🌹 28, MARCH 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 513 / Bhagavad-Gita - 513 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 24 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 24 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 868 / Sri Siva Maha Purana - 868 🌹
🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 5 / The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 5 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 126 / Osho Daily Meditations - 126 🌹
🍀 126. అహం / 126. EGO 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 539-3 🌹
🌻 539. 'శ్రుతిః' - 3 / 539. 'Shrutih' - 3 🌻
5) 🌹 సిద్దేశ్వరయానం - 24 🌹
6) 🌹సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకం యొక్క శక్తి 🌹
*🌹. POWER OF EACH SOUNDARYA LAHARI SHLOKA 🌹*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 513 / Bhagavad-Gita - 513 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 24 🌴*
*24. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణై: సహ |*
*సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే ||*
*🌷. తాత్పర్యం : భౌతికప్రకృతి, జీవుడు, త్రిగుణముల అంత:ప్రక్రియకు సంబంధించిన ఈ తత్త్వమును అవగాహన చేసికొనినవాడు నిశ్చయముగా మోక్షమును బడయును. అతని వర్తమానస్థితి ఎట్లున్నను అతడు తిరిగి జన్మింపడు.*
*🌷. భాష్యము : భౌతికప్రకృతి, పరమాత్మ, జీవాత్మ, వాని నడుమగల సంబంధము యొక్క స్పష్టమైన అవగాహన మనుజుని ముక్తుని గావించును. అంతియేగాక ఈ భౌతికప్రకృతికి అతడు తిరిగిరాకుండునట్లుగా అతని దృష్టిని సంపూర్ణముగా ఆధ్యాత్మికత వైపునకు మళ్ళించును. ఇదియే జ్ఞానము యొక్క ఫలితము. జీవుడు యాదృచ్చికముగా భౌతికస్థితిలోనికి పతితుడయ్యెనని అవగాహన చేసికొనుటయే జ్ఞానము యొక్క ఉద్దేశ్యమై యున్నది.*
*కనుక జీవుడు ప్రామాణికుల (సాధుపురుషుల మరియు గురువు) సాంగత్యమున తన నిజస్థితిని అవగతము చేసికొని, శ్రీకృష్ణుడు వివరించిన రీతిగా భగవద్గీతను తెలిసికొని ఆధ్యాత్మిక భావనకు (కృష్ణభక్తిరస భావనము) మరలవలెను. అప్పుడు అతడు నిశ్చయముగా ఈ భౌతికజగమునకు తిరిగిరాక సచ్చిదానందమయ జీవనమునకై ఆధ్యాత్మికజగత్తును చేరగలడు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 513 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 24 🌴*
*24. ya evaṁ vetti puruṣaṁ prakṛtiṁ ca guṇaiḥ saha*
*sarvathā vartamāno ’pi na sa bhūyo ’bhijāyate*
*🌷 Translation : One who understands this philosophy concerning material nature, the living entity and the interaction of the modes of nature is sure to attain liberation. He will not take birth here again, regardless of his present position.*
*🌹 Purport : Clear understanding of material nature, the Supersoul, the individual soul and their interrelation makes one eligible to become liberated and turn to the spiritual atmosphere without being forced to return to this material nature. This is the result of knowledge. The purpose of knowledge is to understand distinctly that the living entity has by chance fallen into this material existence.*
*By his personal endeavor in association with authorities, saintly persons and a spiritual master, he has to understand his position and then revert to spiritual consciousness or Kṛṣṇa consciousness by understanding Bhagavad-gītā as it is explained by the Personality of Godhead. Then it is certain that he will never come again into this material existence; he will be transferred into the spiritual world for a blissful eternal life of knowledge.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 868 / Sri Siva Maha Purana - 868 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 35 🌴*
*🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 5 🌻*
*మహేశ్వరుడిట్లు పలికెను - మేము భక్తులకు వశవర్తులమై ఉండెదము. మేము ఎన్నటికీ స్వతంత్రులము కాము. భక్తుల కోర్కెచే వారి కార్యములను చేయువారమే గాని, ఏ ఇక్కరి పక్షమునైనూ స్వీకరించువారము గాము (40). పూర్వము ప్రళయసముద్రములో విష్ణువు బ్రహ్మ యొక్క ప్రార్థన నాలకించి దైత్యవీరులగు మధుకైటభులతో సృష్ట్యాదియందు యుద్ధమును చేసెను (41). పూర్వము భక్తులకు హితమును చేయు విష్ణువు దేవతల ప్రార్థనను మన్నించి ప్రహ్లాదుని కొరకై హిరణ్యకశపుని సంహరించెను (42). పూర్వము నేను కూడా దేవతల ప్రార్థనను మన్నించి త్రిపురులతో గొప్ప యుద్ధమును చేసి వారి పురములను భస్మమొనర్చిన వృత్తాంతము లోక విదితమే (43). సర్వేశ్వరి, సర్వజగన్మాత యగు దుర్గ పూర్వము దేవతలు ప్రార్థించుటచే శుంభాదులతో జరిగిన యుద్ధములో వారిని సంహరించెను (44). ఈనాడు కూడా దేవతలందరు బ్రహ్మను శరణు జొచ్చిరి. ఆ బ్రహ్మ, మరియు విష్ణువు దేవతలతో గూడి నన్ను శరణు పొందిరి(45). ఓ దూతా! బ్రహ్మ, విష్ణువు మొదలగు వారి ప్రార్థనను మన్నించి నేను సర్వేశ్వరుడనే అయిననూ ఈ దేవతల యుద్ధము కొరకు వచ్చియుంటిని (46).*
*మహాత్ముడగు శ్రీ కృష్ణునకు నీవు అనుంగు సహచరుడవు. ఇంతకు ముందు సంహరింపబడిన రాక్షసు లెవ్వరూ నీతో సమానమైన వారు కారు (47). ఓ రాజ! నాకు నీతో యుద్ధమును చేయుటలో అధికమగు సిగ్గుఏమి గలదు? ఈశ్వరుడనగు నన్ను దేవతలు వినయముతో ప్రార్థించుగా, దేవకార్యము కొరకు వచ్చియుంటివి (48). నీవు వెళ్లి నా ఈ మాటలను శంఖచూడునకు చెప్పుము. ఆతడు తనకు యెగ్యముగు రీతిలో చేయుగాక! నేను దేవకార్యమును చేసెదను (49). మహేశ్వరుడగు శంకరుడిట్లు పలికి విరమించెను. అపుడు శంఖచూడుని దూత లేచి ఆతని వద్దకు వెళ్లెను (50).*
*శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో శివదూత సంవాదమనే ముప్పది అయిదవ అధ్యాయము ముగిసినది (35).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 868 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 35 🌴*
*🌻 The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 5 🌻*
Lord Śiva said:—
40. We are subservient to our devotees. We are never independent. We carry out their tasks at their wish. We are not the partisans of any one in particular.
41. Formerly the fight of Viṣṇu with the excellent Daityas Madhu and Kaiṭabha in the ocean of dissolution was due to the prior request of Brahmā.
42. For the sake of Prahlāda, at the request of gods, Hiraṇyakaśipu was slain by him acting in the interest of his devotees.
43. Formerly I fought with the Tripuras and reduced them to ashes, only at the request of the gods. It is well known.
44. Formerly Pārvatī, the Mother of all, the goddess of all, fought with Śumbha and others and killed them only at the request of the gods.
45. Even today, the gods have sought refuge in Brahmā. And he along with the gods and the lord Viṣṇu has sought refuge in me.
46. O Emissary, paying heed to the request of Viṣṇu, Brahmā and others, I, though lord of all, have come here in the battle of the gods.
47. Really you are the foremost of the comrades of Kṛṣṇa, the great soul. Those Daityas who had been formerly killed are not on a par with you.
48. What is there excessively shameful in my fight with you, O king? I the lord have been urged humbly to carry out the task of the gods.
49. Go to Śaṅkhacūḍa and tell him what I have said. Let him do what is proper. I shall carry out the taṣk of the gods.
Sanatkumāra said:—
50. On saying this, Śiva the great god, stopped. The emissary stood up and returned to Śaṅkhacñḍa.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 126 / Osho Daily Meditations - 126 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 126. అహం 🍀*
*🕉 మిమ్మల్ని మీరు అంగీకరిస్తే, మీరు అహంభావి అవుతారని మీరు చింతిస్తున్నారా? మొదట ఆ అహం గురించి మరచిపోండి! 🕉*
*మిమ్మల్ని మీరు అంగీకరించండి. అహం గురించి తర్వాత చూద్దాం; మొదట మిమ్మల్ని మీరు పూర్తిగా అంగీకరించండి. అహం రానివ్వండి; అహం అంత పెద్ద సమస్య కాదు, మరియు అది ఎంత పెద్దదైతే, అది సులభంగా పగిలిపోతుంది. ఇది ఒక బెలూన్ లాంటిది-అది పెద్దదిగా మారుతుంది, ఆ తర్వాత కేవలం ఒక దెబ్బతో అది పోతుంది!*
*అహం ఉండనివ్వండి, అది అనుమతించ బడుతుంది, కానీ మిమ్మల్ని మీరు అంగీకరించండి మరియు విషయాలు మారడం ప్రారంభమవుతాయి. నిజానికి సంపూర్ణ అంగీకారం అంటే అహాన్ని కూడా అంగీకరించడం. అంగీకరించడం ద్వారా ప్రారంభించండి. ప్రపంచానికి కొంతమంది గొప్ప అహంభావులు కూడా అవసరం. మాకు అన్ని రకాల వ్యక్తులు కావాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 126 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 126. EGO 🍀*
*🕉 Do you worry that if you accept yourself, you will become egoistic? First forget about the ego! 🕉*
*Accept yourself. We will see about the ego later; first accept yourself totally. Let the ego come; the ego is not such a big problem, and the bigger it is, the easier it is burst. It is like a balloon-it becomes big, then with just a prick it is gone!*
*Let the ego be there, that is allowed, but accept yourself, and things will start changing. In fact total acceptance means acceptance of the ego too. Start by accepting. The world needs a few great egoists too. We need all kinds of People.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*
*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*
*🌻 539. 'శ్రుతిః' - 3 🌻*
*తత్త్వమును యెట్లుండునో తెలియ గోరువారు దానిని గూర్చి తపస్సు చేసి, తపస్సు ద్వారా దాని లోనికి కరిగిపోవుదురు. తిరిగి తాముగ నేర్పడినపుడు దానిని వివరించలేరు. తాము దానియందు కరగిపోయినపు డది యెట్లుండునో తమకునూ తెలియదు. యిట్లుండునని యెవరును వర్ణింపలేరు. అట్టి వేదమును నిర్వచించుట దుర్లభము. అది అనిర్వచనీయము. దానికి నామము లేదు. రూపము లేదు. లింగము లేదు. అనగా చిహ్నము లేదు. అది స్త్రీ కాదు. పురుషుడు కాడు. నపుంసకుడునూ కాడు. సృష్టిలో తెలియబడు ఏ వస్తువుతోనైననూ దానిని పోల్చలేము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*
*svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻*
*🌻 539. 'Shrutih' - 3 🌻*
*Wanting to know what the Tattva is, the devotees do penance for it and dissolve into it through penance. They cannot explain it when they revive themselves again. They don't even know how it is even when they melt into it. No one can describe it as such. It is difficult to define such a Veda. It is indefinable. It has no name. No form. No gender. That is, there is no symbol. It is not a woman. Not a man. It is not a eunuch. It cannot be compared to any known thing in creation.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 24 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 భైరవనాథుడు 🏵*
*వామదేవుడు ఈ కధ చెప్పి "రేణుకాదేవి యొక్క కరుణనీయందు సహజంగా ఉన్నది. ఎందుకంటే పూర్వజన్మలో పరశురాముని పరశువు యొక్క శక్తి నీలోకి ప్రవేశించింది. ఆయా విషయాలు నెమ్మదిగా నీకు తెలుస్తవి. ప్రస్తుతం కర్తవ్య మార్గంలోకి ప్రవేశిద్దాము" అన్నాడు. మరునాడుదయం పల్లెకు దగ్గర ఉన్న పర్వతం మీదకు బయలుదేరాడు. అక్కడ ఒక పెద్ద గుహ ఉన్నది. ఆ గుహలో లోపలిభాగంలో వజ్రభైరవుని విగ్రహం ఉన్నది. దాని ముందు దండకమండలువులు జపమాల ఉన్నవి. ఒక పెద్దపీట దానిపై కూర్మయంత్రం కనిపిస్తున్నవి.*
“ఈ రోజు నుండి ఇది నీ తపస్థానము. కాశీలో నీవు చేసిన పద్ధతి కంటె ఇది కొంచెం భిన్నమైనది. ఈ గుహపురాతనమైనది. ఇక్కడ భైరవ సిద్ధులు తపస్సు చేశారు. శంఖపాలుడు, ఉగ్రసేనుడు అనే యిద్దరు ఇక్కడ తీవ్ర తపస్సు చేసి భైరవానుగ్రహం పొంది ఆయన పరివారంలో ఉన్నారు.. వారు నీకు తోడ్పడుతారు. ఈ గుహముందు భాగంలో ఒక హోమకుండాన్ని నిర్మించి ఆహుతులు వెయ్యాలి. ఇక్కడి వనమూలికలు కూడా కొన్ని ఉపయోగించవచ్చు.*
*ఒక ప్రక్కన పూర్వ జనులు రాజభయంతో చోరభయంతో బందిపోట్ల భయంతో దాచిన ధనమున్నది. వారెవరూ ఇప్పుడు లేరు. వారి వారసులు లేరు. ఆ ధనంలో నుండి బంగారు వెండినాణెములు కొన్ని ఈ కోయవారికిస్తూ ఉండు. నీవు సృష్టించి యిస్తున్నావని అనుకొంటారు. అది మంచిదే. నీ సాధన యెంతకాలం జరగాలో భైరవుడు నిర్ణయిస్తాడు. ఆయనే సాధన చేయిస్తాడు. ఆయనే ఫలితములిస్తాడు. ఇక నేను వెళ్ళి వస్తాను. ఏమి చేయాలో, ఎలా చేయాలో నీవే నిర్ణయించుకోగల శక్తి వస్తుంది. విజయోస్తు ! అని వామదేవుడు బయలుదేరాడు.*
*యువకుడు కన్నీళ్ళతో ఆ మహర్షి పాదములు తడిపాడు. "గురుదేవా! మీ ఆజ్ఞతో మీరు చెప్పినదల్లా చేస్తాను. మీ కృపవల్ల సాధించగలనన్న నమ్మకమున్నది. కానీ మళ్ళీ మిమ్ము చూచి మీ ఆశీస్సులు తీసుకొని కర్తవ్య నిర్వహణకు బయలుదేరుతాను. దానికి మాత్రం మీరు అనుమతించండి" అని ఆర్తితో వేడుకొన్నాడు. మహర్షి అతని ఆవేదనకు చలించి - అలాగే తథాస్తు! అని కదిలి ముందుకు వెళ్ళిపోయినాడు.*
*నిరంతర హోమము, భైరవార్చన- ఒక సంవత్సరం గడిచింది. అంతరిక్షంలో వెళుతున్న దేవతలను విద్యాధర గంధర్వాదులను చూచేశక్తి వచ్చింది. రెండవ సంవత్సరం గడిచింది. రాత్రివేళ స్థూలశరీరంలో నుండి బయటకు వచ్చి సూక్ష్మ శరీరముతో ఆకాశయానము చేసి ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తి వచ్చింది. కానీ ఎక్కడకూ వెళ్ళాలన్న కోరిక లేదు. వజ్రభైరవుని మూర్తి కంటి ముందు అప్పుడప్పుడు కనిపిస్తున్నది. మూడవ సంవత్సరం పూర్తి అయింది. రాత్రివేళ వజ్రభైరవుని ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. ఒక లోకోత్తర సౌందర్యవతి కంటి ముందు సాక్షాత్కరించింది.*
*"తపస్వీ! నేను ఇచటి రేణుకాదేవి ఆలయానికి ఆ మాతను సేవించటానికి వచ్చిన ఒక గంధర్వకాంతను. నీ తపస్సు, నీ దీక్ష చూచి సంతోషించాను. నీవు ఏ శక్తుల కోసం ఈ యజ్ఞం, పూజ, జపము, ధ్యానము చేస్తున్నావో ఆ శక్తులన్నీ నాదగ్గర ఉన్నవి. వాటికి నీకు నేను ఇస్తాను. నాతో క్రీడించు. దివ్యఫలములు, సిద్ధశక్తులు రెండూ పొందగలవు" అని ప్రేమతో ఆహ్వానించింది. నాగభైరవుడు ఆమెను ఆశ్చర్యంతో చూచాడు. ఒకసారి విగ్రహరూపుడైన భైరవుని చూచాడు. క్షణంపాటు ఆలోచించి ఇలా అన్నాడు. "గాంధర్వీ ! దివ్యశక్తులు కలిగిన మహనీయ మూర్తులు మీరు. నేను సామాన్యుడను. నేను కామమును జయించలేదు. మోహమును గెలువలేదు. జితేంద్రియుడను కాదు. కాని గురువాక్యబద్ధుడను.*
*ఈ వేదభూమిని కృష్ణ ధామమును కాపాడటానికి ఈ భారతజాతికి వచ్చే ప్రమాదముల నుండి విదేశ విమతోపద్రవముల నుండి, దుష్టమాంత్రికుల ప్రభావం నుండి రక్షించటానికి సిద్ధాశ్రమ యోగులు నన్నొక ఉపకరణంగా ఎన్నుకొని నా చేత ఈ ధర్మరక్షణ యజ్ఞం చేయిస్తున్నారు. ఈ మహావ్రత కంకణధారినై దీక్షాబద్ధుడనై కృషి చేస్తున్నాను. భైరవ సాక్షాత్కారం కోసం ఎదురుచూస్తున్నాను. ఏ కారణం వల్లనో మీకు నా యందు ప్రేమకలిగింది. నేను ఎంతో అదృష్టవంతుడను. మీరు దివ్యశక్తులిస్తామన్నారు. మీ కరుణకది నిదర్శనం. కాని నేను భైరవుని నుండి వరములు పొందాలని గురుదేవుని సంకల్పం. ప్రణయస్వరూపిణి యైన మీరు నాకు భైరవానుగ్రహం త్వరగా కలిగేట్లు అనుగ్రహించండి!" అని నమస్కరించాడు.*
*ఆ గంధర్వకాంత కనులు విప్పార చూసింది. “యువకుడా! నిన్ను చూచి చాలా ఆనందం కలుగుతున్నది. నీ దీక్ష అసామాన్యమైనది. జాతిరక్షణకు, ధర్మస్థాపనకు అంకితమైన నిన్ను ఇంతకు ముందుకంటే ఇష్టపడుతున్నాను. నీ గురుభక్తిని పట్టుదలను మెచ్చుకుంటాను. ఇప్పుడు నీ మార్గానికి అడ్డురాను. అయితే నేను గంధర్వకాంతను. నా యిచ్ఛ వ్యర్థం కాదు. భవిష్యత్తులో వచ్చే ఒక జన్మలో నీవే నా కోసం పరితపిస్తావు. ప్రేమిస్తావు. ప్రార్థిస్తావు. అప్పుడు జన్మయెత్తకుండా నా దివ్యశక్తితో- మానవ శరీరం ధరించి నీతో కాపురం చేస్తాను.*
*( సశేషం )*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకం యొక్క శక్తి 🌹
✍️. ప్రసాద్ భరధ్వాజ
1. ప్రతి రంగంలో గెలుపు
2. ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించడం
3. సమస్త జ్ఞానాన్ని పొందడం
4. అన్ని భయాలను తొలగించడం, వ్యాధుల నివారణ
5. స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ
6. సంతానంగా పుత్రులను పొందడం
7. అమ్మవారిని ప్రత్యక్షంగా చూడడం, శత్రువులపై విజయం సాధించడం
8. జనన మరణాలను నివారించడం
9. యాత్రకు వెళ్లిన వ్యక్తులు తిరిగి రావడానికి, ఎనిమిది రకాల సంపదలను పొందేందుకు
10. దృఢమైన శరీరం, పురుషత్వము పొందడం
11. మంచి సంతానం, జీవితానికి అర్థాన్ని పొందడం
12. శివుని పొందుటకు,
13. మూగవాడిని మాట్లాడేలా చేయడం
14. ప్రేమ విషయాలలో విజయం
15. కరువు, దోపిడీ మరియు అంటువ్యాధిని నివారించడం
16. పద్యాలు వ్రాయగల సామర్థ్యం మరియు పండితుడు అయ్యే సామర్థ్యం
17. వేదాలలో పాండిత్యం, పదాలపై పట్టు, శాస్త్ర పరిజ్ఞానం
18. ప్రేమలో విజయం
19. ప్రేమలో విజయం
20. అన్ని విషాలను నయం చేయడం మరియు అన్ని జ్వరాలను నయం చేయడం
21. ప్రతి ఒక్కరినీ ఆకర్షించడం, అందరినీ సంతోషపెట్టడం
22. అన్ని అధికారాలను పొందడం,
23. సమస్త సంపదలను పొందడం
24. భూతాలు, ప్రేతాలు మరియు పిశాచాల భయం నిర్వహణ
25. ఉన్నత పదవులు మరియు అధికారాన్ని పొందడం
26. శత్రువుల నాశనము
27. స్వీయ మరియు అంతిమ సత్యాన్ని గ్రహించడం
28. విష భయం, అకాల మరణం
29. అబార్షన్లను నివారించడం, చెడు వ్యక్తులను మచ్చిక చేసుకోవడం
30. మరొక శరీరంలోకి ప్రవేశించడం
31. ప్రతిదానికీ ఆకర్షణ,
32. దీర్ఘాయువు, ప్రతిదానిని ఆకర్షించడం
33. అన్ని ప్రయోజనాలు
34. పరస్పర ఇష్టం అభివృద్ధి
35. క్షయవ్యాధిని నయం చేయడం
36. అన్ని వ్యాధులను నయం చేయడం
37. భూత, ప్రేత పిశాచ మరియు బ్రహ్మ రాక్షసాలను తొలగించడం
38. బాల్యంలో అనారోగ్యం నయం
39. మనం ఏమనుకుంటున్నామో కలలో చూడడానికి
40. లక్ష్మి నుండి దీవెనలు, మంచి కలలు కనడం, చెడు కలలు చూడకపోవడం
41. అమ్మవారి ప్రత్యక్ష దర్శనం, లైంగిక వ్యాధులు నయం
42. సమస్తమును ఆకర్షింపజేయుట, నీటి వలన రోగములను నయం చేయుట
43. అందరిపై విజయం
44. అన్ని వ్యాధులను నయం చేయడం
45. సంపద దేవత యొక్క ఆశీర్వాదం, మీ మాట వాస్తవం అవుతుంది
46. కొడుకుతో ఆశీర్వాదం పొందడం
47. అన్ని ప్రయత్నాలలో విజయం
48. తొమ్మిది గ్రహాల వల్ల ఏర్పడే సమస్యల తొలగింపు
49. ప్రతిదానిలో విజయం, సంపదలను గుర్తించడం
50. దూరం చూడటం, చిన్న పాక్స్ నయం
51. ప్రజలందరినీ ఆకర్షించడం
52. ప్రేమలో విజయం, చెవులు మరియు కంటి వ్యాధులను నయం చేయడం
53. సమస్త ప్రపంచాన్ని ఆకర్షించడం, దేవతను ప్రత్యక్షంగా చూడటం
54. సర్వపాపనాశనము., నేత్రవ్యాధుల నివారణ
55. రక్షించే శక్తి, మూత్రపిండాల వ్యాధులను నయం చేయడం
56. కారాగారం నుండి విముక్తి పొందడానికి, కంటి వ్యాధులను నయం చేయడం
57. సంపూర్ణ అదృష్టం
58. అన్ని వ్యాధుల నుండి నివారణ, ప్రేమలో విజయం
59. ప్రతి ఒక్కరినీ ఆకర్షించడం
60. మూగవారికి వాక్ శక్తిని ఇవ్వడం, మీ అంచనాలను నిజం చేయడం
61. మనస్సుపై విజయం, సంపద పొందడం
62. మంచి నిద్ర
63. అందరినీ మంత్రముగ్ధులను చేయడం
64. సమస్త జ్ఞానాన్ని పొందడం
65. విజయం, పదాలపై నియంత్రణ
66. మధురమైన మాటలు, సంగీతంలో పాండిత్యం
67. దేవత యొక్క వ్యక్తిగా కనిపించడం
68. రాజును ఆకర్షించడం
69. సంగీతం మీద పాండిత్యం
70. శివుడు చేసిన తప్పులకు పరిహారం
71. సంపద పొందడం
72. అంధకార భయాన్ని జయించడం, అమ్మవారి అనుగ్రహం పొందడం, యక్షిణికి దాసుడు చేయడం
73. పాల ఉత్పత్తి, విముక్తి
74. మంచి కీర్తి
75. పద్యాలు వ్రాయగల సామర్థ్యం
76. పూర్తి పరిత్యాగం, ప్రేమలో విజయం
77. సూక్ష్మ దృష్టిని పొందడం, ప్రతి ఒక్కరినీ ఆకర్షించడం
78. సమస్త విశ్వాన్ని ఆకర్షించడం
79. మాంత్రిక సామర్థ్యాన్ని పొందడం, ఇతరులందరినీ మంత్రముగ్ధులను చేయడం
80. విశేషమైన అందాన్ని పొందడం, ఇంద్రజాలంలో నిపుణుడు అవ్వడం
81. అగ్నిని ఆపడం
82. వరదను ఆపడం, ఇంద్రుడు వంటి అధికారాలను పొందడం
83. సైన్యాన్ని ఆపడం
84. విముక్తి పొందడం, మరొక శరీరంలోకి ప్రవేశించడం
85. దయ్యాల భయాన్ని తొలగించడం
86. దయ్యాల భయాన్ని తొలగించడం, శత్రువులపై విజయం
87. పాములను ఆకర్షించడం
88. క్రూరమృగాలు పాటించేలా చేయడం
89. అన్ని రోగాల నుండి విముక్తి పొందడం
90. చెడ్డ మంత్రాలను కత్తిరించడం
91. భూమి పొందడం, సంపదలు పొందడం
92. పాలించే సామర్థ్యాన్ని పొందడం
93. కోరికల నెరవేర్పు
94. అన్ని కోరికలను పొందడం
95. అన్ని కోరికలను పొందడం
96. జ్ఞానం మరియు సంపద సాధించడం
97. ఆత్మ యొక్క విముక్తి
98. మాటలపై పట్టు
99. పరమానందాన్ని పొందడం
100. సకల క్షుద్ర శక్తి ప్రాప్తి
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. POWER OF EACH SOUNDARYA LAHARI SHLOKA 🌹*
*Prasad Bharadwaj*
1. Winning in every field
2. Attracting all the world
3. Attainment of all knowledge
4. Removal of all fears, Curing of diseases
5. Mutual attraction between male and female
6. Getting sons as progeny
7. Seeing the Goddess in person, Winning over enemies
8. Avoiding of birth and death
9. For return of people who have gone on journey, For getting eight types of wealth
10. Getting a strong body, virility
11. Good progeny, Getting a meaning for life
12. To attain Lord Shiva,
13. To make a dumb man speak
14. Victory in the matters of love
15. Avoiding famine, dacoity and epidemic
16. Ability to write poems and ability to become scholar
17. Mastery of Vedas, mastery over words, Knowledge of science
18. Victory in love
19. Victory in love
20. Curing of all poisons and curing of all fevers
21. Attracting every one, Making everyone happy
22. Getting of all powers,
23. Getting of all riches
24. Management of fear of Bhoothas, Prethas and Pishachas
25. Getting higher posts and power
26. Destruction of enemies
27. Realization of self and ultimate truth
28. Fear of poison, Untimely death
29. Avoiding of abortions, Taming bad people
30. Entering to another body
31. Attraction of everything,
32. Long life, Attracting of everything
33. All benefits
34. Development of mutual liking
35. Curing of Tuberculosis
36. Curing of all diseases
37. Removal of Bhootha , Pretha Pisacha and Brahma Rakshasa
38. Curing of sickness during childhood
39. To see in the dream what we think about
40. Blessings from Lakshmi, realization of good dreams, Not seeing bad dreams
41. Seeing of the Goddess in person, curing of sexual diseases
42. Attracting everything, Curing diseases caused by water
43. Victory over all
44. Curing of all diseases
45. Blessing of Goddess of wealth, Your word becoming a fact
46. Getting blessed with a son
47. Victory in all efforts
48. Removal of problems created by nine planets
49. Victory in everything, Locating of treasures
50. Seeing afar, Curing of small pox
51. Attracting all people
52. Victory in love, Curing of diseases of ears and eye
53. Attracting all the world, Seeing the Goddess in person
54. Destruction of all sins., Curing of eye diseases
55. Power to protect, Curing of diseases of kidney
56. To get freed from imprisonment, Curing of eye diseases
57. All round luck
58. Cure from all diseases, Victory in love
59. Attracting every one
60. Giving power of speech to dumb, Making your predictions come true
61. Victory over mind, Getting of wealth
62. Good sleep
63. Bewitching all
64. Getting of all knowledge
65. Victory, Control over words
66. Sweet words, Mastery in music
67. Appearance in person of the Goddess
68. Attracting the king
69. Mastery over music
70. Compensation for mistakes done to God Shiva
71. Getting of wealth
72. Conquering fear of darkness, Getting grace from Goddess, Making slave of Yakshini
73. Production of milk, Redemption
74. Good fame
75. Capacity to write poems
76. Complete renunciation, Victory in love
77. Gaining Micro sight, Attracting every one
78. Attracting all the universe
79. Getting magical capability, Bewitching all others
80. Getting remarkable beauty, Becoming expert in magic
81. Stopping fire
82. Stopping flood, Getting powers like Indhra
83. Stopping of the army
84. Getting redemption, Entering into another body
85. Removing fear of ghosts
86. Removing fear of ghosts, Victory over enemies
87. Attracting of serpents
88. Making wild beasts obey
89. Getting rid of all diseases
90. Cutting of bad spells cast
91. Getting of land, Getting riches
92. Getting ability to rule
93. Fulfillment of desires
94. Getting all desires
95. Getting of all desires
96. Attainment of knowledge and wealth
97. Redemption of the soul
98. Mastery over words
99. Attainment of ultimate bliss
100. Attainment of all occult power
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj