అశ్వినీ దేవతల స్తోత్రం - చరిత్ర, విశిష్టత - Hymn to the Ashwini Devas



https://youtu.be/Gtc7-wLrfrk


🌹 అశ్వినీ దేవతల స్తోత్రం - చరిత్ర, విశిష్టత - Hymn to the Ashwini Devas - History, Specialties 🌹

🍀🎥 పరిపూర్ణ ఆరోగ్యం, శరీర పటిష్టత, మానసిక శాంతి కొరకు తప్పక వీక్షించండి. 🎥 🍀
🍀🎥 Must watch for perfect health, physical strength, and mental peace. 🎥 🍀


గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ
Sung, Composer: Prasad Bharadwaja



🌹🌹🌹🌹🌹



అశ్వినీ దేవతా స్తోత్రం Ashwini Devata Stotram


🌹 అశ్వినీ దేవతా స్తోత్రం 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Ashwini Devata Stotram 🌹
Prasad Bharadwaja


అశ్విని దేవతలు శ్రీ సూర్యభగవానుని పుత్రులు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.

The Ashwini Devatas are the sons of Lord Surya. They are called the Tathastu Devatas.



1) ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానూ గిరా వాం శంసామి తపసా హ్యనంతౌ !

దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానావధిక్షిపంతౌ భువనాని విశ్వా !!



2) హిరణ్మయౌ శకునీ సాంపరాయౌ నాసత్యదస్రౌ సునసౌ వైజయంతీ !

శుక్లం వయంతౌ తరసా సువేమావధి వ్యయంతావసితం వివస్వతః !!



3) గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికామ ముంచతావశ్వినౌ సౌభగాయ !

తావత్సువృత్తా వనమంతమాయయావసత్తమా గా అరుణా ఉదావహత్ !!



4) షష్టిశ్చ గావస్త్రిశతాశ్చ ధేనవ ఏకం వత్సం సువతే తం దుహంతి !

నానాగోష్ఠా విహితా ఏకదోహనాస్తావశ్వినో దుహతో ధర్మముక్థ్యం !!



5) ఏకాం నాభి సప్తశతా అరాః శ్రితాః ప్రధిష్వన్యా వింశతిరర్పితా అరాః !

అనేమిచక్రం పరివర్తతేఽజరం మాయాశ్వినౌ సమనక్తి చర్షణీ !!



6) ఏకం చక్రం వర్తతే ద్వాదశారం షణ్ణాభిమేకాక్షమమృతస్య ధారణం !

యస్మిందేవా అధివిశ్వే విషక్తాస్తావశ్వినౌ ముంచతో మా విషీదతం !!



7) ఆశ్వినావిందు మమృతం వృత్తభూయౌ తిరోధత్తామశ్వినౌ దాసపత్నీ !

హిత్వా గిరిమశ్వినౌ గాముదాచరంతౌ తద్వృష్టిమహ్నాత్ప్రథితౌ బలస్య !!



8) యువాం దిశో జనయథో దశాగ్రే సమానం మూర్ధ్ని రథయానం వియంతి !

తాసాం యాతమృషయోఽనుప్రయాంతి దేవా మనుష్యాః క్షితిమాచరంతి !!



9) యువాం వణాన్వికురుథో విశ్వరూపాంస్తేఽధిక్షియంతే భువనాని విశ్వా !

తే భానవోఽప్యనుసృతాశ్చరంతి దేవా మనుష్యాః క్షితిమాచరంతి !!



10)తౌ నాసత్యావశ్వినౌ వాం మహేఽహం స్రజం చ యాం బిభృథః పుష్కరస్య !

తౌ నాసత్యావమృతావృతావృధావృతే దేవాస్తత్ప్రమదే న సూతే !!



11) ముఖేన గర్భం లభతాం యువానౌ గతాసురేతత్ప్రపదేన సూతే !

సద్యో జాతో మాతరమత్తి గర్భస్తావశ్వినౌ ముంచథో జీవసే గాం !!



12) స్తోతుం న శక్నోమి గుణైభర్వంతౌ చక్షుర్విహీనః పథి సంప్రమోహః !

దుర్గేఽహమస్మిన్పతితోఽస్మి కూపే యువాం శరణ్యౌ శరణం ప్రపద్యే !!



ఇతి శ్రీమన్మహాభారత ఆదిపర్వణ్యశ్వినీకుమారస్తోత్రం సంపూర్ణం.

🌹 🌹 🌹 🌹 🌹

మహిషాసురమర్దిని అవతారం వారణాసి Mahishasura Mardhini Avataar in Varanasi (a YT Short)



https://youtube.com/shorts/aLYuzRCt8zo


🌹🔱 మహిషాసురమర్దిని అవతారం వారణాసి

Mahishasura Mardhini Avataar in Varanasi 🔱🌹


ప్రసాద్ భరద్వాజ


(a YT Short)



Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam





అశ్వినీ దేవతలు - తధాస్తు దేవతలు Ashwini Deities - Tadastu Deities


🌹 అశ్వినీ దేవతలు - తధాస్తు దేవతలు 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. వీరినే తధాస్తు దేవతలు అని కూడా అంటారు. వేదాలలో వీరి గురించి దాదాపు నూరు సూక్తాల వరకు ఉంది. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. వీరు దయార్ద్ర హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర, ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని, విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఉంటాయని పురాణ వర్ణితం.

వీరు విరాట్పురుషుని నాసికాభాగంలో ఉంటారు. వీరి సోదరి ఉష. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యం అంటే బంగారంతో నిర్మితమైనది. ఆ రథాన్ని అధ్వరాశ్వాలనే మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అవి తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి. ఈ రథానికి చక్రాలూ మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.

ఆ రథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరం గా రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్వినీ దేవతల కంఠధ్వని... శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.


🌻 అశ్విని దేవతా మంత్రాలు 🌻

ఓం అశ్విని కుమారాభ్యాం నమః

ఓం అశ్విన్యౌవైద్యౌ తే నమః

ఓం అశ్విని దేవతాయై నమః



వేదాలలో ‘అనుమతి’ అనే ఒక దేవతా వర్గం ఉన్నారు. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో నున్న సూర్యుడు, ఛాయాదేవిలకు వీరు జన్మించారు.

మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులు గా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. 'తథాస్తు' అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.

ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటు చేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి.

కాబట్టి ఎప్పుడూ మంచి ఆలోచనలుతో మంచి కోరుకుంటే, భగవత్‌ చింతనలో ఉంటే అంతా మంచే జరుగుతుంది...

🌹🌹🌹🌹🌹

కార్తిక పురాణం - 17 :- 17వ అధ్యాయము - అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము Kartika Purana - 17 :- Chapter 17 - Angirasa's philosophical advice to the greedy man

🌹. కార్తిక పురాణం - 17 🌹
🌻. 17వ అధ్యాయము - అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము 🌻
📚. ప్రసాద్ భరద్వాజ



ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.

కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పతికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించు చున్నాను. 'ఆత్మ'యనగా యీ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించు చున్నది - అని అంగీరసుడు చెప్పగా

"ఓ మునీఒద్రా! నేనింత వరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన, 'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"యని ధనలోభుడు కోరెను.

అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంత:కరణవృత్తికి సాక్షియే, 'నేను - నాది' అని చెప్పబడు జీవత్మాయే 'అహం' అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే "ఆత్మ" యనబడను. "నేను" అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియే గాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ "నేను", "నాది" అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.

ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరే౦ద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత 'నేను సుఖనిద్ర పోతిని, సుఖింగా వుంది' అనుకోను నదియే ఆత్మ.

దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును, ప్రకాశింప జేయు నటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే 'పరమాత్మ' యని గ్రహింపుము. 'తత్వమసి' మొదలైన వాక్యములందలి 'త్వం' అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం 'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి" అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే "ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షీణి౦చుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించ బడి యున్నదో అదియే "ఆత్మ". ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.

జీవులచే కర్మ ఫలమను అభవింప జేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులా కర్మ ఫలమును అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹కార్తీక మాసం 17వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు

దానములు:- ఔషధాలు, ధనం

పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు

జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తే నమః స్వాహా

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక మాసం 17వ రోజు చేయవలసినవి. Things to do on 17th day of Kartika month (a YT Short)



https://youtube.com/shorts/8B_GSIz9GY0



🌹 కార్తీక మాసం 17వ రోజు చేయవలసినవి. Things to do on 17th day of Kartika month. 🌹

ప్రసాద్ భరద్వాజ


(a YT Short)


Like, Subscribe and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

🌹🌹🌹🌹🌹