కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 9

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 9 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

మా అమ్మాయికి జ్వరం వచ్చింది. మా అమ్మాయికి ఏదో అయ్యింది. లేదూ మా అబ్బాయికి ఏదో అయ్యింది. లేదూ మా ఆయనకి ఏదో అయ్యింది, లేదూ మా ఇంకొకరికి ఏదో అయ్యింది, మా సంబంధీకులకు ఏదో అయ్యింది, ఏ సంబంధమూ లేనివారికి ఏదో అయ్యింది, అనేటటువంటి సంకల్పం నీలో ప్రవేశించింది. 

ప్రవేశించగానే ఏమౌతుందంటే, తత్‌ కారణ రీత్యా, ఆ బలం రీత్యా, ఆ తపస్సు రీత్యా, ఆ జ్ఞానబలం రీత్యా, ఆ వైరాగ్య బలం రీత్యా, ఆ సమర్థనీయమైనటు వంటి శక్తి ద్వారా. ఇదంతా శక్తితో కూడుకున్నటువంటి వ్యవహారమన్నమాట. పదార్థగతంగా ఇవన్నీ సాధ్యం కావు. కానీ, శక్తిగతంగా ఇవన్నీ సాధ్యమే. తపఃశక్తి వలన ఇవన్నీ సాధ్యమే. కర్మఉపాసన వలన ఇవన్నీ సాధ్యమే. 

ఆయా ఉపాసన బలముల యొక్క సమర్థత వలన నీవు అలా అవుతావు. తత్‌ ప్రభావ రీత్యా, ప్రేరేపించబడి, ఆ సంకల్పమునకు నీవు లోబడి, నీవు ప్రవర్తిస్తావు. ఎప్పుడైతే ప్రవర్తించావో, తత్‌ ప్రభావ రీత్యా నీకా మాలిన్యం అంటుకోక తప్పదు. 

మాలిన్యం అంటుకోగానే శుద్ధ చైతన్యంగా ఉండవలసిన నీవు మలిన చైతన్యమై, మిశ్రమ రూపమైనటువంటి కర్మయందు ప్రవేశించి, నీవు జీవుడవైపోతావు.

 ఆత్మసాక్షాత్కార జ్ఞానమే నాకు ప్రధానమైనటువంటి లక్ష్యము అనేటటువంటిది మరపుకు వస్తుంది. “మరుపే జీవుడు. ఎఱుకయే ఆత్మ” - ఈ సత్యమును తెలుసుకోవాలి.

      రోజూ కాబట్టి, ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలనుకున్నవారు, కామమును లవలేశమైననూ మిగుల్చుకోకుండా పోగొట్టుకోవాలి. 

జనన మరణముల మధ్యలో దేనిని నేను ఆశ్రయించను, అని ఈశ్వరుని వద్ద వాగ్దానం చేసి, అట్టి వాగ్దాన భంగం కలుగకుండా నీవు నిలబెట్టుకోవాలి. అనేక రకములైనటువంటి ఆటంకములు వస్తూ ఉంటాయి. అవన్నీ కర్మవశాత్తు ప్రేరితమై పరీక్షగా వస్తూ ఉంటాయి. 

వచ్చినప్పుడు ఆ పరీక్షలో వైరాగ్యం చేత, తీవ్రమైనటువంటి జ్ఞాననిష్ఠ చేత, తీవ్రమైనటువంటి లక్ష్యశుద్ధి చేత, నీవు ఎదురించాలి. అంతేగానీ, ఆయా చిన్న చిన్న సమస్యలను గురించి, నీవు ప్రభావితం కాకూడదు.

       పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి లోబడినది అంతా కామమని పేరు. ఇది పంచభూతాత్మకమైన ప్రకృతికి లోబడి ఉందా? లేదా? అన్న ప్రశ్న వేసుకున్నావనుకో అది కామము అవునో కాదో అర్థమైపోతుంది. వెంటనే ఆ కామమును నిర్జించాలి. వైరాగ్యముతో కామము యొక్క మూలమును నిర్జించాలి. 

అలా ఎప్పుడైతే నిర్జించిన వాడివి అవుతావో, నీవు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి అర్హుడవు అవుతావు. తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ, తీవ్రవైరాగ్యము చాలా అవసరము. 

ఈ రకంగా ఈ యొక్క ప్రేరణకి నచికేతుడు లొంగుతాడా? లేదా? అనేటటువంటి ప్రాధమ్యాలని సరిగ్గా ఆయన ముందు ఉంచి, ఆయా కామము యొక్క ప్రేరణ ఆయనలో కలుగుతోందా? లేదా? అనేటటువంటి సాధారణంగా ఎలా ఉంటుందంటే, పొందడానికి సిద్ధమయ్యేటటువంటి స్థితి ఏర్పడే వరకూ కూడా నీలో ఆ కామము యొక్క ప్రభావము ఉండదు. సాధారణంగా అందరూ ఇవేవీ నాకు అక్కర్లేదండి అనే అంటూ ఉంటారు. 

కానీ, సమయ సందర్భోచితమై అవి నీ ముందు ప్రత్యక్షమై, అనుభోక్త మయ్యేటటుంవంటి స్థితి ఏర్పడినప్పుడు నీలో ఉన్నటువంటి వైరాగ్యం, నీలో ఉన్నటువంటి తీవ్ర మోక్షేచ్ఛ, అప్పుడు కదా వాటి యొక్క నిరూపణము అయ్యేది?

        కాబట్టి, మానవుడు ఆ జీవన పర్యంతము వీటియందు మెలకువ వహించి ఉండాలి. ‘స్త్రీ బాలాంధ జడోప మాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః’ అంటోంది దక్షిణామూర్తి స్తోత్రం. 

కాబట్టి, ఇవన్నీ కూడా ఏదో ఒక భ్రాంతి నీ మీద పనిచేసేటటువంటి పద్ధతిగా ఏర్పడుతుంది. అంతా బానే ఉంటుంది. ఒక్క రెప్పపాటులో ఏదో ఒకటి వీటిల్లో భంగం జరుగుతుంది. లేదా ఒకటి పొందడం జరుగుతుంది. 

ఒకటి పొందకపోవడం వలన కానీ, ఒకటి పొందడం వలన కానీ, నీలో ఏమైనా మార్పు గనుక సంభవించినట్లయితే తత్‌ ప్రభావం చేత, నీవు ఆత్మసాక్షాత్కార ఆత్మానుభూతి అనేటటువంటి స్థితి నుంచీ జీవుడుగా పతనం అవుతావు. అట్లా పతనం అవ్వకుండా స్థిరముగా ఉండేటటువంటి పద్ధతిని నీవు ఆశ్రయించాలి.  

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

24-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 437 / Bhagavad-Gita - 437🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 225 / Sripada Srivallabha Charithamrutham - 225 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 105🌹 
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 128🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 41 / Sri Lalita Sahasranamavali - Meaning - 41 🌹
6) 🌹 VEDA UPANISHAD SUKTHAM - 67🌹
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 44 🌹 
8) 🌹 Guru Geeta - Datta Vaakya - 12 🌹
9) 🌹. శివగీత - 10 / The Shiva-Gita - 10🌹 
10) 🌹. సౌందర్య లహరి - 52 / Soundarya Lahari - 52🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 351 / Bhagavad-Gita - 351 🌹

12) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 179🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 55 🌹
14) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 51 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 66 🌹
16) 🌹 Seeds Of Consciousness - 130 🌹
17) 🌹. మనోశక్తి - Mind Power - 69 🌹
18)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 15 🌹 
19) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 9 🌹
20)


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 437 / Bhagavad-Gita - 437 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 47 🌴*

47. శ్రీ భగవానువాచ
మయా ప్రసన్నేన తవార్జుననేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్ |
తేజోమయం విశ్వమనన్తమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ ||

🌷. తాత్పర్యం : 
శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! ప్రసన్నుడైన నేను ణా అంతరంగశక్తిచే భౌతికజగమునందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపితిని. తేజోమయమును, అనంతమును, ఆద్యమును అగు ఈ రూపమును నీకు ముందెవ్వరును గాంచియుండలేదు.


🌷. భాష్యము : 
అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపమును గాంచగోరెను. తన భక్తుడైన అర్జునుని యెడ కరుణను కలిగిన అ భగవానుడు అంతట తేజోమయమును, విభూతిపూర్ణమును అగు తన విశ్వరూపమును అతనికి చూపెను. సూర్యుని వలె ప్రకాశించుచున్న ఆ రూపము యొక్క పలుముఖములు త్వరితముగా మార్పుచెందుచుండెను. మిత్రుడైన అర్జునుని కోరికను పూర్ణము చేయుట కొరకే శ్రీకృష్ణుడు ఆ రూపమును చూపెను. 

తన అంతరంగశక్తి ద్వారా శ్రీకృష్ణుడు ప్రదర్శించిన ఆ విశ్వరూపము మానవ ఊహకు అతీతమైనది. అర్జునునికి పూర్వమెవ్వరును భగవానుని ఆ రూపమును గాంచియుండలేదు. కాని భక్తుడైన అర్జునునకు అది శ్రీకృష్ణునిచే చూపబడినందున ఊర్థ్వలోకులు మరియు ఆధ్యాత్మికలోకములందు గల ఇతర భక్తులు సైతము దానిని దర్శించగలిగిరి.

 వారు దానిని పూర్వమెన్నడును గాంచకున్నను అర్జునుని కారణమున ఇప్పుడు గాంచగలిగిరి. అనగా పరంపరానుగత భక్తులందరును కృష్ణుని కరుణచే అర్జునుడు గాంచిన విశ్వరూపమును తామును గాంచగలిగిరి. 

దుర్యోధనునితో సంధిరాయబారము జరుపుటకు వెడలినప్పుడును శ్రీకృష్ణుడు ఈ విశ్వరూపమును అతనికి సైతము చూపెనని కొందరు వ్యాఖ్యానించిరి. దురదృష్టవశాత్తు దుర్యోధనుడు ఆ సంధి రాయబారమును అంగీకరించలేదు. 

ఆ సమయనున శ్రీకృష్ణుడు ఈ విశ్వరూపమును అతనికి సైతము చూపెనని కొందరు వ్యాఖ్యానించిరి. దురదృష్టవశాత్తు దుర్యోధనుడు ఆ సంధి రాయబారమును ఆంగీకరించలేదు. 

ఆ సమయమున శ్రీకృష్ణుడు విశ్వరూపములో కొన్ని రూపములానే ప్రదర్శించెను. కాని ఆ రూపములు అర్జునునకు చూపిన ఈ రూపము కన్నును భిన్నమైనవి. కనుకనే ఈ రూపమును పూర్వమెవ్వరును చూడలేదని స్పష్టముగా తెలుపబడినది
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 437 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 47 🌴*

47. śrī-bhagavān uvāca
mayā prasannena tavārjunedaṁ
rūpaṁ paraṁ darśitam ātma-yogāt
tejo-mayaṁ viśvam anantam ādyaṁ
yan me tvad anyena na dṛṣṭa-pūrvam

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: My dear Arjuna, happily have I shown you, by My internal potency, this supreme universal form within the material world. No one before you has ever seen this primal form, unlimited and full of glaring effulgence

🌹 Purport :
Arjuna wanted to see the universal form of the Supreme Lord, so Lord Kṛṣṇa, out of His mercy upon His devotee Arjuna, showed His universal form, full of effulgence and opulence. 

This form was glaring like the sun, and its many faces were rapidly changing. Kṛṣṇa showed this form just to satisfy the desire of His friend Arjuna. This form was manifested by Kṛṣṇa through His internal potency, which is inconceivable by human speculation. 

No one had seen this universal form of the Lord before Arjuna, but because the form was shown to Arjuna, other devotees in the heavenly planets and in other planets in outer space could also see it. They had not seen it before, but because of Arjuna they were also able to see it. 

In other words, all the disciplic devotees of the Lord could see the universal form which was shown to Arjuna by the mercy of Kṛṣṇa. 

Someone has commented that this form was shown to Duryodhana also when Kṛṣṇa went to Duryodhana to negotiate for peace. Unfortunately, Duryodhana did not accept the peace offer, but at that time Kṛṣṇa manifested some of His universal forms. 

But those forms are different from this one shown to Arjuna. It is clearly said that no one had ever seen this form before.
 🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 225 / Sripada Srivallabha Charithamrutham - 225 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 42

*🌻. మంత్రాక్షతలు 🌻*

ఇక్కడ ఆలయంలో తేలు కుట్టిన వ్యక్తి దగ్గరకు ఒక పంట కాపు వచ్చి తమ కులపెద్ద వెంకయ్య తనకు శ్రీపాదులు ఇచ్చిన మంత్రాక్షతలను ఆ బ్రాహ్మణునికి ఇవ్వాలని నిశ్చ యించుకున్నారని దానివల్ల అతను స్వస్థుడు కాగలడనే వార్తని అందించాడు. 

ఏ క్షణంలోనైనా దయ్యంలా మారిపోతా నేమో? అని భయ పడుతున్నఆ బ్రాహ్మణుడు వెంకయ్య లాంటి సౌమ్యుడు ఈ విధంగా కబురు పంపాడంటే బహుశా ఇదే దీనికి విరుగుడై ఉండవచ్చు అని భావించి శూద్రుడైన వెంకయ్య నుండి అక్షతలు తీసుకొని నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు.

దత్త దిగంబర! దత్త దిగంబర! శ్రీపాదవల్లభ దత్త దిగంబర! 

ఇక ఆ బైరాగి విషయంలోకి వస్తే, ఇటువంటి క్షుద్ర మాంత్రి కుని వద్ద మన సొమ్ము దక్షిణ రూపంలోనైనా సరే ఉంచ కూడదు అని నిర్ధారణ చేసిన పీఠికాపురవాసులు అతని వద్ద ఉన్న ధనం మాత్రం లాక్కొని, దయ తలిచి దేహశుద్ధి చేయకుండా ఊరునుండి వెళ్ళగొట్టారు. 

ఆ ధనంతో బాప నార్యుల సలహా మేరకు అష్టాదశ వర్ణాల వారికి అన్నసంతర్పణ జరిగింది. పీఠికాపురంలో మొదటిసారిగా దత్త దిగంబర! దత్త దిగంబర! శ్రీపాదవల్లభ దత్త దిగంబర! అనే దివ్యనామ సంకీర్తన ఎంతో శ్రావ్యంగా వినిపించుతూ ఊరంతా మధురంగా ప్రతిధ్వనించింది.

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

42వ అధ్యాయము సమాప్తము. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 225 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

*🌻 The greatness of Siva - The Siva forms in the eleven Siva Kshetras in Andhra Pradesh - 1 🌻*

Siva has eleven Rudra forms. There are eleven Siva kshetras in Andhra Pradesh. Their darshan will give great fruit. 

1. Brihat Sila Nagaram – Nagareswarudu

2. Srisailam – Mallikharjunudu 

3. Draksharamam – Bhimeswarudu 

4. Ksheeraramam (Palakollu) – Ramalingeswarudu 

5. Amaravathi – Amaralingeswarudu 

6. Kotiphali - Kotiphaleeswarudu 

7. Peethikapuram – Kukkuteswarudu 

8. Mahanandi – Mahanandeeswarudu 

9. Kaleswaram – Kaleswarudu 

10. Sri Kalahasti – Kalahasteeswarudu 

11. Tripuranthakam – Tripuranthakeswarudu

Really, there is no form for Shiva. Siva lingam is nothing but the form of jyothi which glows in ‘atmas’ (souls). The ‘Sphatika Lingam’ is the ‘purity’ that is in the form of pure mind after attaining ‘siddhi’.  

The Rudra who helps to initiate ‘jnana’ in our brain is called ‘kapaali’. The nerves that spread from brain down below the neck are called Rudra ‘jatas’. Siva in the form of ‘Hatha Yogi’ is called ‘Lavaleesa’.  

Siva takes bhiksha and destroys the sinful karmas of ‘jeevas’. Siva does ‘ananda tandavam’ (Siva dance) to the great vibrations of srishti (creation), sthithi (maintainance) and laya (annihilation) with ‘raga’ and ‘tala’. Siva also can give the Moksha Siddhi (liberation) which gives extreme bliss. ‘Chit’ is mind and ‘amber’ is aakaasam (sky) or cloth. 

 ‘Chidambar’ is the one who is in the form of ‘aakaasa’. The cosmic form you see in this vast universe is the form of Rudra only.  

The 12 jyothi lingas are representative of the 12 ‘rasis’, so Siva is the form of ‘kaala’ (kaala swarupa). All the eight ‘sides’ of the universe are the form of Chit Akasa of Astha Murthi’.  

The pancha (five) bhutas are His five faces. The five sense organs, five organs of karma and mind put together form the eleven (ekadasa) rudra kalaas.  

They are called Ekadasa Rudras. The ‘Uma Maheswara’ form is the eternal pleasing form. The form which burns the three ‘gunas’ (Satwa, Rajas and Tamo) into ashes is ‘Tripuranthaka’ form.  

The third eye is the ‘jnana’ nethra. The most sacred ‘Ganga Matha’ in Siva’s jatajutam is the ‘purity’ that flows relentlessly when He is in blissful dhyana.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 105 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

పంచేంద్రియములు, మనస్సు, సప్త ధాతువులు, బుద్ధి, చిత్తము మున్నగునవి ఒక్కొక్కటే వేరు వేరుగా దేహమునందు వర్తించుచుండును.  

అనేక రూపములలో నున్న మంచుగడ్డలన్నియూ నీటినుండియే రూపొందినట్లు ఈ తత్త్వము లన్నియు దేవుని నుండియే రూపములల్లు కొనును.

 శక్తులన్నియు గలవాడు గనుక దేవుని భగవంతుడందురు. జీవుడను పురుషుని లోపల నున్నాడు గనుక పరమపురుషుడందురు.
........ ✍🏼 *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 127 🌹*
*🌴 The Crises - 1 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 Fiery Transformations - 1 🌻

You can compare the development of the subtle body with the churning of milk whereby butter separates from the milk. By churning the butter gets collected; the essence emerges and separates from the rest. 

Churning is a fiery process, just like the process by which the subtle body can be separated from the physical body: through a fiery churning the gross matter is expelled and thus the subtle matter can develop. 

Crises are the means to form us and lead to a reorientation. Crises are turning points of our lives to walk towards the light. 

Every crisis makes us understand better our being. Spiritual realisation cannot happen in fair weather. In good weather we sleep, in bad weather we work. 

That does not mean that we have to invite unfair weather. But only through crises can we be driven more deeply towards truth.

The one or the other crisis keeps on making us suffer because we don’t know how we should do something. The personality does not know how to function; therefore it keeps doing what it likes until it gets into problems. 

As long as it dominates the soul the personality leads us into crises. We have to neutralise all we have done. Until this has been done we cannot reach the source. 

🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources: Master K.P. Kumar: Uranus. The Alchemist of the Age / The Teachings of Sanat Kumara / notes from seminars. 

Continues
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 41 / Sri Lalita Sahasranamavali - Meaning - 41 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 75

334. విశ్వాధికా -
 ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు.

335. వేదవేద్యా - 
వేదముల చేత తెలియదగినది.

336. వింధ్యాచలనివాసినీ - 
వింధ్యపర్వత ప్రాంతమున నివాసము గలది.

337. విధాత్రీ - 
విధానమును చేయునది.

338. వేదజననీ - 
వేదములకు తల్లి.

339. విష్ణుమాయా - 
విష్ణుమూర్తి యొక్క మాయా స్వరూపిణి.

340. విలాసినీ - 
వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది.

🌻. శ్లోకం 76

341. క్షేత్రస్వరూపా -
 క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా నుండునది.

342. క్షేత్రేశీ - క్షేత్రమునకు అధికారిణి.

343. క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ - 
స్థూలభాగమైన దేహమును, సూక్ష్మభాగమైన దేహిని పాలించునది లేదా రక్షించునది.

344. క్షయవృద్ధివినిర్ముక్తా -
 తరుగుదల, పెరుగుదల లేనిది.
క్షేత్రపాల సమర్చితా - క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 41 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 41 🌻*

334 ) Viswadhika -   
She who is above all universe

335 ) Veda vedya -   
She who can be understood by Vedas

336 ) Vindhyachala nivasini -   
She who lives on Vindhya mountains

337 ) Vidhatri -   
She who carries the world

338 ) Veda janani -   
She who created the Vedas

339 ) Vishnu maya -   
She who lives as the Vishnu maya

340 ) Vilasini -   
She who enjoys love making

341 ) Kshetra swaroopa -   
She who is personification of the Kshetra or body

342 ) Kshetresi -   
She who is goddess of bodies

343 ) Kshethra kshethragna palini -   
She who looks after bodies and their lord

344 ) Kshaya vridhi nirmuktha -   
She who neither decreases or increases

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. VEDA UPANISHAD SUKTHAM - 67 🌹*
*🌻 1. Annapurna Upanishad - 28 🌻*
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

V-81. The first plane, generating the desire for liberation, is marked by the practice (of discipline) and detachment due to intimacy with the Shastras and the company of the holy. 

V-82. The second is marked by investigation; the third by contemplation with (all) its accessories; the fourth is the solvent as it consists in the dissolution of latent impressions. 

V-83. The fifth is the rapturous; it is purely cognitive. This is the station of the Liberated-in-life who is, as it were, half awake and half asleep. 

V-84. The sixth plane is non-cognitive. It is the station similar to deep sleep, having the nature of pure and massive bliss. 

V-85. The seventh plane is (marked by) equability, utter purity, tenderness; it is indeed unqualified liberation, the quiescent Fourth State. 

V-86. The transcendent state beyond the Fourth, Nirvana in its essence, is the transcendent and developed seventh plane; it does not come within the purview of mortals. 

V-87. The first three constitute but the wakeful life; the fourth is called the dream (state) where the world is regrettably dream-like. 

V-88. The fifth, conforming to massive bliss, is styled deep sleep. In contrast the sixth which is noncognitive is named the Fourth State. 

V-89. The most excellent seventh plane is the state beyond the Fourth, beyond the range of mind and words, and identified with the self-luminous Being. 

V-90. If due to the withdrawal (of the cognitive organs) into (one's self) no object is perceived. (one) is liberated, indeed, indubitably by that mighty sameness (of vision).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 44 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 27

🌻 27. ఈశ్వర రస్యాప్యభిమాన ద్వేషిత్వాత్‌ దైన్య ప్రియత్వాత్‌ - 1 🌻

            ఈశ్వరుడు భక్తుడిని అనుగ్రహించడానికి భక్తుని యెడల ప్రత్యేకంగా అభిమానంగాని, ద్వేషంగాని ఉండవు. 

ఈశ్వరునికి పక్షపాత బుద్ధి ఉంటే ఆయనను ఈశ్వరుడని ఎందుకంటాం ? భక్తులు మాత్రం దైన్య స్థితిని బట్టి గాని, ప్రీతిని బట్టిని గాని ఈశ్వరుని మీద అటువంటి పక్షపాతాన్ని ఆరోపిస్తూ ఉంటారు.

            నిజానికి భగవదనుగ్రహం సదా సర్వత్రా సహజంగానే ఉంటుంది. ఆ అనుగ్రహాన్ని పొందడానికి భక్తుడు తనలోనే ఉన్న అహంకారాదుల అడ్డు తొలగించు కుంటే భగవదనుగ్రహానికి పాత్రుడవుతాడు. అడ్డు తెరలను తొలగించుకుంటే ఈశ్వరానుగ్రహం సహజంగానే లభిస్తుంది.

 మానవ అనుగ్రహం కావాలంటే చేయవలసిన పనులు మనకు తెలుసు. అటువంటివన్నీ అహంకారాదులతో, స్వార్థంతో కూడుకొని ఉంటాయి. 

ఈశ్వరానుగ్రహానికి ఏమీ చేయనవసరం లేదు. భక్తులందరికీ ఒకే ఒక్క నియమం. అదేమంటే వారి వారి అహంకార మమ కారాలను వదలాలి. 

వస్తువుల మీద, విషయాల మీద ఆసక్తిని వదలి, సర్వమూ ఈశ్వరమయంగా చూడగలిగిన భక్తిని కలిగి ఉండటమే వారి అర్హత.

అహము, ఆత్మాభిమానమ్ము లణగియున్న 
మనసుకే, భగవానుడు కనబడును. -మెహెర్‌ బాబా

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya 12 🌹*
✍️ Sri GS Swami ji Datta Vaakya
📚. Prasad Bharadwaj

*🌻 once you entertain the thought that you should switch Gurus, you may rest assured that in this entire lifetime you will have to remain without any Guru - Changing Guru is meaningless. 🌻*

Datta Purana explains through the story of Deepaka how severe the tests of Guru can be. Similarly, the story of Aruni in the Mahabharata gives another good example. These two stories give us good illustrations. Not everyone can withstand the tests of Guru the way Deepaka did. 

Instead of passing successfully the tests given by Guru, many fools in this world interpret the tests of Guru as flaws they see in the Guru. 

These are people who attribute their failure to the incompetence of the teacher. Such people change their minds and go in search of a different and better Guru. 

People begin with the idea that Guru is Brahma, Vishnu, and Siva and in fact the Supreme Soul. They consider Guru to be the giver, protector, mentor, friend and relative. When they are subjected to tests, these people do not wish to be bothered by them and decide to change Guru. 

They change Guru as if they are exchanging merchandize in a store, or shifting to a different rental property. Is it possible? You tell me. Changing Guru is like changing one’s parents. 

Many people are there who make such a change and speak about it with confidence, that this new Guru has a large following and he is also a good speaker. 

When they get the idea that they should seek a better Guru, such an intention itself sows the seed for their absolute downfall. Swamiji is giving you a caution. 

However many mistakes you commit, Guru accepts, but, once you entertain the thought that you should switch Gurus, you may rest assured that in this entire lifetime you will have to remain without any Guru. 

Changing Guru is meaningless. It should never happen. Before deciding on Guru, you may deliberate a hundred times. But having chosen your Guru, you must never waver in your decision. 

Swamiji has given you some pointers to follow, regarding how to recognize Guru. Moreover, beforehand you must decide in how many ways you wish to test Guru. Only after performing all such tests, you make the final decision that he is the Guru for you. 

Give yourself time. I have told you that as soon as you see Guru, his tests will begin. At this stage you do not have to make your firm decision. 

After undergoing some tests, you decide whether you have the strength, no matter how severely he wishes to test you, that he will remain your Guru. 

Take your time in making your decision. But once the decision is made by you, there is absolutely no question of reversing it. You simply do not have the right to change your mind about Guru.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 10 / The Siva-Gita - 10 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
*🌻. వైరాగ్య యోగము - 1 🌻*

ఋషయ ఊచు :-
కిమర్ధ మాగతో గస్త్యో రామచంద్ర స్య సన్నిధిమ్,
కధం వా విరజాం దీక్షాం - కార యామాస రాఘవమ్ 1
తతః కిమాప్త వా న్రామ :- ఫలం తద్వక్తు మర్హసి,

ఋషులు వక్కాణించిరి :--
ఓయీ సూత మహాముని!

 దండకారణ్యంబులో నున్న శ్రీరాముని వద్దకు అగస్త్య మహాముని యెందులకు గాను వచ్చెను ? ఏ విధముగా శ్రీ రామునికి విరజా దీక్ష నోసంగెను.? ఆ పైన రాముడేమి ఫలము నార్జించెను? ఆ సమస్తమును విస్తారముగా మాకు తెలుపుము. అనిన విని సూతుడిట్లు చెప్పెను:

రావణేన యదా సీతా సహృతా జన కాత్మజా ,
తదా వియోగ దుఃఖేన- విల పన్నా స రాఘవః 2
నిర్నిద్రో నిరహంకారో - నిరాహారో దివానిశమ్
మోక్తు మైచ్చత్తత: ప్రాణా- న్సానుజో రఘు నన్దనః 3

ఎప్పుడైతో సహదర్మ పత్ని యగు సీతాదేవి రావణాసురుని చేత 
అపహరింపబడి నదో అప్పుడు శ్రీ రాముడు ప్రియురాలి విరహ దుఃఖము వలన రాత్రి పగలు నిద్రలేమి కతమున ఆహారము , అహంకారము లేనివాడై తన తమ్ముడైన లక్ష్మణునితో సహ
 అసువుల బాయుటకు ప్రయత్నించెను.

లోపా ముద్రా పతి ర్జాత్వా - తస్య సన్నిధి మాగమత్,
అధం తం బోధ యామాస - సంసారా సార తాముని: 4
కిం విషీద సిరా జేన్ద్ర కాన్తా కస్య విచార్యతామ్,
జడః కిన్ను విజానాతి - దేహో యం పాంచ భౌతికః 5
నిర్లేపః పరిపూర్ణశ్చ - సచ్చిదా నన్ద విగ్రహ:
ఆత్మాన జాయతే నైవ - మ్రియతే నచ దుఃఖ ఖాక్ 6

ఈ సంగతి పసిగట్టి లోపాముద్ర పతియైన అగస్త్య మహర్షి శ్రీరాముని కడకు వచ్చిన వాడయ్యెను. ఆ మీదట నాతడు సంసారము నందలి నిస్సారత నీ ప్రకారముగా ఉద్భోధించెను.
 
ఓయీ రామచంద్రా! ఎందులకు నీ విటు దుఃఖించు చున్నావు. సీత ఎవడిదో విచారించి చూడుము. మూడులకీ రహస్యము తెలియదు. ఈ దేహము పంచ భూతములతో కూడి యున్నది. ఎలాంటి సంబంధము లేనిది యాత్మ సచ్చిదానంద స్వరూపమైనది. ఇది జనన మరణంబుల కతీత మైనది మరియు దుఃఖములకు లోనుగానిది .

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 10 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
*🌻 Vairagya Yoga - 1 🌻*

1. The Monks addressed Suta and enquired: Hey
Suta maha Muni! What for did Sage Agastya visit Sri Rama in Dandakaranya? 

In what way did he initiate Rama in Viraja Deeksha?

 Subsequently, what results did Rama get out of that Deeksha? Kindly narrate the entire story to us in detail. 

After listening to their request, Suta replied this way.

2. 3. When Sita, the wife of Sri Rama was abducted by Ravana, Sri Rama was in a desperate modd due to his beloved separation. 

He didn't sleep day and night, left eating food, and lost his valor, and together with his brother lakshmana he was almost became lifeless.

4. 5. Having realized about Rama's condition, sage Agastya the consort of Lopamudra came to Sri Rama's place. After that he taught 'Vairagya' to Rama as follows: Hey Ramachandra! Why are you feeling so sad? Think who is Sita. 

6. Ignorant people wouldn't understand this secret. This body is made up of 5 elements (Pancha Bhootam). But soul is unattached to the body and it is beyond the reach of birth and death; also Soul remains unaffected by sorrows.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 2 / Sri Gajanan Maharaj Life History - 2 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
*🌻. పరిచయం - 1 🌻*

శ్రోతలారా మీమంచి కోసమే ఈమహాయోగియొక్క జీవతచరిత్ర చిత్తశుద్ధితో వినేందుకు తయారుకమ్ము. ఈ భూప్రపంచంమీద ఇటువంటి యోగులే భగవత్ స్వరూపులు, కరుణాసముద్రులు, మోక్షంఇవ్వగలిగేవారు. ఈ యోగులు మంచి, పవిత్రత నిజాయితీ నిండి ఉన్నవారు. 

వీరు అత్యంత వివేకవంతులు, మనల్ని నిజాయితి అనేబాట మీదకు నడిపిస్తారు. ఇటువంటి యోగులకు పాదాక్రాంతులయినవారికి భగవంతుడు కుడా ఋణపడి ఉంటాడు. ఇక చిత్తశుద్ధితో శ్రీగజనన్ మహారాజ్ జీవితచరిత్ర వనండి..

అనేక యోగులకు జన్మస్థలము అయ్యే అదృష్టం భారతదేశానికే దక్కింది తప్ప మరి ఏ ఇతర దేశాలకి దొరకలేదు. అందువలనే ఇంతవరకు సుఖసంతోషాలకి కొరవలేదు. యుగయుగాలనుండి ఈ భారతావనికి వరసగా ఈయోగీశ్వరుల పాదస్పర్శ లభ్యం అవతూ ఉంది. శ్రీనారద, ధృవ, కాయద్ కుమార్, ఉర్దావ, సుధామ, శుభద్రావర్, అంజనీకుమార్, ధర్మరాజ్, జగత్ గురు శంకరాచార్యులు వీరందరూ కాడా ఈ భారతావనిలో జన్మించారు. మనసంస్కృతిని కాపాడిన మాధవ, వల్లభ, రామానుజులు కూడా ఇక్కడే పుట్టారు. నరశింహ మెహతా, తులసీదాసు, కబీర్, కమల్, శూరదాస్ మరియు గోరంగ ప్రభుల ప్రతిభ వర్ణింప నావల్ల కానిది. 

మీరాభాయి యొక్క ప్రగాఢభక్తి వల్ల అమెకోసం మహావిష్ణువు విషం మింగాడు. నవనాధ్ అనే పవిత్రగ్రంధంలో శ్రీగోరఖనాధ్, మశ్చీంద్ర మరియు జలంధర్ అనే మహాయోగుల గురించి వివరించబడింది.శ్రీనామదేవ్, నరహరి, జనాభాయీ నవ్, సకుభాయి, చోఖా, సవత, కుమార్దాస్ మరయు దామాజి పంత్ లు భక్తితోనే మహావిష్ణువును పోందారు. దామాజి పంత్ కొరకు భగవంతుడు మహర్ అయ్యాడు. ముకుందరజ్, జనార్ధన్, భోధాల, నిషత్ మరియు నిరంజన్ ల జీవితచరిత్రలు మహిపతి ఇంతకు ముందుగానే వివరించారు కనుక ఇక్కడ నేను తిరిగి ప్రస్థావంచటంలేదు. 

భక్తివిజయ మరియు భక్తిమాల అనే పవిత్ర గ్రంధాలు చదవమని మాత్రమే దాసగణు మీకు సలహా ఇస్తున్నాడు. మరో ముగ్గురు యోగుల గూర్చి, నేను ఆతరువాత వివరంగా పాటలు వ్రాసాను, ప్రజలను బాగా ప్రభావితం చేసిన శ్రీగజానన్ మహారజ్ కూడా వారికి సమానమయినవారే. ఈ మహాయోగి జీవితచరిత్ర వ్రాయడానికి అవకాసం నాకు పుణ్యంకొద్ది లభించింది. మొదటిసారి అసలు ఈయనను అకోట్లో చూసింది నేనే కాని ఇంతకు ముందు వివరించిన కారణాలవల్ల చివరిగా ఈయన జీవితచరిత్ర నాచేత వ్రాయబడింది.

ముందు హారం తయారుచేసి చిట్టచివర మేరుమణి (గుఛ్ఛం) మధ్యలో కడతాం అదేవిధంగా మహారజ్ జీవితచరిత్ర మధ్యలో గుచ్ఛంలాంటిది. గొప్పవ్యాపారకేంద్రం అయిన ఈ షేగాం బేరర్ లో ఖాంగాం తాలూకాలో ఒక చిన్న గ్రామం. చిన్న గ్రామం అయినప్పటికి ఈ మహాయోగి కారణంగా ఖ్యాతిపొంది ప్రపంచప్రఖ్యాత స్థానం అయింది. ఈ షేగాం అనే సరస్సులో శ్రీగజానన్ మహారాజ్ పద్మం రూపంలో ఉద్భవించి తన సుగంధాన్ని పూరిబ్రహ్మాండానికి వ్యాపింప చేసారు. షేగాం అనే ఘనిలో శ్రీగజానన్ మహారాజ్ ఒక వజ్రం. 

నా మితమయిన తెలివితో ఈయన అద్భుతాలను వర్నించాలని కోరుకుంటున్నాను. దయచేసి వినండి మరియు ఈయనకు పూర్తిగా ప్రాదాక్రాంతులయిన వారు మోక్షం పొందుతారనే విషయం మరువకండి. 

శ్రీగజానన్ చరిత్ర మేఘాలయితే మీరు నెమళ్ళు. వాన రూపంలో ఉండే శ్రీగజానన్ కధలు మిమ్మల్ని పరవశంతో నాట్యం చేయిస్తాయి. గజానన్ మహారాజ్ను పొందడం షేగాం ప్రజల అదృష్టం. భగవంతుని కంటే ఎక్కువఅయిన ఈ యోగుల ఆశీర్వచనాలు మంచిపనులు చెయ్యబట్టి ప్రాప్తిస్థాయి. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 2 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
*🌻. Introduction - 1 🌻*

Now listeners, get ready and listen single-mindedly to the biography of a saint for your own good.  

On this earth, saints are Gods, ocean of renunciation, and giver of Moksha. Saints are the embodiment of all that is good and sacred and are full on sanctity. Now calmly listen to the life story of such a Saint. 

Saints never deceive anybody. They are full of wisdom that guides us on to the path leading to the ultimate truth. God Himself is indebted to those who surrender themselves at the feet of the saints. 

Now with an open mind, listen to the biography of Shri Gajanan Maharaj. No other country is as fortunate as Bharat in being a birthplace of so many saints and therefore it has never fallen short of any happiness so far. It is so because, since time immemorial, our land continuously has had the touch of sacred feet of saints. 

Shri Narad, Dhruva, Kayadhukumar, Uddhava, Sudama, Subhadravar, Anjanikumar, Dharma Raja, Jagatguru Shankaracharya were all born in this country. Madhawa, Vallabha and Ramanuja, the able defenders of our religion, too were born here. 

The greatness of Narsi Mehta, Tulsidas, Kabir, Kamal, Surdas and Gourang Prabhu is quite beyond my power to describe. Intense devotion of Princess Mirabai made lord Vishnu swallow poison for her. 

The great deeds performed by the supreme yogis like Shri Goraknath, Macchindra and Jalander are described in great detail in the sacred book Navanath. 

Shri Namdeo, Narahari, Janabai, Kanho, Sakhubai, Chokha, Savata, Kurmadas and Damajipanth won over Shri Hari by Bhakti only. God became Mahar for Damajipant. Since Mahipati has already written the biographies of Mukundraj, Janardan, Bodhala, Nipat and Niranjan, I do not repeat them here. I only suggest that you read the sacred books Bhakti Vijay and Bhaktimala. 

After that I have composed songs in the praise of three saints and equal to them is Shri Gajanan Maharaj who greatly influenced the public. With my good fortune, I am now getting an opportunity to write this detailed biography of this great saint. 

In fact, He was first seen by me at Akot, but His biography is being written by me last for the following reasons: When we prepare a plain garland, the middle gem (Merumani) in it is attached at last; so the story of Shri Gajanan Maharaj is like that Merumani. 

Shegaon, a small village in Khamgaon Taluka of Berar is a great market center. Though a small village, it gained importance due to Shri Gajanan Maharaj and became a world famous place. 

In this Shegaon Lake, a lotus in the form of Shri Gajanan Maharaj sprung up and its fragrance spread all over the universe. Shri Gajanan Maharaj is a diamond of Shegaon mine and I, with my limited intelligence, wish to narrate His glory. Please listen to it and do not forget that you can attain Moksha by complete surrender at His feet.

Shri Gajanan Maharaj’s biography is like a cloud and you the peacocks. The rain in the form of Shri Gajanan Maharaj’s stories will make you dance in happiness. People of Shegaon are really fortunate to get Shri Gajanan Maharaj. 

Good deeds only can invoke the blessings of Saints who are superior even to the Gods. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 52 / Soundarya Lahari - 52 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

52 వ శ్లోకము

*🌴. నేత్ర వ్యాధులు, చెవి వ్యాధులు హరించుటకు 🌴*

శ్లో: 52. గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ 
పురాంభేత్తుశ్చిత్త ప్రశమరస విద్రావణఫలేI 
ఇమేనేత్రే గోత్రాధర పతికులోత్తంసకలికే* 
తవాకర్ణా కృష్ణస్మర శరవిలాసం కలయతఃll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా! మంచు పర్వత రాజు అయిన హిమవంతుని వంశమునకు మకుటాయమైన తల్లీ , నా యొక్క కనులకు నీ కనులు చెవులను అంటి ఉండి ఆ కను రెప్పల వెంట్రుకలు బాణములకు రెండు వైపులా కట్టబడు ఈకల వలె ఉండి పరమ శివుని నిరాశను పోగొట్టి శృంగార రసోద్పాదన చేయునట్లుగా కనబడు చున్నవి. మరియు చెవుల వరకు లాగబడి మన్మధ బాణముల యొక్క సౌందర్యమును కలిగించు చున్నవి కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, నువ్వుల అన్నం నివేదించినచో కన్నుల వ్యాధులు, చెవుల వ్యాధుల నివారణ జరుగును అని చెప్పబడింది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 SOUNDARYA LAHARI - 52 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 52 

*🌴 Curing of Diseases of Ears and Eye 🌴*

52. Gathe karnabhyarnam garutha iva pakshmani dhadhati. Puraam bhetthus chitta-prasama-rasa-vidhravana-phale; Ime nethre gothra-dhara-pathi-kulottamsa-kalike Tav'akarn'akrishta-smara-sara-vilasam kalayathah. 
 
 Oh, flower bud, who is the head gear, of the king of mountains, wearing black eye brows above, resembling the feathers of eagle, and determined to destroy peace, from the mind of he who destroyed the three cities, your two eyes elongated up to thine ears, enact the arrows of the god of love.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 45 days, offering tillannam (Ellu rice) as prasadam, it is believed that all problems relating to ears and eyes will be resolved. 
 
🌻 BENEFICIAL RESULTS: 
All eye and ear diseases are cured. 
 
🌻 Literal Results: 
Strengthens eye-sight and hearing.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 351 / Bhagavad-Gita - 351 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 32 🌴*

32. మాం హి పార్థా వ్యపాశ్రిత్య యే(పి స్యు: పాపయోనయ: |
స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తే(పి యాన్తి పరాం గతిమ్ ||

🌷. తాత్పర్యం :
ఓ పార్థా! నా శరణుజొచ్చువారు అధమజన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికిని పరమగతిని పొందగలరు.

🌷. భాష్యము : 
భక్తిలో ఉచ్చ, నీచ జనుల నడుమ భేదభావము ఉండదని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా ప్రకటించుచున్నాడు. భౌతికభావనము నందున్నప్పుడు అట్టి విభాగములు ఉండవచ్చును గాని భగవానుని భక్తియుతసేవ యందు నియుక్తుడైనవానికి అట్టివి ఉండవు. 

ప్రతియొక్కరు పరమగతిని పొందుటకు అర్హులై యున్నారు. చండాలురు (శునకమాంసము భుజించువారు) యని పిలువబడు అతినీచతరగతికి చెందినవారు సైతము శుద్ధభక్తుని సంగములో పవిత్రులు కాగలరని శ్రీమద్భాగవతము (2.4.18) తెలుపుచున్నది. 

భక్తియోగము మరియు భక్తుల మార్గదర్శనము అనునవి అత్యంత శక్తివంతమగుటచే ఉచ్చ, నీచ తరగతి జనుల నడుమ భేదభావమును కలిగియుండవు. ఎవ్వరైనను అట్టి భక్తుని స్వీకరింపవచ్చును. అతిసామాన్యుడు సైతము భక్తుని శరణము నొందినచో చక్కని మార్గదర్శనముచే పవిత్రుడు కాగలడు. 

వాస్తవమునకు గుణముల ననుసరించి మనుజులు సత్త్వగుణప్రధానులని (బ్రాహ్మణులు), రజోగుణప్రధానులని (క్షత్రియులు), రజస్తమోగుణ ప్రధానులని (వైశ్యులు), తమోగుణప్రదానులని (శూద్రులు) నాలుగు తరగతులుగా విభజింపబడిరి. ఈ నాలుగు తరగతుల కన్నను నీచమైనవారు పాపయోనులైన చండాలురు. 

సాధారణముగా అట్టి పాపజన్ముల సాంగత్యమును ఉన్నత తరగతికి చెందినవారు అంగీకరింపరు. కాని భక్తియోగము అత్యంత శక్తివంతమైనదగుటచే శుద్ధభక్తుడు సమస్త నీచజనులు సైతము అత్యున్నత జీవనపూర్ణత్వమును బడయునట్లుగా చేయగలడు. శ్రీకృష్ణభగవానుని శరణుజొచ్చుట ద్వారానే అది సాధ్యము కాగలదు. 

కనుకనే “వ్యపాశ్రిత్య” యను పదముచే సూచింపబడినట్లు ప్రతియొక్కరు శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని పొందవలెను. అంతట మనుజుడు ఘనులైన జ్ఞానులు, యోగుల కన్నను అత్యంత ఘనుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 351 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 32 🌴*

32. māṁ hi pārtha vyapāśritya
ye ’pi syuḥ pāpa-yonayaḥ
striyo vaiśyās tathā śūdrās
te ’pi yānti parāṁ gatim

🌷 Translation : 
O son of Pṛthā, those who take shelter in Me, though they be of lower birth – women, vaiśyas [merchants] and śūdras [workers] – can attain the supreme destination.

🌹 Purport :
It is clearly declared here by the Supreme Lord that in devotional service there is no distinction between the lower and higher classes of people. 

In the material conception of life there are such divisions, but for a person engaged in transcendental devotional service to the Lord there are not. Everyone is eligible for the supreme destination. In the Śrīmad-Bhāgavatam (2.4.18) it is stated that even the lowest, who are called caṇḍālas (dog-eaters), can be purified by association with a pure devotee. 

Therefore devotional service and the guidance of a pure devotee are so strong that there is no discrimination between the lower and higher classes of men; anyone can take to it. The most simple man taking shelter of the pure devotee can be purified by proper guidance. 

According to the different modes of material nature, men are classified in the mode of goodness (brāhmaṇas), the mode of passion (kṣatriyas, or administrators), the mixed modes of passion and ignorance (vaiśyas, or merchants), and the mode of ignorance (śūdras, or workers). Those lower than them are called caṇḍālas, and they are born in sinful families. Generally, the association of those born in sinful families is not accepted by the higher classes. 

But the process of devotional service is so strong that the pure devotee of the Supreme Lord can enable people of all the lower classes to attain the highest perfection of life. 

This is possible only when one takes shelter of Kṛṣṇa. As indicated here by the word vyapāśritya, one has to take shelter completely of Kṛṣṇa. Then one can become much greater than great jñānīs and yogīs.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 179 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
40. అధ్యాయము - 15

*🌻. రుద్రావతార ఆవిర్భావము - 2 🌻*

గమనేsధో వరాహస్య గతిర్భవతి నిశ్చలా | ధృతం వారాహరూపం హి విష్ణునా వన చారిణా || 14

అథవా భవకల్పార్థం తద్రూపం హి ప్రకల్పితమ్‌ | విష్ణునా చ వరాహస్య భువనావన కారిణా || 15

యద్దినం హి సమారభ్య తద్రూపం ధృతవాన్హరిః | తద్దినం ప్రతి కల్పో సౌ కల్పో వారాహసంజ్ఞకః || 16

ఇతి ప్రశ్నోత్తరం దత్తం ప్రస్తుతం శృణు నారద | స్మృత్వా శివపదాంభోజం వక్ష్యే సృష్టివిధిం మునే || 17

అంతర్హితే మహాదేవే త్వహం లోకపితామహః | తదీయం వచనం కర్తు మధ్యాయన్‌ ధ్యానతత్పరః || 18

క్రిందికి దూసుకుపోవుటలో వరాహమునకు స్థిరమైన గమనము గలదు. అందువలననే, వనములయందు సంచరించు విష్ణువు వరాహరూపమును ధరించెను (14). 

లేదా, లోకములను రక్షించు విష్ణువు సృష్టిలో కల్ప వ్యవస్థ కొరకై ఆ రూపమును ధరించియుండును (15). 

ఏనాడు హరి ఆ రూపమును ధరించెనో, ఆ నాటి నుండి ప్రవర్తిల్లిన కల్పముకు వరాహకల్పమని పేరు వచ్చెను (16). 

ఓ నారదా! నీప్రశ్నలలో కొన్నింటికి నీకు సమాధానముల నిచ్చితిని. ఓమహర్షీ! నేనిపుడు శివుని పాదపద్మములను స్మరించి సృష్టి ప్రకారమును చెప్పెదను (17). 

మహాదేవుడు అంతర్ధానము కాగానే లోకములకు పితామహుడనగు నేను శివుని ఆజ్ఞను పాలించుటకై ధ్యానమగ్నుడనైతిని (18).

నమస్కృత్య తదా శంభుం జ్ఞానం ప్రాప్య హరేస్తదా | ఆనందం పరమం గత్వా సృష్టిం కర్తుం మనో దధే || 19

విష్ణుశ్చాపి తదా తత్ర ప్రణిపత్య సదాశివమ్‌ | ఉపదిశ్య చ మాం తాత హ్యంతర్ధానముపాగతః || 20

బ్రహ్మాండాచ్చ బహిర్గత్వా ప్రాప్య శంభోరనుగ్రహమ్‌ | వైకుంఠనగరం గత్వా తత్రోవాస హరిస్సదా || 21

అహం స్మృత్వా శివం తత్ర విష్ణుం వై సృష్టికామ్యయా | పూర్వం సృష్టం జలం యచ్చ తత్రాంజలిముదాక్షిపమ్‌ || 22

అపుడు నేను శంభునకు నమస్కరించి, విష్ణువునుండి జ్ఞానమును పొంది, పరమానందమును పొంది, సృష్టిని చేయుటకు నిశ్చయించితిని (19). 

అపుడు విష్ణువు కూడా, ఓవత్సా! సదాశివునకు నమస్కరించి, నాకు ఉపదేశించి, అంతర్ధానమయ్యెను (20). 

విష్ణువు బ్రహ్మాండమునకు ఆవలనున్న వైకుంఠనగరమును శంభుని అనుగ్రహముచే పొంది అచట శాశ్వత కాలము నివసించెను (21). 

నేను సృష్టిని చేయగోరి, శివుని విష్ణువుని స్మరించి, పూర్వము సృష్టింపబడిన జలము నుండి దోసిలితో నీటిని స్వీకరించితిని (22).

అతోsండమభవత్తత్ర చతుర్విశతిసంజ్ఞకమ్‌ | విరాడ్రూపమ భూద్విప్ర జడరూపమపశ్యతః || 23

తతస్సంశయమాపన్నస్తపస్తేపే సుదారుణమ్‌ | ద్వాదశాబ్దమహం తత్ర విష్ణుధ్యానపరాయణః || 24

తస్మింశ్చ సమయే తాత ప్రాదుర్భూతో హరిస్స్వయమ్‌ | మామువాచ మహాప్రీత్యా మదంగం సంస్పృశన్ముదా || 25

హే విప్రా! ఆనీటి నుండి ఇరువది నాలుగు తత్త్వములతో గూడిన విరాట్‌ అండాకారముగా జన్మించెను. ఆ విరాడ్రూపములో జడత్వమే గాని, చైతన్యము కన్పట్టలేదు (23). 

అపుడు నాకు సందేహము కలిగి విష్ణుధ్యానతత్పరుడనై పన్నెండు సంవత్సరముల దారుణముగ తపస్సును ఆచరించితిని (24). 

ఓవత్సా! అపుడు విష్ణువు స్వయముగా ప్రత్యక్షమై ప్రీతితో నా దేహమును స్పృశించి నాతో ఇట్లు పలికెను (25).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 55 🌹*
Chapter 15
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 THE GOVERNING OF THE OCEANS - 2 🌻*

The Ocean of Nothing of INFINITE UNCONSCIOUSNESS has innumerable drops, and because all these drops are unconscious, everything and everyone exists in a natural chaos. 

To fulfill the purpose of the drops, so they do not end in chaos, the First Drop must fulfill Its responsibility by pushing the drops out of chaos into an infinitude of order. To establish order within chaos, the First

Soul has his own divine government, which consists of seven thousand advanced souls in every age.

These seven thousand advanced souls are the human beings of the Avatar's spiritual hierarchy, who work under the instructions of the Avatar from his divine plan for establishing order and purpose within the throes of the chaos of the universes.

 The Avatar is the head of the hierarchy, and it is his mastermind that works out a divine plan, and through this hierarchy executes the plan. 

The members of his spiritual hierarchy are the Avatar's helpers, who share in the execution of his plan. Their share is a share of his work.
The Ocean of Nothing is filled with innumerable drops that take innumerable shapes and forms. 

In order to know itself as the Ocean of Everything, each drop in the Ocean of Nothing has to pass through the entire evolutionary process of consciousness and the entire involutionary process. Each drop does so by passing through the entire evolution of forms. 

Forms so innumerable and everchanging, so different in color, size and shape, that their dimensions fill the beginning and end of all time! 

These dimensions of oceanic unconsciousness create innumerable forms at every stage of evolution, and thus innumerable drops are passing through an endless variety of stones, metals, vegetation, worms, insects, reptiles, fish, birds, and animals. 

Finally the dimensions of oceanic unconsciousness individualizes in the human form, and individually each drop passes through the various states of involution finally to culminate in the Realization of its own Oceanic Being. 

The culmination of the whole creation is that an individual drop realizes that it is not a drop, but Infinite Ocean, and this happens drop by drop.

Since the Avatar has taken on this responsibility of expanding each drop into Ocean, he has to look after each drop from its beginning in evolution to its end in involution. 

The Avatar's work is infinite and never ending, and there is no one else who has this responsibility, even when he is not physically in the creation.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 51 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 24
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. కుండ నిర్మాణాగ్ని కార్యవిధి - 2 🌻*

స్రువం తు హస్తమాత్రం స్యాద్ధణ్డకేన సమన్వితమ్‌ | వటుకం ద్వ్యజ్గులం వృత్తం కర్తవ్యం తు సుశోభనమ్‌. గోపదం తు యథా మగ్నమల్పపఙ్కే తథా భవేత్‌ |

స్రువము దండముతో సహా చేయి పొడ వుండవలెను. కొంచెము పంకమునందు ఆవు పాదము దిగిన లోతు ఎంట్లుండులో ఆ విధముగా అందమైన, రెండు అంగుళముల వృత్తము చేయవలెను.

ఉపలిప్య లిఖేద్రేఖామజ్గులాం వజ్రనాసికామ్‌. 18

సౌమ్యాగ్రాం ప్రథమాం తస్యాం రేఖే పూర్వముఖే తయోః | మధ్యే తిస్ర స్తథా కూర్యాద్దక్షిణాది క్రమేణ తు.

అగ్నికుండమును అలికి, అంగుళముప్రమాణము గల వజ్రనాసికాలేఖను గీయవలెను. అది ఉత్తరాగ్ర మగు మొదటి రేఖ. దానిపై పూర్వాభిముఖములైన రెండు రేఖలు గీయవలెను. వాటి మధ్య దక్షిణాదిక్రమమున మూడు రేఖలు గీయవలెను.

అలంకృత్వా మూర్తిమతీం క్షిపేదగ్నిం హరిం స్మరన్‌.

ఏవముల్లిఖ్య చాభ్యుక్ష్య ప్రణవేన తు మన్త్రవిత్‌ | విష్టరం కల్పయేత్తేన తస్మిన్‌ శక్తిం తు వైష్ణవీమ్‌ 20

మంత్రవేత్త ఈ విధముగా రేఖలు గీసి, ప్రణవ ముచ్చరించును నీళ్ళు చల్లి, ఓంకారము నుచ్చరించుచు పీఠమును కల్పించి దానిపై మూర్తిమతి యాగు వైష్ణవీశక్తిని అలంకరించి, విష్ణువును స్మరించుచు అగ్నిని ఉంచవలెను.

ప్రాదేశమాత్రాః సమిధో దత్త్వా పరిసముహ్య తమ్‌. 21

దర్భైస్త్రిధా పరిస్తీర్య పూర్వాదౌ తత్ర పాత్రకమ్‌ |
అసాదయేదిధ్మవహ్ని భూమౌ చ స్రుక్‌స్రుమద్వయమ్‌. 22

జానెడు పొడవు గల సమిధల నుంచి ఆ అగ్నిని ప్రజ్వలింపచేసి పూర్వాదిదిక్కులందు దర్భలు మూడు విధములుగా (చుట్టూ) పరచి, వాటిపై పాత్రను, ఇధ్మమును వహ్నిని సమీపమున నుండు నట్లు చేసి స్రుక్కున, స్రువమును భూమిపై ఉంచవలెను.

అజ్యాస్థాలీం చరుస్థాలీం కుశాజ్యం చ ప్రణీతయా |

ప్రోక్షయిత్వా ప్రోక్షణీం చ గృహీత్వా పూర్వ వారిణా. 23

పవిత్రాన్తర్హితే హస్తే పరిస్రావ్య చ తజ్జలమ్‌ | ప్రాజ్నీత్వా ప్రోక్షణీపాత్రం జ్యోతిరగ్రే నిధాయ చ. 24

éతదద్భిస్త్రిశ్చ సంప్రోక్ష్య ఇధ్మం విన్యస్య చాగ్రతః |

ప్రణీతాయం సపుష్పాయాం విష్ణుం ధ్యాత్వోత్తరేణ చ. 25

ఆజ్యస్థాలీమథాజ్యేన సంపూర్యాగ్రే నిధాయ చ |

సంప్లవోత్పవనాభ్యాం తు కుర్యాదాజ్యస్య సంస్కృతిమ్‌. 26

అఖణ్డితాగ్రౌ నిర్గర్భౌ కుశౌ ప్రాదేశమాత్రకౌ | తాభ్యాముత్తానపాణిభ్యామఙ్గుష్ఠానామికే నతే. 27

ఆజ్యాస్థాలిని, చరుస్థాలిని, కుశాజ్యమును ప్రణీతచే ప్రోక్షించి, ప్రోక్షిణిని గ్రహించి దానిని నీటితో నింపి, ఆ నీటిని పవిత్రముచే కప్పబడిన హస్తమునందు జారవిడిచి, ప్రోక్షణీపాత్రమును తూర్పుగా తీసికొని వెళ్ళి, దానిని అగ్నికీ ఎదురుకుగా ఉంచి, దానిని ఉదకముచే మూడు సార్లు ప్రోక్షించి, ఎదుట నుంచి, ఉత్తరమున పుష్పలముతో కూడిన ప్రణీతపై విష్ణువును ధ్యానించి, ఆజ్యసాత్రను ఆజ్యముతో నింపి ఎదుట ఉంచి, తెగని చిగుళ్ళు గల, గర్భము లేని జానెడు పొడవైన రెండు కుశములను వెల్లగితల చేయబడిన హస్తములచే బొటనవ్రేలితోను అనామికతోను పట్టుకొని, వాటిని నేతలో ఇటు నటు త్రిప్పినేతిని సంస్కరించవలెను.

ఆజ్యం తయోస్తు సంగృహ్య ద్విర్నీత్యా త్రిరవాజ్‌క్ష పేత్‌ |
స్రక్స్రువౌ చాపి సంగృహ్య తాభ్యాం ప్రక్షిప్య వారిణా. 28

ప్రతప్య దర్భైః సంమృజ్య పునః ప్రక్షాల్య చైవ హి | నిష్టప్య స్థాపయిత్వాతు ప్రణవేనైవ సాధకః 29

ప్రణవాదినమోన్తేన పశ్చాద్దోమం సమాచరేత్‌ |

వాటి ఆజ్యమును సంగ్రహించి, రెండు పర్యాయములు తీసి, మూడు పర్యాయములు క్రిందికి చిమ్మవలెను. 

వాటితో స్రుక్స్రువములను గ్రహించి, నీటిచే తడిపి, వెచ్చచేసి, దర్భలచేత తుడిచి, మరల కడిగి, వెచ్చచేసి, ఓంకారము నుచ్చరించుచు క్రింద ఉంచి, సాధకుడు, పిమ్మట ఓంకారము మొదట ఉచ్చరించుచు, చివర 'నమః' అని లనుచు పిమ్మట హౌమము చేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 66 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భృగువు మహర్షి - ఖ్యాతి - 2 🌻*

7. ఆ తరువాత భరద్వాజుడు, “ఈ ఆకాశాది పంచభూతముల పరిమాణం ఎంత? అని ఆదిగాడు. ఇది చాలా సరియైన ప్రశ్న. (ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఇదే ఒక పెద్ద ప్రశ్నగా ఎదురవుతున్నది. 

8. విశ్వం పరిమితమా? అపరిమితమా? అన్న ఆ ప్రశ్నకు జవాబు ఇంకా ఇప్పటికీ అన్వేషిస్తున్నారు. చివరకు ఆధునికులు ఇది finite universe అని ఒక నిర్ణయానికి వచ్చారు. కొద్ది సంవత్సరాలకు పూర్వమే! Infinite కాదని, endless కాదని, దానికి boundaries ఉన్నాయని వాళ్ళ అభిప్రాయం. 

9. finite అయినప్పటికీ దీని end ఏమిటి? beyond the ends ఏమైనా ఉంటుందా అని ఒక ప్రశ్న ఉంటుంది కదా! Finite అయితే, borders ఉండాలి దానికి. Beyond the borders ఏదో ఒకటి ఉండాలి. Borders మాత్రమే అనంతంగా ఉంటే infinite అనాలి. కాని science ఈ answer తీసుకున్నతరువాత further questions పరిశీలన చేస్తున్నది.

10. Universe finite యే కాని, దీన్ని ఎలాగ సిద్ధాంతీకరించాలి అని విచారణ చేస్తున్నారట.). భరద్వాజుడి ప్రశ్నకు భృగుమహర్షి, “ఈ భూతములన్నీ అనంతంగా ఉన్నయి” అని చెప్పాడు. Infinite గా ఉన్నాయి అని అర్థం.

11. నిరవధికములు. వాటికి అవధులు లేవు. ఇంత అని ఒక limit లేదు. అప్రమేయము. అప్రమేయము అంటే, not measurable. ఇంత అని పరిమాణము చెప్పలేము. 

12. అదంతా ఆయన శరీరమే కాబట్టి, వాటియందు వ్యాపించినవాడుకాబట్టి, విష్ణువుకు అనంతుడు అనే పేరుంది. విష్ణువు అనంతుదయితే ఆయన సృష్టికి అంతం ఎలా ఉంటుంది? అందులోనే ఉందనామాట ఈ అర్థం. అనంతుడు అనే పేరులోనే infinite universe అనే ఒక మాట ఉంది.

13. ప్రళయకాలంలో బ్రహ్మ ఈ విశ్వాన్నంతా ఉపసంహరించు కుంటున్నాడు కదా! అని సందేహం కలుగవచ్చు. నిజానికి అది వేరే విషయం. ఎందుకంటే ఏమయినా మిగిలి ఉంటుంది అంటే ఆకాశమే మిగులుతుంది. 

14. ఆకాశంకూడా బ్రహ్మ యందుంటుంది. Space is not final. Space is borne by Brahma. ఇక limit ఏదో ఏమి తెలుస్తుంది? ఆకాశమే ఆయననుంచి పుట్టిందని చెపుతున్నారు. అందువలన అనంతత్వాన్ని, అంటే విష్ణువును మానవ మనస్సుతో అవగాహన చేసుకోలేమని తెలుసుకోవాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 69 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. Q 62:-- ఇతర జీవజాతుల నుండి మనిషి నేర్చుకోవాల్సిన విషయాలు. - జీవజాతులు vs జనాభా నియంత్రణ - 1 🌻*

Ans :--
1) కప్ప జాతిని చేప, పాము జాతిని గ్రద్ద,చిన్న జంతువులను పెద్ద జంతువులు, ఇలా జనాభా నియంత్రణ కొనసాగుతుంది.

అంతేగాని జంతుజాతిని నియంత్రించడానికి వాటిని చంపడానికి మానవ జాతికి ఎటువంటి అధికారం లేదు.

2) చైతన్య పరిణామంలో ప్రస్తుతం మానవజాతి ముందుండి. పూర్వం కొన్ని నాగారికతల్లో మానవజాతి కంటే జంతుజాతే తెలివిగా ఉండేది. ప్రస్తుతం కూడా సకల ప్రాణికోటి మానవ చైతన్య పరిణామానికి దోహదపడుతుంది.

3) ప్రత్యక్షంగా పరోక్షంగా సకల జీవజాతుల మానవజాతికి తమ్ముళ్ల వంటివారు. వాటిని చంపడమంటే మానవ చైతన్య పరిణామాన్ని చంపుకోవడమే. జంతుజాతులన్నీ ఇతర లోకాలనుండి భూమ్మీద కు వచ్చిన ప్రతినిధులు.

4) మనకు ఒక చెయ్యి విరిగిందంటే అంగవైకల్యం, దేహానికి కొంత వెలితి ఏర్పడుతుంది. అలాగే జీవజాతులు చైతన్య పరిణామానికి మానవ జాతి ఆటంకం కలిగిస్తే మన చైతన్య పరిణామానికి ఆటంకం కలిగించినట్లే.

5) వైద్యశాస్త్ర ప్రయోగాల కోసం జంతువుల దేహాలు,
మృతజీవకణాలపై ప్రయోగాలు చేసి, వాటిని హింసించి చంపుతున్నారు. ఇది చాలా హీనమైన పని. దీని ద్వారా అభివృద్ధి అయిన అల్లోపతి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 130 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

🌻 The world is but the surface of the mind and the mind is infinite. 🌻

What we call thoughts are just ripples in the mind. When the mind is quiet it reflects reality. 

When it is motionless through and through, it dissolves and only reality remains. 

This reality is so concrete, so actual, so much more tangible than mind and matter, that compared to it even diamond is soft like butter. 

This overwhelming actuality makes the world dreamlike, misty, irrelevant.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 15 🌹*
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం - 3 🌻*

వావీవరసలు తగ్గిపోతాయి. తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషించడం చాలా సాధారణం అవుతుంది..

తండ్రీకొడుకులు ఒకర్నొకరు దూషించుకోవడమే కాదు, హత్యలు చేసుకోవడం ఎక్కువయ్యాయి. ఆస్తి పంచి ఇవ్వలేదనే కోపంతో తండ్రిని, తల్లిని హత్య చేసిన కొడుకుల కధలు ఎన్నో ఉన్నాయి. 

తాను చెప్పిన మాట వినలేదని కొడుకును, కోడళ్లను తండ్రి తగలబెట్టాడనే కధనం ఆమధ్య వార్తల్లో వచ్చింది. పైగా ఆ తండ్రి ఒక వైద్యుడు కూడా. ఇలాంటి వార్తలు కొల్లలుగా వింటున్నాం. కనుక బ్రహ్మంగారి మాట బ్రహ్మవాక్కే.

శిలలు కండలు కక్కుతాయి. ఆ కండలు తినేందుకు ఆకాశం నుంచి గద్దలు వచ్చి నేలపైన వాలతాయి. వెంటనే చస్తాయి. ఆ చచ్చినవాటిని పట్టుకుని ప్రజలు గంతులు వేస్తారు.

ప్రజలు కొరువులు (సిగరెట్లు, బీడీలు కావచ్చు) నోట కరచుకుని తిరుగుతారు. కొండలు మండుతాయి.

చిన్నాపెద్దా తేడా లేకుండా, ఆడా మగా తారతమ్యం లేకుండా ఎందరో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. బహుసా ఇది ఇంకా పెరుగుతుంది కావచ్చు. ఇక కొండలు మండటం అంటే, అగ్ని పర్వతాలు అని సూటిగానే తెలుస్తోంది. నిజానికి అగ్ని పర్వతాలు భారతదేశంలో ఎక్కడా లేవు. ఇవి ఆగ్నేయాసియా దేశాల్లో, యూరప్ దేశాల్లో మాత్రమే కనపడతాయి. వాటిని గురించి బ్రహ్మంగారు 500 ఏళ్ళ కిందట చెప్పటం ఆశ్చర్యకరంగా ఉంది.

జనుల కడుపులో మంటలు పుడతాయి. నోట్లో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాలపాలయి జనులు మరణిస్తారు. అలాగే పశువులు, క్రూర మృగాలు కూడా చస్తాయి.

పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. అయినా సరే, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. క్షయ లాంటి ఎన్నో జబ్బులకు అద్భుతమైన మందులు కనిపెట్టారు. 

కానీ, కాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులు భయపెడుతున్నాయి. దీనికి పంటల్లో వాడే ఎరువులు, వాతావరణ కాలుష్యం, మన అలవాట్లు, జీవనశైలి లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొత్తానికి ఈ పరిణామాన్ని వందల సంవత్సరాల కిందటే చెప్పడం అద్భుతం.

అణు బాంబుల వల్ల అణు ధూళి ఏర్పడుతుంది. దీనివల్ల బ్లడ్ కాన్సర్ , ఇతర రోగాలు వస్తాయి. నోట్లో బొబ్బలు రావడం కూడా అణు ధూళి చూపించే ప్రభావం వల్లే. 

అణు బాంబు ప్రభావం వల్ల మనుషులే కాకుండా క్రూర మృగాలు, పశువులు కూడా కోట్ల సంఖ్యలో మరణించాయి. మొత్తమ్మీద ఇక్కడ చెప్పినవి అన్నీ అణు బాంబుల వల్ల కలిగే దుష్పరిణామాలే అని అర్ధం చేసుకోవచ్చు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 9 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

మా అమ్మాయికి జ్వరం వచ్చింది. మా అమ్మాయికి ఏదో అయ్యింది. లేదూ మా అబ్బాయికి ఏదో అయ్యింది. లేదూ మా ఆయనకి ఏదో అయ్యింది, లేదూ మా ఇంకొకరికి ఏదో అయ్యింది, మా సంబంధీకులకు ఏదో అయ్యింది, ఏ సంబంధమూ లేనివారికి ఏదో అయ్యింది, అనేటటువంటి సంకల్పం నీలో ప్రవేశించింది. 

ప్రవేశించగానే ఏమౌతుందంటే, తత్‌ కారణ రీత్యా, ఆ బలం రీత్యా, ఆ తపస్సు రీత్యా, ఆ జ్ఞానబలం రీత్యా, ఆ వైరాగ్య బలం రీత్యా, ఆ సమర్థనీయమైనటు వంటి శక్తి ద్వారా. ఇదంతా శక్తితో కూడుకున్నటువంటి వ్యవహారమన్నమాట. పదార్థగతంగా ఇవన్నీ సాధ్యం కావు. కానీ, శక్తిగతంగా ఇవన్నీ సాధ్యమే. తపఃశక్తి వలన ఇవన్నీ సాధ్యమే. కర్మఉపాసన వలన ఇవన్నీ సాధ్యమే. 

ఆయా ఉపాసన బలముల యొక్క సమర్థత వలన నీవు అలా అవుతావు. తత్‌ ప్రభావ రీత్యా, ప్రేరేపించబడి, ఆ సంకల్పమునకు నీవు లోబడి, నీవు ప్రవర్తిస్తావు. ఎప్పుడైతే ప్రవర్తించావో, తత్‌ ప్రభావ రీత్యా నీకా మాలిన్యం అంటుకోక తప్పదు. 

మాలిన్యం అంటుకోగానే శుద్ధ చైతన్యంగా ఉండవలసిన నీవు మలిన చైతన్యమై, మిశ్రమ రూపమైనటువంటి కర్మయందు ప్రవేశించి, నీవు జీవుడవైపోతావు.

 ఆత్మసాక్షాత్కార జ్ఞానమే నాకు ప్రధానమైనటువంటి లక్ష్యము అనేటటువంటిది మరపుకు వస్తుంది. “మరుపే జీవుడు. ఎఱుకయే ఆత్మ” - ఈ సత్యమును తెలుసుకోవాలి.

      రోజూ కాబట్టి, ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలనుకున్నవారు, కామమును లవలేశమైననూ మిగుల్చుకోకుండా పోగొట్టుకోవాలి. 

జనన మరణముల మధ్యలో దేనిని నేను ఆశ్రయించను, అని ఈశ్వరుని వద్ద వాగ్దానం చేసి, అట్టి వాగ్దాన భంగం కలుగకుండా నీవు నిలబెట్టుకోవాలి. అనేక రకములైనటువంటి ఆటంకములు వస్తూ ఉంటాయి. అవన్నీ కర్మవశాత్తు ప్రేరితమై పరీక్షగా వస్తూ ఉంటాయి. 

వచ్చినప్పుడు ఆ పరీక్షలో వైరాగ్యం చేత, తీవ్రమైనటువంటి జ్ఞాననిష్ఠ చేత, తీవ్రమైనటువంటి లక్ష్యశుద్ధి చేత, నీవు ఎదురించాలి. అంతేగానీ, ఆయా చిన్న చిన్న సమస్యలను గురించి, నీవు ప్రభావితం కాకూడదు.

       పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి లోబడినది అంతా కామమని పేరు. ఇది పంచభూతాత్మకమైన ప్రకృతికి లోబడి ఉందా? లేదా? అన్న ప్రశ్న వేసుకున్నావనుకో అది కామము అవునో కాదో అర్థమైపోతుంది. వెంటనే ఆ కామమును నిర్జించాలి. వైరాగ్యముతో కామము యొక్క మూలమును నిర్జించాలి. 

అలా ఎప్పుడైతే నిర్జించిన వాడివి అవుతావో, నీవు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి అర్హుడవు అవుతావు. తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ, తీవ్రవైరాగ్యము చాలా అవసరము. 

ఈ రకంగా ఈ యొక్క ప్రేరణకి నచికేతుడు లొంగుతాడా? లేదా? అనేటటువంటి ప్రాధమ్యాలని సరిగ్గా ఆయన ముందు ఉంచి, ఆయా కామము యొక్క ప్రేరణ ఆయనలో కలుగుతోందా? లేదా? అనేటటువంటి సాధారణంగా ఎలా ఉంటుందంటే, పొందడానికి సిద్ధమయ్యేటటువంటి స్థితి ఏర్పడే వరకూ కూడా నీలో ఆ కామము యొక్క ప్రభావము ఉండదు. సాధారణంగా అందరూ ఇవేవీ నాకు అక్కర్లేదండి అనే అంటూ ఉంటారు. 

కానీ, సమయ సందర్భోచితమై అవి నీ ముందు ప్రత్యక్షమై, అనుభోక్త మయ్యేటటుంవంటి స్థితి ఏర్పడినప్పుడు నీలో ఉన్నటువంటి వైరాగ్యం, నీలో ఉన్నటువంటి తీవ్ర మోక్షేచ్ఛ, అప్పుడు కదా వాటి యొక్క నిరూపణము అయ్యేది?

        కాబట్టి, మానవుడు ఆ జీవన పర్యంతము వీటియందు మెలకువ వహించి ఉండాలి. ‘స్త్రీ బాలాంధ జడోప మాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః’ అంటోంది దక్షిణామూర్తి స్తోత్రం. 

కాబట్టి, ఇవన్నీ కూడా ఏదో ఒక భ్రాంతి నీ మీద పనిచేసేటటువంటి పద్ధతిగా ఏర్పడుతుంది. అంతా బానే ఉంటుంది. ఒక్క రెప్పపాటులో ఏదో ఒకటి వీటిల్లో భంగం జరుగుతుంది. లేదా ఒకటి పొందడం జరుగుతుంది. 

ఒకటి పొందకపోవడం వలన కానీ, ఒకటి పొందడం వలన కానీ, నీలో ఏమైనా మార్పు గనుక సంభవించినట్లయితే తత్‌ ప్రభావం చేత, నీవు ఆత్మసాక్షాత్కార ఆత్మానుభూతి అనేటటువంటి స్థితి నుంచీ జీవుడుగా పతనం అవుతావు. అట్లా పతనం అవ్వకుండా స్థిరముగా ఉండేటటువంటి పద్ధతిని నీవు ఆశ్రయించాలి.  

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శివగీత - 10 / The Siva-Gita - 10 🌹


*🌹. శివగీత - 10 / The Siva-Gita - 10 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
*🌻. వైరాగ్య యోగము - 1 🌻*

ఋషయ ఊచు :-
కిమర్ధ మాగతో గస్త్యో రామచంద్ర స్య సన్నిధిమ్,
కధం వా విరజాం దీక్షాం - కార యామాస రాఘవమ్ 1
తతః కిమాప్త వా న్రామ :- ఫలం తద్వక్తు మర్హసి,

ఋషులు వక్కాణించిరి :--
ఓయీ సూత మహాముని!

 దండకారణ్యంబులో నున్న శ్రీరాముని వద్దకు అగస్త్య మహాముని యెందులకు గాను వచ్చెను ? ఏ విధముగా శ్రీ రామునికి విరజా దీక్ష నోసంగెను.? ఆ పైన రాముడేమి ఫలము నార్జించెను? ఆ సమస్తమును విస్తారముగా మాకు తెలుపుము. అనిన విని సూతుడిట్లు చెప్పెను:

రావణేన యదా సీతా సహృతా జన కాత్మజా ,
తదా వియోగ దుఃఖేన- విల పన్నా స రాఘవః 2
నిర్నిద్రో నిరహంకారో - నిరాహారో దివానిశమ్
మోక్తు మైచ్చత్తత: ప్రాణా- న్సానుజో రఘు నన్దనః 3

ఎప్పుడైతో సహదర్మ పత్ని యగు సీతాదేవి రావణాసురుని చేత 
అపహరింపబడి నదో అప్పుడు శ్రీ రాముడు ప్రియురాలి విరహ దుఃఖము వలన రాత్రి పగలు నిద్రలేమి కతమున ఆహారము , అహంకారము లేనివాడై తన తమ్ముడైన లక్ష్మణునితో సహ
 అసువుల బాయుటకు ప్రయత్నించెను.

లోపా ముద్రా పతి ర్జాత్వా - తస్య సన్నిధి మాగమత్,
అధం తం బోధ యామాస - సంసారా సార తాముని: 4
కిం విషీద సిరా జేన్ద్ర కాన్తా కస్య విచార్యతామ్,
జడః కిన్ను విజానాతి - దేహో యం పాంచ భౌతికః 5
నిర్లేపః పరిపూర్ణశ్చ - సచ్చిదా నన్ద విగ్రహ:
ఆత్మాన జాయతే నైవ - మ్రియతే నచ దుఃఖ ఖాక్ 6

ఈ సంగతి పసిగట్టి లోపాముద్ర పతియైన అగస్త్య మహర్షి శ్రీరాముని కడకు వచ్చిన వాడయ్యెను. ఆ మీదట నాతడు సంసారము నందలి నిస్సారత నీ ప్రకారముగా ఉద్భోధించెను.
 
ఓయీ రామచంద్రా! ఎందులకు నీ విటు దుఃఖించు చున్నావు. సీత ఎవడిదో విచారించి చూడుము. మూడులకీ రహస్యము తెలియదు. ఈ దేహము పంచ భూతములతో కూడి యున్నది. ఎలాంటి సంబంధము లేనిది యాత్మ సచ్చిదానంద స్వరూపమైనది. ఇది జనన మరణంబుల కతీత మైనది మరియు దుఃఖములకు లోనుగానిది .

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 10 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
*🌻 Vairagya Yoga - 1 🌻*

1. The Monks addressed Suta and enquired: Hey
Suta maha Muni! What for did Sage Agastya visit Sri Rama in Dandakaranya? 

In what way did he initiate Rama in Viraja Deeksha?

 Subsequently, what results did Rama get out of that Deeksha? Kindly narrate the entire story to us in detail. 

After listening to their request, Suta replied this way.

2. 3. When Sita, the wife of Sri Rama was abducted by Ravana, Sri Rama was in a desperate modd due to his beloved separation. 

He didn't sleep day and night, left eating food, and lost his valor, and together with his brother lakshmana he was almost became lifeless.

4. 5. Having realized about Rama's condition, sage Agastya the consort of Lopamudra came to Sri Rama's place. After that he taught 'Vairagya' to Rama as follows: Hey Ramachandra! Why are you feeling so sad? Think who is Sita. 

6. Ignorant people wouldn't understand this secret. This body is made up of 5 elements (Pancha Bhootam). But soul is unattached to the body and it is beyond the reach of birth and death; also Soul remains unaffected by sorrows.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹