Showing posts with label మనోశక్తి. Show all posts
Showing posts with label మనోశక్తి. Show all posts

మనోశక్తి - Mind Power - 82

No photo description available.
🌹. మనోశక్తి - Mind Power - 82 🌹
Know Your Infinite Mind


🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ

చివరి భాగం
🌻 Q 79:--పూర్ణాత్మ vs దేహం 🌻

Ans :--

1) మనం మన దేహాన్ని ఒక పూర్ణాత్మ గా పరిగణిస్తే దేహంలోని జీవకాణాలన్నీ అంశాత్మలు గా పరిగణించవచ్చు. కాబట్టి అంశాత్మల చైతన్య పరిణామం పూర్ణాత్మ చైతన్య పరిణామం అవుతుంది.

2) దేహం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. జీవకణాలు మృతి చెంది మరలా పడుతుంటాయి. అలాగే అంశాత్మలు మరణిస్తూ పునర్జన్మ తీసుకుంటుంటాయి. కానీ అంశాత్మలు సాధించిన జ్ఞానం, పురోగతికి సంబందించిన information స్టోర్ అవుతుంటుంది.

3) జీవకణం కొంత time జీవించివుంటుంది.దాని అభివృద్ధి అయ్యాక మరణిస్తుంది. మరల జన్మ తీసుకుంటుంది.అలాగే శరీరానికి కొంత టైం ఉంటుంది, సమిష్టిగా జీవకణాలన్నీ(అంశాత్మలన్ని)అభివృద్ధి చెందాక దేహం నశిస్తుంది.

4) మన దేహంలోని భాగాలను గమనిద్దాం. ముక్కు యొక్క అనుభవాలు ఏముంటాయి.... చెడు లేదా మంచి వాసనలు పసిగట్టగలగడం. అలాగే దేహం లోని ప్రతిభాగానికి ఇలాగే వాటి లక్ష్యాలుంటాయి, అనుభవాలు వుంటాయి. ఈ విధంగా దేహంలోని ప్రతి జీవకణం యొక్క అనుభవాల information ఆత్మలో store అవుతుంది. అలాగే total దేహంలో ఉన్న ఆత్మ యొక్క అనుభవం పూర్ణాత్మ యొక్క అనుభవం అవుతుంది.

5) అంశాత్మలు అభివృద్ధి చెంది పూర్ణాత్మ లు అవుతాయి.లీనమవ్వడం అనేది ఈ సృష్టిలో లేనేలేదు.ఏదైనా అనంతకాలం కొనసాగుతూనే వుంటుంది.

6) పూర్ణాత్మ యొక్క అంశాత్మలు higher లోకాలలో, lower లోకాలలో జన్మ తీసుకుని ఉంటాయి, ఈ అంశాత్మలన్ని కలసి సాధించిన ప్రగతి ఒక పూర్ణాత్మ ప్రగతి అవుతుంది. అంశాత్మలన్ని చైతన్యశక్తి ద్వారా అనుసంధానింపబడి ఉంటాయి. కావున ప్రతి అంశాత్మ ఎలాంటి జ్ఞానం కావాలన్నా అంతర్ ప్రయాణం ద్వారా పొందవచ్చు.

7) web system =

పూర్ణాత్మ + అంశాత్మలు.

ప్రతి అంశాత్మను ఒక website అనుకుందాం.

అంశాత్మ = google, facebook, youtube ఈ websites అన్నీ internet ద్వారానే పనిచేస్తాయి.ఇక్కడ internet అంటే చైతన్యశక్తి.

ఒక అంశాత్మ సాధించిన పురోగతి ఇతర అంశాత్మలుకు కూడా చేరవేయబడుతుంది.

8) websystem= 

భూమి+దానిపైన ఉన్న లోకాలు+ఇతర జీవజాతులు ఇక్కడ భూమి పై నివసించే మానవులు ఇతర జీవజాతులు యొక్క పురోగతి భూమి యొక్క పురోగతి అవుతుంది.

భూమి ఇతర లోకాలన్నీ web system కి internet (చైతన్యశక్తి)ద్వారా connect అయి ఉంటాయి.

ఈ విధంగా భూమి పై నివసించే జీవరాసులన్నీ ఈ websystem కి కనెక్ట్ అయితే ఇతర లోకాల ఇన్ఫర్మేషన్ ని కూడా తెలుసుకోవచ్చు.అలాగే మన లోకం గురించి తెలుసుకోవాలంటే ఇతర లోకాలవాళ్ళు వాళ్లు కూడా websystem కి connect అయితే మన information వారు తెలుసుకోవచ్చు.

ఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.
🌻. సమాప్తం... 🌻

🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి - Mind Power - 81

Image may contain: text that says "SELVAGE"
🌹. మనోశక్తి - Mind Power - 81 🌹
Know Your Infinite Mind

🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 77:-- సౌర వర్ణ వ్యవస్థ - 2 🌻
(system of solar spectrum)

9) మనం ధ్యానం ద్వారా మన frequency ని పెంచుకున్నప్పుడు ఇతర సౌరవర్ణవ్యవస్థ లోకి ప్రయాణించవచ్చు. అక్కడి జ్ఞానాన్ని కూడా మనం సంగ్రహించవచ్చు.

10) మనం ఇతర సౌరవర్ణవ్యవస్థ లోకి ప్రయాణించగలిగితే మానవ చైతన్య పరిణామం స్థాయి పెరిగినట్లే.

11) మన భూలోకం range 10 నుండి 1000 వరకు ఉందనుకోండి. మానవజాతి బుద్ధి వికాసం చెందినట్లైతే మన చైతన్యశక్తి విస్తరిస్తుంది, అప్పుడు మన సౌరవర్ణవ్యవస్థ యొక్క range (10 నుండి 7000)వరకు పెరుగుతుంది. అప్పుడు ఆ లోకంలోని జ్ఞానాన్ని మానవజాతి ఇతర జీవజాతులు అందుకోగలవు.

12) మన range ని పెంచుకోవడం వల్ల మన బుద్ధి ... వికాసం చెందడమే కాకుండా ఇతర జీవజాతుల బుద్ధి వికాసం మనోవికాసం జీవిత విలువలు కూడా పెరుగుతాయి.

13) బుద్ధుడు, jesus, కృష్ణుడు అందరూ చేసిన పని ఇదే,
Jesus నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలున్నాయి అన్నారు. అంటే ఆయన అంతర్ ప్రయాణం ద్వారా ఇతర సౌరవర్ణవ్యవస్థ లోని లోకాలను దర్శించాడనమాట.

14) ఒక range లో మానవ దేహం ఒక లాగా, మరో రేంజ్ లో మానవ దేహం మరో లాగా ఉంటుంది.

15) మనకంటే higher range లో మానవ దేహం మరో లాగా ఉంటుంది. వారి science n technology వారు ఎంచుకున్న పరిణామ దశలు వారి కళలు, వారి భౌతిక వాస్తవం చాలా భిన్నంగా ఉంటాయి.

16) ఒక్కొక్క సౌరవర్ణవ్యవస్థ ఒక్కొక్క dimension గా చెప్పబడుతుంది.

🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి - Mind Power - 80

Image may contain: text that says "Brahmanda 1) Satya-loka 2) Taparloka 3) Jana-loka 4) Mahar-loka 5) Svar-loka 6) Bhuvar-loka Cancer 7) Bhür-loka Shuvario Rudras Aries, c Dyuloka Capricorm Libra 8) Atala-loka 9) Vitala-loka 10) Sutala-loka 11) Talatala-loka 12) Mahatala-loka atala 13) Rasatala-loka 14) Patala-loka"
🌹. మనోశక్తి - Mind Power - 80 🌹
Know Your Infinite Mind

🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 77:-- సౌర వర్ణ వ్యవస్థ - 1 🌻
(system of solar spectrum)

Ans :--
1) సౌరవ్యవస్థ అనగా సూర్యుడు, సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు అని అర్థం.

ఈ విశ్వంలో ఎన్నో కోటానుకోట్ల సౌరవ్యవస్థలు ఉన్నాయి. అందులో మానవుడు ఒక సౌరవ్యవస్థ ను మాత్రమే కనుగొన్నాడు.

2) ఒక సౌరవ్యవస్థకు సంబంధించిన కొన్ని లక్షల వర్ణవ్యవస్థలను మన అతీంద్రియాల ద్వారా మనం చూడవచ్చు.

3) ఒక సౌరవ్యవస్థ లో విద్యుదయస్కాంత తరంగాలు ఒక range లో ఉంటాయి. మనము ఇతర జంతుజాతి ఒక సౌరవ్యవస్థలో ఒక range లో ఉన్న విద్యుదయస్కాంత తరంగాల వలయంలో ఉన్నాము.

4) వేరే range లో,వేరే విద్యుదయస్కాంత తరంగాల వలయంలో ఉన్న జీవజాతులు,వాటి దేహాలు మనకు కనిపించవు. మానవుడు కనిపెట్టిన ఏ శాస్త్రపరికరాలు వాటిని పసిగట్టలేవు.

5) భూమి యొక్క చైతన్యశక్తి range ని బట్టి భూమిపై జీవించే జీవరాసులు, వాటి అణువుల నిర్మాణం, కాంతి విలువలు ఉంటాయి.

6) ఒక్కొక్క సౌరవర్ణవ్యవస్థలో ఒక్కొక్క range కి తగ్గ విద్యుదయస్కాంత తరంగాల వలయాలు ఉంటాయి.

7) ఒక్క భూమి మీదే కొన్ని కోట్ల సౌరవర్ణవ్యవస్థలు వున్నప్పుడు ఒక galaxy లో ఎన్ని ఉంటాయో ఆలోచించండి. ఇది మన మానవుని ఇంటెలిజెన్స్ కి అందేది కాదు.

8) ఒక సౌరవర్ణవ్యవస్థ లో ఈ వ్యవస్థ కు తగ్గట్టు చైతన్యశక్తి,కోడ్ లాంగ్వేజ్ ఉంటాయి. ఎలా అయితే ఇండియాలో ప్రతి స్టేట్ కి language ఉన్నట్లు, అలాగే ప్రతి లోకానికి దానికి సంబంధించి లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లోకానికి సంబంధించిన information అంతా code language రూపంలో ఆకాశిక్ record లో పొందుపరచబడి ఉంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి - Mind Power - 79

Image may contain: 1 person
🌹. మనోశక్తి  - Mind Power  - 79 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 Q 76:--telepathy 🌻

Ans :--
1) కుక్క, పిల్లి, ఆవు ఇలా కొన్ని పెంపుడు జంతువులు మన మైండ్ నుండి వెలువడే ఆలోచనా తరంగాల్ని పసిగట్టగలవు.

2) పసిపిల్లలు, పెంపుడు జంతువులు telepathy ద్వారా ప్రతి రోజు సంభాషించుకుంటాయి.

3) మానవజాతి సహజ ప్రవృత్తి లోకి మారాలి.
మానవజాతి, జంతుజాతి పరస్పర సహకారంతో చైతన్య పరిణామం చెందవలసి ఉంది.

4) వాతావరణాన్ని ఉష్ణోగ్రతల్ని మన దేహం పసిగట్టగలుగుతుంది.మనం గమనిస్తే ఇది మన మైండ్ ద్వారా జరుగుతుంది అని గుర్తించవచ్చు. అలానే మానవుల ఆలోచనా తరంగాల్ని జంతువులు, వృక్షాలు ఇతర వస్తువులు ఫీలింగ్స్ ని కూడా మన మైండ్ పసిగట్టగలదు.

5) మన మైండ్ ఆలోచనా తరంగాల్నే కాదు ఆత్మశక్తి నుండి వెలువడే స్పందనలు కూడా పసిగట్టగలదు.

6) మన ఇంట్లో ఉన్న chair, table కూడా ఆత్మశక్తి నుండి వెలువడే స్పందనల్ని పసిగట్టగలవు.
🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి - Mind Power - 78

Image may contain: 1 person, standing
🌹. మనోశక్తి  - Mind Power  - 78 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 75:-- మానవుడు vs జంతుజాతి 🌻
Ans :--
1) భూమిని ఒక చెట్టుతో పోలిస్తే మానవజాతిని వేర్లుగానూ, ఇతర జీవజాతుల్ని చెట్టులోని ఇతర భాగాలతో పోల్చవచ్చు.

2) చెట్టులోని ఏ భాగానికి హాని జరిగినా ఆ బాధ చెట్టంతా భరించాల్సి ఉంటుంది. చెట్టులోని ఒక వేరుని నరికి వేసిన చెట్టుకి నష్టం వాటిల్లుతుంది.

3) భూమి మీద మానవుడు నేటి సమాజంలో అగ్రభాగాన వున్నాడు, అలాగని అతడికి భూమి మీద ఏ జీవజాతిని చంపే అధికారం లేదు.
మానవుడు ఏ జీవాత్మ ను చంపినా భూమి యొక్క గరిష్ట ఫ్రీక్వెన్సీ ని అందుకోలేడు.

4) జీవహింసకు పాల్పడేవాడు దేవుని మార్గంలోకి ప్రవేశించలేడు, మనం ఒక జీవాత్మను చంపితే మనల్ని మనమే దెబ్బతీసుకున్నట్టు అవుతుంది.

5) జీవహింస వల్లే మతవిద్వేషాలు యుద్ధాలు పేరిట మానవజాతి ఒకరిని ఒకరు చంపుకుంటుంది. అంటే చెట్ల వేర్లు తెగిపోతున్నాయి. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవుడిదే. 
ఎప్పుడైతే మానవుడు జీవహింస మానివేస్తాడో అప్పుడే పురోగతి ని సాధిస్తాడు.
🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి - Mind Power - 77

No photo description available.
🌹. మనోశక్తి  - Mind Power  - 77 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 73 :-- Code language (కోడ్ లాంగ్వేజ్) 🌻

Ans :--
1) onion కి అనేక పొరలున్నట్లే మన దేహం కూడా అనేక పొరలను కలిగి ఉంది.

ఇప్పుడు మనం ఏ దేహాన్ని కలిగి ఉన్నా స్త్రీగాగాని, పురుషుడుగగాని గతజన్మలకు సంబందించిన దేహాలు ఆ జన్మలలో పొందిన ఆధ్యాత్మిక జ్ఞానం కోడ్ లాంగ్వేజ్ అనగా విద్యుదయస్కాంత శక్తి రూపంలో అంతర్ శక్తిలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. మనం ఆ దేహాలను ఆ కోడ్ లాంగ్వేజ్ ని అంతరేంద్రియాల ద్వారా దర్శించే వీలుంది.

2) ఇప్పుడు మనం ధరించి ఉన్న దేహం యొక్క genetic నిర్మాణం గత జన్మల్లో మనం సంపాదించిన ఆధ్యాత్మిక జ్ఞానం బట్టి ఉంటుంది. మన దేహంలోని జీవకణాలన్నీ అనేకానేక జన్మల్లో పొందిన జ్ఞానాన్నంతటిని కోడ్ లాంగ్వేజ్ రూపంలో దాచుకుని ఉన్నాయి.

3) ఉల్లిపాయను గమనిద్దాం, ఉపరితలం లో ఉన్న పొర మాత్రమే మనకు కనిపిస్తుంది. లోపల పొరలు కనిపించవు. ఉల్లిపాయకు ఉన్న ప్రతి పొరలో విద్యుదయస్కాంత శక్తి,జీవరసాయినిక శక్తి ఉండటం వల్ల ఉల్లిపాయకు ఒక ఆకారం ఏర్పడింది. ఉల్లిపాయకు గల రుచి,దాని ఘాటు వాసనలు దానిలో ఉన్న చైతన్య శక్తి వల్ల వచ్చింది. 

అలాగే వర్తమానంలో మనకు దేహం మాత్రమే కనిపిస్తుంది. మిగతా అనేకానేక జన్మలలోని దేహాలు అదృశ్యపొరలు వలె మన దేహంలోనే ఇమిడి వున్నాయి .ఈ దేహాలన్నీ చైతన్య శక్తి ద్వారా అనుసంధానింపబడి ఉన్నాయి.

4) అనేకానేక జన్మల్లో ధరించిన దేహాలు ఆధ్యాత్మిక జ్ఞానం చైతన్య పరిణామం అంతా ఆత్మశక్తి కి వారసత్వంగా సంక్రమిస్తుంది.

5) మనం అనారోగ్యం తో ఉన్నామనుకోండి,గత జన్మలో మన ఆరోగ్యకరమైన దేహం యొక్క జెనెటిక్ కోడ్ లాంగ్వేజ్ ని ప్రస్తుత దేహంలోకి చొప్పించి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

6) ఈ జన్మలో మనకు ధైర్యం లేదనుకోండి,గత జన్మలో ధైర్యవంతుడిగా మనం పొందిన అనుభవాల ద్వారా ధైర్యాన్ని మనకు మనమే ప్రాప్తించుకోవచ్చు.

7) ఈ కోడ్ లాంగ్వేజ్ transfer చేసుకోవడానికి స్వప్నాలు,అంతర్ ప్రపంచం మనకు ఉపయోగపడతాయి.
🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి - Mind Power - 76

Image may contain: one or more people
🌹. మనోశక్తి  - Mind Power  - 76 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 Q 70 :--పునర్జన్మ vs కుమారుడు 🌻

Ans :--
గత జన్మలో శత్రువు ఈ జన్మలో కుమారుడిగా లేదా కుమార్తె గా జన్మిస్తుంది. వీరు ప్రేమ సృజనాత్మకత జీవితం విలువలు ఆధ్యాత్మికతను గురించి జ్ఞాన సముపార్జన చేస్తారు.

2) మన ఎమోషన్స్ మనకు బంధాలను కలుగజేస్తాయి.

ఒకవేళ ఈ జన్మలో ఒక వ్యక్తితో emotional గా బంధాన్ని కొనసాగిస్తే దాని గురించిన dynamics అర్థం చేసుకోకుండానే మరణిస్తే తర్వాతి జన్మలో కూడా అదే బంధాన్ని కొనసాగించి ఆ dynamics పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక emotion ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక జన్మ లేదా కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు.

ఆ ఎమోషన్ ని కొనసాగించడానికి ఆ వ్యక్తినే ఎంచుకోవచ్చు లేదా అదే frequency ఉన్న మరో వ్యక్తిని ఎంచుకోవచ్చు. ఆత్మకు ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మజ్ఞానం విస్తారంగా పెరిగినపుడు emotion పరంగా పెంచుకున్న బంధాల సంకెళ్ళు అన్నీ పటాపంచలు అవుతాయి.

ఇంక ఎమోషన్స్ కోసం జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.ప్రతి ఆత్మ జ్ఞాన సముపార్జన చేసుకుని ఇతర జీవాత్మలకు భోదించకుండా వారిని ఆత్మజ్ఞానులు చేయకుండా ఈ లోకం నుండి విముక్తి పొందడం జరుగదు. 

ప్రస్తుతం భూమి మీద ఎవరైతే విరివిగా ఆత్మజ్ఞానం భోదిస్తున్నారో వారందరు ఆఖరిజన్మల్లో ఉన్నారని సేత్ తెలియజేస్తున్నారు. ఎమోషనల్ గా బంధాన్ని పూర్తిగా ఆస్వాదించి దాని dynamics అధ్యయనం చేయడానికి కవల పిల్లలుగా జన్మిస్తారు.
🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి - Mind Power - 75

Image may contain: 1 person
🌹. మనోశక్తి  - Mind Power  - 75 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 Q 72 :-- పునర్జన్మ vs స్త్రీపురుషులు 🌻

Ans :--
గతజన్మల చైతన్య పరిణామం జాగృదావస్థ లో మనకు ఎరుకలో ఉండదు.కానీ అనుభూతులు అంతర్ ప్రపంచంలో నిక్షిప్తం అయి ఉంటాయి.

2) ఆత్మ ఇప్పుడు పురుష జన్మ తీసుకుని ఉందనుకోండి, ఆ ఆత్మ విచక్షణ కోల్పోయి స్త్రీ పట్ల దురుసుగా ప్రవర్తిస్తుందనుకోండి, అచేతనా స్థితిలో మనలో దాగి ఉన్న స్త్రీ జన్మ తాలూకూ చైతన్య శక్తి మనల్ని నియంత్రించడం జరుగుతుంది. అచేతనా స్థితిలో పురుషుడు స్త్రీ మూర్తిత్వ చైతన్యశక్తి వైపు గుంజబడతాడు. మరో వైపు చేతనావస్థలో పురుష జన్మ తాలూకూ చైతన్యశక్తి సంఘర్షణ వైపు గుంజబడుతుంది. ఈ సంఘర్షణ ద్వారా వచ్చే ఆలోచనలతో భౌతిక సంఘటనలు ఏర్పడతాయి.

3) చైతన్య పరిణామం చెందుతున్న ఆత్మకు ప్రారంభదశలో లింగవిభజన తో కూడిన జన్మలు అవసరమవుతాయి. జన్మ పరిసమాప్తి పొందే దశలో లింగ విచక్షణ మటుమాయమవుతుంది. రాగద్వేషాలకు భూభౌతిక వాసనలకు వ్యామోహాలకు అతీతమైన స్థితిలో వుంటారు.

4) ఆఖరి జన్మలో స్త్రీ అయిన పురుషుడు గా జన్మించినా రెండు ఒక్కటే.ఆఖరి జన్మల్లో స్త్రే పురుష చైతన్య శక్తి ధర్మాలు రెండు కలిసిపోతాయి.

5) ఆఖరి జన్మల్లో ఉంటే సకల ప్రాణికోట్ల పట్ల ప్రేమ అనురక్తి ఉంటుంది. సకల జీవజాతులు పట్ల రాగద్వేషాలు మటుమాయమవుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి - Mind Power - 74

Image may contain: 1 person, indoor
🌹. మనోశక్తి  - Mind Power  - 74 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 65 :-- నాగరికత జననం, మరణం. 🌻

1) ప్రతి జీవికి జనన మరణ చక్రాలున్నట్లే ప్రతి నాగరికతకు జనన మరణ చక్రాలుంటాయి.

ప్రతి నాగరికతకు లక్ష్యం ఉంటుంది. మానవ జాతి ఇతర జీవజాతులు అన్నీ ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాయి.
మానవజాతి సూక్ష్మ శరీరంతో 
ఇతర లోకాలకు వెళ్లగల సామర్ధ్యం కలిగివున్నాడు. 

అలాగే ఇతర జీవజాతులు కూడా అదే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి.

2) ఒక్కొక్క నాగరికతలో జీవులు ఒక్కొక్క రీతిలో భౌతిక దేహాలను కలిగి ఉన్నాయి.ఒక నాగరికతలో ఉన్నజీవజాతులు మరో నాగరికతలో continue అవ్వవచ్చు ,లేదా
అంతరించవచ్చు.

3) కొన్ని నాగరికతల్లో కనీ విని ఎరుగని జంతువులు ఉండేవి,
అవి ఇప్పటి నాగరికతలో లేవు
మనుషుల రూపాలు ఒక నాగరికతలో ఒక లాగా మరో నాగరికతలో మరో లాగా ఉండేవి.

4) ఒక నాగరికత లో 50 అడుగుల ఎత్తు ఉండి భారికాయులు లాగా ఉండేవారు,వారి ఆయుష్షు కొన్ని వందల సంవత్సరాలు ఉండేది.
జంతువు తల+మనిషి దేహం
మనిషి తల+జంతువు దేహం
సగం మనిషి +సగం చేప 
కొన్ని నాగరికతల్లో సముద్రజాతి,కొన్ని నాగరికతల్లో  జంతువులు, dominate చేయడం జరిగింది.ప్రస్తుతం మనం domination ఉంది.

5) కొన్ని నాగరికతల్లో వేరే లోకాలకు పయనించి అక్కడి జ్ఞానం భూమి మీదకు తీసుకువచ్చారు.

6).ఒక నాగరికతలో ఉద్భవించిన జీవజాతులు మరింత ఉన్నతి కోసం మళ్లీ భూమి మీద వేరే భౌతిక రూపాలు ఎంచుకుని వేరే లక్ష్యాలు ఎంచుకుని సవాళ్లు ఎంచుకుని వేరే నాగరికతలోకి ప్రవేసిస్తాయి.

7) మన దేహంలో ఒక భాగం పాడైతే శరీరం మొత్తం ఆ బాధను అనుభవించాల్సి ఉంటుంది. దేహంలోని ఇతర భాగాలన్ని దానికి సహకరించి ఆ బాధను తొలగిస్తాయి.
అలాగే భూమి మీద ఒక జాతి crisis లో ఉంటే దాన్ని అన్ని జాతులు భరించాల్సి ఉంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. మనోశక్తి - Mind Power - 10 🌹

🌹. మనోశక్తి - Mind Power - 10 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻 Q 10 :-- ఆలోచన అంటే ఏమిటి? 🌻

Ans ):--
1) మన అంతర్ ప్రపంచం నుండి ఏర్పడే ప్రతి ఫీలింగ్,భావన,కోరిక,ఊహ,కల.... వీటన్నింటిని ఆలోచన గా పరిగణించవచ్చు.

2) మన ఆలోచనకు విద్యుదయస్కాంత శక్తి ఉంటుంది, for ex:-- t.v (టెలివిజన్) ని తీసుకుందాం, t. v లో కనిపించే ప్రతిబింబాలన్ని విద్యుదయస్కాంత తరంగాల వల్ల ఏర్పడుతున్నాయి.

అలాగే భూమి మీద కూడా పదార్ధంతో కూడిన వస్తువులు, భౌతిక సంఘటనలు , భౌతిక వాతావరణం అన్నీ అంతర్ ప్రపంచం నుండి వెలువడుతున్న విద్యుదయస్కాంత ఆలోచనా తరంగాలు నుండి బాహ్యప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి.

3) మన ఆలోచనా తరంగాల యొక్క శక్తితీవ్రత ఎంత ఉంటే అంతకాలం భౌతిక వాస్తవం పొందిన వస్తువు, లేదా భౌతిక సంఘటన జీవించిఉంటుంది.

4) బలహీనమైన ఆలోచన తరంగాల నుండి రూపాంతరం చెందిన భౌతిక సంఘటన కొద్ది కాలం మాత్రమే మనుగడ సాగించి తరువాత అంతరించిపోతుంది.

5) భూమి మీద భౌతిక సంఘటన అనగా మన జీవితంలో కి ప్రవేశించిన భౌతిక సంఘటన ఎంతకాలం కొనసాగుతుంది అనేది ఆ ఆలోచనా తరంగాలుకు మనం ఎంత బలాన్నిచ్చి ప్రభావితం చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంఘటన తాలూకు ఆలోచనలు మనలో ఆగిపోయిన వెంటనే ఆ భౌతిక సంఘటన నశించిపోతుంది.

5) అన్ని ఆలోచనలు భూమి మీద భౌతిక వాస్తవం పొందాలనే నియమమేమి లేదు,వాటి ఫ్రీక్వెన్సీ కి అనుగుణంగా ఉన్న ఇతర dimensions లో రూపాంతరం చెందుతాయి.

6) ఆలోచనలను వైరస్ తో పోల్చవచ్చు,వైరస్ లు మన దేహంపై చర్యలు జరిపి వాటి చర్యలు ద్వారా దేహంలో జీవరసాయనిక మార్పులు ఎలా తేగలవో, అలానే ఆలోచనలు కూడా మన దేహంలో జీవరసాయనిక మార్పులు కలుగజేసి దేహ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు.

7) వైద్య శాస్త్రానికి అంతుచిక్కని జీవరసాయనాలను, enzymes ని ఆలోచనాశక్తి పుట్టిస్తుంది.

8) ఆలోచనల నుండి feelings, emotions పడుతున్నాయి, దేహంలోని జీవకణాలు ఒక తరహా నిర్మాణం కలిగి ఉండి దేహఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయో, అలానే ఆలోచన తరంగాలు ఒక తరహా నిర్మాణం కలిగి భౌతిక సంఘటనలు ఏర్పరుస్తున్నాయి.

9) +ve ఆలోచనలు ఇతర +ve ఆలోచనలను ఆకర్షిస్తాయి,౼ve ఆలోచనలు ఇతర ౼ve ఆలోచనలను ఆకర్షిస్తాయి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. మనోశక్తి - Mind Power - 9 🌹

🌹. మనోశక్తి - Mind Power - 9 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻 Q 9 :--వర్తమానంలో ఉండడం వల్ల లాభాలేంటి? వర్తమానంలో జీవిస్తే గతాన్ని ఎలా పునర్నిర్మించవచ్చు? మరియు భవిష్యత్తును ఎలా మలచుకోవచ్చు? 🌻 

A:-- 1) వర్తమానమే బహుమానం. గతంలో ఏమైనా వర్తమానం మన చేతుల్లో ఉంది.

2) వర్తమానాన్ని చక్కపెడితే భవిష్యత్తు automatic గా మారుతుంది. ఎందుకంటే భవిష్యత్తు లో ఏమి జరగాలో ముందే నిర్ణయించబడదు.

3) భవిష్యత్తు ని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పుకోవచ్చు. for ex:--బంకమట్టిని తీసుకుందాం. దానిని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పవచ్చు. అదేవిధంగా వర్తమానాన్ని సరిచేస్తే భవిష్యత్తు కూడా మారుతుంది.

4) chess game ని పరిశీలిద్దాం.
పావులను కదపడంలో కొన్ని తప్పులు చేసామనుకోండి, అలాగని ఆట గతం లో లేదు. ఇప్పుడు మనం వర్తమానంలో ఆ పావులను సక్రమంగా కదుపుతున్నామో లేదా అనే దానిపైనే గెలుపు, ఓటములు ఆధారపడి ఉంటాయి. వర్తమానంలో కదిపే పావులతో గతంలోని ఆట automatic గా మారుతుంది.అప్పుడు భవిష్యత్తు యొక్క గెలుపు, ఓటములు కూడా automatic గా మారుతాయి.

అంటే ఇక్కడ ఏమయ్యింది, వర్తమానం గతాన్ని పునర్నిర్మించింది, భవిష్యత్తుని కూడా సృష్టించింది. అంతేగాని గతము, భవిష్యత్తు వర్తమానాన్ని సృష్టించలేదు.

5) గతకాలంలో చేసిన తప్పులు, గతజన్మలో చేసిన తప్పులు ఇప్పుడు నెమరువెయ్యడం అర్థరహితం.

ఎందుకంటే మనం ఎన్నో జన్మలు దాటుకుని, ఎంతో జ్ఞానాన్ని ఆర్జించాము. దానిని వర్తమానంలో implement చేస్తే చాలు. గతం తుడిచి పెట్టుకుపోతుంది. భవిష్యత్తు మలచబడుతుంది.

6) ఒకవేళ గతంలోకి చూడవలసివస్తే, ఆనందంగా ఉన్న క్షణాలు, ఆరోగ్యంగా ఉన్న క్షణాలు, విజయాలు సాధించిన క్షణాలు, గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు అవి మనకు మరింత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజయాలను, ఇస్తాయి.

7) మనలో ఏమన్నా లోపాలున్నాయని మనం గుర్తిస్తే, మనం కొంత సాధన చేసి చైతన్య శక్తిని ఆ లోపాలవైపు కేంద్రీకరిస్తే చాలు, ఆ లోపం సరిదిద్దబడి, విజయాన్ని పొందుతాము.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. మనోశక్తి - Mind Power - 8 🌹

🌹. మనోశక్తి - Mind Power - 8 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻 Q 8 :-- conscious మైండ్ మనకున్న తప్పుడు అభిప్రాయాలతో మనల్ని పరిధుల్లో ఎలా ఉంచుతుంది? 🌻 

A:-- 1) జీవితం దుఃఖమయం, గతజన్మ పాపం వల్ల దేహం తీసుకోవడం జరిగింది. నాకు మహిమాన్విత శక్తి లేదు. గతంలో చేసిన కర్మల వల్ల దుఃఖిస్తున్నాను.

 పరిస్థితులు ముందు నేను నిస్సహాయుడ్ని, వాటిని అదుపులో ఉంచలేను. నా వ్యక్తిత్వం ప్రవర్తన బాల్యం నుండి వచ్చింది. దానిని నేను మార్చలేను.

2) అందరూ చెడ్డవాళ్ళగానే కనిపిస్తున్నారు, నేను గొప్పవాడ్ని. నాకు తెలిసిన సత్యం ఇంకెవ్వరికి తెలియదు. నా తెగవాళ్ళు గొప్పవాళ్ళు, మిగతా వారందరు హీనమైనవారు.

3) వయస్సు పెరిగే కొద్ది దేహం యొక్క శక్తి క్షీణించి,శ రీరం అనారోగ్యాలుపాలు
అవుతుంది.

4) నాకు సృజనాత్మకత లేదు, ఊహించడం, కలలు కనడం కూడా రాదు.

5) దురదృష్టం ఎప్పుడు నన్ను వెంటాడుతూవుంటుంది. ధనం వల్ల వచ్చే లాభం ఏమి లేదు.ఆశాపూరితులే ధనార్జన చేస్తారు, ధన సంపాదన వల్ల ఆధ్యాత్మికంగా ఎదగలేరు. ఆనందంగా జీవించలేరు.

6) పూర్వీకుల జీన్స్ ద్వారా నాకు అనారోగ్యం, ఊబకాయం వచ్చింది.ఏ పనిని సక్రమంగా చేయను,నా స్వభావమే అంత,నన్ను ఎవరు ఇష్టబడరు.

ఇలాంటి తప్పుడు అభిప్రాయాలతో మనం ఎన్నో పరిమితులతో conscious మైండ్ ని ఉపయోగించుకోలేక పోతున్నాము.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. మనోశక్తి - Mind Power - 7 🌹

🌹. మనోశక్తి - Mind Power - 7 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీ వైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. Q 7:-- conscious mind (చేతనాత్మక మనస్సు), subconscious mind (ఉపచేతనాత్మక మనస్సు) అంటే ఏమిటి ? 🌻 

A:-- 1) conscious మైండ్ ఎరుకలో ఉంటుంది, ఉపచేతనాత్మక మనస్సు ఎరుకలో ఉండదు.

2) మన మైండ్ అనంతమైన పోరలను కలిగి ఉందని ఊహించుకుంటే, ఉపరితలంలో పైన ఉండే పొర conscious మైండ్ గా పిలవబడుతుంది. 

అంతరాంతరాలలో అపరిమితమైన పొరలను ఉపచేతనాత్మక మనస్సు అని చెప్పవచ్చు. మైండ్ అంటే పొరలు అని కాదు, అర్థమవ్వడానికి అలా చెప్పడం జరిగింది.

3) మహాసముద్రమంత మైండ్ లో conscious మైండ్ ఒక అల. అలజడి మాత్రమే. conscious మైండ్ బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి అంతర ప్రపంచానికి ఒక మార్గంగా పనిచేస్తుంది.

4) అంతర్ ప్రపంచం లేదా అంతర్ శక్తి లేదా subconscious మైండ్ ను మహాసముద్రం తో పోల్చవచ్చు.దీనిని సూపర్ conscious మైండ్ అని కూడా అనవచ్చు.వాస్తవానికి మైండ్ కి పేర్లు లేవు.

4) ఆత్మజ్ఞానం పెరిగేకొద్దీ subconscious మైండ్ open అవుతుంది.

5) జన్మపరంగా సంప్రాప్తించుకున్న జ్ఞానం అంతా subconscious మైండ్ లో store అవుతుంది.

6) conscious మైండ్ యొక్క ఉప ఉత్పత్తి గర్వం.ఇది బాహ్యప్రపంచం లో సంపాదించుకున్న జ్ఞానం వల్ల పుడుతుంది.అహం వల్ల మనస్సు విజృంభిస్తుంది.దీనివలన దుఃఖం పుడుతుంది.

7) conscious మైండ్ కి అంతర్వాణి మరియు విచక్షణ జ్ఞానం తోడైతే ఆ వ్యక్తులుకు positive thinking ఉంటుంది.

8) conscious మైండ్ ని తప్పుడు అభిప్రాయాల వల్ల, సంఘం ఇచ్చిన బుద్ధి వల్ల బాహ్యప్రపంచపు పరిమిత జ్ఞానం వల్ల, మానసిక సోమరితనం వల్ల అసాధారణ రీతిలో ఉపయోగించు కోలేక పోతున్నాము.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. మనోశక్తి - Mind Power - 6 🌹

🌹. మనోశక్తి - Mind Power - 6 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻 Q 6 :-- higher ఫ్రీక్వెన్సీ లో ఉన్న లోకాల వారు వారి ఆలోచనలను ఎలా ఉపయోగిస్తారు? 🌻 

A:--1) higher energy, higher frequency గల ఉన్నత లోకాలలో వారు telepathy కమ్యూనికేషన్ ఉపయోగిస్తారు. అనగా మనం ఒకటి సంకల్పిస్తే ఆ ఆలోచన తరంగాలు ఆ ఎదుటివ్యక్తి యొక్క మనోశక్తి గ్రహించగలుగుతుంది. ఆ విధంగా సంభాషించుకుంటారు.

2) వారికి ఎంతో పారదర్శకత ఉంటుంది, ఒకరి మైండ్ లోని ఆలోచనలు మరొకరు సులభంగా పసిగట్టగలరు.
ఏది దాచిపెట్టలేరు.

3) వినాశకర ఆలోచనలు మైండ్ నుండి వెలువడడం జరగదు.

4) అక్కడి జీవజాతులు ఉన్నతమైన ఆలోచనలను వెలువరించడం ద్వారా ఉన్నత రీతిలో పరిణామం చెందుతున్నారు.

5) వారికి చైతన్య శక్తి యొక్క స్థితిగతులు దాని పర్యవసానాలు బాగా తెలుసు.
కావున జీవజాతులు మధ్య పరస్పర సహకారం ఉంటుంది.

6) సంభావ్య ఆత్మలు అనగా మనం ఆలోచించిన ప్రతిసారి మన ద్వారా మనం ఒక అంశాత్మను సృష్టిస్తున్నాం అన్నమాట. మన ఆలోచన ద్వారా సృష్టించబడ్డ అంశాత్మ ఆ ఫ్రీక్వెన్సీ గల లోకంలో అనుభవాలను పొందుతూ చైతన్య వికాసం చెందుతుంటుంది.

7) ఉన్నత ఆత్మలు వారి సంభావ్య ఆత్మలతో telepathy ద్వారా ఆలోచనలు పంచుకుంటూ అభివృద్ధి చెందుతుంటారు.

8) చైతన్యశక్తి యొక్క డైనమిక్స్ తెలిసినప్పుడు ఆలోచనలను వినాశకర రీతిలో ఉపయోగించరు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. మనోశక్తి - Mind Power - 5 🌹


🌹. మనోశక్తి - Mind Power - 5 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌷. అధ్యాయము : మనోశక్తి 🌷

🌻 Q 5 :-- మన నుండి వెలువడిన ఆలోచనా తరంగాలు ఎంత వేగంగా ప్రయాణిస్తాయి? 🌻 

A:-- మన నుండి వెలువడిన ఆలోచనా తరంగాలు కాంతి వేగం కంటే అధిక వేగంతో ప్రయాణిస్తాయి.

ఆలోచనా తరంగాల వేగం లెక్కకట్టేంత పరిజ్ఞానం ఇంకా మన సైన్స్ కు లేదు.
మనం సంకల్పించిన వెంటనే మన ప్రతిరూపం (counter self) వేరే గాలక్సీ లోని వేరే లోకం లోకి అయిన అక్కడ ప్రత్యక్షీకరించబడుతుంది.

ఆలోచనాతరంగాలు విద్యుదాయస్కాంత శక్తిని కలిగివుండి చైతన్యశక్తితో (consciousness) తో ప్రయాణిస్తాయి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. మనోశక్తి - Mind Power - 4 🌹

🌹. మనోశక్తి - Mind Power - 4 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌷. అధ్యాయము : మనోశక్తి 🌷

🌻 Q 4 :-- టెలిపతీ telepathy అంటే ఏమిటి? 🌻 

A:-- మనం ఒక వ్యక్తి గురించి తీవ్రంగా ఆలోచించినపుడు, మన ఆలోచనా తరంగాలు ఆ వ్యక్తిని చేరుతాయి. అతని మనోశక్తి ఆ ఆలోచనా తరంగాలు ను పసిగట్టగలుగుతుంది. దీనినే టెలిపతి అంటారు.
       
Telepathy ద్వారా జంతువులతో, పక్షులతో, వృక్షాలు తో సముద్రంతో, భూమితో, అలా ఏ వస్తువుతో నైనా సంభాషించవచ్చు. ఈ విశ్వంలో ప్రతి ప్రాణితో telepathy ద్వారా సంభాషించగలం.

మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్,పదార్ధాన్ని దాని భౌతిక స్వరూపంతో కాకుండా, దాని చైతన్య శక్తి తో సంభాషించగలగడం.

పూర్వపు నాగరికతల్లో మానవజాతి జంతుజాతి, వృక్షజాతి, పక్షిజాతి, ఇలా అన్నిటితోను సంభాషించేవారు.
   
  మొక్కలతో సంభాషించి ఎన్నో ఔషధాలను మన ఋషులు మనకు అందించారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. మనోశక్తి - Mind Power - 3🌹

🌹. మనోశక్తి - Mind Power - 3 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌷. అధ్యాయము : మనోశక్తి 🌷

🌻 Q 3:-- భౌతిక పదార్ధం ఎలా సృష్టించ బడుతుంది? 🌻 

A:-- మన మైండ్ నుండి వెలువడే ఆలోచనా తరంగాలు ఎంత సాంద్రత తో, ఎంత తీవ్రతతో, ఉన్నాయో దాన్ని బట్టి చైతన్యశక్తి భౌతిక పదార్ధంగా రూపాంతరం చెందుతుంది.

       మైండ్ నుండి వెలువడే ఆలోచనా తరంగాలు బలహీనమైతే దానికనుగుణంగా మిధ్యా భౌతిక రూపం (pseudo physical form) ఏర్పడుతుంది. ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ, శక్తి, సాంద్రతలకు సరిపడే లోకంలో అక్కడ పరిస్థితులుకు అనుగుణంగా భౌతిక రూపం ఏర్పడుతుంది.

అంతేకాని మన మైండ్ నుండి వెలువడిన ఆలోచనా తరంగాలు నశించిపోవడం గాని,మటుమాయమైపోవడం గాని జరుగదు.
       
మన ఆలోచనలు భౌతిక వాస్తవం పొందాలంటే మన మైండ్ లో,మన మనో ప్రపంచంలో, ఎంత గాఢంగా వాంచిస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది.
       
మన ఆలోచనల తీవ్రత,ఫీలింగ్స్,ఎమోషన్స్, ఎంత తీవ్రంగా ఉన్నాయి, మన నమ్మకపు వ్యవస్ధ ఎలా ఉంది, అనేది ముఖ్యమైంది.
        
మన మనోశక్తి ద్వారా మన దేహాన్ని సృష్టించుకున్నామన్నది ఎంత నిజమో,మన ఆలోచనలు వాస్తవ రూపం పొందుతాయన్నది కూడా అంతే నిజం.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. మనోశక్తి - Mind Power - 2 🌹

🌹. మనోశక్తి - Mind Power - 2 🌹
 Know Your Infinite Mind

🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌷. అధ్యాయము : మనోశక్తి 🌷

🌻 Q 2 :-- దేహం ఎలా ఏర్పడింది? 🌻 

A:-- భూమి అనే దేహాన్ని ఒకానొక ఆత్మ సృష్టించుకుంది, సూర్యుడు అనే దేహాన్ని ఇంకొక ఆత్మ సృష్టించుకుంది. మన subconscious మైండ్ ద్వారానే మనం మన దేహాన్ని సృష్టించుకున్నాం, subconscious మైండ్ వల్లనే పదార్ధం సృష్టించబడింది, ప్రభావితం చేయబడుతుంది.

మన దేహం అందంగాగాని, వికారంగగాని, ఆరోగ్యం గా గాని, అనారోగ్యంగాగాని, చురుగ్గాగాని, నెమ్మదిగాగానీ, ఉందని judgement చేస్తాం. 

కానీ అది మన మనోశక్తి నుండి వచ్చిన ఆలోచనలుకి అనుగుణంగా మనం జన్మ తీసుకోక మునుపే తల్లిదండ్రులు ను ఎంచుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే దేహాన్ని సృష్టించుకోవడం జరిగింది.

🌻. మన ఆలోచన,భావోద్వేగాల ద్వారానే మన దేహం యొక్క సృష్టి జరిగింది. 🌻
          
మన మనోశక్తి ద్వారా ఏది ఊహించుకుంటామో దానికనుగుణంగా పరమాణువులు, అణువులు, సముదాయంతో దేహ నిర్మాణం జరుగుతుంది. మన మనోశక్తి నుండి ఊహాశక్తి యొక్క image దేహంగా రూపుదిద్దుకుంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. మనోశక్తి - Mind Power - 1 🌹

🌹. మనోశక్తి - Mind Power - 1 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌷. అధ్యాయము : మనోశక్తి 🌷

🌻 Q1:- మైండ్ (mind) లేదా మనోశక్తి (mind power)కి మెదడు (brain) కి మధ్య తేడాలేంటి ? ఇవి నిర్వహించే పనులు ఏంటి? 🌻 

A. 1) brain (మెదడు) అనేది దేహంలో ఒక అవయవం.
గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, ప్రేగులు, కళ్ళు ఎలాగో మెదడు కూడా ఒక అవయవం. శాస్త్రవేత్తలు మెదడును ముక్కలుగా చేసి పరిశోధన చేశారు. చిన్నమెదడు, పెద్దమెదడు, మెడుల్లాఅబ్లాంగేట, ఎడమ మెదడు, కుడి మెదడు, అని అనేక పేర్లు పెట్టారు.

2) మైండ్ లేదా మనోశక్తి ఆత్మశక్తికి అంతర్ ప్రపంచానికి సంబంధించింది. మైండ్ చర్మచక్షువుకు కనిపించదు. శాస్త్ర పరికరాలకు అంతు చిక్కదు.

3) మెదడు దేహంలోని అన్ని భాగాలను నియంత్రిస్తుంది, మరియు దేహంలోని నాడులన్నింటికి అనుసంధానింపబడి ఉంటుంది.

4) మైండ్ గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు పనిచేయడం, జీర్ణవ్యవస్థ లాంటి ఎన్నో ప్రక్రియలను నడిపిస్తుంది. ఈ ప్రక్రియలను నడిపించడానికి మైండ్ మెదడు అనే సాధనాన్ని ఉపయోగించుకుంటుంది.

5) ఆలోచనా తరంగాలు (thought waves) మైండ్ లో ఉత్పత్తి అయి మెదడు ద్వారా బయటకు వస్తాయి. ఒక డాక్టర్ బ్రెయిన్ ని కణవిభజన చేయగలడు కాని , ఆ మెదడులోకి ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చాయో అనే విషయం చెప్పలేడు.

6) దేహం ఏర్పడక ముందే ఆత్మ మరియు మైండ్ రెండు ఉన్నాయి. దేహం నశించిన తర్వాత కూడా ఆత్మ మరియు మైండ్ రెండూ ఉంటాయి.

7) మైండ్ యొక్క ఊహాశక్తి నుండి జనించిందే ఈ దేహం, ఈ దేహం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మైండ్ జన్మపరంపరలుగా, మనతోనే ఉంది.జన్మ పరంపరల నుండి జ్ఞానాన్ని, అనుభవాల్ని, చైతన్యశక్తిని, మైండ్ మోసుకొస్తూ ఉంది.

8) గత కోటానుకోట్ల జన్మల తాలూకూ జ్ఞానాన్ని కూడా మైండ్ లో నిక్షిప్తం అయి ఉంది. మరణించిన తర్వాత దేహాన్ని వదిలేస్తాము. కానీ జ్ఞానం, అనుభవాలు, చైతన్య శక్తి సంస్కారాలు, అన్ని నిక్షిప్తం అయి ఉంటాయి. అవి తర్వాత కూడా continue అవుతాయి.

9) ప్రతి జన్మకు మైండ్ వ్యాకోచం చెందుతూ ఉంటుంది. ఈ భూమి మీద జన్మపరంపర పరిసమాప్తి అయిన తర్వాత ఆత్మ మరో లోకంలో జన్మ తీసుకుంటుంది. అక్కడ కూడా మైండ్ అక్కడి జ్ఞానాన్ని, అనుభవాల్ని, పొందుతూ వ్యాకోచం చెందుతుంది.

10) ఈ విశ్వంలో ప్రతి ఆత్మశకలానికి మైండ్ ఉంది. అణువు, పరమాణువు, ఎలెక్ట్రాన్, ప్రతీది చైతన్యశక్తి మరియు మైండ్ ని కలిగి ఉన్నాయి. అన్నింటి మైండ్స్ అనుసంధానింపబడి ఉన్నాయి.

11)మనిషికి ఆత్మ, మైండ్ ఎలాగైతే ఉంటుందో, అలాగే భూమికి, భూమిపై ఉన్న సకల జీవరాశులకు ఆత్మ, మైండ్ ఉంటాయి. మూలకాలు, ఏకకణ జీవులకు కూడా ఆత్మ, మైండ్ ఉంటాయి.

12) సీతాకోకచిలుక, సాలెపురుగు, ఇవి వాటి మనోశక్తి ద్వారానే అందమైన దేహాన్ని, గూటిని నిర్మించుకుంటున్నాయి. పక్షులు వేల మైళ్ళు వెళ్లి ఆహారాన్ని సంపాదిస్తున్నాయి. జంతువులు జీవజాతులన్ని, ప్రకృతి వైపరిత్యాలని ముందుగానే పసిగడుతున్నాయి. ఇవన్నీ మనోశక్తి ద్వారానే సాధ్యం.

13) సంకల్పం, ఊహాశక్తి, ఇంటలిజెన్స్, తర్కం, విశ్లేషణ, స్వప్నాలు, ఆలోచనాశక్తి, clairvoyance, telepathy, సహజావబోధన, జ్ఞాపకశక్తి, ఈ ప్రక్రియలన్ని మైండ్ ద్వారానే జరుగుతున్నాయి.

14) మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, అనేవి మైండ్ కి సంబంధించినవి. కామం, క్రోధం, రాగం, ద్వేషం, లాంటివన్ని మైండ్ నుండి పడుతున్నాయి.

జీవరాసులన్నీ కలిస్తేనే ప్రకృతి. ప్రకృతి అనే మహాసముద్రం లో మనిషి ఒకానొక అల మాత్రమే.
🌹 🌹 🌹 🌹 🌹