శ్రీ శివ మహా పురాణము - 201


🌹 . శ్రీ శివ మహా పురాణము - 201 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴

44. అధ్యాయము - 19

🌻. శివునితో కుబేరుని మైత్రి - 3 🌻

మయా సఖ్యం చ తే నిత్యం వత్స్యామి చ తవాంతికే | అలకాం నిక షా మిత్ర తవ ప్రీతి వివృద్ధయే || 26
ఆగచ్ఛ పాదయోరస్యాః పత తే జననీ త్వియమ్‌ | యజ్ఞదత్త మహాభక్త సుప్రసన్నేన చేతసా || 27

నీకు నాతో నిత్యమైత్రి కలిగినది. నేను నీకు దగ్గరగా అలకానగర సమీపములో నివసించెదను. హే మిత్రమా! నేను నీకు అధికమగు ప్రీతిని కలిగించెదను (26).

యజ్ఞదత్త కుమారా! నీవు మహాభక్తుడవు. రమ్ము. ఈమె నీ తల్లి. ప్రసన్నమగు మనస్సుతో ఈమె పాదములపై పడుము (27).

బ్రహ్మో వాచ |

ఇతి దత్త్వా వరాన్దేవః పునరాహ శివాం శివః | ప్రసాదం కురు దేవేశి తపస్విన్యంగజేsత్రవై || 28
ఇత్యా కర్ణ్య వచశ్శంభోః పార్వతీ జగదంబికా | అబ్రవీద్యాజ్ఞదత్తిం తం సుప్రసన్నేన చేతసా || 29

బ్రహ్మ ఇట్లు పలికెను -

శివ దేవుడు ఈ విధముగా వరములనిచ్చి, మరల దేవితో నిట్లనెను; ఓ దేవదేవీ! తపశ్శాలియగు ఈ నీ పుత్రుని పై దయను చూపుము (28).

శంభుని ఈ మాటలను విని, జగదంబ యగు పార్వతి ప్రసన్నమగు మనస్సు గలదై యజ్ఞదత్త కుమారునితో నిట్లనెను (29).

దేవ్యువాచ |

వత్స తే నిర్మలా భక్తిర్భవే భవతు సర్వదా | భవైక పింగో నేత్రేణ వామేన స్ఫుటితేన హ || 30
దేవేన దత్తా యే తుభ్యం వరాస్సంతు తథైవ తే | కుబేరో భవ నామ్నా త్వం మమ రూపేర్ష్యయా సుత || 31
ఇతి దత్త్వా వరాన్దేవో దేవ్యా సహ మహేశ్వరః | ధనదాయ వివేశాథ ధామ వైశ్వేశ్వరాభిధమ్‌ || 32
ఇత్థం సఖిత్వం శ్రీ శంభోః ప్రాపైష ధనదః పురమ్‌ | అలకాన్నికషా చాసీత్కైలాసశ్శంకరాలయః || 33

ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే కైలాస గమనోపాఖ్యానే కుబేరస్య శివమిత్రత్వ వర్ణనం నామ ఏకోనవింశః అధ్యాయః (19).

దేవి ఇట్లు పలికెను -

వత్సా! నీకు సర్వకాలములయందు శివునిపై నిర్మలమగు భక్తి కలుగుగాక! నీ ఎడమ కన్ను పగిలినది గదా! కాన ఎర్రని ఒకే నేత్రము గల వాడవు కమ్ము (30).

నీకు శివుడు ఇచ్చిన వరములు ఫలించుగాక! ఓ కుమారా! నీవు నా రూపమునందు ఈర్ష్యను పొందితివి గాన, కుబేరుడు అను పేర ప్రసిద్ధుడవగుదువు (31).

మహేశ్వరుడు ఈ విధముగా దేవితో గూడి కుబేరునకు వరములనిచ్చి, విశ్వేశ్వరధామమును ప్రవేశించెను (32).

కుబేరుడు ఈ తీరున శ్రీ శంభుని మైత్రిని, అలకానగరమును పొందెను. శంకరుని నివాసమగు కైలాసము అలకా నగరమునకు సమీపనములో వెలసెను (33).

శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్ర సంహితయందు మొదటి ఖండములో కుబేరునకు శివునితో మైత్రి కలుగుట అనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment