1) 🌹 శ్రీమద్భగవద్గీత - 463 / Bhagavad-Gita - 463🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 251 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 131🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 153 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 67 / Sri Lalita Sahasranamavali - Meaning - 67 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 70 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 39🌹
8) 🌹. శివగీత - 36 / The Shiva-Gita - 36🌹
9) 🌹. సౌందర్య లహరి - 78 / Soundarya Lahari - 78 🌹
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 18 🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 377 / Bhagavad-Gita - 377🌹
12) 🌹. శివ మహా పురాణము - 201🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 77 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 72 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 88 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 19 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 37 🌹
18) 🌹. అద్భుత సృష్టి - 9 🌹
19) 🌹 Seeds Of Consciousness - 153🌹
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 31🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 8 📚
22)
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 463 / Bhagavad-Gita - 463 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 03 🌴*
03. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |
క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ ||
🌷. తాత్పర్యం :
ఓ భరతవంశీయుడా ! సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలిసికొనుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసికొనుటయే జ్ఞానమని నా అభిప్రాయము.
🌷. భాష్యము :
దేహము మరియు దేహము నెరిగినవాని గూర్చియు, ఆత్మ మరియు పరమాత్ముని గూర్చియు చర్చించునపుడు భగవానుడు, జీవుడు, భౌతికపదార్థమనెడి మూడు అంశములు మనకు గోచరించును. ప్రతి కర్మక్షేత్రమునందును (ప్రతిదేహమునందును) జీవాత్మ, పరమాత్మలను రెండు ఆత్మలు గలవు. అట్టి పరమాత్మ రూపము తన ప్రధాన విస్తృతాంశమైనందున శ్రీకృష్ణభగవానుడు “నేను కూడా క్షేత్రజ్ఞుడను. కాని దేహము నందలి వ్యక్తిగత క్షేత్రజ్ఞుడను కాను. పరమజ్ఞాతయైన నేను పరమాత్మరూపమున ప్రతిదేహము నందును వసించియున్నాను” అని పలికెను.
భగవద్గీత దృష్ట్యాఈ కర్మక్షేత్రమును మరియు కర్మక్షేత్రము నెరిగినవానిని గూర్చిన విషయమును సూక్ష్మముగా అధ్యయనము చేయువాడు సంపూర్ణజ్ఞానమును పొందగలడు.
“ప్రతిదేహమునందును నేను కూడా క్షేత్రజ్ఞుడనై యుందును” అని శ్రీకృష్ణభగవానుడు పలికియున్నాడు. అనగా జీవుడు తన దేహమును గూర్చి మాత్రమే ఎరిగియుండును. ఇతర దేహముల జ్ఞానమతనికి ఉండదు. కాని సర్వదేహముల యందు పరమాత్మ రూపమున వసించు శ్రీకృష్ణభగవానుడు మాత్రము సర్వదేహములను గూర్చిన సమస్త విషయములను మరియు వివిధ జీవజాతుల వివిధ దేహములను సంపూర్ణముగా ఎరిగియుండును. దేశపౌరుడు తనకున్న కొద్దిపాటి స్థలమును గూర్చిన జ్ఞానమునే కలిగియుండవచ్చును గాని దేశమునేలెడి రాజు తన రాజప్రాసాదమునే గాక పౌరులు కలిగియున్న ధనసంపత్తులనన్నింటిని తెలిసియుండును. అదే విధముగా జీవుడు వ్యక్తిగతముగా ఒక దేహమునకు యజమాని కావచ్చును. కాని భగవానుడు సర్వదేహములకు యజమాని. రాజ్యమునకు దేశములేనెడి రాజు పౌరుని వలె అప్రధాన యజమానుడు గాక ప్రధాన యజమానుడైనట్లు, దేవదేవుడు సర్వదేహములకు దివ్యయజమానియై యున్నాడు.
దేహము ఇంద్రియములను కూడియుండును. అట్టి ఇంద్రియములను నియమించెడివాడు కనుకనే దేవదేవుడు హృషీకేశుడని పిలువబడును. దేశకార్యములను నియమించుటలో రాజు ప్రధాన నియామకుడు మరియు పౌరులు అప్రధానులైనట్లు, దేవదేవుడు ఇంద్రియములకు ఆదినియామకుడు. “నేను కూడా క్షేత్రజ్ఞుడను” అని శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు. అనగా అతడు పరమజ్ఞాతయనియు, జీవాత్మ కేవలము తన దేహము మాత్రమే ఎరుగుననియు భావము.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 463 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 03 🌴*
03. kṣetra-jñaṁ cāpi māṁ viddhi
sarva-kṣetreṣu bhārata
kṣetra-kṣetrajñayor jñānaṁ
yat taj jñānaṁ mataṁ mama
🌷 Translation :
O scion of Bharata, you should understand that I am also the knower in all bodies, and to understand this body and its knower is called knowledge. That is My opinion.
🌹 Purport :
While discussing the subject of the body and the knower of the body, the soul and the Supersoul, we shall find three different topics of study: the Lord, the living entity, and matter. In every field of activities, in every body, there are two souls: the individual soul and the Supersoul. Because the Supersoul is the plenary expansion of the Supreme Personality of Godhead, Kṛṣṇa, Kṛṣṇa says, “I am also the knower, but I am not the individual knower of the body. I am the superknower. I am present in every body as the Paramātmā, or Supersoul.”
One who studies the subject matter of the field of activity and the knower of the field very minutely, in terms of this Bhagavad-gītā, can attain to knowledge.
The Lord says, “I am the knower of the field of activities in every individual body.” The individual may be the knower of his own body, but he is not in knowledge of other bodies. The Supreme Personality of Godhead, who is present as the Supersoul in all bodies, knows everything about all bodies. He knows all the different bodies of all the various species of life. A citizen may know everything about his patch of land, but the king knows not only his palace but all the properties possessed by the individual citizens. Similarly, one may be the proprietor of the body individually, but the Supreme Lord is the proprietor of all bodies. The king is the original proprietor of the kingdom, and the citizen is the secondary proprietor. Similarly, the Supreme Lord is the supreme proprietor of all bodies.
The body consists of the senses. The Supreme Lord is Hṛṣīkeśa, which means “the controller of the senses.” He is the original controller of the senses, just as the king is the original controller of all the activities of the state; the citizens are secondary controllers. The Lord says, “I am also the knower.” This means that He is the superknower; the individual soul knows only his particular body.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 251 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 29
🌴 Explanation of couples who did Agni pravesam - 1 🌴
Reaching Kurungadda and having darshan of Sripada, we sat in His presence on His order.
🌻 Sripada protects His followers 🌻
Sripada said, ‘My Dear! you are blessed seeing the birthday festivals of Sri Vasavee yesterday. The place and time are playing balls in my hand.
I can transfer the things that have happened, or happening or going to happen into past or present or future. I can order the time and place so that they appear to be like a journey without end however much you may try. I will be understood by you according to the level of your chaitanyam.
IF YOU SURRENDER TO ME PRESENT IN THE FORM OF ‘ANTARYAMI’ (THE INNER BEING) AND DO ‘KARMAS’ ACCORDING TO MY DICTATES, I WILL TAKE ALL YOUR RESPONSIBILITIES AND BRING YOU TO THE SHORE.
As I can rule the ‘prakrithi’ with mere word, I have become famous as Sarawathi. The people of Kali Yuga are like Hiranya Kasyapas. Their problems, feelings, thoughts and ways are very complex.
They gain physical transformation in the science of ‘Nature’ and get boons from ‘Mother Nature’ like Hiranya Kasyapa.
Accordingly, to protect innocent devotees like Prahlada, I have to take ‘avathar’ like ‘Narasimha’ in this Kali Yugam. So, I will take another avathar with the name of ‘Narasimha Saraswathi’ and become famous in Gandharvapuram.’
🌻 The story of Kanyaka Parameswari 🌻
Later He told us about Sri Vasavee Matha. A tapaswi by name ‘Samadhi’ was a devotee of Jaganmatha. He was born as Kusuma Shresti. The ‘Adya Shakti’ was born as his daughter with name Vasavaee.
Vishnu Vardhana asked for something which he should not have asked. Arya Vysyas thought that it was better to jump into Agni Kundam and protect their honour.
Sri Vasavee gave darshan as ‘Arya Mahadevi’ with a divine luster to Her parents, and relatives in other gothras. Unable to see that great luster, many people fell unconscious. Then Ambika withdrew Her lustrous form and became an ordinary looking Vasavee Kanyaka. She told her vysya people.
“Mothers! and Fathers! Immediately after we merge in the ‘Agnihotram’, Vimaladitya’s head will break into thousand pieces. You always keep in mind the supporting God of Vysyas Sri Nagareswara Swami.
The one known as ‘Vindhyavasini’ is none other than Me. You perform your duties like service to cows and Brahmins, worship of family Gods and Gothra worship meticulously. I am giving assurance to you.
If you follow these rules and regulations the music of my anklets will be heard in your houses and in your hearts. Laxmi ‘kala’ will be glowing in your houses.
You will be successful and get all happiness and auspiciousness in this world and ultimately reach Kailasam and be happy there also.’ I asked, ‘Maha Prabhu! who are the couples who entered the agnigundam? What are their gothras? Please let me know.’ Prabhu became happy and said, ‘The people of 102 gothras only are called Arya Vysyas.
One is relieved of sins if one remembers the couple who entered the agni gundam along with Sri Vasavee Kanyaka, who was Arya Maha Devi.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 131 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. సదవగాహన - 2 🌻*
అట్లే తోటి మానవులతో సత్సంబంధములు త్రెంచివేయు అంశములలో జుగుప్స తర్వాత ఎన్నదగినది "ఆత్మన్యూనతా భావము". దీని వలన నరుడు సంతోషమును చంపుకొనును. ఇతరులతో వ్యవహరించునపుడు, ఈ న్యూనతాభావమను రంగుటద్దపు జోడుతో చూచును. అవగాహన వక్రమగును. తన కన్నా అధికులని తాను తలంచువారిపై తిరుగుబాటు చేయ మనస్సు ఉద్రేకించును. ఇతరులలోని ఉన్నత విషయములను గుర్తింప నిరాకరించును.
నిజమునకు, తాను సాధింపదలచిన లక్ష్యము యొక్క స్థాయి కంటే తమ స్థాయి గొప్పదను ఎరుకయే ఈ న్యూనతకు హేతువగుచున్నది. ఆధ్యాత్మిక సాధనా యానపథమున కొంతకాలము ఓటములు తాకక తప్పదు. అంతమాత్రము చేత, సాధకుడు తనను తాను అవమానింపబనిలేదు. నిస్పృహుడు కానక్కరలేదు.
ఇట్టి ఓటములు, వెనుకంజలు తాత్కాలికములు మాత్రమే అని అతడు గుర్తెరుగవలెను. ప్రతి ఓటమి, వెనుకంజ విజయమునకు, ముందంజకు సోపానమే. తప్పుచేసినవాడు ఇక బాగుపడడనుట ప్రకృతి సూత్రము కాదు. ఎవనికయినను బాగుపడుటకును, సరిదిద్దుకొనుటకును ప్రకృతి వీలు కల్పించుచున్నది.
ఏ మానవుడును ఇతరుల కన్నా ఎక్కువగా గాని, తక్కువగా గాని తనను గూర్చి తలంచుట అవివేకము. ప్రతివాడును అమృతపుత్రుడే. మానవుని సహజగుణములు దివ్యములే గాని అసురములు గావు సత్సాంగత్యముతో, సత్కర్మాచరణముతో, సద్గురు స్మరణతో, సమిష్టి జీవనముతో సాధకుడు తన యందు దాగిన దివ్యగుణములను వికసింపజేసికొని, ముందజ వేయగలడు.
.....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 The Masters of Wisdom - The Journey Inside - 151🌹*
*🌴 Beyond Concepts - 1 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj
*🌻 Caught in Concepts 🌻*
According to our understanding the Atlantic and Pacific are two great seas, but there is only one great water.
We make the division for our understanding. We see something and, to comprehend it, we develop a concept. We put names to many things and build thoughts around, and we believe that what we have constructed is the truth.
We point at a mountain top and say, this is the Jungfrau. For itself, however, it is not. We recollect more the name than the mountain. We are not aware that the mountain can distribute energies, or we forget it.
We live in the concepts we have built and we thus become prisoners of these thought forms.
And just like the mountain is not a mountain for itself, like salt isn’t salty for itself or an animal doesn’t know that it is an animal, individuals for themselves actually aren’t human beings but pure consciousness.
We call ourselves “human beings” because we have denoted ourselves human beings. Then there is man and woman, but for themselves human beings are neither male nor female, but just pure consciousness.
As pure consciousness there is the awareness of existence which exists as the original thought.
We are because we call ourselves BEINGS or living beings. We call ourselves BEINGS because we exist. On this basis there are millions of concepts.
Concepts are a facility to frame the infinite into a form and to be able to work in the outer world. Buddha says, “Don’t limit yourself by a concept.”
Normally we are always bound to concepts. We have to find the path to neither remain stuck in concepts nor to break the concepts of others. It is the goal of Yoga to remain in a free-flowing energy, without any congestion or blocking.
When we are connected with the universal soul we don’t suffer from the constricts of concepts. The stream is not broken and energies of healing and of enlightenment flow through us.
Normally we are bound by our inclinations and ideas. He who is unbound by any concept, habit or trait is called a Yogi or a Master of Wisdom.
He is a representative of the absolute energy and the related light, love and will; he knows no separating consciousness.
🌻 🌻 🌻 🌻 🌻
Sources : Master K.P. Kumar: Uranus – The Alchemist of the Age / Saturn / notes from seminars.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 67 / Sri Lalita Sahasranamavali - Meaning - 67 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
శ్లోకం 127
637. విశ్వగర్భా -
విశ్వమును గర్భమునందు ధరించునది.
638. స్వర్ణగర్భా -
బంగారు గర్భము గలది.
639. అవరదా -
తనకు మించిన వరదాతలు లేనిది.
640. వాగధీశ్వరీ -
వాక్కునకు అధిదేవత.
641. ధ్యానగమ్యా -
ధ్యానము చేత పొందబడునది.
642. అపరిచ్ఛేద్యా -
విభజింప వీలులేనిది.
643. జ్ఞానదా -
జ్ఞానమును ఇచ్చునది.
644. జ్ఞానవిగ్రహా -
జ్ఞానమును మూర్తిగా దాల్చింది.
శ్లోకం 128
645. సర్వవేదాంత సంవేద్యా -
అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడునది.
646. సత్యానంద స్వరూపిణీ -
నిత్యసత్యమైన ఆనందమును స్వరూపముగా గలది.
647. లోపాముద్రార్చితా -
లోపాముద్రచే అర్చింపబడింది.
648. లీలాక్లుప్త బ్రహ్మాండమండలా -
క్రీడా వినోదానికై కల్పింపబడి క్లుప్తీకరింపబడే బ్రహ్మాండముల సమూహము గలది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 67 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 Sahasra Namavali - 67 🌻*
637 ) Viswa Grabha -
She who carries the universe in her belly
638 ) Swarna Garbha -
She who is personification of gold
639 ) Avaradha -
She who punishes bad people
640 ) Vagadeeswaree -
She who is the goddess of words
641 ) Dhyanagamya -
She who can be attained by meditation
642 ) Aparichedya -
She who cannot be predicted to be in a certain place
643 ) Gnadha -
She who gives out knowledge
644 ) Gnana Vigraha -
She who is personification of knowledge
645 ) Sarva vedhantha samvedya -
She who can be known by all Upanishads
646 ) Satyananda swaroopini -
She who is personification of truth and happiness
647 ) Lopa mudrarchitha -
She who is worshipped by Lopa Mudhra the wife of Agasthya
648 ) Leela kluptha brahmanda mandala -
She who creates the different universes by simple play
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నారద భక్తి సూత్రాలు - 70 🌹*
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 41
🌻. 41... తస్మిన్ తజ్జనే భేదాభావాత్ ॥ - 1 🌻
భగవంతునికి భక్తునికి భేదం లేదు. జీవాహంకారం ఉన్నంత వరకు జీవుడిలో భేదభావం కొనసాగుతూ ఉంటుంది. ఆ జీవాహంకారమనే అడ్డు తొలగించుకుంటే భగవదైక్యమె..
ఆవరణలెని భగవత్తత్త్వం ఆవరణ కలిగిన భగవత్తత్త్వాన్ని సహజంగాను, నిరంతరంగాను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆవరించబబడ్డ భగవత్తత్త్వమే జీవాహంకారంగా వ్యక్తమైంది. ఆవరణ ఉన్నంతసేపు భగవంతుని ఆకర్షణకు లోబడనేరదు.
జీవాహంకారాన్ని భక్తిసాధన చేత తొలగించుకుంటూ పోతూ భగవంతుడితో అనుష్టాన పూర్వకంగా అనుసంధానం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ పోతే, భగవత్తత్త్వ ఆకర్షణకు అనుకూలత ఏర్పడుతుంది. సాధన చరమాంకంలో భగవదైక్యం లభిస్తుంది.
చిత్తంబు మధురిపు శ్రీపాదములయందు
పలుకులు హరిగుణ పఠరనమంద
కరములు విష్ణు మందిర మార్దనములంద
చెవులు మాధవకథా శ్రవణ మంద
చూపులు గోవిందరూప వీక్షణ మంద
శిరము కేశవ నమస్కృతుల యంద
పదము లీశ్వర గేహ పరిసర్పణములంద
కామంబు చక్రి కైంకర్యమంద
-భాగవతం, అంబరీషోపాఖ్యానం
జీవుడు తన ఇంద్రియాలను, విషయాల మీదికి పోనీయకుండా పై విధంగా భగవత్తత్త్వమందే నిలుపుట చేత జీవుడు కైంకర్య పద్ధతిగా లేకుండా పోయి భగవత్తత్త్వమే మిగులుతుంది. దీనిని భగవదైక్యమని అంటారు.
దీనిలో అన్వయ సాధన, వ్యతిరేక సాధన కనబడుతున్నది. అన్వయ మంటే భగవంతునికి దగ్గరగా జరగడానికి చేసే సాధన.
వ్యతిరేక సాధన అంటే, భగవంతుడిని చెరడానికి అడ్డుగానున్న ఆటంకాలను తొలగించు కోవడం అనగా విరోధంగా ఉండే వాటిని త్యజించడం, కొత్తగా ఆటంకాలు రాకుండా చూసుకోవడం కూడా. ఇటువంటి సాధనకు ఉపాయాలున్నాయి. కొన్ని ఉపాయాలు విశిష్టాద్వైత మతంలో ఇలా చెప్పబడ్డాయి.
భగవంతునికి ఐదు స్వరూపాలున్నాయి.
1. జీవ స్వరూపం :
ఇది జీవాహంకార రూప ఆవరణ కలిగినది.
2, పర స్వరూపం :
ఇది వ్యాపకంగా ఉంది అన్ని లోకాలలో వ్యూహ రూపంగా, భూలోకంలో వివిధ అవతారాల రూపంగా, అంతర్వామిగా, అర్చావతారంగా ఉందే స్వరూపం.
3. ఉపాయ స్వరూపం :
దీనిని అన్వయ సాధనగా వివరించబోతున్నాం.
4. విరోధ స్వరూపం :
దీనిని వ్యతిరేకాన్ని తొలగించుకోవడానికి వివరించ బోతున్నాం.
5. పురుషార్థ స్వరూపం :
జీవుడు భగవంతుని చేరుకోవడానికి ముందస్తుగా ధర్మార్ధ కామాలను ఏ విధంగా ఆచరించాలో తెలుసుకొని కైవల్యం, లేక పరమపదం పొందే స్వరూపం.
ఈ ఐదింటిని అర్ధ పంచక నిర్ణయమని పేర్కొని, మరింత స్పష్టంగా వివరిస్తారు విశిష్టాద్వైతులు. ముందుగా విరోధ స్వరూపాన్ని వివరించి తరువాత ఉపాయ స్వరూపాన్ని వివరించుకుందాం. ఏటిని విశిష్టాద్వైత పద్ధతి అని గుర్తెరిగి గ్రహిద్దాం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 39 🌹*
✍️ Sri GS Swami ji Datta Vaakya
📚. Prasad Bharadwaj
*🌻 Only Sadguru’s energy is spent with total unselfishness and total unblemished compassionate. 🌻*
We have learned that Mother Goddess is asking for that which excels everything else in greatness and power. The question arises whether energy is of different types.
The channels through which energy travels may have varying capacities, but are there greater and lesser energies?
No. Energy is all the same. That is the absolute truth. When we observe the goings on in the world, it is noticed that all efforts using energy are put in to either gain selfish ends or to cause pain to others. When mild (Satvic) food is consumed, the behavior is mild.
For example, an elephant eats mild food and its actions are gentle. Its energy may be channeled to perform actions that are gentle. Observe a tiger. Its food is obtained through cruel means and what it eats is harsh. Therefore, we see that its energy is useful only to cause harm to other creatures.
Of these two, neither is capable of sharing its energy with the other. In this world such is the nature of energy of all beings, including that of the gods. Whenever energy is shared with others, it happens only with a selfish motive. Energy is expended to get personal requirements satisfied.
Any use of energy that is contaminated by the touch of selfishness has to be considered impure. Only Sadguru’s energy is spent with total unselfishness and total unblemished compassionate. Hence, it should be recognized as the highest type of energy.
Mother Goddess has asked in the first part of the verse to grant her that type of pristine energy. In the second half of the verse, she is more specifically asking to be taught the principle of Guru. She is praying for initiation into the means for attaining the highest and the purest form of energy.
She is requesting to be taught the principle of Guru. Mother Goddess is also describing the goal that she aims to achieve by the grace of Sadguru. Verse: Kena .. How does Man, who has occupied a human body become one with God?
He has to become saturated with divinity. But how is it possible? He may become absorbed into death, but how does he become merged with God? Let us see how it can be achieved.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 36 / The Siva-Gita - 36 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
పంచామాధ్యాయము
*🌻. రాముని యస్త్ర ప్రాప్తి - 6 🌻*
అనేక శైల సంబద్దె - సేతౌ యాంతు వలీ ముఖాః,
రావణం సగణం హత్వా - తా మానయ నిజ ప్రియామ్ 36
శస్త్రై ర్యుద్దే జయో యత్ర- తత్రాస్త్రాణి న యోజయేత్,
నిరస్త్రే ష్వల్ప శస్త్రేషు పలాయన పరేషుచ 37
అస్త్రాణి ముంచ న్దివ్యాని - స్వయమేవ వినశ్యతి ,
అధ వాకిం బహూక్తేన - మయైవో త్పాదితం జగత్ 38
మయైవ పాల్యతే నిత్యం - మయా సంహ్రియతే సిచ,
అః మేకో జగన్మ్రుత్యు - ర్మ్రుత్యో రపి మమీ పతే! 39
గ్రసే హమేవ సకలం - జగదేత చ్చరాచరమ్,
మమ వక్త్ర గతా స్సర్వే - రాక్షసా యుద్ద దుర్మదా: 40
నిమిత్త మాత్ర స్త్వం భూయా: -కీర్తి మాస్స్యాసి సంగరే,
ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతాయాం పంచమోధ్యాయః
వనచరులు అనేకములైన గొప్ప గొప్ప రాతి గుండ్లతో సముద్రమునకు వంతెన గట్టి నీతో బాటు లంకకు వచ్చెదరు.
నీవు బృత్య బంధము మిత్రుల సమూహముతోడ గలసి లంకాధి పతి హత మార్చి ప్రియురాలగు సీతను తీసుకొని రమ్ము సామాన్య శస్త్రములతో నే రణ రంగములో విజయము లభించు చుండగ అక్కడ మహాస్త్రములను ప్రయోగింప కూడదు.
శత్రువులు పరుగెత్తు చుండగను ఆయుధాలు లేని వారైనను, కొద్ది మాత్ర శస్త్రములున్న వారైనను అట్టి వారిపై అస్త్రముల ప్రయోగించిన యెడల ప్రయోగించిన వాడే వినాశనమునకు గురి యగును. పైన పేర్కొనిన వారిపై మహాస్త్రములను ప్రయోగింప వలదు . వేయేల, ఈ జగత్తంత యును నాతోనే సృష్టిం బడినది, నా చేతనే రక్షించ బడినది.
నా చేతనే సంహరింప బడినది, నేనే మృత్యువునకు కూడా మృత్యువును, సమస్త స్థిర చరాత్మక ప్రపంచ మంతయును మ్రింగెదను. (అత్ర అనేన హేతునా లీయతే గమ్యతే యత్ర సచ రాచరం తల్లింగ మితి జంజ్నితమ్ ) రణమందు మదించిన రాక్షసులందరు నా నోట బడని వారలే . నిమిత్తమునకు మా తరము నీ వుండుము.
శాశ్వతమైన అపారమగు యశస్సును నీవు పొందగలవు.
ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణాంతర్గతం బైన శివ గీతలో ఐదవ అధ్యాయము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 36 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 05 :
*🌻 Ramaya Varapradanam - 6 🌻
Those Vanaras would create a bridge over the ocean by using huge rocks and stones. and would cross the
ocean along with you. You use their forces in slaying Ravana & his troops and bring your beloved back
from captivity.
When chances of victory with ordinary weapons itself exist, then there one should not hurt divine weapons. When enemies are fleeing away, or when enemy is devoid of weapons, or when enemy has limited weapons with him; on such enemies one should not hurl the supreme weapons.
If hurled, then the wielder himself would become annihilated. Hence do not use the celestial weapons on aforementioned categories of enemies. Well, this entire universe has been created by me, has been protected by me and by me only it has been destroyed.
It's I who is the death of even death. It's I who swallows the entire mobile and immobile creation. All those demons who would die in the fierce war, all have actually been swallowed by me in reality.
You are just an instrument, and you would gain immense and eternal glory for yourself.
Here ends the chapter 5 of Shiva Gita of Padma Purana Uttara Khanda
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 28 / Sri Gajanan Maharaj Life History - 28 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 6వ అధ్యాయము - 4 🌻*
నన్ను కలిసినందుకు నేను కృతజ్ఞుడను. మద్యాహ్నం నీడలా ఈ ప్రపంచం అశాశ్వతమయినది. నేను మీసలహా పాటిస్తాను, కానీ మీరు ఇలా నాదగ్గరకు వస్తూ ఉండండి. ఈ ప్రపంచంలో ప్రతివిషయం ముందునుండి నిశ్చయించబడి ఉంటుంది, భగవంతుని కోరిక ప్రకారం మనం మన పనులు నిర్వర్తించాలి.
నేను మీ తమ్ముడి వంటి వాడను, కావున నన్ను తరచు కలిసేందుకు మీరు రావాలి అనేది నా ఒకేఒక కోరిక. భరతుడు శ్రీరాముని కొరకు నందిగ్రామంలో ఎదురు చూస్తున్నట్టు నేను ఈ అకోట్ లో మీకోసం వేచి ఉంటాను. మీ యొక్క యోగశక్తితో మీకు ఇక్కడకు రావడం సులభం.
యోగి ఏమీ ఎక్కడా ముట్ట కుండానే కొద్ది నిమిషాలలో బ్రహ్మాండం చుట్టు తిరిగి రాగలడు అని శ్రీనరసింహజి అన్నాడు. ఒకరిమీద ఒకరికి ఉన్న అతి సన్నిహిత ప్రేమతో, వారు రాత్రంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజమయిన యోగులు ఈవిధంగా ప్రవర్తిస్తారు, కానీ కపటి యోగులు ఒకరితో ఒకరు పొట్లాడు కుంటారు.
ఈ కపటి యోగులు సముద్రంలో విరిగిన ఓడలాంటి వారు, వీళ్ళను గురువుగా అంగీకరించరాదు. వీళ్ళకి చాలా ప్రాముఖ్యత లభిస్తుంది కానీ మనం వీళ్ళని జాగ్రత్తగా వెళ్ళతీయాలి. ఒక్క ఆత్మజ్ఞానం వల్లనే తప్ప, మఠంలో నివాసం చేయడంవల్ల కానీ, పద్యాలు రాయడం నేర్చుకున్నందు వల్ల కానీ ఎవరూ యోగులు కారు. బంగారం పూత పూసిన వస్తువులను మనం బంగారంగా అంగీకరిస్తామా ? ఈ ఇద్దరూ పవిత్రమయిన నిజమయిన యోగులు.
శ్రీగజానన మహారాజు శ్రీనంసింహజీని కలిసేందుకు వచ్చారని ప్రజలకు తెలిసి, వాళ్ళు అది గోదావరి, భగీరధి సంగమంగా భావించి మరియు అక్కడికి వెళితే ఆ సంగమంలో మునిగిన తృప్తి కలుగుతుంది అని భావించారు. అందుకని కొబ్బరి కాయలతో ఆ అడవి వైపు వెళ్ళడం మొదలు పెట్టారు.
శ్రీనరశింహజి అనుమతితో శ్రీగజానన్ అప్పటికే వెళ్ళిపోయారు. దానితో ప్రజలంతా నిరాశపొందారు.
సాధారణ మయిన తన పరిక్రమణలో ఒకసారి శ్రీగజానన్ తన శిష్యులతో షివార్ అనే గ్రామం చేరారు. ఈ చోటు దర్యాపూరు దగ్గర ఉన్న చంద్రభాగ నదీతీరం దగ్గర ఉంది. అక్కడ తీవ్రజభూషన్ అనే పండితుడు నివసిస్తూ ఉన్నాడు. ఇతను 4 భాషలు ఎరిగి, విదర్భ అంతా ప్రఖ్యాతి పొందిన గొప్ప సూర్యభగవానుని భక్తుడు.
ఉదయం త్వరగా లేచి, చంద్రభాగ నదిలో స్నానంచేసి సూర్యునికి ప్రార్ధన చేయటం ఇతని దినచర్య. ఈ షివార్ గ్రామానికి వ్రజభూషన్ ప్రార్ధనల ఫలం ఇచ్చేందుకన్నట్టు శ్రీగజానన్ వచ్చారు. తను యధాప్రకారం చంద్రభాగకు స్నానాకి వచ్చి, ఆనదీ తీరం దగ్గర శ్రీగజానన్ మహారాజును కూర్చుని ఉండడం చుస్తాడు.
అది ఉదయం వేళ, ఆకాశం వెలుతురుతో నిండి, చుట్టు ప్రక్కలంతా కోళ్ళు కూతలు కూస్తూ ఉండగా, చాతక్ మరియు భరద్వాజ పక్షులు ఉదయిస్తున్న సూర్యునికి ప్రమాణం చేస్తున్నట్టు ఎగురుతున్నాయి. పండితులరాకతో పామరులు స్థలంవిడిచి వెళ్ళినట్టు, సూర్యుడు తూర్పున తలఎత్తేప్పటికి చీకటి త్వరగా అదృశ్యం అయ్యింది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 28 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 6 - part 4 🌻*
Shri Narsinghji said, I am grateful to you for meeting me. This Prapanch is unreal like the shadow at noon. I will follow your advice, but keep on coming to me. Everything is predestined in this world, and we have to perform our duty in this life as per desire of God.
My only request is that you should come frequently to meet me as I am your younger brother.
Just like Bharat, waiting at Nandigram for Shri Ram, I am here at Akot for you. With your yogic achievements, it is very easy for you to come here. A yogi, without touching anywhere, can traverse around the universe in minutes. With intimate love for each other, they were speaking all that night.
Real saints behave like this only, but the hypocrites quarrel with each other. These hypocrites should not be accepted as Guru as they are like a broken ship on the sea.
They receive a lot of publicity, but carefully we should discard them. Living in a ‘math’ or learning an art of composing poems does not make one a saint, but only self knowledge does.
Can we accept gold coated articles as gold, or a prostitute as a house wife? These two saints were real and pious. When people knew that Shri Gajanan Maharaj had come to meet Shri Narsinghji, They thought it to be the confluence of Godavari and Bhagirathi and by going there they could get the satisfaction of taking a dip in that confluence.
So the people with coconuts in their hands started rushing to the forest. But Shri Gajanan, with the permission of Shri Narsinghji had already left and all the people were disappointed.
Once, in his usual wanderings, Shri Gajanan, with his disciples, reached a village named Shivar. This place is on the bank of Chandrabhaga (not of Pandharpur) near Daryapur and the place where Shri Vrajabhushan, a learned man, lived. He had knowledge pertaining to four various languages and was famous all over the Vidarbha; he was also a great devotee of the Sun God.
It was his daily routine to get up early in the morning, take a bath in the Chandrabhaga and offer prayers to the Sun. He was respected by all the intellectuals. Shri Gajanan Maharaj came to this Shivar village as if to give Vrajabhushan the fruits of his prayers. He as usual came to the Chandrabhaga for his bath and saw Shri Gajanan Maharaj sitting on the bank of that river.
It was morning time with twilight spreading all over the sky, cocks were crowing all around and the Chatak and Bharadwaj birds were flying as if they were paying their respects to the rising sun. With the sun peeping up the horizon, darkness quickly disappeared, like fools leaving the congregation at the sight of the learned.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 18 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 18 🌻*
65. ఆదిప్రేరణముయొక్క ప్రతిధ్వనిఘోషలచే అప్పటికప్పుడు వైవిధ్యమనెడి బీజము నాటబడి అగోచర స్థితిలో అంకురించి ద్వైత రూపములో తొలిసారిగా వ్యక్తమయ్యెను
66. ఆదిప్రేరణలయొక్క ప్రతిధ్వని ఘోషలతోపాటు, పరమాణు ప్రమాణమైన స్థూలసంస్కారము ఆవిర్భవించి ఆత్మను, పరమాత్మను భిన్నమైన దానిగను ప్రత్యేకమైనదానిగను, పరమాణు ప్రమాణములో స్థూలమైనదిగను, అత్యంత పరిమితమైనదిగను చేసినది.
67. ఆది ప్రేరణముయొక్క, మిక్కిలి స్థూలమైన తొలి సంస్కారము కారణముననే,అనంత పరమాత్మ తొలిసారిగా అనుభవమును పొందెను.
68. ఆనంతాత్మయొక్క యీ తొలి అనుభవము, సంస్కారములు లేనట్టి, ఎరుకలేనట్టి అనంత పరమాత్మతోగల తాదాత్మ్యతలను ప్రతికూలముగా అనుభవమును పొందెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఇంద్రకృత శ్రీ మహాలక్ష్మీ అష్టకం - వివరణతో 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
నమస్తేస్తు మహామాయే! శ్రీపేఠే సురపూజితే!
శంఖచక్రగదాహస్తే ! మహాలక్ష్మీ ! నమోస్తుతే ||
అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు.
వివరణ : సృష్టిస్తితిలయాలకు మూలకారణమైన శక్తికి మహామాయ అనిపేరు. ఆమెయే శ్రీచక్రారూడ. సకలదేవతలుని ఆమెనే పూజిస్తుంటారు. ఆమె శంఖచక్రగదాహస్త అయి, వైష్ణవీరూపంతో మహాలక్ష్మిగా, విష్ణుపత్నిగా జగద్రక్షణ చేస్తూంది. లక్ష్మి అంటే సర్వాన్నీ చూచేది అని ఒక వ్యుత్పత్తి. కనుకనే సర్వాన్నీ రక్షించేదీ అయింది. విష్ణుపత్ని గనుక విష్ణువు ధరించే ఆయుధాలు లక్ష్మికీ వర్తించాయి. ఇది వైష్ణవీరూపం ఇందలి అయుదిసంబోధనలూ అమ్మవారిపంచప్రకృత్యాత్మకశక్తికి సంకేతాలు.
నమస్తే గరుఢారూఢేః ! కోలాసురభయంకరి!
సర్వపాపహరే! దేవి! మహాలక్ష్మి! నమోస్తుతే ||
గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ ! కోలుడు అనే రాక్షసునికి భయం కల్గించిన దేవీ! సకలపాపహారిణి ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారములు.
వివరణ : విష్ణుదేవుని అర్ధాంగి గనుక మహాలక్ష్మికూడా గరుడవాహనయే ! లక్ష్మీసహస్రనామస్తోత్రం 65వ శ్లోకం లో “గరుడో పరిసంస్థితా” అని ఉంది. గరుత్మంతుడు వేదమూర్తి కనుక భగవానుడు అతనిపై సంచరిస్తాడు. అంటే వేదాలపై విహరిస్తాడు. జగన్మాత అయిన లక్ష్మీదేవి కూడా వేదారూఢయే ! అమ్మవారు వేదమాత, కోలా విధ్వంశులనేవాళ్ళు స్వారొచిషమనువు కాలంవాళ్ళు. ఆకాలంలో చైత్రవంశీయుడైన ‘సురధుడు’ అనే రాజును కోలావిధ్వంశులనేవాళ్ళు జయించి, అతనికి శత్రువులయ్య్యారు. కోలుడు, విధ్వంశుడు అనే ఈ రాక్షసుల్ని అమ్మవారు లక్ష్మీ రూపంతో సమ్హరించింది. కనుక కోలాసుర భయంకరి అయింది. ఈ విషయం దేవీసప్తశతిప్రధమాధ్యాయం ఐదవశ్లోకంలో సూచితం. భగవతీనామస్మరణం సర్వపాపాల్నీ నశింపజేస్తుంది.
సర్వజ్ఞే ! సర్వవరదే ! సర్వదుష్ట భయంకరి!
సర్వదుఃఖహరే! దేవి! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
సర్వజ్ఞురాలా ! సకలవరాలు ప్రసాదించే దయామయీ! సర్వదుష్టశక్తుల్నీ తోలగించేపరాశక్తీ! అన్ని దుఃఖాలనూ హరించే లక్ష్మీదేవీ! నీకు నమస్కారములు
వివరణ : అమ్మవారు జగన్నాయకి. విష్ణుపత్ని కనుక ఆమెకు తెలియని విషయం ఉండదు. ఎవరికి ఏ సుఖం కల్గినా అది శ్రీదేవియొక్క అనుగ్రహవిశేషమే ! అమ్మ ‘సర్వజ్ఞ కనుక సర్వ దుష్టశక్తుల్నీ,దుఃఖాలనీ తొలగించి, అందరికీ సుఖశాంతుల్ని ప్రసాదిస్తూంది. బాహ్యాంతశ్శత్రువులు నశిస్తేనే జీవునికి నిజమైన ఆనందం కల్గుతుంది. ఇందుకు లక్ష్మీదేవియొక్క అనుగ్రహం చాలా ముఖ్యం.
సిద్ధిబుద్ధిప్రదే! దేవి! భుక్తిముక్తిప్రదాయిని !
మంత్రమూర్తే ! సదాదేవె ! మహాలక్ష్మి! నమోస్తుతే ||
సిద్ధినీ బుద్ధినీ ప్రసాదించేతల్లీ ! భుక్తిని, ముక్తిని అనుగ్రహించే దేవీ! మంత్రమూర్తీ! దివ్యకాంతిమయీ ! మహాలక్ష్మీ నీకు నమస్కారము.
వివరణ : అమ్మవారు కార్యసిద్ధిని, అందుకు అవసరమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇహపరసౌఖ్యాలు అనుగ్రహిస్తుంది . అమ్మ మంత్రమూర్తి కనుక ఎవరు ఎలా భావించి, పూజిస్తే వారివారికి తగినట్లుగా రక్షణ ఇస్తూంటుంది. కార్యసిద్ధీ, కార్యనిర్వహణబుద్ధీ, భుక్తీ, ముక్తీ ఇలా జీవికి అవసరమైన అన్ని దంద్వాలనూ ప్రసాదించడం అమ్మ ప్రత్యేకత. అన్ని మంత్రాలూ ‘శ్రీం’ బీజ మయాలే ! కనుక అమ్మ మంత్ర స్వరూపిణి.
ఆద్యంతరహితే ! దేవి! ఆద్యశక్తి ! మహేశ్వరి !
యోగజే ! యోగసంభూతే ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
ఆద్యంతాలు లేనిదేవీ ! ఆదిశక్తీ ! మహేశ్వరీ ! యోగం వల్ల జన్మించిన తల్లీ ! ధ్యానంలో గోచరించే జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.
వివరణ : అమ్మ ఆదిశక్తి. సృష్ఠిస్తితిలయాలకు కారణమైనది. ఈ తల్లికి మొదలు, తుది అనేవిలేవు. సర్వకాల, సర్వావస్థలలో అమ్మ చైతన్యరూపిణియై ఉంటుంది. అమ్మ ‘యోగం’ వల్ల సంభవించింది. ‘యోగ’మంటే ధ్యానం. ధ్యానంలో మాత్రమే అమ్మ సాక్షాత్కారం కల్గుతుంది. కనుక అమ్మ “యోగజ”, “యోగసంభూత” అయింది. అనగా పరమాత్మరూపిణి, జగత్ప్రభువగు విష్ణుదేవుని భార్య కనుక అమ్మ “మహేశ్వరి” అనగా జ్ఞానస్వరూపిణి.
స్థూలసూక్ష్మ మహారౌద్రే ! మహాశక్తి ! మహోదరే !
మహాపాపహరే ! దేవి ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
స్థూలరూపంతోనూ, సూక్ష్మ రూపంతోనూ, మహారౌద్రరూపంతోనూ కనిపించేతల్లీ ! మహాశక్తిస్వరూపిణీ ! గొప్ప ఉదరం గల జగజ్జననీ ! మహాపాపాల్ని హరించేదేవీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.
వివరణ : లక్ష్మీదేవి రజోగుణస్వరూపిణి. హిరణ్యవర్ణ. కనుకనే ఆమె రౌద్ర, స్థూల, సూక్ష్మ రూపాలతో ఆయా సందర్భాలలో వ్యక్తమవుతూ ఉంటుంది. భౌతికంగా భక్తులు కోరికలకై పూజించేరూపం స్థూలం. ఇది రజోగుణాత్మకం. యోగులు నిస్కాములై ధ్యానించేరూపం సూక్ష్మం! ఇది సర్వగుణాత్మకం. ఇక శత్రుసమ్హారం కావించేరూపం తామసం. ఇది రౌద్రం. ఇలా త్రివిధరూపాలతో శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేస్తూ, అమ్మవారు విష్ణుదేవుణ్ణి అనుసరించి వుంటుంది. ఆమె మహాశక్తి. ఆమె గర్భంలో సమస్త బ్రహ్మాండాలూ ఉన్నాయి. అమ్మ పాపసమ్హారిణి. సకలలోకజనని.
పద్మాసనస్థితే ! దేవి ! పరబ్రహ్మ స్వరూపిణి !
పరమేశి ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
పద్మాసనభంగిమలో కూర్చొని ఉండేదేవీ ! పరబ్రహ్మ స్వరూపిణీ ! పరమేశ్వరీ ! జగజ్జననీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.
వివరణ : లక్ష్మి పద్మం నుండి జనించింది. పద్మంలోనే నివసిన్స్తుంది. పద్మాన్నే ధరిస్తుంది. పద్మం పైనే కూర్చుంటుంది. నిల్చుంటుంది. ఇలా ఆమేసర్వమూ పద్మమే ! పద్మమంటే ఇందు లక్ష్మి ఉంటుంది. పద్యతే అత్ర లక్ష్మీః అని వ్యుత్పత్తి. అమ్మ నివసించడంవల్లనే పద్మాలకు అంతటి శోభ, మృదుత్వం, ప్రశస్తీ వచాయి. పద్మాసన – పద్మాన్నే ఆసనంగా కల్గి ఉండేది. అయ్య పరబ్రహ్మ కనుక ఆయన అర్ధాంగి యగు లక్ష్మి యు పరబ్రహ్మమే ! లక్ష్మి మహానాయకురాలు. సృష్ఠి స్థితి లయాలకు ఆమె కారణం. మాత అంటే గర్భం తనలో ఇమిడియుండునది అని వ్యుత్పత్తి. అమ్మ సకలలోకాలనూ తన గర్భం లో ధరించి సృష్ఠి చేస్తుంది. కనుక జగజ్జనని.
శ్వేతాంబరధరే! దేవి ! నానాలంకారభూషితే !
జగత్ స్థితే ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
తెల్లనివస్త్రములు ధరించిన దేవీ ! అనేకాలయిన అలంకారాలు దాల్చినతల్లీ ! లోకస్థితికి కారణమైన విష్ణుపత్నీ ! జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.
వివరణ : మహాలక్ష్మిని శ్వేతాంబరధారిణిగా వర్ణించుట ఇందలి విశేషం. సాధారణంగా సరస్వతిని శ్వేతాంబరధారిణి గా నుతిస్తారు. ఇచ్చట లక్ష్మిని విద్యాలక్ష్మి గా భావించినపుడు ఆమె సరస్వతీ స్వరూపిణి అని భక్తులు భావించి ఆ రూపంతో దర్శించాలి. అష్టవిధలక్ష్ములలో విద్యా లక్ష్మి నానాలంకారభూషితురాలు. ఆభరణాలన్నీ సువర్ణరత్నమయమైనవే ! అమ్మ జగత్తునందలి చరాచర వస్తువు లన్నింటా నిల్చి వాటిల్ని శక్తిమంతాలుగా చేస్తుంది. అది అమ్మవారి విభూతి అనగా ఐశ్వర్యం, లోక్స్థితి కి అమ్మవారే కారణం !
ఫలశ్రుతి
మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీ ర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
ఇంద్రకృతం శ్రీ మహాక్ష్మ్యస్టకం సంపూర్ణం ||
ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలూ పొందుదురు. రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాలనుండి విముక్తులవుతారు. రోజూ ఉదయం, సాయంకాలం రెండు సార్లూ పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు. మూడుకాలాల్లో ఉదయం, మధ్యాన్నం, సాయంకాలం – పఠించేవాళ్ళు సకల శత్రుబాధల్నీ తొలగించుకొని సుఖిస్తారు. అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది. శుభాలు కల్గిస్తుంది.
వివరణ : ఏ స్తోత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా, భక్తి ముఖ్యం. భక్తి లేని పారాయణం, చిల్లులు పడిన కుండలోపోసిన నీళ్ళవలె వృధా అవుతుంది. సర్వం మహాలక్ష్మీ ఆధీనం. ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు ఇహ పర సుఖ జీవనులై ఉంటారు. కామక్రోధాధులైన అరిషడ్వర్గమే మహా శత్రువులు. వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతఃకరణులవుతారు.
భగవదనుగ్రహపాత్రులవుతారు. అట్టివారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది. అంతఃశత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో స్తుతించి, పూజించాలి. త్రిలోకాధిపతియగు ఇంద్రుడు గావించిన ఈ దివ్య శ్తోత్రాన్ని మహర్షులు మనకు అనుగ్రహించారు
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సౌందర్య లహరి - 78 / Soundarya Lahari - 78 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
78 వ శ్లోకము
*🌴. అందరిని ఆకర్షించే శక్తి, సర్వత్రా విజయం 🌴*
శ్లో: 78. స్థిరో గజ్గావర్తః స్తనముకుళరోమావళిలతా కలవాలం కుణ్డం కుసుమ శరతేజో హుతభుజః రతేర్లీలాగారం కిమపి తవ నాభి ర్గిరిసుతే బిలద్వారం సిధ్ధే ర్గిరిశనయనానాం విజయతే ll
🌻. తాత్పర్యం :
అమ్మా! పార్వతీ దేవీ! నీ యొక్క నాభిస్థానము చలనము లేని గంగానది యొక్క సుడిగుండము, కుచములు అనెడి పూవుల మొగ్గలతో నిండిన నూగారు అనెడు తీగెకు పాదునూ, మన్మధుని తేజస్సు అనెడి అగ్నికి హోమకుండము, రతీదేవి విహరించు స్థలము, ఈశ్వరుని నేత్రముల తపస్సిద్ధికి గుహాముఖము, వర్ణించుటకు వీలు కానిదయి ఉన్నది కదా !
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 108 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పొంగలి, వడలు నివేదించినచో అందరిని ఆకర్షించే శక్తి, జీవితంలో విజయం లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Soundarya Lahari - 78 🌹*
📚. Prasad Bharadwaj
🌹
SLOKA - 78
*🌴 Attracting all the Universe 🌴*
78. Sthiro gangavartha sthana mukula romaa vali latha Kalaabhalam kundam kusuma sara thejo hutha bhuja Rathe leelamgaram kimapi thava nabhir giri suthe Bhila dwaram siddhe rgirisa nayananam vijayathe
🌻 Translation :
Oh daughter of the mountain is your navel a whirl pool in river ganga, which looks very stable! or is it the root of the climber, of the stream of your hair line, which has two breasts of yours as buds, or is it the homa fire, where the fire is the light from cupid, or is it the play house of rathi, the wife of god of love,or is it the opening to the cave,in which shiva's tapas gets fulfilled,i am not able to make up my mind!
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 108 times a day for 45 days, offering pongal and Vada (from urad Dhal) as prasadam, it is believed that they will be able to conquer kingdom and attain victory in their life.
🌻 BENEFICIAL RESULTS:
Favours from government, all round success.
🌻 Literal Results:
Great prosperity and promising future in the present occupation/job. Influence in society.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 380 / Bhagavad-Gita - 380 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 29 🌴
29. అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితౄణామర్యమా చాస్మి యమ: సంయమతామహమ్ ||
🌷. తాత్పర్యం :
నేను పెక్కుపడగలు గల నాగులలో అనంతుడను, జలవాసులలో వరుణదేవుడను, పితృదేవతలలో అర్యముడను, ధర్మనిర్వాహకులలో మృత్యుదేవతయైన యముడను అయి యున్నాను.
🌻. భాష్యము :
జలవాసులలో వరుణదేవుడు ఘనుడైనట్లుగా పెక్కుపడగలు గల నాగులలో అనంతుడు ఘనుడైనట్టివాడు. వారిరువురును శ్రీకృష్ణుని ప్రతినిధులు. ఆర్యముడు అధిపతిగా గల పితృలోకమొకటి కలదు. అతడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. దుష్కృతులైనవారిని దండించుటకు గల పెక్కుమందిలో యమధర్మరాజు ముఖ్యుడు. ఈ భూలోకమునకు చేరువలోగల లోకమునందే అతడు నిలిచియుండును. మరణానంతరము పాపులు అచ్చటకు గొనిపోబడగా అతడు వారికి వివిధరకములైన శిక్షలు విధించుచుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 380 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 29 🌴
29. anantaś cāsmi nāgānāṁ
varuṇo yādasām aham
pitṝṇām aryamā cāsmi
yamaḥ saṁyamatām aham
🌷 Translation :
Of the many-hooded Nāgas I am Ananta, and among the aquatics I am the demigod Varuṇa. Of departed ancestors I am Aryamā, and among the dispensers of law I am Yama, the lord of death.
🌹 Purport :
Among the many-hooded Nāga serpents, Ananta is the greatest, as is the demigod Varuṇa among the aquatics. They both represent Kṛṣṇa. There is also a planet of Pitās, ancestors, presided over by Aryamā, who represents Kṛṣṇa. There are many living entities who give punishment to the miscreants, and among them Yama is the chief. Yama is situated in a planet near this earthly planet. After death those who are very sinful are taken there, and Yama arranges different kinds of punishments for them.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 201 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴*
44. అధ్యాయము - 19
*🌻. శివునితో కుబేరుని మైత్రి - 3 🌻*
మయా సఖ్యం చ తే నిత్యం వత్స్యామి చ తవాంతికే | అలకాం నిక షా మిత్ర తవ ప్రీతి వివృద్ధయే || 26
ఆగచ్ఛ పాదయోరస్యాః పత తే జననీ త్వియమ్ | యజ్ఞదత్త మహాభక్త సుప్రసన్నేన చేతసా || 27
నీకు నాతో నిత్యమైత్రి కలిగినది. నేను నీకు దగ్గరగా అలకానగర సమీపములో నివసించెదను. హే మిత్రమా! నేను నీకు అధికమగు ప్రీతిని కలిగించెదను (26).
యజ్ఞదత్త కుమారా! నీవు మహాభక్తుడవు. రమ్ము. ఈమె నీ తల్లి. ప్రసన్నమగు మనస్సుతో ఈమె పాదములపై పడుము (27).
బ్రహ్మో వాచ |
ఇతి దత్త్వా వరాన్దేవః పునరాహ శివాం శివః | ప్రసాదం కురు దేవేశి తపస్విన్యంగజేsత్రవై || 28
ఇత్యా కర్ణ్య వచశ్శంభోః పార్వతీ జగదంబికా | అబ్రవీద్యాజ్ఞదత్తిం తం సుప్రసన్నేన చేతసా || 29
బ్రహ్మ ఇట్లు పలికెను -
శివ దేవుడు ఈ విధముగా వరములనిచ్చి, మరల దేవితో నిట్లనెను; ఓ దేవదేవీ! తపశ్శాలియగు ఈ నీ పుత్రుని పై దయను చూపుము (28).
శంభుని ఈ మాటలను విని, జగదంబ యగు పార్వతి ప్రసన్నమగు మనస్సు గలదై యజ్ఞదత్త కుమారునితో నిట్లనెను (29).
దేవ్యువాచ |
వత్స తే నిర్మలా భక్తిర్భవే భవతు సర్వదా | భవైక పింగో నేత్రేణ వామేన స్ఫుటితేన హ || 30
దేవేన దత్తా యే తుభ్యం వరాస్సంతు తథైవ తే | కుబేరో భవ నామ్నా త్వం మమ రూపేర్ష్యయా సుత || 31
ఇతి దత్త్వా వరాన్దేవో దేవ్యా సహ మహేశ్వరః | ధనదాయ వివేశాథ ధామ వైశ్వేశ్వరాభిధమ్ || 32
ఇత్థం సఖిత్వం శ్రీ శంభోః ప్రాపైష ధనదః పురమ్ | అలకాన్నికషా చాసీత్కైలాసశ్శంకరాలయః || 33
ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే కైలాస గమనోపాఖ్యానే కుబేరస్య శివమిత్రత్వ వర్ణనం నామ ఏకోనవింశః అధ్యాయః (19).
దేవి ఇట్లు పలికెను -
వత్సా! నీకు సర్వకాలములయందు శివునిపై నిర్మలమగు భక్తి కలుగుగాక! నీ ఎడమ కన్ను పగిలినది గదా! కాన ఎర్రని ఒకే నేత్రము గల వాడవు కమ్ము (30).
నీకు శివుడు ఇచ్చిన వరములు ఫలించుగాక! ఓ కుమారా! నీవు నా రూపమునందు ఈర్ష్యను పొందితివి గాన, కుబేరుడు అను పేర ప్రసిద్ధుడవగుదువు (31).
మహేశ్వరుడు ఈ విధముగా దేవితో గూడి కుబేరునకు వరములనిచ్చి, విశ్వేశ్వరధామమును ప్రవేశించెను (32).
కుబేరుడు ఈ తీరున శ్రీ శంభుని మైత్రిని, అలకానగరమును పొందెను. శంకరుని నివాసమగు కైలాసము అలకా నగరమునకు సమీపనములో వెలసెను (33).
శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్ర సంహితయందు మొదటి ఖండములో కుబేరునకు శివునితో మైత్రి కలుగుట అనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 77 🌹*
Chapter 22
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj
*🌻 How Mreciful He Is - 3 🌻*
How does God become everyone and everything? For the Avatar to become everyone and everything what is required? Consciousness!
Consciousness of the beggars,
the kings, the lunatics, the philosophers, the artists, and for every type of man or woman. The form of a beggar, or king, or lunatic is nothing but the mold of his sanskaric
consciousness.
A beggar is a beggar because he has sanskaras perfect for nothing else but being a beggar; the same is true of a king, lunatic, or philosopher. They cannot be anything else because their sanskaras are only suitable for that sanskaric interaction.
So, the Avatar establishes his creation-consciousness at the level of consciousness of the individual beggar, or king, or lunatic, or philosopher.
Once his creation consciousness is one with the consciousness of the beggar, or king, the Avatar becomes that beggar and that king.
The Avatar's creation - consciousness becomes the very consciousness of the beggar or king, and consequently the Avatar passes through all that the poor beggar or rich king passes through.
Exactly in this manner, the Avatar's creation - consciousness merges with each and every thing and being in the universe; he becomes each and every thing and being in the universe! This is why the Avatar suffers like no other man, because there is nothing but suffering in the gross world, and his individual consciousness has merged with the consciousness of all the people in the world.
This suffering is infinite, both physically and mentally.
How merciful the Avatar is! How merciful is he that takes universal form in order to
do his universal work. His suffering is for the sake of his work.
After he has suffered infinitely for the sake of the universe, he gives a universal push. His push affects everyone and everything, because that push was in every level of l consciousness.
Ultimately what is the meaning of his push, and why all this becoming and suffering on his part? The push is received and it is paid for by sacrifice, dedication, love and longing for the Truth.
Therefore, the Avatar becomes everyone and everything in order to give this push, and the push creates the tendencies of sacrifice instead of selfishness, dedication instead of indifference, love instead of hatred, and longing instead of anger in everyone for the Truth.
Ultimately, his suffering means he sacrifices, he dedicates, he
loves and he worships the Truth for everyone and everything, since he became everyone and everything while he was on earth.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 72 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 30
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. అధ మండల విధి - 1 🌻*
అథ త్రింశోధ్యాయః.
అథ మణ్డలవిధిః
నారద ఉవాచ :
మధ్యే పద్మే యజేద్బ్రహ్మ సాఙ్గం పూర్వేబ్జనాభకమ్ | ఆగ్నేయేబ్జే చ ప్రకృతిం యామ్యేబ్జే పురుషంయజేత్. 1
పురుషాద్దక్షిణ వహ్నిం నైరృతే వారుణనిలమ్ | ఆదిత్యమైన్దవే పద్మే బుగ్యజుశ్చే శపద్మ కే. 2
ఇన్ద్రాదీంశ్చ ద్వితీయాయాం పద్మే షోడశకే తథా | సామాథర్వాణమాకాశం వాయుం తేజ స్తథా జలమ్. 3
పృథివీం చ మనశ్చైవ శ్రోత్రం త్వక్చక్షురర్చయేత్. |
రసనాం చ తథా ఘ్రాణం భూర్భువశ్చైవ షోడశమ్. 4
నారదుడు చెప్పెను : భద్రమండలము మధ్య నున్న కమలమున అంగదేవతాసహితబ్రహ్మను పూజింపవలెను.
తూర్పున నున్న కమలమున పద్మనాభుని, ఆగ్నేయమున నుద్న కమలమున ప్రకృతిని, దక్షిణమున నున్న కమలమున పురుషుని దక్షిణభాగమున అగ్నిదేవతను, నైరృతిదిక్కున నిరృతిని, పశ్చిమదిక్కున నున్న కమలమున వరుణుని, వాయవ్యదిక్కునం దున్న కమలమున వాయువును, ఉత్తరదిక్కునందున్న కమలమున ఆదిత్యుని, ఈశాన్యదిక్కునందున్న కమలమున బుగ్వేదయజుర్వేదములను పూజింపవలెను.
రెండవ ఆవరణమునందు ఇంద్రాది దిక్పాలకులను, షోడశదలకమలమున క్రమముగా సామవేద, అథర్వవేద, ఆకాశ, వాయు, తేజో, జల, పృథివీ, మనః, శ్రోత్ర, త్వక్, నేత్ర, రసనా, ఘ్రాణ, భూర్లోక, భువర్లోకములను పూజింపవలెను.
మహర్జనస్తపఃసత్యమత్యగ్నిష్టోమమేవ చ | తథాగ్నిష్టోమకం చోక్థం షోడశీం వాజపేయకమ్. 5
అతిరాత్రం చ సంపూజ్య తథాప్తోర్యామమర్చయేత్ | మనోబుద్ధిమహఙ్కారం శబ్ధం స్పర్శం చ రూపకమ్. 6
రసం గన్ధం చ పద్మేషు చతుర్వింశతిషు క్రమాత్ | జీవం మనో ధియం చాహం ప్రకృతిం శబ్దమాత్రకమ్.
వాసుదేవాదిమూర్తీశ్ఛీ తథా చైవ దశాత్మకమ్ | మనః శ్రోతం త్వచం ప్రార్చ్య చక్షుశ్చ రసనం తథా. 8
ఘ్రాణం వాక్పాణిపాదం చ ద్వాత్రింశద్వారిజేష్విమాన్ | చతుర్థావరణ పూజ్యాః సాఙ్గాః సపరివారకాః. 9
పిమ్మట తృతీయవరణము నందలి, ఇరువదినాలుగు దళముల కమలమున క్రమముగ మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అగ్నిష్టోమ, అత్యగ్నిష్ణోమ, ఉక్థ, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామ, వ్యష్టిమనో, వ్యష్టిబుద్ధి, వ్యష్ట్యహంకార, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, జీవ, సమస్టిమనః, సమష్టిబుద్ధి (మహత్తత్వ), సమష్ట్యహంకార, ప్రకృతులను పూజింపవలెను. వీటి అన్నింటియొక్క స్వరూపము శబ్దమాత్రమే. అనగా కేవలము వీటి పేరులు చెప్పి నమస్కరించిన చాలును; మూర్తులను ధ్యానింపవసరము లేదు.
ఇరువదియైదవ అధ్యాయములో చెప్పిన వాసుదేవాదిమూర్తులను తొమ్మిందింటిని, దశవిధప్రాణములను, మనో, బుద్ధ్య, హంకార, పాయు, ఉపస్థలను, శ్రోత్ర, త్వక్, నేత్ర, రసనా, ఘ్రాణ, వాక్, పాణి, పాదములను, ఈ ముప్పదిరెండింటిని, ముప్పదిరెండు దళముల కమలమున ఆర్చన చేయవలెను. ఇవి నాల్గవ అవరణమునందలి దేతవలు. ఈ ఆవరణమున సాంగసపరివార దేవతాపూజ చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 88 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. పరాశర మహర్షి - 7 🌻*
35. సంసారం అనాది. జీవుడికి సంసారంతో సంబంధం అనాది. అప్పటి నుంచీ ఉంది. దానిని తెంచుకోవటం స్వార్థం కాదు. అదే కర్తవ్యం.
36. ఆహారం తినటము, సుఖపడటము, నిద్రపోవటము, పిల్లలను కనటము – ఇంతే తప్ప నాకు ఇంతకుమించి ఇంకేదీ లేదనుకునేవాడు శీఘ్రంగా నశిస్తాడు. మనిషిపొందే దుఃఖాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సుఖమేమో చాలా అల్పం.
37. ఎప్పుడో ఒక్క ఘడియమాత్రమే ఉండి, పొయే సుఖదుఃఖాలు యథార్థమని ఎవరు నమ్ముతారో – అవి యథార్థమని ఎవరు భావిస్తారో – వాళ్ళు శాస్వతంగా అందులోనే ఉండిపోతారు. అది సత్యమనుకుంటూ అందులోనే ఉంటారు. అది అస్త్యమనుకుంటే, అప్పుడే అందులోంచీ బయటికివెళ్ళిపోతారు.
38. సుఖదుఃఖములందు సత్యత్వబుద్ధి, నిత్యత్వబుద్ధి ఎవడియందుంటాయో వాడికి నిత్యమూ సుఖదుఃఖాలు ఉంటూనే ఉంటాయి. అవి అనిత్యము అని తెలుసుకోవాలి. ఎందుకంటే, ‘నా ఉనికే అనిత్యమయితే, నాకుండే సుఖదుఃఖాలు నిత్యము ఎలా అవుతాయి? నేనే అనిత్యము కదా!’ అన్న వివేకం కలగాలి.
39. ‘మిత్రులు, భార్య, భ్రాతలు, పుత్రులు వీళ్ళంతా మనిషికి నిజకార్యపరులు. వాళ్ళువాళ్ళ కార్యంకోసం నిన్ను ఆశ్రయించి ఉన్నారు.
40. కాని నీ యోగ క్షేమములకొరకు నిన్ను ఆశ్రయించి లేరు’ అని గుర్తుంచుకోవాలి. ‘నా భార్యకు నా మీద చాలా ప్రేమ’ అంటాడు ఒకడు. అయితే భార్య తనకొరకై నిన్ను ప్రేమిస్తుంది. మనమెప్పుడూకూడా మనకు ఉపయోగపడేవస్తువునే ప్రేమిస్తాము కదా! ఇందులో కొద్దిగా కూడా అబద్ధం లేదు.
41. జాగ్రత్తగా ఆలోచిస్తే, తండ్రికి పుత్రులమీద ప్రేమ, పుత్రులకు తండ్రి మీద ఉండే ప్రేమ అమతా స్వార్థంతో కూడుకున్న ప్రేమయే. అటువంటి ప్రేమని మోహం అంటారు. అటువంటి ప్రేమ సత్యం కాదు. కాబట్టి వాళ్ళు(సంబంధం ఉన్నవారందరూ) నిజసాత్వికులు.
42. వాళ్ళు వారి పనులకోసమనే తనను ఆశ్రయించి ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి! ‘బోధను నువ్వుపొందితే అది ఆత్మత్రాణం. నిన్ను నీవు రక్షించుకోవటం బోధలో – అంటే జ్ఞానంలో – ఉంది. ఈ బోధయే మహాలక్ష్మి. ఇట్టి అభేదదృష్టి కలిగినవాడే ధీరుడు.
43. ధైర్యలక్ష్మి-జ్ఞానలక్ష్మిని కలిగిఉన్నవాడు, దానినెప్పుడూ వదలకూడదు. ఎట్టిపరిస్థితులలోనూ ఆ ధైర్యాన్ని, ఆ జ్ఞానాన్ని వదకూడదు’ అని సారాంశం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 19 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴*
STANZA V
*🌻 The Persecution of Love - 1 🌻*
34. The Light of Illumination touched the Earth. The long night that had dominated human consciousness was losing its thickly hued layers. The dark veil of ignorance began to drop from people’s eyes as they opened their vision and were imbued with alertness.
35. Those who most longed for the Light were touched with Fires by the Sons of Heaven. Their flash of illumination spread among the chosen. Those people absorbed the Fires with eager enthusiasm, adding to the luminous capabilities of their Heart.
The world became lighter and brighter. But, still, one had to work hard to kindle the Fires in the Light-Bearers’ companions. And the Sons of Heaven called for help from those who had preserved the lucidity of the Flame.
36. Sparks were flaring. And with the New Era came a great inflow of Fire. Many people were already carrying the Divine Flame within their breasts. Nevertheless, they were in the minority, compared with the whole mass of humanity.
These Light-Bearers were recognized immediately, for it is impossible to conceal the Light. They spoke of God, of Pure Heaven embraced by the Flame of Love, of the Sons of Eternity.
The darkness was irritated by such “flowery” speeches and, wanting to wrap everyone in an even denser veil of ignorance, she infused malice into the minds of her listeners.
Consumed with violent rage and blinded by anger, the sightless groped for stones. Stones from stony hearts, interlaced with a hail of curses, rained down on those who were bearing the Light of Love...
Love was beaten, tortured, burnt... But she was ineffaceable, for she was
drawing upon Immortal Forces within herself. She loved, and that was all that mattered... Sparks were igniting.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 37 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. శ్రీ స్వామి వారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధ చేయుట - 2 🌻*
“కంచికామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాదిమంది మృతి చెందుతారు.
ఆవు కడుపులోని దూడ పుట్టకుముందే బయటి ప్రజలకు కన్పిస్తుంది.
పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
కృష్ణ, గోదావరుల మధ్య మహాదేవుడను వాడు జన్మించి శైవుడైనా, అన్నిమతాలనూ గౌరవిస్తూ, గుళ్ళూ గోపురాలూ నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామదేవతలు ఊగిసలాడుతారు.
కాశీ, కుంభకోణం, గోకర్ణ క్షేత్రాల మహాత్తులు తగ్గిపోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.
ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ, ఈ నిదర్శనాలు కనిపిస్తూంటాయి. పతివ్రతలు పతితలౌతారు. వావీ వరుసలు పాటించరు. ఆచారాలు అన్నీ సమసిపోతాయి.
రాయలవారి సింహాసనం కంపిస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.
శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి. మందులకు తగ్గవు. స్త్రీ పురుషులంతా దురాచారులు అవుతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.
ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.
వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవమతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలతాయి. బెండ్లు మునుగుతాయి. చివరికి శివశక్తి అంటూ లేకుండా పోతుంది.
విజయనగరాన కోటలోని రాయల సింహాసనం బయటపడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామాలలోని రాతి విగ్రహాలు ఊగిసలాడుతాయి. అప్పుడు బిజ్జలరాయని కొలువున రాయల సింహాసనం బయటపడుతుంది...'' ఇలా స్వామివారు కడప నవాబుకు కాలజ్ఞానము బోధించి, మంత్రదీక్ష యిచ్చి ఆశీర్వదించారు.
ఆయన అక్కడినుంచి బయలుదేరి పొద్దుటూరు మీదుగా అల్లాటపల్లె చేరారు. అక్కడ వీరభద్రాలయంలో పూజలు చేయించి బయలుదేరారు. సిద్ధయ్య, మిగిలిన శిష్యులు వెంట రాగా నెమ్మదిగా వెళ్తున్నారు.
ఇదే మార్గంలో అరణ్యంలో తొమ్మిదిమంది దొంగలు, దారిన పోయే బాటసారులను కొల్లగొడుతూ, హతమారుస్తూ వుండేవారు. అందువల్ల ఆ మార్గంలో ప్రయాణించేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ మార్గంలోనే బ్రహ్మంగారు ప్రయాణించడం మొదలుపెట్టారు.
సిద్ధయ్యతో ఇష్టాగోష్ఠి జరుపుతూ వస్తున్న స్వామివారి బండిని ఆ తొమ్మిది మంది దొంగలు ఆపారు. వారిని చూసి బండితోలే వ్యక్తి భయపడిపోయి, బండిని ఆపేశాడు.
కర్రలు ఎత్తి స్వామివారి పైకి పోయిన దొంగలు స్వామి వారి దృష్టి పడటంతోటే ఎత్తిన చేతులు ఎత్తినట్లే వుండిపోయారు. మాట్లాడదామంటే మాటలు కూడా రావటం ఆగిపోయాయి. అలాగే రాతి మనుషుల్లాగా వుండిపోయారు.
అది చూచి వీరబ్రహ్మంగారు బండి దిగి, వారందరినీ తీసుకురమ్మని సిద్ధయకు చెప్పారు. వెంటనే సిద్ధయ్య అందరినీ నెట్టుకుంటూ స్వామి వారి వద్దకు చేర్చాడు. స్వామివారు దొంగలందరిని స్వయంగా తాకి , వారి చేతులను కిందికి దించారు.
“నన్ను కొట్టి ఈ బండిలో వున్నధనాన్ని తీసుకోండి" అన్నారు.
జవాబు చెబుదామనుకున్నారు గానీ వారికి నోట మాట రాలేదు.
స్వామివారు కొంత విభూతి వారి నోటిలో వేశారు. అయినా వారు శరీరాన్ని కదపలేక పోయారు. పశ్చాత్తాప పడిన దొంగలు స్వామిని ప్రార్థించారు. దాంతో స్వామి వారిని క్షమించి వదిలివేశారు. స్వామివారు అక్కడినుంచి బయలుదేరి, పుష్పగిరి అగ్రహారం చేరారు.
🌻. పుష్పగిరి వాసులకు చెప్పిన కాలజ్ఞానం.... 🌻
నేను శ్రీ వీరభోగవసంతరాయలుగా, కలియుగంలో 5000సంవత్సరంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థం భూమిపై అవతరిస్తాను.
మార్గశిర మాసంలో దక్షిణభాగంలో ధూమకేతువనే నక్షత్రం ఉదయిస్తుంది. మీ అందరికీ కన్పిస్తుంది. క్రోథి నామ సంవత్సరమున, మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో శ్రీ వీర భోగ వసంతరాయలుగా వచ్చే సమయంలో దక్షిణాన నక్షత్రము ఒకటి పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి''
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. అద్భుత సృష్టి - 9 🌹*
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌟. మనకు నూతన DNA ఇచ్చినవారు. 🌟*
నూతన ప్రాజెక్ట్ రూపంలో నూతన DNA పునరుద్ధరణ శకం ప్రారంభమైంది.
విశ్వాల యొక్క శాంతిభద్రతల కోసం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన *"ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్"* నిబురా కౌన్సిల్ సభ్యులు, ఆస్తర్ కమాండర్ సభ్యులు, వైట్ బ్రదర్ హుడ్ ఆఫ్ గ్రేట్ లోటస్ యొక్క 12 కిరణాలు, 12 ఉన్నత లోకవాసులు, గురువులు, దైవాలు ఎందరో ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములు అయ్యారు.
💫. 12 DNA ప్రోగుల నూతన మానవుని కోసం నూతన సృష్టికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా I.G. ఫెడరేషన్ ఆఫ్ లైట్ ద్వారా *"లైరా "* అనబడే కాంతి లోకంలో ఒక మీటింగ్ ఏర్పాటు జరిగింది.
*"ఇప్పటి వరకు మనం భూమిని ప్రతిసారీ నాశనం చేసి తిరిగి నిర్మిస్తూ వస్తున్నాం అయినా కొంత కాలం తరువాత అదే పరిస్థితి మిగులుతుంది. కాబట్టి ఈసారి భూమిని పునః నిర్మాణం చేయడం కాకుండా శాశ్వత పునరుద్ధరణ కార్యక్రమం చేపడదాం"* అని వారు నిర్ణయించారు.
💫. అంటే ఇక్కడ ఉన్న మానవులను ప్రళయంతో అంతం చేయకుండా.. మానవునిలో ఉన్న తక్కువ చైతన్యాలను (2ప్రోగుల DNA), ఉన్నత చైతన్యాలుగా(12ప్రోగుల DNA) మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా భూమిపైకి *"ఫ్లైడియన్స్"* వచ్చి ఎన్నో ముఖ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో స్టార్ నేషన్స్ వారు కూడా ఈ భూమి మీదకు రావడం జరిగింది.
💫. ఈ ప్రక్రియలో భాగంగా 12 ఉన్నత లోకవాసులు తమ యొక్క DNA సామర్థ్యాలను ఇచ్చి.. 12 ప్రోగుల దేవత్వం నిండిన నూతన మానవుని తయారు చేశారు.
*12 ప్రోగుల DNA ని ఇచ్చిన వారి పేర్లు;*
*1. ప్లైడియన్స్*
*2. ఆర్కుట్యూరియన్స్*
*3. ఆండ్రోమెడన్స్*
*4. సిరియన్స్*
*5. లైరన్స్*
*6. వేగన్స్*
*7. అల్ఫా సెంట్యూరియన్స్*
*8. బెలిట్రీషియన్స్*
*9. ఓరియన్స్*
*10. వేస్తాస్*
*11. ఫాన్*
*12. ఓవర్ లైటింగ్*
*మీరంతా వారివారి ప్రత్యేక సామర్థ్యాలున్న DNA ని ఇచ్చి మనల్ని నూతన మానవునిగా తయారు చేశారు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 153 🌹*
✍️ Nisargadatta Maharaj
📚. Prasad Bharadwaj
*🌻 You are the all-pervading, eternal and infinitely creative awareness - consciousness. 🌻*
I don’t think you really understand the purpose of my dialogues here. I don’t say things simply to convince people that they are true.
I am not speaking about these matters so that people can build up a philosophy that can be rationally defended, and which is free of all contradictions. When I speak my words, I am not speaking to your mind at all. I am directing my words directly at consciousness.
I am planting my words in your consciousness. If you disturb the planting process by arguing about the meaning of the words, they won’t take root there.
Once my words have been planted in consciousness, they will sprout, they will grow, and at the appropriate moment they will bear fruit. It’s nothing to do with you.
All this will happen by itself. However, if you think about the words too much or dispute their meaning, you will postpone the moment of their fruition. Enough talking. Be quiet and let the words do their work!
To take appearance for reality is a grievous sin and the cause of all calamities. You are the all-pervading, eternal and infinitely creative awareness - consciousness. All else is local and temporary. Don’t forget what you are.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 31 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 20 🌻*
ఆచార్యుడు కానటువంటివాడు ఆత్మతత్త్వమును బోధించలేడు అని చెప్తున్నారు.
అంటే అర్ధం ఏమిటీ అంటే స్వయముగా తానే ఆచరించి తాను స్వయముగా ఆత్మనిష్ఠను పొందనటువంటివారు ఎవరైతే వున్నారో, వారు ఆత్మతత్త్వాన్ని బోధించడానికి అనర్హులు. ఒకవేళ అటువంటి వారిని నీవు ఆశ్రయించినచో, వారు నీకు ఆత్మోన్నతిని కలిగించకపోగా, నీలో అవిద్యా శబలితమైనటువంటి అజ్ఞానప్రవృత్తికి బలం చేకూర్చేటటువంటి అవకాశం వుంది.
కాబట్టి గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు వారిని సమగ్రముగా గమనించవలసినటువంటి అవసరం వుంది. వారిని అనుసరించాలట. నిజానికి శిష్యుడు గురువుని నిర్ణయించుకోవాలి అంటే ఒక సంవత్సరకాలం అనుగమించి ఉండాలి. అనుసరించి వుండాలి. అనేక సందర్భాలలో గురువుగారు ఎలా వున్నారు అనేటటువంటి పరీక్ష చేయాలి. నిజానికి మాట్లాడితే శిష్యుడే గురువుని పరీక్షించాలి. ఈయన నాకు తగునా. తగుపాటి గురువును అన్వేషించాలి. ఈ అన్వేషణ అత్యంత శ్రద్ధతో చేయాలి.
అలా చేసేటప్పుడు అతనికి ఆ గురువుగారు నిరంతరాయంగా ఆత్మనిష్ఠ గురించే బోధిస్తున్నారా, లేక జనవాక్య హితమైనటువంటి ప్రేయోమార్గ పద్ధతిగా జగత్ సంబంధమైనటువంటి పద్ధతిగా బోధ చేస్తున్నాడా అనేటటువంటిది గ్రహించాలి, గమనించాలి. ఎవరైతే స్వయముగా ఆత్మనిష్ఠులో వారు మాత్రము అతికుశలురై వుండుటచేత - ఈ అతికుశలత్వం అంటే అర్ధం ఏమిటంటే బుద్ధియొక్క కదలికలని కదలకముందే తెలుసుకొనుట. ఇది కౌశలము అంటే.
కౌశలము అంటే నిపుణత్వం. నైపుణ్యం ఎంత వుండాలయా అంటే “బుద్ధి కర్మానుసారిణీ”. బుద్ధి కర్మననుసరించే పనిచేస్తుంది. కర్మ అంటే ఏమిటీ అంటే మూడు గుణములతో కూడుకున్నది కర్మ. కర్తృత్వ భోక్తృత్వములతో కూడుకున్నది కర్మ.
ద్వంద్వానుభూతితో కూడుకున్నటువంటిది కర్మ. వాసనలతో కూడుకున్నటువంటిది కర్మ. కాబట్టి గుణత్రయము, వాసనాత్రయమును, దేహత్రయమును, శరీరత్రయమును, అవస్థాత్రయము వంటి త్రిపుటులన్నీ ఇందులో వున్నాయి.
మరి వాటియందు ఏ రకమైనటువంటి కదలిక ఏర్పడినా, ఏరకమైన ప్రలోభం ఏర్పడినా, ఏరకమైన ప్రభావం ఏర్పడినా, ఏరకమైన ప్రతిబంధకం ఏర్పడబోతున్నా, అవి బుద్ధిలోనే వ్యక్తీకరించబడతాయి కాబట్టి, బుద్ధి వాటికి లొంగబోయే లోపలే మేలుకొన్నవాడై బుద్ధిని ఆత్మయందు, సాక్షిత్వమందు, చైతన్యమందు నిలిపివుంచి ఈ ప్రలోభములకు గురి కాకుండా చేయగలగడం కౌశలం. ఇదీ కౌశలం అంటే అర్ధం. కుశలత్వం అంటే అర్ధం ఇది. ఏ నైపుణ్యాన్ని సంపాదించాలయా నువ్వు? ప్రపంచంలో చాలా నైపుణ్యాలు వున్నాయి. అనేక నైపుణ్యాలు.
ఒక గోడకి మేకు కొట్టాలన్నా నైపుణ్యంతో కొట్టాలి; లేకపోతే వేలు బద్దలవుతుంది. ఒక స్క్రూ బిగించాలన్నా కూడా నైపుణ్యం కావాలి. ఒక సెల్ ఫోన్ రిపేర్ చేయాలన్నా నైపుణ్యం కావాలి. ఒక వంట చేయాలన్నా కూడా, వంకాయ కూర చేయాలన్నా కూడా సరిగ్గా జాగ్రత్తగా చేయకపోతే వేలు తెగుతాయి వంకాయ తెగేబదులు.
కాబట్టి ప్రతిపనిలోనూ - కర్మ అంటేనే కౌశలం. కర్మ అంటేనే కౌశలం అని అర్ధం. “కర్మసుకౌశలం” అంటే అర్ధం ఏమిటంటే చాలా నైపుణ్యంతో చేయబడేటటువంటి కర్మ అనే అర్ధం చెప్పకూడదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. 8. అమృతత్వమునకు అర్హత - వ్యధ చెందని మనసు కలవాడు అమృతత్వ స్థితిని పొందుటకు అర్హుడు - దానికై త్రిగుణములకు అతీతముగ నుండు స్థితిని అభ్యాసవశమున స్థిరపరచుకొన వలెను. 🌹*
యం హి న వ్యథంయన్త్యేతే పురుషం పురుషర్షభ |
సమదుóఖ సుఖం ధీరం సో-మృతత్వాయ కల్పతే || 15
వ్యధ చెందని మనసు కలవాడు అమృతత్వ స్థితిని పొందుటకు అర్హుడని గీత బోధించుచున్నది. త్రిగుణాత్మకమైన సృష్టియందు అవస్థితి చెందినటువిం మానవ ప్రజ్ఞకు వ్యధ సహజము. ప్రతి మానవుడు సహజముగ వజ్రచైతన్యవంతుడై ఉన్నప్పటికీ చైతన్యము త్రిగుణముల యందు బంధింపబడి నప్పుడు వ్యధ కవకాశమేర్పడును.
మరికొంత అవస్థితి చెంది ఇంద్రియముల యందు అనగా ఇంద్రియార్థముల ననుసరించు స్థితియందు బంధింపబడినపుడు అట్టి వ్యధ తీవ్రత చెందును.
సత్యవంతుడైన మానవ ప్రజ్ఞ మేల్కాంచగనే చైతన్యవంతునిగ ఏర్పడును. చైతన్యవంతమైన మానవప్రజ్ఞ త్రిగుణముల లోనికి, ఇంద్రియముల లోనికి ప్రవేశించుట తప్పనిసరి. అట్టి ప్రవేశమున
తన సహజ స్థితిని మరచినచో మాయ ఆవరణమున చిక్కును. అనగా ప్రజ్ఞ త్రిగుణాత్మక మగును.
త్రిగుణాత్మక మగు తన ప్రజ్ఞను త్రిగుణములకు అతీతముగ కూడ అభ్యాసవశమున స్థిరపరచుకొన వచ్చును. త్రిగుణములలోనికి మరియు ఇంద్రియముల లోనికి అవతరణము చెందుచున్న చైతన్యము తన సహజ స్థితిని కోల్పోనవసరము లేదు.
సూర్యుని కిరణము గ్రహగోళాదులను
చేరునపుడు సూర్యుని వదలి, గ్రహములను చేరుటలేదు కదా!
సూర్యకిరణము వ్యాపనము చెందుచున్నట్లుగ మనకు తెలియును.
కిరణము సూర్యుని యొద్దనూ ఉన్నది. మరియు ఏడు గోళముల వద్దకూ ఏక కాలమున చేరుచున్నది. అట్లే మానవచైతన్యము కూడ ఏకకాలమున సప్తకోశములనూ వ్యాపించి యుండ గలదు.
అట్టి వ్యాపనమును అభ్యాసము చేయు పురుషుడు శ్రేష్ఠుడు.
మోక్షమునకు అర్హత కలిగి యున్నవాడు. మోక్షమునందు సహజముగ నున్నవాడు. పురుషుడు అను పదమును ఉపయోగించుటలో భగవానుని యొక్క రహస్య సూచన కూడ ఒకటి ఇక్కడ గమనింపదగి యున్నది. ఏడంతస్తుల పురమున ప్రవేశించి, ఏడంతస్తులనూ వ్యాపించి యున్న ప్రజ్ఞవు నీవు సుమా! అని తెలుపుటకే ''పురుషమ్'', ''పురుషర్షభ'' అని పలికినాడు.
జీవిమున వ్యధ చెందువారు తమ్ము తాము మరచినవారనియు, సత్యాన్వేషణమున ఓర్పు వహించి తనను తాను గుర్తుకు తెచ్చుకొనుచు వ్యధ చెందక జీవించువారే అమృతత్త్వమునకు తగిన వారనియు గీతోపనిషత్తు బోధించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹