11) 🌹. శివ మహా పురాణము - 349🌹
12) 🌹 Light On The Path - 102🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 234🌹
14) 🌹 Seeds Of Consciousness - 298🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 173🌹
16) 🌹. శ్రీమద్భగవద్గీత - 28 / Bhagavad-Gita - 28🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 29 / Lalitha Sahasra Namavali - 29🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 29 / Sri Vishnu Sahasranama - 29🌹
18) 🌹. విశ్వాసంతో సంతోషంగా ఉండడమే చేయవలసింది. రక్షణకు ఇదే మార్గము 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -151 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 4
*🍀 4 - 1. సంకల్ప సన్యాసము - మానవ ప్రజ్ఞ బాహ్యములోనికి ప్రవేశించుటకు, అనగా ప్రపంచముతో సంబంధ మేర్పరచు కొనుటకు యింద్రియములు దైవ మేర్పరచిన సౌకర్యము. ఇంద్రియముల ద్వారా బహిరంగ విషయములను వినుట, చూచుట, రుచి చూచుట, వాసన చూచుట, స్పర్శను తెలియుట జరుగుచుండును. ఇట్లు బాహ్యమున చూచునపుడు కొన్ని విషయములం దాసక్తి కలుగుట, కొన్ని విషయములం దనాసక్తి కలుగుట జరుగు చుండును. ఇట్టి ప్రజ్ఞ ప్రథమముగ వెనుకకు మరల్చబడవలెను. పురోగమించు ప్రజ్ఞకు తిరోగమనము కూడ సంకల్ప మాత్రమున కలుగవలెను. అట్లే ప్రజ్ఞ ఆరోహణ క్రమమున సాగుటకు సర్వసంకల్పములను విసర్జించుట ఆవశ్యకము. 🍀*
యదా హి చేంద్రియార్డేషు న కర్మ స్వనుషజ్జతే |
సర్వసంకల్ప సన్న్యాసీ యోగారూఢ స్తదోచ్యతే || 4
యోగవిద్య సాధన చేయుచున్నప్పుడు ప్రజ్ఞ ఆరోహణ క్రమమున సాగుటకు యింద్రియార్థముల ద్వారా బాహ్యమునకు ఊరక చనుచుండుట వర్జనీయము. అట్లే సర్వసంకల్పములను విసర్జించుట ఆవశ్యకము.
సాధారణముగ మానవులు బాహ్య ప్రపంచమున నిమగ్నులై యుందురు. మునిగియుందురు. మానవ ప్రజ్ఞ బాహ్యములోనికి ప్రవేశించుటకు, అనగా ప్రపంచముతో సంబంధ మేర్పరచు కొనుటకు యింద్రియములు దైవ మేర్పరచిన సౌకర్యము.
ఇంద్రియముల ద్వారా బహిరంగ విషయములను వినుట, చూచుట, రుచి చూచుట, వాసన చూచుట, స్పర్శను తెలియుట జరుగుచుండును. ఇట్లు బాహ్యమున చూచునపుడు కొన్ని విషయములం దాసక్తి కలుగుట, కొన్ని విషయములం దనాసక్తి కలుగుట జరుగు చుండును.
బాహ్య విషయములను గ్రహించుచు, బాహ్యమునకు ప్రతిస్పందించుచు సామాన్య జీవితము సాగుచుండును. ఇంద్రియము లందించు సుఖము తాత్కాలికమే అయినను మరల మరల వానిని కోరు స్వభావ మేర్పడి వినుట, చూచుట, తినుట, స్పర్శించుట, మాట్లాడుటగ దినమంతయు సాగీ రాత్రివేళకు ప్రజ్ఞ బలహీనపడును.
ప్రకృతి నిద్ర ద్వారా ప్రజ్ఞను తిరోగమింపజేసి, మరునాటి ఉదయమునకు బలముగను, ఉత్సాహవంతముగను ఏర్పరచును. నిద్ర ప్రకృతి అందించిన వరము. నిదుర నుండి లేచిన మానవ ప్రజ్ఞ మరల బహిరంగమున ఉత్సుకతతో ప్రవేశించును. ఐదు ఇంద్రియముల ద్వారా, జననేంద్రియము ద్వారా, వాక్కు ద్వారా ఏడు విధములుగ ప్రజ్ఞ బహిర్గతమగుచు, జీవుడు నిర్వీర్యు డగుచుండును. క్రమముగ మరణము సమీపించును.
బలీయముగ బహిర్గతము లోనికి యింద్రియముల ద్వారా ప్రజ్ఞ ఏడు విధములుగ యీడ్చబడుచుండును. పశువును అన్ని విధములుగ బంధించి, బలీయముగ లాగుకు పోవునట్లు, మానవ ప్రజ్ఞ మేల్కాంచినది మొదలు బహిరంగమున చేరుటకు కారణము యింద్రియములు రుచి చూపించిన విషయములందు ఏర్పడిన అమితమగు ఆసక్తియే.
ఇట్టి ప్రజ్ఞ ప్రథమముగ వెనుకకు మరల్చబడవలెను. పురోగమించు ప్రజ్ఞకు తిరోగమనము కూడ సంకల్ప మాత్రమున కలుగవలెను. కళ్ళెములేని గుఱ్ఱమువలె పరిగెత్తు ప్రజ్ఞకు గంతల కళ్ళెము ఏర్పరచినట్లు వెనుకకు మరల్చ గల పటుత్వ మేర్పడవలెను. బహిరంగమున గల ఆసక్తిచే బహిరంగములోనికి తీరుబడిలేక ప్రజ్ఞ ప్రసార మగుచున్నది గదా! విషయములం దాసక్తియే దీనికి కారణము.
ఈ ఆసక్తి అనాసక్తిగా ఎట్లు మారగలదు? ఇంద్రియ విషయముల కన్న రుచికరమైన విషయము ఒకటున్నదని తెలియుట వలన, దానియందాసక్తి పెరుగుచుండుట వలన చిల్లర విషయములం దాసక్తి తగ్గుచు నుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 350 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
89. అధ్యాయము - 01
*🌻. హిమవంతుని వివాహము - 2 🌻*
ఆ పర్వతడు కులమును నిలబెట్టి, దర్మును వర్థిల్లజేయుట కొరకైన మరియు పితృదేవలతకు హితమును చేయుకోకికతో వివాహమాడగోరెను(21) ఓ మహర్షీ! ఆ సమయములో దేవతలు పూర్తాగా తమ స్వార్థమును మాత్ము తలబోసి , ప్రకాశస్వరూపులగు పితృదేవలతను సమీపించి, వారితో ప్రీతిపూర్వకముగా నిట్లనిరి(22)
దేవతలిట్లు పలికిరి|
ఓ పితృదేవతలారా! మారు ప్రీతితో గూడిన మనస్సు గలవారై, అందరు మా వాక్యమును వినుడు, మీకు దేవకార్యమును నెరవేర్చు కొరిక ఉన్నచో, మేము చెప్పిన తీరున శీఘ్రముగా ఆచరించపుడు(23) మంగళస్వరూపురాలు, మేనయను పేరుగలది అగు మీజ్యేష్ఠకుమార్తను హిమపత్వర్వతునకు ఇచ్చి ప్రీతి పుస్సనరముగా వివాహమును చేయుడు(24) ఇట్లు చేసినచో అందరికీ అన్ని గొప్పలాభములు కలుగగలవు. మరియు మీకు, దేవతలకు కూడా ప్రతి అడుగునందు దుఃకమలు తొలగిపోవును(25)
పితృదేవలు దేవతల ఈ మాటను విని, విమర్శిచుకొనివ, కుమార్తెల శాపమును స్మరించి, ఆ మాటకు తమ అంగీకారమును తెలిపిరి(26) వారు తమ కురమార్తయగు మేనను హివత్సరవ్వతునకిచ్చి యథావిదిగా వివాహమును చేసిరి. పరమ మంగళకరమగు ఆ వివాహములో గొప్ప ఉత్సవము ప్రవర్తిల్లేను(27) విష్ణవు మొదలగు దేవతలు, మరియు అందరు మహర్షులు వామ దేవుడగు శంకురుని మనసా స్మరివంచి ఆ వివామమునకు వచ్చిరి(28) వారు అనేక బహుమానములనిచ్చి ఉత్సవమును చేయించిరి. దివ్యులగు పితృదేతలను మరియు హివవంతుని అనేక కవిధముగా ప్రశంసించిరి(29)
దేవతలు, మరియు మహర్షులు అందరు మహానందరును పొందినవారై, ఉమాశివులను స్మరిచుకొనుచూచ, తమతమ నివాసములకు మరలి వెళ్లిరి(30) హివంతుడు అనేక బహుమానములను పొంది, ఆ సుందరిని చక్కగా వివాహమాడి తన భవలనుమకు వచ్చి ఆనందించెను(31)
బ్రహ్మ ఇట్లు పలికెను
ఓ మహర్షీ! హిమ వంతునికి మేనకతో జరిగిన దివ్యమైన, సుఖప్రదమైన వివాహమును ప్రీతితో వర్ణించి చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు?(32)
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సపంహిఆతయమందు మూడవది యగు పార్వతీ ఖండములో హిమవంతుని వివాహవర్ణమనే మొదటి అధ్యాయము ముగిసినది(1)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 102 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 7 - THE 15th RULE
*🌻 17. Seek out the way - 4 🌻*
392. When the final secret of this great lesson is told, in it is opened the mystery of the new way – a path which leads out of all human experience, and which is utterly beyond human perception or imagination. At each of these points it is needful to pause long and consider well. At each of these points it is necessary to be sure that the way is chosen for its own sake. The way and the truth come first, then follows the life.
393. A.B. – When the liberated soul has completed the stages of progress to Arhatship, and is passing onward to the first of the great Initiations beyond, he makes a choice from a variety of paths open to him. They are of the sacred number of seven – he has seven ways of choice before him.
People often say that at that point there can be only one possibility – that a man must choose to be a Master – the underlying idea being that if he decides rightly he will choose to return to help the world.
Such a decision recommends itself when humanity itself is thought of, but I must remind you that this is a hasty conclusion. A hint is thrown out as to the nature of the choice, where the note says.: “At each of these points it is necessary to be sure that the way is chosen for its own sake.”
The words “own sake” give the key. The choice is to be made for the sake of the way only. The fact that there are more ways than one, ought to prevent our laying down the law as to our choice; still more should it stop any person from using the words: “If he chooses rightly,” as if any one could choose wrongly when the soul is liberated.
394. Yet an idea – a very subtle one – runs through us, that we can dictate the choice. We sometimes find ourselves choosing for our own future – for the far-off future – what to be and what to do; and that is really the lower consciousness choosing for the higher. This subtle tendency runs through our life.
Part of our consciousness feels itself as the ‘I’, and naturally inclines to choose the path of the future as it looks at it, forgetting that it is thereby choosing for the higher consciousness, in whose hands alone the choice really lies. Making up your minds as to what is to be done at the close of the Arhat stage, would be like a child choosing his profession in life.
His selection, not being guided by knowledge, would certainly not be one that his mature judgment would approve. A young child can have no choice as to his career in the future, and it is the same in these matters. The higher ego will choose, without regard to the lower; indeed, the lower will perish before the choice comes.
All that is important to put before the lower, then, is the idea of service – of its being made an instrument to serve. Unless it does this it becomes an obstacle to the higher consciousness. Remember it can throw obstacles in the way of that consciousness; as has often been said, it crucifies the higher ego.
395. Another thing to remember is that we cannot judge of any stage of consciousness that we have not experienced, and of which we do not know the relative value. When thinking of a higher condition of consciousness that you have not experienced, there is no possibility of your being able to form any judgment about it. When you reach that state the universe alters for you, bringing about a change in your nature, and causing you to know how such consciousness can act.
You must experience this change before you can know. So in forming any opinion as to a path in the future, it is a case of judging a state of consciousness of which you have no knowledge, and your judgment is worthless.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 234 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. దేవలమహర్షి - 5 🌻*
24. ఉదాహరణకు ఒక కుక్కవచ్చి ఇతడికి కోపం తెప్పించవచ్చు. మనిషిదాకా అక్కరలేదు. ఊరికే పోతూపోతూ మీద ఒకరాయిని వేసి కోపం తెప్పించవచ్చు. తన తండ్రి మెడలో చనిపోయిన పామును పరీక్షిత్తువేస్తే, ఆ రాజును సపించాడు కొడుకు. అలా దేశాన్ని ఏలే రాజు శపించటం పాపమని చెప్పి బోధచేసాడు ఆ మహర్షి.
25. “శాపానుగ్రహశక్తి కలిగినటువంటి తపోబలం కలిగిన కొడుకుకు, తన తండ్రిని ఎవరో రాజు అవమానించాదని క్రోధం వచ్చిందంటే, నువ్వు ఏం తపస్వివి! నువ్వు ఏం బ్రాహ్మణుడివి? దేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రభువును చంపటం అంటే ఇక మనిషిని చంపటంకాదు.
26. రాజు తప్పు చేసినప్పిటికీ, ఆయనకు అపకారం చేసినట్లయితే, దేశంమొత్తానికే అపకారం చేసినట్లవుతుంది. కాబట్టి ఇంతటి మహాపాపం నీవు చేసావంటే, నీ శపాన్ని నీవు మళ్ళించుకోలేవు. నీవు అంత శక్తిమతుడివి కావు” అన్నాడు.
27. శాపం పెట్టడం శులభమే కాని, అనుగ్రహించి, తన శాపంవల్ల ముక్తి కలుగుతుందని చెప్పలేనివాడు, ఎప్పుడూకూడా శాపం ఇవ్వలేడు. అనేకచోట్ల మహర్షులు శాపమివ్వటం, ఉపసంహరించుకోవటం మొదలైన సంఘటనలు మనకు పురాణాలలో కనబడతాయి. అటువంటి మహర్షుల వాక్యాలుకూడా ఎన్నో ఉన్నాయి.
28. అంటే, శాపానుగ్రహశక్తులలో శాపాన్ని మళ్ళించుకునే శక్తిలేనివాడు శపించలేడని భావము. ఏ మంత్రం జపించినా, ఏ దేవతను ధ్యానంచేసినా, ప్రాణాయామంతో అంతో ఇంతో ఆరధనచేస్తే యత్కించిత్ సక్తి ఏదో వస్తుంది. అదికాస్తా యోగ్యుడిమీదకాని ఎటు మళ్ళించినాకూడా తపస్సు భంగంకలగడమేకాక, పాపంకూడా వస్తుంది.
29. తపస్సులో ఉన్నవాడికి – ఎవరినీకూడా ద్వేషించకుండా ఉండటము, ఆగ్రహంలేకుండా ఉండతము, ప్రధానంగా ఇంద్రియజం కలిగి ఉండటము ఎంతో ముఖ్యం. హృదయం నిండా శాంతి సుఖములు అనే అమృతాన్ని నింపుకుని వికారరహితమైన మనోవృత్తిని అవలంబించినవాడికే మోక్షలక్ష్మి లభిస్తుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 298 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 147. Forget all about physical disciplines in this connection and just be with that knowledge 'I am'. 🌻*
A large number of physical disciplines have been prescribed by many and in the end you have to select the one which you find suitable. But here the Guru tells us to forget all physical disciplines; he is saying something that is altogether different.
The Guru wants us to understand our sense of 'being' in its utmost purity and then just be with it. Understanding the knowledge 'I am' is important and so is abidance in it, together they form the 'Sadhana' (practice).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 173 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 11 🌻*
662. పరమముక్తుడు సృష్టికి పరుడనైన భగవంతుడు ననియు సృష్టి- స్థితి-లయ కారుడైన భగవంతుడు (ఈశ్వరుడు)ననియు సృష్టి యొక్క పరిమితులకు అతిశయించితిననియు అనుభూతి నొందుచుండును.
అనగా-
భగవంతుని దశ పాత్రలలో ప్రతి పాత్ర యందు ఎరుక కలిగియుండును. సృష్టి యొక్క దివ్య లీలలను పూర్తిగా ఆనందించును. బాధల ననుభవించును, (ప్రతి వారిలో), ప్రతి దానిలో నున్న భగవంతుడు తానేనని తనకు తెలియును.
కనుక ప్రతియొక్కరికి ఆధ్యాత్మికముగా సహాయము చేయు సమర్ధుడుడగును పై నాలుగు విధములలో ఏ రకము ముక్తి నైనను పొందునట్లు చేయును.అతడు నిజముగా ప్రత్యేకించి మానవ జాతికిని సార్వజనీనముగా సృష్టికిని సహాయము చేయును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 28 / Bhagavad-Gita - 28 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 28 🌴*
28. అర్జున ఉవాచ
దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సుం సముపస్థితమ్ | సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను :
ఓ కృష్ణా యుద్దోత్సాహముతో సమావేశమై యున్న ఈ జ్ఞాతులను చూచి, నా యొక్క శరీరావయములు కంపించుచున్నవి. నోరు కూడా ఎండి పోవుచున్నది.
🌻. భాష్యము :
శ్రీకృష్ణభగవానుని యెడ నిష్కపటమైన భక్తికలవాడెవడైనను దివ్యపురుషుల యందు లేదా దేవతల యందు గోచరించు సమస్త సద్గుణములను కలిగియుండును. కాని అభక్తుడైనవాడు విద్య మరియు సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకికయోగ్యతలను కలిగియున్నప్పటికి భగవద్గునములు లోపించియుండును.
తమలో తాము యుద్ధము చేయుటకు సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను గాంచినంతనే అర్జునుడు వారి యెడ దయపూర్ణ హృదయుడయ్యెను. తన సైనికులకు సంబంధించినంతవరకు అతడు వారి యెడ మొదటి నుండియు కరుణను కలిగియుండెను. అంతియేగాక ప్రతిపక్షపు సైనికుల ఎదను వారి నిశ్చయమైన మరణమును వీక్షించుచు కరుణాభావమును పొందెను.
అతడు ఆ విధముగా తలచుచుండ శరీరావయములు కంపించెను. నోరు ఎండిపోయెను. వారి యుద్దోత్సాహము గాంచి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యచకితుడయ్యెను. దాదాపు రాజవంశమంతయు (అర్జునుని రక్తసంబంధికులు) అతనితో యుద్ధము చేయ అరుదెంచెను. కరుణాపూర్ణుడైన అర్జునుని ఈ విషయము ఉద్విగ్నపరిచెను. ఇచ్చట తెలుపబడినప్పటికిని అతని శరీరావయములు కంపించుట, నోరు ఎండిపోవుటయే గాక అతడు కరుణాపూర్ణుడై రోదించుచుండెననియు ఎవరైనను ఊహించగలరు.
అర్జునుని యందలి ఇట్టి లక్షణములు అతని మృదుహృదయము వలననే కలిగినినవి గాని శక్తి హీనట వలన కాదు. అట్టి మృదుహృదయము శుద్ధభక్తుని ముఖ్యలక్షణము.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 28 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 1 - Vishada Yoga - 28 🌴*
28. arjuna uvāca
dṛṣṭvemaṁ sva-janaṁ kṛṣṇa
yuyutsuṁ samupasthitam*
sīdanti mama gātrāṇi
mukhaṁ ca pariśuṣyati
🌷. Translation :
Arjuna said: My dear Kṛṣṇa, seeing my friends and relatives present before me in such a fighting spirit, I feel the limbs of my body quivering and my mouth drying up.
🌻. Purport :
Any man who has genuine devotion to the Lord has all the good qualities which are found in godly persons or in the demigods, whereas the nondevotee, however advanced he may be in material qualifications by education and culture, lacks in godly qualities.
As such, Arjuna, just after seeing his kinsmen, friends and relatives on the battlefield, was at once overwhelmed by compassion for them who had so decided to fight amongst themselves. As far as his soldiers were concerned, he was sympathetic from the beginning, but he felt compassion even for the soldiers of the opposite party, foreseeing their imminent death.
And while he was so thinking, the limbs of his body began to quiver, and his mouth became dry. He was more or less astonished to see their fighting spirit. Practically the whole community, all blood relatives of Arjuna, had come to fight with him. This overwhelmed a kind devotee like Arjuna. Although it is not mentioned here, still one can easily imagine that not only were Arjuna’s bodily limbs quivering and his mouth drying up, but he was also crying out of compassion.
Such symptoms in Arjuna were not due to weakness but to his softheartedness, a characteristic of a pure devotee of the Lord.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 29 / Sri Lalita Sahasranamavali - Meaning - 29 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 29. భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |*
*మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా ‖ 29 ‖ 🍀*
🍀 74. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా -
భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించునది.
🍀 75. మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా -
మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతసించింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 29 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 29. bhaṇḍaputra-vadhodyukta-bālā-vikrama-nanditā |
mantriṇyambā-viracita-viṣaṅga-vadha-toṣitā || 29 || 🌻*
🌻 74 ) Banda puthra vadodyuktha bala vikrama nandhita -
She who was pleased by the valour of Bala devi(her daughter) in destroying the sons of Banda
🌻 75 ) Manthrinyamba virachitha vishangavatha Doshitha -
She who became happy at seeing Goddess Manthrini kill Vishanga(this ogre (brother of Banda) represents our desires for physical things)
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 29 / Sri Vishnu Sahasra Namavali - 29 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*కర్కాటక రాశి - పుష్యమి నక్షత్రం 1వ పాద శ్లోకం*
*🍀 29. సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః |*
*నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ‖ 29 ‖ 🍀*
🍀 265) సుభుజ: -
జగద్రక్షణము గావించు సుందరమైన భుజములు గలవాడు.
🍀 266) దుర్ధర: -
లోకములను ధరించి తనను ఒరులు ధరించేందుకు వీలుపడని భూమాతను ధరించినవాడు.
🍀 267) వాగ్మీ -
వేదజ్ఞానమును వెలువరించినవాడు.
🍀 268) మహేంద్ర: -
దేవేంద్రునకు కూడా ప్రభువైనవాడు.
🍀 269) వసుద: -
భక్తుల అవసరములను సకాలములో సమకూర్చువాడు.
🍀 270) వసు: -
తాను ఇచ్చు ధనము కూడా తానే అయినవాడు.
🍀 271) నైకరూప: -
ఒక రూపము లేనివాడై, అనేక రూపములు గలవాడు.
🍀 272) బృహద్రూప: -
బ్రహ్మాండ స్వరూపము గలవాడు.
🍀 273) శిపివిష్ట: -
సూర్యునియందలి కిరణ ప్రతాపము తానైనవాడు.
🍀 274) ప్రకాశన: -
సర్వమును ప్రకాశింప చేయువాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 29 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Karkataka Rasi, Pushyami 1st Padam*
*🌻 29. subhujō durdharō vāgmī mahendrō vasudō vasuḥ |*
*naikarūpō bṛhadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ || 29 ||*
🌻 265. Subhujaḥ:
One possessing excellent arms that protect the worlds.
🌻 266. Durdharaḥ:
One who holds up the universe – a work which none else can do.
🌻 267. Vāgmi:
One from whom the words constituting the Veda come out.
🌻 268. Mahendraḥ:
The great Lord, that is, the Supreme Being, who is the God of all gods.
🌻 269. Vasudaḥ:
One who bestows riches.
🌻 270. Vasuḥ:
One who is himself the Vasu.
🌻 271. Naikarūpaḥ:
One who is without an exclusive form.
🌻 272. Bṛhadrūpaḥ:
One who has adopted mysterious forms like that of a Boar.
🌻 273. Śipiviṣṭaḥ:
Shipi means cow. One who resides in cows as Yajna.
🌻 274. Prakāśanaḥ:
One who illumines everthing.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విశ్వాసంతో సంతోషంగా ఉండడమే చేయవలసింది. రక్షణకు ఇదే మార్గము 🌹*
*✍️. శ్రీ శ్రీ పరమహంస యోగానంద*
*👂. Whispers From Eternity*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*"గురుదేవా, నేనొక కష్టంలో ఉన్నప్పుడు నీ కంఠస్వరం ఇలా వినిపించింది:"*
*నా రక్షణ -- భానుడు నీ ఉజ్జ్వల గడియలలోనూ, అంధకారమయ గడియలలోనూ సమానంగానే ప్రకాశిస్తాడు. విశ్వాసం ఉంచి చిరునవ్వుతో ఉండు. విచారంగా ఉండడం ఆనంద స్వరూపమైన ఆత్మకు ద్రోహం చేయడమే.*
*జీవితాన్ని మార్చెయ్యగల నా కాంతిని చిరునవ్వుల పారదర్శకత ద్వారా వ్యక్తమవనీ. నా బిడ్డా, నీవు ఆనందంగా ఉండడం వల్ల నేను సంతుష్టుణ్ణవుతాను.*
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఆధ్యాత్మికసందేశాలు
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment