2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 229 / Sripada Srivallabha Charithamrutham - 229 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 109🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 132🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 45 / Sri Lalita Sahasranamavali - Meaning - 45 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 48 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 16 🌹
8) 🌹. శివగీత - 14 / The Shiva-Gita - 14🌹
9) 🌹. సౌందర్య లహరి - 56 / Soundarya Lahari - 56🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 355 / Bhagavad-Gita - 355🌹
11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 182🌹
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 58 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 54🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 69 🌹
15) 🌹 Seeds Of Consciousness - 133 🌹
16) 🌹. మనోశక్తి - Mind Power - 72 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 18 🌹
18) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 12🌹
19) 🌹. సాయి తత్వం - మానవత్వం - 56 / Sai Philosophy is Humanity - 56 🌹
20)
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 441 / Bhagavad-Gita - 441 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 51 🌴*
51. అర్జున ఉవాచ
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్ధన |
ఇదానీమస్మి సంవృత్త: సచేతా: ప్రకృతిం గత: ||
🌷. తాత్పర్యం :
ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్యరూపమును గాంచినంత ఇట్లు పలికెను: ఓ జనార్ధనా! అత్యంత సుందరమైన ఈ నీ మానవరూపమును గాంచి శాంతచిత్తుడవై నా సహజస్వభావమును పొందితివి.
🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుడు సహజముగా ద్విభుజుడని ఈ శ్లోకమునందలి “మానుషం రూపం” అను పదము స్పష్టముగా తెలుపుచున్నది. శ్రీకృష్ణుడు సామాన్యమానవుడే యనెడి భావనలో ఆ దేవదేవుని అపహాస్యము చేయువారు అతని దివ్యస్వభావమును ఎరుగనివారని ఇచ్చట నిరూపించబడినది.
శ్రీకృష్ణుడు సాధారణ మానవుడే యైనచో తొలుత విశ్వరూపమును, ఆ పిదప చతుర్భుజనారాయణ రూపమును చూపుట అతనికెట్లు సాధ్యమగును?
కనుక శ్రీకృష్ణుని సామాన్యమావవునిగా భావించుచు, నిరాకరబ్రహ్మమే శ్రీకృష్ణునిలో నుండి పలుకుచున్నదని వ్యాఖ్యానించుచు పాఠకుని తప్పుద్రోవ పట్టించువారు నిక్కము జనులకు గొప్ప అన్యాయము చేసినవారగుదురు. ఈ విషయమే భగవద్గీత యందు ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది.
శ్రీకృష్ణుడు వాస్తవముగా విశ్వరూపమును మరియు చతుర్భుజనారాయణ రూపమును ప్రదర్శించినపుడు సామాన్యమానవుడెట్లు కాగలడు? శుద్ధభక్తుడైనవాడు సత్యదర్శియైనందున అట్టి తప్పుద్రోవ పట్టించు గీతావ్యాఖ్యానములచే కలతను పొందడు.
భగవద్గీత యందలి మూలశ్లోకములు సూర్యుని భాతి సుస్పష్టములు. మూర్ఖవ్యాఖ్యాతల దీపపు వెలుగు వాటికి ఏమాత్రము అవసరము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 441 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 51 🌴*
51. arjuna uvāca
dṛṣṭvedaṁ mānuṣaṁ rūpaṁ
tava saumyaṁ janārdana
idānīm asmi saṁvṛttaḥ
sa-cetāḥ prakṛtiṁ gataḥ
🌷 Translation :
When Arjuna thus saw Kṛṣṇa in His original form, he said: O Janārdana, seeing this humanlike form, so very beautiful, I am now composed in mind, and I am restored to my original nature.
🌹 Purport :
Here the words mānuṣaṁ rūpam clearly indicate the Supreme Personality of Godhead to be originally two-handed. Those who deride Kṛṣṇa as if He were an ordinary person are shown here to be ignorant of His divine nature.
If Kṛṣṇa is like an ordinary human being, then how is it possible for Him to show the universal form and again to show the four-handed Nārāyaṇa form?
So it is very clearly stated in Bhagavad-gītā that one who thinks that Kṛṣṇa is an ordinary person and who misguides the reader by claiming that it is the impersonal Brahman within Kṛṣṇa speaking is doing the greatest injustice. Kṛṣṇa has actually shown His universal form and His four-handed Viṣṇu form.
So how can He be an ordinary human being? A pure devotee is not confused by misguiding commentaries on Bhagavad-gītā because he knows what is what.
The original verses of Bhagavad-gītā are as clear as the sun; they do not require lamplight from foolish commentators.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 229 / Sripada Srivallabha Charithamrutham - 229 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 43
*🌻. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ, రాజరాజేశ్వరీ - 2 🌻*
ఇక సరస్వతిమాతను ఉపనిషత్తులలో ఉద్గీత అని దశమహా విద్యలలో మాతంగి అని వర్ణించారు. అయితే దివ్యనైపుణ్యానికి, ఆత్మ చైతన్యకర్మలకు మహాసరస్వతి ప్రతీక.
ఈ మహాతల్లి అనుగ్రహం వలన మనకు కర్మలను నిర్వహించడంలో నేర్పు వస్తుంది, దివ్య ఙ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో, ఆత్మ చైతన్యాన్ని జీవితానికి ఎలా అన్వ యించాలో, అనేక శక్తుల సామరస్యత వలన సంతోషం ఏ రకంగా కలుగుతుందో తెలుస్తుంది.
అనఘాలక్ష్మిలో రాజ రాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు పరిపూర్ణంగా ఉంటాయి. రూపం లక్ష్మిలా ఉంటుంది. అలాగే అనఘుని రూపం విష్ణువులా ఉండి, ఆయనలో త్రిమూర్తుల లక్షణాలు పరిపూర్ణంగా ఉంటాయి.
కాబట్టి అనఘా సమేత అనఘుని ఆరాధించడం సర్వ శ్రేయోదాయకం. వివిధ దేవతలను ఆరాధించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. అయితే దత్తారాధనవల్ల ఆయా దేవతలిచ్చే శుభఫలాలు తొందరగా కలుగుతాయి.
దత్తుడు సర్వదేవతా స్వరూపుడు, అవతార సమాప్తిలేని మహా అవతారం అవడంవల్ల ఇది సాధ్యం అవుతుంది," అని వివరించి సుఖం, హర్షం, పార వశ్యం, ఆనందం ఇవి వేరు వేరు భావాలని, ఆనందం ఆధ్యాత్మికమైనదని, అది పరమేశ్వరునికి సంబంధించిన విషయం అని,
పారవశ్యం యోగికి కలిగే అనుభవమని, కోరికలు లేనివారికి కలిగేది హర్షం అని, స్థూలంగా చూస్తే సుఖం భౌతికమైనది అని, సాధారణంగా సుఖం అందరికి అందుబాటులో ఉంటుందని కాని సుఖంయొక్క నిర్వచనం వ్యక్తులను బట్టి మారుతుంటుందని, సుఖంతోపాటు దుఃఖం అనివార్యమని చెప్పారు.
తరువాత నన్ను ఉద్దేశించి, "నాయనా! శంకరభట్టూ! నీవు వ్రాయబోయే గ్రంథం శాశ్వతమైన, అనశ్వరమైన గురుసార్వభౌముల తత్వాన్ని, లీలలను యధాతధంగా చిత్రించే గ్రంధం.
దీన్ని భక్తి, శ్రద్ధలతో ఏ భాషలో చదివినా ఒకే రకమయిన చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇందులోని ప్రతి అక్షరం బీజాక్షర శక్తిని కలిగి ఉంటుంది," అని నేను వ్రాయబోయే శ్రీచరణుల చరితామృత విశిష్టతని అభివర్ణించారు.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 229 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 24.
*🌻 Explanation of Ardhanareeswara Tatwam - 3 🌻*
Yogi, by doing sadhana with breath in his body will get the siddhi of everything in the kaala chakra. He will get the knowledge of everything in the past, present and future.
One should understand this kaalachakra as the Ardhanareeswara tatwa and as a couple who can never be separated. The day and night; the pournami and amavasya will be appearing one after the other.
One is the basis for the other. There can not be day without night and night without day. The Ardha Nareeswaras called mothers and fathers are becoming the cause for the running of this creation.
The inner meaning, of saying that Siva is the cause of destruction, is that old creation goes and new creation comes. While changes are occurring in this creation naturally, creation of new things, their presence for sometime, and their destruction are inevitable.
To get siddhi of all the astras, shastras and mantras mentioned in the Adharvana Veda, one should have the grace of Eesana Rudra who is the head of these ‘astra, shastra vidyas’.” I prayed Sri Dharma Gupta to explain the close relationship between Arudra Star and Siva Parvathi.
Sri Dharma Gupta said, ‘Siva gives darshan as hunter Rudra who holds his bow and arrow aiming a running antelope. He appears in Arudra star in that form in the sky. He looks like a hunter.
🌻 The influence of the movement of Planets 🌻
This form of hunter Rudra appears in the constellation of stars across the Midhuna and Karkataka Rasis in one corner. When the cruel planets Shani, Kuja and Rahu move close to this constellation of stars, wars spreading across the globe and ‘pralayas’ happen.
The wars between Gods and Demons; and the Maha Bharatha war occurred due to such positions of stars only.
Vedas described the destroyer of kaala as fierce Rudra wearing bow and arrow in the form of ‘Manyu’ devatha. That Rudra murthi’s weapon is not Trishul. It is Dhanush only.
In the month of Maagha, the Chaturdasi (14th day) before Amavasya is called Maha Siva Rathri. Every week, the Chaturdasi that comes before Amavasya is called Maasa Siva Rathri.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 109 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. కోరికలు - ధర్మస్వరూపము 🌻*
ధర్మము మొదలగు వాని స్వరూపము కోరిన వానిని బట్టి మారుచుండును.
కోరనివాని ధర్మమునకు ప్రభువు అచ్యుతుడు. కోరిన వారి ధర్మమునకు ప్రభువులు కోరిన వారే.
తుదకు మోక్షము కూడ నిట్లే. మోక్షమనగా ఉపాసకుడు ఏమనుకొనుచున్నాడో అదియే దక్కును గాని , సకల బంధ విమోచనము దక్కదు .
మోక్షమునకు గూర్చి తనకు గల అభిప్రాయములు తనను బంధించును. అపుడు మోక్షమను పేర జీవుడు బద్ధుడగుచు దాని కొరకై యత్నించుచు చచ్చుచు, పుట్టుచుండును.
*🌻. ఇదియే విష్ణుమాయ.*
🌻 🌻 🌻 🌻 🌻
ఎదిరించి యుద్ధము చేయుచున్నను , భక్తితో కొలిచినను శ్రద్ధతో మనస్సు విష్ణుని యందుంచుట జరుగును. ఏ విధముగా జరిగినను వానిపై మనస్సు నిలుచుట చాలును.
దానితో వారి భావములు కరగిపోయి మనస్సు మాత్రము నిలబడును. ఆ మనస్సు భగవంతుని ప్రతిబింబముగా పరిణమించును. అపుడు జీవుడుండక భగవంతుడే యుండును.
*🌻. అదియే మోక్షస్థితి.*
...... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 The Masters of Wisdom - The Journey Inside - 131 🌹*
*🌴 The Crises - 5 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj
*🌻 Standing above the Pairs of Opposites - 1 🌻*
All crises, on every level, have the same evidence and message for us:
Stand above the crisis, above the pairs of opposites and then watch them. When we are above them we see that the pairs of opposites complement each other. As long as we are in them we see opponents and fight.
If, for example, there is unrest in an individual we should ask ourselves why, what the concern is about. It needs a loving understanding to learn the reason. Then we can trace it back to its origin, but not with power or authority.
Each time we suppress something it springs up again. With a loving understanding we can also see the message the unrest on the planet carries in itself.
Our work is to keep away from opinions and to remain dispassionate, without prejudices. When we are neutral, there is no criticism in us, but we reach a higher understanding.
Thus, we call in the light and pass it on so that what is good for all might arise. Crises, also our personal crises, cannot be solved as long as we don’t regularly work for it.
🌻 🌻 🌻 🌻 🌻 🌻
Sources: Master K.P. Kumar: Uranus. The Alchemist of the Age / The Teachings of Sanat Kumara / notes from seminars.
Continues
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 45 / Sri Lalita Sahasranamavali - Meaning - 45 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్లోకం 83
378. ఓడ్యాణపీఠనిలయా -
ఓడ్యాణ పీఠమునందు ఉంది.
379. బిందుమండలవాసినీ -
బిందువును పరివేష్టించి యుండు స్థానమున వసించునది.
380. రహోయాగక్రమారాధ్యా -
ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడునది.
381. రహస్తర్పణతర్పితా - రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది.
🌻. శ్లోకం 84
382. సద్యఃప్రసాదినీ -
తక్షణములోనే అనుగ్రహించునది.
383. విశ్వసాక్షిణీ -
విశ్వములోని కృత్యములకు ఒకే ఒక సాక్షి.
384. సాక్షివర్జితా -
సాక్షి లేనిది.
385. షడంగదేవతాయుక్తా -
ఆరు అంగదేవతలతో కూడి ఉంది.
386. షాడ్గుణ్య పరిపూరితా -
ఆరు విధములైన గుణములచే పుష్కలముగా నిండి యుండునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 45 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 Sahasra Namavali - 45 🌻*
378 ) Jalandhara sthitha -
She who is on Jalandhara peetha or She who is purest of the pure
379 ) Odyana peeda nilaya -
She who is on Odyana peetha or She who lives in orders
380 ) Bindu mandala vaasini -
She who lives in the dot in the center of Srichakra
381 ) Raho yoga kramaradhya -
She who can be worshipped by secret sacrificial rites
382 ) Rahas tarpana tarpitha -
She who is pleased of chants knowing its meaning
383 ) Sadya prasadini -
She who is pleased immediately
384 ) Viswa sakshini -
She who is the witness for the universe
385 ) Sakshi varjitha -
She who does not have witness for herself
386 ) Shadanga devatha yuktha -
She who has her six parts as gods viz., heart, head, hair. Battle dress, eyes and arrows
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నారద భక్తి సూత్రాలు - 48 🌹*
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రథమాధ్యాయం - సూత్రము - 27
*🌻 27. ఈశ్వర రస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాత్ - 5 🌻*
భక్తి కోసం, జ్ఞానం కోసం చేసే సాధనలలో భగవంతుడున్నాడని విశ్వాస ముండాలి. ఆయనతో ఐక్యమవడమే లక్ష్యంగా చేసుకోవాలి.
చాలామంది భగవంతుడున్నాడని నమ్ముతారు గాని, దైవేచ్ఛ ప్రకారం నడచుకోరు. అందువలన దైవం గురించి వివరమైన దృఢమైన అవగాహన ఉండాలి.
ధన, శ్రమ, అవయవ దానాల వంటి త్యాగబుద్ధి ఉండాలి. ఇందులో ‘‘నేను చేశాను’’ అనే అహంకారం తలెత్తరాదు. అందరిలోనూ భగవంతుడున్నాడనే భావనతో ‘నారాయణసేవ’గా చేయాలి.
భగవంతుని పూజించడం, జప, తప ధ్యానాలన్నీ నియమబద్దంగా, క్రమ శిక్షణతో దీక్షగా చేయాలి.
కర్మకాండయందు అంతరార్థ మెరిగి చిత్తశుద్ద్ధితో చేయాలి.
చేయకూడని పనులు చేయరాదు. అట్టి ఆలోచన వచ్చినంతనే సిగ్గుపడి, పశ్చాత్తాపపడి, నిగ్రహించుకోవాలి.
సత్యవ్రతం, అహింసా వ్రతం, బ్రహ్మచర్య వ్రతం, అపరిగ్రహ వ్రతం, మౌనవ్రతం వంటివి, ఉపవాసాలు వీలునుబట్టి, వాటి యొక్క అర్థం తెలిసి చేయాలి.
ఇవన్నీ మనలను మనం క్రమశిక్షణలో పెట్టు కోవడానికి అవసరమౌతాయి. అంతేగాని ఈ పనులు నేరుగా భగవంతుని వద్దకు చేర్చవు.
3. ఆసనం : పూజాది కార్యక్రమాలకు ఒక స్థిరమైన చోటును ఏర్పరచుకొని భక్తి, ఏకాగ్రత కుదిరేటట్లు కదలకుండా కూర్చునే పద్ధతిని ఆసనమంటారు. పద్మాసనం, అర్థ పద్మాసనం, సుఖాసనం ఏది కుదిరితే అదే ఆసనం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 16 🌹*
✍️. Sri GS Swami ji
📚. Prasad Bharadwaj
*🌻. The Grace of Guru is enough for everything to achieve. Your actions in front of him are like childs play 🌻*
What did Indra do? He left Roopa and went to Viswaroopa. Roopa had offered sane advice to Indra which was rejected.
But Viswaroopa had a different and a strange personality. He had three heads, while Roopa had only one head. Lord Dattatreya has three heads, but here this individual was a human with a demonic quality and sported three heads.
With one head he constantly consumed meat, with the second head he consumed liquor, and with the third head he continuously chanted the Vedas. It was very strange indeed.
By wrapping a silk saree on a pig can one make it look beautiful? While eating meat and drinking liquor, if one chants the Vedas, is it of any use? He felt flattered that he was being given the opportunity of being Guru to the gods themselves.
He also had a grudge against his brother. Now that Indra himself had approached him with the request, he felt happy that he got a chance to get even with his brother.
As his Guru, Viswaroopa had Indra perform several sacrificial rituals. In one of them he also had Indra invoke the presence of Lord Dattatreya and earned for him His grace.
Well and good. In addition, Visvaroopa initiated Indra into the Narayana Kavacha so that he would be blessed with victory in battles.
Visvaroopa had great love for his mother, who had much loyalty towards her parents. Secretly, in all the religious rituals, Viswaroopa was arranging for a portion of the fruits of the sacrifices to be distributed amongst the demons.
Outwardly he was having the deities perform great rituals, and as a result, his fame increased amongst them. That was quite natural. Let us see how his popularity is going to diminish soon.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 14 / The Siva-Gita - 14 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
ద్వితీయాధ్యాయము
*🌻. వైరాగ్య యోగము - 5 🌻*
అనాది వాసనా యుక్తాః క్షేత్ర జ్ఞా ఇతితే స్మృతాః,
మనో బుద్ది రహంకార - శ్చిత్తం చేతి చతుష్టయమ్ 30
అన్తః కరణ మిత్యాహు - స్తత్రతే ప్రతి బింబితాః,
జీవిత్వం ప్రాప్నుయు: - కర్మ ఫల భోక్తార ఏవతే 31
అనాది యగు వాసనల చేత నిండి యున్న అట్టి మహేశ్వరాంశ
సంజనితు లైన ప్రాణులు క్షేత్రజ్ఞాలన బడుచున్నారు.
మనస్సు - చిత్తము బుద్ది - అహంకారము ఈ నాల్గింటిని
యంతః కరణ చతుష్టయము లందురు.
వీటిలోనే ప్రతి బింబముగా నేర్పడిన చైతన్యమే ప్రాణముగా రూపొంది
పుణ్య పాపముల ఫలముల ననుభవించు చుండును.
( సుఖ దుఃఖము లను జీవుడు అనుభవించు చుండునని భావము )
తతో వైష యికం తేషాం - సుఖం నా దుఃఖమేవ నా,
త ఏవ భుంజతే భోగా యత నేస్మిన్ శరీరకే 32
స్థావరం జంగమం చేతి - ద్వివిధం న పురుచ్యతే,
స్థాన రాస్తత్ర దేహా స్స్యు - స్సూక్ష్మా గుల్మల తాదయః 33
అండ జా స్స్వేద జాస్తద్వ- దుద్భిజ్జా ఇతి జంగామా:,
అందుచేత విషయ విశేషము నుండి పొడమిన ఆనందము గాని,
వ్యధ గాని, భోగము నేయభి లషించు శరీరమును ప్రాణ కోటి యనుభవించు చుండును.
అట్టి శరీరము స్థావరమని, జంగమమని రెండు విధములు.
అందు స్థావర దేహును, వృక్షములు, పొదలు, తీగెలు- ఇవే మున్నగునవి.
వీని యందు సమన్వయించు కొనునది, జంగమ దేహము,
అండ జము, స్వేద జమనియు, ఉద్భిజ్జ మనియు మూడు రకములుగా విభజింప బడినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 14 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 02 :
*🌻 Vairagya Yoga - 5 🌻*
30. 31. Due to being attached with the age old Vasana(s), those souls Which are Maheshwara's reflections are being called as Kshetragya.
Mana (heart) Chitta (self) Buddhi (Mind)Ahankaram
(Ego); these four are called as 'Antahkarana Chatushtaya'. In these as a shadow remains the consciousness which is the soul and experiences the results of virtues and vices.
32. 33. Hence happiness or sorrow obtained from subjects, and the body which desires for Bhoga exists in the various forms of living beings। That kind of body is of two types called Sthavaram (Immobile) and Jangamam (mobile). Among them Sthavaram body belongs to Trees, bushes, creepers.
Jangama bodies are those who are Andajam (egg born), Swedajam (sweat born), and Unbheejam. These are the three subcategories in which Jangamam bodies are classified.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 6 / Sri Gajanan Maharaj Life History - 6 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 2వ అధ్యాయము - 2 🌻*
అందువల్ల బనకటలాలను వెతకడం కొనసాగించమని ప్రోత్సహిస్తూ తనను కూడా ఆయోగి కనిపిస్తే దర్శనానికి తీసుకొని వెళ్ళమని అతను అన్నాడు. గోవింద్ బువా తాకళికర్ అనే ప్రసిద్ధ కీర్తనకారుడు కొద్దిరోజుల తరువాత షేగాం వస్తాడు.
అతని కీర్తన శివాలయంలో ఏర్పాటు చేయబడింది, అది వినడానికి చాలామంది జనులు సమావేసం అయ్యారు. బనకటలాల్ కూడా వెళ్ళాడు. తన మిత్రుడయిన పీతాంబర్ ను ఆ గుడి లో కలుస్తాడు, మరియు శ్రీగజానన్ గూర్చి అన్ని విషయాలు వివరిస్తాడు.
వాళ్ళు కీర్తన వినేందుకు కూర్చుంటారు. లో ! అక్కడే శ్రీగజానన్ కూడా ఏకాగ్రతతో గోవిందబువా ను వింటూ ఉన్నారు. ఒక లోభికి బంగారం కనిపంచినట్టుగా, నెమలికి మబ్బు కనిపించినట్టుగా వారు సంతోషపడ్డారు.
బనకటలాల్ మరియు పీతాంబర్ లేచి శ్రీగజానన్ దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఏమయినా తినేందుకు కావాలా అని అడుగుతారు. శ్రీగజానన్ వారివైపు చూసి వెళ్ళి ఏ మాల ఇంటినుండి అయినా కొద్ది రొట్టె తెమ్మని అన్నారు.
బనకటలాల్ వెంటనే రొట్టె కూరగాయలు తెచ్చి శ్రీగజానన్ కు ఇస్తాడు. అదితిని పీతాంబరేను నదిలోనుండి తన కమండలంలో నీళ్ళు తెమ్మని అతను అంటారు. నదిపూర్తిగా ఎండిపోయింది, అందువల్ల ఎవరి ఇంటినుండి అయినా నీళ్ళు తెస్తానని పీతాంబర్ అంటాడు.
శ్రీగజానన్ ఆ నదినుండే నీళ్ళు తెమ్మని, అంతేకాక తనకమండలంలో నీళ్ళు చేతితోనింపకుండా, కమడంలాన్నే నీళ్ళలో ముంచి తెమ్మని వక్కాణిస్తారు. పీతాంబర్ నదికి వెళ్ళి చూస్తే, కమండలం తిన్నగా నీళ్ళలో నింపేందుకు సరిపడా నీళ్ళు కనిపించలేదు ఏమిచెయ్యాలి ? అతను సంఛిద్ధంలో పడ్డాడు.
చివరికి సాహసించి కమండలాన్ని నీళ్ళలో ముంచుతాడు. ఒక మహద్భుతం జరిగింది. కమండలం తిన్నగా పూర్తిగా నీళ్ళలోకి పోయింది మరియు మురికినీరు స్వఛ్ఛమయిన నీరుగామారి కమండలం నిండింది.
అతను మరొకసారి ప్రయత్నించాడు. ఆశ్చర్యకరంగా ఎక్కడ నీళ్ళలో కమండలం తగిలించినా స్వఛ్ఛమయిన నీరు ఎగసి కమండలం నిండుతోంది. ఇది అంతా శ్రీగజానన్ యోగిక శక్తివల్లనే అని అతనికి అప్పుడు అర్ధంఅయింది. పీతాంబర్ నీళ్ళు తెచ్చి శ్రీగజానన్ కు ఇస్తాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 6 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 2 - part 2 🌻*
He, therefore, encouraged Bankatlal to continue his search and also to take him for the Darshan of that yogi when found. After a few days there came the renowned Kirtankar, Govindbua Taklikar to Shegaon.
His Kirtan was arranged in the Shankarji's temple where a lot of people assembled to listen to him. Bankatlal also went there.
He met his friend Pitambar in the temple and narrated to him everything about Shri Gajanan. They sat listening to the Kirtan and lo! There was Shri Gajanan Maharaj also attentively listening to Govind Bua.
They were as delighted as does a miser at the sight of gold or a peacock at the glimpse of a cloud. Bankat and Pitambar got up, went to Shri Gajanan, bowed before Him and asked if He would like to eat something.
Gajanan looked up and said, Go and bring some bread for me from the house of some Mali (Caste). Bankatlal immediately brought bread and vegetable and gave it to Shri Gajanan. He ate it and asked Pitambar to bring some water in His Tumba from the river.
Pitambar said that the river was practically dry and offered to bring water from somebody's house. Shri Gajanan insisted on getting water from the river only and with a further condition that the water not be filled by hand, but taken directly by dipping the Tumba in the river.
Pitambar went to the river and saw that the water was not at all sufficient for dipping the Tumba. What to do? He was in a fix. Ultimately he dared and lowered the Tumba in the water and lo!
There was a miracle; the Tumba went straight full with water and the dirty water from the river became clean in the Tumba.
He tried again and was surprised to see that wherever he dipped the Tumba in the water, clean water rushed into it to the brim. He now understood that it was due to the yogic power of Shri Gajanan. Pitambar brought and offered the water to Shri Gajanan.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సౌందర్య లహరి - 56 / Soundarya Lahari - 56 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
56 వ శ్లోకము
*🌴. జైలులో ఉన్నవారి విడుదలకు, కన్నుల సమస్యలకు 🌴*
శ్లో: 56. తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితాః నిలీయం తే తోయే నియతమ నిమేషాఃశ్శఫరికాl
ఇయంచ శ్రీర్బద్ధచ్ఛదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి ll
🌻. తాత్పర్యం :
అమ్మా! ఓ అపర్ణా.. నీ చెవులకు తాకుతున్నట్లు నీ కనులు కనబడటం వలన, ఆ చెవులకు తమ రహస్యం వెల్లడి కాకుండా తమను అమ్మ కళ్ళతో పోల్చుకున్న చేపలు బెడిసి తమ రూపాలను కనబడనీయకుండా దాక్కున్నాయి. నీ కనులలో నున్న కాంతియైన సౌభాగ్య లక్ష్మి ని కలువలు ఆవిష్కరించాయని నీ చెవులతో నేత్రాలు చెబుతాయేమోనని భయపడి పగలు, ఆ పూవుని విడిచి రాత్రి మాత్రమే ఆ పూవుల రేకు డిప్పలను తెరిచి ప్రవేశిస్తోంది. అమ్మ సౌందర్యముతో తమను తాము పోల్చుకున్నామనే బెరుకు వీటిచే ఆ పని చేయింస్తోంది. కదా.
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 20,000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాయసం, తేనె నివేదించినచో జైలులో ఉన్నవారి విడుదల, కన్నుల సమస్యల నివారణ జరుగును అని చెప్పబడింది.
*🌹 SOUNDARYA LAHARI - 56 🌹*
📚Prasad Bharadwaj
SLOKA - 56
*🌴 To get freed from Imprisonment and Curing of Eye Diseases 🌴*
56. Tav'aparne karne-japa-nayana-paisunya-chakita Niliyante thoye niyatham animeshah sapharikah; Iyam cha srir baddhasc-chada-puta-kavaiam kuvalayam Jahati pratyupe nisi cha vighatayya pravisathi.
🌻 Translation :
Oh, she who is begotten to none, it is for sure, that the black female fish in the stream, are afraid to close their eyes. fearing that thine long eyes, resembling them all, would murmur bad about them, in your ears to which they are close by it is also for sure, that the goddess Lakshmi, enters the blooming blue lily flowers, before your eyes close at night, and reenter in the morn when they open.
🌴 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :
If one chants this verse 20,000 times a day for 45 days, offering honey, payasam as prasadam, it is said that one will be freed from imprisonment and also gets solution for eye related issues.
🌻 BENEFICIAL RESULTS:
Freedom from imprisonment; cures physical or mental problems and provides relief from effects of evil eyes. Causes rain.
🌻 Literal results:
Victory over inimical people, controlling secret activities.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 355 / Bhagavad-Gita - 355 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 02 🌴*
02. న మే విదు: సురగణా: ప్రభవం న మహర్షయ: |
అహమాదిర్షి దేవానాం మహర్షీణాం చ సర్వశ: ||
🌷. తాత్పర్యం :
సర్వవిధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై యున్నందున దేవతా సమూహముగాని, మహర్షులుగాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలిసికొనజాలరు.
🌷. భాష్యము :
బ్రహ్మసంహిత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడే దేవదేవుడు. అతని కన్నను అధికుడు వేరొక్కడు లేడు.
అతడే సర్వకారణకారణుడు. తానే దేవతలకు మరియు ఋషులకు కారణుడనని అతడే స్వయముగా ఇచ్చట పలుకుచున్నాడు. అనగా దేవతలు మరియు మహర్షులు కూడా శ్రీకృష్ణుని సంపూర్ణముగా ఎరుగలేరు.
వారే ఆ భగవానుని నామమును గాని, స్వరూపమును గాని ఎరుగలేరన్నచో అల్పమైన ఈ లోకమునకు చెందిన నామమాత్ర పండితుల విషయము వేరుగా తెలుపపనిలేదు. భగవానుడు ఏ కారణము నిమిత్తము ధరత్రి యందు సామాన్యమానవునిగా అవతరించి అద్భుతములు మరియు అసాధారణములైన కార్యముల నొనర్చునో ఎవ్వరును ఎరుగాజాలరు.
అనగా పాండిత్యమనునది శ్రీకృష్ణుని అవగాహన చేసికొనుటకు ఒక యోగ్యత కాదని మనము గ్రహింపవలెను. దేవతలు మరియు ఋషులు సైతము తమ మానసికకల్పనలచే శ్రీకృష్ణుని అవగతము చేసికొన యత్నించినను విఫలురైరి. కనుకనే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణభగవానుని ఎరుగాజాలరని శ్రీమద్భాగవతమునందు స్పష్టముగా తెలుపబడినది.
వారు తమ పరిమిత ఇంద్రియముల పరధి మేరకు ఊహాగానము చేయ యత్నించినను త్రిగుణములచే వ్యక్తము కానట్టి నిజతత్త్వమునకు విరుద్ధభావమైన నిరాకారతత్త్వమునే చేరగలరు. అనగా వారు మానసిక కల్పనలను కావించినను దాని ద్వారా శ్రీకృష్ణుని మాత్రము ఎరుగాజాలరు.
పరతత్త్వమును తెలిసికొనగోరువారు కొరకై శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తాను దేవదేవుడననియు మరియు పరమపురుషుడనని పరోక్షముగా తెలియజేయుచున్నాడు. ఈ విషయమును ప్రతియొక్కరు గమనింపవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 355 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 02 🌴*
02. na me viduḥ sura-gaṇāḥ
prabhavaṁ na maharṣayaḥ
aham ādir hi devānāṁ
maharṣīṇāṁ ca sarvaśaḥ
🌷 Translation :
Neither the hosts of demigods nor the great sages know My origin or opulences, for, in every respect, I am the source of the demigods and sages.
🌹 Purport :
As stated in the Brahma-saṁhitā, Lord Kṛṣṇa is the Supreme Lord. No one is greater than Him; He is the cause of all causes. Here it is also stated by the Lord personally that He is the cause of all the demigods and sages.
Even the demigods and great sages cannot understand Kṛṣṇa; they can understand neither His name nor His personality, so what is the position of the so-called scholars of this tiny planet?
No one can understand why this Supreme God comes to earth as an ordinary human being and executes such wonderful, uncommon activities. One should know, then, that scholarship is not the qualification necessary to understand Kṛṣṇa.
Even the demigods and the great sages have tried to understand Kṛṣṇa by their mental speculation, and they have failed to do so. In the Śrīmad-Bhāgavatam also it is clearly said that even the great demigods are not able to understand the Supreme Personality of Godhead.
They can speculate to the limits of their imperfect senses and can reach the opposite conclusion of impersonalism, of something not manifested by the three qualities of material nature, or they can imagine something by mental speculation, but it is not possible to understand Kṛṣṇa by such foolish speculation.
Here the Lord indirectly says that if anyone wants to know the Absolute Truth, “Here I am present as the Supreme Personality of Godhead. I am the Supreme.” One should know this.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 182 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴*
40. అధ్యాయము - 15
*🌻. రుద్రావతార ఆవిర్భావము - 5 🌻*
క్రుద్ధస్య మోహితస్యాథ విహ్వలస్య మునే మమ | క్రోధేన ఖలు నేత్రాభ్యాం ప్రాపతన్నశ్రుబిందవః || 51
తస్మిన్న వసరే తత్ర స్మృతేన మనసా మయా | ప్రబోధితోsహం త్వరితమాగతేన హి విష్ణునా || 52
తపః కురు శివస్యేతి హరిణా శిక్షితోsప్యహమ్ | తపోకారి మహద్ఘోరం పరమం మునిసత్తమ || 53
తపస్యతశ్చ సృష్ట్యర్థం భ్రువోర్ఘ్రాణస్య మధ్యతః |అవిముక్తాభిధాదేశాత్ స్వకీయాన్మే విశేషతః || 54
త్రిమూర్తీనాం మహేశస్య ప్రాదురాసీద్ఘృణానిధిః | అర్ధనారీశ్వరో భూత్వా పూర్ణాంశస్సకలేశ్వరః || 55
ఓ మహర్షీ! మోహముచే కోపించి విహ్వలుడనైన నాకు కోపము వలన కళ్లనుండి కన్నీటి బిందువులు రాలినవి (51).
ఆ సమయములో నేను మనస్సులో విష్ణువును స్మరించగా, ఆయన వెంటనే వచ్చి నాకు కర్తవ్యమును బోధించెను (52).
శివుని గూర్చి తపస్సు చేయుమని విష్ణువు హెచ్చరించగా నేను ఘోరమగు తపమునాచరించితిని (53).
ఓ మహర్షీ!నేను సృష్టిని చేయగోరి తపస్సు చేయుచుండగా, కనుబొమలకు నడుమ ముక్కుపై గల అవిముక్తమను పేరు గల స్థానము నుండి (54),
త్రిమూర్తులకు ప్రభువు, దయానిధి,సర్వ జగత్ర్పభువునగు పరమేశ్వరుడు పూర్ణాంశతో అర్థనారీశ్వర స్వరూపుడై సాక్షాత్కరించెను (55).
తమజం శంకరం సాక్షాత్తేజోరాశిముమాపతిమ్ | సర్వజ్ఞం సర్వకర్తారం నీలలోహిత సంజ్ఞకమ్ || 56
దృష్ట్వా నత్వా మహాభక్త్యా స్తుత్వాహం తు ప్రహర్షితః | అవోచం దేవదేవేశం సృజ త్వం వివిధాః ప్రజాః || 57
శ్రుత్వా మమ వచస్సోsథ దేవదేవో మహేశ్వరః | ససర్జ స్వాత్మనస్తుల్యాన్రుద్రో రుద్రగణాన్ బహూన్ || 58
అవోచం పునరేవేశం మహారుద్రం మహేశ్వరమ్ | జన్మమృత్యుభయా విష్టాస్సృజ దేవ ప్రజా ఇతి || 59
ఏవం శ్రుత్వా మహాదేవో మద్వచః కరుణానిధిః | ప్రహస్యోవాచ మాం సద్యః ప్రహస్య మునిసత్తమ|| 60
పుట్టుక లేనివాడు, తేజోరాశి, పార్వతీ పతి, సర్వము దెలిసిన వాడు, సర్వమునకు కర్త, నీలలోహితుడను పేరుగలవాడు నగు ఆ శంకరుని ప్రత్యక్షముగా (56)
చూచి, మహాభక్తితో నమస్కరించి, మహానందముతో స్తుతించితిని. దేవ దేవుడగు శివునితో విభిన్న ప్రజలను నీవే సృష్టింపుమని అంటిని (57).
దేవదేవుడగు ఆ మహేశ్వరుడు అపుడు నా మాటను విని, తనతో సమానమైన అనేక రుద్రగణములను సృష్టించెను (58).
అపుడు నేను మరల మహేశ్వరునితో 'దేవా! ప్రజలను జన్మమృత్యుభయము కలవారినిగా సృష్టింపుము' అంటిని (59).
ఓ మహర్షీ! దయానిధియగు మహాదేవుడు నా మాటను విని, వెంటనే చిరునవ్వుతో నాతో నిట్లనెను (60).
మహాదేవ ఉవాచ |
జన్మమృత్యు భయావిష్టా నాహం స్రక్ష్యే ప్రజా విధే | అశోభనాః కర్మవశా విమగ్నా దుఃఖ వారిధౌ || 61
అహం దుఃఖోదధౌ మగ్నా ఉద్దరిష్యామి చ ప్రజాః | సమ్యక్ జ్ఞాన ప్రదానేన గురుమూర్తి పరిగ్రహః || 62
త్వమేవ సృజ దుఃఖాఢ్యాః ప్రజాస్సర్వాః ప్రజాపతే | మదాజ్ఞయా న బద్ధస్త్వం మాయయా సంభవిష్యసి || 63
మహాదేవుడిట్లు పలికెను -
ఓ బ్రహ్మా! జన్మ మృత్యు భయముచే నిండినవారు, శోభ లేనివారు, కర్మకు వశులై దుఃఖసముద్రములో మునిగిన వారు అగు ప్రజలను నేను సృష్టించను (61).
నేను గురు రూపమును స్వీకరించి యథార్థ జ్ఞానమునిచ్చి దుఃఖ సముద్రమునందు మునిగి పోవుచున్న ప్రజలను ఉద్ధరించెదను (62).
ఓ ప్రజాపతీ! నీవేనా యాజ్ఞచే దుఃఖితులగు ప్రజలనందరినీ సృజించుము. నీకు మాయా బంధము ఉండబోదు (63).
బ్రహ్మోవాచ |
ఇత్యుక్త్వా మాం స భగవాన్ సుశ్రీమాన్నీలలోహితః |సగణః పశ్యతో మే హి ద్రు త మంతర్దధే హరః || 64
ఇతి శ్రీ శివ మహాపురాణ ప్రథమ ఖండే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సృష్ట్యు పక్రమే రుద్రావతారవిర్భావ వర్ణనం నామ పంచ దశోsధ్యాయః (15).
బ్రహ్మ ఇట్లు పలికెను -
శోభాయుతుడు, నీలరక్త వర్ణములతో కూడిన దేహము గల వాడు నగు హరభగవానుడు నాతో ఇట్లు పలికి గణములతో కూడి నేను చూచుచుండగనే వెంటనే అంతర్ధానమయ్యెను (64).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మొదటిదియగు సృష్టి ఖండలో రుద్రావతారావిర్భావము అనే పదునైదవ అధ్యాయము ముగిసినది (15).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 58 🌹*
Chapter 15
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj
*🌻 THE FOURTEEN YEARS - 2 🌻*
The author knew that the book required fourteen years to write and be in people's hands, but he decided to write simple, short points and reveal the details of the points, but not put all the details and points together.
He decided to simply let someone else do that, because he decided that he had completed all the work sufficient for the book, and that it did not require his personal hand to finish the book.
The author did all the work necessary for the book, the title, points, chapters, charts, etc., but the result or final outcome of the book he did not need to handle personally, and so he died fourteen years before his book came out.
In this manner, Meher Baba finished his divine work early, and so one may conclude that he dropped his body fourteen years sooner than the time he had first planned.
But, because the work he wanted to do was completed in a few months instead of fourteen years, he was able to drop his body, which he did in 1969, and not in 1983.
Meher Baba completed his universal work in the last few months of 1968 and during the first month of 1969, and it was the same amount of work that he would have done in fourteen years.
Because it was the same amount of work, the result of that work will be the same, even though those fourteen years of work are compressed into a few months.
And, though he dropped his body at the beginning of the fourteen years, he was as if physically present every moment of those fourteen years.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 54 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 25
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. వాసుదేవ మంత్ర లక్షణము - 1 🌻*
అథ వాసుదేవాదిమన్త్ర ప్రదర్శనమ్:
నారద ఉవాచ:
వాసుదేవాదిమన్త్రాణాం పూజ్యానం లక్షణం వదే | వాసుదేవః సఙ్కర్షణః ప్రద్యుమ్నశ్చానిరుద్ధకః. 1
నమో భగవతే చాదౌ అ ఆ అం అః, సబీజకాః | ఓఙ్కారాద్యా నమోన్తాశ్చ నమో నారాయణస్తః. 2
నారదుడు పలికెను:
పూజ్యములైన వాసుదేవాది మంత్రముల లక్షణము చెప్పెదను.
ఆదియందు "నమో భగవతే" అను పదములో కలవి, అ, ఆ, అం, అః అను బీజాక్షరములతో కూడినవి ఓంకారము ఆది యందు కలవి, 'నమః' అనునది అంతమందు కలవి అయిన "వాసుదేవ' 'సంకర్షణ' 'ప్రద్యుమ్న' 'అనిరుద్ధ' అను పదములచే "ఓం అ నమో భగవతే వాసుదేవాయ" ఓం ఆ నమో భగవతే సంకర్షణాయ" "ఓం అం నమో భగవతే ప్రద్యుమ్నాయ" "ఓం అః నమో భగవతే అనిరుద్దాయ" అను మంత్రము లేర్పడును, పిమ్మట "ఓం నమో నారాయణాయ" అను మంత్రము.
ఓం తత్సద్బ్రహ్మణే చైవ ఓం నమో విష్ణవే నమః | ఓం క్షౌం ఓం నమో నరసింహాయ వైనమః. 3
ఓం భూర్భగవతే వరాహాయ నరాధిపాః | జపారుణహరిద్రాభా నీలశ్యామలలోహితాః 4
మేఘాగ్ని మధుపిఙ్గాభా వల్లభా నవ నాయకాః | అఙ్గాని స్వరబీజనాం స్వనామాన్తైర్యథాక్రమమ్. 5
హృదయాదీని కల్పేత విభక్తైస్తన్త్రవేదిభిః | వ్యఞ్జనాదీని బీజాని తేషాం లక్షణమన్యథా. 6
"ఓం తత్సద్బ్రహ్మణ నమః" "ఓం నమో విష్ణవే నమః" ఓం క్షౌ ఓం నమో భగవతే నరసింహాయ నమః" "ఓం భూర్భగవతే వరాహాయ నమః" (ఇవి మంత్రములు). జపా పుష్పము వలె అరుణమైన రంగు పుసుపువంటి రంగు నీల - శ్యామల - లోహిత వర్ణములు, మేఘ - అగ్ని - మధువుల వంటి రంగులు, పింగవర్ణము గల తొమ్మండుగురు నరాధిపులు నీటికి నాయకులు,
తంత్రవేత్తలు విభజించిన విధముగ స్వరరూపము లైన బీజాక్షరములకు ఆ యా మంత్రము లందలి నామములను చివర చేర్చి హృదయాద్యంగములను కల్పించవలెను. వ్యంజనాది బీజాక్షరముల లక్షణము వేరుగా ఉండును.
దీర్ఘన్వర్తేస్తు భిన్నాది నమోన్తాన్తస్థితాని తు | అఙ్గాని హ్రస్వయుక్తాని ఉపాఙ్గానీతి వర్ణ్యతే.
'నమః' అనునది అంతము నందు గల మంత్రముల మధ్య దీర్ఘ స్వరములతో గూడి యున్న వ్యంజనములు అంగము లనియు, హ్రస్వస్వరములతో కూడినవి ఉపాంగము లనియు చెప్పబడును.
విభక్తనామవర్ణాన్తస్థితం బీజాత్మముత్తమమ్ | దీర్ఘహ్రసై#్వశ్చ సంయుక్తం సాఙ్గోపాఙ్గస్వరైః క్రమాత్. 8
వ్యఞ్జనానాం క్రమోహ్యేష హృదయాది ప్రక్లప్తయే | స్వబీజేన స్వనామాన్తైర్విభక్తాన్యఙ్గనామభిః 9
యుక్తాని హృదయాదీని ద్వాదశాన్తాని పఞ్చతః | ఆరభ్య కల్పయిత్వా తు జ పేత్సిద్ధానురూపతః. 10
దీర్ఘ హ్రస్వములతో కూడినదియు, సాంగోపాంగస్వరములతో కూడినదియు, విభజింపబడిన నామాక్షరముల అంతమునందు ఉన్నదియు అగు బీజక్షరము ఉత్తమ మైనది. హృదయాది కల్పనమునకు వ్యంజనముల క్రమ మిది -
తన నామము అంతము నందు గల అంగనామములతే విభక్తములై స్వబీజాక్షరముతో కూడిన, ఐదు మొదలు పండ్రెండు వరకును ఉన్న హృదయాదులను కల్పించి సిద్ధికి అనుగుణముగా ఉండునట్లు జపించవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 69 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
29. అశాశ్వతమయినటువంటి లౌకిక భౌతిక సుఖాన్వేషణ కొరకే యజ్ఞం చెయ్యబడుతుంది. అది జ్ఞానప్రదం కాదు. జ్ఞానంకోసమని ఎవరూకూడా యజ్ఞం చెయ్యరు.
3౦. లౌకికమైన సుఖంకోసమే లౌకికమయినటువంటి శక్తులను అనేకమంత్రమములతో మనము ఆరాధిస్తాము. యజ్ఞంవలన జ్ఞానం పొందటానికి వీలుంటుందా? అని ఒక సందేహం కలుగవచ్చు. యజ్ఞం వలన జ్ఞానం రానేరాదు.
31. అవిద్య, అజ్ఞానంలోంచే యజ్ఞం జరుగుతున్నది. యజ్ఞం అనేది మంత్రములు, అందులో ఋత్విక్కులు, వారు చేసే హోమం, అది ఇచ్చే ఫలములు యజమానిని సుఖవంతుణ్ణి చేస్తాయి.
32. యజమానిని సౌఖ్యవంతుణ్ణి చేస్తూ పుణ్యలోకాలకు పంపించే మార్గం చూపిస్తాయి. యజమానిని కీర్తివంతుణ్ణీ చేస్తాయి. అలా అనే కదా ప్రతీ మంత్రం చెపుతున్నది! నిజానికి యజమానే శాశ్వతుడుకాడు. కాబట్టి కొన్ని పరిధులకులోబడి మనం యోచన చేయాలి.
33. “ఈ భరతవర్షంలో, ఈ భారతదేశంలో సుజనులు, సత్వగుణసంపన్నులు ఎవరైతే ఉన్నారో అలాంటివాళ్ళకు భౌతికమయిన కష్టము, దుఃఖము రాకుండును గాక!” అని, అంతవరకే చాలా పరిమితంగా యజ్ఞఫలం ఆశించి చేయాలి. అలా అయితేనే ఫలం లభిస్తుంది.
34. మనం నిత్యము అరకొరగా సంధ్యావందనంచేసి, ధర్మార్థకామ మోక్షాలకై చేస్తున్నామంటే దానికి అర్థముందా! మధ్యాహ్నసంధ్య నుంచీ సాయంకాలసంధ్యవరకు నేను చేసిన పాపం ప్రాయశ్చిత్తం కోసం – ఆ పాపం పోవటం కోసం నేను ఈ సంధ్యావందనం చేస్తున్నాను; మళ్ళీ రేపు ఉదయకాల సంధ్యావందనం సమయం వరకూ నేను బ్రతికి ఉండటంకోసం చేస్తున్నాను అనుకోవాలి.
35. దాని పరిమితి అంతే అల్ప కర్మకు అల్పఫలమే ఆశించాలి. అనంతమైన మోక్షవిషయానికొస్తే, కర్మ వల్ల మోక్షం రాదు. కాబట్టి అప్పుడు ఆశ్రయించదగినట్టిది అనంత కల్యాణగుణసంపన్నుడు, అనంత దయామయుడు అయినటువంటి ఈశ్వరుడినే.
36. ఆయన కరుణమాత్రమే ఆధారమక్కడ. తన అర్హత కాదు. అసలు అర్హత లేకపోవచ్చు. ఆయన కరుణకు అర్హతార్హతలు స్వల్పములు. దానియందు విశ్వాసం కలిగి ముక్తినడగాలి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 133 🌹*
✍️ Nisargadatta Maharaj
📚. Prasad Bharadwaj
*🌻 Stop Identifying yourself with Body. Give attention to your ‘I’ consciousnes 🌻*
Whatever is called God or Self is because there is the beingness, the feeling that ‘I am’.
That is the fundamental principle, the basis
of all your knowledge, but you are identifying yourself with the
body.
With greatest interest you get absorbed in your Self. By giving
attention only to your ‘I’ consciousness you can reach it.
Without giving attention to the body but to the sense ‘I am’.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మనోశక్తి - Mind Power - 72 🌹*
*Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 Q 63:--mental physics అంటే ఏమిటి? మన శాస్త్రవేత్తలు ఏ విధంగా పరిశోధిస్తే మన సైన్స్ develop అవుతుంది? - 2 🌻*
5) శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలన్ని చాలా వరకు తప్పే వారు పదార్ధాన్ని దాని కున్న చైతన్యశక్తి తో కూడా అధ్యయనం చేయాలి. కంటికి గోచరం కాని చైతన్య శక్తిని అంతర్వాణి ద్వారా study చేయాలి.
6) మన సమీప నాగరికతల్లో భౌతిక వాస్తవాలు ఇప్పటి పరిస్థితులకు భిన్నంగా ఉండేవి. భూ అయస్కాంత ఉత్తర దక్షిణ ధృవాలు reverse లో ఉండేవి. అప్పుడున్న సైన్స్ టెక్నాలజీ ఎంతో ఉన్నతంగా ఉండేది.
7) petrol, diesel కి బదులుగా ధ్వనిని ఇంధనంగా వాడే వారు. ధ్వనితో దేహము యొక్క జబ్బుల్ని తగ్గించేవారు. ధ్వని ద్వారా వాహనాల్ని నడిపేవారు, పదార్ధాన్ని కదల్చడానికి, బరువుల్ని తూకం వేయడానికి ధ్వనిని వాడే వారు.
ఇప్పుడున్న ఫిజిక్స్ కి భిన్నంగా వేరే దిశలో physics అభివృద్ధి చెందింది. అంతర్ ప్రయాణం చేసి జ్ఞానాన్ని సంపాదించేవారు. వేరే వరల్డ్స్ కి వేరే systems కి astral ట్రావెల్ చేసేవారు.
8) ఆ నాగరికత కు చెందిన జీవరాసులన్నీ పదార్ధంతో కూడిన భౌతిక దేహాలను తీసుకునే స్థితిని దాటివేసి భౌతిక దేహాన్ని తీసుకునే సమయంలో సమాంతర లోకాలలో కూడా జన్మ తీసుకుని భౌతిక స్థితిని దాటివేసి other dimensions లోకి ప్రవేశించేవారు.
9) Atlaantis, Lumeria నాగరికతలు atlantic, pacific మహాసముద్రం లో మునిగిపోయాయి.
వీటి నాగరికత లకు సంబంధించిన విషయాలన్నీ ఆకాశిక్ రికార్డ్స్ లో పొందుపరచబడి ఉంటాయి. అంతర్ ప్రయాణం ద్వారా ఆ నాగరికతకు tune అయితే ఆ information అంతా తెలుసుకోవచ్చు.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 18 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం - 6 🌻*
విదేశీయులు వచ్చి భారత దేశాన్ని పరిపాలిస్తారు..
మరీ ప్రాచీనకాలంలో చూస్తే హూణులు తదితరులు, ఆ తర్వాత ముస్లింలు, తర్వాత డచ్ వారు, పోర్చుగీసువారు, తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించారు. వందల సంవత్సరాలు పాలించారు.
భారతీయుల్లో సహజంగా ఉన్న అనైక్యత వల్లే విదేశీయులు మనదేశాన్ని పరిపాలించగలిగారు. ఈ పరిణామాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి ఎన్నడో ఊహించారు.
మాచర్ల లోని రాజులందరూ ఒక స్త్రీ కారణంగా తన్నులాడుకుని మరణిస్తారు..
పల్నాటి యుద్ధం గురించి చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలే కదా! నాయకురాలు నాగమ్మ వల్ల పల్నాడు స్మశానంగా మారిపోయింది. చిన్న చిన్న పట్టింపులు, పౌరుషాల వల్ల యుద్ధం జరిగి వేలాదిమంది హతమారిపోయారు.
పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. దీనివల్ల కొన్ని గ్రామాల్లో ప్రజలు మరణిస్తారు.. దీని గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వలేము. ఇది విమానాల్లో నుంచి వదిలే బాంబులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది.
వియత్నాం యుద్ధంలో జరిగింది ఇదే. అక్కడ ఎక్కువగా గ్రామాలపైనే అమెరికా సేవలు దాడులు జరిపాయి. అక్కడ వామపక్ష గెరిల్లాలు గ్రామాలనుంచే తమ సాహసోపేతమైన పోరాటం చేశారు. అమెరికా సేనలను భయకంపితులను చేశాయి.
ఒకరి భార్యను మరొకరు వశపరచుకుంటారు. స్త్రీ, పురుషులు కామంచేత పీడితులవుతారు.
ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు స్త్రీ, పురుషుల్లో కామ వాంఛ పెరిగింది. నైతిక విలువలు క్రమంగా తగ్గుతున్నాయి.
వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాలను దోచుకుంటారు..
ఇప్పుడు ప్రతిరోజూ ఏదో ఒక దేవాలయంలో దొంగలు పడటం మామూలయింది. ఒక్క వెంకటేశ్వర దేవాలయం అని ఏమిటి.. అన్ని దేవాలయాల్లో దొంగతనాలు సాధారణం అయ్యాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 12 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. జ్ఞానాన్ని సాధించాలి అంటే రెండే మార్గాలు. యోగము, ఇంద్రియ జయము. - 3 🌻*
సకల జీవరాశి కూడా స్త్రీపురుష సౌఖ్యాన్ని అనుభవిస్తూ వున్నాయి కదా.
ఏ కొత్త సుఖమున్నది ఇందులో? అనేక జన్మలయందు తిన్న అన్నమే తినుట లేదా? పోయిన నిద్రే పోవుట లేదా? కొత్త సుఖమేమున్నది? అనేటటువంటి విజ్ఞానదృష్టి కలిగినటువంటివాడికి స్త్రీపురుష కామోపభోగమునందు రతి కలిగేటటువంటి అవకాశమున్నదా? రమించే అవకాశం వున్నదా అంటే లేదు అంటున్నాడు. కారణమేమిటట? అనేక జన్మార్జితముగా ప్రతి జన్మలోనూ గృహస్థాశ్రమ సౌఖ్యాన్ని, ఆ ఒకరికొకరి సహచర్య సౌఖ్యాన్ని స్త్రీపురుషులు ఇరువురూ కూడా అనుభవిస్తూ వున్నారు.
దానివల్ల ఏం పెద్ద ప్రయోజనమున్నదీ? సర్వ జీవులు వాటివాటి సంసార చక్రబంధమునందు నలిగి పోవుచునే వున్నవి కదా! జననమరణ కారణమగుచున్నది కదా.
కాబట్టి అట్టి అనిత్యములైనటువంటి సుఖముల కొరకు ఎవరైనా ఓ వెయ్యేళ్ళు, ఓ పదివేలేళ్ళు, ఓ లక్షేళ్ళు, ఓ కోటి సంత్సరాలు, కల్పాంతము వరకూ జీవించాలని ఎవరైనా అనుకుంటారా? అజ్ఞానం కదా. అనేటటువంటి భావనని తెలియజేస్తున్నారు.
ఇంకేమడుగుతున్నారూ? అసలు ప్రధానమైన సంశయం ఏమిటీ అంటే వివేకవంతమైనటువంటి, బుద్ధి సంఘతమైనటువంటి మానవులకు విచారణా జ్ఞానము వున్నది కదా.
అట్టి విచారణా జ్ఞానం చేత అందరికీ కలిగేటటువంటి గొప్ప సంశయం ఏమిటంటే - అసలు మరణానతరం జీవితం వుందా లేదా? కాబట్టి అటువంటి జీవితాన్ని గురించి మనకి చెప్పగలిగేటటువంటి సమర్ధవంతమైనటువంటి శక్తి ఆచార్యవరుడైనటువంటి యమధర్మరాజుకి మాత్రమే వున్నదని, ఇటువంటి సంశయం దేవతలకి కూడా వున్నప్పటికీ వారు కూడా ఆ సంశయాన్ని తీర్చుకోలేకపోతున్నారని, కాబట్టి ఆత్మ నిర్ణయమునకు సంబంధించినటువంటి విషయం ఏదైతే వుందో, ఆ జ్ఞానం ఏదైతే వుందో దానికి మించినటువంటి విషయం మరొకటి లేదు. అంటే ఒకసారి ఈ ఆత్మవిచారణ గనక మీ మనోబుద్ధులని గనక ఆక్రమించినట్లయితే మీరు జగత్తుకు సంబంధించినటువంటి మరే విషయములకూ ప్రాధాన్యత ఇవ్వజాలరు.
కారణమేమిటీ అంటే అన్నిటికంటే ఉత్తమమైన వివేకాన్ని, ఉత్తమమైనటువంటి విషయజ్ఞానాన్ని, ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని ఎంపిక చేసుకుని, నిర్ణయించి, సాధన ద్వారా సిద్ధింపజేసుకుని ప్రయత్నించి అట్టి బ్రహ్మానందపూర్వకమైనటువంటి స్థితిని సాధించేటటువంటి లక్ష్యం దిశగా నీ ప్రయాణం సాగుతూ వున్నప్పుడు, నీవు ఇతరములైనటువంటి, నశ్వరములైనటువంటి, హీనములైనటువంటి, నీచములైనటువంటి, నిషిద్ధములైనటువంటి, నిరసించదగినటువంటి భోగభాగ్యములయందు దృష్టి కలుగదు అనేటటువంటి స్పష్టతని అందిస్తూ వున్నారు. నేను ఇంక ఏ వరమునూ కోరను, ఒక్క ఆత్మానుభూతికి సంబంధించినటువంటి బోధ గురించి తప్ప. కాబట్టి ఆత్మ విషయమును గురించే బోధించమని నిర్ణయముగా అడుగుతున్నాడు నచికేతుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సాయి తత్వం - మానవత్వం - 56 / Sai Philosophy is Humanity - 56 🌹*
🌴. అధ్యాయము - 8 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. మానవ జన్మ ప్రాముఖ్యత 🌻*
1. ఈ యద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి యున్నాడు.
దేవయక్షగంధర్వాదులు, జంతుకీటకాదులు మనుష్యులు మొదలగువానిని సృష్టించెను.
2. స్వర్గము, నరకము, భూమి మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి యంతయు సృష్టించెను.
3. వీరిలో నెవరి పుణ్యమెక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము ననుభవించిన పిమ్మట త్రోసి వేయబడుదురు.
4. ఎవరి పాప మెక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు.
5. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్షసాధనమునకై యవకాశము గాంచెదరు.
6. వారి పాప పుణ్యములు నిష్క్రమించునప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేల మోక్షముగాని, పుట్టుకగాని వారు వారు చేసికొనిన కర్మపై ఆధారపడియుండును.
*🌻. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ 🌻*
1. జీవకోటి యంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునివిగాక మరొక్క ప్రజ్డ గలదు.
2. అదియే జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందును దీని కవకాశము లేదు.
3. ఈ కారణముచేతనే దేవతలు సైతము మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడ భూమిపై మానవజన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు.
4. కొంతమంది మానవజన్మము చాల నీచమైనదనియు; చీము, రక్తము, మలములతో నిండియుండు ననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుననియునందురు.
5. కొంతవరకదికూడ నిజమే. ఇన్ని లోపములున్నప్పటికి మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు.
6. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి, ఇంద్రియసుఖముల పట్ల విరక్తి పొంది, నిత్యానిత్యవివెకముతో కడకు భగవత్సాక్షాత్కారమును బొందుచున్నాడు.
7. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదము.
8. దేహమును ముద్దుగా పెంచి విషయసుఖములకు మరగినచో నరకమున బడెదము.
ఉచితమార్గమేమన, దేహము నశ్రద్ధ చేయకూడదు; దానిని లోలత్వముతో పోషింపనూగూడదు.
9. తగు జాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. గుఱ్ఱపురౌతు తన గమ్యస్థానము చేరువరకు గుఱ్ఱమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో యంతజాగ్రత్త మాత్రమే తీసికొనవలెను.
10. ఈ శరీరమును మోక్షసాధన, లేక యాత్మసాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధియై యుండవలెను.
11. భగవంతుడనేకజీవులను సృష్టించినప్పటికి అతనికి సంతుష్టి కలుగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని యవేవియు గ్రహించలేక పోయినవి.
12. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను.
13. మానవుడు భగవంతుని లీలలను, అద్భుతకార్యములను, శేముషీవిజ్డానములను జూచి పరవశమొంది నప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టిజెంది యానందించును.
14. అందుచే మానవజన్మ లభించుట గొప్ప యదృష్టము. బ్రాహ్మణజన్మ పొందుట అందులోని శ్రేష్టము.
15. అన్నిటికంటె గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయునవకాశము కలుగుట.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sai Philosophy is Humanity - 56 🌹*
Chapter 8
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj
*🌻 Importance of Human Birth 🌻*
In this wonderful universe, God has created billions (84 lacs according to Hindusastra calculation) of creatures or beings (including Gods, demigods, insects, beasts and men) inhabiting heaven, hell, earth, ocean, sky and other intermediate regions.
Of these, those creatures or souls, whose merits preponderate, go to heaven and live there till they enjoy the fruits of their actions, and when this is done, they are cast down while those souls, whose sins or demerits preponderate, go down to hell, and suffer the consequences of their misdeeds for so long a time as they deserve.
When their merits and demerits balance each other, they are born on earth as human beings, and are given a chance to work out their salvation.
Ultimately when their merits and demerits both drop down (are got rid of) completely, they get their deliverance and become free.
To put the matter in a nutshell, souls get their births or transmigrations according to their deeds and intelligence (development of their minds).
*🌻 Special Value of the Human Body 🌻*
As we all know, four things are common to all the creatures, viz. food, sleep, fear and sexual union. In the case of man, he is endowed with a special faculty, viz. knowledge, with the help of which he can attain God-vision, which is impossible in any other birth. It is for this reasons that Gods envy man's fortune and aspire to be born as men on earth, so as to get their final deliverance.
Some say, that there is nothing worse than the human body, which is full of filth, mucus, phlegm and dirt, and which is subject to decay, disease and death.
This is no doubt true to a certain extent; but inspite of these drawbacks and defects, the special value of the human body is - that man has got the capacity to acquire knowledge: it is only due to the human knowledge that one can think of the perishable and transitory nature of the body itself, and of the world and get a disgust for the sense-enjoyments and can discriminate between the unreal and the real, and thus attain God-vision.
So, if we reject or neglect the body because it is filthy, we lose the chance of God-vision, and if we fondle it, and run after sense - enjoyments, because it is precious, we go to hell.
The proper course, therefore, for us to pursue is the following; that the body should neither be neglected nor fondled, but should be properly cared for, just as a traveler on horse-back takes care of his pony on the way till he reaches his destination and returns home.
Thus the body should ever be used or engaged to attain God-vision or self-realization, which is the supreme end of life.
It is said that though God created various sorts of creatures he was not satisfied, for none of them was able to know and appreciate His work. So he had to create a special being - Man, and endow him with a special faculty, viz.
Knowledge and when He saw that man was able to appreciate His Leela - marvellous work and intelligence. He was highly pleased and satisfied. (Vide, Bhagawat 11-9-28).
So really it is good luck to get a human body, better luck to get birth in a Brahmin family, and best one, to get an opportunity of having recourse to Sai Baba's Feet and surrendering to Him.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment