భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 234


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 234 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. దేవలమహర్షి - 5 🌻


24. ఉదాహరణకు ఒక కుక్కవచ్చి ఇతడికి కోపం తెప్పించవచ్చు. మనిషిదాకా అక్కరలేదు. ఊరికే పోతూపోతూ మీద ఒకరాయిని వేసి కోపం తెప్పించవచ్చు. తన తండ్రి మెడలో చనిపోయిన పామును పరీక్షిత్తువేస్తే, ఆ రాజును సపించాడు కొడుకు. అలా దేశాన్ని ఏలే రాజు శపించటం పాపమని చెప్పి బోధచేసాడు ఆ మహర్షి.

25. “శాపానుగ్రహశక్తి కలిగినటువంటి తపోబలం కలిగిన కొడుకుకు, తన తండ్రిని ఎవరో రాజు అవమానించాదని క్రోధం వచ్చిందంటే, నువ్వు ఏం తపస్వివి! నువ్వు ఏం బ్రాహ్మణుడివి? దేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రభువును చంపటం అంటే ఇక మనిషిని చంపటంకాదు.

26. రాజు తప్పు చేసినప్పిటికీ, ఆయనకు అపకారం చేసినట్లయితే, దేశంమొత్తానికే అపకారం చేసినట్లవుతుంది. కాబట్టి ఇంతటి మహాపాపం నీవు చేసావంటే, నీ శపాన్ని నీవు మళ్ళించుకోలేవు. నీవు అంత శక్తిమతుడివి కావు” అన్నాడు.

27. శాపం పెట్టడం శులభమే కాని, అనుగ్రహించి, తన శాపంవల్ల ముక్తి కలుగుతుందని చెప్పలేనివాడు, ఎప్పుడూకూడా శాపం ఇవ్వలేడు. అనేకచోట్ల మహర్షులు శాపమివ్వటం, ఉపసంహరించుకోవటం మొదలైన సంఘటనలు మనకు పురాణాలలో కనబడతాయి. అటువంటి మహర్షుల వాక్యాలుకూడా ఎన్నో ఉన్నాయి.

28. అంటే, శాపానుగ్రహశక్తులలో శాపాన్ని మళ్ళించుకునే శక్తిలేనివాడు శపించలేడని భావము. ఏ మంత్రం జపించినా, ఏ దేవతను ధ్యానంచేసినా, ప్రాణాయామంతో అంతో ఇంతో ఆరధనచేస్తే యత్కించిత్ సక్తి ఏదో వస్తుంది. అదికాస్తా యోగ్యుడిమీదకాని ఎటు మళ్ళించినాకూడా తపస్సు భంగంకలగడమేకాక, పాపంకూడా వస్తుంది.

29. తపస్సులో ఉన్నవాడికి – ఎవరినీకూడా ద్వేషించకుండా ఉండటము, ఆగ్రహంలేకుండా ఉండతము, ప్రధానంగా ఇంద్రియజం కలిగి ఉండటము ఎంతో ముఖ్యం. హృదయం నిండా శాంతి సుఖములు అనే అమృతాన్ని నింపుకుని వికారరహితమైన మనోవృత్తిని అవలంబించినవాడికే మోక్షలక్ష్మి లభిస్తుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


16 Feb 2021


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద



🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹

www.facebook.com/groups/chaitanyavijnanam/

https://t.me/ChaitanyaVijnanam

No comments:

Post a Comment