నిర్మల ధ్యానాలు - ఓషో - 126
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 126 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మన నిజమైన ఇల్లు అవతలి తీరంలో వుంది. మన మిక్కడున్నది ఎదగడానికి, అనుభవం పొందడానికి, పరిణితి చెందడానికి, కాబట్టి మనం ఆవలి తీరాల్ని ఆమోదించాలి. నీ జీవితం బహుముఖ కోణాల్లో విస్తరించనీ, కానీ ఇది నీ యిల్లు కాదు. కాబట్టి దేన్నీ సొంతం చేసుకోవాలనుకోకు. 🍀
మనమంతా ఈ ప్రపంచానికి అపరిచితులం. మన నిజమైన ఇల్లు అవతలి తీరంలో వుంది. మన మిక్కడున్నది ఎదగడానికి, అనుభవం పొందడానికి, పరిణితి చెందడానికి, కాబట్టి మనం ఆవలితీరాల్ని ఆమోదించాలి. మనం పిల్లల్ని ఎలా స్కూలుకు పంపిస్తారో అలా ఇక్కడికి వచ్చాం. ఇది చదువుకునే స్థలం. ఇది మన ఇల్లు కాదు. మనం యిక్కడ ఎంత వీలయితే అంత చదువుకోవాలి. ఎంత వీలయితే అంత తెలుసుకోవాలి. వీలయినంత గాఢమయిన అనుభవాల్ని అందుకోవాలి. నీ జీవితం బహుముఖ కోణాల్లో విస్తరించనీ, కానీ ఒక సంగతి గుర్తు వుంచుకో. ఇది నీ యిల్లు కాదు.
కాబట్టి అనుబంధాన్ని ఏర్పరచుకోవద్దు. దేన్నీ సొంతం చేసుకోవాలనుకోకు. దేనికీ అతుక్కుపోవద్దు. అట్లా అయితే అవతలి తీరాన్ని ఎలా చేరుతావు. సాయంత్రమయితే పసివాడు ఇంటివేపు సాగుతాడు. రోజంతా స్కూల్లో వుంటాడు. సాయంత్రం ఇంటి వేపు మళ్ళుతాడు. స్కూలు తప్పనిసరి. స్కూలు లేకుంటే అతని ఎదుగుదల వుండదు. బాధలతో, ఆనందాలతో వివేకంతో, తెలివితక్కువతనంతో వీటన్నిటి గుండా మెల్ల మెల్లగా సమతూకాన్ని అందుకుంటాం. కేంద్రానికి చేరుతాం. ఎన్నెన్నో దశల గుండా సాగుతాం. ఆవలి తీరం నించీ పడవ వచ్చేసరికి మనం అన్ని విధాల సిద్ధపడి వుంటాం. మనం సిద్ధపడి వుంటేనే పడవ వస్తుంది. లేని పక్షంలో మనం మళ్ళీ మళ్ళీ స్కూలుకు వెళ్ళాలి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
23 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment