శ్రీ శివ మహా పురాణము - 524 / Sri Siva Maha Purana - 524


🌹 . శ్రీ శివ మహా పురాణము - 524 / Sri Siva Maha Purana - 524 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 45

🌻. శివుని సుందర రూపము - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! ఇంతలో నీవు విష్ణువుచే ప్రేరితుడై వెంటనే శంభునకు నచ్చజెప్పుటకై ఆయన వద్దకు వెళ్లితివి (1). నీవు దేవకార్యమును చేయగోరి అచటకు వెళ్లి రుద్రుని అనేక విధములగు స్తోత్రములచే స్తుతించి ఆయనకు నచ్చ జెప్పితివి (2). శంభుడు నీ మాటను ప్రీతితో విని తన యాగుణమును ప్రదర్శించువాడై అద్భుతము, ఉత్తమము, దివ్యము అగు రూపమును ధరించెను (3). ఓ మునీ! సుందరము, రూపములో మన్మథుని మించి యున్నది, లావణ్యమునకు పరమనిధానము అగు శంభుని ఆ రూపమును చూచి నీవు చాల ఆనందించితివి (4).

ఓ మునీ! పరమానందమును పొందియున్న నీవు అనేక విధములగు స్తోత్రములచే స్తుతించి మేన ఇతరులందరితో కూడియున్న చోటికి వెళ్లితివి (5). ఓ మునీ! మిక్కిలి ప్రసన్నుడు, అధిక ప్రేమతో నిండియున్న వాడు నగు నీవు అచటకు వచ్చి హిమవంతుని పత్నియగు ఆ మేనను ఆనందింప జేయుచూ ఇట్లు పలికితివి (6).

నారదుడిట్లు పలికెను -

ఓ మేనా! విశాలమగు కన్నులు దానా! సర్వోత్తమమగు శివుని రూపమును చూడుము. కరుణా మూర్తి యగు ఆ శివుడు దయను చూపించినాడు (7).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ మాటను విని హిమవంతుని పత్నియగు మేన ఆశ్చర్యపడి, పరమానందమును కలుగ జేయునది (8). కోటి సూర్యుల కాంతి గలది, అన్ని అవయవముల యందు సుందరమైనది, రంగు రంగుల వస్త్రములు గలది, అనేక భూషణములచే అలంకరింపబడినది (9), మిక్కిలి ప్రసన్నమైనది, చక్కని చిరునవ్వు గలది, గొప్ప లావణ్యము గలది, మనస్సును హరించునది, తెల్లని కాంతులను వెదజల్లునది, చంద్రవంకతో అలంకరింపబడినది (10), విష్ణువు మొదలగు దేవగణములందరిచే సేవింపబడినది, శిరస్సుపై సూర్యుడు ఛత్రముగా కలది, చంద్రునితో ప్రకాశించునది అగు శివుని రూపమును చూచెను (11). ఆభరణములతో అలంకరింపబడిన శివుడు అన్ని విధములుగా సుందరుడై యుండెను. ఆయన వాహనము యొక్క గొప్ప శోభను వర్ణింప శక్యముకాదు (12).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 524 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 45 🌴


🌻 Śiva’s comely form and the Jubilation of the Citizens - 1 🌻


Brahmā said:—

1. In the meantime, O sage, urged by Viṣṇu you went immediately to Śiva to conciliate Him.

2. After reaching there, with a desire to get the task of the gods fulfilled, you pleaded with Śiva after eulogising Him with different kinds of hymns.

3. On hearing your words Śiva joyously assumed a wonderfully excellent and divine form and showed His mercifulness.

4. O sage, on seeing the comely form of Śiva, the receptacle of exquisite beauty, far better than that of the cupid, you were greatly delighted.

5. Highly delighted you eulogised Him again and again with different kinds of hymns and returned to the place where Mena was seated along with other gods.

6. Reaching there, O sage, with great affection and delight, you spoke to the great pleasure of Mena, the wife of Himavat.


Nārada said:—

7. O Mena of wide eyes, see the excellent features of Śiva. The merciful Śiva has taken great pity on us.


Brahmā said:—

8. Extremely surprised on hearing your words, Menā the beloved wife of the mountain, saw Śiva’s form that afforded great bliss.

9-12. It was as refulgent as that of a thousand suns. Every part of the body was exquisite. The garments were of variegated colours. He was embellished with different ornaments. He was smiling with great delight. His comeliness was highly pleasing. He was fair-complexioned and lustrous. The crescent moon added to his beauty. Viṣṇu and other gods lovingly served Him. The sun acted as His royal umbrella. The moon embellished Him. In every way He was extremely handsome bedecked in ornaments. It was impossible to describe adequately the great beauty of His vehicle.


Continues....

🌹🌹🌹🌹🌹


23 Feb 2022

No comments:

Post a Comment