🌹. శివగీత - 14 / The Siva-Gita - 14 🌹


*🌹. శివగీత - 14 / The Siva-Gita - 14 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
*🌻. వైరాగ్య యోగము - 5 🌻*

అనాది వాసనా యుక్తాః క్షేత్ర జ్ఞా ఇతితే స్మృతాః,
మనో బుద్ది రహంకార - శ్చిత్తం చేతి చతుష్టయమ్ 30
అన్తః కరణ మిత్యాహు - స్తత్రతే ప్రతి బింబితాః,
జీవిత్వం ప్రాప్నుయు: - కర్మ ఫల భోక్తార ఏవతే 31

అనాది యగు వాసనల చేత నిండి యున్న అట్టి మహేశ్వరాంశ
 సంజనితు లైన ప్రాణులు క్షేత్రజ్ఞాలన బడుచున్నారు.

 మనస్సు - చిత్తము బుద్ది - అహంకారము ఈ నాల్గింటిని
యంతః కరణ చతుష్టయము లందురు. 

వీటిలోనే ప్రతి బింబముగా నేర్పడిన చైతన్యమే ప్రాణముగా రూపొంది 
పుణ్య పాపముల ఫలముల ననుభవించు చుండును.
( సుఖ దుఃఖము లను జీవుడు అనుభవించు చుండునని భావము )

తతో వైష యికం తేషాం - సుఖం నా దుఃఖమేవ నా,
త ఏవ భుంజతే భోగా యత నేస్మిన్ శరీరకే 32
స్థావరం జంగమం చేతి - ద్వివిధం న పురుచ్యతే,
స్థాన రాస్తత్ర దేహా స్స్యు - స్సూక్ష్మా గుల్మల తాదయః 33

అండ జా స్స్వేద జాస్తద్వ- దుద్భిజ్జా ఇతి జంగామా:,

అందుచేత విషయ విశేషము నుండి పొడమిన ఆనందము గాని,
 వ్యధ గాని, భోగము నేయభి లషించు శరీరమును ప్రాణ కోటి యనుభవించు చుండును. 

అట్టి శరీరము స్థావరమని, జంగమమని రెండు విధములు.
 అందు స్థావర దేహును, వృక్షములు, పొదలు, తీగెలు- ఇవే మున్నగునవి.
 
వీని యందు సమన్వయించు కొనునది, జంగమ దేహము,
 అండ జము, స్వేద జమనియు, ఉద్భిజ్జ మనియు మూడు రకములుగా విభజింప బడినది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 


*🌹 The Siva-Gita - 14 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
*🌻 Vairagya Yoga - 5 🌻*

30. 31. Due to being attached with the age old Vasana(s), those souls Which are Maheshwara's reflections are being called as Kshetragya. 

Mana (heart) Chitta (self) Buddhi (Mind)Ahankaram
(Ego); these four are called as 'Antahkarana Chatushtaya'. In these as a shadow remains the consciousness which is the soul and experiences the results of virtues and vices.

32. 33. Hence happiness or sorrow obtained from subjects, and the body which desires for Bhoga exists in the various forms of living beings। That kind of body is of two types called Sthavaram (Immobile) and Jangamam (mobile). Among them Sthavaram body belongs to Trees, bushes, creepers. 

Jangama bodies are those who are Andajam (egg born), Swedajam (sweat born), and Unbheejam. These are the three subcategories in which Jangamam bodies are classified.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment