శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 351-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 351-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 351-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 351-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀
🌻 351-2. 'వామకేశీ' 🌻
సృష్టి యందు ద్వంద్వములు తప్పవు. అనుకూలము నుండి ప్రతికూలము పుట్టుచు నుండును. దీని కెన్నియో ఉదాహరణము లుండును. రాముని యందు అమితమైన అనుకూలవతియైన కైకేయి ప్రతికూలమైనది కదా! మిత్రులు శత్రువు లగుట, అనుకూలురు ప్రతికూలు రగుట జరుగుచు నుండును. మంచిని చెడు, శాంతిని అశాంతి, వెలుగును చీకటి, వృద్ధిని అంతము ఎప్పుడునూ ఎదుర్కొను చుండును. ఉత్తర దక్షిణ ధ్రువములు ఒక దానికొకటి ప్రతికూలముగ నుండుట చేతనే భూమి నిలచి యున్నది.
పక్షి రెక్కల వలె కుడికి ఎడమ, ఎడమకి కుడి ఆధారము. ఎడమలేని కుడి, కుడిలేని ఎడమ పక్షికి ఉపయోగపడవు. ప్రజ్ఞ పదార్థముల కలయికయే సృష్టి ప్రజ్ఞ పురుషుడు కాగ ప్రకృతి పదార్థమై అంతయూ యున్నట్లు గోచరించు చున్నది. ఇట్లన్ని విషయములందు అమ్మ వామతత్త్వమై నిలువగ వామదేవుడిగ శివుడు నిలచి యున్నాడు. అంద మంతయు వామ తత్త్వమునదే. గోచరించు సృష్టి అందమైనది. గోచరించని శివుడు అలక్షణుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 351-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala
Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻
🌻 351-2. Vāmakeśī वामकेशी 🌻
Nāma 945 is Vāmakeśvarī which refers to Vāmakeśvara tantra. This tantra is said to be the sixty fifth tantra apart from the sixty four discussed in Saundarya Laharī verse 31 and nāma 236 of this Sahasranāma. Vāmakeśvara tantra is said to be the most important tantra for Śrī Vidyā worship. This tantra discusses on internal worship of Śaktī. Vāmakeśvarī is said to be the source of this Universe.
Śaktī asks Śiva in Vāmakeśvara tantra “Lord, you revealed to me all the sixty four tantra-s. But you have not told me about sixteen Vidyā-s.” Śiva answers by saying that this has not been declared yet and is hidden so far. Then Śiva begins declaring this tantra to Devi. Everything in this tantra has been revealed in a very subtle manner.
To cite an example the bīja hrīṁ is declared as the form of Vidyā protecting the self is Śiva, agni, māyā and bindu. Unless one knows the bīja-s of these gods and goddesses, it is difficult to make out the hidden bīj. Śiva bījā is ha, Agni bījā is ra, māyā bīja (root of īṁ ईं or kāmakalā) is ‘ī’ and bindu is the dot. By joining all this, the bīja hrīṁ is arrived. Śiva declares a number of uncommon yet powerful bīja-s in this tantra.
Vāma-s mean those who worship Her through left hands. They do not follow the five principle yajñā-s that will be discussed in nāma 946 subsequently. She is the Goddess for these left hand worshippers. She is also known as Vāmeśvarī, which refers to Her divine power which projects the universe out of Śiva (the Brahman without attributes) and produces the reverse (vāma) consciousness of difference. Vāmadevā is the back face of Śiva.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
23 Feb 2022
ఓషో రోజువారీ ధ్యానాలు - 143. చీకటిలోకి చూడటం / Osho Daily Meditations - 143. LOOKING INTO DARKNESS
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 143 / Osho Daily Meditations - 143🌹
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 143. చీకటిలోకి చూడటం 🍀
🕉. కొన్నిసార్లు మీరు మీ గదిలోకి వచ్చినప్పుడు చీకటిగా కనిపిస్తుంది. కానీ మీరు కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు, మరియు చీకటి మాయమవుతుంది. గది నిండా వెలుతురు. ఏదో జరిగిందని కాదు. నీ కళ్ళు చీకట్లోకి చూడటం అలవాటైపోయింది అంతే. 🕉
దొంగలు చీకటిలో పని చేయవలసి ఉంటుంది కాబట్టి అందరికంటే స్పష్టంగా చీకటిలో చూడటం ప్రారంభిస్తారని అంటారు. తెలియని ఇళ్లలోకి అడుగుపెట్టి అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంది. వారు ఏదో విషయంలో పొరపాట్లు చేయవచ్చు. క్రమంగా, వారు చీకటిలో చూడటం ప్రారంభిస్తారు. వారికి చీకటి అంత చీకటి కాదు. కాబట్టి భయపడకు. దొంగలా ఉండు. కళ్ళు మూసుకుని కూర్చుని వీలైనంత లోతుగా చీకటిలోకి చూడండి. అది మీ ధ్యానంలా ఉండనివ్వండి. ప్రతిరోజూ ముప్పై నిమిషాలు మూలలో కూర్చుని, కళ్ళు మూసుకుని, చీకటిని సృష్టించండి-మీరు ఊహించినంత చీకటిని సృష్టించండి- ఆపై ఆ చీకటిలోకి చూడండి. కష్టంగా ఉంటే మీ ముందు ఉన్న బ్లాక్‌బోర్డ్ గురించి ఆలోచించండి, చాలా చీకటిగా మరియు నల్లగా ఉంటుంది.
త్వరలో మీరు మరింత చీకటిని ఊహించుకోగలరు. మీరు ఎంత ఎక్కువ చీకటిలోకి చూస్తున్నారో, మీ కళ్ళు అంత స్పష్టంగా మారుతాయని మీరు చాలా ఆశ్చర్యపోతారు. మరియు భయం ఉంటే, దానిని అనుమతించండి. నిజానికి, ఎవరైనా ఆనందించాలి. అది అక్కడ ఉండనివ్వండి; భయం మీలో ఒక నిర్దిష్ట కంపనాన్ని ప్రారంభిస్తే, దానిని అనుమతించండి. వీలైనంత భయపడండి. దాదాపు భయం పట్టుకుంది ... మరియు అది ఎంత అందంగా ఉందో చూడండి. ఇది దాదాపు స్నానం వంటిది; చాలా దుమ్ము కొట్టుకుపోతుంది. ఆ వణుకు నుండి బయటకు రాగానే, మీరు చాలా సజీవంగా, జీవంతో పులకించి, కొత్త శక్తితో పుంజుకున్నట్లు, పునరుజ్జీవింపబడిన అనుభూతి చెందుతారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 143 🌹
📚. Prasad Bharadwaj
🍀 143. LOOKING INTO DARKNESS 🍀
🕉 Sometimes when you come into your room it looks dark. But then you sit and rest, and by and by the darkness disappears. The room is full of light. It is not that something has happened. It is just that your eyes have become accustomed to looking into the darkness. 🕉
It is said that thieves start seeing in the dark more clearly than anybody else, because they have to work in darkness. They have to enter unfamiliar houses, and on every step there is danger. They may stumble upon something. By and by, they start seeing in the dark. Darkness is not so dark for them. So don't be afraid. Be like a thief. Sit with closed eyes and look into the darkness as deeply as possible. Let that be your meditation. Every day for thirty minutes sit in the corner, close your eyes, and create darkness-as dark as you can imagine-and then look into that darkness. If it is difficult just think of a blackboard in front of you, so dark and so black.
Soon you will be able to imagine more darkness. You will be tremendously surprised that the more you look into darkness, the clearer your eyes will become. And if fear is there, allow it. In fact, one should enjoy it. Let it be there; start; trembling. If the fear starts a certain vibration in you, just allow it. Get as frightened as possible. Be almost possessed by fear ... and see how beautiful it is. It is almost like a bath; much dust will be washed away. When you come out of that trembling, you will feel very alive, throbbing with life, pulsating with a new energy, rejuvenated.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
23 Feb 2022
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 154
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 154 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. ప్రకృతి - జీవనము 🌻
ప్రకృతిని గమనించుకొనుచు జీవితమును నడిపించినచో మార్పులను ఏ విధముగా అర్థము చేసికొనవలెనో తెలియును. ఆకలి పుట్టినపుడు అన్నము తినవలెనని తెలియును. వెంటనే అన్నము తిన్నచో కర్తవ్య నిర్వహణము అనబడును. లేక వేదాంతమో వాణిజ్యమో అంతకన్నా ముఖ్యమని ఆలస్యము చేసినచో, మనము ఏర్పరచుకొనిన కార్యక్రమము కర్తవ్యము కాకపోవును.
మన ఇష్టము, అభిమానము వేరు. మనతో పనిచేయుచున్న ప్రకృతి వేరు. ప్రకృతిలో పొరపాటుండదు. ఇష్టాఇష్టములలో పొరపాట్లుండును. వేదాంతము ఎంత గొప్పదియైనను, ఆహారమునకుగల వేళలు అంతకన్నా గొప్పవి కాకపోవచ్చును గాని అంతకన్నా సత్యములు. అయితే ఒకమారు సర్వాంతర్యామి స్మరణము కలిగించు కథలను ఆత్మతో గ్రోలుటకు అలవాటు పడినవాడు లోకవృత్తాంతములైన ఇతర కథలను గ్రోలుటకు యత్నము చేయడు. అవి వానికి గరళము గ్రోలుట వలె నుండును.
........✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
23 Feb 2022
శ్రీ శివ మహా పురాణము - 524 / Sri Siva Maha Purana - 524
🌹 . శ్రీ శివ మహా పురాణము - 524 / Sri Siva Maha Purana - 524 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 45
🌻. శివుని సుందర రూపము - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మునీ! ఇంతలో నీవు విష్ణువుచే ప్రేరితుడై వెంటనే శంభునకు నచ్చజెప్పుటకై ఆయన వద్దకు వెళ్లితివి (1). నీవు దేవకార్యమును చేయగోరి అచటకు వెళ్లి రుద్రుని అనేక విధములగు స్తోత్రములచే స్తుతించి ఆయనకు నచ్చ జెప్పితివి (2). శంభుడు నీ మాటను ప్రీతితో విని తన యాగుణమును ప్రదర్శించువాడై అద్భుతము, ఉత్తమము, దివ్యము అగు రూపమును ధరించెను (3). ఓ మునీ! సుందరము, రూపములో మన్మథుని మించి యున్నది, లావణ్యమునకు పరమనిధానము అగు శంభుని ఆ రూపమును చూచి నీవు చాల ఆనందించితివి (4).
ఓ మునీ! పరమానందమును పొందియున్న నీవు అనేక విధములగు స్తోత్రములచే స్తుతించి మేన ఇతరులందరితో కూడియున్న చోటికి వెళ్లితివి (5). ఓ మునీ! మిక్కిలి ప్రసన్నుడు, అధిక ప్రేమతో నిండియున్న వాడు నగు నీవు అచటకు వచ్చి హిమవంతుని పత్నియగు ఆ మేనను ఆనందింప జేయుచూ ఇట్లు పలికితివి (6).
నారదుడిట్లు పలికెను -
ఓ మేనా! విశాలమగు కన్నులు దానా! సర్వోత్తమమగు శివుని రూపమును చూడుము. కరుణా మూర్తి యగు ఆ శివుడు దయను చూపించినాడు (7).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆ మాటను విని హిమవంతుని పత్నియగు మేన ఆశ్చర్యపడి, పరమానందమును కలుగ జేయునది (8). కోటి సూర్యుల కాంతి గలది, అన్ని అవయవముల యందు సుందరమైనది, రంగు రంగుల వస్త్రములు గలది, అనేక భూషణములచే అలంకరింపబడినది (9), మిక్కిలి ప్రసన్నమైనది, చక్కని చిరునవ్వు గలది, గొప్ప లావణ్యము గలది, మనస్సును హరించునది, తెల్లని కాంతులను వెదజల్లునది, చంద్రవంకతో అలంకరింపబడినది (10), విష్ణువు మొదలగు దేవగణములందరిచే సేవింపబడినది, శిరస్సుపై సూర్యుడు ఛత్రముగా కలది, చంద్రునితో ప్రకాశించునది అగు శివుని రూపమును చూచెను (11). ఆభరణములతో అలంకరింపబడిన శివుడు అన్ని విధములుగా సుందరుడై యుండెను. ఆయన వాహనము యొక్క గొప్ప శోభను వర్ణింప శక్యముకాదు (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 524 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 45 🌴
🌻 Śiva’s comely form and the Jubilation of the Citizens - 1 🌻
Brahmā said:—
1. In the meantime, O sage, urged by Viṣṇu you went immediately to Śiva to conciliate Him.
2. After reaching there, with a desire to get the task of the gods fulfilled, you pleaded with Śiva after eulogising Him with different kinds of hymns.
3. On hearing your words Śiva joyously assumed a wonderfully excellent and divine form and showed His mercifulness.
4. O sage, on seeing the comely form of Śiva, the receptacle of exquisite beauty, far better than that of the cupid, you were greatly delighted.
5. Highly delighted you eulogised Him again and again with different kinds of hymns and returned to the place where Mena was seated along with other gods.
6. Reaching there, O sage, with great affection and delight, you spoke to the great pleasure of Mena, the wife of Himavat.
Nārada said:—
7. O Mena of wide eyes, see the excellent features of Śiva. The merciful Śiva has taken great pity on us.
Brahmā said:—
8. Extremely surprised on hearing your words, Menā the beloved wife of the mountain, saw Śiva’s form that afforded great bliss.
9-12. It was as refulgent as that of a thousand suns. Every part of the body was exquisite. The garments were of variegated colours. He was embellished with different ornaments. He was smiling with great delight. His comeliness was highly pleasing. He was fair-complexioned and lustrous. The crescent moon added to his beauty. Viṣṇu and other gods lovingly served Him. The sun acted as His royal umbrella. The moon embellished Him. In every way He was extremely handsome bedecked in ornaments. It was impossible to describe adequately the great beauty of His vehicle.
Continues....
🌹🌹🌹🌹🌹
23 Feb 2022
గీతోపనిషత్తు -326
🌹. గీతోపనిషత్తు -326 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 25-2 📚
🍀 25-2. పరమపదము - ఎదురుగ నున్నది దైవమే. దూరముగ నున్నది దైవమే. లోపల ఉన్నది దైవమే. వెలుపల నున్నది దైవమే. అంతయు దైవమే. తాను కూడ దైవము యొక్క వ్యక్తరూపమే. ఇట్టి భావనతో సతతము జీవించు వారికి క్షణక్షణము, అనుక్షణము దైవమును దర్శించుటయే యుండును. ఇదియే అనన్యభావన, అనన్యచింతన, నిత్య అభియుక్తత మరియు పరిఉపాసన కూడ అయి యున్నది. ఇట్టివారు నిజమగు రాజయోగులు. 🍀
26. యాంతి దేవవ్రతా దేవాన్ పితన్ యాంతి పితృవ్రతాః |
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోలి పి మామ్ ||
తాత్పర్యము : దేవతల నారాధించువారు దేవతాలోకములు చేరుదురు. పితృదేవతల నారాధించువారు పితృలోకము చేరుదురు. భూతప్రేతముల నారాధించువారు ఆ లోకములను చేరుదురు. నన్నారాధించు వారు నన్ను చేరుదురు.
వివరణము : దైవమును అన్ని కాలములందు, అన్ని దేశములందు, అన్ని రూపములందు, అన్ని నామములయందు, అన్ని సన్నివేశ ముల యందు దర్శించుచు నుండుటయే మార్గము. ఎదురుగ నున్నది దైవమే. దూరముగ నున్నది దైవమే. లోపల ఉన్నది దైవమే. వెలుపల నున్నది దైవమే. అంతయు దైవమే. తాను కూడ దైవము యొక్క వ్యక్తరూపమే. ఇట్టి భావనతో సతతము జీవించు వారికి క్షణక్షణము, అనుక్షణము దైవమును దర్శించుటయే యుండును.
ఇదియే అనన్యభావన, అనన్యచింతన, నిత్య అభియుక్తత మరియు పరిఉపాసన కూడ అయి యున్నది. ఇట్టివారు నిజమగు రాజయోగులు. వారు దైవమునందే చరించుచు, దైవమును దర్శించుచు, వినుచు, సేవించుచు యుందురు. దేహత్యాగానంతరము అట్టి అపరిమితమగు తత్త్వమును స్థితిగొందురు. ఇట్లు సర్వవ్యాపకము అగు తత్త్వము నారాధింపక ఏదో ఒక రూపమును, ఒక నామమును ఆశ్రయించి ఆరాధించువారు తదనుగుణమైన లోకములు చేరుదురు. ఇది సహజమే గదా! కాముకులు కామలోకము చేరుదురు. అధర్మము నాశ్రయించు వారు నరకమును చేరుదురు. భోగభాగ్యములకై దైవము నారాధించువారు భోగలోకములు చేరుదురు. ధర్మము నాచరించు వారు ధర్మముతో కూడిన క్షేత్రములను చేరుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Feb 2022
23 - FEBRUARY - 2022 బుధవారం MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 23, బుధవారం, ఫిబ్రవరి 2022 సౌమ్య వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 25-2 - 326 - పరమ పదము🌹
3) 🌹. శివ మహా పురాణము - 524 / Siva Maha Purana - 524 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -154🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 142 / Osho Daily Meditations - 142 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 351-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 351-2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 23, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ నృత్తగణపతి ధ్యానం 🍀*
*పాశాంకుశాపూపకుఠారదంత చంచత్కరాక్లుప్తవరాంగులీకమ్ |*
*పీతప్రభం కల్పతరోరధస్థం భజామి నృత్తోపపదం గణేశమ్ ||*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మీరేం చెయ్యాలో ముందుగా ఊహించకుండా, ఏదీ ఆశించకుండా ఉండండి. అప్పుడే మీరు సమర్పణలో జీవిస్తున్నట్లు. 🍀*
*పండుగలు మరియు పర్వదినాలు : శబరి జయంతి, కాలాష్టమి, Shabari Jayanti, Kalashtami*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం
తిథి: కృష్ణ సప్తమి 16:57:47 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: విశాఖ 14:41:46 వరకు
తదుపరి అనూరాధ
యోగం: ధృవ 08:26:33 వరకు
తదుపరి వ్యాఘత
సూర్యోదయం: 06:38:20
సూర్యాస్తమయం: 18:20:37
వైదిక సూర్యోదయం: 06:41:57
వైదిక సూర్యాస్తమయం: 18:17:01
చంద్రోదయం: 00:34:42
చంద్రాస్తమయం: 11:10:45
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: తుల
కరణం: బవ 16:54:46 వరకు
వర్జ్యం: 18:29:20 - 20:00:40
దుర్ముహూర్తం: 12:06:04 - 12:52:54
రాహు కాలం: 12:29:29 - 13:57:16
గుళిక కాలం: 11:01:42 - 12:29:29
యమ గండం: 08:06:08 - 09:33:55
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 06:13:32 - 07:45:48
మరియు 27:37:20 - 29:08:40
ధాత్రి యోగం - కార్య జయం 14:41:46
వరకు తదుపరి సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PANCHANGUM
#DAILYCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -326 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 25-2 📚*
*🍀 25-2. పరమపదము - ఎదురుగ నున్నది దైవమే. దూరముగ నున్నది దైవమే. లోపల ఉన్నది దైవమే. వెలుపల నున్నది దైవమే. అంతయు దైవమే. తాను కూడ దైవము యొక్క వ్యక్తరూపమే. ఇట్టి భావనతో సతతము జీవించు వారికి క్షణక్షణము, అనుక్షణము దైవమును దర్శించుటయే యుండును. ఇదియే అనన్యభావన, అనన్యచింతన, నిత్య అభియుక్తత మరియు పరిఉపాసన కూడ అయి యున్నది. ఇట్టివారు నిజమగు రాజయోగులు. 🍀*
*26. యాంతి దేవవ్రతా దేవాన్ పితన్ యాంతి పితృవ్రతాః |*
*భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోలి పి మామ్ ||*
*తాత్పర్యము : దేవతల నారాధించువారు దేవతాలోకములు చేరుదురు. పితృదేవతల నారాధించువారు పితృలోకము చేరుదురు. భూతప్రేతముల నారాధించువారు ఆ లోకములను చేరుదురు. నన్నారాధించు వారు నన్ను చేరుదురు.*
*వివరణము : దైవమును అన్ని కాలములందు, అన్ని దేశములందు, అన్ని రూపములందు, అన్ని నామములయందు, అన్ని సన్నివేశ ముల యందు దర్శించుచు నుండుటయే మార్గము. ఎదురుగ నున్నది దైవమే. దూరముగ నున్నది దైవమే. లోపల ఉన్నది దైవమే. వెలుపల నున్నది దైవమే. అంతయు దైవమే. తాను కూడ దైవము యొక్క వ్యక్తరూపమే. ఇట్టి భావనతో సతతము జీవించు వారికి క్షణక్షణము, అనుక్షణము దైవమును దర్శించుటయే యుండును.*
*ఇదియే అనన్యభావన, అనన్యచింతన, నిత్య అభియుక్తత మరియు పరిఉపాసన కూడ అయి యున్నది. ఇట్టివారు నిజమగు రాజయోగులు. వారు దైవమునందే చరించుచు, దైవమును దర్శించుచు, వినుచు, సేవించుచు యుందురు. దేహత్యాగానంతరము అట్టి అపరిమితమగు తత్త్వమును స్థితిగొందురు. ఇట్లు సర్వవ్యాపకము అగు తత్త్వము నారాధింపక ఏదో ఒక రూపమును, ఒక నామమును ఆశ్రయించి ఆరాధించువారు తదనుగుణమైన లోకములు చేరుదురు. ఇది సహజమే గదా! కాముకులు కామలోకము చేరుదురు. అధర్మము నాశ్రయించు వారు నరకమును చేరుదురు. భోగభాగ్యములకై దైవము నారాధించువారు భోగలోకములు చేరుదురు. ధర్మము నాచరించు వారు ధర్మముతో కూడిన క్షేత్రములను చేరుదురు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 524 / Sri Siva Maha Purana - 524 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 45
*🌻. శివుని సుందర రూపము - 1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మునీ! ఇంతలో నీవు విష్ణువుచే ప్రేరితుడై వెంటనే శంభునకు నచ్చజెప్పుటకై ఆయన వద్దకు వెళ్లితివి (1). నీవు దేవకార్యమును చేయగోరి అచటకు వెళ్లి రుద్రుని అనేక విధములగు స్తోత్రములచే స్తుతించి ఆయనకు నచ్చ జెప్పితివి (2). శంభుడు నీ మాటను ప్రీతితో విని తన యాగుణమును ప్రదర్శించువాడై అద్భుతము, ఉత్తమము, దివ్యము అగు రూపమును ధరించెను (3). ఓ మునీ! సుందరము, రూపములో మన్మథుని మించి యున్నది, లావణ్యమునకు పరమనిధానము అగు శంభుని ఆ రూపమును చూచి నీవు చాల ఆనందించితివి (4).
ఓ మునీ! పరమానందమును పొందియున్న నీవు అనేక విధములగు స్తోత్రములచే స్తుతించి మేన ఇతరులందరితో కూడియున్న చోటికి వెళ్లితివి (5). ఓ మునీ! మిక్కిలి ప్రసన్నుడు, అధిక ప్రేమతో నిండియున్న వాడు నగు నీవు అచటకు వచ్చి హిమవంతుని పత్నియగు ఆ మేనను ఆనందింప జేయుచూ ఇట్లు పలికితివి (6).
నారదుడిట్లు పలికెను -
ఓ మేనా! విశాలమగు కన్నులు దానా! సర్వోత్తమమగు శివుని రూపమును చూడుము. కరుణా మూర్తి యగు ఆ శివుడు దయను చూపించినాడు (7).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆ మాటను విని హిమవంతుని పత్నియగు మేన ఆశ్చర్యపడి, పరమానందమును కలుగ జేయునది (8). కోటి సూర్యుల కాంతి గలది, అన్ని అవయవముల యందు సుందరమైనది, రంగు రంగుల వస్త్రములు గలది, అనేక భూషణములచే అలంకరింపబడినది (9), మిక్కిలి ప్రసన్నమైనది, చక్కని చిరునవ్వు గలది, గొప్ప లావణ్యము గలది, మనస్సును హరించునది, తెల్లని కాంతులను వెదజల్లునది, చంద్రవంకతో అలంకరింపబడినది (10), విష్ణువు మొదలగు దేవగణములందరిచే సేవింపబడినది, శిరస్సుపై సూర్యుడు ఛత్రముగా కలది, చంద్రునితో ప్రకాశించునది అగు శివుని రూపమును చూచెను (11). ఆభరణములతో అలంకరింపబడిన శివుడు అన్ని విధములుగా సుందరుడై యుండెను. ఆయన వాహనము యొక్క గొప్ప శోభను వర్ణింప శక్యముకాదు (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 524 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 45 🌴*
*🌻 Śiva’s comely form and the Jubilation of the Citizens - 1 🌻*
Brahmā said:—
1. In the meantime, O sage, urged by Viṣṇu you went immediately to Śiva to conciliate Him.
2. After reaching there, with a desire to get the task of the gods fulfilled, you pleaded with Śiva after eulogising Him with different kinds of hymns.
3. On hearing your words Śiva joyously assumed a wonderfully excellent and divine form and showed His mercifulness.
4. O sage, on seeing the comely form of Śiva, the receptacle of exquisite beauty, far better than that of the cupid, you were greatly delighted.
5. Highly delighted you eulogised Him again and again with different kinds of hymns and returned to the place where Mena was seated along with other gods.
6. Reaching there, O sage, with great affection and delight, you spoke to the great pleasure of Mena, the wife of Himavat.
Nārada said:—
7. O Mena of wide eyes, see the excellent features of Śiva. The merciful Śiva has taken great pity on us.
Brahmā said:—
8. Extremely surprised on hearing your words, Menā the beloved wife of the mountain, saw Śiva’s form that afforded great bliss.
9-12. It was as refulgent as that of a thousand suns. Every part of the body was exquisite. The garments were of variegated colours. He was embellished with different ornaments. He was smiling with great delight. His comeliness was highly pleasing. He was fair-complexioned and lustrous. The crescent moon added to his beauty. Viṣṇu and other gods lovingly served Him. The sun acted as His royal umbrella. The moon embellished Him. In every way He was extremely handsome bedecked in ornaments. It was impossible to describe adequately the great beauty of His vehicle.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 154 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. ప్రకృతి - జీవనము 🌻*
ప్రకృతిని గమనించుకొనుచు జీవితమును నడిపించినచో మార్పులను ఏ విధముగా అర్థము చేసికొనవలెనో తెలియును. ఆకలి పుట్టినపుడు అన్నము తినవలెనని తెలియును. వెంటనే అన్నము తిన్నచో కర్తవ్య నిర్వహణము అనబడును. లేక వేదాంతమో వాణిజ్యమో అంతకన్నా ముఖ్యమని ఆలస్యము చేసినచో, మనము ఏర్పరచుకొనిన కార్యక్రమము కర్తవ్యము కాకపోవును.*
*మన ఇష్టము, అభిమానము వేరు. మనతో పనిచేయుచున్న ప్రకృతి వేరు. ప్రకృతిలో పొరపాటుండదు. ఇష్టాఇష్టములలో పొరపాట్లుండును. వేదాంతము ఎంత గొప్పదియైనను, ఆహారమునకుగల వేళలు అంతకన్నా గొప్పవి కాకపోవచ్చును గాని అంతకన్నా సత్యములు. అయితే ఒకమారు సర్వాంతర్యామి స్మరణము కలిగించు కథలను ఆత్మతో గ్రోలుటకు అలవాటు పడినవాడు లోకవృత్తాంతములైన ఇతర కథలను గ్రోలుటకు యత్నము చేయడు. అవి వానికి గరళము గ్రోలుట వలె నుండును.*
........✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 143 / Osho Daily Meditations - 143🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 143. చీకటిలోకి చూడటం 🍀*
*🕉. కొన్నిసార్లు మీరు మీ గదిలోకి వచ్చినప్పుడు చీకటిగా కనిపిస్తుంది. కానీ మీరు కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు, మరియు చీకటి మాయమవుతుంది. గది నిండా వెలుతురు. ఏదో జరిగిందని కాదు. నీ కళ్ళు చీకట్లోకి చూడటం అలవాటైపోయింది అంతే. 🕉*
*దొంగలు చీకటిలో పని చేయవలసి ఉంటుంది కాబట్టి అందరికంటే స్పష్టంగా చీకటిలో చూడటం ప్రారంభిస్తారని అంటారు. తెలియని ఇళ్లలోకి అడుగుపెట్టి అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంది. వారు ఏదో విషయంలో పొరపాట్లు చేయవచ్చు. క్రమంగా, వారు చీకటిలో చూడటం ప్రారంభిస్తారు. వారికి చీకటి అంత చీకటి కాదు. కాబట్టి భయపడకు. దొంగలా ఉండు. కళ్ళు మూసుకుని కూర్చుని వీలైనంత లోతుగా చీకటిలోకి చూడండి. అది మీ ధ్యానంలా ఉండనివ్వండి. ప్రతిరోజూ ముప్పై నిమిషాలు మూలలో కూర్చుని, కళ్ళు మూసుకుని, చీకటిని సృష్టించండి-మీరు ఊహించినంత చీకటిని సృష్టించండి- ఆపై ఆ చీకటిలోకి చూడండి. కష్టంగా ఉంటే మీ ముందు ఉన్న బ్లాక్‌బోర్డ్ గురించి ఆలోచించండి, చాలా చీకటిగా మరియు నల్లగా ఉంటుంది.*
*త్వరలో మీరు మరింత చీకటిని ఊహించుకోగలరు. మీరు ఎంత ఎక్కువ చీకటిలోకి చూస్తున్నారో, మీ కళ్ళు అంత స్పష్టంగా మారుతాయని మీరు చాలా ఆశ్చర్యపోతారు. మరియు భయం ఉంటే, దానిని అనుమతించండి. నిజానికి, ఎవరైనా ఆనందించాలి. అది అక్కడ ఉండనివ్వండి; భయం మీలో ఒక నిర్దిష్ట కంపనాన్ని ప్రారంభిస్తే, దానిని అనుమతించండి. వీలైనంత భయపడండి. దాదాపు భయం పట్టుకుంది ... మరియు అది ఎంత అందంగా ఉందో చూడండి. ఇది దాదాపు స్నానం వంటిది; చాలా దుమ్ము కొట్టుకుపోతుంది. ఆ వణుకు నుండి బయటకు రాగానే, మీరు చాలా సజీవంగా, జీవంతో పులకించి, కొత్త శక్తితో పుంజుకున్నట్లు, పునరుజ్జీవింపబడిన అనుభూతి చెందుతారు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 143 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 143. LOOKING INTO DARKNESS 🍀*
*🕉 Sometimes when you come into your room it looks dark. But then you sit and rest, and by and by the darkness disappears. The room is full of light. It is not that something has happened. It is just that your eyes have become accustomed to looking into the darkness. 🕉*
*It is said that thieves start seeing in the dark more clearly than anybody else, because they have to work in darkness. They have to enter unfamiliar houses, and on every step there is danger. They may stumble upon something. By and by, they start seeing in the dark. Darkness is not so dark for them. So don't be afraid. Be like a thief. Sit with closed eyes and look into the darkness as deeply as possible. Let that be your meditation. Every day for thirty minutes sit in the corner, close your eyes, and create darkness-as dark as you can imagine-and then look into that darkness. If it is difficult just think of a blackboard in front of you, so dark and so black.*
*Soon you will be able to imagine more darkness. You will be tremendously surprised that the more you look into darkness, the clearer your eyes will become. And if fear is there, allow it. In fact, one should enjoy it. Let it be there; start; trembling. If the fear starts a certain vibration in you, just allow it. Get as frightened as possible. Be almost possessed by fear ... and see how beautiful it is. It is almost like a bath; much dust will be washed away. When you come out of that trembling, you will feel very alive, throbbing with life, pulsating with a new energy, rejuvenated.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 351-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 351-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।*
*వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀*
*🌻 351-2. 'వామకేశీ' 🌻*
*సృష్టి యందు ద్వంద్వములు తప్పవు. అనుకూలము నుండి ప్రతికూలము పుట్టుచు నుండును. దీని కెన్నియో ఉదాహరణము లుండును. రాముని యందు అమితమైన అనుకూలవతియైన కైకేయి ప్రతికూలమైనది కదా! మిత్రులు శత్రువు లగుట, అనుకూలురు ప్రతికూలు రగుట జరుగుచు నుండును. మంచిని చెడు, శాంతిని అశాంతి, వెలుగును చీకటి, వృద్ధిని అంతము ఎప్పుడునూ ఎదుర్కొను చుండును. ఉత్తర దక్షిణ ధ్రువములు ఒక దానికొకటి ప్రతికూలముగ నుండుట చేతనే భూమి నిలచి యున్నది.*
*పక్షి రెక్కల వలె కుడికి ఎడమ, ఎడమకి కుడి ఆధారము. ఎడమలేని కుడి, కుడిలేని ఎడమ పక్షికి ఉపయోగపడవు. ప్రజ్ఞ పదార్థముల కలయికయే సృష్టి ప్రజ్ఞ పురుషుడు కాగ ప్రకృతి పదార్థమై అంతయూ యున్నట్లు గోచరించు చున్నది. ఇట్లన్ని విషయములందు అమ్మ వామతత్త్వమై నిలువగ వామదేవుడిగ శివుడు నిలచి యున్నాడు. అంద మంతయు వామ తత్త్వమునదే. గోచరించు సృష్టి అందమైనది. గోచరించని శివుడు అలక్షణుడు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 351-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala*
*Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻*
*🌻 351-2. Vāmakeśī वामकेशी 🌻*
*Nāma 945 is Vāmakeśvarī which refers to Vāmakeśvara tantra. This tantra is said to be the sixty fifth tantra apart from the sixty four discussed in Saundarya Laharī verse 31 and nāma 236 of this Sahasranāma. Vāmakeśvara tantra is said to be the most important tantra for Śrī Vidyā worship. This tantra discusses on internal worship of Śaktī. Vāmakeśvarī is said to be the source of this Universe.*
*Śaktī asks Śiva in Vāmakeśvara tantra “Lord, you revealed to me all the sixty four tantra-s. But you have not told me about sixteen Vidyā-s.” Śiva answers by saying that this has not been declared yet and is hidden so far. Then Śiva begins declaring this tantra to Devi. Everything in this tantra has been revealed in a very subtle manner.*
*To cite an example the bīja hrīṁ is declared as the form of Vidyā protecting the self is Śiva, agni, māyā and bindu. Unless one knows the bīja-s of these gods and goddesses, it is difficult to make out the hidden bīj. Śiva bījā is ha, Agni bījā is ra, māyā bīja (root of īṁ ईं or kāmakalā) is ‘ī’ and bindu is the dot. By joining all this, the bīja hrīṁ is arrived. Śiva declares a number of uncommon yet powerful bīja-s in this tantra.*
*Vāma-s mean those who worship Her through left hands. They do not follow the five principle yajñā-s that will be discussed in nāma 946 subsequently. She is the Goddess for these left hand worshippers. She is also known as Vāmeśvarī, which refers to Her divine power which projects the universe out of Śiva (the Brahman without attributes) and produces the reverse (vāma) consciousness of difference. Vāmadevā is the back face of Śiva.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)