శ్రీ లలితా సహస్ర నామములు - 29 / Sri Lalita Sahasranamavali - Meaning - 29
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 29 / Sri Lalita Sahasranamavali - Meaning - 29 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 29. భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా ‖ 29 ‖ 🍀
🍀 74. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా -
భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించునది.
🍀 75. మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా -
మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతసించింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 29 🌹
📚. Prasad Bharadwaj
🌻 29. bhaṇḍaputra-vadhodyukta-bālā-vikrama-nanditā |
mantriṇyambā-viracita-viṣaṅga-vadha-toṣitā || 29 || 🌻
🌻 74 ) Banda puthra vadodyuktha bala vikrama nandhita -
She who was pleased by the valour of Bala devi(her daughter) in destroying the sons of Banda
🌻 75 ) Manthrinyamba virachitha vishangavatha Doshitha -
She who became happy at seeing Goddess Manthrini kill Vishanga(this ogre (brother of Banda) represents our desires for physical things)
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 173
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 11 🌻
662. పరమముక్తుడు సృష్టికి పరుడనైన భగవంతుడు ననియు సృష్టి- స్థితి-లయ కారుడైన భగవంతుడు (ఈశ్వరుడు)ననియు సృష్టి యొక్క పరిమితులకు అతిశయించితిననియు అనుభూతి నొందుచుండును.
అనగా-
భగవంతుని దశ పాత్రలలో ప్రతి పాత్ర యందు ఎరుక కలిగియుండును. సృష్టి యొక్క దివ్య లీలలను పూర్తిగా ఆనందించును. బాధల ననుభవించును, (ప్రతి వారిలో), ప్రతి దానిలో నున్న భగవంతుడు తానేనని తనకు తెలియును.
కనుక ప్రతియొక్కరికి ఆధ్యాత్మికముగా సహాయము చేయు సమర్ధుడుడగును పై నాలుగు విధములలో ఏ రకము ముక్తి నైనను పొందునట్లు చేయును.అతడు నిజముగా ప్రత్యేకించి మానవ జాతికిని సార్వజనీనముగా సృష్టికిని సహాయము చేయును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 234
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 234 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దేవలమహర్షి - 5 🌻
24. ఉదాహరణకు ఒక కుక్కవచ్చి ఇతడికి కోపం తెప్పించవచ్చు. మనిషిదాకా అక్కరలేదు. ఊరికే పోతూపోతూ మీద ఒకరాయిని వేసి కోపం తెప్పించవచ్చు. తన తండ్రి మెడలో చనిపోయిన పామును పరీక్షిత్తువేస్తే, ఆ రాజును సపించాడు కొడుకు. అలా దేశాన్ని ఏలే రాజు శపించటం పాపమని చెప్పి బోధచేసాడు ఆ మహర్షి.
25. “శాపానుగ్రహశక్తి కలిగినటువంటి తపోబలం కలిగిన కొడుకుకు, తన తండ్రిని ఎవరో రాజు అవమానించాదని క్రోధం వచ్చిందంటే, నువ్వు ఏం తపస్వివి! నువ్వు ఏం బ్రాహ్మణుడివి? దేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రభువును చంపటం అంటే ఇక మనిషిని చంపటంకాదు.
26. రాజు తప్పు చేసినప్పిటికీ, ఆయనకు అపకారం చేసినట్లయితే, దేశంమొత్తానికే అపకారం చేసినట్లవుతుంది. కాబట్టి ఇంతటి మహాపాపం నీవు చేసావంటే, నీ శపాన్ని నీవు మళ్ళించుకోలేవు. నీవు అంత శక్తిమతుడివి కావు” అన్నాడు.
27. శాపం పెట్టడం శులభమే కాని, అనుగ్రహించి, తన శాపంవల్ల ముక్తి కలుగుతుందని చెప్పలేనివాడు, ఎప్పుడూకూడా శాపం ఇవ్వలేడు. అనేకచోట్ల మహర్షులు శాపమివ్వటం, ఉపసంహరించుకోవటం మొదలైన సంఘటనలు మనకు పురాణాలలో కనబడతాయి. అటువంటి మహర్షుల వాక్యాలుకూడా ఎన్నో ఉన్నాయి.
28. అంటే, శాపానుగ్రహశక్తులలో శాపాన్ని మళ్ళించుకునే శక్తిలేనివాడు శపించలేడని భావము. ఏ మంత్రం జపించినా, ఏ దేవతను ధ్యానంచేసినా, ప్రాణాయామంతో అంతో ఇంతో ఆరధనచేస్తే యత్కించిత్ సక్తి ఏదో వస్తుంది. అదికాస్తా యోగ్యుడిమీదకాని ఎటు మళ్ళించినాకూడా తపస్సు భంగంకలగడమేకాక, పాపంకూడా వస్తుంది.
29. తపస్సులో ఉన్నవాడికి – ఎవరినీకూడా ద్వేషించకుండా ఉండటము, ఆగ్రహంలేకుండా ఉండతము, ప్రధానంగా ఇంద్రియజం కలిగి ఉండటము ఎంతో ముఖ్యం. హృదయం నిండా శాంతి సుఖములు అనే అమృతాన్ని నింపుకుని వికారరహితమైన మనోవృత్తిని అవలంబించినవాడికే మోక్షలక్ష్మి లభిస్తుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
శ్రీ శివ మహా పురాణము - 350
🌹 . శ్రీ శివ మహా పురాణము - 350 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
89. అధ్యాయము - 01
🌻. హిమవంతుని వివాహము - 2 🌻
ఆ పర్వతడు కులమును నిలబెట్టి, దర్మును వర్థిల్లజేయుట కొరకైన మరియు పితృదేవలతకు హితమును చేయుకోకికతో వివాహమాడగోరెను(21) ఓ మహర్షీ! ఆ సమయములో దేవతలు పూర్తాగా తమ స్వార్థమును మాత్ము తలబోసి , ప్రకాశస్వరూపులగు పితృదేవలతను సమీపించి, వారితో ప్రీతిపూర్వకముగా నిట్లనిరి(22)
దేవతలిట్లు పలికిరి|
ఓ పితృదేవతలారా! మారు ప్రీతితో గూడిన మనస్సు గలవారై, అందరు మా వాక్యమును వినుడు, మీకు దేవకార్యమును నెరవేర్చు కొరిక ఉన్నచో, మేము చెప్పిన తీరున శీఘ్రముగా ఆచరించపుడు(23) మంగళస్వరూపురాలు, మేనయను పేరుగలది అగు మీజ్యేష్ఠకుమార్తను హిమపత్వర్వతునకు ఇచ్చి ప్రీతి పుస్సనరముగా వివాహమును చేయుడు(24) ఇట్లు చేసినచో అందరికీ అన్ని గొప్పలాభములు కలుగగలవు. మరియు మీకు, దేవతలకు కూడా ప్రతి అడుగునందు దుఃకమలు తొలగిపోవును(25)
పితృదేవలు దేవతల ఈ మాటను విని, విమర్శిచుకొనివ, కుమార్తెల శాపమును స్మరించి, ఆ మాటకు తమ అంగీకారమును తెలిపిరి(26) వారు తమ కురమార్తయగు మేనను హివత్సరవ్వతునకిచ్చి యథావిదిగా వివాహమును చేసిరి. పరమ మంగళకరమగు ఆ వివాహములో గొప్ప ఉత్సవము ప్రవర్తిల్లేను(27) విష్ణవు మొదలగు దేవతలు, మరియు అందరు మహర్షులు వామ దేవుడగు శంకురుని మనసా స్మరివంచి ఆ వివామమునకు వచ్చిరి(28) వారు అనేక బహుమానములనిచ్చి ఉత్సవమును చేయించిరి. దివ్యులగు పితృదేతలను మరియు హివవంతుని అనేక కవిధముగా ప్రశంసించిరి(29)
దేవతలు, మరియు మహర్షులు అందరు మహానందరును పొందినవారై, ఉమాశివులను స్మరిచుకొనుచూచ, తమతమ నివాసములకు మరలి వెళ్లిరి(30) హివంతుడు అనేక బహుమానములను పొంది, ఆ సుందరిని చక్కగా వివాహమాడి తన భవలనుమకు వచ్చి ఆనందించెను(31)
బ్రహ్మ ఇట్లు పలికెను
ఓ మహర్షీ! హిమ వంతునికి మేనకతో జరిగిన దివ్యమైన, సుఖప్రదమైన వివాహమును ప్రీతితో వర్ణించి చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు?(32)
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సపంహిఆతయమందు మూడవది యగు పార్వతీ ఖండములో హిమవంతుని వివాహవర్ణమనే మొదటి అధ్యాయము ముగిసినది(1)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
గీతోపనిషత్తు -151
🌹. గీతోపనిషత్తు -151 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 4
🍀 4 - 1. సంకల్ప సన్యాసము - మానవ ప్రజ్ఞ బాహ్యములోనికి ప్రవేశించుటకు, అనగా ప్రపంచముతో సంబంధ మేర్పరచు కొనుటకు యింద్రియములు దైవ మేర్పరచిన సౌకర్యము. ఇంద్రియముల ద్వారా బహిరంగ విషయములను వినుట, చూచుట, రుచి చూచుట, వాసన చూచుట, స్పర్శను తెలియుట జరుగుచుండును. ఇట్లు బాహ్యమున చూచునపుడు కొన్ని విషయములం దాసక్తి కలుగుట, కొన్ని విషయములం దనాసక్తి కలుగుట జరుగు చుండును. ఇట్టి ప్రజ్ఞ ప్రథమముగ వెనుకకు మరల్చబడవలెను. పురోగమించు ప్రజ్ఞకు తిరోగమనము కూడ సంకల్ప మాత్రమున కలుగవలెను. అట్లే ప్రజ్ఞ ఆరోహణ క్రమమున సాగుటకు సర్వసంకల్పములను విసర్జించుట ఆవశ్యకము. 🍀
యదా హి చేంద్రియార్డేషు న కర్మ స్వనుషజ్జతే |
సర్వసంకల్ప సన్న్యాసీ యోగారూఢ స్తదోచ్యతే || 4
యోగవిద్య సాధన చేయుచున్నప్పుడు ప్రజ్ఞ ఆరోహణ క్రమమున సాగుటకు యింద్రియార్థముల ద్వారా బాహ్యమునకు ఊరక చనుచుండుట వర్జనీయము. అట్లే సర్వసంకల్పములను విసర్జించుట ఆవశ్యకము.
సాధారణముగ మానవులు బాహ్య ప్రపంచమున నిమగ్నులై యుందురు. మునిగియుందురు. మానవ ప్రజ్ఞ బాహ్యములోనికి ప్రవేశించుటకు, అనగా ప్రపంచముతో సంబంధ మేర్పరచు కొనుటకు యింద్రియములు దైవ మేర్పరచిన సౌకర్యము.
ఇంద్రియముల ద్వారా బహిరంగ విషయములను వినుట, చూచుట, రుచి చూచుట, వాసన చూచుట, స్పర్శను తెలియుట జరుగుచుండును. ఇట్లు బాహ్యమున చూచునపుడు కొన్ని విషయములం దాసక్తి కలుగుట, కొన్ని విషయములం దనాసక్తి కలుగుట జరుగు చుండును.
బాహ్య విషయములను గ్రహించుచు, బాహ్యమునకు ప్రతిస్పందించుచు సామాన్య జీవితము సాగుచుండును. ఇంద్రియము లందించు సుఖము తాత్కాలికమే అయినను మరల మరల వానిని కోరు స్వభావ మేర్పడి వినుట, చూచుట, తినుట, స్పర్శించుట, మాట్లాడుటగ దినమంతయు సాగీ రాత్రివేళకు ప్రజ్ఞ బలహీనపడును.
ప్రకృతి నిద్ర ద్వారా ప్రజ్ఞను తిరోగమింపజేసి, మరునాటి ఉదయమునకు బలముగను, ఉత్సాహవంతముగను ఏర్పరచును. నిద్ర ప్రకృతి అందించిన వరము. నిదుర నుండి లేచిన మానవ ప్రజ్ఞ మరల బహిరంగమున ఉత్సుకతతో ప్రవేశించును. ఐదు ఇంద్రియముల ద్వారా, జననేంద్రియము ద్వారా, వాక్కు ద్వారా ఏడు విధములుగ ప్రజ్ఞ బహిర్గతమగుచు, జీవుడు నిర్వీర్యు డగుచుండును. క్రమముగ మరణము సమీపించును.
బలీయముగ బహిర్గతము లోనికి యింద్రియముల ద్వారా ప్రజ్ఞ ఏడు విధములుగ యీడ్చబడుచుండును. పశువును అన్ని విధములుగ బంధించి, బలీయముగ లాగుకు పోవునట్లు, మానవ ప్రజ్ఞ మేల్కాంచినది మొదలు బహిరంగమున చేరుటకు కారణము యింద్రియములు రుచి చూపించిన విషయములందు ఏర్పడిన అమితమగు ఆసక్తియే.
ఇట్టి ప్రజ్ఞ ప్రథమముగ వెనుకకు మరల్చబడవలెను. పురోగమించు ప్రజ్ఞకు తిరోగమనము కూడ సంకల్ప మాత్రమున కలుగవలెను. కళ్ళెములేని గుఱ్ఱమువలె పరిగెత్తు ప్రజ్ఞకు గంతల కళ్ళెము ఏర్పరచినట్లు వెనుకకు మరల్చ గల పటుత్వ మేర్పడవలెను. బహిరంగమున గల ఆసక్తిచే బహిరంగములోనికి తీరుబడిలేక ప్రజ్ఞ ప్రసార మగుచున్నది గదా! విషయములం దాసక్తియే దీనికి కారణము.
ఈ ఆసక్తి అనాసక్తిగా ఎట్లు మారగలదు? ఇంద్రియ విషయముల కన్న రుచికరమైన విషయము ఒకటున్నదని తెలియుట వలన, దానియందాసక్తి పెరుగుచుండుట వలన చిల్లర విషయములం దాసక్తి తగ్గుచు నుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021
వసంత పంచమి విశిష్టత… ఆరోజున సరస్వతి దేవిని ఇలా పూజిస్తే మంచి ఫలితాలే.. (Significance of Vasantha Panchami... Worshiping Goddess Saraswati on this day gives good results ..)
వసంత పంచమి విశిష్టత… ఆరోజున సరస్వతి దేవిని ఇలా పూజిస్తే మంచి ఫలితాలే.. (Significance of Vasantha Panchami ... Worshiping Goddess Saraswati on this day gives good results ..)
మాఘశుద్ధ పంచమినే 'వసంత పంచమి' అంటారు. మాఘ నెలలో శుక్లా పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది.
మాఘశుద్ధ పంచమినే ‘వసంత పంచమి’ అంటారు. మాఘ నెలలో శుక్లా పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 16న ఈ వసంతి పంచమి వచ్చింది. ఆరోజున సరస్వతి దేవి ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది. ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు. సకలవిద్యా స్వరూపిణి సరస్వతీ దేవిగా జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీపంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది. విద్యాదానం జ్ఞానదానమేనని అన్న దానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు. శాంతమూర్తియైన సరస్వతీ దేవి ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెబుతుంటారు.
వసంత పంచమి శుభ సమయం..
పవిత్ర సమయం ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 3.36కు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 17న ఉదయం 5.46 గంటల వరకు ఉంటుంది. ఫిబ్రవరి 16న ఉదయం 6.59కి సరస్వతి దేవికి పూజ చేయడం, మధ్యాహ్నం 12.35కి మధ్య శుభ సమయం ఉంటుంది.
సరస్వతి దేవికి పూజా విధానం..
వసంత పంచమి రోజున సరస్వతి దేవిని తెల్లని పుష్పాలతో పూజించి… అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం.. నేతితో పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి. ఇలా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది. కుల, మత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతి దేవిని పూజిస్తున్నా మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
“యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా
సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః..” శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ దేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీ దేవీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. సరస్వతీ దేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు సూచిస్తున్నారు.
శ్రీ మాత్రే నమః
విశ్వాసంతో సంతోషంగా ఉండడమే చేయవలసింది. రక్షణకు ఇదే మార్గము
👂. Whispers From Eternity
✍️. శ్రీ శ్రీ పరమహంస యోగానంద
📚. ప్రసాద్ భరద్వాజ
"గురుదేవా, నేనొక కష్టంలో ఉన్నప్పుడు నీ కంఠస్వరం ఇలా వినిపించింది:"
నా రక్షణ -- భానుడు నీ ఉజ్జ్వల గడియలలోనూ, అంధకారమయ గడియలలోనూ సమానంగానే ప్రకాశిస్తాడు. విశ్వాసం ఉంచి చిరునవ్వుతో ఉండు. విచారంగా ఉండడం ఆనంద స్వరూపమైన ఆత్మకు ద్రోహం చేయడమే.
జీవితాన్ని మార్చెయ్యగల నా కాంతిని చిరునవ్వుల పారదర్శకత ద్వారా వ్యక్తమవనీ. నా బిడ్డా, నీవు ఆనందంగా ఉండడం వల్ల నేను సంతుష్టుణ్ణవుతాను.
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఆధ్యాత్మికసందేశాలు
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 211 / Sri Lalitha Chaitanya Vijnanam - 211
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 211 / Sri Lalitha Chaitanya Vijnanam - 211 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖
🌻 211. 'మృడప్రియా' 🌻
మృడునకు ప్రియురాలు శ్రీమాత అని అర్థము.
మృడుడనగా శివుడు, పరమ శివుడు. మట్టి యందు కూడ నుండువాడు గనుక మృడు డనిరి. మృడ మనగా మట్టి. మట్టి, బంగారము అను భేదము మానవ మస్తిష్కమునకే గాని, సృష్టి యందు మరెక్కడనూ లేదు.
శివునకు మట్టియు బంగారము ఒక్కటియే. శివతత్త్వ మెరిగినవారికి కూడ నంతియే. శివతత్త్వము పరిపూర్ణముగ నెరిగినది శ్రీమాతయే. మట్టియందుండుటకు శివు డంగీకరించినపుడు మట్టిగ శ్రీమాత రూపము దాల్చినది. అందులకే శివునికి ప్రియురాలు.
పరమ పవిత్రమగు దివ్య చైతన్యము నుండి మట్టి వఱకు కూడ రూపు దాల్చగలదు. "సమానత్వము, సమానత్వము” అనుచూ కేకలు పెట్టువారికి శివా శివుల సమానత్వము ఏమి తెలియగలదు? అనాదిగ మట్టితో లింగముచేసి ఆరాధించుట వాడుకలో గలదు. స్ఫటిక లింగమని, రసలింగమని, నర్మద బాణమని, చిత్త భ్రమలు కలవారికి శివాశివు లందరు.
పురాణ కథలలో ఏ దేవత ఆరాధన అయిననూ మట్టితోగాని, రాగితోగాని, వెండితోగాని, బంగారముతోగాని ప్రతిమను చేయుడని తెలుపబడినది. మట్టికే ప్రాధాన్యత. మట్టి యందు కూడ మాత వున్నదని చూసిన వెంటనే గోచరించినపుడు శ్రీమాత అనుగ్రహము కలదని తెలియవలెను.
భౌతిక లోకమున దేహములన్నియూ మట్టితోనే చేయబడినవి. గోలోకము నుండి అవరోహణ క్రమములో భూలోకము ఎనిమిదవది. మట్టితో కూడిన దేహము నందున్న జీవులు ఎనిమిది లోకముల సుఖములను అనుభవించుటకు అవకాశము కలిగి యుందురు.
దివ్యలోక వాసులగు దేవతలు కూడ పరిపూర్ణ సుఖానుభూతికి అపుడపుడు భౌతిక దేహమును దాల్చుదురని పురాణములు తెలుపు చున్నవి. ఉదాహరణకు మామిడిపండు భుజించవలెనన్నచో భౌతిక దేహము లేనివాడు భుజింపగలడా? ఇట్టి పరిపూర్ణ సుఖము నందించు టకే శ్రీమాత మట్టి రూపమును కూడ ప్రియముతో దాల్చును. ఆమె మృడప్రియ.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 211 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mṛḍapriyā मृडप्रिया (211) 🌻
Śiva is also known as Mṛḍan, His sattvic form. Since She likes Śiva, She is called Mṛḍapriyā. Mṛḍa means happiness, a quality of sattva guṇa, showing compassion or mercy, gracious and priyā means dear. This nāma means that Śiva caresses this universe and as His wife, She loves this act of Śiva. After all, She is the Supreme Mother.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
అహం వదిలితే దివ్యత్వమే అంతా
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
ఉన్నపళంగా ఆ గుర్తింపును వదులుకుని ‘‘మీరెవరు?’’అనే వాస్తవాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలంటే మీకు చాలా భయంగానే ఉంటుంది.
ఎందుకంటే, రోజురోజుకి మృత్యువుకు దగ్గరవుతున్న మీరు ఇంతవరకు మీకున్న గుర్తింపును వదులుకుని ఇప్పుడు కొత్త పాఠం నేర్చుకోవడం మొదలుపెట్టాలి. మరణించలోగా మీరు ఆ పాఠాన్ని పూర్తిగా నేర్చుకోగలరో లేదో ఎవరికి తెలుసు? ఆ ప్రయత్నంలో మీరు మీ పాత గుర్తింపును కోల్పోవచ్చు.
కొత్త పాఠం నేర్చుకుని కొత్త గుర్తింపును సాధించేందుకు కావలసిన సమయం, ధైర్యం, శక్తి మీకు లేకపోవచ్చు? అలా జీవిత చరమాంకంలో మీరు పాత గుర్తింపును కోల్పోయి, కొత్త గుర్తింపును సాధించలేక, చివరికి ఏ గుర్తింపు లేకుండా, కుంగి కృశించిన హృదయంతో పిచ్చిగా జీవిస్తూ, మరణించవచ్చు.
అందుకే ‘‘ఇంతవరకు కష్టపడి సాధించిన పాత గుర్తింపుతో అంతా బాగానే జరిగింది కదా! చివరివరకు అలాగే గడిపేస్తే సరిపోతుంది’’ అని మీరు భావించవచ్చు. ఇప్పుడు నేను ఆ భావనను విడిచి పెట్టాలంటున్నాను. ఎందుకంటే, మీరు మీ పాత గుర్తింపులో ఉన్న వ్యక్తి కాదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మీలో ఎలాంటి భావాలు ఉండకూడదు. నిజానికి, మీలో ఉన్న భావాలన్నీ త్యజించినప్పుడే మీరెవరో మీకు తెలుస్తుంది.
భయపడడం సహజం. దానిని మీరు తప్పుగా భావిస్తూ ఖండించకండి. నిరాకరించకండి. సామాజిక ఎదుగుదలలో అది ఒక భాగం. దానిని మనం ఏమాత్రం ఖండించకుండా, పూర్తిగా అంగీకరిస్తూనే దానిని అధిగమించాలి. కాబట్టి, మీరు చాలా నిదానంగా, ఒక క్రమ పద్ధతిలో, అంచెలంచెలుగా బయటపడుతూ ఉండండి. దూకుడుతో పనిలేదు. దానితో మీరు ఏమీ సాధించలేరు.
అలా చేస్తూ ఉంటే, త్వరలోనే మీరు సత్యం రుచి తెలుసుకుంటారు. అప్పుడు అరవై ఏళ్ళపాటు మీరు మీ జీవితాన్ని ఎలా వృథాచేసుకున్నారో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానితో మీరు మీ పాత గుర్తింపును కోల్పోయి, నూతన దార్శనికభావాలతో నిండిన నవీన మానవునిగా తయారవుతారు.
ఆ మార్పు గుర్తింపు గణాంకాలలోకి రాదు. ఎందుకంటే, అప్పుడు మీరు పలికే ‘‘నేను’’అనే పదం వెనకాల ఏదీ ఉండదు. అది మీకు తెలుసు. ఒకవేళ ఏదైనా ఉంటే మీరు ఆ పదాన్ని పలుకలేరు. కాబట్టి, కేవలం సౌకర్యంకోసమే మీరు ఆ పదాన్ని వాడతారు. దాని వెనకాల ఒక విశాలమైన, పవిత్రమైన, అనంతమైన సముద్రముంటుంది. అందువల్ల మీరెప్పుడూ మరొక గుర్తింపును సాధించాలనుకోరు, సాధించరు.
మీ పాత గుర్తింపుపోవడంతో తొలిసారిగా మీరు దివ్య సముద్రంలోకి కెరటమైనట్లుగా భావించడం ప్రారంభిస్తారు. అది ఎలాంటి గుర్తింపు కాదు. ఎందుకంటే, అందులో మీరు లేరు. దివ్యత్వం మిమ్మల్ని ఆవరించింది. అందులో మీరు అదృశ్యమయ్యారు. మీరు అసత్యంతో పోరాడితే సత్యం మీకు దక్కుతుంది. అది చాలా విలువైనది.
ఎందుకంటే, ఏమీ లేని దానితో పోరాడినా ఎంతో విలువైనది మీకు దక్కుతోంది. అంతకన్నా కావలసినదేముంది? నాతో విసిగిపోయిన నేను నిస్సారమని తెలుసుకున్నాను. మీరేమో మనం ఎలాంటివారమైనా, మనని మనం అంగీకరించాలంటారు. అంతర్గత ఆనందాన్ని కోల్పోతున్నట్లు తెలుసుకున్న నేను ఈ జీవితాన్ని అంగీకరించ లేకపోతున్నాను. ఇప్పుడేం చెయ్యాలి?
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
దేవాపి మహర్షి బోధనలు - 34
🌹. దేవాపి మహర్షి బోధనలు - 34 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 25. జ్ఞానయోగము - కర్మయోగము - 1 🌻
కర్మాచరణము, జ్ఞానార్జనము, ఉచ్ఛ్వాస నిశ్వాసముల వంటివి.
జ్ఞానమార్టించుకొనుటకు సాధనము పవిత్రముగా నుండవలెను. కనుక కర్మాచరణము ప్రాముఖ్యత.
కర్మాచరణము మానవుని స్వభావము నుండి కల్గుచున్నది గాని, జ్ఞానము నుండి కాదు. కావున చేయుట, మానుట లొంగునవి
చేయుట తప్పనిసరియైనపుడు ఫలితముల వైపు లాగనివి చేయదగిన పనులు. అనగా తననుద్దేశించుకొని ఆచరింపని పనులు.
జీవుడు తననుద్దేశించుకొని ఆచరించు పనులు బంధ కారణములగును. ఇతరుల శ్రేయస్సు నుద్దేశించి చేయు పనుల వలన కర్మబంధ విమోచనము కల్గును.
సృష్టియొక్క చక్రభ్రమణము నందలి ప్రజ్ఞులు, దేవతలు, ఫలాపేక్ష లేక స్వధర్మాచరణమునందు వర్తించుచూ సృష్టిని వర్దిల్ల చేయు చున్నవి. మానవుడు కూడా కర్మాచరణమున అట్లే వర్ధిల్లవలెను.
కర్మాచరణము నందు పూజ్యభావము, సమర్పణ బుద్ధి అవసరము, ఇతరులకు చేయుపని వారియందలి దేవతలకు చేయు సమర్పణముగా చేయవలెను.
ఫలాపేక్ష లేని కర్మాచరణము వలన దేహముల యందు, వెలుపల బంధము లేక సృష్టి శక్తులు వర్తించుచున్నవి. ఫలాపేక్ష వలన మానవులు దేహమున బంధింపబడి యున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021
Facebook Hastags: #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
వివేక చూడామణి - 24 / Viveka Chudamani - 24
🌹. వివేక చూడామణి - 24 / Viveka Chudamani - 24 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అంతఃకరణాలు - 1 🍀
93,94. అంతఃకరణ చతుష్టయములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనునవి వాటి పనులవి చేయుచున్నవి. మనస్సు వస్తు పరిజ్ఞానము పొందగా, బుద్ది సత్యాసత్యములను గ్రహించగా అహంకారము శరీరము తానే అను భావముతో తానే స్వయం ఆత్మగా భావిస్తుంది. చిత్తము తనకు నచ్చిన వస్తు విశేషములను గుర్తిస్తుంది.
95. ప్రాణ శక్తి తాను ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అను ఐదు భాగములుగా తమతమ పనులను అనుసరించి విభజింపబడుతుంది. ఎలా అంటే బంగారముతో వివిధ ఆభరణములు తయారు చేయబడినట్లు. అలానే నీరు ప్రవాహముగా, నురుగుగా మారునట్లు.
96. ఐదు కర్మేంద్రియాల పనులైన వాక్కు మొదలగు కర్మల వలన జ్ఞానమును వినుట ద్వారా, తినుట, చేయుట ద్వారా పొందుచున్నవి. ఐదు ప్రాణములు, ఐదు భూతాలు వాటి వాటి చర్యలు బుద్ధిని ఉపయోగించి తన కోర్కెలను జీవాత్మ తీర్చుకొనుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 24 🌹
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj
🌻 Anthah:karanalu - Intuitions - 1 🌻
93-94. The inner organ (Antahkarana) is called Manas, Buddhi, ego or Chitta, according to their respective functions: Manas, from its considering the pros and cons of a thing; Buddhi, from its property of determining the truth of objects; the ego, from its identification with this body as one’s own self; and Chitta, from its function of remembering things it is interested in.
95. One and the same Prana (vital force) becomes Prana, Apana, Vyana, Udana and Samana according to their diversity of functions and modifications, like gold, water, etc.
96. The five organs of action such as speech, the five organs of knowledge such as the ear, the group of five Pranas, the five elements ending with the ether, together with Buddhi and the rest as also Nescience, desire and action –these eight "cities" make up what is called the subtle body.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021
Facebook Hastags: #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 292, 293 / Vishnu Sahasranama Contemplation - 292, 293
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 292, 293 / Vishnu Sahasranama Contemplation - 292, 293 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻292. పావనః, पावनः, Pāvanaḥ🌻
ఓం పావనాయ నమః | ॐ पावनाय नमः | OM Pāvanāya namaḥ
పావనః, पावनः, Pāvanaḥ
భీషాఽస్మాద్వాత ఇతి శ్రుత్యుక్తేః పావయతీశ్వరః ।
యస్మాత్తస్మాత్పావన ఇత్యుచ్యతే విబుధోత్తమైః ॥
వీచునట్లు చేయును. వాయువు వీచునట్లు ప్రేరేపించువాడును విష్ణువే.
:: తైత్తీరీయోపనిషత్ - ఆనందవల్లి (బ్రహ్మానందవల్లి) ద్వితీయాధ్యాయః - అష్టమోఽనువాకః ::
భీషాఽస్మాద్వాతః పవతే । భీషోదేతి సూర్యః । భీషాఽస్మాదగ్నిశ్చేన్ద్రశ్చ । మృత్యుర్ధావతి పఞ్చమ ఇతి । ... (1)
వాయువు పరబ్రహ్మము భయము చేత వీచుచున్నది. సూర్యుడు సైతమూ పరబ్రహ్మము భయము వలన ఉదయించుచున్నాడు. పరబ్రహ్మము వలన భయముచేత అగ్నియు, ఇంద్రుడు, అయిదవవాడగు యముడును ప్రవర్తించుచున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 292 🌹
📚. Prasad Bharadwaj
🌻292. Pāvanaḥ🌻
OM Pāvanāya namaḥ
Bhīṣā’smādvāta iti śrutyukteḥ pāvayatīśvaraḥ,
Yasmāttasmātpāvana ityucyate vibudhottamaiḥ.
भीषाऽस्माद्वात इति श्रुत्युक्तेः पावयतीश्वरः ।
यस्मात्तस्मात्पावन इत्युच्यते विबुधोत्तमैः ॥
One who causes movement. Viṣṇu is the very reason why wind blows.
Taittīrīya Upaniṣad - Ānandavalli (Brahmānandavalli) Section II - Chapter VIII
Bhīṣā’smādvātaḥ pavate , bhīṣodeti sūryaḥ , bhīṣā’smādagniścendraśca , mr̥tyurdhāvati pañcama iti , ... (1)
:: तैत्तीरीयोपनिषत् - आनंदवल्लि (ब्रह्मानंदवल्लि) द्वितीयाध्यायः - अष्टमोऽनुवाकः ::
भीषाऽस्माद्वातः पवते । भीषोदेति सूर्यः । भीषाऽस्मादग्निश्चेन्द्रश्च । मृत्युर्धावति पञ्चम इति । ... (१)
From Its (parabrahma) fear, the wind blows; from fear rises the sun, from the fear of It again Indra, Fire and the fifth i.e., death, proceed (to their respective duties).
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः ।
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥ ३२ ॥
భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥
Bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ ।
Kāmahā kāmakr̥tkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ ॥ 32 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 293 / Vishnu Sahasranama Contemplation - 293🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻293. అనలః, अनलः, Analaḥ🌻
ఓం అనలాయ నమః | ॐ अनलाय नमः | OM Analāya namaḥ
అనలః, अनलः, Analaḥ
జీవాత్మత్వేన యో విష్ణురనాన్ లాతి హ్యసూనితి ।
సోఽనలః ప్రోచ్యతే యద్వాణలతేర్గంధవాచినః ॥
ప్రాణ తత్త్వములకు 'అనాః' అని వ్యవహారము. అట్టి 'అనము'లను తన స్వరూప తత్త్వమునుగా గ్రహించును అనగా పంచ ప్రాణములును, పంచ ఉప ప్రాణములును జీవరూపుడగు పరమాత్ముడే (ప్రాణ, అపాన, వ్యాన, దాన సమానములునూ మరియూ నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయములు).
లేదా న నలతి వాసన కలిగియుండడు. వాసనను గ్రహించడు.
లేదా న అలం పర్యాప్తం అస్య విద్యతే ఈతనికి సరిపోవునది ఏదియు లేదు అని కూడా చెప్పవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 293🌹
📚. Prasad Bharadwaj
🌻293. Analaḥ🌻
OM Analāya namaḥ
Jīvātmatvena yo viṣṇuranān lāti hyasūniti,
So’nalaḥ procyate yadvāṇalatergaṃdhavācinaḥ.
जीवात्मत्वेन यो विष्णुरनान् लाति ह्यसूनिति ।
सोऽनलः प्रोच्यते यद्वाणलतेर्गंधवाचिनः ॥
He receives the prāṇās or life forces into Himself being the self (jīva). In other words, the jīvātma is called Anala because it recognizes Ana or prāṇa as Himself.
Or as the Anala comes from the root 'Nal', it denotes smell. So it can also be interpreted as Paramātma is without smell, Anala. Or as the Paramātma is with without 'Alam' i.e., end, He is Anala.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः ।
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥ ३२ ॥
భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥
Bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ ।
Kāmahā kāmakr̥tkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ ॥ 32 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
16 Feb 2021
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/