అట్లతద్ది అంతరార్థం - అట్ల తద్ది కథ

🌹. అట్లతద్ది అంతరార్థం - అట్ల తద్ది కథ 🌹

🍀 23, శనివారం అట్లతద్దె 🍀

🌻. పఠించవలసిన అర్థనారీశ్వర స్తోత్రం 🌻

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. సౌభాగ్య‌దాయిని ‘అట్ల‌త‌ద్ది’

అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె, అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ, గోరింటాకు పండుగ అనీ అంటారు. ఉండ్రాళ్ళ తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు, ముత్తయిదువులు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు. మరునాడు వేకువ జామునే లేచి తలస్నానం చేసి, పూజా మందిరంలో పీఠమును పనుపు, కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం, పసుపు, పువ్వులతో పూజిస్తారు. ఆ తర్వాత దేవికి అట్లు, ఇతర పదార్థాలు నైవేద్యంగా పెడతారు. అనంతరం శక్తి కొద్దీ ముగ్గురుకానీ, ఐదుగురు కానీ ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వటం ఆనవాయితీ. ఇలా చేసినందువల్ల గౌరీదేవి అనుగ్రహంతో సుఖాలు, సౌభాగ్యం కలకాలం నిలవడంతో పాటు పుణ్యం వస్తుందని చెబుతారు. ఇది అట్లతద్దె జరుపుకోవటంలో ముఖ్య ఉద్దేశ్యం. అట్లతద్దినాడు తెల్లవారు జామున పిల్లలు అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌, ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌ అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఉయ్యాలలూగుతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. పెద్దలు మాత్రం పగలంతా ఉపవసించి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి ఆరగిస్తారు.

🌹. అట్ల తద్ది కథ 🌹

🌟. అట్లతద్దికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి, మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లెలి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయమైంది. అమ్మా కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో’ అన్నాడు. రాజ కుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడషోపచారాలతో ఉమాదేవిని పూజించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ వ్రతానికి ‘చంద్రోదయ ఉమావ్రతం’ అని పేరు వచ్చింది. అయితే రాజకుమారి సోదరుని మాటలు నమ్మి వ్రత భంగం చేసింది. ఇది జరిగిన కొద్ది కాలానికి రాకుమారికి పెళ్లయింది.

🌟. కొంతమంది దుష్టుల మోసం వల్ల ఆమెకు ముసలి భర్త లభించాడు. ఆమె ఎంతో బాధపడింది. వ్రతం చేస్తే మంచి భర్త రావాలి గాని ఇలా ఎందుకు జరిగిందని వాపోయింది. పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. వారు ఆమె సోదరుడు ఆమెపై ప్రేమతో చేసినదంతా చెప్పారు. అయితే మర్నాడు ఆశ్వయుజ బహుళ తదియ అని ఆ రోజు చంద్రోదయ ఉమా వ్రతం చేస్తే ఆమె సమస్య తీరుతుందని చెప్పారు. ఆమె యధావిధిగా పూజ చేసి అక్షతలు భర్త మీద చల్లగానే ఆయన యవ్వనవంతుడయ్యాడు. కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సౌభాగ్యంతో తులతూగుతారు.

🌹. అట్లతద్ది అంతరార్థం 🌹

🌟. త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని, ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం.

🌟. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం.రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి, బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం, మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని, శక్తిని కలిగిస్తుంది.

🌟. ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమయినది. పిల్లలు, పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు జామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీదేవి పూజ చేసి, ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకుని, శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 తాంబూలం వేసుకోవడం, 11 ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు ‘అట్లతద్ది’ అనే పేరు వచ్చింది. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి, ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి.

🌟. సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల భార్యలు సరస్వతి, లక్ష్మి, పార్వతులకు నెల పొడవునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా, పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెబుతున్నాయి పురాణాలు.

🌹. అట్లతదియ రోజున అనుకూల దాంపత్యం కొరకు పఠించవలసిన అర్థనారీశ్వర స్తోత్రం 🌹

చాంపేయ గౌరార్థ శరీరకాయై
కర్పూర గౌరార్థ శరీరకాయ
ధమిల్ల కాయైచ జటాధరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజః పుంజ విచర్చితాయ
కృత స్మరాయై వికృత స్మరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ఝణత్క్వణత్కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

విశాల నీలోత్పల లోచనాయై
వికాసి పంకేరుహ లోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

మందార మాలా కవితాలకాయై
కపాల మాలాంకిత కంథరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయై
నమశ్శివాయై చ నమశ్శివాయ II

అంభోధర శ్యామల కుంతలాయై
తటిత్రభా తామ్ర జటధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ
జగజ్జనన్యై జగదేక పిత్రే
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై
స్ఫురన్మహా పన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ఏతత్పఠే దష్టక నిష్టదం యో
భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ
ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం
భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః

ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్
అట్ల తద్దె 2021 తేదీ - శనివారం, అక్టోబర్ 23, 2021
తదియ తిథి ప్రారంభమవుతుంది - అక్టోబర్ 23, 2021 న 12:29 AM
తదియ తిథి ముగుస్తుంది - 03:01 AM అక్టోబర్ 24, 2021 న

🌹 🌹 🌹 🌹 🌹


24 Oct 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 141 / Sri Lalita Sahasranamavali - Meaning - 141


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 141 / Sri Lalita Sahasranamavali - Meaning - 141 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 141. చిత్కళా,ఽనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ ।
నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ ॥ 141 ॥ 🍀

🍀 728. చిత్కళానందకలికా :
ఙ్ఞానము, ఆనందము అను జ్యోతిస్వరూపిణీ

🍀 729. ప్రేమరూపా :
ప్రేమమూర్తి

🍀 730. ప్రియంకరీ :
కోరికలు సిద్ధింపచేయునది

🍀 731. నామపారాయణప్రీతా :
తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినది

🍀 732. నందివిద్యా :
అమ్మవారికి సంబందించిన ఓక మంత్ర విశేషము

🍀 733. నటేశ్వరీ :
నటరాజు యొక్క శక్తి


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 141 🌹

📚. Prasad Bharadwaj

🌻 141. Chitkala nandakalika premarupa prinankari
Namaparayana prita nandivida nateshvari ॥ 141 ॥ 🌻

🌻 728 ) Chid kala -
She who is the micro power deep within

🌻 728 ) Ananda Kalika -
She who is the happiness in beings

🌻 729 ) Prema roopa -
She who is the form of love

🌻 730 ) Priyamkaree -
She who does what is liked

🌻 731 ) Nama parayana preetha -
She who likes repetition of her various names

🌻 732 ) Nandhi vidhya -
She who is the knowledge taught by Nandi deva (The bull god on whom shiva rides)

🌻 733 ) Nateshwaree -
She who is the goddess of dance


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


24 Oct 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 93


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 93 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 9 🌻


మానవజీవిత రంగంలో ప్రతి ఒక్కడు పరమాత్మను తనకు సహాయంగా ఆవాహన చేసి తన హృదయంలోనికి ఆహ్వానం చేసికొనుటకు సంకేతంగా మహాభారతంలో ఈ ఘట్టం ఉన్నది.

శ్రీకృష్ణుని, యుద్ధంలో సహాయమును ఆపేక్షించుట కొరకు అర్జునుడు, దుర్యోధనుడు వస్తారు. దుర్యోధనుడు తలవైపున అర్జునుడు పాదముల వైపున కూర్చొనుట ఈ కథను మనమెరుగుదుము. పాదముల వైపున కూర్చున్నవాడు అనుగ్రహింప బడినాడు.

పరమాత్మ తన దొంగనిద్రలో నుండి మేల్కొని కనులు తెరిచేటప్పటికి ఎదురుగా కాళ్ళవైపున చూస్తుండగా అర్జునుడు కనబడినాడు. తలవైపున కూర్చున్న దుర్యోధనుడు కనిపించలేదు. అతడు నేను వచ్చానని చెప్పుకోవలసి వచ్చింది.

నేను వచ్చానని చెప్పుకున్నవాడి గతి యుద్ధంలో ఏమైందో మనం చూశాము గదా! ఈ ప్రపంచంలోకి నేను వచ్చానండోయ్ నేనిది పాస్ అయినాను అది చదువుకున్నాను. నాకు ఆస్తి ఇంత ఉంది. నగరంలో నేనింత‌ మందిని ఎరుగుదును. నాకు హోదా ఇంత ఉంది. నేనింతమందిని కంట్రోల్ చేయగలను అన్నవాడి గతి దుర్యోధనుడి గతే అవుతుంది. ఇది లాభం లేదు.

కావలసినదల్లా పాదముల దగ్గర కూర్చోగలగటమే. సంఘంలో ఉన్న జీవులను చూచి, వారిలో పరమాత్మను చూచి, తదర్చన బుద్ధితో, తదర్పణబుద్ధితో తన వృత్తి వ్యాపారాదులను ఆరంభించుకొనవలెను. ఇది మహాభారతానికి (మన జీవితానికి మధ్యన) ఉన్న సంకేతం.

దుర్యోధనునితో పాటు వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని ఏమీ కోరలేదు‌ శ్రీకృష్ణుడే "యాదవుల సహాయం కావాలా? నేను ఒక్కడినే కావాలా? అని అడుగుతూ నేను యుద్ధం చేయను అస్ర్తం పట్టను, అని అన్నాడు. "నీ యుద్ధం, సహాయం కాదయ్యా నేను కోరేది. నీవు నా రథమందు వసింపుమయ్య! నందకుమారా యదుభూషణ" అని (అర్జునుడు) కోరాడు‌. కోరగానే కృష్ణుడు యుద్ధంలో రథం మీద కూర్చున్నాడు.

.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


24 Oct 2021

వివేక చూడామణి - 141 / Viveka Chudamani - 141


🌹. వివేక చూడామణి - 141 / Viveka Chudamani - 141🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 29. కేవల బ్రహ్మము - 1 🍀


464. కేవలము బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేదు. అది శాశ్వతము. దానికి మొదలు చివర లేదు. దానికి మార్పులేదు. మార్పు చెందదు. అందు ఏవిధమైన రెండవ పదార్థము లేదు.

465. అచట బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేదు. అది స్థితి యొక్క సారము, విజ్ఞానము, శాశ్వతమైన ఆనందము ఏవిధమైన కర్మలు లేనిది, ఏ విధమైన ద్వంద్వ భావము లేనిది.

466. అచట బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేనిది. అది విజ్ఞానము యొక్క సారము, బ్రహ్మానంద స్థితి, ఏ కర్మ చేయనిది, అందులో ఏవిధమైన ద్వంద్వత్వము లేదు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹





🌹 VIVEKA CHUDAMANI - 141 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 29. Only Brahmam - 1 🌻


464. There is only Brahman, the One without a second, infinite, without beginning or end, transcendent and changeless; there is no duality whatsoever in It.

465. There is only Brahman, the One without a second, the Essence of Existence, Knowledge and Eternal Bliss, and devoid of activity; there is no duality whatsoever in It.

466. There is only Brahman, the One without a second, which is within all, homogeneous, infinite, endless, and all-pervading; there is no duality whatsoever in It.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

23 Oct 2021

శ్రీ శివ మహా పురాణము - 464


🌹 . శ్రీ శివ మహా పురాణము - 464🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 33

🌻. సప్తర్షుల ఉపదేశము - 2 🌻


అరుంధతి ఇట్లు పలికెను-

ఓ మేనకా! సాధ్వీ! లెమ్ము. నేను అరుంధతిని. దయానిధులగు ఏడ్గురు ఋషులతో గూడి నేను మీఇంటికి వచ్చి యుంటిని (13).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అరుంధతి యొక్క కంఠస్వరమును విన్నంతనే మేనక వేగమే లేచి నిలబడి, లక్ష్మీదేవి వలె వెలుగొందుచున్న ఆమెకు శిరసానమస్కరించి ఇట్లు పలికెను (14).

మేన ఇట్లు పలికెను-

అహో! మేము ఎంత పుణ్యమో చేసుకొని జన్మించితిమి. అందువలననే జగ్తునకు విధివిధానమునందించిన వసిష్ఠుని ధర్మపత్ని ఇచటకు వచ్చినది (15). ఓ దేవీ! ఇచటకు మీరు వచ్చుటలో గల కారణమేమియో నాకు వివరముగా చెప్పుడు. నేను నీకు దాసివంటి దానను. నీకుమార్తె వంటి దానను. నాపై దయను చూపుము (16).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు పతివ్రతయగు అరుంధతిమేనయొక్క ఈ మాటలను విని, ఆమెకు పరిపరివిధముల బోధచేసి, మరల ఆ ఋషులు ఉన్నచోటికి ప్రీతితో తరలి వచ్చెను (17). మరియు మాటలాడుటలో సమర్థులగు ఆ ఋషులందరు శివుని పాద పద్మములను స్మరించి సాదరముగా పర్వతరాజునకు బోధించిరి (18).

ఋషులిట్లు పలికిరి-

ఓ పర్వతరాజా! శుభకరమగు మా మాటలను వినుము. పార్వతిని శివునకు ఇమ్ము. జగత్తును లయముచేయు రుద్రునకు మామవు కమ్ము (19). తారకుని వినాశము కొరకై బ్రహ్మగారు యాచించుట ఎరుంగని ఆ సర్వేశ్వరుని ఈ వివాహమును చేసుకొమ్మని కష్టపడి ఒప్పించెను (20). యోగివర్యుడగు శంకరునకు వివాహమునందభిరుచి లేదు. కాని ఆ దేవుడు బ్రహ్మగారి ప్రార్థనచే నీ కన్యను వివాహమాడగలడు (21). నీ కుమార్తె తపస్సును చేయగా ఆయన ఆమెకు మాటను ఇచ్చి యున్నాడు. ఈ రెండు కారణములచే యోగివర్యుడగు శివుడు వివాహమును చేసుకొనగలడు (22).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


23 Oct 2021

గీతోపనిషత్తు -265


🌹. గీతోపనిషత్తు -265 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 7-2

🍀 7. ఈశ్వర ప్రణిధానము -2 - ప్రతి జీవుడును తన ప్రకృతిని తాను దాటుటకు, తన యందున్న ఈశ్వరుని శాశ్వతముగ ఆశ్రయించ వలెను. ఈశ్వర ప్రణిధానముననే జీవుడు తనదైన ప్రకృతిని దాట గలడు. సర్వప్రకృతికిని స్వామియే ఈశ్వరుడై యుండుటచే, ఈశ్వరునాశ్రయించుట, ఈశ్వర శరణాగతి జొచ్చుట, ఈశ్వరునితో ఎల్లప్పుడు కూడి యుండుట ఉపాయమని తెలియవలెను. చేతల యందున్నంత కాలము ప్రకృతి యందున్నట్లే, చేతలకు మూలమగు ఉనికి యందున్నపుడు స్వభావ వశమున యుండక దైవవశమై యుండును. ప్రకృతికి మూలము, ఆధారము అగు తత్త్వమును ఆశ్రయించుట మార్గమని తెలియవలెను. 🍀


సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |
కల్పయే పున స్తాని కల్పాదౌ విస్పజా మ్యహమ్ II 7


తాత్పర్యము : ప్రళయ కాలమున ప్రాణికోట్లన్నియు నా ప్రకృతిని చేరును. నా ప్రకృతి నన్నుచేరి హృదయమున నుండును. మరల నా ప్రకృతి నా హృదయమునుండి వెలువడి ప్రాణికోట్లను వెలువరించును.

వివరణము : ప్రాణికోట్లన్నిటికిని ప్రకృతియే మూలము. ప్రకృతికి తాను మూలము. తన నుండి పుట్టిన ప్రకృతినుండి పుట్టిన ప్రాణి కోట్లకు ప్రకృతియే స్వామి. ప్రకృతికి తాను స్వామి. తాను ప్రకృతికి ఆవలివాడు. జీవులు ప్రకృతికి ఈవలివారు. జీవులు ప్రకృతికి లోబడి యుందురు. తాను ప్రకృతికి మూలమగుటచే ప్రకృతికి లోబడి యుండు వాడు కాదు.

జీవులు తన్నాశ్రయించినచో ప్రకృతిని దాటుటకు వీలుపడును. ప్రతి జీవుడును తన ప్రకృతిని తాను దాటుటకు, తన యందున్న ఈశ్వరుని శాశ్వతముగ ఆశ్రయించ వలెను. ఈశ్వర ప్రణిధానముననే జీవుడు తనదైన ప్రకృతిని దాట గలడు. సర్వప్రకృతికిని స్వామియే ఈశ్వరుడై యుండుటచే, ఈశ్వరునాశ్రయించుట, ఈశ్వర శరణాగతి జొచ్చుట, ఈశ్వరునితో ఎల్లప్పుడు కూడి యుండుట ఉపాయమని తెలియవలెను.

చేతల యందున్నంత కాలము ప్రకృతి యందున్నట్లే, చేతలకు మూలమగు ఉనికి యందున్నపుడు స్వభావ వశమున యుండక దైవవశమై యుండును. జీవుడు తానే కర్తయని భావించుచుండును. నిజమునకు తన యందలి ప్రకృతియే తనను నడిపించు కర్త. తన స్వాధీనము నందు లేని తన ప్రకృతిని తానెట్లు దాటగలడు? తన ప్రకృతి బలవత్తరముగ తనచే పనులు చేయించు చుండును. అనగూడని మాటలనుట, వినగూడనివి వినుట, చేయగూడనివి చేయుట, తినగూడనివి తినుట- ఇట్లెన్నో విధములుగ జీవుడు అవశుడై యుండును. ఎంత తెలిసినను ప్రకృతిచే ఏదో విధమగు హింసకు గురియగు చుండును. అట్టి ప్రకృతిని జ్ఞానులు కూడ దాటలేరు. కనుక ప్రకృతికి మూలము, ఆధారము అగు తత్త్వమును ఆశ్రయించుట మార్గమని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

23 Oct 2021

Akhanda Jyothi Installed By Sadguru Pandit Sriram Sharma Acharya Ji In 1926 - Maintained By Mata Bhagavathi Devi Ji

🌹 Akhanda Jyothi Installed By Sadguru Pandit Sriram Sharma Acharya Ji In 1926 - Maintained By Mata Bhagavathi Devi Ji 🌹

🍀 All World Gayatri Pariwar 🍀

🙌 Shantikunj, Haridwar 🙌

🌹🙏🌹

🙏 Prasad Bharadwaj 🙏


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

23-OCTOBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 23, శనివారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 265 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 464🌹 
4) 🌹 వివేక చూడామణి - 141 / Viveka Chudamani - 141🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -93🌹  
6) 🌹 Osho Daily Meditations - 82 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 141 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 141🌹
8) 🌹. అట్లతద్ది అంతరార్థం - అట్ల తద్ది కథ 🌹
*🍀 23, శనివారం అట్లతద్దె 🍀
🌻. పఠించవలసిన అర్థనారీశ్వర స్తోత్రం 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹AKHANDA JYOTHI INSTALLED BY SADGURU PANDIT SRIRAM SHARMA ACHARYA JI IN 1926 - MAINTAINED BY MATA BHAGAVATHI DEVI JI 🌹*
*🍀 ALL WORLD GAYATRI PARIWAR 🍀*
*🙌 SHANTIKUNJ, HARIDWAR 🙌*
🌹🙏🌹
*🙏 PRASAD BHARADWAJ 🙏*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*23, అక్టోబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ వేంకటేశ అష్టకం - 2 🍀*

గోవిందో గోపతిః కృష్ణః కేశవో గరుడధ్వజః |
వరాహో వామనశ్చైవ నారాయణ అధోక్షజః || 3 ||
శ్రీధరః పుండరీకాక్షః సర్వదేవస్తుతో హరిః |
శ్రీనృసింహో మహాసింహః సూత్రాకారః పురాతనః || 4 ||

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: కృష్ణ తదియ 27:03:36 వరకు తదుపరి కృష్ణ చవితి
కార్తీక - పౌర్ణమాంతం
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: కృత్తిక 21:54:05 వరకు తదుపరి రోహిణి
యోగం: వ్యతీపాత 22:32:47 వరకు తదుపరి వరియాన
కరణం: వణిజ 13:45:25 వరకు
వర్జ్యం: 08:25:00 - 10:12:52
దుర్ముహూర్తం: 07:44:20 - 08:30:52
రాహు కాలం: 09:05:46 - 10:33:00
గుళిక కాలం: 06:11:17 - 07:38:31
యమ గండం: 13:27:29 - 14:54:44
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 19:12:12 - 21:00:04
సూర్యోదయం: 06:11:17, సూర్యాస్తమయం: 17:49:13
వైదిక సూర్యోదయం: 06:14:53
వైదిక సూర్యాస్తమయం: 17:45:36
చంద్రోదయం: 19:44:15, చంద్రాస్తమయం: 08:14:42
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: వృషభం
ఆనందాదియోగం: ధ్వజ యోగం - కార్య సిధ్ధి 21:54:05 వరకు
తదుపరి శ్రీవత్స యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
పండుగలు : అట్లతద్ధి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -265 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 7-2
 
*🍀 7. ఈశ్వర ప్రణిధానము -2 - ప్రతి జీవుడును తన ప్రకృతిని తాను దాటుటకు, తన యందున్న ఈశ్వరుని శాశ్వతముగ ఆశ్రయించ వలెను. ఈశ్వర ప్రణిధానముననే జీవుడు తనదైన ప్రకృతిని దాట గలడు. సర్వప్రకృతికిని స్వామియే ఈశ్వరుడై యుండుటచే, ఈశ్వరునాశ్రయించుట, ఈశ్వర శరణాగతి జొచ్చుట, ఈశ్వరునితో ఎల్లప్పుడు కూడి యుండుట ఉపాయమని తెలియవలెను. చేతల యందున్నంత కాలము ప్రకృతి యందున్నట్లే, చేతలకు మూలమగు ఉనికి యందున్నపుడు స్వభావ వశమున యుండక దైవవశమై యుండును. ప్రకృతికి మూలము, ఆధారము అగు తత్త్వమును ఆశ్రయించుట మార్గమని తెలియవలెను. 🍀*

సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |
కల్పయే పున స్తాని కల్పాదౌ విస్పజా మ్యహమ్ II 7

తాత్పర్యము : ప్రళయ కాలమున ప్రాణికోట్లన్నియు నా ప్రకృతిని చేరును. నా ప్రకృతి నన్నుచేరి హృదయమున నుండును. మరల నా ప్రకృతి నా హృదయమునుండి వెలువడి ప్రాణికోట్లను
వెలువరించును. 

వివరణము : ప్రాణికోట్లన్నిటికిని ప్రకృతియే మూలము. ప్రకృతికి తాను మూలము. తన నుండి పుట్టిన ప్రకృతినుండి పుట్టిన ప్రాణి కోట్లకు ప్రకృతియే స్వామి. ప్రకృతికి తాను స్వామి. తాను ప్రకృతికి ఆవలివాడు. జీవులు ప్రకృతికి ఈవలివారు. జీవులు ప్రకృతికి లోబడి యుందురు. తాను ప్రకృతికి మూలమగుటచే ప్రకృతికి లోబడి యుండు వాడు కాదు. 

జీవులు తన్నాశ్రయించినచో ప్రకృతిని దాటుటకు వీలుపడును. ప్రతి జీవుడును తన ప్రకృతిని తాను దాటుటకు, తన యందున్న ఈశ్వరుని శాశ్వతముగ ఆశ్రయించ వలెను. ఈశ్వర ప్రణిధానముననే జీవుడు తనదైన ప్రకృతిని దాట గలడు. సర్వప్రకృతికిని స్వామియే ఈశ్వరుడై యుండుటచే, ఈశ్వరునాశ్రయించుట, ఈశ్వర శరణాగతి జొచ్చుట, ఈశ్వరునితో ఎల్లప్పుడు కూడి యుండుట ఉపాయమని తెలియవలెను. 

చేతల యందున్నంత కాలము ప్రకృతి యందున్నట్లే, చేతలకు మూలమగు ఉనికి యందున్నపుడు స్వభావ వశమున యుండక దైవవశమై యుండును. జీవుడు తానే కర్తయని భావించుచుండును. నిజమునకు తన యందలి ప్రకృతియే తనను నడిపించు కర్త. తన స్వాధీనము నందు లేని తన ప్రకృతిని తానెట్లు దాటగలడు? తన ప్రకృతి బలవత్తరముగ తనచే పనులు చేయించు చుండును. అనగూడని మాటలనుట, వినగూడనివి వినుట, చేయగూడనివి చేయుట, తినగూడనివి తినుట- ఇట్లెన్నో విధములుగ జీవుడు అవశుడై యుండును. ఎంత తెలిసినను ప్రకృతిచే ఏదో విధమగు హింసకు గురియగు చుండును. అట్టి ప్రకృతిని జ్ఞానులు కూడ దాటలేరు. కనుక ప్రకృతికి మూలము, ఆధారము అగు తత్త్వమును ఆశ్రయించుట మార్గమని తెలియవలెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 464🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 33

*🌻. సప్తర్షుల ఉపదేశము - 2 🌻*

అరుంధతి ఇట్లు పలికెను-

ఓ మేనకా! సాధ్వీ! లెమ్ము. నేను అరుంధతిని. దయానిధులగు ఏడ్గురు ఋషులతో గూడి నేను మీఇంటికి వచ్చి యుంటిని (13).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అరుంధతి యొక్క కంఠస్వరమును విన్నంతనే మేనక వేగమే లేచి నిలబడి, లక్ష్మీదేవి వలె వెలుగొందుచున్న ఆమెకు శిరసానమస్కరించి ఇట్లు పలికెను (14).

మేన ఇట్లు పలికెను-

అహో! మేము ఎంత పుణ్యమో చేసుకొని జన్మించితిమి. అందువలననే జగ్తునకు విధివిధానమునందించిన వసిష్ఠుని ధర్మపత్ని ఇచటకు వచ్చినది (15). ఓ దేవీ! ఇచటకు మీరు వచ్చుటలో గల కారణమేమియో నాకు వివరముగా చెప్పుడు. నేను నీకు దాసివంటి దానను. నీకుమార్తె వంటి దానను. నాపై దయను చూపుము (16).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు పతివ్రతయగు అరుంధతిమేనయొక్క ఈ మాటలను విని, ఆమెకు పరిపరివిధముల బోధచేసి, మరల ఆ ఋషులు ఉన్నచోటికి ప్రీతితో తరలి వచ్చెను (17). మరియు మాటలాడుటలో సమర్థులగు ఆ ఋషులందరు శివుని పాద పద్మములను స్మరించి సాదరముగా పర్వతరాజునకు బోధించిరి (18).

ఋషులిట్లు పలికిరి-

ఓ పర్వతరాజా! శుభకరమగు మా మాటలను వినుము. పార్వతిని శివునకు ఇమ్ము. జగత్తును లయముచేయు రుద్రునకు మామవు కమ్ము (19). తారకుని వినాశము కొరకై బ్రహ్మగారు యాచించుట ఎరుంగని ఆ సర్వేశ్వరుని ఈ వివాహమును చేసుకొమ్మని కష్టపడి ఒప్పించెను (20). యోగివర్యుడగు శంకరునకు వివాహమునందభిరుచి లేదు. కాని ఆ దేవుడు బ్రహ్మగారి ప్రార్థనచే నీ కన్యను వివాహమాడగలడు (21). నీ కుమార్తె తపస్సును చేయగా ఆయన ఆమెకు మాటను ఇచ్చి యున్నాడు. ఈ రెండు కారణములచే యోగివర్యుడగు శివుడు వివాహమును చేసుకొనగలడు (22).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 141 / Viveka Chudamani - 141🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 29. కేవల బ్రహ్మము - 1 🍀*

464. కేవలము బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేదు. అది శాశ్వతము. దానికి మొదలు చివర లేదు. దానికి మార్పులేదు. మార్పు చెందదు. అందు ఏవిధమైన రెండవ పదార్థము లేదు. 

465. అచట బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేదు. అది స్థితి యొక్క సారము, విజ్ఞానము, శాశ్వతమైన ఆనందము ఏవిధమైన కర్మలు లేనిది, ఏ విధమైన ద్వంద్వ భావము లేనిది. 

466. అచట బ్రహ్మము మాత్రమే ఉన్నది. రెండవది ఏదీ లేనిది. అది విజ్ఞానము యొక్క సారము, బ్రహ్మానంద స్థితి, ఏ కర్మ చేయనిది, అందులో ఏవిధమైన ద్వంద్వత్వము లేదు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 141 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 29. Only Brahmam - 1 🌻*

464. There is only Brahman, the One without a second, infinite, without beginning or end, transcendent and changeless; there is no duality whatsoever in It.

465. There is only Brahman, the One without a second, the Essence of Existence, Knowledge and Eternal Bliss, and devoid of activity; there is no duality whatsoever in It.

466. There is only Brahman, the One without a second, which is within all, homogeneous, infinite, endless, and all-pervading; there is no duality whatsoever in It. 
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 93 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు* 
*సంకలనము : వేణుమాధవ్* 
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. చేయవలసినది- చేయదలచినది - 9 🌻 *

*మానవజీవిత రంగంలో ప్రతి ఒక్కడు పరమాత్మను తనకు సహాయంగా ఆవాహన చేసి తన హృదయంలోనికి ఆహ్వానం చేసికొనుటకు సంకేతంగా మహాభారతంలో ఈ ఘట్టం ఉన్నది.* 

*శ్రీకృష్ణుని, యుద్ధంలో సహాయమును ఆపేక్షించుట కొరకు అర్జునుడు, దుర్యోధనుడు వస్తారు. దుర్యోధనుడు తలవైపున అర్జునుడు పాదముల వైపున కూర్చొనుట ఈ కథను మనమెరుగుదుము. పాదముల వైపున కూర్చున్నవాడు అనుగ్రహింప బడినాడు.* 

*పరమాత్మ తన దొంగనిద్రలో నుండి మేల్కొని కనులు తెరిచేటప్పటికి ఎదురుగా కాళ్ళవైపున చూస్తుండగా అర్జునుడు కనబడినాడు. తలవైపున కూర్చున్న దుర్యోధనుడు కనిపించలేదు. అతడు నేను వచ్చానని చెప్పుకోవలసి వచ్చింది.* 

*నేను వచ్చానని చెప్పుకున్నవాడి గతి యుద్ధంలో ఏమైందో మనం చూశాము గదా! ఈ ప్రపంచంలోకి నేను వచ్చానండోయ్ నేనిది పాస్ అయినాను అది చదువుకున్నాను. నాకు ఆస్తి ఇంత ఉంది. నగరంలో నేనింత‌ మందిని ఎరుగుదును. నాకు హోదా ఇంత ఉంది. నేనింతమందిని కంట్రోల్ చేయగలను అన్నవాడి గతి దుర్యోధనుడి గతే అవుతుంది. ఇది లాభం లేదు.* 

*కావలసినదల్లా పాదముల దగ్గర కూర్చోగలగటమే. సంఘంలో ఉన్న జీవులను చూచి, వారిలో పరమాత్మను చూచి, తదర్చన బుద్ధితో, తదర్పణబుద్ధితో తన వృత్తి వ్యాపారాదులను ఆరంభించుకొనవలెను. ఇది మహాభారతానికి (మన జీవితానికి మధ్యన) ఉన్న సంకేతం.* 

*దుర్యోధనునితో పాటు వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని ఏమీ కోరలేదు‌ శ్రీకృష్ణుడే "యాదవుల సహాయం కావాలా? నేను ఒక్కడినే కావాలా? అని అడుగుతూ నేను యుద్ధం చేయను అస్ర్తం పట్టను, అని అన్నాడు. "నీ యుద్ధం, సహాయం కాదయ్యా నేను కోరేది. నీవు నా రథమందు వసింపుమయ్య! నందకుమారా యదుభూషణ" అని (అర్జునుడు) కోరాడు‌. కోరగానే కృష్ణుడు యుద్ధంలో రథం మీద కూర్చున్నాడు.*

.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 82 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 82. RIGHT AND WRONG 🍀*

*🕉 There is nothing right or wrong. It all depends on your standpoint. 🕉*

The same thing can be right to one person and wrong to another, because it more or less depends on the person. The same thing can be right in one moment for a person, and in another moment it can be wrong, because it depends on the situation.

You have been taught in Aristotelian categories. This is right and that is wrong. This is white and that is black. This is God and that is the devil. These categories are false. Life is not divided into black and white. Much of it is more like gray. And if you see very deeply, white is one extreme of gray, and black is another extreme, but the expanse is of gray. Reality is gray. It has to be so, because it is not divided anywhere. There are no watertight compartments anywhere. This is a foolish categorization, but it has been implanted in our minds.

So right and wrong go on changing continuously. Then what is there to do? If somebody wants to decide absolutely, he will be paralyzed; he will not be able to act. If you want to act only when you have an absolute decision about what is right, you will be paralyzed. You will not be able to act. One has to act, and to act in a relative world. There is no absolute decision, so don't wait for it. Just watch, see, and whatever you feel is right, do it. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 141 / Sri Lalita Sahasranamavali - Meaning - 141 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 141. చిత్కళా,ఽనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ ।
నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ ॥ 141 ॥ 🍀*

🍀 728. చిత్కళానందకలికా : 
ఙ్ఞానము, ఆనందము అను జ్యోతిస్వరూపిణీ 

🍀 729. ప్రేమరూపా : 
ప్రేమమూర్తి 

🍀 730. ప్రియంకరీ : 
కోరికలు సిద్ధింపచేయునది 

🍀 731. నామపారాయణప్రీతా : 
తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినది 

🍀 732. నందివిద్యా : 
అమ్మవారికి సంబందించిన ఓక మంత్ర విశేషము 

🍀 733. నటేశ్వరీ : 
నటరాజు యొక్క శక్తి 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 141 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 141. Chitkala nandakalika premarupa prinankari
Namaparayana prita nandivida nateshvari ॥ 141 ॥ 🌻*

🌻 728 ) Chid kala -   
She who is the micro power deep within

🌻 728 ) Ananda Kalika -   
She who is the happiness in beings

🌻 729 ) Prema roopa -   
She who is the form of love

🌻 730 ) Priyamkaree -  
 She who does what is liked

🌻 731 ) Nama parayana preetha -   
She who likes repetition of her various names

🌻 732 ) Nandhi vidhya -   
She who is the knowledge taught by Nandi deva (The bull god on whom shiva rides)

🌻 733 ) Nateshwaree -   
She who is the goddess of dance

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. అట్లతద్ది అంతరార్థం - అట్ల తద్ది కథ 🌹*
* 🍀 23, శనివారం అట్లతద్దె 🍀*
*🌻. పఠించవలసిన అర్థనారీశ్వర స్తోత్రం 🌻*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌟. సౌభాగ్య‌దాయిని ‘అట్ల‌త‌ద్ది’*

*అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె, అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ, గోరింటాకు పండుగ అనీ అంటారు. ఉండ్రాళ్ళ తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు, ముత్తయిదువులు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు. మరునాడు వేకువ జామునే లేచి తలస్నానం చేసి, పూజా మందిరంలో పీఠమును పనుపు, కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం, పసుపు, పువ్వులతో పూజిస్తారు. ఆ తర్వాత దేవికి అట్లు, ఇతర పదార్థాలు నైవేద్యంగా పెడతారు. అనంతరం శక్తి కొద్దీ ముగ్గురుకానీ, ఐదుగురు కానీ ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వటం ఆనవాయితీ. ఇలా చేసినందువల్ల గౌరీదేవి అనుగ్రహంతో సుఖాలు, సౌభాగ్యం కలకాలం నిలవడంతో పాటు పుణ్యం వస్తుందని చెబుతారు. ఇది అట్లతద్దె జరుపుకోవటంలో ముఖ్య ఉద్దేశ్యం. అట్లతద్దినాడు తెల్లవారు జామున పిల్లలు అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌, ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌ అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఉయ్యాలలూగుతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. పెద్దలు మాత్రం పగలంతా ఉపవసించి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి ఆరగిస్తారు.*

*🌹. అట్ల తద్ది కథ 🌹*

*🌟. అట్లతద్దికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి, మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లెలి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయమైంది. అమ్మా కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో’ అన్నాడు. రాజ కుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడషోపచారాలతో ఉమాదేవిని పూజించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ వ్రతానికి ‘చంద్రోదయ ఉమావ్రతం’ అని పేరు వచ్చింది. అయితే రాజకుమారి సోదరుని మాటలు నమ్మి వ్రత భంగం చేసింది. ఇది జరిగిన కొద్ది కాలానికి రాకుమారికి పెళ్లయింది.*

*🌟. కొంతమంది దుష్టుల మోసం వల్ల ఆమెకు ముసలి భర్త లభించాడు. ఆమె ఎంతో బాధపడింది. వ్రతం చేస్తే మంచి భర్త రావాలి గాని ఇలా ఎందుకు జరిగిందని వాపోయింది. పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. వారు ఆమె సోదరుడు ఆమెపై ప్రేమతో చేసినదంతా చెప్పారు. అయితే మర్నాడు ఆశ్వయుజ బహుళ తదియ అని ఆ రోజు చంద్రోదయ ఉమా వ్రతం చేస్తే ఆమె సమస్య తీరుతుందని చెప్పారు. ఆమె యధావిధిగా పూజ చేసి అక్షతలు భర్త మీద చల్లగానే ఆయన యవ్వనవంతుడయ్యాడు. కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సౌభాగ్యంతో తులతూగుతారు.*

*🌹. అట్లతద్ది అంతరార్థం 🌹*

*🌟. త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని, ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం.*

*🌟. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం.రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి, బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం, మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని, శక్తిని కలిగిస్తుంది.*

*🌟. ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమయినది. పిల్లలు, పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు జామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీదేవి పూజ చేసి, ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకుని, శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 తాంబూలం వేసుకోవడం, 11 ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు ‘అట్లతద్ది’ అనే పేరు వచ్చింది. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి, ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి.*

*🌟. సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల భార్యలు సరస్వతి, లక్ష్మి, పార్వతులకు నెల పొడవునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా, పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెబుతున్నాయి పురాణాలు.*

*🌹. అట్లతదియ రోజున అనుకూల దాంపత్యం కొరకు పఠించవలసిన అర్థనారీశ్వర స్తోత్రం 🌹*

చాంపేయ గౌరార్థ శరీరకాయై
కర్పూర గౌరార్థ శరీరకాయ
ధమిల్ల కాయైచ జటాధరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజః పుంజ విచర్చితాయ
కృత స్మరాయై వికృత స్మరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ఝణత్క్వణత్కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

విశాల నీలోత్పల లోచనాయై
వికాసి పంకేరుహ లోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

మందార మాలా కవితాలకాయై
కపాల మాలాంకిత కంథరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయై
నమశ్శివాయై చ నమశ్శివాయ II

అంభోధర శ్యామల కుంతలాయై
తటిత్రభా తామ్ర జటధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ
జగజ్జనన్యై జగదేక పిత్రే
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై
స్ఫురన్మహా పన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ఏతత్పఠే దష్టక నిష్టదం యో
భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ
ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం
భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః

ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్
అట్ల తద్దె 2021 తేదీ - శనివారం, అక్టోబర్ 23, 2021
తదియ తిథి ప్రారంభమవుతుంది - అక్టోబర్ 23, 2021 న 12:29 AM
తదియ తిథి ముగుస్తుంది - 03:01 AM అక్టోబర్ 24, 2021 న
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹