గీతోపనిషత్తు -196

🌹. గీతోపనిషత్తు -196 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 37

🍀 36. మనో నిగ్రహము - శ్రద్ధ కలవాడు మొట్టమొదటగ కర్మఫలములను విసర్జించుట నేర్వవలెను. కర్తవ్య కర్మనే నిర్వర్తించుట నేర్వవలెను. ఇష్టాయిష్టములను ఆధారముగ చేసుకొని జీవించుటగాక కర్తవ్యమునే అనుసరించుట నేర్వవలెను. క్రమముగ స్వంత సంకల్పము లను విసర్జించి అందివచ్చు కర్తవ్యములను మాత్రము నిర్వర్తించుచు జీవించవలెను. శీతోష్ణ సుఖదుఃఖములు, మానావమానములు వైరాగ్య దృష్టితో గ్రహించవలెను. సమ భావమును అందరియందు నిర్వర్తించుట నేర్వవలెను. శ్రద్ధ ఆధారముగ ఈ విషయములను నేర్చినచో మనో నిగ్రహ మేర్పడును. 🍀

అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః |
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి || 37

అర్జునుడు మరియొక సందేహమును వెలిబుచ్చెను. శ్రద్ధ యున్నను మనోనిగ్రహము లేనివాడు, చంచలమగు మనస్సు కలవాడు యోగసిద్ధిని పొందనపుడు అత డే గతి పొందును? ఈ ప్రశ్న చాల సమంజసమగు ప్రశ్న. శ్రద్ధ యున్నను మనో నిగ్రహము లేకపోవుట సర్వసామాన్యముగ శిష్టుల ఎడ గోచ రించును. మనో చాంచల్యము వలన యోగము కుదరదు.

యత చిత్తుడు కానిదే యోగాభ్యాసమును గూర్చి భావించుట నిరర్ధకము గదా! కావున శ్రద్ధ కలవాడు మొట్టమొదటగ కర్మఫలములను విసర్జించుట నేర్వవలెను. కర్తవ్య కర్మనే నిర్వర్తించుట నేర్వవలెను. ఇష్టాయిష్టములను ఆధారముగ చేసుకొని జీవించుటగాక కర్తవ్యమునే అనుసరించుట నేర్వవలెను.

క్రమముగ స్వంత సంకల్పము లను విసర్జించి అందివచ్చు కర్తవ్యములను మాత్రము నిర్వర్తించుచు జీవించవలెను. శీతోష్ణ సుఖదుఃఖములు, మానావమానములు వైరాగ్య దృష్టితో గ్రహించవలెను. సమ భావమును అందరియందు నిర్వర్తించుట నేర్వవలెను. శ్రద్ధ ఆధారముగ ఈ విషయములను నేర్చినచో మనో నిగ్రహ మేర్పడును.

అర్జునుడు సహజముగ శ్రద్ధా వంతుడు అగుటచే శ్రద్ధ ఆధారముగ యోగమును నిర్వర్తించుట వీలుపడు నేమోనని, చంచలమైన మనస్సు కలిగినను యోగ మభ్యసించవచ్చునేమోనని కొంత తడవు భావించి, చలిత మానసు లకు యోగాభ్యాసము కుదరదని నిశ్చయించుకొని పై విధముగ ప్రశ్నించెను.

శ్రద్ధ ప్రధానమగు విషయము. శ్రద్ధను ముందు తెలిపిన ప్రాథమిక విషయములపై నిలుపవలెను. అపుడు స్థిరమగు మనస్సు లేక యతచిత్తము ఏర్పడును. యతచిత్త మేర్పడినవాడు యతి. ఈ శ్లోకమున అయతి గూర్చి అర్జునుడు పలుకుచున్నాడు.

అయతీకి మనస్సు చలించు చుండును. యతి మనస్సు చలింపదు. యతియైనవాడికే యోగాభ్యాసము సిద్ధించును. కానివాడు ముందు యతచిత్తము నేర్పరచుకొనవలెను. కేవలము శ్రద్ధ కలిగి చరిత మనస్కులగు వారు యోగసిద్ధిని పొందలేరు గదా! అట్టివారు ఏ గతి పొందుదురని అర్జునుని ప్రశ్న.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

08 May 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 72 / Sri Lalita Sahasranamavali - Meaning - 72

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 72 / Sri Lalita Sahasranamavali - Meaning - 72 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🍀 313. రమా -
లక్ష్మీదేవి.

🍀 314. రాకేందువదనా -
పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము గలది.

🍀 315. రతిరూపా -
ఆసక్తి రూపమైనది.

🍀 316. రతిప్రియా -
ఆసక్తి యందు ప్రీతి కలది.

🍀 317. రక్షాకరీ -
రక్షించునది.

🍀 318. రాక్షసఘ్నీ -
రాక్షసులను సంహరించునది.

🍀 319. రామా -
ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా వుండేది.

🍀 320. రమణ లంపటా -
రమణునితో అత్యంత సాన్నిహిత్య, సామ్య సంబంధము గలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 72 🌹

📚. Prasad Bharadwaj

🌻 72. ramā rākenduvadanā ratirūpā ratipriyā |
rakṣākarī rākṣasaghnī rāmā ramaṇalampaṭā || 72 || 🌻

🌻 313 ) Ramaa -
She who is like Lakshmi

🌻 314 ) Raakendu vadana -
She who has a face like the full moon

🌻 315 ) Rathi roopa -
She who attracts others with her features like Rathi (wife of God of love-Manmatha)

🌻 316 ) Rathi priya -
She who likes Rathi

🌻 317 ) Rakshaa kari -
She who protects

🌻 318 ) Rakshasagni -
She who kills Rakshasas-ogres opposed to the heaven

🌻 319 ) Raamaa -
She who is feminine

🌻 320 ) Ramana lampata -
She who is interested in making love to her lord

Continues..

🌹 🌹 🌹 🌹 🌹

08 May 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 23

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 23 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚. ప్రసాద్ భరద్వాజ

సంతోషమనేది ఒక దివ్య లక్షణము. దేశకాల పరిస్థితులకు, పరిసరముల ప్రభావమునకు అతీతముగా, తనకు కలిగినదానిని దైవదత్తముగా స్వీకరించి జీవించువారిలో ఈ లక్షణము సంపూర్ణముగా కనబడుతుంది. సంతోషము వలన మనస్సు పరిసరముల ప్రభావమునకు లోనుకాదు.

దీనివలన ఆరోగ్యము, బలము, దీర్ఘాయువు సిద్ధిస్తాయి. సంతోషాన్ని అవలంబించినవారే తాము సుఖముగా జీవించి‌ ఇతరులకు కూడ సుఖాన్ని కలిగించగలరు.

ఆనందమనేది‌ అంతర్యామియైన భగవంతుని వ్యక్తరూపము. ఆనందమునకు అంతరాయము కలుగనప్పుడే అమరత్వము సిద్ధిస్తుంది.

ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నకు పరమగురువులు ఇచ్చిన సమాధానమేమంటే ఆనందంగా ఉండడమే.

అందుకోసం ఇంకేమిచేసినా దాని కన్నా వేరైనా స్థితిలో ఉంటాము. ప్రతి ఒక్క జీవికి భగవంతుడు ప్రసాదించిన స్థితి ఆనందమే. కాని‌ మనమే అందుకు అవరోధాలు కల్పించుకుంటాము.

మన ప్రవర్తన వలన కలిగిన అవరోధాలకు బంధితులమై దుఃఖాన్ని పొంది, దానికి కారణము ఇతరులు అని లేక భగంతుడు అని భావిస్తాము.

సహజమైన భగవద్ధత్తమైన ఆనందస్థితిని నిలుపుకోవడానికి మనకు కావలసినది వివేకము. అనగా యుక్తాయుక్త విచక్షణ. దీనినే బుద్ధి అంటారు.

🌹 🌹 🌹 🌹 🌹

08 May 2021

శ్రీ శివ మహా పురాణము - 395

🌹 . శ్రీ శివ మహా పురాణము - 395 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 18

🌻. కాముని విజృంభణము - 3 🌻

శివుడిట్లు పలికెను-

ఇది ముఖమా? చంద్రుడా? ఇవి నేత్రములా? కలువలా? ఇవి కనుబొమలా? మహాత్ముడగు మన్మథుని ధనస్సులా? (31) ఇది అధరమా? దొండపండా? ఇది నాసికయా ? లేక చిలుక ముక్కు అగునా? ఆహా! ఏమి కంఠధ్వని? కోకిల గీతమును పోలియున్నది. ఈమె నడుము అగ్ని హోత్రవేది వలె సన్నగా నున్నది (32). ఈమె నడకను ఏమని వర్ణించెదను? ఈమె రూపమును ఎన్నిసార్లు వర్ణించెదను? ఈమె ధరించిన పుష్పములను, వస్త్రములను ఏమని వర్ణించగలను? (33) సృష్టిలోని సౌందర్యము అంతయూ ఒక్కచోట ప్రోగు చేసినట్లున్నది. ఈమె అవయవములు పూర్ణ రమణీయములనుటలో సందియము లేదు (34).

అహో! అద్భుతమగు రూపముగల ఈ పార్వతి ధన్యురాలు. ఇంతటి సుందరి ముల్లోకములలోనైననూ మరియొక స్త్రీ లేదు (35). అద్భుతమగు అవయవములను కలిగియున్న ఈమె మంచి లావణ్యమునకు నిధియై యున్నది. గొప్ప సుఖమును వర్ధిల్లజేయు ఈమె మునులనైననూ మోహపెట్టగలదు (36).

హరుడు ఈ విధముగా అనేక పర్యాయములు ఆమె అవయవములను వర్ణించి, బ్రహ్మ ఇచ్చిన వరమును గుర్తు చేసుకొని విరమించెను (37). ఓ మహర్షీ ! పార్వతి తన ముఖమును ప్రకటము చేసి, పదేపదే ప్రేమ వీక్షణములతో మహానందముతో చూచుచూ చక్కటి చిరునవ్వుతో కూడి యుండెను (38). ఆమె యొక్క ఆ చేష్టను చూచినవాడై, గొప్ప లీలలు గలవాడు, మహేశ్వరుడునగు శంభుడు మోహమును పొంది ఇట్లు పలికెను (39). ఈమెను చూచినంత మాత్రాన మహానందము కలుగుచున్నది. ఈమెను నేను కౌగిలించుకున్నప్పుడు ఎంతటి సుఖము కలుగునో గదా! (40)

మహాయోగి యగు ఆ శివుడు క్షణకాలము ఇట్లు అలోచించి, తరువాత పార్వతిని ఆదరించెను. ఆయన తెలివిని పొంది (మోహమును వీడి) గొప్ప వైరాగ్యము గలవాడై ఇట్లు అనుకొనెను (41). ఏమైనది? చిత్రమగు ఘటన జరిగినది. నేను మోహితుడనైతిని యేమి? నేను సమర్థుడను, ప్రభుడను అయి ఉండియూ, ఈనాడు కామునిచే వికారమును పొందునట్లు చేయబడితిని (42). ఈశ్వరుడనగు నేనే పరస్త్రీని సృశించ గోరినచో, ఇతరులగు సామాన్య ప్రాణులు ఏ పనిని చేయుటకు తగరు? ఏయే పనులను చేయకుందురు? (43) సర్వప్రాణుల ఆత్మభూతుడగు ఆ పరమేశ్వరుడు 'దీనివలన ప్రయోజనమేమున్నది?' అని నిశ్చయించుకొని, వైరాగ్యము నాశ్రయించి, ఆమెను పొందవలెననే ఆకాంక్షను నివారించుకొనెను (44).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందలి పార్వతీ ఖండములో కాముడు వికారములను కలిగించుట అనే పదునెమిదవ అధ్యాయము ముగిసినది (18).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

08 May 2021

8-MAY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 196🌹  
2) 🌹. శివ మహా పురాణము - 395🌹 
3) 🌹 Light On The Path - 142🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -23🌹  
5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 217🌹
6) 🌹 Osho Daily Meditations - 12🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 72 / Lalitha Sahasra Namavali - 72🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 72 / Sri Vishnu Sahasranama - 72🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -196 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 37

*🍀 36. మనో నిగ్రహము - శ్రద్ధ కలవాడు మొట్టమొదటగ కర్మఫలములను విసర్జించుట నేర్వవలెను. కర్తవ్య కర్మనే నిర్వర్తించుట నేర్వవలెను. ఇష్టాయిష్టములను ఆధారముగ చేసుకొని జీవించుటగాక కర్తవ్యమునే అనుసరించుట నేర్వవలెను. క్రమముగ స్వంత సంకల్పము లను విసర్జించి అందివచ్చు కర్తవ్యములను మాత్రము నిర్వర్తించుచు జీవించవలెను. శీతోష్ణ సుఖదుఃఖములు, మానావమానములు వైరాగ్య దృష్టితో గ్రహించవలెను. సమ భావమును అందరియందు నిర్వర్తించుట నేర్వవలెను. శ్రద్ధ ఆధారముగ ఈ విషయములను నేర్చినచో మనో నిగ్రహ మేర్పడును. 🍀*

అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః |
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి || 37

అర్జునుడు మరియొక సందేహమును వెలిబుచ్చెను. శ్రద్ధ యున్నను మనోనిగ్రహము లేనివాడు, చంచలమగు మనస్సు కలవాడు యోగసిద్ధిని పొందనపుడు అత డే గతి పొందును? ఈ ప్రశ్న చాల సమంజసమగు ప్రశ్న. శ్రద్ధ యున్నను మనో నిగ్రహము లేకపోవుట సర్వసామాన్యముగ శిష్టుల ఎడ గోచ రించును. మనో చాంచల్యము వలన యోగము కుదరదు. 

యత చిత్తుడు కానిదే యోగాభ్యాసమును గూర్చి భావించుట నిరర్ధకము గదా! కావున శ్రద్ధ కలవాడు మొట్టమొదటగ కర్మఫలములను విసర్జించుట నేర్వవలెను. కర్తవ్య కర్మనే నిర్వర్తించుట నేర్వవలెను. ఇష్టాయిష్టములను ఆధారముగ చేసుకొని జీవించుటగాక కర్తవ్యమునే అనుసరించుట నేర్వవలెను. 

క్రమముగ స్వంత సంకల్పము లను విసర్జించి అందివచ్చు కర్తవ్యములను మాత్రము నిర్వర్తించుచు జీవించవలెను. శీతోష్ణ సుఖదుఃఖములు, మానావమానములు వైరాగ్య దృష్టితో గ్రహించవలెను. సమ భావమును అందరియందు నిర్వర్తించుట నేర్వవలెను. శ్రద్ధ ఆధారముగ ఈ విషయములను నేర్చినచో మనో నిగ్రహ మేర్పడును. 

అర్జునుడు సహజముగ శ్రద్ధా వంతుడు అగుటచే శ్రద్ధ ఆధారముగ యోగమును నిర్వర్తించుట వీలుపడు నేమోనని, చంచలమైన మనస్సు కలిగినను యోగ మభ్యసించవచ్చునేమోనని కొంత తడవు భావించి, చలిత మానసు లకు యోగాభ్యాసము కుదరదని నిశ్చయించుకొని పై విధముగ ప్రశ్నించెను.

శ్రద్ధ ప్రధానమగు విషయము. శ్రద్ధను ముందు తెలిపిన ప్రాథమిక విషయములపై నిలుపవలెను. అపుడు స్థిరమగు మనస్సు లేక యతచిత్తము ఏర్పడును. యతచిత్త మేర్పడినవాడు యతి. ఈ శ్లోకమున అయతి గూర్చి అర్జునుడు పలుకుచున్నాడు. 

అయతీకి మనస్సు చలించు చుండును. యతి మనస్సు చలింపదు. యతియైనవాడికే యోగాభ్యాసము సిద్ధించును. కానివాడు ముందు యతచిత్తము నేర్పరచుకొనవలెను. కేవలము శ్రద్ధ కలిగి చరిత మనస్కులగు వారు యోగసిద్ధిని పొందలేరు గదా! అట్టివారు ఏ గతి పొందుదురని అర్జునుని ప్రశ్న.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 395🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 18

*🌻. కాముని విజృంభణము - 3 🌻*

శివుడిట్లు పలికెను-

ఇది ముఖమా? చంద్రుడా? ఇవి నేత్రములా? కలువలా? ఇవి కనుబొమలా? మహాత్ముడగు మన్మథుని ధనస్సులా? (31) ఇది అధరమా? దొండపండా? ఇది నాసికయా ? లేక చిలుక ముక్కు అగునా? ఆహా! ఏమి కంఠధ్వని? కోకిల గీతమును పోలియున్నది. ఈమె నడుము అగ్ని హోత్రవేది వలె సన్నగా నున్నది (32). ఈమె నడకను ఏమని వర్ణించెదను? ఈమె రూపమును ఎన్నిసార్లు వర్ణించెదను? ఈమె ధరించిన పుష్పములను, వస్త్రములను ఏమని వర్ణించగలను? (33) సృష్టిలోని సౌందర్యము అంతయూ ఒక్కచోట ప్రోగు చేసినట్లున్నది. ఈమె అవయవములు పూర్ణ రమణీయములనుటలో సందియము లేదు (34). 

అహో! అద్భుతమగు రూపముగల ఈ పార్వతి ధన్యురాలు. ఇంతటి సుందరి ముల్లోకములలోనైననూ మరియొక స్త్రీ లేదు (35). అద్భుతమగు అవయవములను కలిగియున్న ఈమె మంచి లావణ్యమునకు నిధియై యున్నది. గొప్ప సుఖమును వర్ధిల్లజేయు ఈమె మునులనైననూ మోహపెట్టగలదు (36).

హరుడు ఈ విధముగా అనేక పర్యాయములు ఆమె అవయవములను వర్ణించి, బ్రహ్మ ఇచ్చిన వరమును గుర్తు చేసుకొని విరమించెను (37). ఓ మహర్షీ ! పార్వతి తన ముఖమును ప్రకటము చేసి, పదేపదే ప్రేమ వీక్షణములతో మహానందముతో చూచుచూ చక్కటి చిరునవ్వుతో కూడి యుండెను (38). ఆమె యొక్క ఆ చేష్టను చూచినవాడై, గొప్ప లీలలు గలవాడు, మహేశ్వరుడునగు శంభుడు మోహమును పొంది ఇట్లు పలికెను (39). ఈమెను చూచినంత మాత్రాన మహానందము కలుగుచున్నది. ఈమెను నేను కౌగిలించుకున్నప్పుడు ఎంతటి సుఖము కలుగునో గదా! (40)

  మహాయోగి యగు ఆ శివుడు క్షణకాలము ఇట్లు అలోచించి, తరువాత పార్వతిని ఆదరించెను. ఆయన తెలివిని పొంది (మోహమును వీడి) గొప్ప వైరాగ్యము గలవాడై ఇట్లు అనుకొనెను (41). ఏమైనది? చిత్రమగు ఘటన జరిగినది. నేను మోహితుడనైతిని యేమి? నేను సమర్థుడను, ప్రభుడను అయి ఉండియూ, ఈనాడు కామునిచే వికారమును పొందునట్లు చేయబడితిని (42). ఈశ్వరుడనగు నేనే పరస్త్రీని సృశించ గోరినచో, ఇతరులగు సామాన్య ప్రాణులు ఏ పనిని చేయుటకు తగరు? ఏయే పనులను చేయకుందురు? (43) సర్వప్రాణుల ఆత్మభూతుడగు ఆ పరమేశ్వరుడు 'దీనివలన ప్రయోజనమేమున్నది?' అని నిశ్చయించుకొని, వైరాగ్యము నాశ్రయించి, ఆమెను పొందవలెననే ఆకాంక్షను నివారించుకొనెను (44).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందలి పార్వతీ ఖండములో కాముడు వికారములను కలిగించుట అనే పదునెమిదవ అధ్యాయము ముగిసినది (18).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 142 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then - 9 🌻*

 541. We are always told that we must follow our own conscience. The dictates of conscience come from above and represent usually the knowledge of the ego on the subject. But the ego himself is only partially developed as yet. His knowledge on any given subject may be quite small, or even inaccurate, and he can reason only from the information before him. 

Because of this a man’s conscience often misleads him. It sometimes happens that an ego who is young and knows but little may nevertheless be able to impress his will upon the personality. As a general rule, the undeveloped ego is also undeveloped in his power of impressing himself upon his lower vehicles, and perhaps that is just as well. 

Sometimes, however, an ego who lacks development in tolerance and wide knowledge may yet have a will sufficiently strong to impress upon his physical brain orders which would show that he was a very young ego and did not understand.1 1 Ante., Vol. I, Part IV, Ch. 6: Confidence.

542. We cannot but obey our conscience, yet surely we might try to check and verify it by certain broad facts which no one can dispute. It may be that the Inquisitors were acting under the dictates of their conscience sometimes, but if they had compared the great broad rules that they should love one another which their supposed leader had given them, with the conscience which dictated murders and tortures and burnings, they would have waited and said: 

“Manifestly something is wrong. Let us at least take counsel before we follow our instincts in this particular matter.” They would have been quite right to take such counsel, to test that conscience, by the general rules coming from One whom they themselves acknowledged as infinitely greater than themselves. They did not think of it; so came much evil into the world. Very few people will pause and consider in a case of that sort, yet one can easily see that it is the only safe thing to do.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 23 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚. ప్రసాద్ భరద్వాజ

సంతోషమనేది ఒక దివ్య లక్షణము. దేశకాల పరిస్థితులకు, పరిసరముల ప్రభావమునకు అతీతముగా, తనకు కలిగినదానిని దైవదత్తముగా స్వీకరించి జీవించువారిలో ఈ లక్షణము సంపూర్ణముగా కనబడుతుంది. సంతోషము వలన మనస్సు పరిసరముల ప్రభావమునకు లోనుకాదు. 

దీనివలన ఆరోగ్యము, బలము, దీర్ఘాయువు సిద్ధిస్తాయి. సంతోషాన్ని అవలంబించినవారే తాము సుఖముగా జీవించి‌ ఇతరులకు కూడ సుఖాన్ని కలిగించగలరు. 

ఆనందమనేది‌ అంతర్యామియైన భగవంతుని వ్యక్తరూపము. ఆనందమునకు అంతరాయము కలుగనప్పుడే అమరత్వము సిద్ధిస్తుంది. 

ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నకు పరమగురువులు ఇచ్చిన సమాధానమేమంటే ఆనందంగా ఉండడమే. 

అందుకోసం ఇంకేమిచేసినా దాని కన్నా వేరైనా స్థితిలో ఉంటాము. ప్రతి ఒక్క జీవికి భగవంతుడు ప్రసాదించిన స్థితి ఆనందమే. కాని‌ మనమే అందుకు అవరోధాలు కల్పించుకుంటాము. 

మన ప్రవర్తన వలన కలిగిన అవరోధాలకు బంధితులమై దుఃఖాన్ని పొంది, దానికి కారణము ఇతరులు అని లేక భగంతుడు అని భావిస్తాము.

సహజమైన భగవద్ధత్తమైన ఆనందస్థితిని నిలుపుకోవడానికి మనకు కావలసినది వివేకము. అనగా యుక్తాయుక్త విచక్షణ. దీనినే బుద్ధి అంటారు.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 12 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 CHAIN REACTION 🍀*

*🕉 All things happen together. 🕉*

When you feel less guilty, immediately you start feeling happier. When you feel more happy, you feel less in conflict, more harmonious-together. When you feel together, more harmonious, suddenly you feel a certain grace surrounding you. 

These things function like a chain reaction: One starts the other, the other starts another, and they go on spreading. Feeling less guilty is very important. The whole of humanity has been made to feel guilty--centuries of conditioning, of being told to do this and not to do that. 

Not only that, but forcing people by saying that if they do something that is not allowed by the society or by the church, then they are sinners. If they do something that is appreciated by the society and the church, then they are saints. 

So everybody has been fooled into doing things that society wants them to do, and not to do things that society does not want them to do. Nobody has bothered about whether this is your thing or not. Nobody has bothered about the individual. Move into a new light, into a new consciousness, where you can unguilt yourself. And then many more things will follow.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 72 / Sri Lalita Sahasranamavali - Meaning - 72 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*

🍀 313. రమా - 
లక్ష్మీదేవి.

🍀 314. రాకేందువదనా - 
పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము గలది.

🍀 315. రతిరూపా - 
ఆసక్తి రూపమైనది.

🍀 316. రతిప్రియా - 
ఆసక్తి యందు ప్రీతి కలది.

🍀 317. రక్షాకరీ - 
రక్షించునది.

🍀 318. రాక్షసఘ్నీ -
 రాక్షసులను సంహరించునది.

🍀 319. రామా - 
ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా వుండేది.

🍀 320. రమణ లంపటా - 
రమణునితో అత్యంత సాన్నిహిత్య, సామ్య సంబంధము గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 72 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 72. ramā rākenduvadanā ratirūpā ratipriyā |*
*rakṣākarī rākṣasaghnī rāmā ramaṇalampaṭā || 72 || 🌻*

🌻 313 ) Ramaa -   
She who is like Lakshmi

🌻 314 ) Raakendu vadana -  
 She who has a face like the full moon

🌻 315 ) Rathi roopa -   
She who attracts others with her features like Rathi (wife of God of love-Manmatha)

🌻 316 ) Rathi priya -   
She who likes Rathi

🌻 317 ) Rakshaa kari -   
She who protects

🌻 318 ) Rakshasagni -   
She who kills Rakshasas-ogres opposed to the heaven

🌻 319 ) Raamaa -   
She who is feminine

🌻 320 ) Ramana lampata -   
She who is interested in making love to her lord

Continues..
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 72 / Sri Vishnu Sahasra Namavali - 72 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*జ్యేష్ట నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*

*🍀 72. మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః|*
*మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః|| 72 🍀*

🍀 671) మహాక్రమ: - 
గొప్ప పధ్ధతి గలవాడు.

🍀 672) మహాకర్మా - 
గొప్ప కర్మను ఆచరించువాడు.

🍀 673) మహాతేజా: - 
గొప్ప తేజస్సు గలవాడు.

🍀 674) మహోరగ: - 
గొప్ప సర్ప స్వరూపుడు.

🍀 675) మహాక్రతు: - 
గొప్ప యజ్ఞ స్వరూపుడు.

🍀 676) మహాయజ్వా - 
విశ్వ శ్రేయమునకై అనేక యజ్ఞములు నిర్వహించినవాడు.

🍀 677) మహాయజ్ఞ: - 
గొప్ప యజ్ఞ స్వరూపుడు.

🍀 678) మహాహవి: - 
యజ్ఞమునందలి హోమసాధనములు, హోమద్రవ్యములు అన్నిటి స్వరూపుడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 72 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Jeshta 4th Padam*

*🌻mahākramō mahākarmā mahātejā mahōragaḥ |*
*mahākraturmahāyajvā mahāyajñō mahāhaviḥ || 72 || 🌻*

🌻 671. Mahākramaḥ: 
One with enormous strides. May Vishnu with enormous strides bestow on us happiness.

🌻 672. Mahākarmā: 
One who is performing great works like the creation of the world.

🌻 673. Mahātejāḥ: 
He from whose brilliance, sun and other luminaries derive their brilliance. Or one who is endowed with the brilliance of various excellences.

🌻 674. Mahoragaḥ: 
He is also the great serpent.

🌻 675. Mahākratuḥ: 
He is the great Kratu or sacrifice.

🌻 676. Mahāyajvā: 
One who is great and performs sacrifices for the good of the world.

🌻 677. Mahāyajñaḥ: 
He who is the great sacrifice.

🌻 678. Mahāhaviḥ: 
The whole universe conceived as Brahman and offered as sacrificial offering (Havis) into the fire of the Self, which is Brahman.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹