శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-2








🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀

🌻 355-2. 'సంహృతాశేష పాషండా' 🌻


అట్లే సనాతనమగు ధర్మమును, ఆచారమును పాలకులు సహితము కించపరచు చున్నారు. పవిత్ర గ్రంథములను బహిరంగముగ ధ్వంసము చేయుచున్నారు. శ్రీరాముని విగ్రహ మూర్తులను కూడ చెప్పుల దండతో అలంకరించి ఊరేగించుట జరిగినది. ఇది అంతయూ పాషండ తత్వమే. సజ్జనులు బలహీనులై చేయునది లేక మనస్థాపముతో వ్యధ చెందుచున్నారు. స్వేచ్ఛ స్వాతంత్ర్యము అను పదములకు నూతన నిర్వచనముల నేర్పరచి ఇంద్రియలోలురై దేహబద్దులై దేహమే తామనుకొనుచు జీవించు చున్నారు.

ఇట్టి పాషండత్వము తొలగించుట మానవ సాధ్యము కాదు. దైవమే దిగివచ్చి ఈ పాషండత్వమును సంహరింపవలెను. రామ కృష్ణాది అవతారముల యందు ఇట్టి సంస్కరణమే జరిగినది. ప్రస్తుత కాలమున సదాచార ప్రవర్తకులు దివ్యావతరణమునకే ప్రార్థనలు సలపవలెను. శ్రీమాత సంకల్పమే రూపము దాల్చిన దివ్యత్వము. పూర్వము సృష్టి యందు ఎందరినో పాషండులను సంహరించి ఆమె జీవుల నుద్ధరించినది. ప్రతి మానవుడు సదాచారమున రక్షింపబడినచో తన యందలి పాషండత్వమును నిర్మూలించు కొనవలెను. అందులకే ఈ నామము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 355-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻

🌻 355-2. Saṃhṛtāśeṣa-pāṣaṇḍā संहृताशेष-पाषण्डा 🌻


She is referred in this nāma as the destroyer of heretics. Heretics are those who do not follow the principles laid down by Veda-s. Fourteen places (which include the four Veda-s and their extensions are referred to as the principle domains of dharma.

Those men who cross the boundaries of the principles of dharma are called pāṣaṇḍa or heresy. She destroys all those who act against the principles of Veda-s.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 Mar 2022

No comments:

Post a Comment