🌹. మనోశక్తి - Mind Power - 9 🌹

🌹. మనోశక్తి - Mind Power - 9 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻 Q 9 :--వర్తమానంలో ఉండడం వల్ల లాభాలేంటి? వర్తమానంలో జీవిస్తే గతాన్ని ఎలా పునర్నిర్మించవచ్చు? మరియు భవిష్యత్తును ఎలా మలచుకోవచ్చు? 🌻 

A:-- 1) వర్తమానమే బహుమానం. గతంలో ఏమైనా వర్తమానం మన చేతుల్లో ఉంది.

2) వర్తమానాన్ని చక్కపెడితే భవిష్యత్తు automatic గా మారుతుంది. ఎందుకంటే భవిష్యత్తు లో ఏమి జరగాలో ముందే నిర్ణయించబడదు.

3) భవిష్యత్తు ని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పుకోవచ్చు. for ex:--బంకమట్టిని తీసుకుందాం. దానిని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పవచ్చు. అదేవిధంగా వర్తమానాన్ని సరిచేస్తే భవిష్యత్తు కూడా మారుతుంది.

4) chess game ని పరిశీలిద్దాం.
పావులను కదపడంలో కొన్ని తప్పులు చేసామనుకోండి, అలాగని ఆట గతం లో లేదు. ఇప్పుడు మనం వర్తమానంలో ఆ పావులను సక్రమంగా కదుపుతున్నామో లేదా అనే దానిపైనే గెలుపు, ఓటములు ఆధారపడి ఉంటాయి. వర్తమానంలో కదిపే పావులతో గతంలోని ఆట automatic గా మారుతుంది.అప్పుడు భవిష్యత్తు యొక్క గెలుపు, ఓటములు కూడా automatic గా మారుతాయి.

అంటే ఇక్కడ ఏమయ్యింది, వర్తమానం గతాన్ని పునర్నిర్మించింది, భవిష్యత్తుని కూడా సృష్టించింది. అంతేగాని గతము, భవిష్యత్తు వర్తమానాన్ని సృష్టించలేదు.

5) గతకాలంలో చేసిన తప్పులు, గతజన్మలో చేసిన తప్పులు ఇప్పుడు నెమరువెయ్యడం అర్థరహితం.

ఎందుకంటే మనం ఎన్నో జన్మలు దాటుకుని, ఎంతో జ్ఞానాన్ని ఆర్జించాము. దానిని వర్తమానంలో implement చేస్తే చాలు. గతం తుడిచి పెట్టుకుపోతుంది. భవిష్యత్తు మలచబడుతుంది.

6) ఒకవేళ గతంలోకి చూడవలసివస్తే, ఆనందంగా ఉన్న క్షణాలు, ఆరోగ్యంగా ఉన్న క్షణాలు, విజయాలు సాధించిన క్షణాలు, గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు అవి మనకు మరింత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజయాలను, ఇస్తాయి.

7) మనలో ఏమన్నా లోపాలున్నాయని మనం గుర్తిస్తే, మనం కొంత సాధన చేసి చైతన్య శక్తిని ఆ లోపాలవైపు కేంద్రీకరిస్తే చాలు, ఆ లోపం సరిదిద్దబడి, విజయాన్ని పొందుతాము.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment