📚. ప్రసాద్ భరద్వాజ
🌻 30. నిధిరవ్యయః, निधिरव्ययः, Nidhiravyayaḥ 🌻
ఓం నిధయేఽవ్యయాయ నమః | ॐ निधयेऽव्ययाय नमः | OM Nidhaye’vyayāya namaḥ
(ప్రళయకాలేన అస్మిన్ సర్వం) నిధీయతే ప్రళయకాలమున సర్వమునూ ఇతనియందే ఉంచబడును. ఈ 'నిధి' శబ్ధమునకు 'అవ్యయః' (వినాశనము లేనిది; 13వ దివ్య నామము) అనునది విశేషము. తరగని నిధి.
:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయం ॥ 18 ॥
పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగిన వాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయియున్నాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 30 🌹
📚. Prasad Bharadwaj
🌻 30.Nidhiravyayaḥ 🌻
Nidhaye’vyayāya namaḥ
The changeless and indestructible Being in whom the whole universe becomes merged and remains in seminal condition at the time of Pralaya or cosmic dissolution.
Bhagavad Gīta - Chapter 9
Gatirbhartā prabhussākṣī nivāsaśśaraṇaṃ suhr̥t,
Prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayaṃ. (18)
I am the goal, the sustainer, the master, the witness, the abode, the refuge, and the most dear friend. I am the creation and the annihilation, the basis of everything, the resting place and the eternal seed.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः ।सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥
సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥
Sarvaśśarvaśśivasthāṇurbhūtādirnidhiravyayaḥ ।Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 31 / Vishnu Sahasranama Contemplation - 31 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 31. సంభవః, संभवः, Saṃbhavaḥ 🌻
ఓం సంభవాయ నమః | ॐ संभवाय नमः | OM Saṃbhavāya namaḥ
స్వేచ్ఛాయా సిద్ధం సమీచీనం భవనం సంభవః అస్య ఇతనికి మన అందరికివలె కర్మవశమున కాక ఆయా అవతారములలో తన స్వేచ్ఛ చేతనే లెస్సయగు ఉనికి కలదు. ఈ అర్థమున 'సం - భవః' అను రెండు శబ్దరూపముల కలయికచే సంభవః ఐనది.
:: భగవద్గీత - జ్ఞాన యోగము ::
అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ॥ 6 ॥
నేను పుట్టుకలేనివాడను, నాశరహితస్వరూపముకలవాడను, సమస్తప్రాణులకు ఈశ్వరుడను అయియున్నప్పటికి స్వకీయమగు ప్రకృతిని వశపఱచుకొని నా మాయాశక్తిచేత అవతరించుచున్నాను.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ 8 ॥
సాధు సజ్జనులను సంరక్షించుటకొఱకును, దుర్మార్గులను వినాశమొనర్చుట కోఱకును, ధర్మమును లెస్సగ స్థాపించుట కొఱకును నేను ప్రతియుగము నందున అవతరించుచుందును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 31 🌹
📚. Prasad Bharadwaj
🌻 31.Saṃbhavaḥ 🌻
OM Saṃbhavāya namaḥ
One born out of His own will as incarnation. As like us, He does not need to take birth to clear the accumulated Karma; rather He incarnates out of His own will when He needs to.
Bhagavad Gitā - Chapter 4
Ajo’pi sannavyayātmā bhūtānāmīśvaro’pi san,
Prakr̥tiṃ svāmadhiṣṭhāya saṃbhavāmyātmamāyayā. (6)
Though I am birthless, undecaying by nature, and the Lord of beings, (still) by subjugating My Prakr̥ti, I take birth by means of My own Māyā.
Paritrāṇāya sādhūnāṃ vināśāya ca duṣkr̥tām,
Dharmasaṃsthāpanārthāya saṃbhavāmi yuge yuge. (8)
O scion of Bharatha dynasty, whenever there is a decline of virtue and increase of vice, then do I manifest Myself.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः ।सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥
సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥
Sarvaśśarvaśśivasthāṇurbhūtādirnidhiravyayaḥ ।Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
02 Oct 2020
No comments:
Post a Comment