✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚. ప్రసాద్ భరద్వాజ
సంతోషమనేది ఒక దివ్య లక్షణము. దేశకాల పరిస్థితులకు, పరిసరముల ప్రభావమునకు అతీతముగా, తనకు కలిగినదానిని దైవదత్తముగా స్వీకరించి జీవించువారిలో ఈ లక్షణము సంపూర్ణముగా కనబడుతుంది. సంతోషము వలన మనస్సు పరిసరముల ప్రభావమునకు లోనుకాదు.
దీనివలన ఆరోగ్యము, బలము, దీర్ఘాయువు సిద్ధిస్తాయి. సంతోషాన్ని అవలంబించినవారే తాము సుఖముగా జీవించి ఇతరులకు కూడ సుఖాన్ని కలిగించగలరు.
ఆనందమనేది అంతర్యామియైన భగవంతుని వ్యక్తరూపము. ఆనందమునకు అంతరాయము కలుగనప్పుడే అమరత్వము సిద్ధిస్తుంది.
ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నకు పరమగురువులు ఇచ్చిన సమాధానమేమంటే ఆనందంగా ఉండడమే.
అందుకోసం ఇంకేమిచేసినా దాని కన్నా వేరైనా స్థితిలో ఉంటాము. ప్రతి ఒక్క జీవికి భగవంతుడు ప్రసాదించిన స్థితి ఆనందమే. కాని మనమే అందుకు అవరోధాలు కల్పించుకుంటాము.
మన ప్రవర్తన వలన కలిగిన అవరోధాలకు బంధితులమై దుఃఖాన్ని పొంది, దానికి కారణము ఇతరులు అని లేక భగంతుడు అని భావిస్తాము.
సహజమైన భగవద్ధత్తమైన ఆనందస్థితిని నిలుపుకోవడానికి మనకు కావలసినది వివేకము. అనగా యుక్తాయుక్త విచక్షణ. దీనినే బుద్ధి అంటారు.
🌹 🌹 🌹 🌹 🌹
08 May 2021
No comments:
Post a Comment