🌹 25, AUGUST 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 25, AUGUST 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 25, AUGUST 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
🍀. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Varalakshmi Vrat to All. 🍀
2) 🌹 కపిల గీత - 226 / Kapila Gita - 226 🌹 
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 36 / 5. Form of Bhakti - Glory of Time - 36 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 818 / Vishnu Sahasranama Contemplation - 818 🌹 
🌻 818. సువ్రతః, सुव्रतः, Suvrataḥ 🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 779 / Sri Siva Maha Purana - 779 🌹
🌻. దూత సంవాదము - 3 / Jalandhara’s emissary to Śiva - 3 🌻
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 131 / DAILY WISDOM - 131 🌹 
🌻 10. ఆత్మిక ప్రశ్నలు సాధారణంగా ఆదిభౌతిక శాస్త్రంగా చర్చించబడతాయి / 10. Questions are Usually Discussed under Metaphysics 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 471 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 471 - 3 🌹 
🌻 471. ‘సిద్ధవిద్యా’- 3 / 471. 'Siddhavidya'- 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 25, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*🍀. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Varalakshmi Vrat to All. 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వరలక్ష్మీ వ్రతం, Varalakshmi Vrat 🌻*

*🍀. శ్రీ వరలక్ష్మీ స్తోత్రం 🍀*

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే 
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః 

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఆకాంక్షకు సహచరులు - సాధనలో, పరమప్రాప్య మందు తీవ్ర ఆకాంక్ష వుండడం ఎంత అవసరమో. దానికి సహచరులుగా, ప్రశాంతి, వివేకం, నిస్సంగత్వం అనేవి ఉండడం కూడా అంతే అవసరం, ఏలనంటే, ఈ మూడింటికీ వ్యతిరేక లక్షణాలు నీలో వుంటే, అవి జరగవలసిన దివ్య పరివర్తనకు అవరోధాలు కల్పిస్తాయి. 🍀*

🌷🌷🌷🌷🌷

*🌸. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలకష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. ఈ వ్రతం చేయడంవల్ల లక్ష్మీదేవి కృప కల్గి, సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం. ఈ వ్రతాన్ని గురించి పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు.*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల-నవమి 26:03:16 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: అనూరాధ 09:15:23
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: వైధృతి 18:45:20 వరకు
తదుపరి వషకుంభ
కరణం: బాలవ 14:36:50 వరకు
వర్జ్యం: 14:42:22 - 16:15:54
దుర్ముహూర్తం: 08:31:49 - 09:22:07
మరియు 12:43:18 - 13:33:36
రాహు కాలం: 10:43:51 - 12:18:09
గుళిక కాలం: 07:35:14 - 09:09:33
యమ గండం: 15:26:47 - 17:01:05
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:43
అమృత కాలం: 24:03:34 - 25:37:06
సూర్యోదయం: 06:00:55
సూర్యాస్తమయం: 18:35:23
చంద్రోదయం: 13:23:37
చంద్రాస్తమయం: 00:36:31
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 09:15:23 వరకు తదుపరి
చర యోగం - దుర్వార్త శ్రవణం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🍀. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Varalakshmi Vrat to All. 🍀*
*- ప్రసాద్ భరద్వాజ*

*🌸. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలకష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. ఈ వ్రతం చేయడంవల్ల లక్ష్మీదేవి కృప కల్గి, సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం. ఈ వ్రతాన్ని గురించి పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు.*

వరలక్ష్మీ స్తోత్రం :
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే 
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 226 / Kapila Gita - 226 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 36 🌴*

*36. ఏతద్భగవతో రూపం బ్రహ్మణః పరమాత్మనః|*
*పరం ప్రధానం పురుషం దైవం కర్మవిచేష్టితమ్॥*

*తాత్పర్యము : ఈ విశ్వమంతయును పరమాత్మయైన పరబ్రహ్మ స్వరూపమే. ఐనను ఆ పరమాత్మ ఈ విశ్వమునకు అతీతుడు. ప్రకృతి, పురుషుడు (జీవుడు), దైవము (అదృష్టము), కర్మఫలము ఇవి అన్నియును భగవత్స్వరూపములే.*

*వ్యాఖ్య : వ్యక్తిగత ఆత్మ ఎవరిని సంప్రదించాలి అనే దానికి, భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తిత్వం కలవాడు పురుషుడుగా చెప్పబడ్డాడు, అంటే ఈ పురుషుడు అన్ని జీవులలో ప్రధానమైన వాడు మరియు అతీతము అయిన బ్రహ్మ ప్రకాశం మరియు పరమాత్మ స్వరూపం యొక్క అంతిమ రూపమని ఇక్కడ వివరించబడింది. ఆయన బ్రహ్మ ప్రకాశానికి మరియు పరమాత్మ స్వరూపానికి మూలం కాబట్టి, ఆయనే ఇక్కడ ప్రధాన వ్యక్తిగా వర్ణించబడ్డారు. ఇది కఠ ఉపనిషద్, నిత్యో నిత్యానంలో ధృవీకరించబడింది: అనేక శాశ్వతమైన జీవులు ఉన్నాయి, కానీ ఆయన ప్రధాన నిర్వహణదారు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 226 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 5. Form of Bhakti - Glory of Time - 36 🌴*

*36. etad bhagavato rūpaṁ brahmaṇaḥ paramātmanaḥ*
*paraṁ pradhānaṁ puruṣaṁ daivaṁ karma-viceṣṭitam*

*MEANING : This puruṣa whom the individual soul must approach is the eternal form of the Supreme Personality of Godhead, who is known as Brahman and Paramātmā. He is the transcendental chief personality, and His activities are all spiritual.*

*PURPORT : In order to distinguish the personality whom the individual soul must approach, it is described herein that this puruṣa, the Supreme Personality of Godhead, is the chief amongst all living entities and is the ultimate form of the impersonal Brahman effulgence and Paramātmā manifestation. Since He is the origin of the Brahman effulgence and Paramātmā manifestation, He is described herewith as the chief personality. It is confirmed in the Kaṭha Upaniṣad, nityo nityānām: there are many eternal living entities, but He is the chief maintainer.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 818 / Vishnu Sahasranama Contemplation - 818🌹*

*🌻 818. సువ్రతః, सुव्रतः, Suvrataḥ 🌻*

*ఓం సువ్రతాయ నమః | ॐ सुव्रताय नमः | OM Suvratāya namaḥ*

*యశ్శోభనం వ్రతయతి భుఙ్క్తే విష్ణుర్హిభోజనాత్ ।*
*నివర్తత ఇతి వా స సువ్రతః ప్రోచ్యతే బుధైః ॥*

*వ్రతము అను శభ్దమునకు భుజించుట, భుజించుటను విరమించుట అను రెండు అర్థములు కలవు. చక్కగా వ్రతమును పాటించు జీవులును పరమాత్మ స్వరూపులే.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 818🌹*

*🌻818. Suvrataḥ🌻*

*OM Suvratāya namaḥ*

यश्शोभनं व्रतयति भुङ्क्ते विष्णुर्हिभोजनात् ।
निवर्तत इति वा स सुव्रतः प्रोच्यते बुधैः ॥

*Yaśśobhanaṃ vratayati bhuṅkte viṣṇurhibhojanāt,*
*Nivartata iti vā sa suvrataḥ procyate budhaiḥ.*

*Suvrataḥ is He who is of excellent vows or enjoys eminently or ceases from enjoyment as the occasion may demand.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥
సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥
Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 779 / Sri Siva Maha Purana - 779 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 19 🌴*

*🌻. దూత సంవాదము - 3 🌻*

*రాహువు ఇట్లు పలికెను- దైత్యులచే నాగులచే సేవింపబడు వాడు, సర్వదా ముల్లోకములకు అధిపతి యగు ఆ జలంధరునిచే పంపబడినవాడనై దూతనగు నేను నీ వద్దకు వచ్చి యుంటిని (22). సముద్రుని కుమారుడు, దితిపుత్రులందరికీ ప్రభువు అగు జలంధరుడు తరువాతి కాలములో సర్వులకు అధినాయకుడై ముల్లోకములకు ప్రభువైనాడు (23). బలవంతుడు, దేవతలకు మృత్యువుతో సమమైనవాడు అగు ఆ రాక్షసరాజు యోగివి అగు నిన్ను ఉద్దేశించి పలికిన పలుకులను వినుము (24). ఓ వృషభధ్వజా! గొప్ప దివ్యమైన ప్రభావము గలవాడు, రాక్షసాధిపతి, సర్వశ్రేష్ఠవస్తువులకు యజమాని అగు ఆ రాక్షసప్రభుని ఆజ్ఞను నీవు వినుము (25). శ్మశానమునందు నివసించువాడవు, నిత్యము ఎముకల మాలను ధరించు వాడవు, మరియు దిగంబరుడవు అగు నీకు శుభకరురాలు అగు హిమవత్పుత్రి భార్య ఎట్లు అయినది? (26) నేను రత్నములకు అధీశ్వరుడను. ఆమె స్త్రీలలో శ్రేష్ఠురాలు. కావున ఆమె నాకు మాత్రమే యోగ్యురాలగును. భిక్షకుడవగు నీకు ఆమె తగదు (27). నాకు ముల్లోకములు వశములో నున్నవి. నేను యజ్ఞభాగములను భుజించి చున్నాను. ఈ ముల్లోకములలోని శ్రేష్ఠవస్తువు లన్నియు నా ఇంటిలో నున్నవి (28). మేము శ్రేష్ఠవస్తువులను అనుభవించే రారాజులము. నీ వైతే యోగివి, దిగంబరుడవు. నీవద్దనున్న స్త్రీరత్నమును నాకు సమర్పించుము. ప్రజలు రాజునకు సుఖమును కలిగించవలెను గదా! (29)*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 779🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 19 🌴*

*🌻 Jalandhara’s emissary to Śiva - 3 🌻*

Rāhu said:—
22. I am the messenger of the lord of the three worlds, worthy of being served for ever by Daityas and serpents. I have come here to you on being sent by him.

2 3. The son of the ocean Jalandhara became the lord of all Daityas and now he is the lord of the three worlds. He is the emperor of all.

24. That powerful king of Daityas is like the god of death to the gods. Listen to what he says addressing you the Yogin.

25. O bull-bannered god, listen to the behest of the lord of Daityas who has divine power and who is the master of all excellent things.

26. How can the auspicious daughter of Himavat be a wife unto you who habitually stay in the cremation ground wearing garlands of bones and assuming the form of a naked ascetic.

27. I am the possessor of all excellent things. She is the most excellent of all ladies. She deserves me better than you who live on alms.

28. The three worlds are under my control. I partake of shares in sacrifices. The excellent things of the three worlds are found in my palace.

29. We are the enjoyers of excellent things. You are a mere naked ascetic and a Yogin. Surrender your wife unto me. Subjects shall always keep their king happy.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 131 / DAILY WISDOM - 131 🌹*
*🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 10. ఆత్మిక ప్రశ్నలు సాధారణంగా ఆదిభౌతిక శాస్త్రంగా చర్చించబడతాయి 🌻*

*ఆదిభౌతిక శాస్త్రంగా భావించబడిన తత్వశాస్త్రం భగవంతుడు, ప్రపంచం మరియు ఆత్మ యొక్క స్వభావాలు మరియు సంబంధాల గురించి విస్తృతంగా హేతుబద్ధంగా చర్చిస్తుంది. ఆత్మ మరియు ప్రపంచం భగవంతునితో సమానంగానైనా ఉంటాయి, లేదా భిన్నంగా నయినా ఉంటాయి. అవి భగవంతుని భాగంగా అయినా ఉంటాయి లేదా భగవంతుని రూపంగానైనా ఉంటాయి. అత్యున్నత వాస్తవికత దేవుడు అవ్వొచ్చు, లేదా భౌతిక ప్రపంచం మాత్రమే కావొచ్చు, లేదా వ్యక్తిగత మనస్సు మాత్రమే అవ్వొచ్చు. దేవుడు ఉంటాడు లేదా ఉండడు. అనుభవానికి మూలం భగవంతుడు అవ్వొచ్చు లేదా కాకపోనూ వచ్చు. ప్రపంచం భౌతికమైనది అవ్వొచ్చు లేదా మానసికమైనది అవ్వొచ్చు. చైతన్యం అనేది పదార్థం నుండి స్వతంత్రంగా ఉండొచ్చు లేదా దానిపై ఆధారపడి ఉండొచ్చు.*

*ప్రపంచం మొత్తం ఏకం, అనేకం, వాస్తవం, అవాస్తవం, ఊహ, అనుభావికం వీటిలో ఏదైనా కావొచ్చు. మానవుడు స్వేచ్చా జీవి కావొచ్చు లేదా కాకపోవచ్చు. ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా ఆడిభౌతిక శాస్త్రం క్రింద చర్చించబడతాయి. ఇది విశ్వానికి, సృష్టికి మధ్య తేడా కూడా చెప్తుంది. అదే కాకుండా దేశం, కాలం, సృష్టి, స్థితి, లయ, పరిణామ క్రమం, పుట్టుక, చావు, మరణం తర్వాత జీవితం గురించి శాస్త్ర వివరణలు మొదలైన ఎన్నో ప్రశ్నలను ఈ ఆదిభౌతిక శాస్త్రం చర్చిస్తుంది. ఆధునిక భౌతిక శాస్త్రం మరియు జీవశాస్త్రం యొక్క తాత్విక ప్రాతిపదికను ఆదిభౌతిక శాస్త్రం కింద కూడా చేర్చవచ్చు. విజ్ఞాన శాస్త్రం కింద వివిధ సిద్ధాంతాలు మరియు ప్రక్రియలు, అలాగే తప్పుడు జ్ఞానం యొక్క స్వభావం గురించి వివరంగా చర్చించబడ్డాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 131 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 10. Questions are Usually Discussed under Metaphysics 🌻*

*Philosophy conceived as metaphysics deals with an extensive reasoned discussion of the natures and the relations of God, world and the individual soul. The latter two are either identical in essence with God, or are attributes or parts of God, or are different from God. The ultimate Reality is either God, or the world of perception alone, or only the individual mind. God either exists or not, and is necessary or unnecessary for an explanation of experience. The world is either material or mental in nature; and consciousness is independent of or is dependent on matter.*

*The world is either pluralistic or a single whole, and is real, ideal or unreal, empirical, pragmatic or rational. The individual is either free or bound. Questions of this nature are usually discussed under metaphysics. It also delineates the process of cosmogony and cosmology, the concepts of space, time and causation, creation, evolution and involution, as well as the presuppositions of eschatology or the discourse on the nature of life after death. The philosophical basis of modern physics and biology also can be comprised under metaphysics. Under epistemology the various theories and processes of the acquisition of right knowledge, as well as the nature and possibility of wrong knowledge, are discussed in detail.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 471 - 3  / Sri Lalitha Chaitanya Vijnanam  - 471  - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁* 

*🍀  97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।*
*సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀* 

*🌻 471. ‘సిద్ధవిద్యా’ - 3 🌻* 

*అనన్య చింతన, పర్యుపాసన, నిత్య అభియుక్తత, అనుస్మరణ నిజమగు సిద్ధవిద్య. జ్యోతిషము ఇత్యాది వేదాంగముల ద్వారా జ్ఞానము పొందుచు, సిద్ధులను పొందుట, కాలజ్ఞానము పొందుట అనునవి భ్రాంతులే. అంతర్యామియగు దైవమును సమస్తము నందు దర్శించుచూ, ఉపాసించుట. అట్టి దైవమును పంచాక్షరీతోగాని, అష్టాక్షరీతోగాని, ద్వాదశాక్షరీతోగాని, పంచదశాక్షరీతోగాని ఆరాధించుట సరియగు మార్గము. ఈ మంత్రములు పరామంత్రములు. అనన్యత్వము కలిగించును. సిద్ధ విద్యకిదియే ఉపాయము.* 

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 471 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj* 

*🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita*
*sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻* 

*🌻 471. 'Siddhavidya'- 3 🌻* 

*Ananya Chintana, Paryupasana, Nitya Abhiyuktata, Anusmarana are real Siddhavidya. Gaining knowledge, gaining siddhas and knowledge of time through astrology etc. are illusions. Seeing and worshiping the inner God in everything. Worshiping that God with Panchakshari, Ashtakshari, Dwadasakshari or Panchadsakshari is the right way. These mantras are paraamantras. Brings Uniqueness. Siddha Vidya is the right thing.* 

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 132 : 2-10. vidyāsamhāre taduttha svapna darśanam -4 / శివ సూత్రములు - 132 : 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -4


🌹. శివ సూత్రములు - 132 / Siva Sutras - 132 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

2వ భాగం - శక్తోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -4 🌻

🌴. ఆత్మశుద్ధి త్యాగంలో నిమ్న జ్ఞానము నశించి నప్పుడు, యోగి, ప్రపంచాన్ని శివుని స్వప్నంగా మరియు అతని శరీరం ఏర్పడినట్లు అనుభవిస్తాడు. అతను తన మాయ స్వరూపాన్ని గ్రహించి, స్వచ్ఛమైన జ్ఞానంలో స్థిరపడతాడు. 🌴


సమాధి స్థితిని మేల్కొన్న దశ నుండి నేరుగా లేదా మెలకువ, స్వప్నం, గాఢనిద్ర మరియు తుర్య యొక్క వరుస దశల ద్వారా చేరుకోవచ్చు. నిరంతర ధ్యాన పద్ధతుల ద్వారా ఒకరు అభివృద్ధి చెందినప్పుడు, మేల్కొన్న స్థితి నుండి సమాధిలోకి ప్రవేశించే నైపుణ్యం, చైతన్యం లేదా ఎరుక స్థాయి యొక్క స్వచ్ఛమైన రూపంలో ఉంటుంది, ఇక్కడ సాక్షాత్కారం సులభంగా జరుగుతుంది. మనస్సు మరియు ఉన్నత మనస్సు మధ్య అంతరం క్రమంగా తగ్గినప్పుడు, చివరకు నేను శివుడిని అని గోప్యంగా ధృవీకరించి నప్పుడు అది రెండింటి కలయికకు దారితీస్తుంది. అభ్యాసకుడు దశల వారీగా పురోగమించినప్పుడు మాత్రమే ఈ అంతిమ కలయిక దృఢంగా స్థిరపడుతుంది.



కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 132 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 2 - Śāktopāya.

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 2-10. vidyāsamhāre taduttha svapna darśanam -4 🌻

🌴. When the knowledge is thus destroyed in the sacrifice of self-purification, the yogi experiences the world as a dream of Shiva and his body as a formation. He realizes their illusory nature and becomes established in pure knowledge. 🌴


The stage of samādhi can be reached either from the awakened stage directly or through the successive stages of awake, dream, deep sleep and turya. When one develops by persistent meditative techniques, the skill of entering samādhi from the awakened state, the level of consciousness or awareness is in its purest form where Realization takes place with ease. When the gap between Self and self is progressively reduced, finally it leads to the merger of both when one confidentially affirms I am That of I am Śiva. This ultimate union is firmly established, only when the practitioner progresses in stages.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 32. PROBLEMS / ఓషో రోజువారీ ధ్యానాలు - 32. సమస్యలు



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 32 / Osho Daily Meditations - 32 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 32. సమస్యలు 🍀

🕉. మీకు సమస్యలు లేనట్లుగా మీరు నిర్థారణకు రాగలిగితే, మీకు ఎటువంటి సమస్యలు లేవని మీరు కనుగొంటారు! అన్ని సమస్యలు నమ్మదగినవిగా ఉంటాయి; మీరు వాటిని నమ్ముతారు, అందుకే మీరు అక్కడ ఉన్నారు. 🕉


ఇది స్వయంసూచన: మీరు ఈ విధంగా లేక ఆ విధంగా ఉన్నారని, మీరు సరిపోనివారు లేదా అసమర్థులు అని మీరు పునరావృతం చేస్తూ ఉంటారు. మీరు దేన్నైనా పునరావృతం చేయండి మరియు అది మంత్రం అవుతుంది; అది మీ హృదయంలోకి దిగి వాస్తవం అవుతుంది. మీకు సమస్యలు లేనట్లుగా పని చేయడానికి ప్రయత్నించండి మరియు అకస్మాత్తుగా మీరు పూర్తిగా భిన్నమైన స్థితిని కలిగి ఉన్నారని మీరు చూస్తారు: మీకు ఎలాంటి సమస్యలు లేవని కనుగొంటారు! ఆపై మీరు సమస్యను మళ్లీ తీసుకుంటారా లేదా వాటిని శాశ్వతంగా వదిలేస్తారా అనేది మీ ఇష్టం. సమస్యను పట్టుకున్నది మీరేనని, సమస్య మిమ్మల్ని పట్టుకోవడం కాదని మీరు అర్థం చేసుకుంటే సమస్య చాలా తేలికగా తొలగి పోతుంది.

కానీ మీరు సమస్యలు లేకుండా జీవించలేరు, కాబట్టి మీరు వాటిని సృష్టించడం కొనసాగిస్తారు. సమస్యలు లేకుండా ఒంటరిగా ఉన్న వ్యక్తికి ఏమీ చేయట్లేదు అనిపిస్తుంది. సమస్యతో మీరు చాలా సంతోషంగా భావిస్తారు, ఏదైనా చేయవలసి ఉంటుంది మరియు మీరు దాని గురించి ఆలోచించాలి; అది మీకు ఒక వృత్తిని ఇస్తుంది. మీరు సమర్థులు మరియు మీరు అసమర్థులు మరియు మీరు అది మరియు ఇది- ఇది ప్రాథమికంగా చాలా నేను అనే ఈ నిరంతర ఆలోచన. మీరు తగినంతగా ఉండాలను కుంటున్నారు, కానీ ఎందుకు? మీరు నిజంగా అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉండాలను కుంటున్నారు, కానీ ఎందుకు? ఉన్న అన్ని లోపాలు మరియు పరిమితులతో మీరు ఎందుకు సంతృప్తి చెందలేరు? మీరు వాటిని అంగీకరించిన తర్వాత మీరు మరింత సులభంగా ప్రవహించడాన్ని మీరు చూస్తారు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 32 🌹

📚. Prasad Bharadwaj

🍀 32. PROBLEMS 🍀

🕉 If you can Junction as if you have no problems, you will find that you don't have any problems! All problems are make-believe; you believe in them, and that's why they are there. 🕉


It is autohypnosis: You go on repeating that you are this way and that way, that you are inadequate or incapable. You repeat this, and it becomes a mantra; it sinks into your heart and becomes reality. Just try to function as if you have no problems, and suddenly YOU will see that you have a totally different quality: you don't have any problems! And then it is up to you whether you take up the problem again or you drop them forever. A problem can be dropped so easily if you understand that it is you holding the problem, not the problem holding you.

But we cannot live without problems, so you go on creating them. One feels so alone without problems there is nothing left to be done. With the problem you feel very happy something has to be done, and you have to think about it; it gives you an occupation. This continuous idea that you are inadequate and you are incapable and you are this and that-this is basically very egoistic. You want to be so adequate, but why? You want to be really tremendously capable, but why? Why can't you be satisfied with all the inadequacies and limitations that are there? Once you accept them you will see that you start to flow more easily.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 264 / Agni Maha Purana - 264


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 264 / Agni Maha Purana - 264 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 75

🌻. శివ పూజాంగ హోమ విధి - 9 🌻


పిమ్మట ఘృతముతో నింపిన స్రుక్కు పైన అధోముఖ మగు స్రువము ఉంచి, స్రుక్కునకు చివర పుష్పములుంచవలెను. రెండు చేతులతోడను ఆ రెండింటిని, శంఖముద్రతో పట్టుకొనవలెను. శరీరము పై భాగము ఉన్నతమగునట్లుచేసి లేచి పాదములు సమముగా ఉంచి నిలచి, స్రుక్స్రువముల మూలభాగములను నాభికి అన్చి, దృష్టికి స్థిరముగ నిలిపి, భావనచే బ్రహ్మాదికారణములను విడచుచు, సుషుమ్నా నాడీ మార్గమున బైటకు వచ్చి పైన నిలబడవలెను. స్రుక్స్రువముల మూలభాగములను నాభినుండి పైకి లేపి ఎడమ స్తనమువైపు తీసికొని రావలెను. శరీరము చేతను, మనస్సు చేతను ఆలస్యమును రూపము చేసి, ల్‌షట్‌, వరకును మూలమంత్రములు (ఓం లమః శివాయ వోషట్‌) మెల్లగ చదువుచు ఆ ఘృతమును యవ వలె సన్ననైన ధారతో హోమము చేయవలెను.

పిదప, అచమన - చందన - తాంబూలాదులా సమర్పించి భక్తి భావముతో శివుని ఐశ్వర్యమునకు సాష్టాంగవందనము చేసి మరల అగ్నిపూజ చేపి, 'ఓం హః అస్త్రాయ ఫట్‌" అని ఉచ్చరించుచు సంహారముద్రచే శంబరాహరణము చేసి, భగవంతుడా? నా అపరాధములను క్షమింపుము. అని ఇష్టదేవతను ప్రార్థించి హృదయ మంత్ర ముచ్చరించుచు పూరక ప్రాణాయామముచే, శ్రద్ధతో, తేజఃశాలు లగు ఆ సంధులను తన హృదయ కమలమునందు నిలుపవలెను. వండిన పదార్థములలోని అగ్రభాగము తీసి, కుండసమీపమున అగ్ని కోణమునందు, రెండు మండలములు చేసి ఒక దానిలో అంతర్బలి ఈయవలెను. రెండవదానియందు బాహ్యాబలి ఈయవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 264 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 75

🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 9 🌻


52. The oblation should thus be completed with the (principal mantra) brahmabīja (oṃ) with sacrificial ladles filled with clarified butter holding the ladle in such a way as to have its cup part downwards.

53-56. Having placed a flower at the head of the spoon and then holding it first with the left hand and then with the right band and (showing) the mudrā denoting the conch he should stand up half erect with feet evenly placed and eyes fixed upon the end of the ladle and holding the base of ladle pressed against his navel. Then one should rouse up the stream of his pure consciousness through the suṣumnā (nerve centre below the spiral chord) and carry it to the base of his left breast vigilantly and tell the principal mantra ending with the vauṣaṭ in a low tone. The -clarified butter should be offered having a flow of the measure of the barley.

57. Water for rinsing the mouth, sandal, betals etc. should be offered. (The worshipper) should meditate in his greatness with devotion and then offer salutation.

58-59. After having worshipped the fire well with (the mantra of) the weapon ending with phaṭ and showing the saṃhāra mudrā (the posture of the fingers conveying destruction) and uttering "Pardon me", the gods who reside in the periphery (of the mystic circle) should be placed in the lotus of the heart with extreme devotion with the hṛd mantra after taking a breath.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 418: 11వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 418: Chap. 11, Ver. 04

 

🌹. శ్రీమద్భగవద్గీత - 418 / Bhagavad-Gita - 418 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 04 🌴

04. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో |
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ||


🌷. తాత్పర్యం : హే ప్రభూ! యోగేశ్వరా! నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడనని నీవు తలచినచో దయతో ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము.

🌷. భాష్యము : భౌతికేంద్రియముల ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని దర్శించుట, శ్రవణము చేయుట, అవగాహన చేసికొనుట లేదా గ్రహించుట సాధ్యముకాదని తెలపబడినది. కాని తొలి నుండియే మనుజుడు ప్రేమయుతసేవలో నిమగ్నుడైనచో అ భగవానుని గాంచగలుగును. వాస్తవమునకు ఆధ్యాత్మిక స్పులింగము మాత్రమేయైన జీవునకు భగవానుని దర్శనముగాని, అవగాహనముగాని సాధ్యముగాని విషయము. కనుకనే భక్తుడైన అర్జునుడు తన ఊహాశక్తికి లేదా కల్పనాశక్తిపై ఆధారపడక సామాన్యజీవిగా తన పరిమితిని అంగీకరించి, శ్రీకృష్ణభగవానుని అపరిమేయ స్థితిని కీర్తించుచున్నాడు. పరిమితుడైన జీవునికి అపరిమితుడును మరియు అనంతుడును అయిన భగవంతుని గూర్చి తెలియుట సాధ్యము కాదని అర్జునుడు ఎరుగగలిగెను. అపరిమితుడైన వాడు తనను తాను వ్యక్తపరచుకొనినపుడే అతని కరుణచే అతని అపరిమిత స్వభావమును ఎరుగుట సాధ్యపడగలదు.

శ్రీకృష్ణభగవానుడు అచింత్యశక్తి సంపన్నుడు కనుకనే “యోగేశ్వరా” యను పదము సైతము ప్రాధాన్యమును సంతరించుకొన్నది. అనగా అతడు అపరిమితుడైనను తాను కోరినచో తనంతట తాను వ్యక్తము కాగలడు. కనుకనే అర్జునుడు ఇచ్చట ఆజ్ఞలను ఒసగక అతని నిర్హేతుక, అచింత్యకరుణకై ప్రార్థించుచున్నాడు. భక్తిభావనలో తనను సంపూర్ణ శరణాగతుడై భక్తియుతసేవలో నిలువనిదే ఎవ్వరికినీ తనను వ్యక్తపరచుకొనవలసిన అవసరము శ్రీకృష్ణునకు లేదు. కనుక మానసికకల్పనాబలముపై ఆధారపడివారికి శ్రీకృష్ణభగవానుని దర్శించుట సాధ్యము కాదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 418 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 04 🌴

04. manyase yadi tac chakyaṁ mayā draṣṭum iti prabho
yogeśvara tato me tvaṁ darśayātmānam avyayam


🌷 Translation : If You think that I am able to behold Your cosmic form, O my Lord, O master of all mystic power, then kindly show me that unlimited universal Self.

🌹 Purport : It is said that one can neither see, hear, understand nor perceive the Supreme Lord, Kṛṣṇa, by the material senses. But if one is engaged in loving transcendental service to the Lord from the beginning, then one can see the Lord by revelation. Every living entity is only a spiritual spark; therefore it is not possible to see or to understand the Supreme Lord. Arjuna, as a devotee, does not depend on his speculative strength; rather, he admits his limitations as a living entity and acknowledges Kṛṣṇa’s inestimable position. Arjuna could understand that for a living entity it is not possible to understand the unlimited infinite. If the infinite reveals Himself, then it is possible to understand the nature of the infinite by the grace of the infinite.

The word yogeśvara is also very significant here because the Lord has inconceivable power. If He likes, He can reveal Himself by His grace, although He is unlimited. Therefore Arjuna pleads for the inconceivable grace of Kṛṣṇa. He does not give Kṛṣṇa orders. Kṛṣṇa is not obliged to reveal Himself unless one surrenders fully in Kṛṣṇa consciousness and engages in devotional service. Thus it is not possible for persons who depend on the strength of their mental speculations to see Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


24 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 24, అగష్టు, AUGUST, 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : మాస దుర్గాష్టమి Masik Durgashtami 🌺

🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 19 🍀

37. సత్యధ్యానః సత్యమయః సత్యరూపో నిజాకృతిః |
త్రిలోకగురురేకాత్మా భస్మోద్ధూలితవిగ్రహః

38. ప్రియాప్రియసమః పూర్ణో లాభాలాభసమప్రియః |
సుఖదుఃఖసమో హ్రీమాన్ హితాహితసమః పరః

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : అహంకార విసర్జన - అహంకారానికి అనేక రూపాలున్నాయి. వాటి నన్నింటినీ గురించి నీ చేతన యందలి ఏ ప్రవృత్తిలోనూ దానికి తావీయకు. విశ్వచేతనను నీలో పెంపొందించుకో. ఆహంకారిక దృష్టిని విశ్వవిశాల దృష్టిగా మార్పు చెందించు. ఇదంతా విశ్వేశ్వరుని విశ్వలీలగా గుర్తించి, విశ్వశక్తుల నవగాహన మొనర్చుకో. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల-అష్టమి 27:12:26 వరకు

తదుపరి శుక్ల-నవమి

నక్షత్రం: విశాఖ 09:04:22 వరకు

తదుపరి అనూరాధ

యోగం: ఇంద్ర 20:37:05 వరకు

తదుపరి వైధృతి

కరణం: విష్టి 15:21:21 వరకు

వర్జ్యం: 13:05:50 - 14:42:34

దుర్ముహూర్తం: 10:12:32 - 11:02:53

మరియు 15:14:41 - 16:05:02

రాహు కాలం: 13:52:51 - 15:27:16

గుళిక కాలం: 09:09:35 - 10:44:00

యమ గండం: 06:00:45 - 07:35:10

అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:43

అమృత కాలం: 22:46:14 - 24:22:58

సూర్యోదయం: 06:00:45

సూర్యాస్తమయం: 18:36:07

చంద్రోదయం: 12:23:22

చంద్రాస్తమయం: 23:43:48

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: వృశ్చికం

యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ

ఫలం 09:04:22 వరకు తదుపరి

ఆనంద యోగం - కార్య సిధ్ధి

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹