు ఆయనను అవతరించమని ప్రార్థించేది ఇక్కడే. బ్రహ్మ, రుద్రులు, దేవతలు, సనకాది మునీంద్రులు, అక్కడికి వెళ్ళారు. ఇది వారి వారి కొరతలు తీర్చుకొనడానికి అనుకూలమైన వ్యూహం.

సాధారణ భక్తులకు ఈ వ్యూహాలు అందుబాటులో ఉండవు. సాధన ఫలితంగా వారు ఆయా వ్యూహాలలో చేరి, ఆనందిస్తారు. భక్తి సలపడానికి విభవ స్వరూపాలే అందుబాటులో ఉంటాయి. అవతారాల కాలం కాకపోయినా వారి విగ్రహాలను అర్చావతారాలుగా భావించి భక్తి సలపడం అందుబాటు లోనిది.

మానసిక భక్తిగా మారే వరకు విగ్రహారాధన చేసే క్రియలను అపరాభక్తి అంటారు. మానసిక భక్తిగా మారి, అది ముఖ్యభక్తి అయినప్పుడు మిగిలింది పరాభక్తి అంటారు. ఈ సూత్రంలో భగవంతుని విభవ రూపాలలో భావించి ప్రేమించడం, దానిని త్రికరణ శుద్ధిగా చేయడం, ఉత్తమ భజనగా చెప్ప బడింది. కాని ఆయన అంతర్యామిత్వాన్ని అర్థం చేసుకొని భజిస్తే పరాభక్తి సిద్ధిస్తుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 83 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
76

Sloka: 
Asanam sayanam vastram vahanam bhusanadhikam | Sadhakena pradatavyam gurossantosa karanam || 

Seats, cots, clothes, vehicles, ornaments are some of the things which should be offered to Guru for they are the means to please him. We discussed what a real offering should be like. But, for beings that are tied down in karmic bondages, such an offering is not at all easy. 

So, what should one do then? We discussed how the creator, Brahma, made this creation. It was a big question even back then. There is also another question. Are you pure now? Or, are you impure? You are a being that is struggling in the web of karma. 

That is why, you cannot proclaim that you are pure consciousness. You cannot say “I am pure consciousness”. That is because you are always faced with karma, whether your eyes are open or close. You have so many anxieties. You have adhi (psychic) vyadhi (illness) anxieties. So many varieties of anxieties. 

You have Adi-bhautika (miseries caused by other living beings), Adi-atmika (miseries caused by one’s own body and mind) anxieties and so on…all form of adhi vyadhi. They appear whether your eyes are open or closed. So, would it be right then, to say that your mind is filled with crystal clear pure consciousness? Wouldn’t that be a lie?

Okay, let’s assume you offered yourself along with your karma to the Guru. You offered yourself along with your karma that appears whether your eyes are open or close, your karma and difficulties under whose weight the mind crumbles. 

Then, should he (the Guru), along with you, accept experience and pay for your sins and bad karma? Does it mean that he accepted everything as soon as you announced your offering. 

Just because you offered yourself to him completely, you expect him to go to great lengths and suffer for your karma to alleviate it? A lot of people say “I am offering myself completely to you Swami, along with all my karma”. So, who will experience the karma? Is it the Sadguru?  

Just because he merged you into him, does the pure milk have to be curdled due to the impurity. He (the Guru) set aside some pure milk. If he brings you into the mix, the milk will be curdled due to the impurity. Did you pour the milk into a clean container? If not, then the pure milk set aside by the Guru will curdle when mixed. 

The milk you brought is impure. It’s placed in an unwashed container. You want it mixed with the pure milk. As soon as you do so, it’ll curdle. Whose fault is it? You expect the Sadguru to blindly trust the disciple and mix the milk? 

Even though a person offered himself completely along with his karmic bondages to the Sadguru, even though the Sadguru is pure consciousness, once the impurity is brought in, the purity will be tainted. Would that be good? That is not good.  

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 69 / Sri Gajanan Maharaj Life History - 69 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 13వ అధ్యాయము - 6 🌻*

ఒకసారి షేగాం చేరినతరువాత మరణించినా నేను ఏమీ అనుకోను. దయచేసి నేను షేగాం చేరేంతవరకూ నన్ను ఈప్లేగు అనే శతృవునుండి రక్షించండి. మంచి ఆరోగ్యం ఉంటేనే పుణ్యక్షేత్ర దర్శనం వీలవుతుంది అని అన్నాడు. పుండలీకుని ఈపరిస్థితి చూసి, అతని తండ్రి చింతితుడై కళ్ళనుండి నీళ్ళు వచ్చాయి. తన ఏకైక కుమారుని ఈ వినాశనం నుండి కాపాడమని భగవంతుడిని ప్రార్ధించాడు. 

ఒక ఎడ్లబండి ప్రయాణానికి తీసుకుందామని, పుండలీకునితో అతను నేను మంచి ఆరోగ్యం ఉంటేనే భగవంతుడిని ర్ధించాడు. అతని తండ్రి చింతితుడై అన్నాడు. 

దానికి పుండలీకుడు...వద్దు నేను షేగాం నడకమీదనే వెళ్ళాలి, నేను నెమ్మదిగా నడిచి ఎలాగయినా షేగాం చేరతాను. ఒకవేళ దారిలో చనిపోతే కనుక నాశరీరం షేగాం మోసుకు వెళ్ళండి, చింతించకండి అన్నాడు. అలా అంటూ నెమ్మదిగా నడుచుకుంటూ అతి కష్టం మీద షేగాం చేరాడు.

అతను శ్రీమహారాజును చూసి పాదాలకు నమస్కరించాడు. శ్రీమహారాజు పుండలీకుని చూసి, తన చంకక్రింద నొక్కుకుని, పుండలీకా నీప్రమాదం తప్పింది కావున అసలు చింతించకు అని అన్నారు. అలా శ్రీమహారాజు అనగానే పుండలీకుడి చంకక్రింద గడ్డ అకస్మాత్తుగా అదృశ్యం అయింది. కానీ అతనికి కొంత నీరసంగా అనిపించింది. పుండలీకుని తల్లి సమర్పించిన నైవేద్యం రెండు ముద్దలు శ్రీమహారాజు తినేసరికి అదికూడా మాయం అయింది. 

పుండలీకుడు మామూలుగా ఉన్నట్టు అనుభూతి పొందాడు. ఇదంతా గురుభక్తి ఫలితం, మరియు నమ్మకం లేనివాళ్ళు గమనించదగ్గ విషయం. సరిఅయిన గురువుమీద భక్తి ఎప్పటికీ వృధాకాదు అని ఇద తెలియచేస్తోంది. నిజమయిన గురువు ఇంట్లో కామధేనువు ఉండి మనకోరికలన్నీ తీర్చినట్టు. పుండలీకుడు తన కార్యక్రమంలోని పనులు పూర్తి చేసుకుని ముండగాం తిరిగి వచ్చాడు. 

మీరు ఈ చరిత్ర చదివితే మీకు వచ్చే ప్రమాదాలన్నీ తొలుగుతాయి. ఇది ఒక గొప్ప యోగి జీవిత చరిత్ర కానీ ఏదో ఊహించిన కధకాదు. ఈ పుస్తకంలో వివరించినవి అన్నీ నిజంగా జరిగిన విషయాలు. ఈయోగి యొక్క కధలపై ఎవరూ అపనమ్మకం చూపరాదు. దాసగణు రచించిన ఈ గజానన్ విజయ గ్రంధం అందరికీ సుఖాలు తెచ్చుగాక. ఈ విధంగా దాసగణు ప్రార్ధిస్తున్నాడు. అందరికీ శుభంకలుగుగాక. హర మరియు హరి కి నానమస్కారములు. 

శుభం భవతు 

13. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 69 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 13 - part 6 🌻*

Once I reach Shegaon I won't mid death thereafter. Please protect me from this plague enemy till I reach Shegaon. Visit to shrines is possible only if you are in good health.” 

Looking to the condition of Pundalik, his father felt sorry and tears rolled from his eyes. He prayed to God to save his only sons from this calamity. He offered Pundalik to get a bullock cart for his journey to Shegaon. Pundalik replied, “No, I must go to Shegaon on foot only. Slowly I will walk and reach Shegaon. 

If I die on way, please carry my body to Shegaon and don't worry.” Saying so, Pundalik started walking slowly and with great difficulty reached Shegaon. He saw Shri Gajanan Maharaj and prostrated at his feet. 

Looking to Pundalik Shri Gajanan Maharaj pressed His own armpit by another hand and said, “Pundalik, your danger is averted, so do not worry at all.” When Shri Gajanan Maharaj said so, the tumour in the armpit of Pundalik suddenly vanished. 

He was, however, feeling a bit of weakness, but that too disappeared when Shri Gajanan Maharaj ate two morsels of Naivedya offered by Pundalikas mother. Pundalik began feeling normal. This was the result of Gurubhakti, and an example to be noted by disbelievers. 

It shows that devotion to proper Guru never goes waste. Real Guru is like having a Kamdhenu at home, to fulfil all your desires. After completing his rituals of the Vari, Pundalik returned to Mundgaon. 

If you read this Chaitra, all the dangers to you will be averted. It is a biography of a great saint and not any imaginary story. Everything given in this book is real and actually happened. Nobody should show any disbelief in this story of the great saint. 

May this Gajanan Vijay Granth, written by Dasganu, bring happiness to all! Thus prays Dasganu. May good come to you all. My obeisance to both Har and Hari. 

||SHUBHAM BHAVATU||

 Here ends Chapter Thrirteen

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 62 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 12 🌻*

253. మానవుని అర్థస్పృహ ద్వారా యీ సంస్కారములు పైకి లేచినప్పుడు కలలో అస్పష్టమైన సూక్ష్మరూపములుగా వస్తువులను ప్రాణులను సృష్టించు చున్నవి .
సినీఫిల్ము ...మనస్సు 
ఫొటోలు ... నిద్రాణసంస్కారములు
తెర పై ప్రదర్శనము "కల" అనెడి డ్రామా .

254. మానవుడు స్వప్నావస్థలో , స్వప్ననాటకములో తగుల్కొని తాను ఆ నాటకకర్తగను , కథానాయకునిగను
పాత్రలు ధరించుటయే గాక తన స్వప్ననాటకములో సూక్ష్మాతి సూక్షరూపములుగానున్న వస్తువులతోను ప్రాణులతోను సన్నిహితముగా హత్తుకొని వుంటున్నాడు .

ఈ సూక్ష్మరూపముల సృష్టి కేవలము మానవుని పూర్వ, ప్రస్తుత జన్మల యొక్క స్వీయ సంస్కారముల వ్యక్తీకరణ ఫలితమే.

255. స్వప్నావస్థలో తాను చూచిన రూపములను, కలిసికొన్న రూపములను మెలుకువ వచ్చిన తరువాత స్మృతికి తెచ్చుకొన్నప్పుడు, అవి, ప్రస్తుత జీవితములో తాను ఏ రోజు కారోజు స్థూలరూపములలో నున్న వస్తువులను ప్రాణులను మానవులను ఎఱుకతో కలిసికొన్న సమావేశములను గుర్తుకు తెచ్చుచున్నవి. 

అంతియే కాక, వెంటనే వచ్చు జన్మములోగాని, లేక, కొంతకాలము గడచిన తరువాత వచ్చు జీవితము యొక్క సంబంధ _అనుబంధములను కూడా స్థాపించు చుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 15 / Sri Lalitha Chaitanya Vijnanam - 15 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*అష్టమిచంద్ర విభ్రాజ దళికస్తల శోభిత*
*ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక*

*🌻 15. 'అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా' 🌻*
 
అష్టమి చంద్రుడు అర్ధచంద్రుడు. సగము దృశ్యముగను, సగము అదృశ్యముగను, అష్టమినాడు చంద్రుడు గోచరించును. సృష్టి యందు ప్రకృతి పురుషులు యిట్లే యుందురు. కనపడునది మాత్రమే చూచుట అసంపూర్ణ దృష్టి. 

కనపడునది ఆధారముగ కనపడనిది ఊహించవలెను, భావించవలెను. పూర్ణమైన చంద్రబింబము సగము భాగము కనుపించనపుడు ఆ మిగిలిన భాగము లేకుండునా? ఉన్నది. అగుపడక ఉన్నది. 

అటులనే సృష్టియందు దివ్యమైనది అగుపడక ఉన్నది. లేదు అనుకొనుట అల్పత్వము. అర్ధ చంద్రబింబము దీనినే సంకేతించుచున్నదా అన్నట్లు ఉండును. శుక్లాష్టమినాడు కనపడిన భాగము కృష్ణాష్టమినా డగుపడదు.

అటులనే కృష్ణాష్టమి నాడు అగుపడు భాగము శుక్లాష్టమినాడగు పడదు.
రెండును అర్ధచంద్రాకారములే అయినను, ఒకటి కాదు. రెండు తత్త్వములు సృష్టిలో ఒకదానికొకటి ఆలంబనములు. ఒకటి పెరుగుచున్న, రెండవది తరుగుచుండును. 

పదార్థము పెరుగుట జరుగుచున్న కొలది, పరమార్థము అదృశ్య మగుచుండును. అటులనే పరమార్ధము పెరుగుచున్న కొలది పదార్థము అదృశ్య మగుచుండును. రెండునూ సమతూకముగా నున్న స్థితిని పూర్ణయోగ మందురు. అష్టమి అట్టి యోగమునకు సంకేతము. అర్ధనారీశ్వరుని తత్త్వము దీనినే బోధించును.

గోచరింపనివాడు అవ్యక్త బ్రహ్మము. గోచరింపబడునది అతని వెలుగు. అదియే అమ్మవారు. తాను గోచరించి, గోచరింపని వానిని తెలియబరచు చుండును. అమ్మవారు, అయ్యవారి శోభనమూర్తి. ఆమెను పూజించుట ద్వారా ఆయనను రుచి చూడవచ్చును. ఆయన కనపడుట ఎపుడును ఆమెగనే యుండును. కేనోపనిషత్తు ఈ విషయమును ప్రతిపాదించు చున్నది. 

అష్టమి కళను అమ్మవారిగ ఆరాధించుచు, మిగిలిన కనబడని అర్ధచంద్ర బింబమును అయ్యవారిగ ఊహించుచు ధ్యానము చేయు మార్గ మిచట తెలుపబడుచున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 15 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Aṣṭamī -candra-vibrāja-dhalika-sthala-śobhitā* *अष्टमी-चन्द्र-विब्राज-धलिक-स्थल-शोभिता (15) 🌻*

Her forehead appears like the moon on the eighth day. Eighth day from the full moon or new moon is called asḥṭamī.  

The moon appears beautiful with even curves on both sides on eighth lunar day.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 422 / Bhagavad-Gita - 422 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 31 🌴

31. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమో(స్తు తే దేవవర ప్రసీద |
విజ్ఞాతుమిచ్చామి భవన్తమాద్యమ్
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ||

🌷. తాత్పర్యం : 
ఓ దేవవర! భయంకర రూపముతోనున్న నీవెవరవో నాకు దయతో తెలియజేయుము. నీకు వందనముల నర్పించెదను; నా యెడ ప్రసన్నుడవగుము. నీవు ఆదిదేవుడవు. నీ కార్యమును ఎరుగలేకున్నందున నిన్ను గూర్చి నేను తెలిసికొనగోరుచున్నాను.

🌷. భాష్యము : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 422 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 31 🌴

31. ākhyāhi me ko bhavān ugra-rūpo
namo ’stu te deva-vara prasīda
vijñātum icchāmi bhavantam ādyaṁ
na hi prajānāmi tava pravṛttim

🌷 Translation : 
O Lord of lords, so fierce of form, please tell me who You are. I offer my obeisances unto You; please be gracious to me. You are the primal Lord. I want to know about You, for I do not know what Your mission is.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మంత్ర పుష్పం - భావగానం - 11 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

 *🌻. మంత్రం పుష్పం - 27 to 30 🌻*

🌻. మంత్ర పుష్పం 27.

 *అన్తశ్చరతి భూతేషు*
 *గుహాయామ్ విశ్వమూర్తిషు*

🍀. భావగానం :

జీవులందున్నవాడు
బయటా వున్నవాడు
తెలియని వాడు
 విశ్వమంతా వున్నవాడు

🌻. మంత్ర పుష్పం 28.

*త్వం యజ్ఞ్యస్త్వం* *వషట్కారస్త్వం మిన్ద్రస్తగ్o* *రుద్రస్త్వం విష్ణుస్త్వం*
 *బ్రహ్మత్వం ప్రజాపతిః*
*త్వం తదాప ఆపొజ్యోతీ*
 *రసో ౭ మృతం*
*బ్రహ్మ
భూర్భువస్సువరోమ్*

🍀. భావ గానం:

నీవే యాగము యాగమంత్రము
నీవే విష్ణువు బ్రహ్మ ఇంద్రుడవు
నీవే జలము తేజము రసము
 నీవే శాశ్వతము విశ్వరూపము
నీవే ఓం కారబ్రహ్మవు

🌻. మంత్ర పుష్పం 29.

 *ఈశాన స్సర్వ విద్యానా మీశ్వర*
 *స్సర్వభూతానామ్ బ్రహ్మధిపతిర్*
*బ్రహ్మణో ౭ ధిపతిర్ బ్రహ్మశివోమే*
*అస్తు సదా శివోమ్*

🍀. భావ గానం:

సకల విద్యలకు ఈసుడవు
సకల జీవులకు ఈసుడవు
నీవే బ్రహ్మ యజమాని
నీవే బ్రాహ్మల యజమాని
నీవే బ్రహ్మ సదాశివుడవు.

🌻. మంత్ర పుష్పం 30.

*తద్విష్ణో పరమం పదగ్o*
*సదా పశ్యన్తి సూరయః*
*దివీవ చక్షు రాతతమ్*

🍀. భావగానం:

ఆ విష్ణు లోకము నోయి
ఆ పరమ పధమునోయి
జ్ఞానులు సదా చూచేరోయి
ఆకాశమంతా చూచేరోయి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 236 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
51. అధ్యాయము - 6

*🌻. సంధ్య తపస్సును చేయుట - 6 🌻*

తన్మధ్యే స దదౌ కన్యా విధవే సప్తవింశతిః | చంద్రోsన్యాస్సంపరిత్యజ్య రోహిణ్యాం ప్రీతిమానభూత్‌ || 55

తద్ధేతోర్హి యదా చంద్రశ్శప్తో దక్షేణ కోపినా |తదా భవత్యా నికటే సర్వే దేవాస్సమాగతాః || 56

న దృష్టాశ్చ త్వయా సంధ్యే తే దేవా బ్రహ్మాణా సహ | మయి విన్యస్త మనసా ఖం చ దృష్ట్వా లభేత్పునః || 57

చంద్రస్య శాపమోక్షార్థం జాతా చంద్రనదీ తదా | సృష్టా ధాత్రా తదైవాత్ర మేధాతిథి రుపస్థితః || 58

ఆ కన్యలలో ఇరవై ఏడు మందిని ఆయన చంద్రునకిచ్చి వివాహము చేసెను. చంద్రుడు ఇతరభార్యలను పట్టించుకొనక, రోహిణి యందు మాత్రమే ప్రీతిని కలిగియుండెను (55). ఆ కారణముచే దక్షుడు కోపించి చంద్రుని శపించగా దేవతలందరు నీవు ఉన్న ఈ చోటకు వచ్చిరి (56) 

ఓ సంధ్యా!బ్రహ్మతో కూడి వచ్చిన ఆ దేవతలను నాయందు లగ్నమైన మనస్సుగల నీవు చూడలేదు. బ్రహ్మ ఆకసమును చూచి, చంద్రుడు తన పూర్వ రూపమును ఎట్లు పొందునో యని చింతిల్లెను (57). 

బ్రహ్మ చంద్రుని శాపవిముక్తి కొరకు చంద్రభాగానదిని సృష్టించెను. అదే సమయములో అచటకు మేధాతిథి విచ్చేసెను | (58).

తపసా తత్సమో నాస్తి న భూతో న భవిష్యతి | యేన యజ్ఞస్సమారబ్ధో జ్యోతిష్టోమో మహావిధిః || 59

తత్ర ప్రజ్వలితో వహ్నిస్తస్మింస్త్యజ వపుస్స్వకమ్‌ | సుపవిత్రా త్వమిదానీం సంపూర్ణోsసుతు పణస్తవ || 60

ఏతన్మయా స్థాపితం తే కార్యార్థం భో తపస్విని | తత్కురుష్వ మహాభాగే యాహి యజ్ఞే మహామునేః || 61

తస్యా హితం చ దేవేశస్తత్రై వాంతరధీయత || 62

ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సంధ్యా చరిత్ర వర్ణనం నామ షష్ఠోsధాయః (6).

తపస్సులో ఆయనతో సమానమైన వాడు మరియొకడు లేడు. ఉండబోడు. ఆయన అతివిస్తృతమైన జ్యోతిష్టోమమనే యజ్ఞమునారంభించినాడు (59). 

అచట అగ్ని ప్రకాశించుచున్నది. నీవు నీ దేహమును దానియందు విడువుము. ఇప్పుడు నీవు మిక్కిలి పవిత్రురాలవు. నీ ప్రతిజ్ఞ నెరవేరుగాక! (60). 

ఓ తపస్వినీ! ఈ తీరున నేను నీ కార్యములను సిద్దింపజేసితిని. ఓ మహాత్మురాలా!నేను చెప్పినట్లు చేయుము. ఆ మహాముని యజ్ఞము చేయుచున్న చోటకు వెళ్లుము (61).

 ఇట్లు దేవదేవుడు ఆమెకు హితమునుపదేశించి అచటనే అంతర్ధానము నొందెను (62).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండమునందు సంధ్యా చరిత్ర వర్ణనమనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 2 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

*🌻 INTRODUCTION - 2 🌻*

5. It will be noticed from the above table (which covers only Part I of the book) that rules 4, 8, 12, 16, 20 and 21 are absent from the list. That is because they do not belong to the most ancient part of the book.

 Those rules and the preliminary and concluding comments are the portion added by the greater One who gave it to the Master. In addition there are notes, which were written by the Master Hilarion Himself. 

The book as originally published in 1885 contained these three portions: the aphorisms from the ancient manuscript, the additions of the Chohan, and the notes of the Master Hilarion. 

All these were written down by Mabel Collins, who acted as the physical instrument, as the pen that wrote it. The Master was Himself the translator of the book, and He impressed it upon her brain. His was the hand that held the pen. 

Then there subsequently appeared in Lucifer under the title of “Comments” a few articles which were written by Mabel Collins under the influence of the Master, and which are exceedingly valuable, worth reading and studying.

6. Now, taking up the book itself, we first find the following statement:

7. These rules are written for all disciples: Attend you to them.

8. A distinction is made here between the world and the disciples; this is not a book intended for the world in general. 

The word disciple is to be considered in two senses – the uninitiated and the initiated. In reading the book carefully we can trace the two distinct lines of teaching clothed in the same words; each sentence contains a double meaning, one intended for the more and the other for the less advanced.

 We will try to trace them out when we come to the preliminary statements. The second part of the treatise appears to be intended entirely for the initiated disciple, but this duality runs through the first part.

9. Many persons not yet approaching discipleship entirely misunderstand these rules, and often criticize them as holding up^ an ideal which is hard and wanting in sympathy. 

This is constantly the case when an ideal is presented which is too high for the reader. No person is helped by an ideal, however noble in itself, which to him is not attractive; it is a practical lesson for dealing with human beings that we should put before them only such ideals as may attract them. With all books of this kind that which a man gets out of them is what he brings to them; his understanding depends upon his own power to answer to the thoughts which they contain. 

Even material things exist for us only if we have developed the organs which can respond to them; hence at the present time there are hundreds of vibrations playing upon us to which we are incapable of giving heed. 

Sir William Crookes once illustrated this very well when he was trying to show how circumscribed was our knowledge of electricity, and how great therefore was the possibility of progress in electrical science. 

He said that it would make an enormous difference to us, would in fact revolutionize our ideas, if we had organs answering to electrical vibrations instead of eyes sensitive to light vibrations. In dry air we should not be conscious of anything, for it does not conduct electricity. 

A house made of glass would be opaque, but an ordinary house would be transparent. A silver wire would look like a hole or tunnel in the air. What we know of the world thus depends upon our response to its vibrations. 

Similarly, if we cannot answer to a truth, it is not truth for us. So, when dealing with books written by occultists we can only catch their thought in proportion to our own spiritual advancement. Any part of their thought which is too subtle or too high simply passes by us as if it were not there.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 124 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నరనారాయణ మహర్షులు - 5 🌻*

29. పవిత్రభావంతో ఋషుల చరిత్ర వింటే, ఋషి ఋణం తీరుతుంది. ఋషి ఋణం తీరితే, మిగిలిన ఋణాలు సులభంగా తీరుతాయి. ఋషులు అనుగ్రహిస్తే పితృఋణం తీరుతుంది. వారి అనుగ్రహముంటే ఉత్తమ సర్మ ఫలాలు వస్తాయి. ఋషులు మనమీద అనుగ్రహిస్తే సమస్త యజ్ఞఫలాలూ ఇవ్వగలరు. వాళ్ళ నామస్మరణ మాత్రం చేత, ఇన్ని యజ్ఞాలుచేసే పనిలేకుండానే ఫలంవస్తుంది. 

30. ఒక్క ఋషి మాత్రమే – ఒక్కక్షణం మనను అనుగ్రహిస్తే చాలు; నూరు అశ్వమేధయాగాల ఫలం లభిస్తుంది. అంతటి సమర్థుల ఋషులు. అడిగి తెచ్చుకోవాలి. భక్తియుక్తులు, శ్రద్ధ ఉండాలి. మనం దేవతాధ్యానం సంప్రదాయపరంగా చేస్తూంటాంకాని; ఋషులచరిత్రవలన మనకు కలిగే ఫలాలు, దేవతానుగ్రహంవలనకూడా మనకు కలగనంతటి ఉత్కృష్టమైనవి.

31. ఋషులకు సహజంగా మనం సంతానంకాబట్టి, వాళ్ళకు మన యందున్న శ్రద్ధ, అనుగ్రహం దేవతలకు ఉండదు. దేవతలు కర్మాధీనులై ఉంటారు. కర్మవలన, యజ్ఞంవలన దానికి నిర్ణీతమైన సంప్రదాయంలో, శాస్త్రంలో స్మృతులలో ఎలా చెప్పబడి ఉన్నదో అలాంటి ఫలాన్నే వాళ్ళు ఇస్తారు. దానినే అనుగ్రహం అంటారు. కానీ కాస్త భక్తికి అపరిమితంగా సంతోషించి ఇచ్చే ఫలాలన్నీ దైవసంపత్తి – ఈశ్వరుడియొక్క లక్షణములు. ఈశ్వరుడియొక్క లక్షణములు ఋషులయందున్నాయి. 

32. ఈశ్వరుడు కర్మాధీనుడు కాడు. దేవతలు కర్మాధీనులు. భవంతుడు అలా కాదు. ఒక్క తులసీదళాన్ని భక్తితో సమర్పిస్తే, తీసుకుని మోక్షాన్నే అనుగ్రహిస్తాడు. లేదా వందసంవత్సరాలు ఈ భూమిని పరిపాలించమని చక్రవర్తిని చేసి తరువాత మోక్షాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన ఇవ్వటానికి పరిధులులేవు. ఆయన అనుగ్రహానికి అవధులులేవు. కాబట్టి ఋషులు ఈశ్వరస్వరూపులు అనబడతారు.

33. కాబట్టే ఋషుల ఆరాధన ఈశ్వరారాధనతో తుల్యమై అంతటి ఫలాన్ని ఇవ్వగలదు. వాళ్ళు ఈశ్వరుణ్ణి చూపించగలరు. జ్ఞానాన్ని ఇవ్వగలరు. వాళ్ళ అనుగ్రహానికి అవధిలేదు. అందుకని ఈశ్వరారాధన, నిష్కళంకమైన భక్తి అది అందరికీ సులభంగా లభ్యమయ్యే వస్తువు కాదు. కనుక, ఈశ్వరుడి యందు అట్టి భక్తిని ఇవ్వమని అడిగితే, ఋషి ఇవ్వగలడు. మహర్షులే గురువు అనేభావన, సంప్రదాయం ఈ ఋషులవల్లనే. 

34. ఇట్టి మహాత్ములుండటంచేతనే ఇది మనకు సిద్ధించిన సంప్రదాయం. ఈ సంప్రదాయం ఇతర మతాలలో లేదు. దీనిని యథార్థంగా నమ్మి ఆ విశ్వాసంతో ఆరాధన చేసినట్లయితే, మన భవిష్యత్తంతా ఋషిప్రోక్తమయిన గురువులుగా, వాళ్ళను తండ్రులుగా, రక్షకులుగా భావించి ఈశ్వరుడిని చేరే మార్గం అర్థించటంలోనే – మన భవిష్యత్తుంది.

35. ఋషులు నిగ్రహానుగ్రహ సమర్థులు. త్రిమూర్తులను చూచినవారు, త్రిమూర్తులనుకూడా శాపగ్రస్తులను చేయగలిగినవాళ్ళు. అపరిమితమయిన శక్తిసామర్థ్యాలు కలిగినటువంటివాళ్ళు. మన భౌతికమైన జీవనవిధానంలో సుఖదుఃఖాలకు హేతువులు పాపపుణ్యాలు. 

36. పుణ్యం చేసినా, పాపం చేసినా మనం అల్పమైన శక్తిసంపదలు కలిగిన వాళ్ళమేకాబట్టి; మనకు భౌతికమైన క్షేమాన్ని, సుఖాన్ని ఇవ్వాలంటే, ఈ లోకంలో మనక్షేమాన్ని కోరేవాళ్ళు, మన తండ్రులైన ఋషులే శరణ్యం. వారే ఇక్కడ మనకు సుఖాన్నిస్తారు. ఇవాళ పుణ్యంచేస్తే ఫలితం ఎప్పుడో వస్తుంది మనబోటి సామాన్యులకు. 

37. కాని, మనగోత్ర ఋషినిగాని, మహాత్ములైన ఋషులనుకాని, ఋషులరూపంలో ఉన్న గురువులనుకాని ఆశ్రయిస్తే; పుణ్యం ఉన్నాలేకపోయినా ఆ ఫలాన్ని ఇప్పుడే ఇవ్వగల సమర్థులు వాళ్ళు. మన కర్మకాండ, స్మృతులు, మంత్రములు అన్నీ ఋషిప్రోక్తాలే. వాళ్ళ అనుగ్రహంతో మనకు లభించినటువంటి మార్గాలే ఇవన్నీ. 

38. ప్రతి మంత్రానికీ దేవతవలె, ఋషికూడా ఒకరున్నారుకదా! అంతే, ఆ మంత్రోపాసనతో ఆ దేవతను ఏ విధంగా ఆరాధన చేయాలో, తద్వారా ఏ ఫలం పొందవచ్చో మనకు చెప్పింది ఋషులే. మరి వారిని స్మరిస్తే ఇక మనకు మిగిలేది ఏముంది?

39. ఒక ముఖ్య విషయం – బ్రాహ్మణులైన మహర్షులు నేడు కూడా బ్రహ్మలోకానికి దిగువన తపోలోకంలో ఉన్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు - 42 🌹*
*🍀 2. శ్రద్ధ - భక్తి - ప్రతిదినము కర్మల నాచరించువాడు సంగము లేక ఆచరించినచో అతడు ఉత్తమ కర్మిష్ఠిగ నుండగలడు. 🍀*  
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. కర్మయోగము - 07 📚*

7. యస్యింద్రియాణి మనసా నియమ్యారభతేఖర్జున |
కర్మేంద్రియై: కర్మయోగ మసక్త స్ప విశిష్యతే ||

తమను తాము కర్మలయందు బంధించుకొనక జీవించు విధానము శ్రీకృష్ణుడు ఈ క్రింది విధముగ తెలుపుచున్నాడు. వీనిని శ్రద్ధతో అధ్యయనము చేసి అనుసరించిన వానికి జీవితము ఒక క్రీడగ సాగును. అట్లు కానిచో జీవితమున బంధము తప్పదు.

అసక్తస్స, ఆరభతే, కర్మయోగమ్ : ప్రతిదినము కర్మల నాచరించువాడు సంగము లేక ఆచరించినచో అతడు ఉత్తమ కర్మిష్ఠిగ నుండగలడు. సంగము లేక కర్మలాచరించుట యనగ, తన కర్తవ్యమును తను శ్రద్ధా భక్తులతో నిర్వర్తించుట. ఫలితములవైపు మనస్సును పోనీయకుండుట. అనగా తినునపుడు, మాటాడునపుడు, పనులు చేయుచున్నపుడు వానియందు పరిపూర్ణమైన శ్రద్ధ, భక్తి ఉండవలెను. 

వానిని నిర్వర్తించు తీరు తెలుసుకొని అట్లే నిర్వర్తించుచు నుండవలెను. ఎక్కువ తక్కువలు చేయరాదు. ఫలితముల వైపుకు మనస్సును పోనీయరాదు. 

విద్యార్థులకు విద్యయందు శ్రద్ధ ఉండవలెను గాని మార్కుల యందు గాదు. పని చేయువాడు పనియందు శ్రద్ధగాని నెలసరి భత్యమునందు కాదు. ఇట్లు సమస్తమునందు శ్రద్ధాపూరిత కర్తవ్య నిర్వహణమే కాని, ఇతరము లందు ఆసక్తి జనింపరాదు. 

ప్రస్తుత మెప్పుడును కర్తవ్యమునే బోధించుచుండును. దానిని గ్రహించి నిర్వర్తించుటే మార్గము. చిన్నతనము నుండి ఈ పద్ధతి నభ్యసించినచో మనిషి కర్మ నిర్వహణమున శ్రేష్ఠముగ నిలచియుండును. (3-7)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 188 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

🌻 36. Appearance and disappearance, birth and death these are qualities of ‘I am’, they do not belong to you, the Absolute. 🌻 

Coming, appearance or birth and going, disappearance or death are qualities of the ‘I am’, the consciousness or the beingness which only apparently seem to have arisen on your True nature. 

You are the Absolute and none of these qualities belong to you, in fact they have never actually occurred but only appear to be so.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 66 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 30 🌻*

చిత్తము ఏకాగ్రము అవడము అంటే అర్ధము ఏమిటంటే మానవ ఉపాధియందు అంతఃకరణముగా వున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటి నాలుగు పనిముట్లు దానియొక్క ఆధారమైనటువంటి జ్ఞాత స్థానములో లయించిపోయినవి. అట్టి జ్ఞాత పరిణామ రహితమైనటువంటి కూటస్థునియందు చేరిపోయింది. ఈ చెరిపోయేటటువంటి విధానాన్నే చిత్తైకాగ్రత అంటారు. 

ఏ కూటస్థ శబ్దమైతే నీకు బ్రహ్మముగా బోధించబడుతుందో, బ్రహ్మాండ పంచీకరణకు ఆద్యముగా ప్రధమస్థానమందున్న కూటస్థ పదము ఏదైతే వున్నదో, ఆ కూటస్థ పదము చాలా ముఖ్యమైనటువంటిది. అట్టి కూటస్థ స్థితికి చేరాలి అంటే జ్ఞాతకి కూటస్థుడికి బేధం లేదు అనేటటువంటి స్థితిని నువ్వు సాధించాలి. అంటే అర్ధమేమిటంటే ప్రత్యగాత్మ బ్రహ్మ ఈ రెండూ ఒక్కటే. 

జ్ఞాత ప్రత్యగాత్మ. కూటస్థుడు బ్రహ్మము. ఈ ప్రత్యగాత్మ బ్రహ్మ అభిన్నులు అనేటటువంటి నిర్ణయాత్మక జ్ఞానాన్ని నువ్వు పొందాలి. అలాంటి స్థితిని పొందినప్పుడు మాత్రమే ఈ ఓంకార వాచ్యమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయం వైపుకు నీ స్ఫురణ పనిచేయడం మొదలుపెడుతుంది.

 ఎవరైతే నేను కూటస్థుడను, నేను బ్రహ్మమును, నేను పరిణామము లేనివాడను, నేను ఏ మార్పూ లేనివాడను, నేను స్థాణువును, నేను నిరహంకారిని, నేను నిర్గుణుడను, నేను నిరవయవుడును, నేను నిరంజనుడను, నేను నిర్మలుడను అనేటటువంటి నకార పూర్వక లక్షణాలన్నీ ఆ కూటస్థ స్థితిలో ప్రాప్తించడం ప్రారంభిస్తాయి. 

ఈ లక్షణముల ద్వారానే పరబ్రహ్మమును స్ఫురింపచేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆట్టి పరబ్రహ్మమును తెలుసుకోవాలి అంటే ఓంకారమును నాలుగు పద్ధతులుగా ఆశ్రయించవచ్చు. అకార ఉకార మకారములనే త్రిమాత్రుకాయుత ప్రణవ ధ్యానం ద్వారా ఆశ్రయించవచ్చు.

         అలా కాకుండా (త్రిమాతృకలు కాకుండా) ఒక్కొక్క మాత్రనీ పట్టుకుని ఆశ్రయించేటటువంటి బీజాక్షరములను పట్టుకుని ఉపాసించే విధానమూ కలదు. ఇది కాకుండా అమతృకాయుత పద్ధతిగా కేవల లయయోగ విధాన పద్ధతిగా ఆశ్రయించేటటువంటి పద్ధతిగా కూడా ఓంకారోపాసన చేయవచ్చును. 

కారణమేమిటంటే ఈ నాలుగు మాత్రలు కూడా నాలుగు అవస్థలను, నాలుగు శరీరాలను, నాలుగు మాత్రలను తెలియజేస్తూ వున్నవి. నాలుగు శరీరములు ఏమిటివీ - స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరములు. వీటి యొక్క వివరణ అంతా కూడా సాంఖ్య విచారణలో స్పష్టముగా బోధించబడుచున్నది. ఉత్తరత్తరా రాబోయేటటువంటి బోధలో అవి కూడా వివరించబడతాయి.

         స్థూల శరీరము అంటే తనకు తా కదలనది ఏదియో అది స్థూల శరీరము. సూక్ష్మ శరీరము - చలించుచున్నట్లు కనబడుతున్నప్పటికి స్వయముగా చలింపజాలనిది ఏదియో అదియే సూక్ష్మ శరీరము. స్థూల సూక్ష్మ వ్యవహారము - తాత్కాలికముగా ఉడిగినటువంటి స్థితి ఏదైతే కలదో అది కారణ శరీరము. ఇది కూడా స్వయముగా చలింపజాలదు.

 మహా కారణ శరీరము - స్థూల సూక్ష్మ కారణ శరీరములను చలింపజేయుచు తనకు తా స్వయముగా కదులుచున్నట్లు కనపడుచున్నది ఏదో అది మహాకారణ శరీరము. కాబట్టి క్రిందున్న మూడింటికి లయస్థానమూ అయివున్నది, తనకు తా కదలగలిగే శక్తి కలిగి వున్నది, ఇతరులను కలిగించగలిగే శక్తి కూడా కలిగినటువంటి మహాకారణ శరీరము ఏదైతే వున్నదో అది నాలుగవ శరీరము.

 ఇవే మరల మనం నాలుగవస్థలుగా దర్శించవచ్చు. అంటే అర్ధమేమిటి? జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయములు. జాగ్రత్ స్వప్న సుషుప్తులు తమకు తా పనిచేస్తున్నట్లుగా కనబడుతున్నవి గానీ స్వయముగా పనిచేయడం లేదు.

 ప్రతిఒక్కరూ జాగ్రదావస్థలో తనకు తా అన్ని పనులను చేస్తున్నట్లుగా చలనములు పొందుతున్నట్లుగా, చలనశీలత కలిగి వున్నట్లుగా, సర్వకర్మలను ఆచరిస్తున్నట్లుగా, ఆచరణ శీలత కలిగివున్నట్లుగా తోచుచున్నప్పటికీ కర్మ వశాత్తూ వారి వారి యొక్క పుణ్య పాప ఫలములను స్వయంకృతములను అనుభవించుట చేత వారు కదులుతున్నట్లు కనబడుతున్నది గానీ స్వయముగా వారికి కదలగలిగే శక్తి లేదు.

అట్లే స్వప్నావస్థయందు ఇంద్రియములు ఏమియూ లేకున్నను చలనశీలమైనట్టి మనసనే ఇంద్రియము ద్వారా మనో బుద్ధి చిత్త అహంకారముల మధ్య ఏర్పడుతున్న మనో వ్యాపార వ్యవహారము చేత కదులుతున్నట్లు కనపడుతున్ననూ అది కూడా స్వయముగా కదలగలిగే శక్తి లేనటువంటిది.

 సుషుప్త్యావస్థ యందు జాగ్రత్ స్వప్నములందు ఏర్పడుతున్న కదలికలన్నియు లేమితనమును పొంది సుప్తచేతనావస్థ తాత్కాలికముగా నిరోధించబడి నిగ్రహించబడినట్లు కనబడుచున్నను స్వయముగా కదలిక లేనటువంటి శక్తి లేనందువల్ల జడముగా పడియుండుట అనేటటువంటి స్థితియందు తాను సాక్షిగా నిలబడివున్నటువంటి ప్రజ్ఞా స్వరూపముగా సుషుప్త్యావస్థ జరుగబడుచున్నది. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 43 🌹*
 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
🌻 *16.సిలికేట్ మాట్రిక్స్*🌻

సిలికేట్ మ్యాట్రిక్స్ DNA అనేది DNA యొక్క పన్నెండు ప్రోగులను సంక్రియం చేసే పద్ధతి. 12 ప్రోగుల DNA యాక్టివేషన్ ద్వారా శరీరం నశించకుండా (మరణించకుండా) ఉన్నత తలాలకు ప్రయాణించ గలిగే స్థితికి మారుతుంది.

💠. *స్పటికాకార బ్లూప్రింట్ ని మార్చడం:-*
ఒకప్పుడు ఈ భూమి అత్యున్నతమైన స్థాయిలో ఉండేది. ఆ సమయంలో ఈ భూమి యొక్క ఆత్మ పేరు *"తారా"*; ఈ భూమి 12 ఉన్నత లోకాల స్థాయి శక్తిని కలిగి ఉండేది కానీ ఇప్పుడు ఆ స్థాయి మార్చబడింది.
12 శక్తి స్థాయిలు కలిగిన ఈ భూమి రెండు శక్తి స్థాయిలకు దిగిపోయిన తరువాత ఈ భూమిని *"గెయియా"* అనే ఆత్మ పరిపాలిస్తోంది.

💫. ఈ భూమిపైకి మానవులు భగవంతుని యొక్క రూపురేఖలతో దైవమానవునిగా సృష్టించబడ్డారు. ఇతని DNA లో 12 ఉన్నత స్వర్గాల యొక్క జన్యు నిర్మాణం కలిగి ఉండేది. ఈ మానవుని *"ఎమరాల్డ్ DNA ఆర్డర్ ఫౌండర్ రేస్ మానవుడు"* అనేవారు.

💫. ఇప్పుడు మానవుడు తన డీఎన్ఏలో మొదటి జన్యుజ్ఞానాన్ని కోల్పోయి (12 స్థాయిల నుండి రెండు స్థాయిలకు దిగిపోయాడు) అతి సామాన్యుడిగా ఉన్నాడు. ఈ స్థితిని మార్చి తిరిగి అతనికి పూర్వవైభవాన్ని పొందేలా చేయడమే *"DNA సంక్రియ".* అంటే *"DNA సంక్రియ"* అనేది కణస్థాయి నుండి తీసుకొని రావలసిన మార్పు. మన DNAలో గుప్త జ్ఞానం దాగి ఉంది. ఈ గుప్త జ్ఞానం ఉన్న DNAని *"జంక్ DNA"* అన్నారు. ఈ DNAలో ఉన్నత తలాల సమాచారం, ఉన్నత జ్ఞానం, శక్తి నిక్షిప్తం చేయబడి ఉన్నాయి.

💠. *డైమండ్ సన్ DNA కోడ్:-*
మనల్ని మొదట దైవ మానవునిగా తయారు చేసినప్పుడు మనం అత్యధికమైన DNA స్థాయిని కలిగి ఉండే వాళ్ళం. దాని పేరు 12 ప్రోగుల డైమెండ్ సన్ DNA తో ఉన్నప్పుడు మనల్ని *"ఏంజెలిక్ హ్యూమన్"* అని పిలిచేవారు.

💫 24 స్ట్రాండ్ DNA ని కలిగి ఉన్నప్పుడు డబుల్ డైమండ్ సన్ DNAలేదా ఎమరాల్డ్ సన్ DNA అని పిలిచేవారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో స్థాయిలు ఉన్నాయి. గోల్డెన్ సన్ DNA, ప్లాటినమ్ సన్ DNA మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఈ సిలికేట్ మ్యాట్రిక్స్ లో మానవుడు= 12 ప్రోగుల డైమండ్ సన్ DNA ని కలిగి ఉంటాడు. సిలికెట్ మ్యాట్రిక్స్ అంటే నిద్రాణమై ఉన్న మానవ DNA పరిణామ సంభావ్యత అని అర్థం.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 26 / Sri Vishnu Sahasra Namavali - 26 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*మిధునరాశి- పునర్వసు నక్షత్ర 2వ పాద శ్లోకం*

*26. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః |*
*సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ‖ 26 ‖*

🍀. సుప్రసాదః --- 
అనంతమైన దయగలవాడు; అనుగ్రహ స్వరూపుడు; శుభకరమగు ఫలములను ప్రసాదించువాడు. 

🍀. ప్రసన్నాత్మా --- 
సర్వకాల సర్వావస్థలయందును ప్రసన్నమైన, ప్రశాంతమైన మనసు గలవాడు; రాగాదులచే ప్రభావితము కానివాడు. 

🍀. విశ్వసృట్, విశ్వసృడ్ --- 
విశ్వమును సృజించినవాడు; 

 🍀. విశ్వధృగ్ --- విశ్వమును తన అధీనములో ధరించి, బాగోగులు గమనించువాడు. (పాఠాంతరములు) విశ్వసృగ్, విశ్వసృష్ట్ 

🍀. విశ్వభుగ్విభుః --- 
'విశ్వ భుగ్ విభుః' అంతటను వ్యాపించి అన్నింటిని రక్షించువాడు. 

శంకరాచార్యులు రెండు వేరువేరు నామములుగా వ్యాఖ్యానించిరి. 
🍀. విశ్వభుగ్ --- జీవరూపమున విశ్వమును అనుభవించువాడు, భక్షించువాడు; అన్ని అనుభూతులను తనయందు లీనము చేసికొనును; అన్ని దిశలందును విస్తరించి విశ్వమును ఏర్పరచాడు . 
🍀. విభుః --- హిరణ్య గర్భుడై, అనేక రూపములు ధరించి, విశ్వమంతయును నిండి వెలుగుచున్న పరమేశ్వరుడు; సర్వము తానె యైనవాడు; అన్ని చోట్ల అన్నింటిని నింపువాడు; విశ్వమునకు ప్రభువు. 

🍀. సత్కర్తా --- 
సజ్జనులను, పుణ్యవర్తనులను, ధర్మాత్ములను ఆదరించువాడు, సత్కరించువాడు. 

🍀. సత్కృతః --- 
పూజనీయులచేత కూడా పూజింపబడువాడు; లోకైక పూజ్యుడు. 

🍀. సాధుః ---
 (భక్తుల క్షేమమునకు అవుసరమైన పనిని) సాధించువాడు; సాధువర్తనుడు, సదాచార సంపన్నుడు. 

🍀. జహ్నుః ---
 గుహ్యమైనవాడు, కానరానివాడు (మూఢులను విడనాడువాడు) ; ప్రళయకాలమున సమస్తమును లయము చేయువాడు; దోషులకు దూరముగానుండువాడు. 

🍀. నారాయణః --- 
సకలాత్మలకు ఆధారమైనవాడు, జీవసముదాయములకు ఆశ్రయుడు; జగత్తంతయును (లోపల, వెలుపల) వ్యాపించియున్నవాడు; జలములకు (నారములకు) ఆధారము, జలములే నివాసము అయినవాడు; ప్రళయకాలమున జీవులకు నిలయమగువాడు. 

🍀. నరః --- 
నాశనము (తుది) లేనివాడు; నడపించువాడు, నాయకుడు; నిత్యమగు చేతనాచేతనములకు విభూతిగా గలవాడు; జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడపువాడు.. 

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 26 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Midhuna Rasi, Punarvasu 2nd Padam*

*26. suprasādaḥ prasannātmā viśvadhṛgviśvabhugvibhuḥ |*
*satkartā satkṛtaḥ sādhurjahnurnārāyaṇō naraḥ || 26 ||*

🌻 Suprasādaḥ: 
One whose Prasada or mercy is uniquely wonderful, because He gives salvation to Sisupala and others who try to harm Him.
    
🌻 Prasannātmā: 
One whose mind is never contaminated by Rajas or Tamas.
    
🌻 Viśvadhṛg: 
One who holds the universe by his power.
    
🌻 Viśvabhug: 
One who eats up or enjoys or protects the worlds.
    
🌻 Vibhuḥ: 
One who takes various forms
    
🌻 Satkartā: 
One who offers benefits.
    
🌻 Satkṛtaḥ: 
One who is adored even by those who deserve adoration.
    
🌻 Sādhuḥ: 
One who acts according to justice.
    
🌻 Jahnuḥ: 
One who dissolves all beings in oneself at the time of dissolution.
    
🌻 Nārāyaṇaḥ: 
Nara means Atman. Narayana, that is, one having His residence in all beings.
    
🌻 Naraḥ: 
He directs everything, the eternal Paramatma is called Nara.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 14 (Sloka 91 to 100)

🌹. విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 14 🌹

🎤. స్వామి చిన్మయానంద మిషన్
📚. ప్రసాద్ భరద్వాజ

Audio file: Download / Listen     [ Audio file : VS-Lesson-14 Sloka 91 to 100.mp3 ]

https://drive.google.com/file/d/1573E2swFUZlDMuUTb4E9X4z-IB1cedHs/view?usp=sharing

భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః |

ఆశ్రమః శ్రమణః, క్షామః సుపర్ణో వాయువాహనః ‖ 91 ‖

ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః |

అపరాజితః సర్వసహో నియంతాఽనియమోఽయమః ‖ 92 ‖

సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః |

అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః ‖ 93 ‖

విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః |

రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ‖ 94 ‖

అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః |

అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠానమద్భుతః ‖ 95 ‖

సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః |

స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ‖ 96 ‖

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః |

శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ‖ 97 ‖

అక్రూరః పేశలో దక్షో దక్షిణః, క్షమిణాంవరః |

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ‖ 98 ‖

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః |

వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః ‖ 99 ‖

అనంతరూపోఽనంత శ్రీర్జితమన్యుర్భయాపహః |

చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ‖ 100 ‖

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ విష్ణు సహస్ర నామములు - 26 / Sri Vishnu Sahasra Namavali - 26

🌹.   శ్రీ విష్ణు సహస్ర నామములు - 26 / Sri Vishnu Sahasra Namavali - 26  🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

మిధునరాశి- పునర్వసు నక్షత్ర 2వ పాద శ్లోకం

26. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః |

సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ‖ 26 ‖

🍀. సుప్రసాదః ---
అనంతమైన దయగలవాడు; అనుగ్రహ స్వరూపుడు; శుభకరమగు ఫలములను ప్రసాదించువాడు.

🍀. ప్రసన్నాత్మా ---
సర్వకాల సర్వావస్థలయందును ప్రసన్నమైన, ప్రశాంతమైన మనసు గలవాడు; రాగాదులచే ప్రభావితము కానివాడు.

🍀. విశ్వసృట్, విశ్వసృడ్ ---
విశ్వమును సృజించినవాడు;

🍀. విశ్వధృగ్ --- వి
శ్వమును తన అధీనములో ధరించి, బాగోగులు గమనించువాడు. (పాఠాంతరములు) విశ్వసృగ్, విశ్వసృష్ట్

🍀. విశ్వభుగ్విభుః ---
'విశ్వ భుగ్ విభుః' అంతటను వ్యాపించి అన్నింటిని రక్షించువాడు.

శంకరాచార్యులు రెండు వేరువేరు నామములుగా వ్యాఖ్యానించిరి.

🍀. విశ్వభుగ్ --- 
జీవరూపమున విశ్వమును అనుభవించువాడు, భక్షించువాడు; అన్ని అనుభూతులను తనయందు లీనము చేసికొనును; అన్ని దిశలందును విస్తరించి విశ్వమును ఏర్పరచాడు .

🍀. విభుః --- 
హిరణ్య గర్భుడై, అనేక రూపములు ధరించి, విశ్వమంతయును నిండి వెలుగుచున్న పరమేశ్వరుడు; సర్వము తానె యైనవాడు; అన్ని చోట్ల అన్నింటిని నింపువాడు; విశ్వమునకు ప్రభువు.

🍀. సత్కర్తా ---
సజ్జనులను, పుణ్యవర్తనులను, ధర్మాత్ములను ఆదరించువాడు, సత్కరించువాడు.

🍀. సత్కృతః ---
పూజనీయులచేత కూడా పూజింపబడువాడు; లోకైక పూజ్యుడు.

🍀. సాధుః ---
(భక్తుల క్షేమమునకు అవుసరమైన పనిని) సాధించువాడు; సాధువర్తనుడు, సదాచార సంపన్నుడు.

🍀. జహ్నుః ---
గుహ్యమైనవాడు, కానరానివాడు (మూఢులను విడనాడువాడు) ; ప్రళయకాలమున సమస్తమును లయము చేయువాడు; దోషులకు దూరముగానుండువాడు.

🍀. నారాయణః ---
సకలాత్మలకు ఆధారమైనవాడు, జీవసముదాయములకు ఆశ్రయుడు; జగత్తంతయును (లోపల, వెలుపల) వ్యాపించియున్నవాడు; జలములకు (నారములకు) ఆధారము, జలములే నివాసము అయినవాడు; ప్రళయకాలమున జీవులకు నిలయమగువాడు.

🍀. నరః ---
నాశనము (తుది) లేనివాడు; నడపించువాడు, నాయకుడు; నిత్యమగు చేతనాచేతనములకు విభూతిగా గలవాడు; జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడపువాడు..

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹   Vishnu Sahasra Namavali - 26  🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Midhuna Rasi, Punarvasu 2nd Padam

26. suprasādaḥ prasannātmā viśvadhṛgviśvabhugvibhuḥ |
satkartā satkṛtaḥ sādhurjahnurnārāyaṇō naraḥ || 26 ||

🌻 Suprasādaḥ:
One whose Prasada or mercy is uniquely wonderful, because He gives salvation to Sisupala and others who try to harm Him.

🌻 Prasannātmā:
One whose mind is never contaminated by Rajas or Tamas.

🌻 Viśvadhṛg:
One who holds the universe by his power.

🌻 Viśvabhug:
One who eats up or enjoys or protects the worlds.

🌻 Vibhuḥ:
One who takes various forms

🌻 Satkartā:
One who offers benefits.

🌻 Satkṛtaḥ:
One who is adored even by those who deserve adoration.

🌻 Sādhuḥ:
One who acts according to justice.

🌻 Jahnuḥ:
One who dissolves all beings in oneself at the time of dissolution.

🌻 Nārāyaṇaḥ:
Nara means Atman. Narayana, that is, one having His residence in all beings.

🌻 Naraḥ:
He directs everything, the eternal Paramatma is called Nara.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

02 Oct 2020

అద్భుత సృష్టి - 43

🌹.   అద్భుత సృష్టి - 43   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 16.సిలికేట్ మాట్రిక్స్🌻

సిలికేట్ మ్యాట్రిక్స్ DNA అనేది DNA యొక్క పన్నెండు ప్రోగులను సంక్రియం చేసే పద్ధతి. 12 ప్రోగుల DNA యాక్టివేషన్ ద్వారా శరీరం నశించకుండా (మరణించకుండా) ఉన్నత తలాలకు ప్రయాణించ గలిగే స్థితికి మారుతుంది.

💠. స్పటికాకార బ్లూప్రింట్ ని మార్చడం:-

ఒకప్పుడు ఈ భూమి అత్యున్నతమైన స్థాయిలో ఉండేది. ఆ సమయంలో ఈ భూమి యొక్క ఆత్మ పేరు "తారా"; ఈ భూమి 12 ఉన్నత లోకాల స్థాయి శక్తిని కలిగి ఉండేది కానీ ఇప్పుడు ఆ స్థాయి మార్చబడింది.

12 శక్తి స్థాయిలు కలిగిన ఈ భూమి రెండు శక్తి స్థాయిలకు దిగిపోయిన తరువాత ఈ భూమిని "గెయియా" అనే ఆత్మ పరిపాలిస్తోంది.

💫. ఈ భూమిపైకి మానవులు భగవంతుని యొక్క రూపురేఖలతో దైవమానవునిగా సృష్టించబడ్డారు. ఇతని DNA లో 12 ఉన్నత స్వర్గాల యొక్క జన్యు నిర్మాణం కలిగి ఉండేది. ఈ మానవుని "ఎమరాల్డ్ DNA ఆర్డర్ ఫౌండర్ రేస్ మానవుడు" అనేవారు.

💫. ఇప్పుడు మానవుడు తన డీఎన్ఏలో మొదటి జన్యుజ్ఞానాన్ని కోల్పోయి (12 స్థాయిల నుండి రెండు స్థాయిలకు దిగిపోయాడు) అతి సామాన్యుడిగా ఉన్నాడు. ఈ స్థితిని మార్చి తిరిగి అతనికి పూర్వవైభవాన్ని పొందేలా చేయడమే "DNA సంక్రియ". అంటే "DNA సంక్రియ" అనేది కణస్థాయి నుండి తీసుకొని రావలసిన మార్పు. మన DNAలో గుప్త జ్ఞానం దాగి ఉంది. ఈ గుప్త జ్ఞానం ఉన్న DNAని "జంక్ DNA" అన్నారు. ఈ DNAలో ఉన్నత తలాల సమాచారం, ఉన్నత జ్ఞానం, శక్తి నిక్షిప్తం చేయబడి ఉన్నాయి.

💠. డైమండ్ సన్ DNA కోడ్:-

మనల్ని మొదట దైవ మానవునిగా తయారు చేసినప్పుడు మనం అత్యధికమైన DNA స్థాయిని కలిగి ఉండే వాళ్ళం. దాని పేరు 12 ప్రోగుల డైమెండ్ సన్ DNA తో ఉన్నప్పుడు మనల్ని "ఏంజెలిక్ హ్యూమన్" అని పిలిచేవారు.

💫 24 స్ట్రాండ్ DNA ని కలిగి ఉన్నప్పుడు డబుల్ డైమండ్ సన్ DNAలేదా ఎమరాల్డ్ సన్ DNA అని పిలిచేవారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో స్థాయిలు ఉన్నాయి. గోల్డెన్ సన్ DNA, ప్లాటినమ్ సన్ DNA మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఈ సిలికేట్ మ్యాట్రిక్స్ లో మానవుడు= 12 ప్రోగుల డైమండ్ సన్ DNA ని కలిగి ఉంటాడు. సిలికెట్ మ్యాట్రిక్స్ అంటే నిద్రాణమై ఉన్న మానవ DNA పరిణామ సంభావ్యత అని అర్థం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

02 Oct 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 66

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 66 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 30 🌻

చిత్తము ఏకాగ్రము అవడము అంటే అర్ధము ఏమిటంటే మానవ ఉపాధియందు అంతఃకరణముగా వున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటి నాలుగు పనిముట్లు దానియొక్క ఆధారమైనటువంటి జ్ఞాత స్థానములో లయించిపోయినవి. అట్టి జ్ఞాత పరిణామ రహితమైనటువంటి కూటస్థునియందు చేరిపోయింది. ఈ చెరిపోయేటటువంటి విధానాన్నే చిత్తైకాగ్రత అంటారు.

ఏ కూటస్థ శబ్దమైతే నీకు బ్రహ్మముగా బోధించబడుతుందో, బ్రహ్మాండ పంచీకరణకు ఆద్యముగా ప్రధమస్థానమందున్న కూటస్థ పదము ఏదైతే వున్నదో, ఆ కూటస్థ పదము చాలా ముఖ్యమైనటువంటిది. అట్టి కూటస్థ స్థితికి చేరాలి అంటే జ్ఞాతకి కూటస్థుడికి బేధం లేదు అనేటటువంటి స్థితిని నువ్వు సాధించాలి. అంటే అర్ధమేమిటంటే ప్రత్యగాత్మ బ్రహ్మ ఈ రెండూ ఒక్కటే.

జ్ఞాత ప్రత్యగాత్మ. కూటస్థుడు బ్రహ్మము. ఈ ప్రత్యగాత్మ బ్రహ్మ అభిన్నులు అనేటటువంటి నిర్ణయాత్మక జ్ఞానాన్ని నువ్వు పొందాలి. అలాంటి స్థితిని పొందినప్పుడు మాత్రమే ఈ ఓంకార వాచ్యమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయం వైపుకు నీ స్ఫురణ పనిచేయడం మొదలుపెడుతుంది.

ఎవరైతే నేను కూటస్థుడను, నేను బ్రహ్మమును, నేను పరిణామము లేనివాడను, నేను ఏ మార్పూ లేనివాడను, నేను స్థాణువును, నేను నిరహంకారిని, నేను నిర్గుణుడను, నేను నిరవయవుడును, నేను నిరంజనుడను, నేను నిర్మలుడను అనేటటువంటి నకార పూర్వక లక్షణాలన్నీ ఆ కూటస్థ స్థితిలో ప్రాప్తించడం ప్రారంభిస్తాయి.

ఈ లక్షణముల ద్వారానే పరబ్రహ్మమును స్ఫురింపచేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆట్టి పరబ్రహ్మమును తెలుసుకోవాలి అంటే ఓంకారమును నాలుగు పద్ధతులుగా ఆశ్రయించవచ్చు. అకార ఉకార మకారములనే త్రిమాత్రుకాయుత ప్రణవ ధ్యానం ద్వారా ఆశ్రయించవచ్చు.

అలా కాకుండా (త్రిమాతృకలు కాకుండా) ఒక్కొక్క మాత్రనీ పట్టుకుని ఆశ్రయించేటటువంటి బీజాక్షరములను పట్టుకుని ఉపాసించే విధానమూ కలదు. ఇది కాకుండా అమతృకాయుత పద్ధతిగా కేవల లయయోగ విధాన పద్ధతిగా ఆశ్రయించేటటువంటి పద్ధతిగా కూడా ఓంకారోపాసన చేయవచ్చును.

కారణమేమిటంటే ఈ నాలుగు మాత్రలు కూడా నాలుగు అవస్థలను, నాలుగు శరీరాలను, నాలుగు మాత్రలను తెలియజేస్తూ వున్నవి. నాలుగు శరీరములు ఏమిటివీ - స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరములు. వీటి యొక్క వివరణ అంతా కూడా సాంఖ్య విచారణలో స్పష్టముగా బోధించబడుచున్నది. ఉత్తరత్తరా రాబోయేటటువంటి బోధలో అవి కూడా వివరించబడతాయి.

స్థూల శరీరము అంటే తనకు తా కదలనది ఏదియో అది స్థూల శరీరము. సూక్ష్మ శరీరము - చలించుచున్నట్లు కనబడుతున్నప్పటికి స్వయముగా చలింపజాలనిది ఏదియో అదియే సూక్ష్మ శరీరము. స్థూల సూక్ష్మ వ్యవహారము - తాత్కాలికముగా ఉడిగినటువంటి స్థితి ఏదైతే కలదో అది కారణ శరీరము. ఇది కూడా స్వయముగా చలింపజాలదు.

మహా కారణ శరీరము - స్థూల సూక్ష్మ కారణ శరీరములను చలింపజేయుచు తనకు తా స్వయముగా కదులుచున్నట్లు కనపడుచున్నది ఏదో అది మహాకారణ శరీరము. కాబట్టి క్రిందున్న మూడింటికి లయస్థానమూ అయివున్నది, తనకు తా కదలగలిగే శక్తి కలిగి వున్నది, ఇతరులను కలిగించగలిగే శక్తి కూడా కలిగినటువంటి మహాకారణ శరీరము ఏదైతే వున్నదో అది నాలుగవ శరీరము.

ఇవే మరల మనం నాలుగవస్థలుగా దర్శించవచ్చు. అంటే అర్ధమేమిటి? జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయములు. జాగ్రత్ స్వప్న సుషుప్తులు తమకు తా పనిచేస్తున్నట్లుగా కనబడుతున్నవి గానీ స్వయముగా పనిచేయడం లేదు.

ప్రతిఒక్కరూ జాగ్రదావస్థలో తనకు తా అన్ని పనులను చేస్తున్నట్లుగా చలనములు పొందుతున్నట్లుగా, చలనశీలత కలిగి వున్నట్లుగా, సర్వకర్మలను ఆచరిస్తున్నట్లుగా, ఆచరణ శీలత కలిగివున్నట్లుగా తోచుచున్నప్పటికీ కర్మ వశాత్తూ వారి వారి యొక్క పుణ్య పాప ఫలములను స్వయంకృతములను అనుభవించుట చేత వారు కదులుతున్నట్లు కనబడుతున్నది గానీ స్వయముగా వారికి కదలగలిగే శక్తి లేదు.

అట్లే స్వప్నావస్థయందు ఇంద్రియములు ఏమియూ లేకున్నను చలనశీలమైనట్టి మనసనే ఇంద్రియము ద్వారా మనో బుద్ధి చిత్త అహంకారముల మధ్య ఏర్పడుతున్న మనో వ్యాపార వ్యవహారము చేత కదులుతున్నట్లు కనపడుతున్ననూ అది కూడా స్వయముగా కదలగలిగే శక్తి లేనటువంటిది.

సుషుప్త్యావస్థ యందు జాగ్రత్ స్వప్నములందు ఏర్పడుతున్న కదలికలన్నియు లేమితనమును పొంది సుప్తచేతనావస్థ తాత్కాలికముగా నిరోధించబడి నిగ్రహించబడినట్లు కనబడుచున్నను స్వయముగా కదలిక లేనటువంటి శక్తి లేనందువల్ల జడముగా పడియుండుట అనేటటువంటి స్థితియందు తాను సాక్షిగా నిలబడివున్నటువంటి ప్రజ్ఞా స్వరూపముగా సుషుప్త్యావస్థ జరుగబడుచున్నది. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

02 Oct 2020

గీతోపనిషత్తు - 42

🌹. గీతోపనిషత్తు - 42 🌹

🍀 2. శ్రద్ధ - భక్తి - ప్రతిదినము కర్మల నాచరించువాడు సంగము లేక ఆచరించినచో అతడు ఉత్తమ కర్మిష్ఠిగ నుండగలడు. 🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚.   కర్మయోగము - 07  📚

7. యస్యింద్రియాణి మనసా నియమ్యారభతేఖర్జున |

కర్మేంద్రియై: కర్మయోగ మసక్త స్ప విశిష్యతే ||

తమను తాము కర్మలయందు బంధించుకొనక జీవించు విధానము శ్రీకృష్ణుడు ఈ క్రింది విధముగ తెలుపుచున్నాడు. వీనిని శ్రద్ధతో అధ్యయనము చేసి అనుసరించిన వానికి జీవితము ఒక క్రీడగ సాగును. అట్లు కానిచో జీవితమున బంధము తప్పదు.

అసక్తస్స, ఆరభతే, కర్మయోగమ్ : ప్రతిదినము కర్మల నాచరించువాడు సంగము లేక ఆచరించినచో అతడు ఉత్తమ కర్మిష్ఠిగ నుండగలడు. సంగము లేక కర్మలాచరించుట యనగ, తన కర్తవ్యమును తను శ్రద్ధా భక్తులతో నిర్వర్తించుట. ఫలితములవైపు మనస్సును పోనీయకుండుట. అనగా తినునపుడు, మాటాడునపుడు, పనులు చేయుచున్నపుడు వానియందు పరిపూర్ణమైన శ్రద్ధ, భక్తి ఉండవలెను.

వానిని నిర్వర్తించు తీరు తెలుసుకొని అట్లే నిర్వర్తించుచు నుండవలెను. ఎక్కువ తక్కువలు చేయరాదు. ఫలితముల వైపుకు మనస్సును పోనీయరాదు.

విద్యార్థులకు విద్యయందు శ్రద్ధ ఉండవలెను గాని మార్కుల యందు గాదు. పని చేయువాడు పనియందు శ్రద్ధగాని నెలసరి భత్యమునందు కాదు. ఇట్లు సమస్తమునందు శ్రద్ధాపూరిత కర్తవ్య నిర్వహణమే కాని, ఇతరము లందు ఆసక్తి జనింపరాదు.

ప్రస్తుత మెప్పుడును కర్తవ్యమునే బోధించుచుండును. దానిని గ్రహించి నిర్వర్తించుటే మార్గము. చిన్నతనము నుండి ఈ పద్ధతి నభ్యసించినచో మనిషి కర్మ నిర్వహణమున శ్రేష్ఠముగ నిలచియుండును. (3-7)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

WhatsApp, Telegram, Facebook groups:

02 Oct 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 124

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 124 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నరనారాయణ మహర్షులు - 5 🌻

29. పవిత్రభావంతో ఋషుల చరిత్ర వింటే, ఋషి ఋణం తీరుతుంది. ఋషి ఋణం తీరితే, మిగిలిన ఋణాలు సులభంగా తీరుతాయి. ఋషులు అనుగ్రహిస్తే పితృఋణం తీరుతుంది. వారి అనుగ్రహముంటే ఉత్తమ సర్మ ఫలాలు వస్తాయి. ఋషులు మనమీద అనుగ్రహిస్తే సమస్త యజ్ఞఫలాలూ ఇవ్వగలరు. వాళ్ళ నామస్మరణ మాత్రం చేత, ఇన్ని యజ్ఞాలుచేసే పనిలేకుండానే ఫలంవస్తుంది. 

30. ఒక్క ఋషి మాత్రమే – ఒక్కక్షణం మనను అనుగ్రహిస్తే చాలు; నూరు అశ్వమేధయాగాల ఫలం లభిస్తుంది. అంతటి సమర్థుల ఋషులు. అడిగి తెచ్చుకోవాలి. భక్తియుక్తులు, శ్రద్ధ ఉండాలి. మనం దేవతాధ్యానం సంప్రదాయపరంగా చేస్తూంటాంకాని; ఋషులచరిత్రవలన మనకు కలిగే ఫలాలు, దేవతానుగ్రహంవలనకూడా మనకు కలగనంతటి ఉత్కృష్టమైనవి.

31. ఋషులకు సహజంగా మనం సంతానంకాబట్టి, వాళ్ళకు మన యందున్న శ్రద్ధ, అనుగ్రహం దేవతలకు ఉండదు. దేవతలు కర్మాధీనులై ఉంటారు. కర్మవలన, యజ్ఞంవలన దానికి నిర్ణీతమైన సంప్రదాయంలో, శాస్త్రంలో స్మృతులలో ఎలా చెప్పబడి ఉన్నదో అలాంటి ఫలాన్నే వాళ్ళు ఇస్తారు. దానినే అనుగ్రహం అంటారు. కానీ కాస్త భక్తికి అపరిమితంగా సంతోషించి ఇచ్చే ఫలాలన్నీ దైవసంపత్తి – ఈశ్వరుడియొక్క లక్షణములు. ఈశ్వరుడియొక్క లక్షణములు ఋషులయందున్నాయి. 

32. ఈశ్వరుడు కర్మాధీనుడు కాడు. దేవతలు కర్మాధీనులు. భవంతుడు అలా కాదు. ఒక్క తులసీదళాన్ని భక్తితో సమర్పిస్తే, తీసుకుని మోక్షాన్నే అనుగ్రహిస్తాడు. లేదా వందసంవత్సరాలు ఈ భూమిని పరిపాలించమని చక్రవర్తిని చేసి తరువాత మోక్షాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన ఇవ్వటానికి పరిధులులేవు. ఆయన అనుగ్రహానికి అవధులులేవు. కాబట్టి ఋషులు ఈశ్వరస్వరూపులు అనబడతారు.

33. కాబట్టే ఋషుల ఆరాధన ఈశ్వరారాధనతో తుల్యమై అంతటి ఫలాన్ని ఇవ్వగలదు. వాళ్ళు ఈశ్వరుణ్ణి చూపించగలరు. జ్ఞానాన్ని ఇవ్వగలరు. వాళ్ళ అనుగ్రహానికి అవధిలేదు. అందుకని ఈశ్వరారాధన, నిష్కళంకమైన భక్తి అది అందరికీ సులభంగా లభ్యమయ్యే వస్తువు కాదు. కనుక, ఈశ్వరుడి యందు అట్టి భక్తిని ఇవ్వమని అడిగితే, ఋషి ఇవ్వగలడు. మహర్షులే గురువు అనేభావన, సంప్రదాయం ఈ ఋషులవల్లనే. 

34. ఇట్టి మహాత్ములుండటంచేతనే ఇది మనకు సిద్ధించిన సంప్రదాయం. ఈ సంప్రదాయం ఇతర మతాలలో లేదు. దీనిని యథార్థంగా నమ్మి ఆ విశ్వాసంతో ఆరాధన చేసినట్లయితే, మన భవిష్యత్తంతా ఋషిప్రోక్తమయిన గురువులుగా, వాళ్ళను తండ్రులుగా, రక్షకులుగా భావించి ఈశ్వరుడిని చేరే మార్గం అర్థించటంలోనే – మన భవిష్యత్తుంది.

35. ఋషులు నిగ్రహానుగ్రహ సమర్థులు. త్రిమూర్తులను చూచినవారు, త్రిమూర్తులనుకూడా శాపగ్రస్తులను చేయగలిగినవాళ్ళు. అపరిమితమయిన శక్తిసామర్థ్యాలు కలిగినటువంటివాళ్ళు. మన భౌతికమైన జీవనవిధానంలో సుఖదుఃఖాలకు హేతువులు పాపపుణ్యాలు. 

36. పుణ్యం చేసినా, పాపం చేసినా మనం అల్పమైన శక్తిసంపదలు కలిగిన వాళ్ళమేకాబట్టి; మనకు భౌతికమైన క్షేమాన్ని, సుఖాన్ని ఇవ్వాలంటే, ఈ లోకంలో మనక్షేమాన్ని కోరేవాళ్ళు, మన తండ్రులైన ఋషులే శరణ్యం. వారే ఇక్కడ మనకు సుఖాన్నిస్తారు. ఇవాళ పుణ్యంచేస్తే ఫలితం ఎప్పుడో వస్తుంది మనబోటి సామాన్యులకు. 

37. కాని, మనగోత్ర ఋషినిగాని, మహాత్ములైన ఋషులనుకాని, ఋషులరూపంలో ఉన్న గురువులనుకాని ఆశ్రయిస్తే; పుణ్యం ఉన్నాలేకపోయినా ఆ ఫలాన్ని ఇప్పుడే ఇవ్వగల సమర్థులు వాళ్ళు. మన కర్మకాండ, స్మృతులు, మంత్రములు అన్నీ ఋషిప్రోక్తాలే. వాళ్ళ అనుగ్రహంతో మనకు లభించినటువంటి మార్గాలే ఇవన్నీ. 

38. ప్రతి మంత్రానికీ దేవతవలె, ఋషికూడా ఒకరున్నారుకదా! అంతే, ఆ మంత్రోపాసనతో ఆ దేవతను ఏ విధంగా ఆరాధన చేయాలో, తద్వారా ఏ ఫలం పొందవచ్చో మనకు చెప్పింది ఋషులే. మరి వారిని స్మరిస్తే ఇక మనకు మిగిలేది ఏముంది?

39. ఒక ముఖ్య విషయం – బ్రాహ్మణులైన మహర్షులు నేడు కూడా బ్రహ్మలోకానికి దిగువన తపోలోకంలో ఉన్నారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:

02 Oct 2020

శ్రీ శివ మహా పురాణము - 236

🌹 .   శ్రీ శివ మహా పురాణము - 236   🌹
 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
51. అధ్యాయము - 6

🌻. సంధ్య తపస్సును చేయుట - 6 🌻

తన్మధ్యే స దదౌ కన్యా విధవే సప్తవింశతిః | 
చంద్రోsన్యాస్సంపరిత్యజ్య రోహిణ్యాం ప్రీతిమానభూత్‌ || 55

తద్ధేతోర్హి యదా చంద్రశ్శప్తో దక్షేణ కోపినా |
తదా భవత్యా నికటే సర్వే దేవాస్సమాగతాః || 56

న దృష్టాశ్చ త్వయా సంధ్యే తే దేవా బ్రహ్మాణా సహ | 
మయి విన్యస్త మనసా ఖం చ దృష్ట్వా లభేత్పునః || 57

చంద్రస్య శాపమోక్షార్థం జాతా చంద్రనదీ తదా | 
సృష్టా ధాత్రా తదైవాత్ర మేధాతిథి రుపస్థితః || 58

ఆ కన్యలలో ఇరవై ఏడు మందిని ఆయన చంద్రునకిచ్చి వివాహము చేసెను. చంద్రుడు ఇతరభార్యలను పట్టించుకొనక, రోహిణి యందు మాత్రమే ప్రీతిని కలిగియుండెను (55). ఆ కారణముచే దక్షుడు కోపించి చంద్రుని శపించగా దేవతలందరు నీవు ఉన్న ఈ చోటకు వచ్చిరి (56)

ఓ సంధ్యా!బ్రహ్మతో కూడి వచ్చిన ఆ దేవతలను నాయందు లగ్నమైన మనస్సుగల నీవు చూడలేదు. బ్రహ్మ ఆకసమును చూచి, చంద్రుడు తన పూర్వ రూపమును ఎట్లు పొందునో యని చింతిల్లెను (57).

బ్రహ్మ చంద్రుని శాపవిముక్తి కొరకు చంద్రభాగానదిని సృష్టించెను. అదే సమయములో అచటకు మేధాతిథి విచ్చేసెను | (58).

తపసా తత్సమో నాస్తి న భూతో న భవిష్యతి | 
యేన యజ్ఞస్సమారబ్ధో జ్యోతిష్టోమో మహావిధిః || 59

తత్ర ప్రజ్వలితో వహ్నిస్తస్మింస్త్యజ వపుస్స్వకమ్‌ |
 సుపవిత్రా త్వమిదానీం సంపూర్ణోsసుతు పణస్తవ || 60

ఏతన్మయా స్థాపితం తే కార్యార్థం భో తపస్విని | 
తత్కురుష్వ మహాభాగే యాహి యజ్ఞే మహామునేః || 61

తస్యా హితం చ దేవేశస్తత్రై వాంతరధీయత || 62

ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సంధ్యా చరిత్ర వర్ణనం నామ షష్ఠోsధాయః (6).

తపస్సులో ఆయనతో సమానమైన వాడు మరియొకడు లేడు. ఉండబోడు. ఆయన అతివిస్తృతమైన జ్యోతిష్టోమమనే యజ్ఞమునారంభించినాడు (59).

అచట అగ్ని ప్రకాశించుచున్నది. నీవు నీ దేహమును దానియందు విడువుము. ఇప్పుడు నీవు మిక్కిలి పవిత్రురాలవు. నీ ప్రతిజ్ఞ నెరవేరుగాక! (60).

ఓ తపస్వినీ! ఈ తీరున నేను నీ కార్యములను సిద్దింపజేసితిని. ఓ మహాత్మురాలా!నేను చెప్పినట్లు చేయుము. ఆ మహాముని యజ్ఞము చేయుచున్న చోటకు వెళ్లుము (61).

ఇట్లు దేవదేవుడు ఆమెకు హితమునుపదేశించి అచటనే అంతర్ధానము నొందెను (62).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండమునందు సంధ్యా చరిత్ర వర్ణనమనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము