🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 211 / Sri Lalitha Chaitanya Vijnanam - 211 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖
🌻 211. 'మృడప్రియా' 🌻
మృడునకు ప్రియురాలు శ్రీమాత అని అర్థము.
మృడుడనగా శివుడు, పరమ శివుడు. మట్టి యందు కూడ నుండువాడు గనుక మృడు డనిరి. మృడ మనగా మట్టి. మట్టి, బంగారము అను భేదము మానవ మస్తిష్కమునకే గాని, సృష్టి యందు మరెక్కడనూ లేదు.
శివునకు మట్టియు బంగారము ఒక్కటియే. శివతత్త్వ మెరిగినవారికి కూడ నంతియే. శివతత్త్వము పరిపూర్ణముగ నెరిగినది శ్రీమాతయే. మట్టియందుండుటకు శివు డంగీకరించినపుడు మట్టిగ శ్రీమాత రూపము దాల్చినది. అందులకే శివునికి ప్రియురాలు.
పరమ పవిత్రమగు దివ్య చైతన్యము నుండి మట్టి వఱకు కూడ రూపు దాల్చగలదు. "సమానత్వము, సమానత్వము” అనుచూ కేకలు పెట్టువారికి శివా శివుల సమానత్వము ఏమి తెలియగలదు? అనాదిగ మట్టితో లింగముచేసి ఆరాధించుట వాడుకలో గలదు. స్ఫటిక లింగమని, రసలింగమని, నర్మద బాణమని, చిత్త భ్రమలు కలవారికి శివాశివు లందరు.
పురాణ కథలలో ఏ దేవత ఆరాధన అయిననూ మట్టితోగాని, రాగితోగాని, వెండితోగాని, బంగారముతోగాని ప్రతిమను చేయుడని తెలుపబడినది. మట్టికే ప్రాధాన్యత. మట్టి యందు కూడ మాత వున్నదని చూసిన వెంటనే గోచరించినపుడు శ్రీమాత అనుగ్రహము కలదని తెలియవలెను.
భౌతిక లోకమున దేహములన్నియూ మట్టితోనే చేయబడినవి. గోలోకము నుండి అవరోహణ క్రమములో భూలోకము ఎనిమిదవది. మట్టితో కూడిన దేహము నందున్న జీవులు ఎనిమిది లోకముల సుఖములను అనుభవించుటకు అవకాశము కలిగి యుందురు.
దివ్యలోక వాసులగు దేవతలు కూడ పరిపూర్ణ సుఖానుభూతికి అపుడపుడు భౌతిక దేహమును దాల్చుదురని పురాణములు తెలుపు చున్నవి. ఉదాహరణకు మామిడిపండు భుజించవలెనన్నచో భౌతిక దేహము లేనివాడు భుజింపగలడా? ఇట్టి పరిపూర్ణ సుఖము నందించు టకే శ్రీమాత మట్టి రూపమును కూడ ప్రియముతో దాల్చును. ఆమె మృడప్రియ.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 211 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mṛḍapriyā मृडप्रिया (211) 🌻
Śiva is also known as Mṛḍan, His sattvic form. Since She likes Śiva, She is called Mṛḍapriyā. Mṛḍa means happiness, a quality of sattva guṇa, showing compassion or mercy, gracious and priyā means dear. This nāma means that Śiva caresses this universe and as His wife, She loves this act of Śiva. After all, She is the Supreme Mother.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
No comments:
Post a Comment