మైత్రేయ మహర్షి బోధనలు - 62
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 62 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 48. మాయ 🌻
సాధనలో లోతులు పొందినవారు కూడ కష్ట సమయముల యందు ఒంటరితనము ఆనుభవింతురు. సద్గురు బోధనలన్నీ అసత్యము లనిపించును. గురువులు గురుపరంపర తాము ఏర్పరచుకొన్నదే కాని నిజమునకు లేవనిపించును. రకరకములైన అభిప్రాయములు గడ్డు సమయములలో క్రమ్ముకొని తెలిసిన విషయమును జ్ఞానమును) కప్పివేయును, తన కెవ్వరూ లేరని, తనవారెవ్వరూ లేరని; బోధనలు, ప్రార్థనలు అక్కరకు రావని- దివ్య సహాయము వట్టిమాట యని- అంతయూ శుష్క వేదాంతమని అనిపించును. పై భావములు కలుగుటకు కారణము మాయ.
మాయావరణములో జీవులుండుటచే మాయ బలపడి నప్పుడెల్ల జీవుడు నిస్సహాయుడిగ బాధపడును. మాయ పలుచబడినపుడు తాను శక్తివంతుడుగ భావించును. మాయ చాల విచిత్రముగ మెదడును స్పృశించగలదు. యుగయుగముల నుండి మాయయే సృష్టిని నడిపించు చున్నది. మాయకున్న అనుభవము జీవునికి లేదు. మాయలో నున్నవానికి తనను మాయ కప్పినదని తెలియకపోవుటయే మాయ. ఇది మాయాదేవి నేర్పరితనము. మాయకు నమస్కరించి దారి చూపు మనినచో దారి చూపగలదు. తెలిసి మాయలో బడుటకన్న సృష్టిలో అద్భుతమేమియును లేదు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
23 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment