🌹. శ్రీమద్భగవద్గీత - 272 / Bhagavad-Gita - 272 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 39 🌴
39. ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషత: |
త్వదన్య: సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ||
🌷. తాత్పర్యం :
ఓ కృష్ణా! ఈ నా సందేహమును సంపూర్ణముగా తొలగించుమని నిన్ను వేడుచున్నను. నీవు తప్ప ఈ సందేహమును నివారించువారు వేరెవ్వరును లేరు.
🌷. భాష్యము :
శ్రీకృష్ణుడు భూత, భవిష్యత్, వర్తమానములను పూర్ణముగా నెరిగినవాడు. జీవుల వ్యక్తిత్వముతో గతము నందును, వర్తమానము నందును, భవిష్యత్తు నందును నిలిచియుందురనియు, భవబంధము నుండి ముక్తిని పొందిన పిదపయు వారట్లే వ్యక్తిత్వముతో కొనసాగుదురనియు అతడు భగవద్గీత యొక్క ఆరంభమున తెలిపెను.
అనగా జీవుని భవిష్యత్తును గూర్చిన ప్రశ్నకు అతడు సమాధానము నొసగియే యున్నాడు. కాని ఇప్పుడు అర్జునుడు సామాన్యజీవుని విషయమున గాక, ఆధ్యాత్మికమార్గమునందు జయమును సాధింపలేని యోగి భవిష్యత్తును గూర్చి తెలియగోరుచున్నాడు. వాస్తవమునకు కృష్ణునికి సమానులు గాని, అధికులు గాని లేరు. నామమాత్ర యోగులు మరియు తత్త్వవేత్తలు ప్రకృతికి లోబడియుండువారే గనుక ముమ్మాటికి శ్రీకృష్ణునికి సములు కాలేరు.
తత్కారణముగా అర్జునుని ఈ ప్రశ్న విషయమున శ్రీకృష్ణుని తీర్పే తుదియై, సర్వసంశయములకు సంపూర్ణ సమాధానమై యున్నది. ఆ దేవదేవుడు భూత, భవిష్యత్, వర్తమానములను పూర్ణముగా నెరిగియుండుటయే అందులకు కారణము. కాని అతనికి మాత్రము ఎవ్వరును ఎరుగజాలరు. కృష్ణుడు మరియు కృష్ణభక్తులు మాత్రమే ఏది ఎట్టిదన్న విషయమును సంపూర్ణముగా నెరిగియుందురు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 272 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 6 - Dhyana Yoga - 39 🌴
39. etan me saṁśayaṁ kṛṣṇa chettum arhasy aśeṣataḥ
tvad-anyaḥ saṁśayasyāsya chettā na hy upapadyate
🌷 Translation :
This is my doubt, O Kṛṣṇa, and I ask You to dispel it completely. But for You, no one is to be found who can destroy this doubt.
🌹 Purport :
Kṛṣṇa is the perfect knower of past, present and future. In the beginning of the Bhagavad-gītā, the Lord said that all living entities existed individually in the past, they exist now in the present, and they continue to retain individual identity in the future, even after liberation from the material entanglement. So He has already cleared up the question of the future of the individual living entity. Now, Arjuna wants to know of the future of the unsuccessful transcendentalist.
No one is equal to or above Kṛṣṇa, and certainly the so-called great sages and philosophers who are at the mercy of material nature cannot equal Him. Therefore the verdict of Kṛṣṇa is the final and complete answer to all doubts, because He knows past, present and future perfectly – but no one knows Him. Kṛṣṇa and Kṛṣṇa conscious devotees alone can know what is what.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment