Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 Q 10 :-- ఆలోచన అంటే ఏమిటి? 🌻
Ans ):--
1) మన అంతర్ ప్రపంచం నుండి ఏర్పడే ప్రతి ఫీలింగ్,భావన,కోరిక,ఊహ,కల.... వీటన్నింటిని ఆలోచన గా పరిగణించవచ్చు.
2) మన ఆలోచనకు విద్యుదయస్కాంత శక్తి ఉంటుంది, for ex:-- t.v (టెలివిజన్) ని తీసుకుందాం, t. v లో కనిపించే ప్రతిబింబాలన్ని విద్యుదయస్కాంత తరంగాల వల్ల ఏర్పడుతున్నాయి.
అలాగే భూమి మీద కూడా పదార్ధంతో కూడిన వస్తువులు, భౌతిక సంఘటనలు , భౌతిక వాతావరణం అన్నీ అంతర్ ప్రపంచం నుండి వెలువడుతున్న విద్యుదయస్కాంత ఆలోచనా తరంగాలు నుండి బాహ్యప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి.
3) మన ఆలోచనా తరంగాల యొక్క శక్తితీవ్రత ఎంత ఉంటే అంతకాలం భౌతిక వాస్తవం పొందిన వస్తువు, లేదా భౌతిక సంఘటన జీవించిఉంటుంది.
4) బలహీనమైన ఆలోచన తరంగాల నుండి రూపాంతరం చెందిన భౌతిక సంఘటన కొద్ది కాలం మాత్రమే మనుగడ సాగించి తరువాత అంతరించిపోతుంది.
5) భూమి మీద భౌతిక సంఘటన అనగా మన జీవితంలో కి ప్రవేశించిన భౌతిక సంఘటన ఎంతకాలం కొనసాగుతుంది అనేది ఆ ఆలోచనా తరంగాలుకు మనం ఎంత బలాన్నిచ్చి ప్రభావితం చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంఘటన తాలూకు ఆలోచనలు మనలో ఆగిపోయిన వెంటనే ఆ భౌతిక సంఘటన నశించిపోతుంది.
5) అన్ని ఆలోచనలు భూమి మీద భౌతిక వాస్తవం పొందాలనే నియమమేమి లేదు,వాటి ఫ్రీక్వెన్సీ కి అనుగుణంగా ఉన్న ఇతర dimensions లో రూపాంతరం చెందుతాయి.
6) ఆలోచనలను వైరస్ తో పోల్చవచ్చు,వైరస్ లు మన దేహంపై చర్యలు జరిపి వాటి చర్యలు ద్వారా దేహంలో జీవరసాయనిక మార్పులు ఎలా తేగలవో, అలానే ఆలోచనలు కూడా మన దేహంలో జీవరసాయనిక మార్పులు కలుగజేసి దేహ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు.
7) వైద్య శాస్త్రానికి అంతుచిక్కని జీవరసాయనాలను, enzymes ని ఆలోచనాశక్తి పుట్టిస్తుంది.
8) ఆలోచనల నుండి feelings, emotions పడుతున్నాయి, దేహంలోని జీవకణాలు ఒక తరహా నిర్మాణం కలిగి ఉండి దేహఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయో, అలానే ఆలోచన తరంగాలు ఒక తరహా నిర్మాణం కలిగి భౌతిక సంఘటనలు ఏర్పరుస్తున్నాయి.
9) +ve ఆలోచనలు ఇతర +ve ఆలోచనలను ఆకర్షిస్తాయి,౼ve ఆలోచనలు ఇతర ౼ve ఆలోచనలను ఆకర్షిస్తాయి.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment