శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 351-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 351-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 351-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 351-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀
🌻 351-2. 'వామకేశీ' 🌻
సృష్టి యందు ద్వంద్వములు తప్పవు. అనుకూలము నుండి ప్రతికూలము పుట్టుచు నుండును. దీని కెన్నియో ఉదాహరణము లుండును. రాముని యందు అమితమైన అనుకూలవతియైన కైకేయి ప్రతికూలమైనది కదా! మిత్రులు శత్రువు లగుట, అనుకూలురు ప్రతికూలు రగుట జరుగుచు నుండును. మంచిని చెడు, శాంతిని అశాంతి, వెలుగును చీకటి, వృద్ధిని అంతము ఎప్పుడునూ ఎదుర్కొను చుండును. ఉత్తర దక్షిణ ధ్రువములు ఒక దానికొకటి ప్రతికూలముగ నుండుట చేతనే భూమి నిలచి యున్నది.
పక్షి రెక్కల వలె కుడికి ఎడమ, ఎడమకి కుడి ఆధారము. ఎడమలేని కుడి, కుడిలేని ఎడమ పక్షికి ఉపయోగపడవు. ప్రజ్ఞ పదార్థముల కలయికయే సృష్టి ప్రజ్ఞ పురుషుడు కాగ ప్రకృతి పదార్థమై అంతయూ యున్నట్లు గోచరించు చున్నది. ఇట్లన్ని విషయములందు అమ్మ వామతత్త్వమై నిలువగ వామదేవుడిగ శివుడు నిలచి యున్నాడు. అంద మంతయు వామ తత్త్వమునదే. గోచరించు సృష్టి అందమైనది. గోచరించని శివుడు అలక్షణుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 351-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala
Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻
🌻 351-2. Vāmakeśī वामकेशी 🌻
Nāma 945 is Vāmakeśvarī which refers to Vāmakeśvara tantra. This tantra is said to be the sixty fifth tantra apart from the sixty four discussed in Saundarya Laharī verse 31 and nāma 236 of this Sahasranāma. Vāmakeśvara tantra is said to be the most important tantra for Śrī Vidyā worship. This tantra discusses on internal worship of Śaktī. Vāmakeśvarī is said to be the source of this Universe.
Śaktī asks Śiva in Vāmakeśvara tantra “Lord, you revealed to me all the sixty four tantra-s. But you have not told me about sixteen Vidyā-s.” Śiva answers by saying that this has not been declared yet and is hidden so far. Then Śiva begins declaring this tantra to Devi. Everything in this tantra has been revealed in a very subtle manner.
To cite an example the bīja hrīṁ is declared as the form of Vidyā protecting the self is Śiva, agni, māyā and bindu. Unless one knows the bīja-s of these gods and goddesses, it is difficult to make out the hidden bīj. Śiva bījā is ha, Agni bījā is ra, māyā bīja (root of īṁ ईं or kāmakalā) is ‘ī’ and bindu is the dot. By joining all this, the bīja hrīṁ is arrived. Śiva declares a number of uncommon yet powerful bīja-s in this tantra.
Vāma-s mean those who worship Her through left hands. They do not follow the five principle yajñā-s that will be discussed in nāma 946 subsequently. She is the Goddess for these left hand worshippers. She is also known as Vāmeśvarī, which refers to Her divine power which projects the universe out of Śiva (the Brahman without attributes) and produces the reverse (vāma) consciousness of difference. Vāmadevā is the back face of Śiva.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
23 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment