🌹 'శ్రీరామ' అనే దివ్య నామ స్మరణతో ఆరుగురు దేవతల ఆశీస్సులు లభిస్తాయని మీకు తెలుసా ?. 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Did you know that by chanting the divine name 'Shri Rama', you can get the blessings of six gods? 🌹
Prasad Bharadwajaశ్రీరామ నామం ఎంతో మధురం.. అని అంటూ ఉంటారు. కొందరు రామకోటి రాస్తూ శ్రీరాముడి ఆశీస్సులు పొందుతారు. శ్రీరామ అంటే కేవలం విష్ణు మాత్రమే కాదని సకల దేవతలు ఈ నామంలో ఉన్నాయని ఇప్పటికే చాలామంది ఆధ్యాత్మిక వాదులు పేర్కొన్నారు.
అయితే కొన్ని గ్రంథాలు, పురాణాల ప్రకారం ఈ నామములో ఆరుగురు దేవతలు కొలువై ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు శ్రీరామ నామ జపం చేయడం వల్ల ఆరుగురు దేవతలను పూజించినట్లు అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా సమస్యలు, బాధలు ఉన్నప్పుడు శ్రీరామ నామం జపం చేయడం వల్ల అవి తొలగిపోతాయని కూడా చెబుతున్నారు. అసలు శ్రీరామ నామం లో ఉన్న ఆరుగురు దేవతలు ఎవరు? వారి పేర్లు ఏంటి?
శ్రీరామ అనగానే మనకు విష్ణువు అవతారమైన రాముడు గురించి మాత్రమే చర్చించుకుంటాం. కానీ శ్రీరామ అనే పదాన్ని మాత్రం ఆలయాలకు వెళ్లినప్పుడు పలుకుతూ ఉంటాం. అయితే శ్రీరామ అనే పేరును పలకడం రాముడిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా ఆరుగురు దేవతలను స్మరించడం అని అంటున్నారు.
శ్రీరామ లో.. మొదటి శ్రీ అంటే లక్ష్మి తత్వం. శ్రీరామ నామంలో మొదటి అక్షరం సంపద, శాంతి, శ్రేయస్సు ప్రసాదించే లక్ష్మీదేవత ఉన్నట్లు చెబుతారు.
శ్రీరామ లో.. ర అంటే రుద్రశక్తి. శివుడి తత్వాన్ని ఈ అక్షరం సూచిస్తుంది. రామ నామంలో కూడా శివుడు కొలువై ఉన్నాడని ఈ పదం తెలుపుతుంది.
శ్రీరామ లో.. ర+అ=రా.. అంటే ఇందులో ఆ అక్షరం అగ్ని దేవుడిని సూచిస్తుంది. ప్రతి కార్యక్రమంలో అగ్ని దేవుడిని కొలుస్తుంటాం. శుద్ధి శక్తికి ప్రత్యేకగా అగ్నిదేవుడని కొలుస్తూ ఉంటాం. శ్రీరామ నామం జపించినప్పుడు అగ్నిదేవుడు కూడా ఉంటాడు.
శ్రీరామ లో.. చివరి అక్షరం మ లో ముగ్గురు దేవతలు కొలువై ఉన్నట్లు తెలుపుతున్నారు. అంటే బ్రహ్మ, విష్ణు తో పాటు ఆదిశక్తి స్వరూపిణి కూడా ఈ అక్షరం లో ఉన్నట్లు చెబుతారు.
ఇలా శ్రీరామలో ఆరుగురు దేవతలు ఉండడంవల్ల ప్రతిసారి శ్రీరామ అనే నామం జపించడం వల్ల వీరు సంతోషిస్తారని అంటున్నారు. వీరితోపాటు శ్రీరామ అని పేరు చెప్పగానే ముందుగా స్పందించేది హనుమంతుడు. విష్ణు సేవ కోసం శివుడే హనుమంతుడి రూపం లో వచ్చాడని కొన్ని పురాణాల్లో ద్వారా తెలుస్తుంది. అయితే శివుడితోపాటు పార్వతీ కూడా వస్తానని అంటుంది. కానీ హనుమంతుడు బ్రహ్మచర్య రూపం వల్ల పార్వతికి అడ్డు చెబుతాడు. అయినా కూడా శ్రీరామ అనే పదంలో ఆదిశక్తి స్వరూపిణి కొలువై ఉంటుందని శ్రీరామ నామం అనే పదం ద్వారా తెలుస్తుంది. ప్రతిరోజు మంచి మనసుతో కొన్నిసార్లు శ్రీరామ నామం జపించడం వల్ల ఈ దేవతల ఆశీస్సులు ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శ్రీరామ నామం జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి అనుకున్న పనులు కూడా పూర్తవుతాయని చెబుతున్నారు.
🌹🌹🌹🌹🌹