★彡 భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 18 彡★


🌹.   ★彡    భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 18   彡★   🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 18 🌻

65. ఆదిప్రేరణముయొక్క ప్రతిధ్వనిఘోషలచే అప్పటికప్పుడు వైవిధ్యమనెడి బీజము నాటబడి అగోచర స్థితిలో అంకురించి ద్వైత రూపములో తొలిసారిగా వ్యక్తమయ్యెను

66. ఆదిప్రేరణలయొక్క ప్రతిధ్వని ఘోషలతోపాటు, పరమాణు ప్రమాణమైన స్థూలసంస్కారము ఆవిర్భవించి ఆత్మను, పరమాత్మను భిన్నమైన దానిగను ప్రత్యేకమైనదానిగను, పరమాణు ప్రమాణములో స్థూలమైనదిగను, అత్యంత పరిమితమైనదిగను చేసినది.

67. ఆది ప్రేరణముయొక్క, మిక్కిలి స్థూలమైన తొలి సంస్కారము కారణముననే,అనంత పరమాత్మ తొలిసారిగా అనుభవమును పొందెను.

68. ఆనంతాత్మయొక్క యీ తొలి అనుభవము, సంస్కారములు లేనట్టి, ఎరుకలేనట్టి అనంత పరమాత్మతోగల తాదాత్మ్యతలను ప్రతికూలముగా అనుభవమును పొందెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment