🍀 19 - OCTOBER - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀

🌹🍀 19 - OCTOBER - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 19 - OCTOBER - 2022 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 80 / Kapila Gita - 80 🌹 సృష్టి తత్వము - 36
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 119 / Agni Maha Purana - 119 🌹 🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 2🌻
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 254 / Osho Daily Meditations - 254 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 408 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 408 -3 🌹 ”శివంకరీ”- 3 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹19, October 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*

*🍀. శ్రీ నారాయణ కవచం - 20 🍀*

*29. గరుడో భగవాన్ స్తోత్రస్తోమశ్ఛందోమయః ప్రభుః |*
*రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విష్వక్సేనః స్వనామభిః*
*30. సర్వాపద్భ్యో హరేర్నామరూపయానాయుధాని నః |*
*బుద్ధీంద్రియమనఃప్రాణాన్పాంతు పార్షదభూషణాః*


🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మానవుడు తప్పుదారులలో నడుస్తూ వుండగా ఈశ్వరుడు వానిని నడిపిస్తూ వుంటాడు. అవరాప్రకృతి కొట్టే పల్టీలను పరాప్రకృతి సాక్షిగా తిలకిస్తూ వుంటుంది. ఈ విషమస్థితి నుండి బయటపడి విశుద్ధజ్ఞాన రూపమైన ఆత్మైక్యం అందుకొన్నప్పుడే నిర్దుష్ట కర్మాచరణం మనకు సాధ్యమవుతుంది.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ నవమి 14:15:37 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: పుష్యమి 08:02:02
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: సద్య 17:32:09 వరకు
తదుపరి శుభ
కరణం: గార 14:11:37 వరకు
వర్జ్యం: 22:09:28 - 23:55:24
దుర్ముహూర్తం: 11:37:32 - 12:24:19
రాహు కాలం: 12:00:56 - 13:28:39
గుళిక కాలం: 10:33:12 - 12:00:56
యమ గండం: 07:37:45 - 09:05:29
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 00:53:12 - 02:40:24
సూర్యోదయం: 06:10:02
సూర్యాస్తమయం: 17:51:50
చంద్రోదయం: 00:40:06
చంద్రాస్తమయం: 14:04:54
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కర్కాటకం
ఆనందాదియోగం: మతంగ యోగం
- అశ్వ లాభం 08:02:02 వరకు 
తదుపరి రాక్షస యోగం - మిత్ర కలహం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 80 / Kapila Gita - 80🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 36 🌴*

*36. మృదుత్వం కఠినత్వం చ శైత్యముష్ణత్వమేవ చ|*
*ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః॥*

*మృదుత్వము, కాఠిన్యము, చల్లదనము, వెచ్చదనము (వేడి) అను వానిని గుర్తించుట వాయువు యొక్క సూక్ష్మరూపమైన స్పర్శ లక్షణము.*

*మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది అని చెప్పగలిగేది స్పర్శ. ఇవి ముట్టుకుంటేనే తెలిసేది. ఈ నాల్గింటినీ గ్రహించేది త్వక్. స్పర్శ గుణం కలిగి ఉండుట వాయువు లక్షణం. వాయువంటే రూపము లేకుండా స్పర్శ మాత్రమే కలిగి ఉండేది వాయువు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 80 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 36 🌴*

*36. mṛdutvaṁ kaṭhinatvaṁ ca śaityam uṣṇatvam eva ca*
*etat sparśasya sparśatvaṁ tan-mātratvaṁ nabhasvataḥ*

*Softness and hardness and cold and heat are the distinguishing attributes of touch, which is characterized as the subtle form of air.*

*Tangibility is the proof of form. In actuality, objects are perceived in two different ways. They are either soft or hard, cold or hot, etc. This tangible action of the tactile sense is the result of the evolution of air, which is produced from the sky.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 119 / Agni Maha Purana - 119 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 38*

*🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 2🌻*

దేవతాబ్రాహ్మణాదుల రక్షణము నిమిత్తము రణభూమిలో ప్రాణాత్యాగము చేసిన వీరునకు ఏ ఫలము లభించునో ఆ ఫలము దేవాలయనిర్మాణము చేయువానికి లభించును. లోభముచే మట్టితో దేవాలయము కట్టించినవానికి గూడ స్వర్గముగాని దివ్యలోకము గాని లభించును. ఏకాయతన దేవాలయము (ఒకే దేవతా విగ్రహమునకై ఒక గది గల ఆలయము నిర్మించినవాడు స్వర్గమును పొందును. త్య్రాయతనదేవాలయమును నిర్మించినవాడు బ్రహ్మలోకములో నివసించును. పంచాయతన దేవాలయమును నిర్మించినవాడు శివలోకమును చేరును. అష్టాయతన మందిరము నిర్మించినవాడు శ్రీహరి సాంనిధ్యము నందుండును. 

షోడశాయతన దేవాలయ నిర్మాణముచేసినవాడు భోగమును, మోక్షమును కూడా పొందును. శ్రీహరి దేవాలయములలో కనిష్ఠము, మధ్యమము, శ్రేష్ఠము అను మూడు శ్రేణు లున్నవి. వీటి నిర్మాణము వలన క్రమముగ స్వర్గలోక-విష్ణులోక-మోక్షములు ప్రాప్తించును. 

ధనవంతుడు శ్రేష్ఠశ్రేణికి చెందిన విష్ట్వాలయమును నిర్మించుటచే ఎట్టి పలితమును పొందునో ఆ ఫలితమునే కనిష్ఠ శ్రేణికి చెందిన దేవాలయమును నిర్మించిన నిర్ధనుడు పొందును. తాను సంపాదించిన ధనములో స్వల్పధనమును మాత్రమే వెచ్చించి దేవాలయమును నిర్మించినను భక్తుడు అధిక మగు పుణ్యమును, భగవంతుని అనుగ్రహమును పొందును. ఒక లక్షగాని, ఒక వెయ్యి గాని, నూరు గాని, దానిలో సగము గాని ముద్రలను వెచ్చించి విష్ణుమందిరమును నిర్మించువాడు శ్రీ మహావిష్ణులోకమును చేరును.

బాల్యమునందు ఆట లాడుచు మట్టితో విష్ణ్వాలయమును నిర్మించినవారు కూడ విష్ణలోకమును చేరుదురు. తీర్థములందు, పవిత్రాస్థానములందు, సిద్ధక్షేత్రములందు, ఆశ్రయములందు విష్ట్వాలయమును నిర్మించువారికి ఇతర ప్రదేశము లందు నిర్మించువారికంటె మూడు రెట్లు ఎక్కువ ఫలము లభించును. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 119 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 38*
*🌻 Benefits of constructing temples - 2 🌻*

9-17. One who builds sixteen abodes gets enjoyment and emancipation. Having built a small, medium or excellent temple for Hari one gets heaven or the world of Viṣṇu or emancipation respectively in order. Which merits a rich man would get by erecting an excellent temple of Viṣṇu, a poor man would get by (erecting) a small temple itself. 

Having acquired riches and built a temple for Hari even with a small portion of it one would get excellent and enormous merits. By erecting a temple of Hari with a lakh or thousand or hundred or fifty (units of money) one would reach the place of that person who has the eagle in his banner. 

Those who play in their childhood with (the building of) abodes of Hari with earth also go to the world of Vāsudeva. The building of temples of Viṣṇu at holy places, within temples, accomplished place or hermitage (yields) threefold benefit than those already described. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 254 / Osho Daily Meditations - 254 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 254. కష్టాలు 🍀*

*🕉. కష్టాలనేవి సవాళ్లు. అవి ఎప్పుడూ ఉంటాయి. అవి జీవితంలో భాగమే, మరియు అవి అక్కడ ఉండటం మంచిది, లేకపోతే ఎదుగుదల ఉండదు. 🕉*

*కష్టాలనేవి సవాళ్లు. అవి పని చేయడానికి, ఆలోచించడానికి, పరిస్థితులను అధిగమించడానికి, మార్గాలను కనుగొనడానికి మనకి ప్రేరణ నిస్తాయి. వీటికి చాలా కృషి అవసరం. కష్టాలను ఎల్లప్పుడూ ఆశీర్వాదాలుగా తీసుకోండి. ఇబ్బందులు లేకపోతే మనం ఎక్కడున్నామో తెలియదు. పెద్ద కష్టాలు మీకు వచ్చాయి అంటే ఉనికి మిమ్మల్ని చూస్తోంది అని అర్ధం. అది మీకు మరిన్ని సవాళ్లను ఇస్తోంది. మీరు వాటిని ఎంత ఎక్కువగా పరిష్కరిస్తారో, మరింత పెద్ద సవాళ్లు మీ కోసం వేచి ఉంటాయి. చివరి క్షణంలో, కష్టాలు మాయమవుతాయి, కానీ ఆ చివరి క్షణం, కష్టాల వల్ల మాత్రమే వస్తుంది.*

*కాబట్టి ఏ కష్టాన్ని ప్రతికూలంగా తీసుకోకండి. అందులో సానుకూలమైన దాన్ని కనుగొనండి. మార్గాన్ని అడ్డుకునే అదే రాయి మెట్ల రాయిగా పనిచేస్తుంది. దారిలో రాయి లేకపోతే, మీరు ఎప్పటికీ పైకి లేవలేరు. మరియు దాని పైన వెళ్ళే ప్రక్రియ జరగదు. దానిని ఒక మెట్టుగా మార్చడం, మీకు కొత్త ఎత్తును ఇస్తుంది. కాబట్టి మీరు జీవితాన్ని సృజనాత్మకంగా ఆలోచించిన తర్వాత, ప్రతిదీ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిదీ మీకు ఏదైనా ఇవ్వడానికి సిద్థంగా ఉంటుంది. ఏదీ అర్థరహితం కాదు.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 254 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 254. DIFFICULTIES 🍀*

*🕉. Difficulties are always there. They are part of life· And it is good that they are there, otherwise there would be no growth. 🕉*

*Difficulties are challenges. They provoke you to work, to think, to find ways to overcome them. The very effort is essential. So always take difficulties as blessings. Without difficulties, we would be nowhere. Bigger difficulties come--that means that existence is looking after you, it is giving you more challenges. And the more you solve them, the greater challenges will be waiting for you. Only at the last moment, difficulties disappear, but that last moment comes only because of difficulties.*

*So never take any difficulty negatively. Find something positive in it. The same rock blocking the path can function as a stepping stone. If there were no rock on the path, you would never rise up. And the very process of going above it, making it a stepping stone, gives you a new altitude of being. So once you think about life creatively, then everything is useful and everything has something to give you. Nothing is meaningless.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 409 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 409 - 1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*
*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*

*🌻 409. ‘శివప్రియా'- 1 🌻* 

*శివునకు ప్రియురాలు శ్రీమాత అని అర్ధము. శివుడు ప్రియుడుగా నుండునది శ్రీమాత అని అర్థము. శివునికి శ్రీమాత ప్రియురాలు. శ్రీమాతకు శివుడు ప్రియుడు. ఒకరి యందు ఒకరికి ప్రియత్వము సమానముగ నున్న స్థితి ఇది. ఇట్టి సమానత్వము అరుదు. దంపతీయం దిట్టి ప్రియత్వము సామాన్యముగ కానరాదు. సమాన ప్రియత్వమునకు శివపార్వతులే ప్రమాణము. వారితో పోల్చదగిన వారు సీతారాములు. వీరినే ఆదర్శ దంపతులని మన సంప్రదాయము కొనియాడుచున్నది. దంపతి యందు ప్రియత్వమున హెచ్చుతగ్గులు సామాన్యము. కొన్ని సమయములందు పురుషుడు ఆధిక్యము చూపుట, అట్లే మరికొన్ని సమయములందు స్త్రీలు ఆధిక్యము చూపుట కనబడును. ప్రేమ యున్నచోట ఆధిక్యముండదు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 409 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita*
*Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻*

*🌻 409. 'Shivapriya'- 1 🌻*

*It means Srimata is the beloved of Lord Shiva. It also means Srimata's beloved is Lord Shiva. Srimata is dear to Lord Shiva. Lord Shiva is dear to Srimata. This is the state of equal love for each other. Such equality is rare. It is rare to see such love in marriage. Shiva Parvati is the standard for equality in love. Comparable to them are the Sita and Rama. Our tradition praises them as ideal couple. Inequalities are common in marriage. At some times the husband is seen to be dominant and at other times the wife is seen to be dominant. Where there is love there is no superiority.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 249


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 249 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. వ్యక్తి ఎంత సృజనాత్మకంగా, సున్నితంగా మారితే అంతగా మతానికి సన్నిహితుడవుతాడు. అతనెంతగా సృజన కారుడయితే అంతగా సృష్టికర్తకు సన్నిహితుడవుతాడు. 🍀


నా సమస్త దృష్టి నాట్యం గురించి, పాడడం గురించి ప్రేమించడం గురించి మానవజాతి ఆనందం గురించి నేను ఈ ప్రపంచాన్ని నవ్వుతో, సంగీతంతో, కవిత్వంతో, పెయింటింగ్స్, సృజనాత్మకతతో, సున్నితత్వంతో నింపాలను కుంటున్నాను.

వ్యక్తి ఎంత సృజనాత్మకంగా, సున్నితంగా మారితే అంతగా మతానికి సన్నిహితుడవుతాడు. అతనెంతగా సృజన కారుడయితే అంతగా సృష్టికర్తకు సన్నిహితుడవుతాడు. అప్పుడు తప్పనిసరిగా దాని ఫలితంగా జీవితంలో ఆనందిస్తాడు. అదే నా సందేశం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

నిత్య ప్రజ్ఞా సందేశములు - 350 - 15. మనిషి ఒక కేంద్రీకృత శక్తి / DAILY WISDOM - 350 - 15. Man is a Concentrated Point of Energy


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 350 / DAILY WISDOM - 350 🌹

🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀

📝. ప్రసాద్ భరద్వాజ్

🌻15. మనిషి ఒక కేంద్రీకృత శక్తి 🌻


మానవ వ్యక్తిత్వం రాతి స్తంభం కాదు. మనిషి ఒక ఘన వస్తువు కాదు. మీ లేదా నా వ్యక్తిత్వం - దానిని ఏ విధంగా పిలిచినా - రాయి, ఇటుక లేదా బరువైన పదార్ధం వంటి ఘనమైన వస్తువు కాదు. ఇది ప్రత్యేకంగా ఉనికిలో ఉన్న ఒక కదలిక, ఒక నిరంతర పరివర్తన. మనిషి ఈ పరివర్తన లేదా కదలిక యొక్క కేంద్రీకృత బిందువు. ఇది గుర్తుంచు కోవలసిన ముఖ్యమైన విషయం. ఏదైనా కదలిక ఒక అస్తవ్యస్తమైన చర్య కావచ్చు, ఏ దిశలోనైనా పరుగెత్తవచ్చు, తుఫాను లేదా వీచే గాలి లాగా అన్ని దిశాలలోను ఉండొచ్చు, కానీ మానవ వ్యక్తిత్వానికి సంబంధించిన కదలిక ఒక దిశ లేని గందరగోళం కాదు.

ఏ దిక్కునయినా తన ఇష్టం వచ్చినట్టు వీచే తుఫాను కాదు. ఇది బాగా వ్యవస్థీకృతమైన ఉద్దేశ్యతో కూడిన కదలిక. మనుషులు మామూలుగా చెప్పుకునే పిచ్చిలో సైతం మనకి తెలియని ఒక వ్యవస్థ ఉంటుంది. ఈ క్షణికమైన, నిరంతర పరివర్తన కలిగిన, శక్తి సంచాలకమైన వ్యక్తిత్వం ఒక వ్యవస్థీకృతమైన, తనకంటూ ఒక పద్ధతి, తర్కం కలిగిన అంశము. అందుకే మానవులు అడివి జంతువుల్లా కాక బుద్ధిని కలిగి ఉంటారు. ఒకవేళ మానవ వ్యక్తిత్వం సముద్రగాలి లాగా ఒక దిశానిర్దేశం లేకుండా అన్ని వైపులకీ వీచేదే అయితే, అది అనేక ముక్కలై చెల్లాచెదురు అవుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 350 🌹

🍀 📖 from The Philosophy of Religion 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻15. Man is a Concentrated Point of Energy🌻


Human personality is not a granite or flint pillar. Man is not a solid object. Your personality or my individuality —whatever it may be called—is not a solid object like a stone, a brick, or a heavy substance. It is a movement, a continuous transition, rather than a thing that exists exclusively. Man is a concentrated point of movement. This is an important thing to remember. Movement can be higgledy-piggledy, chaotic action, running about in any direction, or like the cyclone or the wind that blows, but the movement that is human personality is not a jumble of agitation.

It is not a tempest that blows in any direction as it wills. It is a well-organised purposive movement. There is a system even in madness, as they usually say. In this transitoriness that the human personality is, in this movement that man is, in this complex of forces rather than of substances that he seems to be, there is an order, a system, a method, and a logic of its own. That is why human beings are actually sane and not wild sceneries. If man were to blow like wind, and the components of his personality were to go anywhere they willed like a storm in the ocean, he would be torn to pieces; a part of him would be there, and another part of him would be anywhere else.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 633 / Sri Siva Maha Purana - 633


🌹 . శ్రీ శివ మహా పురాణము - 633 / Sri Siva Maha Purana - 633 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 12 🌴

🌻. కార్తికేయ స్తుతి - 3 🌻

ఓ నారదా! అది దంపతులగు పార్వతీపరమేశ్వరులు ప్రాణప్రియమైన తమ పుత్రుడగు కుమారుని చూచి మిక్కిలి ఆనందించిరి (22). మహాదేవుడు నమస్కరించిన కుమారుని లేవదీసి ఒడిలో కూర్చుండ బెట్టుకొని ఆనందముతో లలాటమునందు ముద్దిడి ప్రేమపూర్వకముగా చేతితో స్పృశించెను (23). మహానందముతో నిండిన శంభుడు తారకుని సంహరించిన మహాప్రభుడగు కుమారుని ముఖము నందు మహాప్రేమతో ముద్దిడెను (24). పార్వతీ దేవి కూడా ఆతనిని లోవదీసి తన ఒడిలో కూర్చుండబెట్టుకొని మహాప్రేమతో లలాటమునందు ముద్దిడెను (25).

ఓ నారదా! వత్సా! లోకాచారమును పాటించే, ఆది దంపతులగు ఆ పార్వతీ పరమేశ్వరులకు ఆ సమయములో మహానందము క్షణక్షణ ప్రవర్ధమానమయ్యెను (26). అపుడు శివుని నివాసములో పెద్ద ఉత్సవము జరిగెను. సర్వత్రా జయధ్వానములు, నమస్కారశబ్దములు వినవచ్చెను (27). ఓ మునీ! అపుడు విష్ణువు మొదలుగా గల సర్వదేవతలు, మరియు మునులు పార్వతీ పరమేశ్వరులను ఆనందముతో ప్రణమిల్లి స్తుతించిరి (28).

దేవతలిట్లు పలికిరి-

దేవే దేవా! మమాదేవా! భక్తులకు అభయము నిచ్చవాడా! నీవు అనేక నమస్కారములు. కృపానీధీ! మహేశ్వరా! (29) మహాదేవా! నీ గొప్ప లీల అద్భుతమైనది; సత్పురుషులందరికీ సుఖమును కలిగించునది. దీనులకు బంధువైన మహాప్రభూ! (30) సనాతనుడవగు నీ విషయములో మరియు నీ పూజ విషయములో మేము ఈ తీరున వ్యామోహమును పొందిన బుద్ధి కలిగి అజ్ఞానులమై ఉన్నాము. ఓ ప్రభు! నిన్ను ఆవాహన చేయుట గాని, నీ అద్భుత లీల గాని మాకు తెలియదు (31). గంగాజలమును ధారగా ఇచ్చినవాడు, జగత్తునకు ఆధారమైనవాడు, త్రిగుణస్వరూపుడు దేవతలకు ప్రుభువు, శుభమును కలిగించువాడు అగు నీకు అనేక నమస్కారములు (32).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 633🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 12 🌴

🌻 The story of Śiva and Pārvatī including that of Kārttikeya - 3 🌻

22. O Nārada, on seeing their beloved son Kumāra, the lordly couple Śiva and Pārvatī rejoiced much.

23. The great lord got up, kissed him on the head with joy, stroked him with the hand and placed him on his lap.

24. With great affection, the highly delighted Śiva kissed the face of Kumāra, the great lord and the slayer of Tāraka.

25. Pārvatī, too got up and placed him on her lap. Keeping him close to her head with great affection she kissed his lotus-like face.

26. O dear Nārada, the joy of the couple—Śiva and Pārvatī who followed the worldly conventions, increased very much.

27. There was great jubilation in the abode of Śiva. Everywhere the sound of shouts “Victory” and “Obeisance” rose up.

28. O sage, then Viṣṇu, other gods and the sages bowed joyously to Śiva. They eulogised Him.


The gods said:—

29. O lord of the gods, O bestower of protection to your devotees, Obeisance, Obeisance to you many times, O merciful lord Śiva.

30. Wonderful indeed, O great lord, is your divine sport, conferring happiness to all good men, O Śiva, kinsman to the distressed, O lord.

31. We are deluded in our intellects. We are ignorant of the procedure of your worship, O eternal one. We do not know your invocation nor your wonderful course, O lord.

32. Obeisance to you, the support of the waters of the Gaṅgā, to the deity possessed of the attributes, obeisance to the lord of the gods, obeisance to Śiva.


Continues....

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 671 / Vishnu Sahasranama Contemplation - 671


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 671 / Vishnu Sahasranama Contemplation - 671🌹

🌻671. మహాక్రమః, महाक्रमः, Mahākramaḥ🌻

ఓం మహాక్రమాయ నమః | ॐ महाक्रमाय नमः | OM Mahākramāya namaḥ


మహాక్రమః, महाक्रमः, Mahākramaḥ

మహాన్తః పాదవిక్షేపాః క్రమా అస్యేతి కేశవః ।
మహాక్రమ ఇతిప్రోక్తః శన్నో విష్ణురురుక్రమః ।
ఇతి శుక్లయజుర్వేద శ్రవణాద్ విష్ణువాచకః ॥

లోకత్రయమును వ్యాపించు చాల పెద్దవైన పాద విన్యాసములు ఎవనివో ఆతండు మహాక్రమః. 'శం నో విష్ణురురుక్రమః' - పెద్ద పాదన్యాసములుగల విష్ణువు మాకు శుభమును కలిగించుగాక అను శుక్ల యజుర్వేద వచనము ఇట ప్రమాణము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 671🌹

🌻671.Mahākramaḥ🌻

OM Mahākramāya namaḥ


महान्तः पादविक्षेपाः क्रमा अस्येति केशवः ।
महाक्रम इतिप्रोक्तः शन्नो विष्णुरुरुक्रमः ।
इति शुक्लयजुर्वेद श्रवणाद् विष्णुवाचकः ॥

Mahāntaḥ pādavikṣepāḥ kramā asyeti keśavaḥ,
Mahākrama itiproktaḥ śanno viṣṇururukramaḥ,
Iti śuklayajurveda śravaṇād viṣṇuvācakaḥ.

The One with great strides that cover all the three worlds is Mahākramaḥ. The Śukla Yajurveda chant 'शं नो विष्णुरुरुक्रमः' / 'Śaṃ no viṣṇururukramaḥ' means 'may the Viṣṇu of great strides give us welfare' can be a reference here.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

महाक्रमो महाकर्मा महातेजा महोरगः ।महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः ॥ ७२ ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ 72 ॥

Mahākramo mahākarmā mahātejā mahoragaḥ,Mahākraturmahāyajvā mahāyajño mahāhaviḥ ॥ 72 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


శ్రీమద్భగవద్గీత - 272: 06వ అధ్., శ్లో 39 / Bhagavad-Gita - 272: Chap. 06, Ver. 39

 

🌹. శ్రీమద్భగవద్గీత - 272 / Bhagavad-Gita - 272 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 39 🌴

39. ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషత: |
త్వదన్య: సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ||


🌷. తాత్పర్యం :

ఓ కృష్ణా! ఈ నా సందేహమును సంపూర్ణముగా తొలగించుమని నిన్ను వేడుచున్నను. నీవు తప్ప ఈ సందేహమును నివారించువారు వేరెవ్వరును లేరు.

🌷. భాష్యము :

శ్రీకృష్ణుడు భూత, భవిష్యత్, వర్తమానములను పూర్ణముగా నెరిగినవాడు. జీవుల వ్యక్తిత్వముతో గతము నందును, వర్తమానము నందును, భవిష్యత్తు నందును నిలిచియుందురనియు, భవబంధము నుండి ముక్తిని పొందిన పిదపయు వారట్లే వ్యక్తిత్వముతో కొనసాగుదురనియు అతడు భగవద్గీత యొక్క ఆరంభమున తెలిపెను.

అనగా జీవుని భవిష్యత్తును గూర్చిన ప్రశ్నకు అతడు సమాధానము నొసగియే యున్నాడు. కాని ఇప్పుడు అర్జునుడు సామాన్యజీవుని విషయమున గాక, ఆధ్యాత్మికమార్గమునందు జయమును సాధింపలేని యోగి భవిష్యత్తును గూర్చి తెలియగోరుచున్నాడు. వాస్తవమునకు కృష్ణునికి సమానులు గాని, అధికులు గాని లేరు. నామమాత్ర యోగులు మరియు తత్త్వవేత్తలు ప్రకృతికి లోబడియుండువారే గనుక ముమ్మాటికి శ్రీకృష్ణునికి సములు కాలేరు.

తత్కారణముగా అర్జునుని ఈ ప్రశ్న విషయమున శ్రీకృష్ణుని తీర్పే తుదియై, సర్వసంశయములకు సంపూర్ణ సమాధానమై యున్నది. ఆ దేవదేవుడు భూత, భవిష్యత్, వర్తమానములను పూర్ణముగా నెరిగియుండుటయే అందులకు కారణము. కాని అతనికి మాత్రము ఎవ్వరును ఎరుగజాలరు. కృష్ణుడు మరియు కృష్ణభక్తులు మాత్రమే ఏది ఎట్టిదన్న విషయమును సంపూర్ణముగా నెరిగియుందురు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 272 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 39 🌴

39. etan me saṁśayaṁ kṛṣṇa chettum arhasy aśeṣataḥ
tvad-anyaḥ saṁśayasyāsya chettā na hy upapadyate


🌷 Translation :

This is my doubt, O Kṛṣṇa, and I ask You to dispel it completely. But for You, no one is to be found who can destroy this doubt.

🌹 Purport :

Kṛṣṇa is the perfect knower of past, present and future. In the beginning of the Bhagavad-gītā, the Lord said that all living entities existed individually in the past, they exist now in the present, and they continue to retain individual identity in the future, even after liberation from the material entanglement. So He has already cleared up the question of the future of the individual living entity. Now, Arjuna wants to know of the future of the unsuccessful transcendentalist.

No one is equal to or above Kṛṣṇa, and certainly the so-called great sages and philosophers who are at the mercy of material nature cannot equal Him. Therefore the verdict of Kṛṣṇa is the final and complete answer to all doubts, because He knows past, present and future perfectly – but no one knows Him. Kṛṣṇa and Kṛṣṇa conscious devotees alone can know what is what.

🌹 🌹 🌹 🌹 🌹


18 Oct 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹18, అక్టోబరు, October 2022 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻

🍀. సంకట మోచన హనుమాన్ స్తుతి - 7 🍀


7. భ్రాత్రాన్వితం రఘువరం త్వహిలోకమేత్య
దేవ్యై ప్రదాతుమనసం త్వహిరావణం త్వాం.

సైన్యాన్వితం నిహతవాన- నిలాత్మజం ద్రాక్
ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : ప్రపంచ సంస్కృతికి భారతయ సంస్కృతి ఏడుగడ కావాలి. పూర్వం ఉన్నత ప్రమాణాలు గల వివిధ విద్యలలో, కళలలో ఈ సంస్కృతి ప్రతిబింబిత మైనప్పుడు ఆ విధంగానే జరిగింది. ఇప్పుడు ఈ వైజ్ఞానిక యుగంలో కూడా అట్లే జరుగ వలసి వున్నది. భారతీయ మేధ మరెవ్వరి మేధకూ తీసిపోదు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం

తిథి: కృష్ణ అష్టమి 11:59:16

వరకు తదుపరి కృష్ణ నవమి

నక్షత్రం: పుష్యమి 32:02:18

వరకు తదుపరి ఆశ్లేష

యోగం: సిధ్ధ 16:52:17 వరకు

తదుపరి సద్య

కరణం: కౌలవ 11:57:16 వరకు

వర్జ్యం: 14:09:20 - 15:56:36

దుర్ముహూర్తం: 08:30:18 - 09:17:09

రాహు కాలం: 14:56:48 - 16:24:38

గుళిక కాలం: 12:01:07 - 13:28:57

యమ గండం: 09:05:26 - 10:33:17

అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24

అమృత కాలం: 24:52:56 - 26:40:12

సూర్యోదయం: 06:09:46

సూర్యాస్తమయం: 17:52:28

చంద్రోదయం: 00:40:06

చంద్రాస్తమయం: 13:22:01

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: కర్కాటకం

వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం

32:02:18 వరకు తదుపరి ఆనంద

యోగం - కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹