శ్రీ శివ మహా పురాణము - 533 / Sri Siva Maha Purana - 533
🌹 . శ్రీ శివ మహా పురాణము - 533 / Sri Siva Maha Purana - 533 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 47
🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 3 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఇట్లు వారచట సాదరముగా మాటలాడు చుండగనే, ఇంతలో పర్వతరాజు యొక్క మంత్రులు అందరు విచ్చేసిరి(23). వారు శివుని వద్దకు,విష్ణువు మొదలగు వారి వద్దకు వెళ్లి కన్యాదాన సమయము సమీపించు చన్నది గాన, బయలు దేరుడు అని ప్రార్ధించిరి(24). ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలందరు ఆ మాటను విని మనస్సులో చాల సంతసించి వెంటనే హిమవంతుని ఉద్దేశించి జయాధ్వానమును చేసిరి (25). కాళిని పొందవలెననే ఉత్కంఠ గల శివుడు కూడ మిక్కిలి సంతసించెను. కాని ఆ చిహ్నములను మనస్సులందు రహస్యముగ నుంచి గంభీరాకారడై యుండెను(26).
అపుడు శూలధారి, లోకానుగ్రహమును చేయువాడు, మిక్కిలి ప్రసన్నుడు అగు మంగళ ద్రవ్యములతో స్నానమును చేసెను (27). స్నానము చేసి చక్కని వస్త్రమును ధరించిను శివుని వారందరు చుట్టుముట్టిరి. లోకపాలకులు ఆయనను చక్కగా సేవిస్తూ వృషభముపై నెక్కించిరి(28). వారందరు వాద్యములను మ్రోగించుచూ, పండుగను చేసుకొనుచూ ఆ ప్రభుని ముందిడుకొని హిమవంతుని గృహమునకు వెళ్లిరి(29). హిమవంతునిచే పంప బడిన బ్రాహ్ణణులు మరియు శ్రేష్ఠులగు పర్వతులు కుతూహలముతో కూడిన వారై శంభుని యెదుట నడిచిరి(30).
శివుని శిరస్సుపై పెద్ద ఛత్రము ఏర్పాటు చేయబడెను. చామరములు వీచబడెను. వితానము ( వస్త్రముతో చేసిన పందిరి) క్రింద మహేశ్వరుడు శోభిల్లెను(31). నేను, విష్ణువు, ఇంద్రుడు, లోకపాలకులు ముందు నడిచితిమి. మేము కూడ గొప్ప శోభతో ప్రకాశించితిమి (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 533 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴
🌻 The ceremonious entry of Śiva - 3 🌻
Brahmā said:—
23. Even as these confabulations were going on, the ministers of the lord of mountains came there.
24. They approached Śiva, Viṣṇu and others and made their submission that the time for the celebration of marriage had arrived and that they would please hasten to the palace.
25. On hearing that, O sage, Viṣṇu and others rejoiced much and cried shouts of victory to the mountain.
26. Śiva too rejoiced much eager that he was approaching Pārvatī but kept the signs of joy within his mind alone in a wonderfully serene manner.
27. Then the ceremonial ablution with the sacred articles of toilet, was performed by the delighted tridentbearing lord eager to bless the worlds.
28. The bath being over He wore fine clothes. He was attended upon by the guardians of the quarters and surrounded by several others. He was then seated on the shoulders of the Bull.
29. With the lord in front, all of them entered the palace of Himavat playing on various musical instruments and exhibiting their eagerness.
30. The brahmins sent by Himavat and the excellent mountains enthusiastically went ahead of Śiva.
31. The great royal umbrella was held aloft over the great lord. He was fanned by chowries and a canopy was spread over Him.
32. Viṣṇu, Indra, the other guardians of the quarters and I going ahead shone with great brilliance and splendour.
Continues....
🌹🌹🌹🌹🌹
13 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment