శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 546 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 546 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀

🌻 546. 'బంధమోచనీ’ - 3 🌻


సర్వజీవరాశుల చైతన్యముగా తాను ఉన్నాడు అను భావము కలుగుటకు శ్రీమాత అనుగ్రహము కావలెను. అట్టి అనుగ్రహము కొఱకే ఆరాధన. అవిద్య అను చీకటి గదిలో చీకటిని పారద్రోలు దీపము శ్రీమాత. అంతర్ముఖముగ నుండు అజ్ఞానపూరితమైన జీవుని స్వభావము నందు చీకటిని పారద్రోలు దీపము వంటిది శ్రీమాత. "అవిద్యానాం అంత స్థిమిర మిహిర ద్వీప నగరీ" అని ఆది శంకరులు శ్రీమాతను ప్రస్తుతి గావించినారు. కరుడు గట్టిన అజ్ఞానాంధకారమును పటాపంచలు చేయుట శ్రీమాతకే సాధ్యము. అజ్ఞాన తిమిరమునకు ఆమెయే మిహిర. ఆమె అనుగ్రహము వలననే అవిద్యా బంధము వీడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻

🌻 546. 'Bandhamochani' - 3 🌻


Sri Mata's grace is needed to feel that one is the consciousness of all living beings. Worship is for that Grace. Srimata is the lamp that dispels the darkness in the dark room of ignorance. Srimata is like the lamp that dispels the darkness in the nature of an inner ignorant being. Adi Sankarulu sang to Srimata that 'Avidyanam Anta Sthimira Mihira Dweepa Nagari'. Sri Mata is the only one who can dispel the stubborn ignorance. She is the Sun that dispels ignorance. It is because of her grace that ignorance will leave the bond.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

సిద్దేశ్వరయానం - 70 Siddeshwarayanam - 70

🌹 సిద్దేశ్వరయానం - 70 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 19వ శతాబ్దం - గుహలో కాళి 🏵


తీర్థ యాత్రకు బయలుదేరి పాంధులతో కలిసి ఆంధ్ర ప్రాంతం నుండి ఓడ్ర దేశంలోకి ప్రవేశించాము. రైలు వేగంగా కదలిపోతున్నది. ఒక అడవిలోకి ప్రవేశించిన తరువాత ఎందుకో గమనం మందగించి నెమ్మదిగా సాగుతూ కాసేపటికి బండి ఆగిపోయింది. గంట, రెండు గంటలు, మూడు గంటలు గడిచినవి. ఈ లోపు ప్రయాణికులు గార్డు దగ్గరికి కొందరు, ఇంజను దగ్గరకు కొందరు వెళ్ళి కనుక్కుంటే త్రోవలో కొంత దూరాన పట్టాలు బాగుచేస్తున్నారు. త్వరలో సందేశం వస్తుంది బయలుదేరుతాము అని సమాధానం వచ్చింది. నాకెందుకో మనస్సులో ఇక్కడ దిగు దిగు -రైలులో వెళ్ళవద్దు. అని సందేశం వస్తున్నట్లు అనిపించింది. చాలామంది క్రింద దిగి మాట్లాడుకుంటున్నారు. కొందరు దూరంగా ఉన్న చెట్ల దగ్గరకు వెళ్ళి నీడలో విశ్రాంతి తీసుకొంటున్నారు. నేనూ దిగి దూరంగా ఒక రావిచెట్టు కింద కూర్చున్నాను.

శ్లో॥ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శ్శివరూపాయ వృక్షరాజాయతే నమః

అశ్వత్థ వృక్షం మొదలు బ్రహ్మస్వరూపం, మధ్య విష్ణు స్వరూపం. కొమ్మల చివరలు పైన శివరూపం. అటువంటి దేవతా వృక్షానికి నమస్కారం అనుకొంటూ ఉన్నాను. సాయంసంధ్య దాటి కొంచెం చీకటిపడుతున్న సమయానికి రైలు కూత వేసి బయలుదేరింది. గార్డు విజిల్ వేశాడు. అందరూ గబగబా రైలెక్కారు. నేను ఉండిపోయినాను. నేను తమతో రాకపోతే ఈ ప్రయాణీకుడు ఏమైపోయినాడో పట్టించుకొనే వారు నా ఆప్తులు- బంధువులు - రైలులో ఎవరూ లేరు. నేను ఎప్పుడూ ఒంటరివాడినే. ఇప్పుడూ ఒంటరివాడినే. నాలో నేనే నవ్వుకొన్నాను. ఈ ప్రపంచంలో ఎవరికెవరు ? ఒంటరిగా రావటం ఒంటరిగా పోవటం. మధ్యలో భార్యా - బిడ్డలు - చుట్టాలు - స్నేహితులు నదీ ప్రవాహంలో కలుస్తూ విడిపోతూ ఉండే కట్టెల వంటి వారు. జీవితం ఎంత చిత్రమైనది! ఆ రాత్రి ఆ చెట్టు క్రిందనే శయనించి ప్రొద్దుననే లేచి చూచి నెమ్మదిగా దగ్గరనే ఉన్న ఒక సరస్సులో స్నానం ముగించుకొని రైలు వెళ్ళిన త్రోవ ప్రక్క నడవటం మొదలుపెట్టాను.

మధ్యాహ్నం దాకా నడిచిన తర్వాత ఒక చోట దిగుడుబావి. పండ్లచెట్లు కనిపించినవి. ఆగి నాలుగు పండ్లు కోసుకొని తిని కాసిని మంచినీళ్ళు తాగి విశ్రాంతి తీసుకొన్నాను. ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ లేచి బయలుదేరుతుంటే ఒక కోయవాడు కనిపించి ఎక్కడకు వెళుతున్నారని అడిగాడు. భువనేశ్వర్ వెళ్తున్నానని చెప్పాను. అతడు " ఈ బండ్లదోవన నడుస్తూ పోతే చాలా రోజులు పడుతుంది. అడవిలో దగ్గర దోవ ఉంది. కాలిబాట. నేనూ అటే వెళుతున్నాను. మీరు వస్తే మిమ్మూ తీసుకెళ్తాను. ఇక్కడి మార్గాలన్ని నాకు బాగా తెలిసినవి" అన్నాడు. అతనిని చూస్తే మనిషి మంచి వాడిలానే ఉన్నాడు. ఒక వేళ కాదు - అయితే ఏమిటి? నా దగ్గర ఏముంది? నా గమ్యస్థానం అంత వేగంగా చేరుకోవలసిన పనేమీ లేదు. తొందరగా చేరినా మంచిదే చేరకపోయినా మంచిదే. ఎవరో ఒకరు తోడు దొరికారు. అనుకొని అలాగే కలసి వెళదామన్నాను. కొంతదూరం ప్రధాన మార్గంలో నడిచి తర్వాత అడవిలో ప్రవేశించాము. మధ్యాహ్నం, రాత్రి పూట ఆగటం పండ్ల చెట్లున్న చోట్లు నీళ్ళు దొరికే చోట్లు మాకు విశ్రమస్థానాలు. అవి ఆ కోయవానికి తెలుసు. ఇలా కొద్దిరోజుల ప్రయాణం సాగింది.

ఒక చోటుకు వెళ్ళేసరికి కనుచూపు మేర మోకాలి లోతు నీళ్ళు. త్రోవ కనపడటం లేదు. ఆ కోయవాడు "బాబుగారూ! దోవ ఇటే కానీ ఇప్పుడు పోవటానికి వీలు లేదు. ఎక్కడ ఎంత లోతు నీళ్ళుంటవో, ఎక్కడైనా ఊబి ఉంటుందో ప్రమాదం. ఎన్ని రోజులు ఇలా ఉంటుందో చెప్పలేము. ఇటీవల కురిసిన వానల వల్ల ఇలా జరిగింది. ఇప్పుడేమి చెయ్యాలో తోచటం లేదు" అన్నాడు. నేను "ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కు పోవాలనిపించటం లేదు. ఈ నీటి ప్రక్కనే నడుచుకుంటూ వెళ్లాము. అమ్మవారు సహాయం చేస్తుంది” అని ముందుకు దోవదీశాను. ఇప్పుడు నేను తెలియని మార్గదర్శిని. అలా వెళ్ళగా వెళ్ళగా అడవిలో ఒక కొలను. అక్కడికి మనుషులు వచ్చిన జాడలు కనిపిస్తున్నవి. వాటిని పట్టుకొని వెళుతున్నాము. సాయంకాలం కావచ్చింది దారి కాస్త పెద్దదైంది. మరి కొన్ని కాలిబాటలు దీనిలో వచ్చి కలిసినవి. బండ్లు ప్రయాణం చేసే దోవలోకి చేరాము. ఎక్కువ దూరం పోకముందే ఒక తోట కనిపిస్తున్నది. మనుషులు గోచరిస్తున్నారు. ఒక కొండగుట్ట మరీ ఎత్తు లేదు. అక్కడి నుండి కొ దరు ఎదురు వచ్చారు. పూర్ణకుంభంతో స్వాగతం చెప్పి కంఠంలో పూలదండ వేశారు. కోయవాడు దిగ్భ్రాంతితో చూస్తున్నాడు. వారంతా నా పాదములకు నమస్కారం చేశారు. "స్వామీ! మీరాక కోసం ఎదురు చూస్తున్నాము" అంటూ వారిలో పెద్దాయన అరవై సంవత్సరాల వానివలె ఉన్నాడు. ఆయనతో ముప్ఫైయేండ్ల యువకుడు, మధ్యవయస్కులు కొందరు. స్త్రీలు - వినయంతో రావలసినదిగా ప్రార్థించారు. ముందుకు వెళ్ళిన తర్వాత పాణిపాద ప్రక్షాళనం చేసి ఆ కొండగుట్టలోని ఒక గుహలోకి ప్రవేశించాము.

అది పెద్ద గుహ. అందులో కాళీదేవి యొక్క విగ్రహం అద్భుతంగా అలరారుతున్నది. ఆ పెద్దాయన అమ్మవారికి హారతి యిచ్చి విధేయతతో నన్ను అచట సింహాసనం మీద ఆసీనుని చేసి విన్నవించాడు. "గురుదేవా! మీరిక్కడకు వస్తున్నారని అమ్మవారు తెలియజేశారు. ఈ గుహమీది. ఈ దేవి మీతో హిమాలయాల నుండి వచ్చినది. కాళీసిద్ధునిగా మూడు వందల సంవత్సరాలు జీవించి శరీరాన్ని విడిచి వెడుతూ నాకిక్కడి బాధ్యతలు అప్పగించారు. గత రెండు వందల సంవత్సరాలుగా నేనిక్కడ సేవచేస్తున్నాను. మా అబ్బాయి ఇప్పుడే తపస్సులో కొంత పురోగమిస్తున్నాడు. ఇక ఈ క్షణం నుండి మేమంతా మీ అజ్ఞాబద్ధులము. మీతో వచ్చిన ఈ కోయవాడు నిమిత్తమాత్రుడు. వానికి సుఖంగా జీవించటానికి కావలసినంత ధనమిచ్చి పంపిస్తున్నాము".

కాళీదేవిని చూస్తున్నాను. తప్పిపోయిన బిడ్డ తిరిగివస్తే తల్లి ఎలా ఉంటుందో అలా ఉన్నది కాళీమాత. ఆమె కన్నులలో ప్రేమ, కరుణ, జాలి అన్నీ భాసిస్తున్నవి. కాసేపటికి అందరూ బయటికి వెళ్ళిపోయినారు. మిగిలింది అమ్మ - నేను.


( సశేషం )

🌹🌹🌹🌹🌹

శ్రీ శివ మహా పురాణము - 890 / Sri Siva Maha Purana - 890


🌹 . శ్రీ శివ మహా పురాణము - 890 / Sri Siva Maha Purana - 890 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 40 🌴

🌻. శంఖచూడ వధ - 5 🌻

విష్ణువు వైకుంఠముకు వెళ్లెను. శ్రీ కృష్ణుడు స్వస్థుడాయెను. దేవతలు పరమానందముతో గూడిన వారై తమ నెలవులకు వెళ్లిరి (36). జగత్తు మిక్కిలి స్వస్థతను పొందెను. భూమియందు విఘ్నములన్నియు శమించెను. ఆకాశము నిర్మలమాయెను. భూమియందు అంతటా మంగళములు నెలకొనెను (37).

ఈ తీరున ఆనందదాయకము, దుఃఖములనన్నిటినీ పోగొట్టునది, సంపదల నిచ్చునది, కోర్కెల నన్నిటినీ ఈడేర్చునది యగు మహేశుని వృత్తాంతమును చెప్పియుంటిని (38). ధన్యము, కీర్తికరము, ఆయుర్వర్ధనము, విఘ్నములనన్నిటినీ తొలగించునది, భుక్తి ముక్తులను సర్వకామములను ఇచ్చునది (39). అగు ఈ చంద్రశేఖరుని గాథను బుద్ధిశాలియగు ఏ మానవుడు నిత్యము వినునో, లేదా వినిపించునో, లేదా పఠించునో, లేదా పఠింపజేయునో (40), అట్టివాడు ధనధాన్యములను, పుత్రుని, సౌఖ్యమును, సర్వకామనలను, విశేషించి శివభక్తిని పొందుననుటలో సందియములేదు. (41). ఈ సాటిలేని గాథ ఉపద్రవములనన్నిటినీ నశింపజేసి పరమజ్ఞానమునిచ్చి శివభక్తిని వర్ధిల్లజేయును (42). దీనిని విన్న బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్విగను, క్షత్రియుడు విజయిగను, వైశ్యుడు సంపన్నుడు గను, శూద్రుడు మహాపురుషుడుగను అగుదురు (43).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శంఖచూడవధయను నలుబదియవ అధ్యాయము ముగిసినది (40).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 890 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 40 🌴

🌻 Śaṅkhacūḍa is slain - 5 🌻


36. Viṣṇu went to Vaikuṇṭha. Kṛṣṇa became complacent. The gods went to their abodes with great delight.

37. The universe regained normalcy. The whole earth was freed of obstacles. The sky was pure. The whole world became auspicious.

38. Thus I have narrated to you the delightful story of lord Śiva that removes all misery, yields wealth and fulfils cherished desires.

39. It is conducive to prosperity and longevity. It prevents all obstacles. It yields worldly pleasure and salvation. It confers the fruits of all cherished desires.

40-41. The intelligent man who hears or narrates the story of the moon-crested lord, or reads or teaches it shall undoubtedly derive wealth, grains, progeny, happiness, all desires and particularly devotion to Śiva.

42. This narrative is unequalled. It destroys all torments. It generates great knowledge. It increases devotion to Śiva.

43. The brahmin listener attains brahminical splendour; the Kṣatriya becomes a conqueror; the Vaiśya rich and the Śūdra the most excellent of men.


Continues....

🌹🌹🌹🌹🌹


శ్రీమద్భగవద్గీత - 536: 14వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 536: Chap. 14, Ver. 12

 

🌹. శ్రీమద్భగవద్గీత - 536 / Bhagavad-Gita - 536 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 12 🌴

12. లోభ: ప్రవృత్తిరారామ్భ: కర్మణామశమ: స్పృహా |
రజస్యేతాని జాయన్తే వివృద్దే భరతర్షభ ||


🌷. తాత్పర్యం : ఓ భరతవంశ శ్రేష్టుడా! రజోగుణము వృద్ధినొందినపుడు లోభము, కామ్యకర్మము, తీవ్రయత్నము, అణచసాధ్యముగాని కోరిక, తపన యను లక్షణములు వృద్ది నొందును.

🌷. భాష్యము : రజోగుణము నందున్నవాడు తాను పొందియున్న స్థితితో ఎన్నడును సంతృప్తినొందడు. దానిని వృద్ధిచేసికొనుటకు అతడు ఆకాంక్ష పడుచుండును. నివసించుటకు గృహమును నిర్మించదలచినచో తానా గృహమందు అనంతకాలము నివసింప బోవుచున్నట్లు రాజమహలు వంటి భవంతిని నిర్మింప శాయశక్తులు యత్నించును. ఇంద్రియ భోగానుభవమునకై తీవ్రమైన ఆకాంక్షను వృద్ధిచేసికొను అతని భోగములకు అంతమనునది ఉండదు.

ఇల్లు మరియు సంసారముతోడనే ఎల్లప్పుడును నిలిచి ఇంద్రియభోగానుభవమును కొనసాగించుటయే అతని కోరిక. ఆ కోరికకు త్రెంపు అనునది ఉండదు. ఈ చిహ్నములన్నింటిని రజోగుణ లక్షణములుగా అర్థము చేసికొనవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 502 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 12 🌴

12. lobhaḥ pravṛttir ārambhaḥ karmaṇām aśamaḥ spṛhā
rajasy etāni jāyante vivṛddhe bharatarṣabha


🌷 Translation : O chief of the Bhāratas, when there is an increase in the mode of passion the symptoms of great attachment, fruitive activity, intense endeavor, and uncontrollable desire and hankering develop.

🌹 Purport : One in the mode of passion is never satisfied with the position he has already acquired; he hankers to increase his position. If he wants to construct a residential house, he tries his best to have a palatial house, as if he would be able to reside in that house eternally. And he develops a great hankering for sense gratification.

There is no end to sense gratification. He always wants to remain with his family and in his house and to continue the process of sense gratification. There is no cessation of this. All these symptoms should be understood as characteristic of the mode of passion.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 31, MAY 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 31, MAY 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 536 / Bhagavad-Gita - 536 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 47 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 47 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 890 / Sri Siva Maha Purana - 890 🌹
🌻. శంఖచూడుని వధ - 5 / The annihilation of Śaṅkhacūḍa - 5 🌻
3) 🌹 సిద్దేశ్వరయానం - 70 🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 546 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 546 - 3 🌹 
🌻 546. 'బంధమోచనీ’ - 3 / 546. 'Bandhamochani' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 536 / Bhagavad-Gita - 536 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 12 🌴*

*12. లోభ: ప్రవృత్తిరారామ్భ: కర్మణామశమ: స్పృహా |*
*రజస్యేతాని జాయన్తే వివృద్దే భరతర్షభ ||*

*🌷. తాత్పర్యం : ఓ భరతవంశ శ్రేష్టుడా! రజోగుణము వృద్ధినొందినపుడు లోభము, కామ్యకర్మము, తీవ్రయత్నము, అణచసాధ్యముగాని కోరిక, తపన యను లక్షణములు వృద్ది నొందును.*

*🌷. భాష్యము : రజోగుణము నందున్నవాడు తాను పొందియున్న స్థితితో ఎన్నడును సంతృప్తినొందడు. దానిని వృద్ధిచేసికొనుటకు అతడు ఆకాంక్ష పడుచుండును. నివసించుటకు గృహమును నిర్మించదలచినచో తానా గృహమందు అనంతకాలము నివసింప బోవుచున్నట్లు రాజమహలు వంటి భవంతిని నిర్మింప శాయశక్తులు యత్నించును. ఇంద్రియ భోగానుభవమునకై తీవ్రమైన ఆకాంక్షను వృద్ధిచేసికొను అతని భోగములకు అంతమనునది ఉండదు.*

*ఇల్లు మరియు సంసారముతోడనే ఎల్లప్పుడును నిలిచి ఇంద్రియభోగానుభవమును కొనసాగించుటయే అతని కోరిక. ఆ కోరికకు త్రెంపు అనునది ఉండదు. ఈ చిహ్నములన్నింటిని రజోగుణ లక్షణములుగా అర్థము చేసికొనవలెను.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 502 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 12 🌴*

*12. lobhaḥ pravṛttir ārambhaḥ karmaṇām aśamaḥ spṛhā*
*rajasy etāni jāyante vivṛddhe bharatarṣabha*

*🌷 Translation : O chief of the Bhāratas, when there is an increase in the mode of passion the symptoms of great attachment, fruitive activity, intense endeavor, and uncontrollable desire and hankering develop.*

*🌹 Purport : One in the mode of passion is never satisfied with the position he has already acquired; he hankers to increase his position. If he wants to construct a residential house, he tries his best to have a palatial house, as if he would be able to reside in that house eternally. And he develops a great hankering for sense gratification.*

*There is no end to sense gratification. He always wants to remain with his family and in his house and to continue the process of sense gratification. There is no cessation of this. All these symptoms should be understood as characteristic of the mode of passion.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 890 / Sri Siva Maha Purana - 890 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 40 🌴*

*🌻. శంఖచూడ వధ - 5 🌻*

*విష్ణువు వైకుంఠముకు వెళ్లెను. శ్రీ కృష్ణుడు స్వస్థుడాయెను. దేవతలు పరమానందముతో గూడిన వారై తమ నెలవులకు వెళ్లిరి (36). జగత్తు మిక్కిలి స్వస్థతను పొందెను. భూమియందు విఘ్నములన్నియు శమించెను. ఆకాశము నిర్మలమాయెను. భూమియందు అంతటా మంగళములు నెలకొనెను (37).*

*ఈ తీరున ఆనందదాయకము, దుఃఖములనన్నిటినీ పోగొట్టునది, సంపదల నిచ్చునది, కోర్కెల నన్నిటినీ ఈడేర్చునది యగు మహేశుని వృత్తాంతమును చెప్పియుంటిని (38). ధన్యము, కీర్తికరము, ఆయుర్వర్ధనము, విఘ్నములనన్నిటినీ తొలగించునది, భుక్తి ముక్తులను సర్వకామములను ఇచ్చునది (39). అగు ఈ చంద్రశేఖరుని గాథను బుద్ధిశాలియగు ఏ మానవుడు నిత్యము వినునో, లేదా వినిపించునో, లేదా పఠించునో, లేదా పఠింపజేయునో (40), అట్టివాడు ధనధాన్యములను, పుత్రుని, సౌఖ్యమును, సర్వకామనలను, విశేషించి శివభక్తిని పొందుననుటలో సందియములేదు. (41). ఈ సాటిలేని గాథ ఉపద్రవములనన్నిటినీ నశింపజేసి పరమజ్ఞానమునిచ్చి శివభక్తిని వర్ధిల్లజేయును (42). దీనిని విన్న బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్విగను, క్షత్రియుడు విజయిగను, వైశ్యుడు సంపన్నుడు గను, శూద్రుడు మహాపురుషుడుగను అగుదురు (43).*

*శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శంఖచూడవధయను నలుబదియవ అధ్యాయము ముగిసినది (40).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 890 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 40 🌴*

*🌻 Śaṅkhacūḍa is slain - 5 🌻*

36. Viṣṇu went to Vaikuṇṭha. Kṛṣṇa became complacent. The gods went to their abodes with great delight.

37. The universe regained normalcy. The whole earth was freed of obstacles. The sky was pure. The whole world became auspicious.

38. Thus I have narrated to you the delightful story of lord Śiva that removes all misery, yields wealth and fulfils cherished desires.

39. It is conducive to prosperity and longevity. It prevents all obstacles. It yields worldly pleasure and salvation. It confers the fruits of all cherished desires.

40-41. The intelligent man who hears or narrates the story of the moon-crested lord, or reads or teaches it shall undoubtedly derive wealth, grains, progeny, happiness, all desires and particularly devotion to Śiva.

42. This narrative is unequalled. It destroys all torments. It generates great knowledge. It increases devotion to Śiva.

43. The brahmin listener attains brahminical splendour; the Kṣatriya becomes a conqueror; the Vaiśya rich and the Śūdra the most excellent of men.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 70 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
 
*🏵 19వ శతాబ్దం - గుహలో కాళి 🏵*

*తీర్థ యాత్రకు బయలుదేరి పాంధులతో కలిసి ఆంధ్ర ప్రాంతం నుండి ఓడ్ర దేశంలోకి ప్రవేశించాము. రైలు వేగంగా కదలిపోతున్నది. ఒక అడవిలోకి ప్రవేశించిన తరువాత ఎందుకో గమనం మందగించి నెమ్మదిగా సాగుతూ కాసేపటికి బండి ఆగిపోయింది. గంట, రెండు గంటలు, మూడు గంటలు గడిచినవి. ఈ లోపు ప్రయాణికులు గార్డు దగ్గరికి కొందరు, ఇంజను దగ్గరకు కొందరు వెళ్ళి కనుక్కుంటే త్రోవలో కొంత దూరాన పట్టాలు బాగుచేస్తున్నారు. త్వరలో సందేశం వస్తుంది బయలుదేరుతాము అని సమాధానం వచ్చింది. నాకెందుకో మనస్సులో ఇక్కడ దిగు దిగు -రైలులో వెళ్ళవద్దు. అని సందేశం వస్తున్నట్లు అనిపించింది. చాలామంది క్రింద దిగి మాట్లాడుకుంటున్నారు. కొందరు దూరంగా ఉన్న చెట్ల దగ్గరకు వెళ్ళి నీడలో విశ్రాంతి తీసుకొంటున్నారు. నేనూ దిగి దూరంగా ఒక రావిచెట్టు కింద కూర్చున్నాను.*

*శ్లో॥ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శ్శివరూపాయ వృక్షరాజాయతే నమః*

*అశ్వత్థ వృక్షం మొదలు బ్రహ్మస్వరూపం, మధ్య విష్ణు స్వరూపం. కొమ్మల చివరలు పైన శివరూపం. అటువంటి దేవతా వృక్షానికి నమస్కారం అనుకొంటూ ఉన్నాను. సాయంసంధ్య దాటి కొంచెం చీకటిపడుతున్న సమయానికి రైలు కూత వేసి బయలుదేరింది. గార్డు విజిల్ వేశాడు. అందరూ గబగబా రైలెక్కారు. నేను ఉండిపోయినాను. నేను తమతో రాకపోతే ఈ ప్రయాణీకుడు ఏమైపోయినాడో పట్టించుకొనే వారు నా ఆప్తులు- బంధువులు - రైలులో ఎవరూ లేరు. నేను ఎప్పుడూ ఒంటరివాడినే. ఇప్పుడూ ఒంటరివాడినే. నాలో నేనే నవ్వుకొన్నాను. ఈ ప్రపంచంలో ఎవరికెవరు ? ఒంటరిగా రావటం ఒంటరిగా పోవటం. మధ్యలో భార్యా - బిడ్డలు - చుట్టాలు - స్నేహితులు నదీ ప్రవాహంలో కలుస్తూ విడిపోతూ ఉండే కట్టెల వంటి వారు. జీవితం ఎంత చిత్రమైనది! ఆ రాత్రి ఆ చెట్టు క్రిందనే శయనించి ప్రొద్దుననే లేచి చూచి నెమ్మదిగా దగ్గరనే ఉన్న ఒక సరస్సులో స్నానం ముగించుకొని రైలు వెళ్ళిన త్రోవ ప్రక్క నడవటం మొదలుపెట్టాను.*

*మధ్యాహ్నం దాకా నడిచిన తర్వాత ఒక చోట దిగుడుబావి. పండ్లచెట్లు కనిపించినవి. ఆగి నాలుగు పండ్లు కోసుకొని తిని కాసిని మంచినీళ్ళు తాగి విశ్రాంతి తీసుకొన్నాను. ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ లేచి బయలుదేరుతుంటే ఒక కోయవాడు కనిపించి ఎక్కడకు వెళుతున్నారని అడిగాడు. భువనేశ్వర్ వెళ్తున్నానని చెప్పాను. అతడు " ఈ బండ్లదోవన నడుస్తూ పోతే చాలా రోజులు పడుతుంది. అడవిలో దగ్గర దోవ ఉంది. కాలిబాట. నేనూ అటే వెళుతున్నాను. మీరు వస్తే మిమ్మూ తీసుకెళ్తాను. ఇక్కడి మార్గాలన్ని నాకు బాగా తెలిసినవి" అన్నాడు. అతనిని చూస్తే మనిషి మంచి వాడిలానే ఉన్నాడు. ఒక వేళ కాదు - అయితే ఏమిటి? నా దగ్గర ఏముంది? నా గమ్యస్థానం అంత వేగంగా చేరుకోవలసిన పనేమీ లేదు. తొందరగా చేరినా మంచిదే చేరకపోయినా మంచిదే. ఎవరో ఒకరు తోడు దొరికారు. అనుకొని అలాగే కలసి వెళదామన్నాను. కొంతదూరం ప్రధాన మార్గంలో నడిచి తర్వాత అడవిలో ప్రవేశించాము. మధ్యాహ్నం, రాత్రి పూట ఆగటం పండ్ల చెట్లున్న చోట్లు నీళ్ళు దొరికే చోట్లు మాకు విశ్రమస్థానాలు. అవి ఆ కోయవానికి తెలుసు. ఇలా కొద్దిరోజుల ప్రయాణం సాగింది.*

*ఒక చోటుకు వెళ్ళేసరికి కనుచూపు మేర మోకాలి లోతు నీళ్ళు. త్రోవ కనపడటం లేదు. ఆ కోయవాడు "బాబుగారూ! దోవ ఇటే కానీ ఇప్పుడు పోవటానికి వీలు లేదు. ఎక్కడ ఎంత లోతు నీళ్ళుంటవో, ఎక్కడైనా ఊబి ఉంటుందో ప్రమాదం. ఎన్ని రోజులు ఇలా ఉంటుందో చెప్పలేము. ఇటీవల కురిసిన వానల వల్ల ఇలా జరిగింది. ఇప్పుడేమి చెయ్యాలో తోచటం లేదు" అన్నాడు. నేను "ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కు పోవాలనిపించటం లేదు. ఈ నీటి ప్రక్కనే నడుచుకుంటూ వెళ్లాము. అమ్మవారు సహాయం చేస్తుంది” అని ముందుకు దోవదీశాను. ఇప్పుడు నేను తెలియని మార్గదర్శిని. అలా వెళ్ళగా వెళ్ళగా అడవిలో ఒక కొలను. అక్కడికి మనుషులు వచ్చిన జాడలు కనిపిస్తున్నవి. వాటిని పట్టుకొని వెళుతున్నాము. సాయంకాలం కావచ్చింది దారి కాస్త పెద్దదైంది. మరి కొన్ని కాలిబాటలు దీనిలో వచ్చి కలిసినవి. బండ్లు ప్రయాణం చేసే దోవలోకి చేరాము. ఎక్కువ దూరం పోకముందే ఒక తోట కనిపిస్తున్నది. మనుషులు గోచరిస్తున్నారు. ఒక కొండగుట్ట మరీ ఎత్తు లేదు. అక్కడి నుండి కొ దరు ఎదురు వచ్చారు. పూర్ణకుంభంతో స్వాగతం చెప్పి కంఠంలో పూలదండ వేశారు. కోయవాడు దిగ్భ్రాంతితో చూస్తున్నాడు. వారంతా నా పాదములకు నమస్కారం చేశారు. "స్వామీ! మీరాక కోసం ఎదురు చూస్తున్నాము" అంటూ వారిలో పెద్దాయన అరవై సంవత్సరాల వానివలె ఉన్నాడు. ఆయనతో ముప్ఫైయేండ్ల యువకుడు, మధ్యవయస్కులు కొందరు. స్త్రీలు - వినయంతో రావలసినదిగా ప్రార్థించారు. ముందుకు వెళ్ళిన తర్వాత పాణిపాద ప్రక్షాళనం చేసి ఆ కొండగుట్టలోని ఒక గుహలోకి ప్రవేశించాము.*

*అది పెద్ద గుహ. అందులో కాళీదేవి యొక్క విగ్రహం అద్భుతంగా అలరారుతున్నది. ఆ పెద్దాయన అమ్మవారికి హారతి యిచ్చి విధేయతతో నన్ను అచట సింహాసనం మీద ఆసీనుని చేసి విన్నవించాడు. "గురుదేవా! మీరిక్కడకు వస్తున్నారని అమ్మవారు తెలియజేశారు. ఈ గుహమీది. ఈ దేవి మీతో హిమాలయాల నుండి వచ్చినది. కాళీసిద్ధునిగా మూడు వందల సంవత్సరాలు జీవించి శరీరాన్ని విడిచి వెడుతూ నాకిక్కడి బాధ్యతలు అప్పగించారు. గత రెండు వందల సంవత్సరాలుగా నేనిక్కడ సేవచేస్తున్నాను. మా అబ్బాయి ఇప్పుడే తపస్సులో కొంత పురోగమిస్తున్నాడు. ఇక ఈ క్షణం నుండి మేమంతా మీ అజ్ఞాబద్ధులము. మీతో వచ్చిన ఈ కోయవాడు నిమిత్తమాత్రుడు. వానికి సుఖంగా జీవించటానికి కావలసినంత ధనమిచ్చి పంపిస్తున్నాము".*

*కాళీదేవిని చూస్తున్నాను. తప్పిపోయిన బిడ్డ తిరిగివస్తే తల్లి ఎలా ఉంటుందో అలా ఉన్నది కాళీమాత. ఆమె కన్నులలో ప్రేమ, కరుణ, జాలి అన్నీ భాసిస్తున్నవి. కాసేపటికి అందరూ బయటికి వెళ్ళిపోయినారు. మిగిలింది అమ్మ - నేను.*

*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 546 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 546 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀*

*🌻 546. 'బంధమోచనీ’ - 3 🌻*

*సర్వజీవరాశుల చైతన్యముగా తాను ఉన్నాడు అను భావము కలుగుటకు శ్రీమాత అనుగ్రహము కావలెను. అట్టి అనుగ్రహము కొఱకే ఆరాధన. అవిద్య అను చీకటి గదిలో చీకటిని పారద్రోలు దీపము శ్రీమాత. అంతర్ముఖముగ నుండు అజ్ఞానపూరితమైన జీవుని స్వభావము నందు చీకటిని పారద్రోలు దీపము వంటిది శ్రీమాత. "అవిద్యానాం అంత స్థిమిర మిహిర ద్వీప నగరీ" అని ఆది శంకరులు శ్రీమాతను ప్రస్తుతి గావించినారు. కరుడు గట్టిన అజ్ఞానాంధకారమును పటాపంచలు చేయుట శ్రీమాతకే సాధ్యము. అజ్ఞాన తిమిరమునకు ఆమెయే మిహిర. ఆమె అనుగ్రహము వలననే అవిద్యా బంధము వీడును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 546 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*

*🌻 546. 'Bandhamochani' - 3 🌻*

*Sri Mata's grace is needed to feel that one is the consciousness of all living beings. Worship is for that Grace. Srimata is the lamp that dispels the darkness in the dark room of ignorance. Srimata is like the lamp that dispels the darkness in the nature of an inner ignorant being. Adi Sankarulu sang to Srimata that 'Avidyanam Anta Sthimira Mihira Dweepa Nagari'. Sri Mata is the only one who can dispel the stubborn ignorance. She is the Sun that dispels ignorance. It is because of her grace that ignorance will leave the bond.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj