గీతోపనిషత్తు - సాంఖ్య యోగము :- 16. భయము - భదత్ర : -- ఎంత స్వల్పమైననూ, అతి చిన్న దైననూ ఏదో నొక ధర్మమును దైనందినముగ ఆచరించిన జీవునకు ఎంత పెద్ద భయమైననూ నివారణమగును.

🌹. గీతోపనిషత్ - 16. భయము - భదత్ర : -- ఎంత స్వల్పమైననూ, అతి చిన్న దైననూ ఏదో నొక ధర్మమును దైనందినముగ ఆచరించిన జీవునకు ఎంత పెద్ద భయమైననూ నివారణమగును., 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 40 📚

నేహాభిక్రమనాశో-స్తి ప్రత్యవాయో న విద్యతే |

స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌ || 40

మానవ జీవితమున ప్రస్తుత కాలమున భద్రత లోపించినది. భయమావరించినది. ప్రాథమిక విద్య నేర్చు పసివాని నుండి పరిపాలనము చేయు పరిపాలకుని వరకూ ఎవరును నిర్భీతిగా జీవించుట లేదు.

పిల్లలకు చదువు భయము, యువకులకు వృత్తి - ఉద్యోగ భయము, మధ్య వయస్కులకు అభివృద్ధిని గూర్చి భయము, అధికారులకు పదవీ భయము, ధనకాముకులకు ధన భయము, కీర్తి కాముకులకు అపకీర్తి భయము, అందరికీ అనారోగ్య భయము, జీవితమంతా భయం భయం. ఇవికాక, హత్యలు, మారణ హోమాలు, అభద్రత, వివిధమగు ప్రమాదాలు, యిన్ని యందు దినమొక గండముగ జీవితము సాగుచున్నది. నిస్సహాయుడైన మానవుడు కలియుగము కదాయని, సమస్తమును సరిపెట్టు కొనుచున్నాడు.

భౌగోళికముగా యిప్పుడు భూమికి చక్రవర్తి భయమను పిశాచమే. అది కారణముగా భద్రత ఎండమావిగ భావించబడుతూ యున్నది. కానీ, భద్రపథమును భగవద్గీత సూక్ష్మముగ తెలిపియున్నది. ఆ పథము శాశ్వతముగా భయమును నివారించును.

ఎంత స్వల్పమైననూ, అతి చిన్న దైననూ ఏదో నొక ధర్మమును దైనందినముగ ఆచరించిన జీవునకు ఎంత పెద్ద భయమైననూ నివారణమగును. నిరంతరత్వము, శ్రద్ధాభక్తులు, ఒక ధర్మము ననుసరించుటలో ప్రాప్తించిన జీవునకు సమస్త భయమూ పాపంచలగును.

కలియుగము కటిక చీకటిది. కటిక చీకటిలో చిన్న దీపము కూడ చక్కని వెలుగునిచ్చి దారి చూపును. అట్లే నిరంతరమూ నిర్వర్తింప బడుచున్న చిన్న ధర్మము ఎంతపెద్ద భయము నుండైనా రక్షించగలదు.

''స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌''

అని భగవానుడు వాగ్దానము చేసెను.

దీనిని విశ్వసించి ధర్మమాచరించు జీవునకు భయపడుటకు తావుండదు. భయంకరమగు భయమును అతి స్వల్పమైన ధర్మాచరణ మాలంబనముగా దాటుడు. ఇట్లు మార్గమును సుభద్రము చేసుకొనుడు.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

29.Aug.2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 39

🌹.  కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 39  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 3 🌻

ప్రత్యక్ష ప్రమాణంగా ఆత్మను నిరూపించలేము. అంటే ఎలాగండీ? ఆత్మ కదలదు. మొదటి లక్షణం.

రాయి కదలదు. మరి కదలనివి భూమండలంలో ఏం తెలుసంటే? రాళ్ళు కదలవు. కొండలు కదలవు. ఆత్మ కొండవలే వుంటుంది అన్నామనుకోండి. తప్పు. పోయింది. ఆత్మ అన్నింటినీ కదిలించగలదు అన్నాం. ఆత్మ అన్నింటినీ కదిలించగలదు అంటే? వాయువు అన్నింటినీ కదిలించగలదు కదా.

కాబట్టి ఆత్మ వాయువు వలే వుంటుంది అన్నామనుకోండి. పొరపాటు. తేడా వచ్చేసింది. అలా కుదరదు. మరి ప్రత్యక్ష ప్రమాణానికి ఇంకేం చెప్పారు? నిప్పు - పొగ. ఎక్కడైనా సరే ఒక పొగ వస్తోందంటే నిప్పుంది అని ఎవరైనా గానీ చెప్తారనమాట. కానీ అట్లా అనుమాన ప్రమాణంతో కూడా ఇది వీలుకాదు.

ఇది రెండవ ప్రమాణం అనమాట. మనం దగ్గరికి వెళ్ళి నిప్పుందో లేదో చూడలేదు. దూరం నించీ పొగ వస్తోందని చూశాం. అది వంటిల్లు కావచ్చు, ఎక్కడైనా దూరప్రదేశంలో కావచ్చు.

తద్వారా నీవేం తెలుసుకున్నావు? వాసన చేత అక్కడ వంట జరుగుతోందని, వంట జరగాలంటే నిప్పుందని, వెళ్ళి చూడక పోయినప్పటికీ కూడా ఊహించావు. ఇదేమిటిదీ? అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణంతో కూడా దీనిని మనం నిర్ణయించలేము.

రెండు ప్రమాణాలకి సంబంధించినటు వంటి ఉపమానాలని ఇక్కడ వేశారనమాట. గ్రుడ్డివారు ఏనుగు దగ్గరికి వెళ్ళారు. నలుగురు గ్రుడ్డివారు ఏనుగు దగ్గరికి వెళ్ళారు, నాలుగు వైపుల నించి ఏనుగును పట్టుకోవడానికి.

ఒకాయన తొండాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఏమన్నాడు? ఏనుగంటే మెత్తగా వుంటుంది అన్నాడు. ఒకాయన తోకను పట్టుకున్నాడు. ఏనుగంటే కుచ్చులాగా వుంటుంది అన్నాడు. ఒకాయన కాళ్ళు పట్టుకున్నాడు.

ఏనుగంటే స్థంభమువలే వుంటుందీ అన్నాడు. ఒకాయన ప్రయత్నించి ఏనుగుమీదకి ఎక్కాడు. ఏనుగంటే ఎత్తుగా వుంటుందీ అన్నాడు. అప్పుడేమయిందీ? ఈ నాలుగు లక్షణాలు ఏనుగుయొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని మనకి ఇవ్వడం లేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

29 Aug 2020

అద్భుత సృష్టి - 17

🌹.  అద్భుత సృష్టి - 17  🌹

✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. 4. DNA సైన్స్ పరంగా 🌟

DNA అంటే "డీ- ఆక్సీ రైబో న్యూక్లియిక్ ఆసిడ్". ఇది మానవులలో, సకల జీవరాశులలో ఉండే వంశపారంపర్య పదార్థం (అనువంశిక అణువు), ఒకానొక వ్యక్తి యొక్క ప్రతి కణంలో దాదాపు ఒకే DNA ఉంటుంది. DNA అనేది కణకేంద్రంలో ఉంటుంది. దీనిని "న్యూక్లియర్ DNA" అని అంటారు. ఇందులో ఆత్మసామర్ధ్యాలు మరి జ్ఞానం ఉంటాయి.

💫. కొంత DNA మైటోకాండ్రియా లో కూడా ఉంటుంది. దీనినే "మైటోకాండ్రియల్ DNA" అని అంటారు.

మైటోకాండ్రియల్ DNA స్ట్రక్చర్.. మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చి కణాలకు అందిస్తుంది.

💫. ఈ DNAగురించి సమాచారం ఏమిటి అంటే.. ఇందులో ఉన్న DNA కోడ్స్ ఏదైతే ఉందో అది అంతటా 4 కెమికల్ బేస్ లను కలిగి ఉంటుంది.

DNAలోని ప్రతి తంతులు లేక ప్రోగులు అనేక AP న్యూక్లియోటైడ్, పాలిమర్స్ ని కలిగి ఉంటాయి.

🌟. ఈ న్యూక్లియోటైడ్స్ మూడు రకాలు 🌟

1. ఫాస్పేట్ సముదాయం
2. డీఆక్సిరైబోస్ అనే చక్కెర సముదాయం
3. నత్రజని షరలు (బేసులు)

🌟. ఈ నత్రజని షరలు తిరిగి నాలుగు రకాలు:-

1. అడినైన్(Adenine)

2.గ్వానైన్ ( Guanine)

3.సైటోసిన్(Cytosine)

4.థైమైన్(Thymine)

మానవజాతి అందరి లోనూ మూడు బిలియన్ల బెస్ టోన్స్ ని కలిగి ఉంటుంది. 99% మానవజాతి అంతా ఓకే ఆధారిత బేస్ టోన్స్ కలిగి ఉంటారు. మిగిలిన 1% తేడాతోనే మానవులలో వ్యత్యాసాలు ఉన్నాయి.

💫. బేస్ టోన్స్ అయిన అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమైన్ ఒకదానితో ఒకటి కలిసి జతలుగా ఏర్పడతాయి. అంటే A,T (Adenine + Thymine) C,G (Cytosine+Guanine) తో కలిసి కొన్ని యూనియన్ లేదా యూనిట్లుగా ఏర్పడతాయి. ప్రతి బేస్.. చక్కెర అణువూ మరి ఫాస్పేట్ అణువుతో జతచేయబడి, చక్కర ఫాస్పేట్ న్యూక్లియోటైడ్ గా మారుతాయి.

💫. ఈ AT, CG అనే న్యూక్లియోటైడ్స్ ని చక్కెర ఫాస్పేట్ పొడవాటి లైన్ తో జత చేయడం జరుగుతుంది.

💫. న్యూక్లియోటైడ్స్ సముదాయాన్ని - "కోడాన్స్" అనీ.. చక్కెర ఫాస్పేట్ పొడవాటి లైన్ ను - "లైట్ ఎన్ కోడెడ్ ఫిలమెంట్" అనీ పిలుస్తారు. వీటిని అన్నింటినీ కలిపి "డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్" అని పిలుస్తారు లేదా "2 Strands DNA" అని పిలుస్తారు. ఇది మెలిపెట్టిన... సవ్యదిశలో ఉన్న నిచ్చెనలా ఉంటుంది. DNA యొక్క స్పెషాలిటీ.. తనలాంటి డూప్లికేట్స్ ని తయారుచేయడం.(కణవిభజనలో DNA కూడా విభజించబడి తిరిగి మునుపటి కణంలో ఉన్న DNA లా తిరిగి సృష్టించబడుతుంది).

🌟. డీ - ఆక్సి రైబో న్యూక్లిక్ యాసిడ్ (DNA)🌟

"డీ -ఆక్సి రైబో న్యూక్లియిక్ యాసిడ్" అనేది ఒక అనువంశిక అణువు. ఇది ప్రతి జాతి యొక్క జీవ సంపద సూచనలను కలిగి ఉంటుంది.( వంశపారంపర్య సమాచారం) పునరుత్పత్తి సమయంలో వ్యక్తి తల్లిదండ్రుల యొక్క ఆర్గానిజం నుండి సమాచారాన్ని సరఫరా చేసుకుంటూ... కొత్త జన్యువులను తయారు చేసుకుంటారు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

29 Aug 2020

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 45

🌹.   శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 45  🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా వుంది... 2 🌻

“శ్రీశైలంలో తపస్సు చేస్తాను. నంద నామ సంవత్సరంలో నేను తపస్సు ప్రారంభించబోయే ముందు, భూమి మీద కొన్ని నక్షత్రాలు రాలిపడతాయి. భూమి గడగడ వణుకుతుంది. అనేకమంది ప్రజలు మరణిస్తారు. శుభ కృత నామ సంవత్సరంలో కార్తీక మాసంలో, దక్షిణ భాగంలో అనేక ఉత్పాతాలు కనబడతాయి. అదే సమయంలో ధూమకేతు నక్షత్రం ఆవిర్భవిస్తుంది. అందువల్ల అనేకమంది మరణిస్తారు.

నేను సమాధి విడిచి విష్ణు అంశతో కలికి అవతారం ఎత్తుతాను. ప్రమాదినామ సంవత్సరానికి ఎనిమిదేళ్ళవాడినై ఎర్ర బొయీలతో కలిసి వారికి అంతర్య బుద్ధులు కల్పిస్తాను.

అక్కడినుండి శాలివాహనశకం 5407 సంవత్సరము నాటికి, సరిగా పింగళనామ సంవత్సరంలో భయంకరమైన కొట్లాటలు ప్రారంభమవుతాయి. కాళయుక్త నామ సంవత్సరం వరకూ, ఉత్తరదేశాన పోట్లాటలు విపరీతంగా జరుగుతాయి. ఆనందనామ సంవత్సరంలో మార్గశిర బహుళ అష్టమీ గురువారం మల్లిఖార్జునుడు భ్రమరాంబా సమేతంగా వింధ్యపర్వతానికి చేరతాడు.

రక్తాక్షినామ సంవత్సరంలో విజయవాడకు వచ్చి, అక్కడ పోతులూరి వారి కన్యను పెళ్ళాడి, పట్టాభిషిక్తుడనవుతాను. దుర్ముఖినామ సంవత్సరం, కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొని, దుష్ట నిగ్రహం ఆరంభిస్తాను. నేను వచ్చేసరికి కలియుగ ప్రమాణం 4094 అవుతుంది.

నా భక్తులయిన వారును సదా నమ్మి ఓం, హ్రీం, క్ల్రీం, శ్రీం, శివాయ శ్రీ వీరబ్రహ్మణే నమః అను బీజ సంపుటయైన మహామంత్రమును ఎప్పుడూ పలుకుతుంటే, వారికి నేను మోక్షం ప్రసాదిస్తాను’’

పుత్రుడు గోవిందాచార్యుల స్వామికి బ్రహ్మంగారు తెల్పిన భవిష్యత్ శ్రీ వీరబ్రహ్మంగారు, తన కుమారులకు చెప్పిన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే, మొదటగా శ్రీ బ్రహ్మంగారు విశ్వనాథ అవధూతగా పుడతారు.

ఆ తరువాత ముప్పరంలో స్వర్ణ అమరలింగేశ్వర స్వామిగా, చెరుకూరి శివరామయోగిగా జన్మిస్తారు. ఆ తరువాత వీర భోగ వసంతరాయుల అవతారం.

“నాయనా! నేను కంది మల్లయ్యపల్లె చేరి వీర బ్రహ్మ నామతో యిప్పటి వరకు 175 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ నేను ఈ కలియుగంలోని సామాన్యుల మనస్సులను మార్చి, కేవలం పరబ్రహ్మ ఉపాసకులుగా మార్చగలిగాను.

ఇప్పుడు ఈ బాధ్యతను నీవే స్వీకరించవలసి వుంది. వీరి ఆలోచనలను ఏ విధంగా మార్చగలవో అది నీ యిష్టం. నేను ఈ దినము సమాధి నిష్ఠలో ప్రవేశించేందుకు నిశ్చయించుకున్నాను. నీ సోదర సోదరీమణులను జాగ్రత్తగా సంరక్షించుకో.

నీకొక రహస్యాన్ని తెలియజేస్తున్నాను. నీ గర్భవాసంలో పరమేశ్వరియే జన్మిస్తుంది. ఆమె భూత, భవిష్యత్, వర్తమానములను తెలిసిన బ్రహ్మజ్ఞాని. ఈ కలియందలి మూఢులకు నేనెట్లు మహిమలు చూపానో, ఆమె కూడా అద్భుతములైన మహిమలు ప్రదర్శిస్తుంది.

ఆమె వాక్కులు వెంటనే ఫలిస్తాయి. చివరికామె ఆ విధంగానే సమాధి నిష్టను పొందుతుంది. నా విధంగానే అంటే ... నాకు ఏ విధంగా మఠములున్నాయో, అదే విధంగా ఆమెకు కూడా మఠములుంటాయి.

నాకే విధంగా పూజలు జరుగుతున్నాయో అలానే ఆమెకు కూడా పూజలు జరుగుతాయి. ఆ దేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవలసి వుంది. ఇక సిద్ధుని విషయంలో అసలు రహస్యం చెబుతాను విను. అతడు ఈశ్వరాంశ సంభూతుడు.

ఈతడు ఒక క్షత్రియుని ఇంత పుట్టి గోహత్య చేయటంవల్ల ఇలా మహమ్మదీయ వంశంలో జన్మించాడు. ఆ గోహత్య పాపపరిహారం కోసమే యిప్పుడు నా సేవకుడయ్యాడు.

🌻. గోవిందమ్మకు జ్ఞాన బోధ 🌻

బోధ వైశాఖ శుద్ధ దశమి, ఆదివారం అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శుభ సమయమైనందున తాను సమాధి పొందగలనని వీరబ్రహ్మంగారు ప్రకటించారు.

గోవిందమ్మ విలపించటం ప్రారంభించారు. అప్పుడు గోవిందమ్మను ఉద్దేశించి బ్రహ్మంగారు “నాకు మరణం లేదు, నీకు వైధవ్యం లేదు. నీవు సుమంగళిగా జీవించు. సమాధిని చీల్చుకుని నేను వీరభోగ వసంతరాయులనై భూమి మీద అవతరిస్తాను.

నా ధర్మ పాలనతో భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను తిరిగి అవతరించే వరకు ఏమేం జరుగుతాయో నీకు క్రమక్రమంగా వివరిస్తాను’’ అంటూ కాలజ్ఞాన బోధ మొదలుపెట్టారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం

29 Aug 2020

T̼w̼e̼l̼v̼e̼ S̼t̼a̼n̼z̼a̼s̼ f̼r̼o̼m̼ t̼h̼e̼ B̼o̼o̼k̼ o̼f̼ D̼z̼y̼a̼n̼ - 2̼6̼

🌹  T̼w̼e̼l̼v̼e̼ S̼t̼a̼n̼z̼a̼s̼ f̼r̼o̼m̼ t̼h̼e̼ B̼o̼o̼k̼ o̼f̼ D̼z̼y̼a̼n̼ - 2̼6̼   🌹 

🌴  T̼h̼e̼ P̼r̼o̼p̼h̼e̼t̼i̼c̼ R̼e̼c̼o̼r̼d̼ o̼f̼ H̼u̼m̼a̼n̼ D̼e̼s̼t̼i̼n̼y̼ a̼n̼d̼ E̼v̼o̼l̼u̼t̼i̼o̼n̼  🌴 

STANZA VI
🌻 The Final Battle - 3 
🌻

52. Earth felt a fresh inflow of forces. The Gods were tirelessly spinning the Wheel. And Earth could see how the Sparkling Thread was reaching towards her. 

The Golden Fleece presented her with a new garment, woven from stellar threads. Yes, the Golden Fleece could array many an earthling in gold-brocaded garments which would protect them from the darkness. And heroes set out in search of it...

53. The planet could not lose people. The Mysterious Origin of Life had not arisen on her only to be crowned with death, grinding into dust all the works of Eternity, which had never been made by human hand. 

No, the Earth had been begotten of the Light, and only He who gave her Life could ask for it back. But He who gives birth does not know death, for everything woven by Him contains the Threads of Immortality in its weave. 

The planet was well aware that she was immortal. Yet all her earthly mysteries were accessible to the warlocks of the darkness, and it was precisely in this situation that the principal danger lurked.

54. Evil was busy casting his magical spells, engendering monsters of a like never before seen. The Earth was as open as the palm of one’s hand, for the Light is impossible to hide — it is there for everyone to see. 

And lo, the darkness beheld the Shining Hearts of those who were full of the Spirit of Heroism. And she could not bear that dazzling Light. What she needed was stony hearts. 

So she at once sent to the heroes her monstrous progeny — Medusa the Gorgon. Even one glance at that creature could turn a living being into a heartless stone. But one hero triumphed. 

Medusa herself was beheaded and was no longer capable of harm. Wherever her two older sisters may have concealed themselves was a mystery to be solved by future generations of heroes.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #BookofDzyan #Theosophy

29 Aug 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 96

🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 96  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శంఖలిఖిత మహర్షులు - 2 🌻

7. ఈనాడు మనం కొత్తరకమయిన విజ్ఞానం నేర్చుకున్నాం. సుఖంగానే బ్రతుకుతూ ఉండవచ్చు. లౌకికమైనటువంటి దృష్టితోచూస్తే, “నాకేం లోటండీ! సైన్స్, టెక్నాలజీ, ధనం, సుఖం, వాహనాలు సంపాదించాను” అనవచ్చు. ఇవేమీ మహర్షులకు విరుద్ధంకాదు. వీటికి మహర్షులు దుఃఖపడరు. ఇవి అధర్మం అని వాళ్ళ ఉద్దేశ్యం కాదు.

8. అయితే, అతిథి అభ్యాగతుల విషయంలో ఒక సత్యము, శౌచము, ధర్మము, దేవతలను అనుగ్రహంకోసమని అర్చన చేయటము, దేశభక్తి, ప్రజలయందు ప్రసన్నత, ఇతరులయందు దయ, కష్టపడే వాళ్ళయందు సానుభూతి ఇట్లాంటి మానవధర్మాలెన్నో ఉన్నాయి. ఇవి విస్మరించడమే ధర్మపతనం.

9. పాపమే వృత్తిగా పెట్టుకున్నవాళ్ళ మాట వదిలేస్తే, మనం పాపం చేయకపోయినప్పటికీ, ధర్మాచరణం అనేటటువంటిది-ఆ ఋషులు ఏది ఆచరించారో అది-చెయ్యక పోవటం చేత, వాళ్ళు మన స్మృతిపథంలోంచీ వెళ్ళిపోతున్నారు క్రమక్రమంగా.

10. జీవహింస చేయటంలో మనలో దయాదాక్షిణ్యాలులేవు. మరో ఆలోచనలేకుండా తృణప్రాయంగా నిరాలోచనగానే లక్షల పశువులను చంపగలుగుతున్నాం మనం.

11. కష్టపడుతూ దరిద్రంలో ఉండేవాడిని మనం సానుభూతితో చూడటంలేదు. ‘వాడి కష్టానికి నాకేమయినా బాధ్యత ఉందా? వాడి కష్టాలు తీరటానికి నేనేమయినా చేయాలా?’ ఇట్లాంటి భావనలే పుట్టటంలేదు మనకు. ఎవరిమటుకు వారే, ధనవంతుడు అధిక ధనవంతుడు కావాలని! దానికి పరిమితిలేదు.

12. ‘నేను తృప్తిగా ఉన్నా’ననే భావం ఎవరికీ కలగటంలేదు. ఇటువంటి నేటి భావనలన్నీ ఆర్యధర్మములు కానేకావు. మన ఋషులు మనకు ఏ ధర్మమార్గంలో ఉండమన్నారో, ఆ మార్గానికి సంబంధించిన ధర్మాలలో నేడు మనం అతిక్రమించని ధర్మంలేదు అంటే అతిశయోక్తికాదు.

13. అందువల్ల మరల మన ఋషులను మనం స్మరిస్తే, ధర్మమార్గంలో వెళ్ళేటటువంటి మనోబుద్ధి చిత్తములు అనుగ్రహించమని మనం వారిని అర్థిస్తే, వారు అవి ప్రసాదిస్తారు. వారు దివ్యదేహాలలో ఉన్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

29 Aug 2020

శ్రీ మదగ్ని మహాపురాణము - 80

🌹.   శ్రీ మదగ్ని మహాపురాణము - 80  🌹

ప్రథమ సంపుటము, అధ్యాయము - 32

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అథ సంస్కార కథనమ్‌‌ 🌻

అగ్ని రువాచ :

నిర్వాణాదిషు దీక్షాసు చత్వారింశత్తథాష్ట చ | సంస్కారాన్కారయేద్ధీమాఞ్ఛృణు తాన్యైః సురో భవేత్‌. 1
గర్బాధానం యోన్యాం వై తతః పుంసవనం చరేత్‌ | సీమన్తోన్నయనం చైవ జాతకర్మ చ నామ చ. 2

అన్నాశనం తతశ్చూడా బ్రహ్మచర్యం వ్రతాని చ | చత్వారి వైష్ణవీ పార్థీ భౌతికీ శ్రౌతికీ తథా. 3

గోదానం స్నాతకత్వం చ పాకయజ్ఞాశ్చ సప్త తే | అష్టకా పార్వణశ్రాద్ధం శ్రావణ్యాగ్రయణీతిచ. 4

చైత్రీ చాశ్యయుజీ సప్త హవిర్యజ్ఞాశ్చ తాఞ్ఛృణు | అధానం చాగ్నిహోత్రం చ దర్శో వై పౌర్ణమాసకః. 5

చాతుర్మాస్యం పశోర్బన్ధః సౌత్రామణిరథాపరః | సోమసంస్థాః సప్త శృణు చాగ్నిష్టోమః క్రతూత్తమః. 6

అత్యగ్నిష్టోమ ఉక్థశ్చ షోడశీవాజపేయకః | అతిరాత్రాప్తోర్యామశ్చ సహస్రేశాః సవాఇమే. 7

హిరణ్యాఙ్ఘ్రిర్హిరణ్యాక్షో హిరణ్యమిత్ర ఇత్యతః | | హిరణ్యపాణి ర్హేమాక్షో మేమాఙ్గో హేమసూత్రకః. 8

హిరణ్యాస్యో హిరణ్యాఙ్గో హేమజిహ్వా హిరణ్యవాన్‌ | అశ్వమేధో హి సర్వేశో గుణాశ్చాష్టాథ తాఞ్ఛృణు. 9

దయా చ సర్వభూతేషు క్షాన్తిశ్చైవ తథార్జవమ్‌ | శౌచం చైవ మనాయాసో మఙ్గలం చాపరో గుణః. 10

అకార్పణ్యం చాస్పృహా చ మూలేన జుహుయాచ్ఛతమ్‌ | సౌరశాక్తేయ విష్ణ్వీశదీక్షాస్వేతే సమాః స్మృతాః. 11

సంస్కారైః సంస్కృతశ్చతైర్భుక్తిం ముక్తిమవాప్నుయాత్‌ | సర్వరోగాదినిర్ముక్తో దేవవద్వర్తతే నరః. 12

జప్యాద్ధోమాత్పూజనాచ్చ ధ్యానాద్దేవస్య చేష్టభాక్‌ |

ఇత్యాది మమాపురాణ ఆగ్నేయే అష్టచత్వారింశత్సంస్కారకథనం నామ ద్వాత్రింశో7ధ్యాయః.

అగ్నిదేవుడు చెప్పను :

బుద్ధిమంతు డగు పురుషుడు నిర్వాణాదిదీక్షలలో నలబదియోనిమిది సంస్కారములు చేసికొనవలెను. ఆ సంస్కారములను గూర్చి వినుము.

వీటిచే మనుష్యుడు దేవతాతుల్యు డగును. మొట్టమొదట యోనిలో, గర్భాధానము. పిమ్మట (2) పుంసవన సంస్కారము చేయవలెను: పిమ్మట (3) సీమంతోన్నయనము, (4) జాతకర్మ (5) నామకరణము (6) అన్నప్రాశనము (7) చూడాకర్మ (8) బ్రహ్మచర్యము (9) వైష్ణవి (10) పార్థి (11) భౌతిక (12) శ్రౌతికి అను నాలుగు బ్రహ్మచర్యవ్రతములు, (13) గోదానము (14) సమావర్తనము (15) అష్టక (16) అన్వష్టక (17) పార్వణశ్రాద్ధము (18) శ్రావణి (19 ఆగ్రహాయణి (20) చైత్రి (21) ఆశ్యయుజి అను ఏడు పాకయజ్ఞములు, (22) ఆధానము (23) అగ్ని హోత్రము (24) దర్శము (25) పౌర్ణమాసము (26) చాతుర్మాస్యము (27) పశుబంధము (28) సౌత్రామణి అను ఏడు హవిర్యజ్ఞములు (29) యజ్ఞములలో శ్రేష్ఠ మైన దగు అగ్నిష్టోమము (30) అత్యగ్నిష్టోమము (31) ఉక్థ్యము (32) షోడశి (33) వాజపేయము (34) అతిరాత్రము (35) అప్తోర్యామముఅను ఏడు సోమసంస్థలు, (36) హిరణ్యాంఘ్రి (37) హిరణ్యాక్షము (38) హిరణ్యమిత్రము (39) హిరణ్యపాణి (40) హేమాక్షము (41) హేమాంగము (42) హేమసూత్రము (43) హిరణ్యాస్యము (44) హిరణ్యాంగము (45) హేమజిహ్వము (46) హిరణ్యవత్తు (47) అన్ని యజ్ఞములకును అధిపతి యైన (1) అశ్వమేధము అను సహస్రేశయజ్ఞములు,

సర్వభూతదయ, క్షమ, ఋజుత్వము, శౌచము, అనాయాసము, మంగళము, అకార్పణ్యము, అస్పృహ అను ఎనిమిది గుణములు. ఈ సంస్కారములను చేయవలెను.

ఇష్టదేవతా మూల మంత్రమున నూరు ఆహుతు లివ్వవలెను.

సౌర-శాక్త-వైష్ణవ-శైవ దీక్షలలో అన్నింటియందును ఇవి సమానమే. ఈ సంస్కారములచే సంస్కృతు డగు పురుషుడు భోగములను, మోక్షమును కూడ పొందును. సమస్తరోగములచే విముక్తుడై దేవతాపురుషుడు వలె నుండును.

మునుష్యునకు ఇష్టదేవతామంత్ర జప-హోమ-పూజా-ధ్యానములచే ఆభీష్టప్రాప్తి కలుగును.

ఆగ్నేయమహాపురాణమునందలి సంస్కారవర్ణన మను ముప్పదిరెండవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

29 Aug 2020

శ్రీ శివ మహా పురాణము - 209

🌹 . శ్రీ శివ మహా పురాణము - 209 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

46. అధ్యాయము - 1

🌻. సంక్షేప సతీచరిత్రము - 2 🌻
అభవంస్తేsథ వై సర్వే తస్మిన్‌ శంభౌ పరప్రభౌ | ఉపాయ నిష్పలాస్తేషాం మమ చాపి మునీశ్వర || 14
తదాsస్మరం రమేశానం వ్యర్థోపాయస్సుతై స్సహ | అబోధయత్స ఆగత్య శివభక్తి రతస్సుధీః || 15
ప్రబోధితో రమేశేన శివతత్త్వ ప్రదర్శినా | తదీర్ష్యామత్యజం సోహం తం హఠం న విమోహితః || 16
శక్తిం సంసేవ్య తత్ర్పీత్యో త్పాదయామాస తాం తదా | దక్షాదశిక్న్యాం వీరిణ్యాం స్వపుత్రాద్ధరమోహనే || 17

ఓ మహర్షీ! పరమాత్మయగు ఆ శంభునిపై నేను, వారు ప్రయోగించిన ఉపాయములన్నియు వ్యర్థమయ్యెను (14).

ఈ రకముగా ఉపాయములన్నియూ వ్యర్థము కాగా, నేను సుతులతో గూడి రమాపతిని స్మరించితిని. అపుడు శివభక్తియందు తత్పరుడు, జ్ఞానియగు ఆ విష్ణువు వచ్చి నా మౌఢ్యమును పోగొట్టెను (15).

శివతత్త్వమును బోధించు రమాపతి నా కళ్లు తెరిపించెను. అపుడు నేను ఈర్ష్యము విడిచి పెట్టితిని. కాని మోహితుడనగు నేను మొండి పట్టును వీడలేదు (16).

అపుడు శక్తిని సేవించి ఆమె అనుగ్రహముచే, శివుని మోహింపజేయుట కొరకై, నా కుమారుడగు దక్షుని వలన వీరిణి అనబడే అశిక్ని యందు ఆమె జనించినట్లు చేసితిని (17).

సోమా భూత్వా దక్షసుతా తపః కృత్వా తు దుస్సహమ్‌ | రుద్రపత్న్య భవ ద్భక్త్యా స్వభక్తహితకారిణీ || 18
సోమో రుద్రో గృహీ భూత్వాsకార్షీల్లీలాం పరాం ప్రభుః | మోహయిత్వాsథ మాం తత్ర స్వవివాహేsవికారధీః || 19
వివాహ్య తాం స ఆగత్య స్వగిరౌ సూతికృత్తయా | రేమే బహువిమోహో హి స్వతంత్రస్స్వాత్తవిగ్రహః || 20
తయా విహరతస్తస్య వ్యతీయాయ మహాన్మనే | కాలస్సుఖరశ్శంభోర్నిర్వి కారస్య సద్రతేః || 21
తతో రుద్రస్య దక్షేణ స్పర్ధా జాతా నిజేచ్ఛయా | మహామూఢస్య తన్మాయో మోహితస్య సుగుర్విణః || 22

ఆ ఉమాదేవి దక్షుని కుమార్తెగా జన్మించి, దుస్సహమగు తపస్సును భక్తితో చేసి రుద్రునకు పత్ని ఆయెను. ఆమె తన భక్తులకు హితమును కలుగజేయును (18).

పరమేశ్వరుడగు రుద్రుడు ఉమాదేవితో కూడి గృహియై లీలలను ప్రకటించెను. ఆయన బుద్ది యందు వికారములేమియూ ఉండవు. ఆయన తన వివాహముందు నన్ను మోహింపజేసెను (19).

సృష్టిని చేయువాడు, మోహములేని వాడు, స్వతంత్రుడు, స్వేచ్ఛచే రూపమును ధరించిన వాడునగు రుద్రుడు ఆమెను వివాహమాడి, తన పర్వతమును చేరి బహువిధముల రమించెను (20).

ఓ మహర్షీ! వికారములు లేనివాడు, సద్విహారియగు శంభుడు చిరకాలము ఆమెతో కలిసి విహరించుచూ సుఖముగా గడిపెను (21).

అపుడు రుద్రునకు మహామూర్ఖుడు, శివమాయచే మోహితుడు, గర్విష్ఠి అగు దక్షునితో, తన ఇచ్ఛ చేత విరోధము ఏర్పడెను (22).

తత్ర్పభావాద్ధరం దక్షో మహాగర్వి విముఢధీః | మహాశాంతం నిర్వికారం నినింద బహు మోహితః || 23
తతో దక్షస్స్వయం యజ్ఞం కృతవాన్‌ గర్వితోsహరమ్‌ | సర్వా నాహూయ దేవాదీన్‌ విష్ణుం మాం చాఖిలాధిపః || 24
నాజుహావ తథాభూతో రుద్రం రోషసమాకులః |తథా తత్ర సతీం నామ్నా స్వపుత్రీం విధి మోహితః || 25
యదా నాకారితా పిత్రా మాయామోహిత చేతసా | లీలాం చకార సుజ్ఞానా మహాసాధ్వీ శివా తదా || 26

గొప్ప గర్వము గలవాడు, విమోహితమైన బుధ్ధి గలవాడునగు దక్షుడు, మిక్కిలి శాంతుడు, వికార రహితుడునగు శివుని మాయా ప్రభావముచే మిక్కలి మోహితుడై అనేక విధములుగా నిందించెను (23).

అపుడు గర్వితుడగు దక్ష ప్రజాపతి దేవతలను, ఇతరులను, నన్ను, విష్ణువును అందరినీ ఆహ్వానించి శివుడు లేని యజ్ఞమును చేసెను (24).

మాయామోహితుడు, గర్విష్ఠి, రోషముతో కల్లోలితమైనమనస్సు గలవాడునగు దక్షుడు రుద్రుని, సతియను తన పుత్రికను ఆ యజ్ఞమునకు ఆహ్వానించలేదు (25).

మాయచే విమూఢమైన మనస్సు గల తండ్రి ఆహ్వానించకపోగా, గొప్ప జ్ఞానవతి మహాసాధ్వియగు సతీదేవి లీలను ప్రకటించెను (26).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

29 Aug 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 28

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 28 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని మూడవ పాత్ర : సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 6 🌻

104. బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు ప్రధాన దేవదూతలు.వీరు పరిమిత జీవితమును హెచ్చు ప్రమాణములో సృష్టించుట యందును, దానిని పోషించుటయందును, పోషించిన దానిని లయమొనర్చుటయందును గల భగవంతుని ప్రధాన దివ్య ధర్మములను వ్యక్తపరచుటలో ఈ ప్రధాన దేవదూతలు మధ్యవర్తులుగా నుందురు.

105. భగవంతుని అపరిమిత జ్ఞానమును పరిమిత ప్రమాణములో నివేదించుటలో కూడా మధ్యవర్తులుగానుందురు.

106.ప్రధాన దేవదూతలు సత్వములు. వారెల్లప్పుడు భోగములనుభవింతురే కాని బాధలను పొందరు.

107. అనంతమైన భగవల్లీల 'కారణము'గా దివ్య సుషుప్తి యైన మూల స్థితికి భంగము కలిగి, దాని ఫలితముగా సృష్టి కార్యరూపం దాల్చినది. ఇవియే కార్యకారణ ధర్మములు.

108. భగవంతునికి సృష్టి-స్థితి-లయము అనెడు ప్రధాన ధర్మములను ప్రసాదించుటలో భగవంతుని ఆది విలాసమే బాధ్యత కలదై యున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

29 Aug 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 37 / 𝙎𝙧𝙞 𝙂𝙖𝙟𝙖𝙣𝙖𝙣 𝙈𝙖𝙝𝙖𝙧𝙖𝙟 𝙇𝙞𝙛𝙚 𝙃𝙞𝙨𝙩𝙤𝙧𝙮 - 37

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 37 / 𝙎𝙧𝙞 𝙂𝙖𝙟𝙖𝙣𝙖𝙣 𝙈𝙖𝙝𝙖𝙧𝙖𝙟 𝙇𝙞𝙛𝙚 𝙃𝙞𝙨𝙩𝙤𝙧𝙮 - 37  🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 8వ అధ్యాయము - 2 🌻

పాటిల్ ఉద్రిక్తుడయ్యేట్టు, అతను పాటిల్ పైన అసభ్యకరమైన సూచనలు చేస్తాడు. ఆకోపంలో పాటిల్ మార్యా చేతిమీద కర్రతో ఒక బలమయిన దెబ్బ కొట్టాడు. పాటిల్ లాంటి బలమయిన వ్యక్తి యొక్క గట్టి దెబ్బకి మార్యా చెయ్యవిరిగి, నిస్పృహుడిని చేసింది. మార్యా బంధువులు అతనని దేష్ ముఖ్ దగ్గరికి తీసుకు వెళ్ళారు, ఈ అవకాశాన్ని అందుకుని ఇతను ఖాండుపాటిల్ ను ఇరికించి, బాధించాడు. 

మార్యను, దేష్ ముఖ్ పోలీసు స్టేషను తీసుకు వెళ్ళి అక్కడ అధికారికి ఈవిషయం నివేదిస్తాడు. సమాజంలో ఎప్పుడు ఈవిభజన ఉందో, చాలాచిన్నచిన్న విషయాలుకూడా, ఒకరినొకరు అతిగా తూలనాడేందుకు, కించపరచడానికి చూస్తారు. ఆ ఆఫీసరు పిర్యాదు స్వీకరించి, పుస్తకంలో వ్రాసి, మార్యా చెయ్యంలో పాటిల్ మా జవాబుదారుడనని కరు అతిగా ఊడ అధికారికి అవకాశాన్ని అందుకు ఖాండుపాటిల్ ను నిర్భందిచేందుకు సూచనలు జారీచేసాడు. 

ఈ వార్త షేగాంలో దావానలంలా వ్యాపించింది. దీనికి సహజంగా పాటిల్ కూడాభయపడ్డాడు. అతను ఈ నిర్భందింపబడడం అనే అవమానంనుండి రక్షించమని శక్తిసాలి అయిన భగవంతుని ప్రార్ధించాడు. గౌరవనీయమయిన వ్యక్తికి అవమానం చావుకంటే కనిష్ట మయినది. ఇతని సోదరులు కూడా చింతితులయి అసహాయులుగా భావంచారు. 

అప్పుడు ఖాండుపాటిల్ కు అకస్మాత్తుగా తట్టింది, తను శ్రీమహారాజు దగ్గరకు వెళ్ళి ఆయనసహాయం కోరడం మంచిది అని. ఈయన తప్ప వేరెవరు ఈఉపద్రవం నుండి కాపాడలేరు అని. న్యాయపరమయిన మానవ ప్రయత్నాలకు అతని సోదరులు అకోలా వెళ్ళారు. రాత్రి తిన్నగా ఖాండుపాటిల్ శ్రీమహారాజు దగ్గరకు వెళ్ళాడు. 

శ్రీమహారాజుకు నమస్కరించి, మొత్తం వృత్తాంతం అంతా వర్ణించాడు. ప్రభుత్వ కార్యంనిరాకరించిన కారణంగా నేను మాహర్ ను కొట్టాను. దీనిని అవకాశంగా తీసుకొని, దేష్ముఖ్ నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. వీళ్ళు నన్ను నింర్భందించడానికి ఏర్పాటు చేస్తున్నారు, మీరుతప్ప మరివేరెవరు నన్ను రక్షించడానికి లేరు. 

రేపు నన్ను నిర్భందిచడానికి పొలీసు రావచ్చు. దయచేసి దానికి ముందు నన్ను చంపండి. నేను పరువుగల వ్యక్తిని, కావున ఈవిధమయిన నిర్భంధం చావుకు సరిసమానం వంటిది. నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నాను, కానీ దీనిని వీళ్ళు ఉన్నదానికన్నా చాలా అతిగా చిత్రిస్తున్నారు. దయచేసి నన్ను ఈ నిరాదరణ నుండి కాపాడండి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹  𝙎𝙧𝙞 𝙂𝙖𝙟𝙖𝙣𝙖𝙣 𝙈𝙖𝙝𝙖𝙧𝙖𝙟 𝙇𝙞𝙛𝙚 𝙃𝙞𝙨𝙩𝙤𝙧𝙮 - 37  🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 8 - part 2 🌻

Marya had blatantly refused to go saying that he was a subordinate to the Deshmukh only. He made some nasty gesticulations at Patil, which infuriated him. In the fury, Patil gave a forceful blow with a stick on Marya's hand. 

This blow fractured Marya's hand, making him unconscious. Patil sent the dak with some other man. The relatives of the Marya took him to the Deshmukh, who grabbed this opportunity to corner and trouble Khandu Patil. 

Deshmukh took Marya to the police station and reported the matter to the officer. Whenever there are conflicting groups in the society, even the small things are magnified by the individual groups to denounce each other. 

The Officer registered the complaint and issued orders to arrest Khandu Patil. The news spread like wildfire in Shegaon and Patil, naturally, got frightened and worried over the impending danger. He prayed to the Almighty God to save him from the humiliation of arrest. 

For a man of dignity, an insult is worse than death. All his brothers too were worried and were feeling helpless. Then it suddenly occurred to Khandu Patil that he should surrender himself to Shri Gajanan Maharaj and seek His help as none else would be able to save him from this calamity. 

His brothers went to Akola for legal and personal efforts. Khandu Patil went straight to Shri Gajanan Maharaj that night. He prostrated before Shri Gajanan Maharaj and narrated the whole episode. He said, I gave a beating to one Mahar as he refused to do Government work and that matter is being used by the Deshmukh to put me in trouble. 

They are arranging to get me arrested and there is nobody to save me except you. Tomorrow the policemen will come to arrest me. Please kill me before that. I am a man of dignity and an insult, such as arrest, is as good as death to me.

I do accept my mistake, but that is being exaggerated out of proportion. Please save me from this contempt.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

29 Aug 2020

శివగీత - 46 / 𝙏𝙝𝙚 𝙎𝙞𝙫𝙖-𝙂𝙞𝙩𝙖 - 46

🌹.  శివగీత - 46 / 𝙏𝙝𝙚 𝙎𝙞𝙫𝙖-𝙂𝙞𝙩𝙖 - 46  🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
షష్ట మాధ్యాయము

🌻. విభూతి యోగము - 10 🌻

వేదై రవే షై రహమేవ వేద్యో 
వేదాంత క్రుద్వేద విదేవ చాహమ్,
న పుణ్య పాపే మయి నాస్తి నాశో
న జన్మ దేహేంద్రి య బుద్ధ యశ్చ 57

న భూమిరాపో న చ వ హ్నిరస్తి
న చానిలో మేస్తి న మే నభశ్చ
ఏవం విదిత్వా పరమాత్మ రూపం
గుహాశయం నిష్కల మద్వితీయమ్ 58

సమస్త సాక్షిం సద సద్విహీనం
ప్రయాతి శుద్ధం పరమాత్మ రూపమ్,
ఏవం మాం తత్త్వతో వేత్తి - యస్తు రామ మహీపతే !
స ఏవ నాన్యో లోకేషు - కైవల్య పల మశ్నుతే 59

ఇతి శ్రీపద్మ పురానే శివగీతాయాం షష్టోధ్యాయః

సమస్త వేదములద్వారా తెలిసికొనదగిన వాడిని నేనే. వేదాంతములను రచించిన వాడిని, వేదములను గుర్తించిన వాడిని, పుణ్యపాపముల కతీతుడను, నా కంతమనునది లేనేలేదు. (నాశనము లేదు).

జనన దేహేంద్రి యములు బుద్ధి శూన్యములు, మరియు నాకు పృథ్వీ అప్పు - తేజ - ఆకాశము - వాయువు అనే పంచతత్వముల కతీతుడను,

ఈ ప్రకారముగా నెవ్వడైతే పరమాత్మను ఒక్కనిగాను సమస్త సాక్షిగాను, శుద్ధ స్వరూపునిగాను, సద సద్విహీనునిగాను, హృదయ స్థితుడనైన నన్ను తెలిసికొందురో వారే కైవల్యమును పొందుదురు, ఇతరులు పొందలేరు.

ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణంతర్గతం బైన శివ గీతలో ఆరవ అధ్యాయము సమాప్తము.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

🌹  𝙏𝙝𝙚 𝙎𝙞𝙫𝙖-𝙂𝙞𝙩𝙖 - 46  🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 06 :
🌻 Vibhooti Yoga - 10
🌻

I am the one to be known through all the Vedas. I am the creator of Vedas and Vedanta.

I'm the knower of Vedas. I am beyond virtues and vices. There is nothing called as 'End' to me. I am beyond birth and death.

I am beyond the five elemental nature. In this way whoever realizes me as the paramatma who is the all witnesser, who is pure, who dwells in hearts; such people only reaches me.

O Rama! in this way whoever realizes me truly, only that one would gain Kaivalya, others would not.

Here ends the chapter 6 of Shiva Gita present in Padma Purana Uttara Khanda...

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

29 Aug 2020

నారద భక్తి సూత్రాలు - 80

🌹.  నారద భక్తి సూత్రాలు - 80  🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము - సూత్రము - 48

🌻. 48. యః కర్మ ఫలం త్యజతి, కర్మాణి

సంన్యస్యతి తతో నిర్వంద్వో భవతి ॥| 🌻

ఎవడు కర్మ ఫలాన్ని ఆశించడో, ఎవడు లోకంలో న్వార్ధపూరితమైన కర్మలను చెయడో, ఇతర కర్మలను చెసినా, చేయనివాదుగా ఉంటాడో చెసిన కర్మలను భగవదర్పితం చేసి కర్మ సన్వాసి అవుతాడో అతడు సుఖ దుఃఖాది ద్వంద్వానుభవాలకు అతీతుదవుతాడు.

వ్యవసాయ, వ్యాపారాలలో, ఉద్యోగ, వృత్తులలో ఫలితాన్ని లాభాన్ని జీతాన్ని ఆశిస్తాం. అనుకున్న దానికంటే తక్కువో, ఎక్కువో వస్తుంది. అయినా పురుష ప్రయత్నంగా మన పని మనం చెస్తూ పోవాలి.

ఫలితం కర్మాధథనం కాబట్టి ,అది అలాగే ఉంటుందని సరిపెట్టుకోవాలి. ఈ విధంగా కొంతకాలం అభ్యాసం చేయగా చెయగా, ఫలత్యాగ బుద్ధి దానంతటదే స్థిరమవుతుంది. చివరకు నిష్కామ కర్మయోగం సిద్ధిస్తుంది.

సాధారణంగా మానవుడు జీవభావం ఉన్నంతవరకు నిష్మామకర్మ యోగం చేయలెడు. భగవానునితో అనుసంధానమైనప్పుడు మాత్రమె ప్రకృతికి సంబంధించిన విషయాలు పట్టవు.

భగవంతుని కళ్యాణ గుణాలను సంకీర్తన చేస్తూ, తదర్ధాన్ని తనలో నింపుకుంటూ, యోగి కావాలి. ఇంద్రియ భోగాలకు లోనైనప్పుడల్లా పశ్చాత్తాపపడుతూ తిరిగి భగవంతునికి పునరంకిత మవుతూ ఉండాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

29 Aug 2020

శ్రీ లలితా సహస్ర నామములు - 7͙7͙ / S͙r͙i͙ L͙a͙l͙i͙t͙a͙ S͙a͙h͙a͙s͙r͙a͙n͙a͙m͙a͙v͙a͙l͙i͙ - M͙e͙a͙n͙i͙n͙g͙ - 7͙7͙

🌹.  శ్రీ లలితా సహస్ర నామములు - 7͙7͙ / S͙r͙i͙ L͙a͙l͙i͙t͙a͙ S͙a͙h͙a͙s͙r͙a͙n͙a͙m͙a͙v͙a͙l͙i͙ - M͙e͙a͙n͙i͙n͙g͙ - 7͙7͙  🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 147

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్ప నిభాకృతి:

ఓజోవతీ ద్యుతిధరా యఙ్ఞరూపా ప్రియవ్రతా

763. స్వర్గాపవర్గదా :  స్వర్గమును, మోక్షమును కూడా ఇచ్చునది
764. శుద్ధా : పరిశుద్ధమైనది
765. జపాపుష్ప నిభాకృతి: : జపాపుష్పములవలె ఎర్రని ఆకృతి కలది
766. ఓజోవతీ : తేజస్సు కలిగినది
767. ద్యుతిధరా : కాంతిని ధరించినది
768. యఙ్ఞరూపా :  యఙ్ఞము రూపముగా కలిగినది
769. ప్రియవ్రతా :  ప్రియమే వ్రతముగా కలిగినది

🌻. శ్లోకం 148

దురారాధ్యా దురాధర్షా పాటలీ కుసుమ ప్రియా

మహతీ మేరునిలయా మందార కుసుమప్రియా

770. దురారాధ్యా ;  కష్ట సాధ్యమైన ఆరాధన కలిగినది
771. దురాధర్షా : చుచూటకు కష్ట సాధ్యమైనది
772. పాటలీ కుసుమప్రియా : పాటలీపుష్పమునందు ప్రీతి కలిగినది
773. మహతీ :  గొప్పదైనది
774. మేరునిలయా : మేరుపర్వతము నివాసముగా కలిగినది
775. మందారకుసుమప్రియా : మందారపువ్వులు అంటే ప్రీతి కలిగినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹.   Sri Lalita Sahasranamavali - Meaning - 77  🌹
📚. Prasad Bharadwaj

🌻 Sahasra Namavali - 77 🌻

763) Trigunathmika -
She who is personification of three gunas viz .,Thamo (Kali), Rajo (Dhurga) and Sathva (Parvathy)

764) Swargapavargadha -
She who gives heaven and the way to it

765) Shuddha -
She who is clean

766) Japapushpa nibhakrithi -
She who has the colour of hibiscus

767) Ojovathi -
She who is full of vigour

768) Dhyuthidhara -
She who has light

769) Yagna roopa -
She who is of the form of sacrifice

770) Priyavrudha -
She who likes penances

771) Dhuraradhya -
She who is rarely available for worship

772) Dhuradharsha -
She who cannot be won

773) Patali kusuma priya -
She who likes the buds of Patali tree

774) Mahathi -
She who is big

775) Meru nilaya -
She who lives in Meru mountain.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi

29 Aug 2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 140

🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 140  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

సృష్టిలో ఒక్కొక్క డొక్కొక్క విధముగా వర్తించును. ఎందరిని గూర్చి తెలిసికొన్నను , ఎన్ని శాస్త్ర రహస్యములు నేర్చినను , తెలిసికొన వలసినది మిగిలియే యుండును.

వాని యందు సర్వాంతర్యామిగా నున్న తత్త్వమొక్కటే గనుక దాని వైపునకు మనస్సు మరలింపజేయ గలిగినచో తెలియవలసినది మరియొకటి యని యుండదు. ఆ మార్గమలవాటు పడిన వెనుక మరియొకటి ఏదియును మనస్సునాకర్షింపదు‌.

🌻. ఆశీర్వచనం 🌻

నేను ఏనాడు దేనికి భయపడలేదు
మీరు భయపడకుందురు గాక!
నా పెదవులపై ఏనాడు చిరునవ్వు చెదరలేదు...
అట్టి చిరునవ్వుతో మీరూ ఉందురు గాక!

శక్తులూ, సామర్థ్యాలు, తెలివీ తేట
సత్కర్మాచరణకు వినియోగించి 
ధన్యులగుదురు గాక!... 

"నేను" అనే ఒకే వెలుగులో మీరు
మేల్కాంచి "నా" వెలుగులో నడచెదరు గాక!  ............✍ మాస్టర్ ఇ.కె. 🌻 

29-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 473 / Bhagavad-Gita - 473🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 261🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 141🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 163🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 77 / Sri Lalita Sahasranamavali - Meaning - 77🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 80 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 50🌹
8) 🌹. శివగీత - 46 / The Shiva-Gita - 46🌹
9) 🌹. సౌందర్య లహరి - 88 / Soundarya Lahari - 88🌹
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 28🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 388 / Bhagavad-Gita - 388🌹

12) 🌹. శివ మహా పురాణము - 209🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 85 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 80 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 96 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 27🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 45 🌹
18) 🌹. అద్భుత సృష్టి - 17 🌹
19) 🌹 Seeds Of Consciousness - 160🌹 
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 39🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 16 📚
22)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 473 / Bhagavad-Gita - 473 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 18 🌴*

18. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమస: పరముచ్యతే |
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితమ్ ||

🌷. తాత్పర్యం : 
తేజోపూర్ణములైన సర్వములందు తేజ:కారణుడతడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము, జ్ఞానవిషయము, జ్ఞానగమ్యము కూడా అతడే. అతడే ఎల్లరి హృదయములందు స్థితుడై యున్నాడు.

🌷. భాష్యము :
సూర్యుడు,చంద్రుడు, నక్షత్రములు వంటి తేజోమయములైన వాని తేజమునకు పరమాత్ముడే (దేవదేవుడే) కారణు. ఆధ్యాత్మికజగమునందు సూర్యుడు లేదా చంద్రుని అవసరము లేదనియు. దేవదేవుని తేజము అచ్చట విస్తరించియుండుటయే అందులకు కారణమనియు వేదవాజ్మయమున తెలుపబడినది. 

కాని భగవానుని తేజమైన ఆ బ్రహ్మజ్యోతి ఈ భౌతికజగమునందు మహాతత్త్వముచే (భౌతికాంశములు) కప్పుబడుట వలన ఇచ్చట వెలుగు కొరకు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు మనకు అవసరములగుచున్నవి. ఇటువంటివి ఆధ్యాత్మికజగత్తున ఏమాత్రము అవసరముండవు. 

భగవానుని ప్రకాశమానమైన కాంతి చేతనే సర్వమును ప్రకాశింపజేయబడుచున్నదని వేదములందు స్పష్టముగా తెలుపబడినది. దీనిని బట్టి అతడు భౌతికజగత్తు నందు స్థితిని కలిగిలేదని స్పష్టమగుచున్నది.

 ఆధ్యాత్మికకాకాశమున అత్యంతదూరములో దివ్యధామమునందు అతడు స్థితుడై యున్నాడు. ఈ విషయమును వేదములు సైతము నిర్ధారించియున్నవి. 

“ఆదిత్యవర్ణం తమస: పరస్తాత్ (శ్వేతాశ్వతరోపనిషత్తు 3.8) అనగా సూర్యుని వలె నిత్యకాంతిమంతుడైన భగవానుడు ఈ భౌతికజగత్తు అంధకారమునకు ఆవల నున్నాడు”.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 473 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 18 🌴*

18. jyotiṣām api taj jyotis
tamasaḥ param ucyate
jñānaṁ jñeyaṁ jñāna-gamyaṁ
hṛdi sarvasya viṣṭhitam

🌷 Translation : 
He is the source of light in all luminous objects. He is beyond the darkness of matter and is unmanifested. He is knowledge, He is the object of knowledge, and He is the goal of knowledge. He is situated in everyone’s heart.

🌹 Purport :
The Supersoul, the Supreme Personality of Godhead, is the source of light in all luminous objects like the sun, moon and stars. In the Vedic literature we find that in the spiritual kingdom there is no need of sun or moon, because the effulgence of the Supreme Lord is there.

 In the material world that brahma-jyotir, the Lord’s spiritual effulgence, is covered by the mahat-tattva, the material elements; therefore in this material world we require the assistance of sun, moon, electricity, etc., for light. But in the spiritual world there is no need of such things. It is clearly stated in the Vedic literature that because of His luminous effulgence, everything is illuminated.

 It is clear, therefore, that His situation is not in the material world. He is situated in the spiritual world, which is far, far away in the spiritual sky. That is also confirmed in the Vedic literature.

 Āditya-varṇaṁ tamasaḥ parastāt (Śvetāśvatara Upaniṣad 3.8). He is just like the sun, eternally luminous, but He is far, far beyond the darkness of this material world.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 261 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 31
F🌴 Description of ‘Dasa Maha Vidyas’ (Ten aspects of Sri Devi) - 2 🌴*

*🌻 The story of Lopamudra and Agastya - 2 🌻*

Ilvala and Vatapi were brothers. Vatapi would take the form of a goat.  Ilvala would kill that goat and offer it along with food to the guest. After the guest finished the meal, Ilvala would call ‘Vatapi! Come out.’  

He would tear open the abdomen of the guest and come out. Then both demons would eat that guest. After Agastya finished eating goat meat, Ilvala called, ‘Vatapi! Come out.’  

But Agastya said, ‘Jeernam, Jeernam, Vatapi Jeernam’ (may Vatapi be digested). By the will of Agatsya, Vatapi got digested. As promised by him, Ilvala gave great amount of money to Agatsya.  

Thus people got rid of Vatapi and Ilvala’s menace. Agatsya once attracted the water of all the seven seas into his ‘kamandalam’ and drank it. He also destroyed the arrogance of Vindhyachala. He is still  present in the southern part of India in the form of Maha Siddha.  

He invented Tamil language. He built temples at many places. When I come as avathar of Kalki Bhagwan, Agatsya will be a ‘Guru’ like Parasurama.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 140 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 సృష్టిలో ఒక్కొక్క డొక్కొక్క విధముగా వర్తించును. ఎందరిని గూర్చి తెలిసికొన్నను , ఎన్ని శాస్త్ర రహస్యములు నేర్చినను , తెలిసికొన వలసినది మిగిలియే యుండును. 
 
వాని యందు సర్వాంతర్యామిగా నున్న తత్త్వమొక్కటే గనుక దాని వైపునకు మనస్సు మరలింపజేయ గలిగినచో తెలియవలసినది మరియొకటి యని యుండదు. ఆ మార్గమలవాటు పడిన వెనుక మరియొకటి ఏదియును మనస్సునాకర్షింపదు‌.

🌻. ఆశీర్వచనం 🌻

నేను ఏనాడు దేనికి భయపడలేదు 
మీరు భయపడకుందురు గాక!
నా పెదవులపై ఏనాడు చిరునవ్వు చెదరలేదు... 
అట్టి చిరునవ్వుతో మీరూ ఉందురు గాక!

శక్తులూ, సామర్థ్యాలు, తెలివీ తేట
సత్కర్మాచరణకు వినియోగించి 
ధన్యులగుదురు గాక!... 

"నేను" అనే ఒకే వెలుగులో మీరు
మేల్కాంచి "నా" వెలుగులో నడచెదరు గాక!............✍ *మాస్టర్ ఇ.కె.* 🌻 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 161 🌹*
*🌴 The Buddhic Plane - 3 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Guidance from Within - 2 🌻*

The purpose of studying wisdom is to step forward to the Atmic plane and to enter into self-awareness which we call the I AM or the soul. 

There, wisdom disappears, just as the mental concepts have disappeared before hand already. Everything disappears - only the beauty of the awareness of existence remains.

The reasoning capacity of an elephant does not fit into that of a fly. Buddhi, the capacity of the soul, is much greater than the capacity of the brain. 

Thus, it resides outside of the brain rather than within. The brain is only an instrument of the soul and, hence, the reasoning capacity of it. The initiate does not think with the brain, but outside of it. 

That is why many initiates are proclaimed insane by their fellow men who cannot understand them. The one, for example, who lives in the higher realms of the Buddhic plane does not consider anything to belong to him, while the average man constantly thinks in terms of “mine” and “yours”. 

For the initiate, it is an experience that everything belongs to the One, even he himself. He does not think “my possession, my house, my land…” When he contemplates upon the soul, he forgets his body. 

The idea of holding on to something belongs to the reasoning capacity and the lower levels of Buddhi.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: Mithila / seminar notes – Master E. Krishnamacharya: Occult Anatomy / Full Moon Meditations.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 77 / Sri Lalita Sahasranamavali - Meaning - 77 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 147

 *స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్ప నిభాకృతి:* 
*ఓజోవతీ ద్యుతిధరా యఙ్ఞరూపా ప్రియవ్రతా*

763. స్వర్గాపవర్గదా : 
స్వర్గమును, మోక్షమును కూడా ఇచ్చునది 

764. శుద్ధా : పరిశుద్ధమైనది 

865. జపాపుష్ప నిభాకృతి: : జపాపుష్పములవలె ఎర్రని ఆకృతి కలది 

766. ఓజోవతీ : తేజస్సు కలిగినది 

767. ద్యుతిధరా : కాంతిని ధరించినది 

768. యఙ్ఞరూపా : 
యఙ్ఞము రూపముగా కలిగినది 

769. ప్రియవ్రతా : 
ప్రియమే వ్రతముగా కలిగినది 

🌻. శ్లోకం 148

*దురారాధ్యా దురాధర్షా పాటలీ కుసుమ ప్రియా*
*మహతీ మేరునిలయా మందార కుసుమప్రియా* 

770. దురారాధ్యా ; 
కష్ట సాధ్యమైన ఆరాధన కలిగినది 

771. దురాధర్షా : 
చుచూటకు కష్ట సాధ్యమైనది 

772. పాటలీ కుసుమప్రియా :
 పాటలీపుష్పమునందు ప్రీతి కలిగినది
 
773. మహతీ : 
గొప్పదైనది 

774. మేరునిలయా : 
మేరుపర్వతము నివాసముగా కలిగినది 

775. మందారకుసుమప్రియా :
 మందారపువ్వులు అంటే ప్రీతి కలిగినది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 77 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 77 🌻*

763 ) Trigunathmika -   
She who is personification of three gunas viz .,Thamo (Kali), Rajo (Dhurga) and Sathva (Parvathy)

764 ) Swargapavargadha -   
She who gives heaven and the way to it

765 ) Shuddha -   
She who is clean

766 ) Japapushpa nibhakrithi -   
She who has the colour of  hibiscus

767 ) Ojovathi -   
She who is full of vigour

768 ) Dhyuthidhara -   
She who has light

769 ) Yagna roopa -   
She who is of the form of sacrifice

770 ) Priyavrudha -   
She who likes penances

771 ) Dhuraradhya -   
She who is rarely available for worship

772 ) Dhuradharsha -   
She who cannot be won

773 ) Patali kusuma priya -   
She who likes the buds of Patali tree

774 ) Mahathi -   
She who is big

775 ) Meru nilaya -   
She who lives in Meru mountain.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నారద భక్తి సూత్రాలు - 80 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
 తృతీయాధ్యాయము - సూత్రము - 48

*🌻. 48. యః కర్మ ఫలం త్యజతి, కర్మాణి*
*సంన్యస్యతి తతో నిర్వంద్వో భవతి ॥|* 🌻

ఎవడు కర్మ ఫలాన్ని ఆశించడో, ఎవడు లోకంలో న్వార్ధపూరితమైన కర్మలను చెయడో, ఇతర కర్మలను చెసినా, చేయనివాదుగా ఉంటాడో చెసిన కర్మలను భగవదర్పితం చేసి కర్మ సన్వాసి అవుతాడో అతడు సుఖ దుఃఖాది ద్వంద్వానుభవాలకు అతీతుదవుతాడు.

వ్యవసాయ, వ్యాపారాలలో, ఉద్యోగ, వృత్తులలో ఫలితాన్ని లాభాన్ని జీతాన్ని ఆశిస్తాం. అనుకున్న దానికంటే తక్కువో, ఎక్కువో వస్తుంది. అయినా పురుష ప్రయత్నంగా మన పని మనం చెస్తూ పోవాలి. 

ఫలితం కర్మాధథనం కాబట్టి ,అది అలాగే ఉంటుందని సరిపెట్టుకోవాలి. ఈ విధంగా కొంతకాలం అభ్యాసం చేయగా చెయగా, ఫలత్యాగ బుద్ధి దానంతటదే స్థిరమవుతుంది. చివరకు నిష్కామ కర్మయోగం సిద్ధిస్తుంది. 

సాధారణంగా మానవుడు జీవభావం ఉన్నంతవరకు నిష్మామకర్మ యోగం చేయలెడు. భగవానునితో అనుసంధానమైనప్పుడు మాత్రమె ప్రకృతికి సంబంధించిన విషయాలు పట్టవు. 

భగవంతుని కళ్యాణ గుణాలను సంకీర్తన చేస్తూ, తదర్ధాన్ని తనలో నింపుకుంటూ, యోగి కావాలి. ఇంద్రియ భోగాలకు లోనైనప్పుడల్లా పశ్చాత్తాపపడుతూ తిరిగి భగవంతునికి పునరంకిత మవుతూ ఉండాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 49 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj

So, Mother Goddess asked for such an initiation. Lord Shiva said that nobody ever asked him such a question. Those saints are not ordinary people.  

They are very accomplished, wellversed in all Vedas and scriptures, capable of creating and sustaining life. Yet, they never asked such a question because arrogance comes naturally to spiritual seekers.   

Some people who buy something new, like a new phone, approach someone to show them how to use the phone. When the person starts explaining, the owner of the phone cuts him off midway saying he’s understood how to use the phone. 

A few days later, they realize they only know a little. But, they are too embarrassed to ask the same person, so they ask someone else. In  the spiritual path, arrogance comes naturally. Let’s see what happens ahead. 

*🌹. శివగీత - 46 / The Siva-Gita - 46 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

షష్ట మాధ్యాయము

*🌻. విభూతి యోగము - 10 🌻*

వేదై రవే షై రహమేవ వేద్యో
వేదాంత క్రుద్వేద విదేవ చాహమ్,
న పుణ్య పాపే మయి నాస్తి నాశో
న జన్మ దేహేంద్రి య బుద్ధ యశ్చ 57  
న భూమిరాపో న చ వ హ్నిరస్తి
న చానిలో మేస్తి న మే నభశ్చ
ఏవం విదిత్వా పరమాత్మ రూపం
గుహాశయం నిష్కల మద్వితీయమ్ 58
సమస్త సాక్షిం సద సద్విహీనం
ప్రయాతి శుద్ధం పరమాత్మ రూపమ్,
ఏవం మాం తత్త్వతో వేత్తి - యస్తు రామ మహీపతే !
స ఏవ నాన్యో లోకేషు - కైవల్య పల మశ్నుతే 59

ఇతి శ్రీపద్మ పురానే శివగీతాయాం షష్టోధ్యాయః

సమస్త వేదములద్వారా తెలిసికొనదగిన వాడిని నేనే. వేదాంతములను రచించిన వాడిని, వేదములను గుర్తించిన వాడిని, పుణ్యపాపముల కతీతుడను, నా కంతమనునది లేనేలేదు. (నాశనము లేదు).  

జనన దేహేంద్రి యములు బుద్ధి శూన్యములు,  మరియు నాకు పృథ్వీ అప్పు - తేజ - ఆకాశము - వాయువు అనే పంచతత్వముల కతీతుడను, 

ఈ ప్రకారముగా నెవ్వడైతే పరమాత్మను ఒక్కనిగాను సమస్త సాక్షిగాను, శుద్ధ స్వరూపునిగాను, సద సద్విహీనునిగాను, హృదయ స్థితుడనైన నన్ను తెలిసికొందురో వారే కైవల్యమును పొందుదురు, ఇతరులు పొందలేరు.
                                          
      ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణంతర్గతం బైన శివ గీతలో ఆరవ అధ్యాయము సమాప్తము.

సశేషం.. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 46 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 06 :
*🌻 Vibhooti Yoga - 10 🌻*

I am the one to be known through all the Vedas. I am the creator of Vedas and Vedanta. 

I'm the knower of Vedas. I am beyond virtues and vices. There is nothing called as 'End' to me. I am beyond birth and death. 

I am beyond the five elemental nature. In this way whoever realizes me as the paramatma who is the all witnesser, who is pure, who dwells in hearts; such people only reaches me. 

O Rama! in this way whoever realizes me truly, only that one would gain Kaivalya, others would not.

Here ends the chapter 6
of Shiva Gita present in Padma Purana Uttara Khanda...

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 37 / Sri Gajanan Maharaj Life History - 37 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 8వ అధ్యాయము - 2 🌻*

పాటిల్ ఉద్రిక్తుడయ్యేట్టు, అతను పాటిల్ పైన అసభ్యకరమైన సూచనలు చేస్తాడు. ఆకోపంలో పాటిల్ మార్యా చేతిమీద కర్రతో ఒక బలమయిన దెబ్బ కొట్టాడు. పాటిల్ లాంటి బలమయిన వ్యక్తి యొక్క గట్టి దెబ్బకి మార్యా చెయ్యవిరిగి, నిస్పృహుడిని చేసింది. మార్యా బంధువులు అతనని దేష్ ముఖ్ దగ్గరికి తీసుకు వెళ్ళారు, ఈ అవకాశాన్ని అందుకుని ఇతను ఖాండుపాటిల్ ను ఇరికించి, బాధించాడు. 

మార్యను, దేష్ ముఖ్ పోలీసు స్టేషను తీసుకు వెళ్ళి అక్కడ అధికారికి ఈవిషయం నివేదిస్తాడు. సమాజంలో ఎప్పుడు ఈవిభజన ఉందో, చాలాచిన్నచిన్న విషయాలుకూడా, ఒకరినొకరు అతిగా తూలనాడేందుకు, కించపరచడానికి చూస్తారు. ఆ ఆఫీసరు పిర్యాదు స్వీకరించి, పుస్తకంలో వ్రాసి, మార్యా చెయ్యంలో పాటిల్ మా జవాబుదారుడనని కరు అతిగా ఊడ అధికారికి అవకాశాన్ని అందుకు ఖాండుపాటిల్ ను నిర్భందిచేందుకు సూచనలు జారీచేసాడు. 

ఈ వార్త షేగాంలో దావానలంలా వ్యాపించింది. దీనికి సహజంగా పాటిల్ కూడాభయపడ్డాడు. అతను ఈ నిర్భందింపబడడం అనే అవమానంనుండి రక్షించమని శక్తిసాలి అయిన భగవంతుని ప్రార్ధించాడు. గౌరవనీయమయిన వ్యక్తికి అవమానం చావుకంటే కనిష్ట మయినది. ఇతని సోదరులు కూడా చింతితులయి అసహాయులుగా భావంచారు. 

అప్పుడు ఖాండుపాటిల్ కు అకస్మాత్తుగా తట్టింది, తను శ్రీమహారాజు దగ్గరకు వెళ్ళి ఆయనసహాయం కోరడం మంచిది అని. ఈయన తప్ప వేరెవరు ఈఉపద్రవం నుండి కాపాడలేరు అని. న్యాయపరమయిన మానవ ప్రయత్నాలకు అతని సోదరులు అకోలా వెళ్ళారు. రాత్రి తిన్నగా ఖాండుపాటిల్ శ్రీమహారాజు దగ్గరకు వెళ్ళాడు. 

శ్రీమహారాజుకు నమస్కరించి, మొత్తం వృత్తాంతం అంతా వర్ణించాడు. ప్రభుత్వ కార్యంనిరాకరించిన కారణంగా నేను మాహర్ ను కొట్టాను. దీనిని అవకాశంగా తీసుకొని, దేష్ముఖ్ నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. వీళ్ళు నన్ను నింర్భందించడానికి ఏర్పాటు చేస్తున్నారు, మీరుతప్ప మరివేరెవరు నన్ను రక్షించడానికి లేరు. 

రేపు నన్ను నిర్భందిచడానికి పొలీసు రావచ్చు. దయచేసి దానికి ముందు నన్ను చంపండి. నేను పరువుగల వ్యక్తిని, కావున ఈవిధమయిన నిర్భంధం చావుకు సరిసమానం వంటిది. నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నాను, కానీ దీనిని వీళ్ళు ఉన్నదానికన్నా చాలా అతిగా చిత్రిస్తున్నారు. దయచేసి నన్ను ఈ నిరాదరణ నుండి కాపాడండి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 37 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 8 - part 2 🌻*

Marya had blatantly refused to go saying that he was a subordinate to the Deshmukh only. He made some nasty gesticulations at Patil, which infuriated him. In the fury, Patil gave a forceful blow with a stick on Marya's hand. 

This blow fractured Marya's hand, making him unconscious. Patil sent the dak with some other man. The relatives of the Marya took him to the Deshmukh, who grabbed this opportunity to corner and trouble Khandu Patil. 

Deshmukh took Marya to the police station and reported the matter to the officer. Whenever there are conflicting groups in the society, even the small things are magnified by the individual groups to denounce each other. 

The Officer registered the complaint and issued orders to arrest Khandu Patil. The news spread like wildfire in Shegaon and Patil, naturally, got frightened and worried over the impending danger. He prayed to the Almighty God to save him from the humiliation of arrest. 

For a man of dignity, an insult is worse than death. All his brothers too were worried and were feeling helpless. Then it suddenly occurred to Khandu Patil that he should surrender himself to Shri Gajanan Maharaj and seek His help as none else would be able to save him from this calamity. 

His brothers went to Akola for legal and personal efforts. Khandu Patil went straight to Shri Gajanan Maharaj that night. He prostrated before Shri Gajanan Maharaj and narrated the whole episode. He said, I gave a beating to one Mahar as he refused to do Government work and that matter is being used by the Deshmukh to put me in trouble. 

They are arranging to get me arrested and there is nobody to save me except you. Tomorrow the policemen will come to arrest me. Please kill me before that. I am a man of dignity and an insult, such as arrest, is as good as death to me.

 I do accept my mistake, but that is being exaggerated out of proportion. Please save me from this contempt.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 28 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మూడవ పాత్ర : సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 6 🌻*

104. బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు ప్రధాన దేవదూతలు.వీరు పరిమిత జీవితమును హెచ్చు ప్రమాణములో సృష్టించుట యందును, దానిని పోషించుటయందును, పోషించిన దానిని లయమొనర్చుటయందును గల భగవంతుని ప్రధాన దివ్య ధర్మములను వ్యక్తపరచుటలో ఈ ప్రధాన దేవదూతలు మధ్యవర్తులుగా నుందురు.

105. భగవంతుని అపరిమిత జ్ఞానమును పరిమిత ప్రమాణములో నివేదించుటలో కూడా మధ్యవర్తులుగానుందురు. 

106.ప్రధాన దేవదూతలు సత్వములు. వారెల్లప్పుడు భోగములనుభవింతురే కాని బాధలను పొందరు.

107. అనంతమైన భగవల్లీల 'కారణము'గా దివ్య సుషుప్తి యైన మూల స్థితికి భంగము కలిగి, దాని ఫలితముగా సృష్టి కార్యరూపం దాల్చినది. ఇవియే కార్యకారణ ధర్మములు.

108. భగవంతునికి సృష్టి-స్థితి-లయము అనెడు ప్రధాన ధర్మములను ప్రసాదించుటలో భగవంతుని ఆది విలాసమే బాధ్యత కలదై యున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 88 / Soundarya Lahari - 88 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

88 వ శ్లోకము

*🌴. పశు ప్రవృత్తులపై అదుపునకు, క్రూర జంతువుల వశ్యత కొరకు 🌴*

శ్లో: 88. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీకర్పరతులాం కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా యదాదాయ న్యస్తం దృషది దయామానేన మనసా ll 

🌷. తాత్పర్యం : 
అమ్మా! పార్వతీ ! కీర్తులకు నెలవయిన ఆపదలను దరి చేర నీయని నీ పాదముల పై భాగమును కవి శ్రేష్ఠులు తాబేలు వీపు చిప్పతో ఎట్లు పోల్చినారు? వివాహ సమయమున దయకలిగిన హృదయము కల ఈశ్వరుడు తన చేతులతో ఎత్తి సన్నికల్లు మీద ఎట్లు ఉంచినాడు?

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 6 నెలలు జపం చేస్తూ, పాయసము, పండ్లు , కొబ్బరికాయ నివేదించినచో స్వీయ పశు ప్రవృత్తులపై అదుపు, క్రూర జంతువుల వశ్యత, సమస్యల మీద అదుపు లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹Soundarya Lahari - 88 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 88

*🌴 Making wild Beasts Obey 🌴*

88. Padham the kirhtinam prapadham apadham Devi vipadham Katham nitham sadbhih kutina-kamati-karpara-thulam; Katham vaa bahubhyam upayamana-kaale purabhida Yad adhaya nyastham drshadi daya-manena manasa.
 
🌻 Translation : 
Oh, goddess devi,how did the poets compare,the foreside of your merciful feet,which are the source of fame to your devotees,and which are not the source of danger to them,to the hard shell of tortoise,i do not understand. how did he who destroyed the three cities,take them in his hand, and place them on hard rock, during your marriage?

🌻 It denotes a customary rite in Hindu marriage called asmarohanam

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : 
 If one chants this verse 1000 times a day for 6 months, offering milk payasam, coconut and fruits as prasadam, it is believed that one can get control over own lower nature, control over troubles and can overcome fear of wild animals and bring them under our control.
 
🌻 BENEFICIAL RESULTS: 
Controlling wild animals, freedom from troubles and prosperity. 
 
🌻 Literal Results: 
Great fame, enhances creativity controls brutal force. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 388 / Bhagavad-Gita - 388 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 37 🌴

37. వృష్ణీనాం వాసుదేవో(స్మి పాణ్డవానాం ధనంజయ: |
మునీనామప్యహం వ్యాస: కవీనాముశనా కవి: ||

🌷. తాత్పర్యం : 
నేను వృష్ణివంశీయులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను అయి యున్నాను.

🌷. భాష్యము : 
శ్రీకృష్ణుడు ఆద్యదేవదేవుడు కాగా, బలదేవుడు అతని అవ్యవహిత విస్తృతాంశయై యున్నాడు. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు వసుదేవుని తనయులుగా అవతరించి యున్నందున వారిరువురిని వాసుదేవులుగా పిలువవచ్చును. 

వేరొక దృష్టితో చూచినచో శ్రీకృష్ణుడు ఎన్నడును బృందావనమును వీడడు కనుక, బృందావనమునకు అన్యమైన స్థలములలో దర్శితమైన కృష్ణుని రూపములు అతని విస్తృతాంశములై యున్నవి. అనగా శ్రీకృష్ణుని విస్తృతాంశయైన వాసుదేవుడు శ్రీకృష్ణుని కన్నను అన్యుడు కాదు. 

భగవద్గీత యందలి ఈ శ్లోకమున గల వాసుదేవ పదము బలరామునే సూచించుచున్నదని అవగతము చేసికొనవలెను. ఏలయన బలరాముడే సర్వవతారములకు మూలమై యున్నందున వాసుదేవ అంశములకు సైతము అతడే మూలమై యున్నాడు. 

ఈ విధమైన శ్రీకృష్ణభగవానుని అవ్యవహిత విస్తారములు “స్వాంశములు” (వ్యక్తిగత రూపములు) అని పిలువబడును. ఇవియేగాక “విభిన్నాంశములు” అని పిలువబడు విస్తృతరూపములును కలవు.

పాండురాజు తనయులలో ధనంజయునిగా పేరొందిన అర్జునుడు నరులలో శ్రేష్టుడు గనుక శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. మునులు లేక వేదజ్ఞానపారంగతులైన మనుజులలో వ్యాసుడు శ్రేష్టుడు. 

ఏలయన ఆయన ఈ కలియుగ జనులకు అవగతమగునట్లు భిన్నపద్దతులలో వేదజ్ఞానమును వివరించెను. అంతియేగాక వ్యాసుడు శ్రీకృష్ణుని అవతారమై యున్నాడు. 

కనుక అతడు శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. ఎట్టి విషయమును గూర్చియైనను సమగ్రముగా ఆలోచింప సమర్థులైనవారిని కవులందురు. 

అట్టి కవులలో దానవుల గురువైన ఉశనుడు(శుక్రాచార్యుడు) అసాధారణ మేధాసంపన్నుడు మరియు దూరదృష్టి కలిగిన రాజనీతినిపుణుడు కనుక శ్రీకృష్ణుని విభూతికి ప్రతినిధియై యున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 388 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 37 🌴

37. vṛṣṇīnāṁ vāsudevo ’smi
pāṇḍavānāṁ dhanañ-jayaḥ
munīnām apy ahaṁ vyāsaḥ
kavīnām uśanā kaviḥ

🌷 Translation : 
Of the descendants of Vṛṣṇi I am Vāsudeva, and of the Pāṇḍavas I am Arjuna. Of the sages I am Vyāsa, and among great thinkers I am Uśanā.

🌹 Purport :
Kṛṣṇa is the original Supreme Personality of Godhead, and Baladeva is Kṛṣṇa’s immediate expansion. Both Lord Kṛṣṇa and Baladeva appeared as sons of Vasudeva, so both of Them may be called Vāsudeva. 

From another point of view, because Kṛṣṇa never leaves Vṛndāvana, all the forms of Kṛṣṇa that appear elsewhere are His expansions. Vāsudeva is Kṛṣṇa’s immediate expansion, so Vāsudeva is not different from Kṛṣṇa. 

It is to be understood that the Vāsudeva referred to in this verse of Bhagavad-gītā is Baladeva, or Balarāma, because He is the original source of all incarnations and thus He is the sole source of Vāsudeva. 

The immediate expansions of the Lord are called svāṁśa (personal expansions), and there are also expansions called vibhinnāṁśa (separated expansions).

Amongst the sons of Pāṇḍu, Arjuna is famous as Dhanañjaya. He is the best of men and therefore represents Kṛṣṇa. 

Among the munis, or learned men conversant in Vedic knowledge, Vyāsa is the greatest because he explained Vedic knowledge in many different ways for the understanding of the common mass of people in this Age of Kali. 

And Vyāsa is also known as an incarnation of Kṛṣṇa; therefore Vyāsa also represents Kṛṣṇa. Kavis are those who are capable of thinking thoroughly on any subject matter. 

Among the kavis, Uśanā, Śukrācārya, was the spiritual master of the demons; he was an extremely intelligent and far-seeing politician. Thus Śukrācārya is another representative of the opulence of Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 209 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
46. అధ్యాయము - 1

*🌻. సంక్షేప సతీచరిత్రము - 2 🌻*

అభవంస్తేsథ వై సర్వే తస్మిన్‌ శంభౌ పరప్రభౌ | ఉపాయ నిష్పలాస్తేషాం మమ చాపి మునీశ్వర || 14

తదాsస్మరం రమేశానం వ్యర్థోపాయస్సుతై స్సహ | అబోధయత్స ఆగత్య శివభక్తి రతస్సుధీః || 15

ప్రబోధితో రమేశేన శివతత్త్వ ప్రదర్శినా | తదీర్ష్యామత్యజం సోహం తం హఠం న విమోహితః || 16

శక్తిం సంసేవ్య తత్ర్పీత్యో త్పాదయామాస తాం తదా | దక్షాదశిక్న్యాం వీరిణ్యాం స్వపుత్రాద్ధరమోహనే || 17

ఓ మహర్షీ! పరమాత్మయగు ఆ శంభునిపై నేను, వారు ప్రయోగించిన ఉపాయములన్నియు వ్యర్థమయ్యెను (14).

 ఈ రకముగా ఉపాయములన్నియూ వ్యర్థము కాగా, నేను సుతులతో గూడి రమాపతిని స్మరించితిని. అపుడు శివభక్తియందు తత్పరుడు, జ్ఞానియగు ఆ విష్ణువు వచ్చి నా మౌఢ్యమును పోగొట్టెను (15). 

శివతత్త్వమును బోధించు రమాపతి నా కళ్లు తెరిపించెను. అపుడు నేను ఈర్ష్యము విడిచి పెట్టితిని. కాని మోహితుడనగు నేను మొండి పట్టును వీడలేదు (16).

అపుడు శక్తిని సేవించి ఆమె అనుగ్రహముచే, శివుని మోహింపజేయుట కొరకై, నా కుమారుడగు దక్షుని వలన వీరిణి అనబడే అశిక్ని యందు ఆమె జనించినట్లు చేసితిని (17).

సోమా భూత్వా దక్షసుతా తపః కృత్వా తు దుస్సహమ్‌ | రుద్రపత్న్య భవ ద్భక్త్యా స్వభక్తహితకారిణీ || 18

సోమో రుద్రో గృహీ భూత్వాsకార్షీల్లీలాం పరాం ప్రభుః | మోహయిత్వాsథ మాం తత్ర స్వవివాహేsవికారధీః || 19

వివాహ్య తాం స ఆగత్య స్వగిరౌ సూతికృత్తయా | రేమే బహువిమోహో హి స్వతంత్రస్స్వాత్తవిగ్రహః || 20

తయా విహరతస్తస్య వ్యతీయాయ మహాన్మనే | కాలస్సుఖరశ్శంభోర్నిర్వి కారస్య సద్రతేః || 21

తతో రుద్రస్య దక్షేణ స్పర్ధా జాతా నిజేచ్ఛయా | మహామూఢస్య తన్మాయో మోహితస్య సుగుర్విణః || 22

ఆ ఉమాదేవి దక్షుని కుమార్తెగా జన్మించి, దుస్సహమగు తపస్సును భక్తితో చేసి రుద్రునకు పత్ని ఆయెను. ఆమె తన భక్తులకు హితమును కలుగజేయును (18). 

పరమేశ్వరుడగు రుద్రుడు ఉమాదేవితో కూడి గృహియై లీలలను ప్రకటించెను. ఆయన బుద్ది యందు వికారములేమియూ ఉండవు. ఆయన తన వివాహముందు నన్ను మోహింపజేసెను (19). 

సృష్టిని చేయువాడు, మోహములేని వాడు, స్వతంత్రుడు, స్వేచ్ఛచే రూపమును ధరించిన వాడునగు రుద్రుడు ఆమెను వివాహమాడి, తన పర్వతమును చేరి బహువిధముల రమించెను (20).

 ఓ మహర్షీ! వికారములు లేనివాడు, సద్విహారియగు శంభుడు చిరకాలము ఆమెతో కలిసి విహరించుచూ సుఖముగా గడిపెను (21). 

అపుడు రుద్రునకు మహామూర్ఖుడు, శివమాయచే మోహితుడు, గర్విష్ఠి అగు దక్షునితో, తన ఇచ్ఛ చేత విరోధము ఏర్పడెను (22).

తత్ర్పభావాద్ధరం దక్షో మహాగర్వి విముఢధీః | మహాశాంతం నిర్వికారం నినింద బహు మోహితః || 23

తతో దక్షస్స్వయం యజ్ఞం కృతవాన్‌ గర్వితోsహరమ్‌ | సర్వా నాహూయ దేవాదీన్‌ విష్ణుం మాం చాఖిలాధిపః || 24

నాజుహావ తథాభూతో రుద్రం రోషసమాకులః |తథా తత్ర సతీం నామ్నా స్వపుత్రీం విధి మోహితః || 25

యదా నాకారితా పిత్రా మాయామోహిత చేతసా | లీలాం చకార సుజ్ఞానా మహాసాధ్వీ శివా తదా || 26

గొప్ప గర్వము గలవాడు, విమోహితమైన బుధ్ధి గలవాడునగు దక్షుడు, మిక్కిలి శాంతుడు, వికార రహితుడునగు శివుని మాయా ప్రభావముచే మిక్కలి మోహితుడై అనేక విధములుగా నిందించెను (23). 

అపుడు గర్వితుడగు దక్ష ప్రజాపతి దేవతలను, ఇతరులను, నన్ను, విష్ణువును అందరినీ ఆహ్వానించి శివుడు లేని యజ్ఞమును చేసెను (24). 

మాయామోహితుడు, గర్విష్ఠి, రోషముతో కల్లోలితమైనమనస్సు గలవాడునగు దక్షుడు రుద్రుని, సతియను తన పుత్రికను ఆ యజ్ఞమునకు ఆహ్వానించలేదు (25).

మాయచే విమూఢమైన మనస్సు గల తండ్రి ఆహ్వానించకపోగా, గొప్ప జ్ఞానవతి మహాసాధ్వియగు సతీదేవి లీలను ప్రకటించెను (26).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 85 🌹*
Chapter 25
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 The Language of Light - 3 🌻*

When people are suffering from hunger, floods, hurricanes, earthquakes and volcanic eruptions, they cannot be in the mood to listen to spiritual discourses, messages, or philosophy about God. The world must be relieved of its suffering before it will be possible for mankind to accept God.  

Why is mankind over involved with the gross world? What causes human consciousness to be overly concerned with this world? 

The imbalance in human  
consciousness is caused by the over involvement with this shadow of the gross world.  

Mankind's obsessive selfishness, brutality, hatred, lust, hypocrisy is completely out of proportion to a natural human state of mind. 

Mankind's obses- siveness and imbalance is caused by attachment to this shadow, this gross world. This attachment has caused human consciousness to become indifferent and detached from God! 

Thus the language of darkness, the sounds of all the low, dark desires become very powerful and there is no room left in the world or in human consciousness for the language of Light to be expressed. So it seems that God has disappeared from the world. 
 
The world was suffering from its obsessive over involvement when God himself took human form on earth in the name of Meher Baba. 

The seventh shadow was out of proportion, and mankind suffered from the severe imbalance of consciousness in the world, since the consciousness was reverberating the sounds of darkness very loudly and  
intensely.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 80🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 32
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. అథ సంస్కార కథనమ్‌‌ 🌻*

అగ్ని రువాచ :

నిర్వాణాదిషు దీక్షాసు చత్వారింశత్తథాష్ట చ | సంస్కారాన్కారయేద్ధీమాఞ్ఛృణు తాన్యైః సురో భ##వేత్‌. 1

గర్బాధానం యోన్యాం వై తతః పుంసవనం చరేత్‌ | సీమన్తోన్నయనం చైవ జాతకర్మ చ నామ చ. 2

అన్నాశనం తతశ్చూడా బ్రహ్మచర్యం వ్రతాని చ | చత్వారి వైష్ణవీ పార్థీ భౌతికీ శ్రౌతికీ తథా. 3

గోదానం స్నాతకత్వం చ పాకయజ్ఞాశ్చ సప్త తే | అష్టకా పార్వణశ్రాద్ధం శ్రావణ్యాగ్రయణీతిచ. 4

చైత్రీ చాశ్యయుజీ సప్త హవిర్యజ్ఞాశ్చ తాఞ్ఛృణు | అధానం చాగ్నిహోత్రం చ దర్శో వై పౌర్ణమాసకః. 5

చాతుర్మాస్యం పశోర్బన్ధః సౌత్రామణిరథాపరః | సోమసంస్థాః సప్త శృణు చాగ్నిష్టోమః క్రతూత్తమః. 6

అత్యగ్నిష్టోమ ఉక్థశ్చ షోడశీవాజపేయకః | అతిరాత్రాప్తోర్యామశ్చ సహస్రేశాః సవాఇమే. 7

హిరణ్యాఙ్ఘ్రిర్హిరణ్యాక్షో హిరణ్యమిత్ర ఇత్యతః | | హిరణ్యపాణి ర్హేమాక్షో మేమాఙ్గో హేమసూత్రకః. 8

హిరణ్యాస్యో హిరణ్యాఙ్గో హేమజిహ్వా హిరణ్యవాన్‌ | అశ్వమేధో హి సర్వేశో గుణాశ్చాష్టాథ తాఞ్ఛృణు. 9

దయా చ సర్వభూతేషు క్షాన్తిశ్చైవ తథార్జవమ్‌ | శౌచం చైవ మనాయాసో మఙ్గలం చాపరో గుణః. 10

అకార్పణ్యం చాస్పృహా చ మూలేన జుహుయాచ్ఛతమ్‌ | సౌరశాక్తేయ విష్ణ్వీశదీక్షాస్వేతే సమాః స్మృతాః. 11

సంస్కారైః సంస్కృతశ్చతైర్భుక్తిం ముక్తిమవాప్నుయాత్‌ | సర్వరోగాదినిర్ముక్తో దేవవద్వర్తతే నరః. 12

జప్యాద్ధోమాత్పూజనాచ్చ ధ్యానాద్దేవస్య చేష్టభాక్‌ |

ఇత్యాది మమాపురాణ ఆగ్నేయే అష్టచత్వారింశత్సంస్కారకథనం నామ ద్వాత్రింశో7ధ్యాయః.

అగ్నిదేవుడు చెప్పను :
 బుద్ధిమంతు డగు పురుషుడు నిర్వాణాదిదీక్షలలో నలబదియోనిమిది సంస్కారములు చేసికొనవలెను. ఆ సంస్కారములను గూర్చి వినుము. వీటిచే మనుష్యుడు దేవతాతుల్యు డగును.

 *మొట్టమొదట యోనిలో, గర్భాధానము. పిమ్మట (2) పుంసవన సంస్కారము చేయవలెను: పిమ్మట (3) సీమంతోన్నయనము, (4) జాతకర్మ (5) నామకరణము (6) అన్నప్రాశనము (7) చూడాకర్మ (8) బ్రహ్మచర్యము (9) వైష్ణవి (10) పార్థి (11) భౌతిక (12) శ్రౌతికి అను నాలుగు బ్రహ్మచర్యవ్రతములు, (13) గోదానము (14) సమావర్తనము (15) అష్టక (16) అన్వష్టక (17) పార్వణశ్రాద్ధము (18) శ్రావణి (19 ఆగ్రహాయణి (20) చైత్రి (21) ఆశ్యయుజి అను ఏడు పాకయజ్ఞములు, (22) ఆధానము (23) అగ్ని హోత్రము (24) దర్శము (25) పౌర్ణమాసము (26) చాతుర్మాస్యము (27) పశుబంధము (28) సౌత్రామణి అను ఏడు హవిర్యజ్ఞములు (29) యజ్ఞములలో శ్రేష్ఠ మైన దగు అగ్నిష్టోమము (30) అత్యగ్నిష్టోమము (31) ఉక్థ్యము (32) షోడశి (33) వాజపేయము (34) అతిరాత్రము (35) అప్తోర్యామముఅను ఏడు సోమసంస్థలు, (36) హిరణ్యాంఘ్రి (37) హిరణ్యాక్షము (38) హిరణ్యమిత్రము (39) హిరణ్యపాణి (40) హేమాక్షము (41) హేమాంగము (42) హేమసూత్రము (43) హిరణ్యాస్యము (44) హిరణ్యాంగము (45) హేమజిహ్వము (46) హిరణ్యవత్తు (47) అన్ని యజ్ఞములకును అధిపతి యైన (1) అశ్వమేధము అను సహస్రేశయజ్ఞములు,* 

*సర్వభూతదయ, క్షమ, ఋజుత్వము, శౌచము, అనాయాసము, మంగళము, అకార్పణ్యము, అస్పృహ అను ఎనిమిది గుణములు. ఈ సంస్కారములను చేయవలెను.*

 ఇష్టదేవతా మూల మంత్రమున నూరు ఆహుతు లివ్వవలెను. 

సౌర-శాక్త-వైష్ణవ-శైవ దీక్షలలో అన్నింటియందును ఇవి సమానమే. ఈ సంస్కారములచే సంస్కృతు డగు పురుషుడు భోగములను, మోక్షమును కూడ పొందును. సమస్తరోగములచే విముక్తుడై దేవతాపురుషుడు వలె నుండును.

 మునుష్యునకు ఇష్టదేవతామంత్ర జప-హోమ-పూజా-ధ్యానములచే ఆభీష్టప్రాప్తి కలుగును.

ఆగ్నేయమహాపురాణమునందలి సంస్కారవర్ణన మను ముప్పదిరెండవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 96 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శంఖలిఖిత మహర్షులు - 2 🌻*

7. ఈనాడు మనం కొత్తరకమయిన విజ్ఞానం నేర్చుకున్నాం. సుఖంగానే బ్రతుకుతూ ఉండవచ్చు. లౌకికమైనటువంటి దృష్టితోచూస్తే, “నాకేం లోటండీ! సైన్స్, టెక్నాలజీ, ధనం, సుఖం, వాహనాలు సంపాదించాను” అనవచ్చు. ఇవేమీ మహర్షులకు విరుద్ధంకాదు. వీటికి మహర్షులు దుఃఖపడరు. ఇవి అధర్మం అని వాళ్ళ ఉద్దేశ్యం కాదు. 

8. అయితే, అతిథి అభ్యాగతుల విషయంలో ఒక సత్యము, శౌచము, ధర్మము, దేవతలను అనుగ్రహంకోసమని అర్చన చేయటము, దేశభక్తి, ప్రజలయందు ప్రసన్నత, ఇతరులయందు దయ, కష్టపడే వాళ్ళయందు సానుభూతి ఇట్లాంటి మానవధర్మాలెన్నో ఉన్నాయి. ఇవి విస్మరించడమే ధర్మపతనం.

9. పాపమే వృత్తిగా పెట్టుకున్నవాళ్ళ మాట వదిలేస్తే, మనం పాపం చేయకపోయినప్పటికీ, ధర్మాచరణం అనేటటువంటిది-ఆ ఋషులు ఏది ఆచరించారో అది-చెయ్యక పోవటం చేత, వాళ్ళు మన స్మృతిపథంలోంచీ వెళ్ళిపోతున్నారు క్రమక్రమంగా. 

10. జీవహింస చేయటంలో మనలో దయాదాక్షిణ్యాలులేవు. మరో ఆలోచనలేకుండా తృణప్రాయంగా నిరాలోచనగానే లక్షల పశువులను చంపగలుగుతున్నాం మనం.

11. కష్టపడుతూ దరిద్రంలో ఉండేవాడిని మనం సానుభూతితో చూడటంలేదు. ‘వాడి కష్టానికి నాకేమయినా బాధ్యత ఉందా? వాడి కష్టాలు తీరటానికి నేనేమయినా చేయాలా?’ ఇట్లాంటి భావనలే పుట్టటంలేదు మనకు. ఎవరిమటుకు వారే, ధనవంతుడు అధిక ధనవంతుడు కావాలని! దానికి పరిమితిలేదు. 

12. ‘నేను తృప్తిగా ఉన్నా’ననే భావం ఎవరికీ కలగటంలేదు. ఇటువంటి నేటి భావనలన్నీ ఆర్యధర్మములు కానేకావు. మన ఋషులు మనకు ఏ ధర్మమార్గంలో ఉండమన్నారో, ఆ మార్గానికి సంబంధించిన ధర్మాలలో నేడు మనం అతిక్రమించని ధర్మంలేదు అంటే అతిశయోక్తికాదు. 

13. అందువల్ల మరల మన ఋషులను మనం స్మరిస్తే, ధర్మమార్గంలో వెళ్ళేటటువంటి మనోబుద్ధి చిత్తములు అనుగ్రహించమని మనం వారిని అర్థిస్తే, వారు అవి ప్రసాదిస్తారు. వారు దివ్యదేహాలలో ఉన్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 26 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴* 

STANZA VI
🌻 The Final Battle - 3 🌻

52. Earth felt a fresh inflow of forces. The Gods were tirelessly spinning the Wheel. And Earth could see how the Sparkling Thread was reaching towards her. 

The Golden Fleece presented her with a new garment, woven from stellar threads. Yes, the Golden Fleece could array many an earthling in gold-brocaded garments which would protect them from the darkness. And heroes set out in search of it...
 
53. The planet could not lose people. The Mysterious Origin of Life had not arisen on her only to be crowned with death, grinding into dust all the works of Eternity, which had never been made by human hand. 

No, the Earth had been begotten of the Light, and only He who gave her Life could ask for it back. But He who gives birth does not know death, for everything woven by Him contains the Threads of Immortality in its weave. 

The planet was well aware that she was immortal. Yet all her earthly mysteries were accessible to the warlocks of the darkness, and it was precisely in this situation that the principal danger lurked.
 
54. Evil was busy casting his magical spells, engendering monsters of a like never before seen. The Earth was as open as the palm of one’s hand, for the Light is impossible to hide — it is there for everyone to see. 

And lo, the darkness beheld the Shining Hearts of those who were full of the Spirit of Heroism. And she could not bear that dazzling Light. What she needed was stony hearts. 

So she at once sent to the heroes her monstrous progeny — Medusa the Gorgon. Even one glance at that creature could turn a living being into a heartless stone. But one hero triumphed. 

Medusa herself was beheaded and was no longer capable of harm. Wherever her two older sisters may have concealed themselves was a mystery to be solved by future generations of heroes.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 45 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా వుంది... 2 🌻* 

“శ్రీశైలంలో తపస్సు చేస్తాను. నంద నామ సంవత్సరంలో నేను తపస్సు ప్రారంభించబోయే ముందు, భూమి మీద కొన్ని నక్షత్రాలు రాలిపడతాయి. భూమి గడగడ వణుకుతుంది. అనేకమంది ప్రజలు మరణిస్తారు. శుభ కృత నామ సంవత్సరంలో కార్తీక మాసంలో, దక్షిణ భాగంలో అనేక ఉత్పాతాలు కనబడతాయి. అదే సమయంలో ధూమకేతు నక్షత్రం ఆవిర్భవిస్తుంది. అందువల్ల అనేకమంది మరణిస్తారు.

నేను సమాధి విడిచి విష్ణు అంశతో కలికి అవతారం ఎత్తుతాను. ప్రమాదినామ సంవత్సరానికి ఎనిమిదేళ్ళవాడినై ఎర్ర బొయీలతో కలిసి వారికి అంతర్య బుద్ధులు కల్పిస్తాను.

అక్కడినుండి శాలివాహనశకం 5407 సంవత్సరము నాటికి, సరిగా పింగళనామ సంవత్సరంలో భయంకరమైన కొట్లాటలు ప్రారంభమవుతాయి. కాళయుక్త నామ సంవత్సరం వరకూ, ఉత్తరదేశాన పోట్లాటలు విపరీతంగా జరుగుతాయి. ఆనందనామ సంవత్సరంలో మార్గశిర బహుళ అష్టమీ గురువారం మల్లిఖార్జునుడు భ్రమరాంబా సమేతంగా వింధ్యపర్వతానికి చేరతాడు.

రక్తాక్షినామ సంవత్సరంలో విజయవాడకు వచ్చి, అక్కడ పోతులూరి వారి కన్యను పెళ్ళాడి, పట్టాభిషిక్తుడనవుతాను. దుర్ముఖినామ సంవత్సరం, కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొని, దుష్ట నిగ్రహం ఆరంభిస్తాను. నేను వచ్చేసరికి కలియుగ ప్రమాణం 4094 అవుతుంది.

నా భక్తులయిన వారును సదా నమ్మి ఓం, హ్రీం, క్ల్రీం, శ్రీం, శివాయ శ్రీ వీరబ్రహ్మణే నమః అను బీజ సంపుటయైన మహామంత్రమును ఎప్పుడూ పలుకుతుంటే, వారికి నేను మోక్షం ప్రసాదిస్తాను’’

పుత్రుడు గోవిందాచార్యుల స్వామికి బ్రహ్మంగారు తెల్పిన భవిష్యత్ శ్రీ వీరబ్రహ్మంగారు, తన కుమారులకు చెప్పిన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే, మొదటగా శ్రీ బ్రహ్మంగారు విశ్వనాథ అవధూతగా పుడతారు. 

ఆ తరువాత ముప్పరంలో స్వర్ణ అమరలింగేశ్వర స్వామిగా, చెరుకూరి శివరామయోగిగా జన్మిస్తారు. ఆ తరువాత వీర భోగ వసంతరాయుల అవతారం.

“నాయనా! నేను కంది మల్లయ్యపల్లె చేరి వీర బ్రహ్మ నామతో యిప్పటి వరకు 175 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ నేను ఈ కలియుగంలోని సామాన్యుల మనస్సులను మార్చి, కేవలం పరబ్రహ్మ ఉపాసకులుగా మార్చగలిగాను.

ఇప్పుడు ఈ బాధ్యతను నీవే స్వీకరించవలసి వుంది. వీరి ఆలోచనలను ఏ విధంగా మార్చగలవో అది నీ యిష్టం. నేను ఈ దినము సమాధి నిష్ఠలో ప్రవేశించేందుకు నిశ్చయించుకున్నాను. నీ సోదర సోదరీమణులను జాగ్రత్తగా సంరక్షించుకో. 

నీకొక రహస్యాన్ని తెలియజేస్తున్నాను. నీ గర్భవాసంలో పరమేశ్వరియే జన్మిస్తుంది. ఆమె భూత, భవిష్యత్, వర్తమానములను తెలిసిన బ్రహ్మజ్ఞాని. ఈ కలియందలి మూఢులకు నేనెట్లు మహిమలు చూపానో, ఆమె కూడా అద్భుతములైన మహిమలు ప్రదర్శిస్తుంది.

ఆమె వాక్కులు వెంటనే ఫలిస్తాయి. చివరికామె ఆ విధంగానే సమాధి నిష్టను పొందుతుంది. నా విధంగానే అంటే ... నాకు ఏ విధంగా మఠములున్నాయో, అదే విధంగా ఆమెకు కూడా మఠములుంటాయి. 

నాకే విధంగా పూజలు జరుగుతున్నాయో అలానే ఆమెకు కూడా పూజలు జరుగుతాయి. ఆ దేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవలసి వుంది. ఇక సిద్ధుని విషయంలో అసలు రహస్యం చెబుతాను విను. అతడు ఈశ్వరాంశ సంభూతుడు. 

ఈతడు ఒక క్షత్రియుని ఇంత పుట్టి గోహత్య చేయటంవల్ల ఇలా మహమ్మదీయ వంశంలో జన్మించాడు. ఆ గోహత్య పాపపరిహారం కోసమే యిప్పుడు నా సేవకుడయ్యాడు.

🌻. గోవిందమ్మకు జ్ఞాన బోధ 🌻

బోధ వైశాఖ శుద్ధ దశమి, ఆదివారం అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శుభ సమయమైనందున తాను సమాధి పొందగలనని వీరబ్రహ్మంగారు ప్రకటించారు.

గోవిందమ్మ విలపించటం ప్రారంభించారు. అప్పుడు గోవిందమ్మను ఉద్దేశించి బ్రహ్మంగారు “నాకు మరణం లేదు, నీకు వైధవ్యం లేదు. నీవు సుమంగళిగా జీవించు. సమాధిని చీల్చుకుని నేను వీరభోగ వసంతరాయులనై భూమి మీద అవతరిస్తాను. 

నా ధర్మ పాలనతో భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను తిరిగి అవతరించే వరకు ఏమేం జరుగుతాయో నీకు క్రమక్రమంగా వివరిస్తాను’’ అంటూ కాలజ్ఞాన బోధ మొదలుపెట్టారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 17 🌹*
 ✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
*🌟. 4. DNA సైన్స్ పరంగా 🌟*

DNA అంటే *"డీ- ఆక్సీ రైబో న్యూక్లియిక్ ఆసిడ్"*. ఇది మానవులలో, సకల జీవరాశులలో ఉండే వంశపారంపర్య పదార్థం (అనువంశిక అణువు), ఒకానొక వ్యక్తి యొక్క ప్రతి కణంలో దాదాపు ఒకే DNA ఉంటుంది. DNA అనేది కణకేంద్రంలో ఉంటుంది. దీనిని *"న్యూక్లియర్ DNA"* అని అంటారు. ఇందులో ఆత్మసామర్ధ్యాలు మరి జ్ఞానం ఉంటాయి.

💫. కొంత DNA మైటోకాండ్రియా లో కూడా ఉంటుంది. దీనినే *"మైటోకాండ్రియల్ DNA"* అని అంటారు. 

మైటోకాండ్రియల్ DNA స్ట్రక్చర్.. మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చి కణాలకు అందిస్తుంది.

💫. ఈ DNAగురించి సమాచారం ఏమిటి అంటే.. ఇందులో ఉన్న DNA కోడ్స్ ఏదైతే ఉందో అది అంతటా 4 కెమికల్ బేస్ లను కలిగి ఉంటుంది.
DNAలోని ప్రతి తంతులు లేక ప్రోగులు అనేక AP న్యూక్లియోటైడ్, పాలిమర్స్ ని కలిగి ఉంటాయి.

🌟. *ఈ న్యూక్లియోటైడ్స్ మూడు రకాలు* 🌟

*1. ఫాస్పేట్ సముదాయం*

*2. డీఆక్సిరైబోస్ అనే చక్కెర సముదాయం*

*3. నత్రజని షరలు (బేసులు)*

🌟. *ఈ నత్రజని షరలు తిరిగి నాలుగు రకాలు:-*

*1. అడినైన్(Adenine)*

*2.గ్వానైన్ ( Guanine)*

*3.సైటోసిన్(Cytosine)*

*4.థైమైన్(Thymine)*

  మానవజాతి అందరి లోనూ మూడు బిలియన్ల బెస్ టోన్స్ ని కలిగి ఉంటుంది. 99% మానవజాతి అంతా ఓకే ఆధారిత బేస్ టోన్స్ కలిగి ఉంటారు. మిగిలిన 1% తేడాతోనే మానవులలో వ్యత్యాసాలు ఉన్నాయి.

💫. బేస్ టోన్స్ అయిన అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమైన్ ఒకదానితో ఒకటి కలిసి జతలుగా ఏర్పడతాయి. అంటే A,T (Adenine + Thymine) C,G (Cytosine+Guanine) తో కలిసి కొన్ని యూనియన్ లేదా యూనిట్లుగా ఏర్పడతాయి. ప్రతి బేస్.. చక్కెర అణువూ మరి ఫాస్పేట్ అణువుతో జతచేయబడి, చక్కర ఫాస్పేట్ న్యూక్లియోటైడ్ గా మారుతాయి.

💫. ఈ AT, CG అనే న్యూక్లియోటైడ్స్ ని చక్కెర ఫాస్పేట్ పొడవాటి లైన్ తో జత చేయడం జరుగుతుంది.

💫. న్యూక్లియోటైడ్స్ సముదాయాన్ని - *"కోడాన్స్"* అనీ.. చక్కెర ఫాస్పేట్ పొడవాటి లైన్ ను - *"లైట్ ఎన్ కోడెడ్ ఫిలమెంట్"* అనీ పిలుస్తారు. వీటిని అన్నింటినీ కలిపి *"డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్"* అని పిలుస్తారు లేదా *"2 Strands DNA"* అని పిలుస్తారు. ఇది మెలిపెట్టిన... సవ్యదిశలో ఉన్న నిచ్చెనలా ఉంటుంది. DNA యొక్క స్పెషాలిటీ.. తనలాంటి డూప్లికేట్స్ ని తయారుచేయడం.(కణవిభజనలో DNA కూడా విభజించబడి తిరిగి మునుపటి కణంలో ఉన్న DNA లా తిరిగి సృష్టించబడుతుంది).

🌟. *డీ - ఆక్సి రైబో న్యూక్లిక్ యాసిడ్ (DNA)*🌟

*"డీ -ఆక్సి రైబో న్యూక్లియిక్ యాసిడ్"* అనేది ఒక అనువంశిక అణువు. ఇది ప్రతి జాతి యొక్క జీవ సంపద సూచనలను కలిగి ఉంటుంది.( వంశపారంపర్య సమాచారం) పునరుత్పత్తి సమయంలో వ్యక్తి తల్లిదండ్రుల యొక్క ఆర్గానిజం నుండి సమాచారాన్ని సరఫరా చేసుకుంటూ... కొత్త జన్యువులను తయారు చేసుకుంటారు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 161 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 8. Hang on to the ‘I am’ and go beyond it, without the ‘I am’ you are at peace and happy. 🌻*

Right now you have this ‘I am’, hang on to it, it is the only means you have to go beyond, and there is nothing else. 

And what has this ‘I am’ given you but conflict and misery? It came, it identified with the body and you became an individual, now revert, come to the ‘I am’ transcend it and be peaceful and happy.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 39 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 3 🌻*

ప్రత్యక్ష ప్రమాణంగా ఆత్మను నిరూపించలేము. అంటే ఎలాగండీ? ఆత్మ కదలదు. మొదటి లక్షణం. 

రాయి కదలదు. మరి కదలనివి భూమండలంలో ఏం తెలుసంటే? రాళ్ళు కదలవు. కొండలు కదలవు. ఆత్మ కొండవలే వుంటుంది అన్నామనుకోండి. తప్పు. పోయింది. ఆత్మ అన్నింటినీ కదిలించగలదు అన్నాం. ఆత్మ అన్నింటినీ కదిలించగలదు అంటే? వాయువు అన్నింటినీ కదిలించగలదు కదా. 

కాబట్టి ఆత్మ వాయువు వలే వుంటుంది అన్నామనుకోండి. పొరపాటు. తేడా వచ్చేసింది. అలా కుదరదు. మరి ప్రత్యక్ష ప్రమాణానికి ఇంకేం చెప్పారు? నిప్పు - పొగ. ఎక్కడైనా సరే ఒక పొగ వస్తోందంటే నిప్పుంది అని ఎవరైనా గానీ చెప్తారనమాట. కానీ అట్లా అనుమాన ప్రమాణంతో కూడా ఇది వీలుకాదు. 

ఇది రెండవ ప్రమాణం అనమాట. మనం దగ్గరికి వెళ్ళి నిప్పుందో లేదో చూడలేదు. దూరం నించీ పొగ వస్తోందని చూశాం. అది వంటిల్లు కావచ్చు, ఎక్కడైనా దూరప్రదేశంలో కావచ్చు. 

తద్వారా నీవేం తెలుసుకున్నావు? వాసన చేత అక్కడ వంట జరుగుతోందని, వంట జరగాలంటే నిప్పుందని, వెళ్ళి చూడక పోయినప్పటికీ కూడా ఊహించావు. ఇదేమిటిదీ? అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణంతో కూడా దీనిని మనం నిర్ణయించలేము.
         
రెండు ప్రమాణాలకి సంబంధించినటు వంటి ఉపమానాలని ఇక్కడ వేశారనమాట. గ్రుడ్డివారు ఏనుగు దగ్గరికి వెళ్ళారు. నలుగురు గ్రుడ్డివారు ఏనుగు దగ్గరికి వెళ్ళారు, నాలుగు వైపుల నించి ఏనుగును పట్టుకోవడానికి. 

ఒకాయన తొండాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఏమన్నాడు? ఏనుగంటే మెత్తగా వుంటుంది అన్నాడు. ఒకాయన తోకను పట్టుకున్నాడు. ఏనుగంటే కుచ్చులాగా వుంటుంది అన్నాడు. ఒకాయన కాళ్ళు పట్టుకున్నాడు. 

ఏనుగంటే స్థంభమువలే వుంటుందీ అన్నాడు. ఒకాయన ప్రయత్నించి ఏనుగుమీదకి ఎక్కాడు. ఏనుగంటే ఎత్తుగా వుంటుందీ అన్నాడు. అప్పుడేమయిందీ? ఈ నాలుగు లక్షణాలు ఏనుగుయొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని మనకి ఇవ్వడం లేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్ - 16. భయము - భదత్ర : -- ఎంత స్వల్పమైననూ, అతి చిన్న దైననూ ఏదో నొక ధర్మమును దైనందినముగ ఆచరించిన జీవునకు ఎంత పెద్ద భయమైననూ నివారణమగును., 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 40 📚*

నేహాభిక్రమనాశో-స్తి ప్రత్యవాయో న విద్యతే |
స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌ || 40

మానవ జీవితమున ప్రస్తుత కాలమున భద్రత లోపించినది. భయమావరించినది. ప్రాథమిక విద్య నేర్చు పసివాని నుండి పరిపాలనము చేయు పరిపాలకుని వరకూ ఎవరును నిర్భీతిగా జీవించుట లేదు. 

పిల్లలకు చదువు భయము, యువకులకు వృత్తి - ఉద్యోగ భయము, మధ్య వయస్కులకు అభివృద్ధిని గూర్చి భయము, అధికారులకు పదవీ భయము, ధనకాముకులకు ధన భయము, కీర్తి కాముకులకు అపకీర్తి భయము, అందరికీ అనారోగ్య భయము, జీవితమంతా భయం భయం. ఇవికాక, హత్యలు, మారణ హోమాలు, అభద్రత, వివిధమగు ప్రమాదాలు, యిన్ని యందు దినమొక గండముగ జీవితము సాగుచున్నది. నిస్సహాయుడైన మానవుడు కలియుగము కదాయని, సమస్తమును సరిపెట్టు కొనుచున్నాడు. 

భౌగోళికముగా యిప్పుడు భూమికి చక్రవర్తి భయమను పిశాచమే. అది కారణముగా భద్రత ఎండమావిగ భావించబడుతూ యున్నది. కానీ, భద్రపథమును భగవద్గీత సూక్ష్మముగ తెలిపియున్నది. ఆ పథము శాశ్వతముగా భయమును నివారించును. 

ఎంత స్వల్పమైననూ, అతి చిన్న దైననూ ఏదో నొక ధర్మమును దైనందినముగ ఆచరించిన జీవునకు ఎంత పెద్ద భయమైననూ నివారణమగును. నిరంతరత్వము, శ్రద్ధాభక్తులు, ఒక ధర్మము ననుసరించుటలో ప్రాప్తించిన జీవునకు సమస్త భయమూ పాపంచలగును. 

కలియుగము కటిక చీకటిది. కటిక చీకటిలో చిన్న దీపము కూడ చక్కని వెలుగునిచ్చి దారి చూపును. అట్లే నిరంతరమూ నిర్వర్తింప బడుచున్న చిన్న ధర్మము ఎంతపెద్ద భయము నుండైనా రక్షించగలదు.

*''స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌''*