శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀
🌻 355-2. 'సంహృతాశేష పాషండా' 🌻
అట్లే సనాతనమగు ధర్మమును, ఆచారమును పాలకులు సహితము కించపరచు చున్నారు. పవిత్ర గ్రంథములను బహిరంగముగ ధ్వంసము చేయుచున్నారు. శ్రీరాముని విగ్రహ మూర్తులను కూడ చెప్పుల దండతో అలంకరించి ఊరేగించుట జరిగినది. ఇది అంతయూ పాషండ తత్వమే. సజ్జనులు బలహీనులై చేయునది లేక మనస్థాపముతో వ్యధ చెందుచున్నారు. స్వేచ్ఛ స్వాతంత్ర్యము అను పదములకు నూతన నిర్వచనముల నేర్పరచి ఇంద్రియలోలురై దేహబద్దులై దేహమే తామనుకొనుచు జీవించు చున్నారు.
ఇట్టి పాషండత్వము తొలగించుట మానవ సాధ్యము కాదు. దైవమే దిగివచ్చి ఈ పాషండత్వమును సంహరింపవలెను. రామ కృష్ణాది అవతారముల యందు ఇట్టి సంస్కరణమే జరిగినది. ప్రస్తుత కాలమున సదాచార ప్రవర్తకులు దివ్యావతరణమునకే ప్రార్థనలు సలపవలెను. శ్రీమాత సంకల్పమే రూపము దాల్చిన దివ్యత్వము. పూర్వము సృష్టి యందు ఎందరినో పాషండులను సంహరించి ఆమె జీవుల నుద్ధరించినది. ప్రతి మానవుడు సదాచారమున రక్షింపబడినచో తన యందలి పాషండత్వమును నిర్మూలించు కొనవలెను. అందులకే ఈ నామము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 355-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻
🌻 355-2. Saṃhṛtāśeṣa-pāṣaṇḍā संहृताशेष-पाषण्डा 🌻
She is referred in this nāma as the destroyer of heretics. Heretics are those who do not follow the principles laid down by Veda-s. Fourteen places (which include the four Veda-s and their extensions are referred to as the principle domains of dharma.
Those men who cross the boundaries of the principles of dharma are called pāṣaṇḍa or heresy. She destroys all those who act against the principles of Veda-s.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
13 Mar 2022
ఓషో రోజువారీ ధ్యానాలు - 152. నిద్ర / Osho Daily Meditations - 152. SLEEP
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 152 / Osho Daily Meditations - 152 🌹
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 152. నిద్ర 🍀
🕉. నిద్ర అనేది దైవికం. మరే సమయంలోనైనా కంటే ఎక్కువ దైవికం. ఒకరు ధ్యానం చేస్తూ నిద్రపోతే, ధ్యానం వారి అవ్యక్త స్థితి యొక్క పొరలలోకి దూసుకు పోతుంది. 🕉
మీరు ఎప్పుడైనా గమనించారా? రాత్రి మీ చివరి ఆలోచన ఏదైతే, ఉదయం అదే మీ మొదటి ఆలోచన అవుతుంది. మీరు నిద్రలోకి ప్రవేశించినప్పుడు చివరిదయిన ఆలోచనను గమనించండి. మీరు నిద్ర యొక్క ప్రవేశద్వారం మీద నిలబడి ఉన్నారు- మీరు మళ్ళీ ప్రవేశద్వారం మీద నిలబడినప్పుడు, అంటే మీరు నిద్ర నుండి బయటకు వచ్చేటప్పుడు మీ చివరి ఆలోచన ఎల్లప్పుడూ మళ్లీ మీ మొదటి ఆలోచన అయి ఉంటుంది.
అందుకే అన్ని మతాలు నిద్రపోయే ముందు ప్రార్థన చేయమని పట్టుబట్టాయి. అంటే చివరి ఆలోచన ప్రార్థన అయి ఉంటే, అది మీ హృదయంలోకి దిగిపోతుంది. రాత్రంతా అది మీ చుట్టూ సుగంధంలాగా ఉంటుంది- అది మీ లోపలి స్థలాన్ని దివ్యత్వంతో నింపుతుంది. ఉదయం మీరు మేల్కొన్నప్పుడు, అదే మీ చుట్టూ ఉంటుంది. ఎనిమిది గంటల నిద్రను ధ్యానంగా ఉపయోగించవచ్చు. ఈ రోజుల్లో ప్రజలకు ఎక్కువ సమయం లేదు, కానీ ఈ ఎనిమిది గంటల నిద్రను ధ్యాన సమయంగా ఉపయోగించ వచ్చు. నా మొత్తం విధానం ఏమిటంటే, ప్రతిదీ ఉపయోగించ వచ్చు. అలాగే నిద్రని కూడా ఉపయోగించు కోవాలి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 152 🌹
📚. Prasad Bharadwaj
🍀 152. SLEEP 🍀
🕉 Sleep is divine, more divine than any other time. And if one falls asleep meditating, the meditation keeps resounding down into the layers of one’s unconscious. 🕉
Have you ever noticed? Whatever is your last thought in the night will be your first thought in the morning. Watch it-the last, the very last, when you enter into sleep. You are standing just on the threshold-the last thought will always be the first thought when you again stand on the threshold and you are coming out of sleep.
That's why all the religions have insisted on praying before one goes to sleep, so the last thought remains of prayer, and it sinks into one's heart. The whole night it remains like an aroma around you-it fills your inner space, and in the morning when you awake, again it is there. Eight hours of sleep can be used as meditation. Nowadays people don't have much time, but these eight hours of sleep can be used as meditation time. My whole approach is that everything can be used and should be used---even sleep!
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
13 Mar 2022
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 163
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 163 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻
మహనీయులు దేవుని అస్తిత్వమునందు శరణాగతి చెంది, జీవయాత్ర సాగింతురు. వీరు తమ హృదయములందు ఎనిమిది అంగుళముల కొలత కలిగిన దివ్యదేహునిగా సర్వాంతర్యామిని ధ్యానింతురు. అనగా ఎనిమిది ప్రకృతులలోని వానిని తెలియుదురు. చూపుడు వ్రేలు కొలతగా హృదయమున శ్రీహరిని ధ్యానింతురు. అనగా చూపడు వ్రెలితో ఎవ్వనిని చూపినను, ఏ వస్తువును చూపినను, వాని యందు భగవంతుడు జ్ఞప్తి రావలెను గాని ఆయా వ్యక్తులు, వస్తువులుగాదు.
స్వామిని చతుర్భుజుడుగా ధ్యానింపవలెను. అనగా తాను నిలబడిన తావున నుండి నాలుగు దిక్కుల వరకు కనుపించునంతమేర దేవుని బాహువులు రక్షించుచున్నవని తెలియవలెను. మందర ధారియగు కూర్మమూర్తిగా భావింపవలెను. అనగా జగత్తును ధరించు శక్తిగా తెలియవలెను.
దేవుని గూర్చి మనకు ఎంత గొప్ప అభిప్రాయమున్నను, అది అభిప్రాయమే గాని దేవుడు కాదని గ్రహింపవలెను. సాధన చేయుచున్నప్పుడు కలుగు స్వప్న సాక్షాత్కారములు మున్నగు అనుభవములకు మురిసి పొంగినచో, ఇంక ఆ పైకి పోవుట జరుగదు. ఇట్టివి మన కోరికల సాక్షాత్కారములే కాని, దేవుని సాక్షాత్కారములు గావు. భగవంతుని సాక్షాత్కారమనగా సృష్టిలోని జీవుల రూపములోని సాక్షాత్కారమే. మిగిలినదంతయు జీవులల్లుకొన్న పాండిత్యమనియు తెలియవలెను.
.✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
13 Mar 2022
శ్రీ శివ మహా పురాణము - 533 / Sri Siva Maha Purana - 533
🌹 . శ్రీ శివ మహా పురాణము - 533 / Sri Siva Maha Purana - 533 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 47
🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 3 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఇట్లు వారచట సాదరముగా మాటలాడు చుండగనే, ఇంతలో పర్వతరాజు యొక్క మంత్రులు అందరు విచ్చేసిరి(23). వారు శివుని వద్దకు,విష్ణువు మొదలగు వారి వద్దకు వెళ్లి కన్యాదాన సమయము సమీపించు చన్నది గాన, బయలు దేరుడు అని ప్రార్ధించిరి(24). ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలందరు ఆ మాటను విని మనస్సులో చాల సంతసించి వెంటనే హిమవంతుని ఉద్దేశించి జయాధ్వానమును చేసిరి (25). కాళిని పొందవలెననే ఉత్కంఠ గల శివుడు కూడ మిక్కిలి సంతసించెను. కాని ఆ చిహ్నములను మనస్సులందు రహస్యముగ నుంచి గంభీరాకారడై యుండెను(26).
అపుడు శూలధారి, లోకానుగ్రహమును చేయువాడు, మిక్కిలి ప్రసన్నుడు అగు మంగళ ద్రవ్యములతో స్నానమును చేసెను (27). స్నానము చేసి చక్కని వస్త్రమును ధరించిను శివుని వారందరు చుట్టుముట్టిరి. లోకపాలకులు ఆయనను చక్కగా సేవిస్తూ వృషభముపై నెక్కించిరి(28). వారందరు వాద్యములను మ్రోగించుచూ, పండుగను చేసుకొనుచూ ఆ ప్రభుని ముందిడుకొని హిమవంతుని గృహమునకు వెళ్లిరి(29). హిమవంతునిచే పంప బడిన బ్రాహ్ణణులు మరియు శ్రేష్ఠులగు పర్వతులు కుతూహలముతో కూడిన వారై శంభుని యెదుట నడిచిరి(30).
శివుని శిరస్సుపై పెద్ద ఛత్రము ఏర్పాటు చేయబడెను. చామరములు వీచబడెను. వితానము ( వస్త్రముతో చేసిన పందిరి) క్రింద మహేశ్వరుడు శోభిల్లెను(31). నేను, విష్ణువు, ఇంద్రుడు, లోకపాలకులు ముందు నడిచితిమి. మేము కూడ గొప్ప శోభతో ప్రకాశించితిమి (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 533 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴
🌻 The ceremonious entry of Śiva - 3 🌻
Brahmā said:—
23. Even as these confabulations were going on, the ministers of the lord of mountains came there.
24. They approached Śiva, Viṣṇu and others and made their submission that the time for the celebration of marriage had arrived and that they would please hasten to the palace.
25. On hearing that, O sage, Viṣṇu and others rejoiced much and cried shouts of victory to the mountain.
26. Śiva too rejoiced much eager that he was approaching Pārvatī but kept the signs of joy within his mind alone in a wonderfully serene manner.
27. Then the ceremonial ablution with the sacred articles of toilet, was performed by the delighted tridentbearing lord eager to bless the worlds.
28. The bath being over He wore fine clothes. He was attended upon by the guardians of the quarters and surrounded by several others. He was then seated on the shoulders of the Bull.
29. With the lord in front, all of them entered the palace of Himavat playing on various musical instruments and exhibiting their eagerness.
30. The brahmins sent by Himavat and the excellent mountains enthusiastically went ahead of Śiva.
31. The great royal umbrella was held aloft over the great lord. He was fanned by chowries and a canopy was spread over Him.
32. Viṣṇu, Indra, the other guardians of the quarters and I going ahead shone with great brilliance and splendour.
Continues....
🌹🌹🌹🌹🌹
13 Mar 2022
గీతోపనిషత్తు -335
🌹. గీతోపనిషత్తు -335 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-2 📚
🍀 28-2. సన్యాస యోగము - కర్తవ్యము నిర్వర్తింప లేకపోవుట వలన, అనవసరపు కార్యములలో తల దూర్చుకొనుట వలన బంధములు పెరుగుచు నుండును. మొదట సంకల్పములను సన్యసింపవలెను. పిదప కర్మఫలములను కూడ సన్యసింపవలెను. అట్టివాడే నిజమగు సన్యాసి. కర్తవ్యకర్మ నిర్వర్తించుచునే యుండవలెను. అట్టివాడే నిజమగు యోగి. ఇట్టి జ్ఞానము వలన విశిష్టమగు మోక్షస్థితి సద్యోఫలముగ నుండును. కర్తవ్య కర్మయందు యజ్ఞము, దానము, తపస్సు కూడ భగవానుడు పేర్కొనినాడు. 🍀
28. శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాస యోగ యుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి ||
🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.
🌻. వివరణము : స్వంత సంకల్పములు రజోగుణ దోషముచే కలుగుచు నుండును. అట్లు సంకల్పములు బలీయముగ లాగుచుండగ, కర్తవ్యము మరపునకు వచ్చును. కర్తవ్యము నిర్వర్తింప లేకపోవుట వలన, అనవసరపు కార్యములలో తల దూర్చుకొనుట వలన బంధములు పెరుగుచు నుండును. కనుక నిజమగు సన్యాసము రెండు విధములుగ నున్నది. మొదట సంకల్పములను సన్యసింపవలెను. పిదప కర్మఫలములను కూడ సన్యసింపవలెను.
కర్తవ్యకర్మ నిర్వర్తించుచునే యుండవలెను. అట్టివాడే నిజమగు సన్యాసి. అట్టివాడే నిజమగు యోగి. ఇట్టి జ్ఞానము వలన విశిష్టమగు మోక్షస్థితి సద్యోఫలముగ నుండును. కర్తవ్య కర్మయందు యజ్ఞము, దానము, తపస్సుకూడ భగవానుడు చివరి అధ్యాయమున పేర్కొనినాడు. అనగా పర హితార్థము జీవించుట, అందివచ్చిన సంపదను దానము చేయుట, తన లోపల వెలుపల నిండియున్న ఈశ్వరునితో అనుసంధానము చెందుట కూడ కర్తవ్యములే అని తెలియవలెను. అట్టి కర్తవ్యము లందు కూడ ఫలాసక్తి యుండరాదు. అట్టివాడు విముక్తుడగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
13 Mar 2022
13 - MARCH - 2022 ఆదివారం MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 13, ఆదివారం, మార్చి 2022 భాను వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 28-2 - 335 - సన్యాస యోగము 🌹
3) 🌹. శివ మహా పురాణము - 533 / Siva Maha Purana - 533 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -163 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 152 / Osho Daily Meditations - 152 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 13, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు.🌻*
*🍀. ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాలు - 10 🍀*
*🌟 10. భగః –*
*భగః స్ఫూర్జోఽరిష్టనేమిః ఊర్ణ ఆయుశ్చ పంచమః |*
*కర్కోటకః పూర్వచిత్తిః పౌషమాసం నయంత్యమీ*
*తిథి మాస ఋతూనాం చ వత్సరాఽయనయోరపి |*
*ఘటికానాం చ యః కర్తా భగో భాగ్యప్రదోఽస్తు మే*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : జన్మ తీసుకున్నాక భాధ్యతలు అనే పరీక్షలు రాయవలసిందే. బాధ్యతల నుండి పారిపోవడం అనేది ఖచ్ఛితంగా తప్పే - మాస్టర్ ఆర్.కె. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల-దశమి 10:23:18 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: పునర్వసు 20:06:24 వరకు
తదుపరి పుష్యమి
యోగం: శోభన 28:18:09 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: గార 10:20:19 వరకు
వర్జ్యం: 06:49:30 - 08:35:42
మరియు 28:46:40 - 30:30:48
దుర్ముహూర్తం: 16:49:33 - 17:37:32
రాహు కాలం: 16:55:33 - 18:25:31
గుళిక కాలం: 15:25:36 - 16:55:33
యమ గండం: 12:25:41 - 13:55:38
అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:48
అమృత కాలం: 17:26:42 - 19:12:54
సూర్యోదయం: 06:25:51
సూర్యాస్తమయం: 18:25:31
చంద్రోదయం: 14:07:11
చంద్రాస్తమయం: 02:53:12
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: జెమిని
ధ్వజ యోగం - కార్య సిధ్ధి 20:06:24
వరకు తదుపరి శ్రీవత్స యోగం -
ధన లాభం , సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -335 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-2 📚*
*🍀 28-2. సన్యాస యోగము - కర్తవ్యము నిర్వర్తింప లేకపోవుట వలన, అనవసరపు కార్యములలో తల దూర్చుకొనుట వలన బంధములు పెరుగుచు నుండును. మొదట సంకల్పములను సన్యసింపవలెను. పిదప కర్మఫలములను కూడ సన్యసింపవలెను. అట్టివాడే నిజమగు సన్యాసి. కర్తవ్యకర్మ నిర్వర్తించుచునే యుండవలెను. అట్టివాడే నిజమగు యోగి. ఇట్టి జ్ఞానము వలన విశిష్టమగు మోక్షస్థితి సద్యోఫలముగ నుండును. కర్తవ్య కర్మయందు యజ్ఞము, దానము, తపస్సు కూడ భగవానుడు పేర్కొనినాడు. 🍀*
*28. శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |*
*సన్న్యాస యోగ యుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి ||*
*🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.*
*🌻. వివరణము : స్వంత సంకల్పములు రజోగుణ దోషముచే కలుగుచు నుండును. అట్లు సంకల్పములు బలీయముగ లాగుచుండగ, కర్తవ్యము మరపునకు వచ్చును. కర్తవ్యము నిర్వర్తింప లేకపోవుట వలన, అనవసరపు కార్యములలో తల దూర్చుకొనుట వలన బంధములు పెరుగుచు నుండును. కనుక నిజమగు సన్యాసము రెండు విధములుగ నున్నది. మొదట సంకల్పములను సన్యసింపవలెను. పిదప కర్మఫలములను కూడ సన్యసింపవలెను.*
*కర్తవ్యకర్మ నిర్వర్తించుచునే యుండవలెను. అట్టివాడే నిజమగు సన్యాసి. అట్టివాడే నిజమగు యోగి. ఇట్టి జ్ఞానము వలన విశిష్టమగు మోక్షస్థితి సద్యోఫలముగ నుండును. కర్తవ్య కర్మయందు యజ్ఞము, దానము, తపస్సుకూడ భగవానుడు చివరి అధ్యాయమున పేర్కొనినాడు. అనగా పర హితార్థము జీవించుట, అందివచ్చిన సంపదను దానము చేయుట, తన లోపల వెలుపల నిండియున్న ఈశ్వరునితో అనుసంధానము చెందుట కూడ కర్తవ్యములే అని తెలియవలెను. అట్టి కర్తవ్యము లందు కూడ ఫలాసక్తి యుండరాదు. అట్టివాడు విముక్తుడగును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 533 / Sri Siva Maha Purana - 533 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 47
*🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 3 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఇట్లు వారచట సాదరముగా మాటలాడు చుండగనే, ఇంతలో పర్వతరాజు యొక్క మంత్రులు అందరు విచ్చేసిరి(23). వారు శివుని వద్దకు,విష్ణువు మొదలగు వారి వద్దకు వెళ్లి కన్యాదాన సమయము సమీపించు చన్నది గాన, బయలు దేరుడు అని ప్రార్ధించిరి(24). ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలందరు ఆ మాటను విని మనస్సులో చాల సంతసించి వెంటనే హిమవంతుని ఉద్దేశించి జయాధ్వానమును చేసిరి (25). కాళిని పొందవలెననే ఉత్కంఠ గల శివుడు కూడ మిక్కిలి సంతసించెను. కాని ఆ చిహ్నములను మనస్సులందు రహస్యముగ నుంచి గంభీరాకారడై యుండెను(26).
అపుడు శూలధారి, లోకానుగ్రహమును చేయువాడు, మిక్కిలి ప్రసన్నుడు అగు మంగళ ద్రవ్యములతో స్నానమును చేసెను (27). స్నానము చేసి చక్కని వస్త్రమును ధరించిను శివుని వారందరు చుట్టుముట్టిరి. లోకపాలకులు ఆయనను చక్కగా సేవిస్తూ వృషభముపై నెక్కించిరి(28). వారందరు వాద్యములను మ్రోగించుచూ, పండుగను చేసుకొనుచూ ఆ ప్రభుని ముందిడుకొని హిమవంతుని గృహమునకు వెళ్లిరి(29). హిమవంతునిచే పంప బడిన బ్రాహ్ణణులు మరియు శ్రేష్ఠులగు పర్వతులు కుతూహలముతో కూడిన వారై శంభుని యెదుట నడిచిరి(30).
శివుని శిరస్సుపై పెద్ద ఛత్రము ఏర్పాటు చేయబడెను. చామరములు వీచబడెను. వితానము ( వస్త్రముతో చేసిన పందిరి) క్రింద మహేశ్వరుడు శోభిల్లెను(31). నేను, విష్ణువు, ఇంద్రుడు, లోకపాలకులు ముందు నడిచితిమి. మేము కూడ గొప్ప శోభతో ప్రకాశించితిమి (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 533 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴*
*🌻 The ceremonious entry of Śiva - 3 🌻*
Brahmā said:—
23. Even as these confabulations were going on, the ministers of the lord of mountains came there.
24. They approached Śiva, Viṣṇu and others and made their submission that the time for the celebration of marriage had arrived and that they would please hasten to the palace.
25. On hearing that, O sage, Viṣṇu and others rejoiced much and cried shouts of victory to the mountain.
26. Śiva too rejoiced much eager that he was approaching Pārvatī but kept the signs of joy within his mind alone in a wonderfully serene manner.
27. Then the ceremonial ablution with the sacred articles of toilet, was performed by the delighted tridentbearing lord eager to bless the worlds.
28. The bath being over He wore fine clothes. He was attended upon by the guardians of the quarters and surrounded by several others. He was then seated on the shoulders of the Bull.
29. With the lord in front, all of them entered the palace of Himavat playing on various musical instruments and exhibiting their eagerness.
30. The brahmins sent by Himavat and the excellent mountains enthusiastically went ahead of Śiva.
31. The great royal umbrella was held aloft over the great lord. He was fanned by chowries and a canopy was spread over Him.
32. Viṣṇu, Indra, the other guardians of the quarters and I going ahead shone with great brilliance and splendour.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 163 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻*
*మహనీయులు దేవుని అస్తిత్వమునందు శరణాగతి చెంది, జీవయాత్ర సాగింతురు. వీరు తమ హృదయములందు ఎనిమిది అంగుళముల కొలత కలిగిన దివ్యదేహునిగా సర్వాంతర్యామిని ధ్యానింతురు. అనగా ఎనిమిది ప్రకృతులలోని వానిని తెలియుదురు. చూపుడు వ్రేలు కొలతగా హృదయమున శ్రీహరిని ధ్యానింతురు. అనగా చూపడు వ్రెలితో ఎవ్వనిని చూపినను, ఏ వస్తువును చూపినను, వాని యందు భగవంతుడు జ్ఞప్తి రావలెను గాని ఆయా వ్యక్తులు, వస్తువులుగాదు.*
*స్వామిని చతుర్భుజుడుగా ధ్యానింపవలెను. అనగా తాను నిలబడిన తావున నుండి నాలుగు దిక్కుల వరకు కనుపించునంతమేర దేవుని బాహువులు రక్షించుచున్నవని తెలియవలెను. మందర ధారియగు కూర్మమూర్తిగా భావింపవలెను. అనగా జగత్తును ధరించు శక్తిగా తెలియవలెను.*
*దేవుని గూర్చి మనకు ఎంత గొప్ప అభిప్రాయమున్నను, అది అభిప్రాయమే గాని దేవుడు కాదని గ్రహింపవలెను. సాధన చేయుచున్నప్పుడు కలుగు స్వప్న సాక్షాత్కారములు మున్నగు అనుభవములకు మురిసి పొంగినచో, ఇంక ఆ పైకి పోవుట జరుగదు. ఇట్టివి మన కోరికల సాక్షాత్కారములే కాని, దేవుని సాక్షాత్కారములు గావు. భగవంతుని సాక్షాత్కారమనగా సృష్టిలోని జీవుల రూపములోని సాక్షాత్కారమే. మిగిలినదంతయు జీవులల్లుకొన్న పాండిత్యమనియు తెలియవలెను.*
.✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 152 / Osho Daily Meditations - 152 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 152. నిద్ర 🍀*
*🕉. నిద్ర అనేది దైవికం. మరే సమయంలోనైనా కంటే ఎక్కువ దైవికం. ఒకరు ధ్యానం చేస్తూ నిద్రపోతే, ధ్యానం వారి అవ్యక్త స్థితి యొక్క పొరలలోకి దూసుకు పోతుంది. 🕉*
*మీరు ఎప్పుడైనా గమనించారా? రాత్రి మీ చివరి ఆలోచన ఏదైతే, ఉదయం అదే మీ మొదటి ఆలోచన అవుతుంది. మీరు నిద్రలోకి ప్రవేశించినప్పుడు చివరిదయిన ఆలోచనను గమనించండి. మీరు నిద్ర యొక్క ప్రవేశద్వారం మీద నిలబడి ఉన్నారు- మీరు మళ్ళీ ప్రవేశద్వారం మీద నిలబడినప్పుడు, అంటే మీరు నిద్ర నుండి బయటకు వచ్చేటప్పుడు మీ చివరి ఆలోచన ఎల్లప్పుడూ మళ్లీ మీ మొదటి ఆలోచన అయి ఉంటుంది.*
*అందుకే అన్ని మతాలు నిద్రపోయే ముందు ప్రార్థన చేయమని పట్టుబట్టాయి. అంటే చివరి ఆలోచన ప్రార్థన అయి ఉంటే, అది మీ హృదయంలోకి దిగిపోతుంది. రాత్రంతా అది మీ చుట్టూ సుగంధంలాగా ఉంటుంది- అది మీ లోపలి స్థలాన్ని దివ్యత్వంతో నింపుతుంది. ఉదయం మీరు మేల్కొన్నప్పుడు, అదే మీ చుట్టూ ఉంటుంది. ఎనిమిది గంటల నిద్రను ధ్యానంగా ఉపయోగించవచ్చు. ఈ రోజుల్లో ప్రజలకు ఎక్కువ సమయం లేదు, కానీ ఈ ఎనిమిది గంటల నిద్రను ధ్యాన సమయంగా ఉపయోగించ వచ్చు. నా మొత్తం విధానం ఏమిటంటే, ప్రతిదీ ఉపయోగించ వచ్చు. అలాగే నిద్రని కూడా ఉపయోగించు కోవాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 152 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 152. SLEEP 🍀*
*🕉 Sleep is divine, more divine than any other time. And if one falls asleep meditating, the meditation keeps resounding down into the layers of one’s unconscious. 🕉*
*Have you ever noticed? Whatever is your last thought in the night will be your first thought in the morning. Watch it-the last, the very last, when you enter into sleep. You are standing just on the threshold-the last thought will always be the first thought when you again stand on the threshold and you are coming out of sleep.*
*That's why all the religions have insisted on praying before one goes to sleep, so the last thought remains of prayer, and it sinks into one's heart. The whole night it remains like an aroma around you-it fills your inner space, and in the morning when you awake, again it is there. Eight hours of sleep can be used as meditation. Nowadays people don't have much time, but these eight hours of sleep can be used as meditation time. My whole approach is that everything can be used and should be used---even sleep!*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।*
*సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀*
*🌻 355-2. 'సంహృతాశేష పాషండా' 🌻*
*అట్లే సనాతనమగు ధర్మమును, ఆచారమును పాలకులు సహితము కించపరచు చున్నారు. పవిత్ర గ్రంథములను బహిరంగముగ ధ్వంసము చేయుచున్నారు. శ్రీరాముని విగ్రహ మూర్తులను కూడ చెప్పుల దండతో అలంకరించి ఊరేగించుట జరిగినది. ఇది అంతయూ పాషండ తత్వమే. సజ్జనులు బలహీనులై చేయునది లేక మనస్థాపముతో వ్యధ చెందుచున్నారు. స్వేచ్ఛ స్వాతంత్ర్యము అను పదములకు నూతన నిర్వచనముల నేర్పరచి ఇంద్రియలోలురై దేహబద్దులై దేహమే తామనుకొనుచు జీవించు చున్నారు.*
*ఇట్టి పాషండత్వము తొలగించుట మానవ సాధ్యము కాదు. దైవమే దిగివచ్చి ఈ పాషండత్వమును సంహరింపవలెను. రామ కృష్ణాది అవతారముల యందు ఇట్టి సంస్కరణమే జరిగినది. ప్రస్తుత కాలమున సదాచార ప్రవర్తకులు దివ్యావతరణమునకే ప్రార్థనలు సలపవలెను. శ్రీమాత సంకల్పమే రూపము దాల్చిన దివ్యత్వము. పూర్వము సృష్టి యందు ఎందరినో పాషండులను సంహరించి ఆమె జీవుల నుద్ధరించినది. ప్రతి మానవుడు సదాచారమున రక్షింపబడినచో తన యందలి పాషండత్వమును నిర్మూలించు కొనవలెను. అందులకే ఈ నామము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 355-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani*
*Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻*
*🌻 355-2. Saṃhṛtāśeṣa-pāṣaṇḍā संहृताशेष-पाषण्डा 🌻*
*She is referred in this nāma as the destroyer of heretics. Heretics are those who do not follow the principles laid down by Veda-s. Fourteen places (which include the four Veda-s and their extensions are referred to as the principle domains of dharma.*
*Those men who cross the boundaries of the principles of dharma are called pāṣaṇḍa or heresy. She destroys all those who act against the principles of Veda-s.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)