2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 311 🌹
3) 🌹. శివ మహా పురాణము - 509🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -139🌹
5) 🌹 Osho Daily Meditations - 128🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 342-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 342-2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 24, జనవరి 2022*
*మీకు ఈ రోజు కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. రుద్రనమక స్తోత్రం - 8 🍀*
*15. అవతత్య ధనుశ్చత్వం సహస్రాక్ష శతేషుధే!*
*ముఖానిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ!!*
*16. విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి!*
*అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః!!*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ షష్టి 08:45:10 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: హస్త 11:15:56 వరకు
తదుపరి చిత్ర
యోగం: సుకర్మ 11:12:13 వరకు
తదుపరి ధృతి
కరణం: వణిజ 08:43:10 వరకు
సూర్యోదయం: 06:49:18
సూర్యాస్తమయం: 18:06:55
వైదిక సూర్యోదయం: 06:53:05
వైదిక సూర్యాస్తమయం: 18:03:08
చంద్రోదయం: 23:44:03
చంద్రాస్తమయం: 11:06:10
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కన్య
వర్జ్యం: 19:08:20 - 20:43:00
దుర్ముహూర్తం: 12:50:42 - 13:35:52
మరియు 15:06:13 - 15:51:23
రాహు కాలం: 08:14:01 - 09:38:43
గుళిక కాలం: 13:52:49 - 15:17:31
యమ గండం: 11:03:25 - 12:28:07
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 05:13:45 - 06:50:05
మరియు 28:36:20 - 30:11:00
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 11:15:56
వరకు తదుపరి ముద్గర యోగం - కలహం
పండుగలు : లేదు.
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -311 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 21 -4 📚*
*🍀 21-4. జనన మరణ చక్రము - భగవద్గీత మార్గమున శ్రేయస్సు నుద్దేశించి, కర్తవ్యము నాచరించుటయే యున్నది గాని, పుణ్యమును భోగమును ఆశించుట బోధింప బడలేదు. కామ్యకర్మ ప్రోత్సహింప బడలేదు. కర్తవ్య కర్మే నిర్దేశింప బడినది. కర్తవ్య కర్మమునే స్వధర్మమని, కార్యం కర్మయని భగవానుడు పేర్కొనినాడు. కర్తవ్యాచరణము నందే శ్రేయస్సున్నది. ఫలముల నాశ్రయించక, కర్తవ్యమునే నిర్వర్తించమని (అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియః) భగవానుడు నిర్దిష్టముగ తెలిపినాడు. అట్టివాడు జనన మరణ చక్రము నుండి విముక్తి చెంది శాశ్వత ధర్మపథమందు శాశ్వతుడై జీవించును. 🍀*
*21. తే తం భుక్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |*
*ఏవం త్రయీధర్మ మమప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||*
*తాత్పర్యము : దివ్యలోకములందు విస్తృతముగ దివ్య భోగానుభవము అనుభవింపగనే, చేసిన పుణ్యము క్షీణించుట వలన మరల జీవులు మర్త్యలోకములందు ప్రవేశించుచున్నారు. అర్థకామములను ధర్మము నాశ్రయంచి పొందుచున్నవారు ఇట్లు స్వర్గలోకమునకు, మర్త్యలోకమునకు నడుమ రాకపోకలను పొందుచు నున్నారు.*
*వివరణము : దైవయోగము నాశ్రయించిన వారు జీవులలో కొందరే. ఇతరులు భోగాసక్తులై కామాభిలాషులై రాకడ, పోకడగల జనన మరణ చక్రమున తీరుబడి లేక, అనంత కాలము తిరుగాడు చుందురని భగవానుడు తెలుపుచున్నాడు. పుణ్యమాశించి పనిచేయుట అవివేకము. భగవద్గీత మార్గమున శ్రేయస్సు నుద్దేశించి, కర్తవ్యము నాచరించుటయే యున్నది గాని, పుణ్యమును భోగమును ఆశించుట బోధింపబడ లేదు. కర్తవ్యము నందే జీవున కధికారమున్నది గాని, ఫలము నందు లేదని దైవము స్పష్టముగ తెలిపినాడు.*
*భగవద్గీత యందు కామ్యకర్మ ప్రోత్సహింప బడలేదు. కర్తవ్య కర్మే నిర్దేశింప బడినది. కర్తవ్య కర్మమునే స్వధర్మమని, కార్యం కర్మయని భగవానుడు పేర్కొనినాడు. కర్తవ్యాచరణము నందే శ్రేయస్సున్నది. ఫలముల నాశ్రయించక, కర్తవ్యమునే నిర్వర్తించమని (అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియః) భగవానుడు నిర్దిష్టముగ తెలిపినాడు. అట్టివాడు జనన మరణ చక్రము నుండి విముక్తి చెంది శాశ్వత ధర్మపథ మందు శాశ్వతుడై జీవించును. కోర్కెలు తీర్చుకొను మార్గమున జన్మల తరబడి శ్రమించుట కన్న, దైవమును చేర్చు యోగమార్గమును ఆశ్రయించుట ఉత్తమమని తెలియవలెను. కోరికలకై దైవమును ప్రార్థించుటగ కాక, దైవము కొరకే దైవమును ప్రార్థించుట ఋషి మార్గము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 509 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 43
*🌻. శివుని అద్భుత లీల - 1 🌻*
ఓ మునీ! ఎవని కొరకై పార్వతి ఉత్తమమగు తపస్సును చేసినదో, అట్టి గిరిజాపతి యగు శివుని రూపము ఎట్లుండునో మున్ముందుగా చూడగోరుచున్నాను (1).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మునీ! మూర్ఖురాలగు ఆమె నీతో బాటు శివుని చూచుట కొరకై వెంటనే ప్రాసాదము యొక్క పై భాగమునకు వచ్చెను (2). ఆమె యందు గల అహంకారము నెరింగి శివ ప్రభుడు అద్భుత లీలను ప్రదర్శించ గోరి విష్ణువును, నన్ను ఉద్దేశించి ఇట్లు పలికెను (3).
శివుడిట్ల పలికెను-
కుమారులారా! మీరిద్దరు దేవతలతో గూడి వేర్వేరుగా హిమవంతుని గృహద్వారము వద్దకు వెళ్లుడు. మేము తరువాత వచ్చెదము (4).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఈ మాటను విని విష్ణువు అందరినీ పిలిచి వివరించెను. అప్పుడు తన్మయులై యున్న దేవతందరు అదే తీరున ఉత్సాహముతో శీఘ్రముగా ముందుకు సాగిరి (5). ఓ మునీ! ప్రాసాదము యొక్క అగ్రభాగమున నీతో కలిసి ఉన్న మేనకు గుండె జారిపోవు విధముగా విశ్వేశ్వరుడు తన రూపపమును ప్రదర్శించెను (6). ఓ మునీ! ఈ సమయములో మేనకా దేవి శుభకరమగు ఆ సేనను చూచి సామాన్యముగా హర్షమును పొందెను (7). సుందరులు, సౌభాగ్యవంతులు అగు గంధర్వులు శుభవస్త్రములతో ప్రకాశిస్తూ అనేకములగు భూషణములనలంకరించుకొని మున్ముందుగా వచ్చిరి (8).
వారు అనేక వాహనములలో ముందుకు సాగుతూ, అనేక వాద్యములను మ్రోయించుచుండిరి. వారి వాహనములపై రంగుల రంగుల జెండాలు ఉండెను. వారితో బాటు అప్సరసల గణములు కూడ ఉండెను (9). అపుడు వారికి పరమ ప్రభుడగు వసువును చూచి మేన ఆనందించినదై 'ఈతడే శివుడు' అని పలికెను (10). ఓ మహర్షీ! నీవు అపుడు ఆమెతో 'వీరు శివుని సేవకులు. ఈతడు పార్వతీ పతియగు శివుడు కాడు' అని చెప్పి యుంటివి (11). ఆ మాటను విని మేన అపుడు 'ఇంత కంటె గొప్పవాడగు శివుడు ఎట్లుండునో?' అని ఆలోచించ మొదలిడెను (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 139 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. సదవగాహన - 3 🌻*
*తోటి మానవులతో సత్సంబంధములు త్రెంచివేయు అంశములలో జుగుప్స తర్వాత ఎన్నదగినది "ఆత్మన్యూనతా భావము". దీని వలన నరుడు సంతోషమును చంపుకొనును. ఇతరులతో వ్యవహరించు నపుడు, ఈ న్యూనతాభావమను రంగుటద్దపు జోడుతో చూచును. అవగాహన వక్రమగును.*
*తన కన్నా అధికులని తాను తలంచువారిపై తిరుగుబాటు చేయ మనస్సు ఉద్రేకించును. ఇతరులలోని ఉన్నత విషయములను గుర్తింప నిరాకరించును.*
*నిజమునకు, తాను సాధింపదలచిన లక్ష్యము యొక్క స్థాయి కంటే తమ స్థాయి గొప్పదను ఎరుకయే ఈ న్యూనతకు హేతువగుచున్నది. ఆధ్యాత్మిక సాధనా యాన పథమున కొంతకాలము ఓటములు తాకక తప్పదు. అంతమాత్రము చేత, సాధకుడు తనను తాను అవమానింపబనిలేదు. నిస్పృహుడు కానక్కరలేదు.*
.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 128 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 128. ASLEEP IN A TRAIN 🍀*
*🕉 Just the other day I was reading a sentence of Jean-Paul Sartre. He says that life is like a child who is asleep in a train and is awakened by an inspector who wants to check the ticket, but the child has no ticket and no money to pay for one. 🕉*
*The child is also not at all aware of where he is going, what his destination is and why he is on the train. And last but not the least, the child cannot figure it out, because he never decided to be on the train in the first place. Why is he there? This situation is becoming more and more common to the modern mind, because we are somehow uprooted, and meaning is missing. One simply feels, "Why? Where am I going?" You don't know where you are going, and you don't know why you are in the train. You don't have a ticket and you don't have the money to pay for it, and still you cannot get out of the train. Everything seems to be chaos, maddening.*
*This has happened because the roots in love have been lost. People are living loveless lives, somehow pulling themselves along. So what to do? I know that everybody one day feels like a child in a train. Yet life is not going to be a failure, because in this big train there are millions of people fast asleep, but there is always somebody who is awake. The child can search and find somebody who is not asleep and snoring, someone who has consciously entered the train, someone who knows where the train is going. Being in the vicinity of that person, the child also learns the ways of becoming more conscious.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 342-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 342 -2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*
*🌻 342-2. 'క్షేత్రేశీ' 🌻*
మహాభారత యుద్ధమున పాండవులకు ప్రకృతి అనుకూలమై నిలచినది. దుర్యోధనాదులకు ప్రతికూలమై నిలచినది. భీముడు ప్రార్థించగ వాయుపుత్రుడైన హనుమంతుడు యుద్ధమున పాండవులకు వాయు సహకారము నందించెను. దానితో పాండవసేనలు ప్రయోగించిన ఆయుధములకు బలము ఇనుమడింపగ ధార్తరాష్ట్రులు ప్రయోగించిన ఆయుధముల బలము వాయువుచే ప్రతిఘటింపబడి బలహీనములైనవి. అట్లే రామ రావణ యుద్ధము నందు కూడ రామునికి ప్రకృతి అనుకూలమై నిలచినది.
ఇట్లు ప్రకృతి అనుకూలమున సజ్జనులు పురోభివృద్ధి సాధించగ, దుర్జనులు నశింతురు. ప్రకృతి శ్రీమాత అధీనమున నుండును గనుక శ్రీమాత ఆరాధనమున అటు దైవము, ఇటు ప్రకృతి కూడ అనుకూలించి భక్తులు వైభవముతో నుందురు. మహా వైభవము గల యోగులందరూ శ్రీమాత భక్తులే. యోధులలో కూడ చక్రవర్తులు శ్రీమాత భక్తులే.
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 342-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻*
*🌻 342-2. Kṣtreśī क्ष्त्रेशी (342) 🌻*
Wife of Kṣetrajña (Śiva) is Kṣtreśī (Śaktī). It is like Bhairava and Bhairavī. It must always be remembered that there is no difference between Śiva and Śaktī. Or it may also be said that She is the Īśvarī of all kṣetra-s (possible extension of the previous nāma).
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹