శ్రీ లలితా సహస్ర నామములు - 33 / Sri Lalita Sahasranamavali - Meaning - 33

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 33 / Sri Lalita Sahasranamavali - Meaning - 33 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 33. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా ।
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా ॥ 33 ॥ 🍀

🍀 82. కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర సైనికా -
ప్రయోగముతో నిశ్శేషంగా దహింపబడిన భండాసురునితో కూడిన శూన్యకా నగరము గలది.

🍀 83. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా -
బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 33 🌹

📚. Prasad Bharadwaj

🌻 33. kāmeśvarāstra-nirdagdha-sabhaṇḍāsura-śūnyakā |
brahmopendra-mahendrādi-deva-saṁstuta-vaibhavā || 33 || 🌻

🌻 82 ) Kameshwarasthra nirdhagdha sabandasura sunyaka -
She who destroyed Bandasura and his city called sunyaka by the Kameshwara arrow.

🌻83 ) Brhmopendra mahendradhi deva samsthutha vaibhava -
She who is prayed by Lord Brahma , Vishnu, indra and other devas

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

22 Feb 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 177

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 177 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - మహాభినిష్క్రమణము లేక సద్గురు నిర్యాణము - 1 🌻

673. సద్గురువు భగవంతునిగా దేహమును చాలించుట నాల్గవ దివ్యయాణమునకు సంబంధించి యుండును.

674. సద్గురువు దేహము చాలించిన తరువాత కూడా అతని ఎరుక గలిగిన అనంత ,అఖండ వ్యక్తిత్వం అనుభవమైన "అహం బ్రహ్మాస్మి" స్థితి శాశ్వతముగా పరమాత్మ (B)స్థితిలో నిలిచియుండును.

అవతార పురుషుడు

675. సద్గురువు దేహము చాలించిన తరువాత మరల జన్మించడు. కానీ ఒక్క అవతార పురుషుడు మరల మరల జన్మించుచుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

22 Feb 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 238

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 238 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 2 🌻

7. మనసు నిర్వికారంగా చేసుకోవాలంటే ప్రకృతి, పురుషులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఒక దీపంతో అనేక దీపాలను ముట్టించుకోవచ్చును. ఆప్రకారంగానే ప్రకృతి బహురూపగుణాలతో ఉంటుంది, పెరుగుతుంది. ఒకదానితో ఒకటి తగిలి పెరుగుతుంది.

8. గుణములు మూడింటిలో సంతోషము, ఆనందము, ఆరోగ్యము, అక్రొధము, అర్జవము, అంటే ఋజుమార్గము; శుద్ధి, ప్రకాశత్వము, సుస్థిరత్వము, అహింస, నిర్మల శ్రద్ధ, వినీతి, లజ్జ, అంటే వినయము; సత్యము, శౌచము, సమత, ఆచారము, అకార్పణ్యము, అంటే కృపణత్వము లేకుండా, పైశునత్వము(లోభత్వము) లేకుండా ఉండటము; అకామవృత్తి(తీవ్రమైన కోరిక లేకుండటము), ఇవన్నీకూడా సత్వగుణముంలు అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు.

9. విగ్రహము, దర్పము, తిరస్కార, అభిమానములు(అంటే మరొకరిని తిరస్కరించి యుద్ధం చెయ్యటము), కామక్రోధములు, మాత్సర్యము, కరుణ లేకపోవటము, భోగకాంక్ష, అహంకారము – ఇవన్నీ కూడా రజోగుణలక్షణములు.

10. అప్రకాశము (చీకటి, కాంతి లేకపోవటము), బహుతరాశనము (అతిగా భోజనము చేయటము), మోహము, వాదము, ప్రమాదము, పెద్దలోస్తే లేవకుండా మత్తుగా ఒకచోట కూర్చుని ఉండటము, మూర్ఖత్వము, మందబుద్ధి, మరణమంటే భయము, దుఃఖము మొదలైనివి తమోగుణలక్షణాలు.

11. పురుషుడు లోపలి చేతనుడు, ప్రకృతి జడమైనటువంటిది. ఆత్ముడు తనను తాను తెలుసుకుంటే, వ్యక్తమైన(తనను పరివేష్టించిన) ప్రకృతితో తాదాత్మ్యం చెందడు. ప్రకృతిని సమీక్షించక, ‘అజర శాశ్వత నిరంజన విమలాచ్యుత పదము’న నిజప్రకాశ స్థిరుడై అక్షరుడవుతాడు. అంటే మోక్ష పదవిని పొందుతాడు. ప్రకృతివశంకాడు. ఆత్ముడు తనను తాను తెలుసుకుంటే, పురుషుడు ప్రకృతి యందు, ప్రకృతి పురుషుని యందు నిలుస్తారు.

12. పురుషుడు నీటిలో చేపవలె, ఉదుంబరమశకములు సంగమించిన రీతిగా వికృతి చెందడు. (మేడిపండుపైన దోమ వాలినప్పుడు ఒకటిగా కనబడినా, ఆ రెండూ వేరే అయినట్లు, శరీరానికీ – ఆత్మకూ భిన్నత్వం ఉంది అని అర్థం) అంతరాత్మ ప్రకృతిని పొందినా – నీటిలో కమలము ఉండికూడా నీరు అంటనట్లుగా – వికారము పొందదు.

13. మనసు ఇంద్రియాలతో ఉండి వికారం చెందుతుంది. మనసుననుసరించి ముద్ధి వికారము చెందుతుంది. పాపపుణ్యాలలో ప్రవర్తిస్తోంది. ఈ ప్రకృతిననుసరించి చిత్తము సంక్షుభితమవుతోంది. అంతరాత్మ ఈ ప్రకృతిలో ఉండికూడా, మాలిన్యం లేకుండా విమలంగా ఉంది.

14. మనోబుద్ధి చిత్తహంకారాలు మాత్రం ఈ ప్రకారంగా మాలిన్యం పొందుతుంటే, ఆత్మ వస్తువుకు మరి ఈ ప్రకృతిలో ఉండికూడా విమలత్వం ఎలా వచ్చింది? దాని స్వభావం ఏమిటి? ఇలాంటి విచారణ వల్ల జీవుడికి ఆత్మజ్ఞానము కలుగుతుంది.

15. అహంకారమేమో పునర్జన్మహేతువవుతోంది. దీనిలో పాపపుణ్యాలు ప్రవేశిస్తున్నాయి, లోభమోహాలవుతున్నాయి. కానీ ఎటువంటి పరిస్థితిలోనూ కూడా ప్రకృతివల్ల ఏ దోషం సంక్రమించకుండా ఉండే ఆత్మవస్తువు ఒకటుందే, దాని స్వభావమేది అనే విచారణ మోక్షమార్గం.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

22 Feb 2021

శ్రీ శివ మహా పురాణము - 354

🌹 . శ్రీ శివ మహా పురాణము - 354 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

91. అధ్యాయము - 03

🌻. దేవీస్తుతి - 2 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ పర్వతరాజు విష్ణువు మొదలుగా గల ఆ దేవతల మాటలను విని, ప్రసన్నమగు మనస్సు గలవాడై అదరముతో అటులనే అగు గాక! అని పలికెను(23) అపుడు వారు మిక్కిలి అదరముతో ఆ విధివిధానము నంతయు హిమవంతునకు భోదించి తాయుమ శంకరపత్నియగు ఉమాదేవిని శరణము జొచ్చిరి(24). వారు మంచి స్థలములో నిలబడి మనస్సులో ఆ జగన్మాతను స్మరించి, అనేక పర్యాయములు ప్రణమిల్లి శ్రద్ధతో స్తుతించిరి(25)

దేవతలిట్లు పలికిరి-

ఓ ఉమాదేవీ! జగన్మాతా! దుర్గా! మహేశ్వరి! సదాశివునకు ప్రియురాలనవై శివలోకము నందు నివసించు నీకు నమస్కారము (26). పవిత్రము చేయునది. శాంతిస్వరూపురాలు, పుష్టిని కలిగించునది, మహత్తు, ప్రకృతి స్వరూపముగా గలది అగు శ్రీ శక్తిని మేము భక్తితో నమస్కరించుచున్నాము (27) మంగళ స్వరూపురాలు, మంగళము నిచ్చునామె, శుద్ధ, స్థూలరూపిణి(కార్య రూపిణ) సూక్ష్మ (కారణ) రూపిణీ, సర్వశ్రేష్ఠ లక్ష్యము, అంతర్ముఖత్వముచే మరియు అధ్యాత్మ విద్యచే మిక్కలి ప్రీతిని పొందునది అగు నిన్ను నమస్కరించు చున్నాము(28). శ్రద్ధ నీవే, ధైర్యము నీవే, సర్వ ప్రాణములలోని శోభ నీవే. సూర్యుని యందలి ప్రకాశమునీవే. నీ స్వరూపమగు ప్రపంచమును నీవే ప్రకాశింప జేయుచున్నావు (29)

ఏదేవి బ్రహ్మాండమే దేహముగా కలిగియున్నదో, బ్రహ్మాండములోని ప్రాణులన్నింటిలో చలన శక్తిరూపములో నున్నదో, బ్రహ్మగారి నుండి తృణము వలరకు గల సర్వప్రాణులను సంతృప్తి పరచు చున్నదో అట్టి ఆ ఉమాదేవిని నమస్కరించు చున్నాము(30) వేదమాత యగు గాయత్రివి నీవే. సవితృమండలాదధిష్టాన దేవతవు నీవే. సరస్వతివి నీవే. సర్వ ప్రాణులలోని తెలిసే సామర్థ్యము నీవే. ధర్మమూలమగు వేదము నీవే (31).

సర్వ ప్రాణుల యందలి నిద్ర, ఆకలి, మరియు తృప్తి నీవే . ప్రాణుల యందలి తృష్ట, కాంతి, సౌందర్యము మరియు తుష్టి నీవే. నీవు సదా సర్వులకు ఆనందము నిచ్చెదవు (32). పుణ్యాత్ములకు లభించు లక్ష్మివి నీవే. పాపులకు నిశ్చితముగా సంప్రాప్తమయ్యే దారిద్ర్యము నీవే. సర్వప్రాణులలోని శాంతివి నీవే. సర్వ ప్రాణులను పోషించు తల్లివి నీవే (33).

పంచభూతములలోని సారతత్త్వము నీ స్వరూపమే. నీతి శాస్త్రజ్ఞుల, మరియు నీతి మంతుల నీతి నీవే. నిశ్చయాత్మకమగు బుద్ధి నీ స్వరూపమే (34). సామవేదమునందలి గీతి నీవే. యజుర్వేదములోని ఆహుతి నీవే. మరియు బుగ్వేదము యొక్క మాత్ర నీవే. అథర్వణ వేదము యొక్క పరమతాతత్పర్యము నీవే (35). సమస్త దేవతా బృందముల శక్తి నీవే. లోకములకు తల్లి వగు నీ యందు తమోగుణము ఒకానొక రూపములో కనబుడును. రజోగుణ స్వరూపిణి వగు నీ నుండియే ఈ ప్రపంచము పుట్టినది. మాకు మంగళములనిచ్చు నిన్ను ఇచట మేము వేద వాక్కులచే స్తుతించుచున్నాము (36).

సంసార సముద్రములో పుట్టుట యనే భయంకరమగు దుఃఖమును దాటించే పడవ నీవే. అజ్ఞానావరణ నీకు లేదు. ఎనిమిది అంగములోత గూడిన యాగమును పాలించుట అను క్రీడలో సమర్థురాలు, వింధ్య పర్వత నివాసముచే ప్రీతిని పొందునది అగు ఆ దేవిని నమస్కరించుచున్నాము (37) ప్రాణులలో ముక్కు, కన్ను మొదలగు జ్ఞానేంద్రియముల యందు, నోరు, భుజములు మొదలగు కర్మేంద్రియముల యందు మరియు మనస్సునందు ఓ జోరూపముగా నుండి, మరియు ప్రాణుల హృదయ పుండరీకమునందు నివసించి వారికి సదా నీవు సుఖమును కలిగించుచున్నాము. జగదేక సుందరివగు నీవు మా యందు నిద్రా రూపమున ఉన్నావు. అజ్ఞాన రూపములో నున్నావు. అట్టి నీవు ఈ జగుత్తు యొక్క ఉనికిని రక్షించి మమ్ములను పాలించుము(38)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలందురు మహేశ్వరి, జగన్మాత, సతీ దేహధారిణి అగు ఉమాదేవిని ఈ విధముగా స్తుతించి, మిక్కిలి ప్రీతితో నిండిన మనస్సు గలవారై ఆమెను దర్శించు కోరికతో అచటనే వేచి యుండిరి(39) .

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్రసంహితయందు యగు పార్వతీ ఖండలో దేవీస్తుతి అనే మూడవ అధ్యాయము ముగిసినది(3).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

22 Feb 2021

గీతోపనిషత్తు -155

🌹. గీతోపనిషత్తు -155 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 5

🍀 5 - 3. ఆత్మోద్ధరణ - దేహము తన వాహనమే కాని తాను కాదు. తాను ప్రజ్ఞ, శరీరము తన వాహనము. వాహనమును, తనను అనుసంధానము చేయు ప్రజ్ఞ చిత్తము. ఈ చిత్తము బుద్ధి నుండి దిగివచ్చినది. బుద్ధి దైవమునుండి దిగివచ్చినది. జీవుడు కూడ దైవమునుండి దిగి వచ్చినాడు. చిత్తము దేహమునకు లోనైనపుడు, తాను దైవ స్వరూపుడనని, జీవుడు శాశ్వతుడని, బుద్ధియను వెలుగు తన సహజమగు గుణమని మానవుడు మరచును. ఇట్టి మరపునకు కారణము బాహ్యమందలి విషయములకు చిత్తము నిష్కారణముగ ఆకర్షింపబడుటయే. ఇట్లాకర్షింప బడినపుడు చిత్తము ప్రవృత్తి మార్గమునందే యుండునుగాని, నివృత్తి మార్గమున ప్రవేశింపదు. యోగవిద్య నుపాసించువారు మొట్టమొదట చిత్తముయొక్క ప్రవృత్తులను నిరోధించవలెనని యోగశాస్త్రము తెలుపుచున్నది. చిత్తము ప్రవృత్తులకు బానిస అయినచో జీవు డధోగతి చెందును. చిత్తము ప్రవృత్తితో దైనందినముగ వ్యవహరించు చున్నప్పటి కిని, నివృత్తి మార్గమున బుద్ధితోను, జీవాత్మతోను, పరమాత్మతోను అనుసంధానము చెందుట ఊర్ధ్వగతి యగును. 🍀

ఉద్ద రేదాత్మనం 2 త్మానాం నాత్మాన మవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః || 5

పంచేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచభూతములతో కూడిన శరీరము బహిఃకరణ మందురు. బహిఃకరణము ప్రపంచముతో ప్రతిస్పందించుటకు ఒక వాహిక. అంతఃకరణమున నున్న మానవుడు బహిఃకరణమగు దేహమును వాహనముగ గొని, పంచభూతాత్మకమైన ప్రపంచమున తిరుగాడుచుండును. వాహనమెక్కి తిరుగుట యనగా, సంకేతార్థ మిదియే. దేవతలందరును వాహనమెక్కియే తిరుగుదురు. నరుడు కూడ దేహమను వాహనమెక్కియే తిరుగుచున్నాడు. ఇది తెలియుట ముఖ్యము.

దేహము తన వాహనమే కాని తాను కాదు. తాను ప్రజ్ఞ, శరీరము తన వాహనము. వాహనమును, తనను అనుసంధానము చేయు ప్రజ్ఞ చిత్తము. ఈ చిత్తము బుద్ధి నుండి దిగివచ్చినది. బుద్ధి దైవమునుండి దిగివచ్చినది. జీవుడు కూడ దైవమునుండి దిగి వచ్చినాడు. చిత్తము దేహమునకు లోనైనపుడు, తాను దైవ స్వరూపుడనని, జీవుడు శాశ్వతుడని, బుద్ధియను వెలుగు తన సహజమగు గుణమని మానవుడు మరచును. ఇట్టి మరపునకు కారణము బాహ్యమందలి విషయములకు చిత్తము నిష్కారణముగ ఆకర్షింపబడుటయే. ఇట్లాకర్షింపబడినపుడు చిత్తము ప్రవృత్తి మార్గమునందే యుండునుగాని, నివృత్తి మార్గమున ప్రవేశింపదు.

యోగవిద్య నుపాసించువారు మొట్టమొదట చిత్తముయొక్క ప్రవృత్తులను నిరోధించవలెనని యోగశాస్త్రము తెలుపుచున్నది. చిత్తము ప్రవృత్తులకు బానిస అయినచో జీవు డధోగతి చెందును. అనగా ప్రపంచమున బంధింపబడును. అన్నిటికన్న మిన్నగ దేహమే బంధించును. అపుడు దేహమే తానను భావముతో జీవించును. ఇదియొక వికృత స్థితి. రౌతు గుఱ్ఱముతో చేరి, గుఱ్ఱముచే బంధింపబడి, గుఱ్ఱమునకు బానిస అయినచో అది వికారమే. గుఱ్ఱము నధిరోహించి తన పనులను చక్క పెట్టుకొనుట మాని, గుఱ్ఱమునకు సేవకు డగుట పతనమే కదా! రాజు సేవకుడగుట, సేవకుడు రాజగుట సామాన్య నరుని స్థితి. ఈ కారణముగనే గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు, తనకు తానే అధోగతి చెందుటను గూర్చి బోధించినాడు.

చిత్తము ప్రవృత్తులకు లోబడి ఉన్నంతకాలము జీవుడు దేహబద్దుడై యుండును. ప్రవృత్తి వర్జనీయము కాదుగాని, జీవితమున ప్రవృత్తియే సమస్తము కారాదు. ప్రవృత్తితో నుండుట అనుభవమును, ఆనందమును యిచ్చును. కాని ప్రవృత్తిలో నుండుట బంధము. ఈ బంధము దుఃఖ హేతువు. సంసార హేతువు. ఇది జరుగకూడదు సుమా! అని దైవము హెచ్చరించు చున్నాడు.

చిత్తము ప్రవృత్తితో దైనందినముగ వ్యవహరించు చున్నప్పటి కిని, నివృత్తి మార్గమున బుద్ధితోను, జీవాత్మతోను, పరమాత్మతోను అనుసంధానము చెందుట ఊర్ధ్వగతి యగును. చిత్తము తానే. కనుక తాను తనను అధోగతికి చేర్చవచ్చును. తనను తాను ఊర్ధ్వ గతికిని చేర్చవచ్చును. అంతఃకరణ మార్గము ఊర్ధ్వగతి నిచ్చును. బహిర్గత మార్గమున యిమిడిపోయినచో అధోగతి కలుగును. తన్ను తాను మరచి, ప్రపంచమే సర్వస్వమని జీవించువాడు తనకు తానే శత్రువగు చున్నాడు.

అంతఃకరణ మార్గమున తన సమగ్ర రూపమును తెలిసి దేహమును వాహనముగ నిర్వర్తించుకొనువాడు తనకు తానే మిత్రుడు, తనకు తానే బంధువు. ఈ శ్లోకము పరమ పవిత్రమగు నొక సత్యము నావిష్కరించును. దీనిని బుద్ధిమంతుడు శ్రద్ధతో చదువుకొనవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

22 Feb 2021

22-FEB-2021 EVENING

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 155🌹  
11) 🌹. శివ మహా పురాణము - 353🌹 
12) 🌹 Light On The Path - 106🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 238🌹 
14) 🌹 Seeds Of Consciousness - 302🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 177 🌹
16) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 004 🌹*
AUDIO - VIDEO
17) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 33 / Lalitha Sahasra Namavali - 33🌹 
18) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 33 / Sri Vishnu Sahasranama - 33 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -155 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 5

*🍀 5 - 3. ఆత్మోద్ధరణ - దేహము తన వాహనమే కాని తాను కాదు. తాను ప్రజ్ఞ, శరీరము తన వాహనము. వాహనమును, తనను అనుసంధానము చేయు ప్రజ్ఞ చిత్తము. ఈ చిత్తము బుద్ధి నుండి దిగివచ్చినది. బుద్ధి దైవమునుండి దిగివచ్చినది. జీవుడు కూడ దైవమునుండి దిగి వచ్చినాడు. చిత్తము దేహమునకు లోనైనపుడు, తాను దైవ స్వరూపుడనని, జీవుడు శాశ్వతుడని, బుద్ధియను వెలుగు తన సహజమగు గుణమని మానవుడు మరచును. ఇట్టి మరపునకు కారణము బాహ్యమందలి విషయములకు చిత్తము నిష్కారణముగ ఆకర్షింపబడుటయే. ఇట్లాకర్షింప బడినపుడు చిత్తము ప్రవృత్తి మార్గమునందే యుండునుగాని, నివృత్తి మార్గమున ప్రవేశింపదు. యోగవిద్య నుపాసించువారు మొట్టమొదట చిత్తముయొక్క ప్రవృత్తులను నిరోధించవలెనని యోగశాస్త్రము తెలుపుచున్నది. చిత్తము ప్రవృత్తులకు బానిస అయినచో జీవు డధోగతి చెందును. చిత్తము ప్రవృత్తితో దైనందినముగ వ్యవహరించు చున్నప్పటి కిని, నివృత్తి మార్గమున బుద్ధితోను, జీవాత్మతోను, పరమాత్మతోను అనుసంధానము చెందుట ఊర్ధ్వగతి యగును. 🍀*

ఉద్ద రేదాత్మనం 2 త్మానాం నాత్మాన మవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః || 5

పంచేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచభూతములతో కూడిన శరీరము బహిఃకరణ మందురు. బహిఃకరణము ప్రపంచముతో ప్రతిస్పందించుటకు ఒక వాహిక. అంతఃకరణమున నున్న మానవుడు బహిఃకరణమగు దేహమును వాహనముగ గొని, పంచభూతాత్మకమైన ప్రపంచమున తిరుగాడుచుండును. వాహనమెక్కి తిరుగుట యనగా, సంకేతార్థ మిదియే. దేవతలందరును వాహనమెక్కియే తిరుగుదురు. నరుడు కూడ దేహమను వాహనమెక్కియే తిరుగుచున్నాడు. ఇది తెలియుట ముఖ్యము.

దేహము తన వాహనమే కాని తాను కాదు. తాను ప్రజ్ఞ, శరీరము తన వాహనము. వాహనమును, తనను అనుసంధానము చేయు ప్రజ్ఞ చిత్తము. ఈ చిత్తము బుద్ధి నుండి దిగివచ్చినది. బుద్ధి దైవమునుండి దిగివచ్చినది. జీవుడు కూడ దైవమునుండి దిగి వచ్చినాడు. చిత్తము దేహమునకు లోనైనపుడు, తాను దైవ స్వరూపుడనని, జీవుడు శాశ్వతుడని, బుద్ధియను వెలుగు తన సహజమగు గుణమని మానవుడు మరచును. ఇట్టి మరపునకు కారణము బాహ్యమందలి విషయములకు చిత్తము నిష్కారణముగ ఆకర్షింపబడుటయే. ఇట్లాకర్షింపబడినపుడు చిత్తము ప్రవృత్తి మార్గమునందే యుండునుగాని, నివృత్తి మార్గమున ప్రవేశింపదు. 

యోగవిద్య నుపాసించువారు మొట్టమొదట చిత్తముయొక్క ప్రవృత్తులను నిరోధించవలెనని యోగశాస్త్రము తెలుపుచున్నది. చిత్తము ప్రవృత్తులకు బానిస అయినచో జీవు డధోగతి చెందును. అనగా ప్రపంచమున బంధింపబడును. అన్నిటికన్న మిన్నగ దేహమే బంధించును. అపుడు దేహమే తానను భావముతో జీవించును. ఇదియొక వికృత స్థితి. రౌతు గుఱ్ఱముతో చేరి, గుఱ్ఱముచే బంధింపబడి, గుఱ్ఱమునకు బానిస అయినచో అది వికారమే. గుఱ్ఱము నధిరోహించి తన పనులను చక్క పెట్టుకొనుట మాని, గుఱ్ఱమునకు సేవకు డగుట పతనమే కదా! రాజు సేవకుడగుట, సేవకుడు రాజగుట సామాన్య నరుని స్థితి. ఈ కారణముగనే గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు, తనకు తానే అధోగతి చెందుటను గూర్చి బోధించినాడు.

చిత్తము ప్రవృత్తులకు లోబడి ఉన్నంతకాలము జీవుడు దేహబద్దుడై యుండును. ప్రవృత్తి వర్జనీయము కాదుగాని, జీవితమున ప్రవృత్తియే సమస్తము కారాదు. ప్రవృత్తితో నుండుట అనుభవమును, ఆనందమును యిచ్చును. కాని ప్రవృత్తిలో నుండుట బంధము. ఈ బంధము దుఃఖ హేతువు. సంసార హేతువు. ఇది జరుగకూడదు సుమా! అని దైవము హెచ్చరించు చున్నాడు. 

చిత్తము ప్రవృత్తితో దైనందినముగ వ్యవహరించు చున్నప్పటి కిని, నివృత్తి మార్గమున బుద్ధితోను, జీవాత్మతోను, పరమాత్మతోను అనుసంధానము చెందుట ఊర్ధ్వగతి యగును. చిత్తము తానే. కనుక తాను తనను అధోగతికి చేర్చవచ్చును. తనను తాను ఊర్ధ్వ గతికిని చేర్చవచ్చును. అంతఃకరణ మార్గము ఊర్ధ్వగతి నిచ్చును. బహిర్గత మార్గమున యిమిడిపోయినచో అధోగతి కలుగును. తన్ను తాను మరచి, ప్రపంచమే సర్వస్వమని జీవించువాడు తనకు తానే శత్రువగు చున్నాడు. 

అంతఃకరణ మార్గమున తన సమగ్ర రూపమును తెలిసి దేహమును వాహనముగ నిర్వర్తించుకొనువాడు తనకు తానే మిత్రుడు, తనకు తానే బంధువు. ఈ శ్లోకము పరమ పవిత్రమగు నొక సత్యము నావిష్కరించును. దీనిని బుద్ధిమంతుడు శ్రద్ధతో చదువుకొనవలెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 354 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
91. అధ్యాయము - 03

*🌻. దేవీస్తుతి - 2 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ పర్వతరాజు విష్ణువు మొదలుగా గల ఆ దేవతల మాటలను విని, ప్రసన్నమగు మనస్సు గలవాడై అదరముతో అటులనే అగు గాక! అని పలికెను(23) అపుడు వారు మిక్కిలి అదరముతో ఆ విధివిధానము నంతయు హిమవంతునకు భోదించి తాయుమ శంకరపత్నియగు ఉమాదేవిని శరణము జొచ్చిరి(24). వారు మంచి స్థలములో నిలబడి మనస్సులో ఆ జగన్మాతను స్మరించి, అనేక పర్యాయములు ప్రణమిల్లి శ్రద్ధతో స్తుతించిరి(25) 

దేవతలిట్లు పలికిరి-

ఓ ఉమాదేవీ! జగన్మాతా! దుర్గా! మహేశ్వరి! సదాశివునకు ప్రియురాలనవై శివలోకము నందు నివసించు నీకు నమస్కారము (26). పవిత్రము చేయునది. శాంతిస్వరూపురాలు, పుష్టిని కలిగించునది, మహత్తు, ప్రకృతి స్వరూపముగా గలది అగు శ్రీ శక్తిని మేము భక్తితో నమస్కరించుచున్నాము (27) మంగళ స్వరూపురాలు, మంగళము నిచ్చునామె, శుద్ధ, స్థూలరూపిణి(కార్య రూపిణ) సూక్ష్మ (కారణ) రూపిణీ, సర్వశ్రేష్ఠ లక్ష్యము, అంతర్ముఖత్వముచే మరియు అధ్యాత్మ విద్యచే మిక్కలి ప్రీతిని పొందునది అగు నిన్ను నమస్కరించు చున్నాము(28). శ్రద్ధ నీవే, ధైర్యము నీవే, సర్వ ప్రాణములలోని శోభ నీవే. సూర్యుని యందలి ప్రకాశమునీవే. నీ స్వరూపమగు ప్రపంచమును నీవే ప్రకాశింప జేయుచున్నావు (29)

ఏదేవి బ్రహ్మాండమే దేహముగా కలిగియున్నదో, బ్రహ్మాండములోని ప్రాణులన్నింటిలో చలన శక్తిరూపములో నున్నదో, బ్రహ్మగారి నుండి తృణము వలరకు గల సర్వప్రాణులను సంతృప్తి పరచు చున్నదో అట్టి ఆ ఉమాదేవిని నమస్కరించు చున్నాము(30) వేదమాత యగు గాయత్రివి నీవే. సవితృమండలాదధిష్టాన దేవతవు నీవే. సరస్వతివి నీవే. సర్వ ప్రాణులలోని తెలిసే సామర్థ్యము నీవే. ధర్మమూలమగు వేదము నీవే (31). 

సర్వ ప్రాణుల యందలి నిద్ర, ఆకలి, మరియు తృప్తి నీవే . ప్రాణుల యందలి తృష్ట, కాంతి, సౌందర్యము మరియు తుష్టి నీవే. నీవు సదా సర్వులకు ఆనందము నిచ్చెదవు (32). పుణ్యాత్ములకు లభించు లక్ష్మివి నీవే. పాపులకు నిశ్చితముగా సంప్రాప్తమయ్యే దారిద్ర్యము నీవే. సర్వప్రాణులలోని శాంతివి నీవే. సర్వ ప్రాణులను పోషించు తల్లివి నీవే (33).

పంచభూతములలోని సారతత్త్వము నీ స్వరూపమే. నీతి శాస్త్రజ్ఞుల, మరియు నీతి మంతుల నీతి నీవే. నిశ్చయాత్మకమగు బుద్ధి నీ స్వరూపమే (34). సామవేదమునందలి గీతి నీవే. యజుర్వేదములోని ఆహుతి నీవే. మరియు బుగ్వేదము యొక్క మాత్ర నీవే. అథర్వణ వేదము యొక్క పరమతాతత్పర్యము నీవే (35). సమస్త దేవతా బృందముల శక్తి నీవే. లోకములకు తల్లి వగు నీ యందు తమోగుణము ఒకానొక రూపములో కనబుడును. రజోగుణ స్వరూపిణి వగు నీ నుండియే ఈ ప్రపంచము పుట్టినది. మాకు మంగళములనిచ్చు నిన్ను ఇచట మేము వేద వాక్కులచే స్తుతించుచున్నాము (36).

సంసార సముద్రములో పుట్టుట యనే భయంకరమగు దుఃఖమును దాటించే పడవ నీవే. అజ్ఞానావరణ నీకు లేదు. ఎనిమిది అంగములోత గూడిన యాగమును పాలించుట అను క్రీడలో సమర్థురాలు, వింధ్య పర్వత నివాసముచే ప్రీతిని పొందునది అగు ఆ దేవిని నమస్కరించుచున్నాము (37) ప్రాణులలో ముక్కు, కన్ను మొదలగు జ్ఞానేంద్రియముల యందు, నోరు, భుజములు మొదలగు కర్మేంద్రియముల యందు మరియు మనస్సునందు ఓ జోరూపముగా నుండి, మరియు ప్రాణుల హృదయ పుండరీకమునందు నివసించి వారికి సదా నీవు సుఖమును కలిగించుచున్నాము. జగదేక సుందరివగు నీవు మా యందు నిద్రా రూపమున ఉన్నావు. అజ్ఞాన రూపములో నున్నావు. అట్టి నీవు ఈ జగుత్తు యొక్క ఉనికిని రక్షించి మమ్ములను పాలించుము(38)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలందురు మహేశ్వరి, జగన్మాత, సతీ దేహధారిణి అగు ఉమాదేవిని ఈ విధముగా స్తుతించి, మిక్కిలి ప్రీతితో నిండిన మనస్సు గలవారై ఆమెను దర్శించు కోరికతో అచటనే వేచి యుండిరి(39) .

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్రసంహితయందు యగు పార్వతీ ఖండలో దేవీస్తుతి అనే మూడవ అధ్యాయము ముగిసినది(3).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 106 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 8 - THE 18, 19 RULE
*🌻 18. Seek the way by retreating within. 19. Seek the way by advancing boldly without. - 2 🌻*

408. We get these samples sometimes, and should try to understand them as such; we often find, for example, quite an ordinary person showing great heroism when a sudden emergence arises. A workman will sacrifice his life to save his fellow-man. Now the possibility of doing that shows that the man inside is really at that level. 

Whatever is the highest a man can touch is in reality the man himself, because he could not touch it, could not think it, if it were not himself. All the lower expression – the storms of passion, the baser feelings – belongs to the personality. They should not be there – that goes without saying – but they are not the real man. If sometimes he touches great heights, that is the level at which he ought always to strive to keep himself.

409. The high and noble things for which a man yearns must be to some extent developed in the ego, otherwise he could not be longing for them down here. 

The people who do not wish for such ideals are those in whom those particular qualities do not exist even in germ. If we yearn for higher things they are in us not as a mere possibility but a living fact, and it remains for us to live at our highest level and in that way reach one still higher. The whole object of the ego in putting himself down is that he may become more definite, that all his vaguely beautiful feelings may crystallize into a definite resolution to act. 

All his incarnations form a process by means of which he may gain precision and definiteness. Therefore specialization is our way of advancement. We come down into each race or sub-race in order that we may acquire the qualities for the perfection of which that sub-race is working. The fragment of the ego which is put down is highly specialized. 

It is intended to develop a certain quality, and when that is done the ego absorbs it into himself in due course, and he does that over and over again. The personality scatters something of its special achievement over the whole when it is withdrawn into the ego, so that he thus becomes a little less vague than before.

410. The ego, with all its mighty powers, is very much less accurate than the lower mind, and the personality, valuing above all the discriminating powers of the lower mind which it is intended to develop, often comes in consequence to despise the far higher but vaguer self, and acquires a habit of thinking of itself as independent of the ego.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 238 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 2 🌻*

7. మనసు నిర్వికారంగా చేసుకోవాలంటే ప్రకృతి, పురుషులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఒక దీపంతో అనేక దీపాలను ముట్టించుకోవచ్చును. ఆప్రకారంగానే ప్రకృతి బహురూపగుణాలతో ఉంటుంది, పెరుగుతుంది. ఒకదానితో ఒకటి తగిలి పెరుగుతుంది. 

8. గుణములు మూడింటిలో సంతోషము, ఆనందము, ఆరోగ్యము, అక్రొధము, అర్జవము, అంటే ఋజుమార్గము; శుద్ధి, ప్రకాశత్వము, సుస్థిరత్వము, అహింస, నిర్మల శ్రద్ధ, వినీతి, లజ్జ, అంటే వినయము; సత్యము, శౌచము, సమత, ఆచారము, అకార్పణ్యము, అంటే కృపణత్వము లేకుండా, పైశునత్వము(లోభత్వము) లేకుండా ఉండటము; అకామవృత్తి(తీవ్రమైన కోరిక లేకుండటము), ఇవన్నీకూడా సత్వగుణముంలు అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు.

9. విగ్రహము, దర్పము, తిరస్కార, అభిమానములు(అంటే మరొకరిని తిరస్కరించి యుద్ధం చెయ్యటము), కామక్రోధములు, మాత్సర్యము, కరుణ లేకపోవటము, భోగకాంక్ష, అహంకారము – ఇవన్నీ కూడా రజోగుణలక్షణములు. 

10. అప్రకాశము (చీకటి, కాంతి లేకపోవటము), బహుతరాశనము (అతిగా భోజనము చేయటము), మోహము, వాదము, ప్రమాదము, పెద్దలోస్తే లేవకుండా మత్తుగా ఒకచోట కూర్చుని ఉండటము, మూర్ఖత్వము, మందబుద్ధి, మరణమంటే భయము, దుఃఖము మొదలైనివి తమోగుణలక్షణాలు. 

11. పురుషుడు లోపలి చేతనుడు, ప్రకృతి జడమైనటువంటిది. ఆత్ముడు తనను తాను తెలుసుకుంటే, వ్యక్తమైన(తనను పరివేష్టించిన) ప్రకృతితో తాదాత్మ్యం చెందడు. ప్రకృతిని సమీక్షించక, ‘అజర శాశ్వత నిరంజన విమలాచ్యుత పదము’న నిజప్రకాశ స్థిరుడై అక్షరుడవుతాడు. అంటే మోక్ష పదవిని పొందుతాడు. ప్రకృతివశంకాడు. ఆత్ముడు తనను తాను తెలుసుకుంటే, పురుషుడు ప్రకృతి యందు, ప్రకృతి పురుషుని యందు నిలుస్తారు.

12. పురుషుడు నీటిలో చేపవలె, ఉదుంబరమశకములు సంగమించిన రీతిగా వికృతి చెందడు. (మేడిపండుపైన దోమ వాలినప్పుడు ఒకటిగా కనబడినా, ఆ రెండూ వేరే అయినట్లు, శరీరానికీ – ఆత్మకూ భిన్నత్వం ఉంది అని అర్థం) అంతరాత్మ ప్రకృతిని పొందినా – నీటిలో కమలము ఉండికూడా నీరు అంటనట్లుగా – వికారము పొందదు. 

13. మనసు ఇంద్రియాలతో ఉండి వికారం చెందుతుంది. మనసుననుసరించి ముద్ధి వికారము చెందుతుంది. పాపపుణ్యాలలో ప్రవర్తిస్తోంది. ఈ ప్రకృతిననుసరించి చిత్తము సంక్షుభితమవుతోంది. అంతరాత్మ ఈ ప్రకృతిలో ఉండికూడా, మాలిన్యం లేకుండా విమలంగా ఉంది. 

14. మనోబుద్ధి చిత్తహంకారాలు మాత్రం ఈ ప్రకారంగా మాలిన్యం పొందుతుంటే, ఆత్మ వస్తువుకు మరి ఈ ప్రకృతిలో ఉండికూడా విమలత్వం ఎలా వచ్చింది? దాని స్వభావం ఏమిటి? ఇలాంటి విచారణ వల్ల జీవుడికి ఆత్మజ్ఞానము కలుగుతుంది. 

15. అహంకారమేమో పునర్జన్మహేతువవుతోంది. దీనిలో పాపపుణ్యాలు ప్రవేశిస్తున్నాయి, లోభమోహాలవుతున్నాయి. కానీ ఎటువంటి పరిస్థితిలోనూ కూడా ప్రకృతివల్ల ఏ దోషం సంక్రమించకుండా ఉండే ఆత్మవస్తువు ఒకటుందే, దాని స్వభావమేది అనే విచారణ మోక్షమార్గం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 302 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 151. The primary concept 'I am' appears spontaneously and is the source of all concepts, so everything is mental entertainment. 🌻*

The first time when you came to know that 'you are' or 'I am', how did it happen? Did you play any part in bringing about this feeling? No, it came quite spontaneously, on its own. In its nascent phase the 'I am' was pure with nothing attached to it, it was non-verbal. 

Gradually, as you grew up, the pure non-verbal 'I am' donned the guise of a verbal 'I am' with the 'so-and-so' attached to it and many, many more attachments followed. So you can see that the primary concept was the 'I am', all other concepts followed this primary one. 

Now, after understanding and following the teachings of the Guru you have realized that the 'I am' is false! The root is cut! Thenceforth, whatever follows, can it be anything else but mental entertainment?
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం # #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 177 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - మహాభినిష్క్రమణము లేక సద్గురు నిర్యాణము - 1 🌻*

673. సద్గురువు భగవంతునిగా దేహమును చాలించుట నాల్గవ దివ్యయాణమునకు సంబంధించి యుండును.

674. సద్గురువు దేహము చాలించిన తరువాత కూడా అతని ఎరుక గలిగిన అనంత ,అఖండ వ్యక్తిత్వం అనుభవమైన "అహం బ్రహ్మాస్మి" స్థితి శాశ్వతముగా పరమాత్మ (B)స్థితిలో నిలిచియుండును.

అవతార పురుషుడు 

675. సద్గురువు దేహము చాలించిన తరువాత మరల జన్మించడు. కానీ ఒక్క అవతార పురుషుడు మరల మరల జన్మించుచుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్గీత యథాతథం - 1 - 004 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 4 🌻*

అత్ర శూరా మహేష్వాసా
భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథ : ||

తాత్పర్యము : 
ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్దరులు పెక్కురు కలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు.

భాష్యము : 
ద్రోణాచార్యుని ముందు దృష్టద్యుమ్నుడు గొప్ప ఆటంకము కాకపోయినా ఇంకొందరు యోధులు విజయాన్ని పొందుట కష్టతరము చేయగలరని దుర్యోధనుడు భయపడెను. తనకు భీమార్జునుల యుద్ధ నైపుణ్యము తెలియును కనుక మిగిలిన వారిని వారిద్దరితో పోల్చిచెప్పెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 33 / Sri Lalita Sahasranamavali - Meaning - 33 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 33. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా ।*
*బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా ॥ 33 ॥ 🍀*

🍀 82. కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర సైనికా - 
ప్రయోగముతో నిశ్శేషంగా దహింపబడిన భండాసురునితో కూడిన శూన్యకా నగరము గలది.

🍀 83. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా - 
బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 33 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 33. kāmeśvarāstra-nirdagdha-sabhaṇḍāsura-śūnyakā |*
*brahmopendra-mahendrādi-deva-saṁstuta-vaibhavā || 33 || 🌻*

🌻 82 ) Kameshwarasthra nirdhagdha sabandasura sunyaka -   
She who destroyed Bandasura and his city called sunyaka by the Kameshwara arrow.

🌻83 ) Brhmopendra mahendradhi deva samsthutha vaibhava -   
She who is prayed by Lord Brahma , Vishnu, indra and other devas

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 33 / Sri Vishnu Sahasra Namavali - 33 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*కర్కాటక రాశి- అశ్లేష నక్షత్ర 1వ పాద శ్లోకం - నిత్యం 108 సార్లు*

*🍀. 33. యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః |*
*అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ‖ 33 ‖ 🍀*

🍀 300) యుగాదికృత్ - 
కృతాది యుగములను ప్రారంభించినవాడు.

🍀 301) యుగావర్త: - 
యుగములను త్రిప్పువాడు.

🍀 302) నైకమాయ: - 
తన మాయాశక్తిచే అనేక రూపములను ధరించి, ప్రదర్శించువాడు.

🍀 303) మహాశన: - 
సర్వమును కబళించువాడు.

🍀 304) అదృశ్య: - 
దృశ్యము కానివాడు.

🍀 305) వ్యక్తరూప: - 
భక్తుల హృదయములలో వ్యక్తరూపుడై భాసిల్లువాడు.

🍀 306) సహస్రజిత్ - 
వేలకొలది రాక్షసులను సంగ్రామమున జయించువాడు.

🍀 307) అనంతజిత్ - 
అనూహ్యమైన శక్తి సామర్ద్యములు కలవాడై, రణరంగమున ఎదిరించువారిని జయించు శక్తి కలవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 33 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for karkataka Rasi, Aslesha 1st Padam*

*🌻 33. yugādikṛdyugāvartō naikamāyō mahāśanaḥ |*
*adṛśyō vyaktarūpaśca sahasrajidanantajit || 33 || 🌻*

🌻 300. Yugādikṛd: 
One who is the cause of periods of time like Yuga.

🌻 301. Yugāvartaḥ: 
One who as time causes the repetition of the four Yugas beginning with Satya Yuga.

🌻 302. Naikamāyaḥ: 
One who can assume numerous forms of Maya, not one only.

🌻 303. Mahāśanaḥ: 
One who consumes everything at the end of a Kalpa.

🌻 304. Adṛśyaḥ: 
One who cannot be grasped by any of the five organs of knowledge.

🌻 305. Vyaktarūpaḥ: 
He is so called because His gross form as universe can be clearly perceived.

🌻 306. Sahasrajit:
One who is victorious over innumerable enemies of the Devas in battle.

🌻 307. Anantajit: 
One who, being endowed with all powers, is victorious at all times over everything.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 216 / Sri Lalitha Chaitanya Vijnanam - 216

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 216 / Sri Lalitha Chaitanya Vijnanam - 216 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 
మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖

🌻 216. “మహాసత్యా'' 🌻

మహత్తరమైన సత్వము గలది శ్రీమాత అని అర్థము.

సత్త్వ మనగా ఉనికి, వుండుట. సృష్టి స్థితిగొని వుండుటకు మూలకారణము శ్రీమాతయే. ఆమె సంకల్పించినచో మొత్తము సృష్టి తిరోధానము చెందగలదు. పురోగమనము కూడ చెందగలదు. స్థితియందుండ గలదు. సమస్త సృష్టిని తన యందు లయము చేసుకొని తానే కేవలముగ నుండగలదు. అట్టి ఉనికి మహాసత్త్వము.

పరాప్రకృతిగ పరమ పురుషునియందు స్థితిగొని యుండుట, సంకల్ప మాత్రమున సృష్టి నిర్మాణము గావించి బ్రహ్మ నుండి చీమ వఱకు అన్నిటి యందు ఉనికిగ నుండుట కూడ చేయును. ఆమె మన యందు వుండుట వలననే మనము వున్నామని భావించుచున్నాము.

ఆమె లేని మనము లేము - మనము లేని ఆమె యున్నది. మన మున్నామని మనకు

భ్రాంతి ఆమె మాయ నుండే కలుగుచున్నది. నిజమున కున్నది ఆమెయే. అల యందున్నది సముద్రమే కదా! సముద్రము లేక అల లేదు. కాని అలలేని సముద్ర ముండగలదు. అందుకని ఆమెయే మహాసత్త్వం మన ఉనికి రహస్యము మనకు తెలియుటయే నిజమగు జ్ఞానము.

శ్రీమాతయే దీని ననుగ్రహించ గలదు. ఆమెను తెలిసినవాడే తెలిసినవాడు. ఆమె అనుగ్రహ పాత్రులగుటకు సాధకులు త్రిగుణములలో ప్రధానమైన సత్త్వగుణమున నిలువవలెను. శ్రీమాత సత్త్వ గుణమునకు కూడ అతీతమైనప్పటికిని ఆమెను చేరుమార్గము సత్త్వగుణమే.

సత్త్వగుణము నిర్మలమగు నీరు వంటిది. రజస్తమో గుణములు కలతవారిన నీరు వంటివి; బురద నీరు వంటివి. సత్త్వగుణ లక్షణములు భగవద్గీతయందు 16వ అధ్యాయమున మొదటి మూడు

శ్లోకములలో తెలుపబడినవి. వానిని శ్రీమాత ఆరాధనతో జోడించి అభ్యసించినచో సాధకుడు సత్సాధకుడు కాగలడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 216 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Mahā-sattvā महा-सत्त्वा (216) 🌻

Sattvā is one of the three guṇa-s, the other two being rajas and tamas. Out of the three, sattva guṇa is supreme. When this guṇa is dominant in a person, he cannot commit any sins either knowingly or unknowingly. She chooses these persons to shower on them Her special grace.

Here She is referred to as an embodiment of the qualities of sattva guṇa such as understanding the reality, emitting positive energy from one’s own self, the mental and physical strength due to the positive vibrations etc.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

22 Feb 2021

ప్రథమం కోసం అన్వేషణ

🌹. ప్రథమం కోసం అన్వేషణ 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

ఎలాంటి ఆశలు, అవసరాలు లేకుండా, పూర్తి సంతృప్తితో చాలా హాయిగా, సౌకర్యంగా జీవిస్తున్న ప్రపంచం నుంచి మరో ప్రపంచంలోకి గెంటివేయబడిన శిశువుకు అది మృత్యుసమానమైన అనుభవమే. అది వాడికే తెలుస్తుంది. కాబట్టి, వాడిలా ఆలోచిస్తేనే అది సత్యమని మీకు తెలుస్తుంది.

ఎందుకంటే, పూర్తి రక్షణతో కూడిన అత్యంత సౌకర్యవంతమైన ప్రపంచాన్ని వాడు కోల్పోయాడు. చివరికి శాస్తజ్ఞ్రులు కూడా మాతృగర్భం లాంటి మరొక ప్రపంచాన్ని సృష్టించలేమని ఒప్పుకున్నారు.

కానీ, మనిషి తాను కోల్పోయిన మాతృగర్భానికి సమానమైన గృహాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేశాడు. నీటి పరుపులు, వేడి నీళ్ళ స్నానపు తొట్టెలు ఆ ప్రయత్నంలో భాగాలే. తెలివైనవాడు ఆ స్నానపుతొట్టెలలో ఉప్పుకూడా కలుపుతాడు. ఎందుకంటే, తల్లిగర్భంలో అలాగే ఉంటుంది. సముద్రపు నీటిలోని ఉప్పు సాంద్రత కూడా సరిగ్గా అలాగే ఉంటుంది.

కానీ, అలా సృష్టించుకున్న ఆ స్నానపు తొట్టెల్లో మీరు ఎంత కాలముండగలరు? తల్లి గర్భంలో ఉన్నట్లుగా మీరు వాటిలో కచ్చితంగా తొమ్మిది నెలలు ఉండలేరు.

సిగ్మండ్ ఫ్రాయిడ్ జ్ఞానోదయం పొందినవాడు కాదు. కానీ, నిజానికి, అతడు కాస్త కోకిల లాంటివాడు. కోకిలలు అప్పుడప్పుడు చక్కగా కూస్తాయి కదా! అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా అప్పుడప్పుడు చక్కని భావాలు చెప్పేవాడు.

‘‘పురుషుడు సంగమించడం కేవలం మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించేందుకే’’ అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది చాలా లోతైన భావన. పైకి అది పిచ్చిగా అనిపించినా, అందులో సత్యముంది. కేవలం, సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి పిచ్చివాడే దానిని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకుంటాడు. పురుషుడు ఏ మార్గంనుంచి వచ్చాడో ఆ మార్గం నుంచే గర్భాన్వేషణ ప్రారంభిస్తాడు. అయినా అతడు గర్భాన్ని చేరుకోలేడన్నది వాస్తవం.

అందుకే పురుషుడు గుహలు తవ్వడం, ఇళ్ళు కట్టడం, విమానాలు చెయ్యడం ప్రారంభించాడు. త్వరలో ఏదో ఒకరోజు విమానాలలో కూడా అందరూ ఉప్పుకలిపిన వేడి నీళ్ళ తొట్టెల్లో తేలినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఎందుకంటే, అవి మీకు తల్లి గర్భంలో ఉన్న అనుభూతిని అందిస్తాయి. మీట నొక్కగానే ‘‘విమాన పరిచారిక (ఎయిర్ హోస్టెస్)’’ వచ్చి మీకు కావలసినవి చేస్తుంది. అయినా మీకు తృప్తి లభించదు.

శిశువుకు తల్లిగర్భంలో సుఖంగా ఉండడం కన్నా ఏమీ తెలియదు. బయటపడ్డ శిశువుకు ఎన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటుచేసినా అవి తల్లి గర్భంలో ఉన్న సుఖానుభూతికి సమానం కావు. ఎందుకంటే, మీట నొక్కే అవసరం లేకుండానే తల్లి గర్భంలో మీకు కావలసినవన్నీ లభిస్తాయి. ఆకలి వేసేలోగానే ఆహారం మీకు అందుతుంది. అలాగే ‘గాలి కావాలి’ అనుకునే లోపే అది మీకు లభిస్తుంది.

అక్కడ మీకు ఎలాంటి బాధ్యతలు ఉండవు. అందుకే తల్లి గర్భంనుంచి బయటకు రావడాన్ని శిశువు మరణంగా భావిస్తాడే కానీ, జననంగా ఎప్పుడూ భావించడు, భావించలేడు. బయట నుంచి చూసేవారు మాత్రమే దానిని జననమంటారు. అలా బయటపడ్డ శిశువు పెరిగి పెద్దవాడై భార్య, పిల్లలు, కుటుంబం, స్నేహితులు, సుఖంగా గడిపేందుకు ఒక చిన్న ఇల్లు, హాయిగా తిరిగేందుకు వాహనం లాంటివి సంపాదించేందుకు తన జీవితాన్ని ధారపోస్తాడు.

అంతలోనే అకస్మాత్తుగా వాడు జీవితం నుంచి బయటపడే రోజు ముంచుకొస్తుంది. వెంటనే వైద్యుడు వస్తాడు. వాడు కూడా మీరు పుట్టగానే ఊపిరి పీల్చేందుకు మీ పిర్రపై కొట్టిన వైద్యుడు లాంటివాడే. కానీ, ఈసారి వాడు వచ్చినది మీకు ఊపిరి పోసేందుకు కాదని అందరికీ తెలుసు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹

22 Feb 2021

వివేక చూడామణి - 28 / Viveka Chudamani - 28

🌹. వివేక చూడామణి - 28 / Viveka Chudamani - 28 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మాయ 🍀

108. అవిధ్య లేక మాయ అనునది పరమాత్మ యొక్క వ్యక్తీకరణమే. సత్వ, రజో, తమో గుణాల సమత్వ స్థితి బ్రహ్మము. సమత్వ స్థితి లోపించినప్పుడు మాయ వ్యక్తమవుతుంది. విశ్వ సృష్టికి కారణమైన ఈ మాయ త్రిగుణాతీత స్థితిలో లేదు. త్రిగుణములు సమత్వ స్థితిని కోల్పోయినప్పుడే సృష్టి ఏర్పడినది. అదే ప్రకృతి.

109. మాయ అనేది వ్యక్తము కాదు. అవ్యక్తము కాదు. లేక రెండు లక్షణాలు ఉన్నదికాదు, లేనిదికాదు. లేక కొన్ని లక్షణాలు విడివిడిగా లేక కలసి ఉన్నట్లు భావించ రాదు. ఇది చాలా ఆశ్చర్యకరమైనది. దానిని మాటలతో వర్ణించలేము.

110. మాయను జయించాలంటే కేవలము బ్రహ్మాన్ని తెలుసుకొని ఉండాలి. బ్రహ్మము లాంటిది వేరొకటి లేదు. ఎలా అంటే త్రాడును చూసి పాము అని భ్రమించి అది పాము కాదు తాడని గ్రహించినట్లు; దాని లక్షణాలైన సత్వ, రజో, తమో గుణాలు వానివాని స్వభావాన్ని బట్టి నిర్ణయించబడతాయి.

111. రాజస గుణములో నిక్షేపశక్తి అనగా తన యొక్క క్రొత్త ఆకారమును తెలుసుకొన్న వెంటనే వ్యక్తము చేయగలుగుతుందో అది ఆవరణములో బహిర్గతమవుతుంది. దీని నుండి కూడా మానసిక లక్షణములైన ఆకర్షణ, విచారము అనునవి నిరంతరముగా ఉత్పత్తి అవుతూనే ఉంటాయి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 28 🌹

✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj

🌻 Illusion 🌻

108. Avidya (Nescience) or Maya, called also the Undifferentiated, is the power of the Lord. She is without beginning, is made up of the three Gunas and is superior to the effects (as their cause). She is to be inferred by one of clear intellect only from the effects She produces. It is She who brings forth this whole universe.

109. She is neither existent nor non-existent nor partaking of both characters; neither same nor different nor both; neither composed of parts nor an indivisible whole nor both. She is most wonderful and cannot be described in words.

110. Maya can be destroyed by the realisation of the pure Brahman, the one without a second, just as the mistaken idea of a snake is removed by the discrimination of the rope. She has her Gunas as Rajas, Tamas and Sattva, named after their respective functions.

111. Rajas has its Vikshepa-Shakti or projecting power, which is of the nature of an activity, and from which this primeval flow of activity has emanated. From this also, mental modifications such as attachment and grief are continually produced.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

22 Feb 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 302, 303 / Vishnu Sahasranama Contemplation - 302, 303

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 302, 303 / Vishnu Sahasranama Contemplation - 302, 303 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 302. నైకమాయః, नैकमायः, Naikamāyaḥ 🌻

ఓం నైకమాయాయ నమః | ॐ नैकमायाय नमः | OM Naikamāyāya namaḥ

నైకమాయః, नैकमायः, Naikamāyaḥ

బహ్వీర్మాయాః ప్రవహతః ఏకా మాయా న విద్యతే ।
ఇతి విష్ణుర్నైకమాయ ఇతి సంప్రోచ్యతే బుధైః ॥

ఇతనికి ఒకే మాయ కాదు ఉన్నది. అనేకములగు మాయా శక్తులను వహించుచున్నవాడు గనుక విష్ణువు నైకమాయః.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 302🌹

📚. Prasad Bharadwaj

🌻302. Naikamāyaḥ🌻

OM Naikamāyāya namaḥ

Bahvīrmāyāḥ pravahataḥ ekā māyā na vidyate,
Iti viṣṇurnaikamāya iti saṃprocyate budhaiḥ.

बह्वीर्मायाः प्रवहतः एका माया न विद्यते ।
इति विष्णुर्नैकमाय इति संप्रोच्यते बुधैः ॥

His māyā i.e., illusory energy is not one! But He wields many māyās; hence He is Naikamāyaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ || ౩౩ ||

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 303 / Vishnu Sahasranama Contemplation - 303🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 303. మహాఽశనః, महाऽशनः, Mahā’śanaḥ 🌻

ఓం మహాఽశనాయ నమః | ॐ महाऽशनाय नमः | OM Mahā’śanāya namaḥ

మహాఽశనః, महाऽशनः, Mahā’śanaḥ

యస్యాస్తి మహదశనం స మహాశన ఉచ్యతే ।
యః కల్పంతేఽఖిలం విశ్వం గ్రసతి ప్రభురచ్యుతః ॥

కల్పాంతము నందు పరమాత్మ సర్వమును మ్రింగివేయును కావున ఇతడు ఆరగించునది గొప్పపరిమాణము కల ఆహారము.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::

తే. యోగమాయా విదూరుఁడై యుగసహస్ర, కాలపర్యంత మఖిలలోకములు మ్రింగి
పేర్చి మఱికాల శక్త్యుబృంహితమును, సమత సృష్టి క్రియా కలాపములఁ దగిలి. (273)

క. తన జఠరము లోపలఁ దాఁ, చిన లోక నికాయముల సృజించుటకును సా
ధనమగు సూక్ష్మార్థము మన, సున గని కాలానుగత రజోగుణ మంతన్‍. (274)

యోగమాయకు కూడా దూరంగా వెయ్యియుగాల పర్యంతం సమస్తలోకాలను తన కడుపులో దాచుకొని వెలుగొందుతూ ఆ పైన కాలమూ శక్తీ చక్కగా అభివ్యక్తం కాగా సమత్వం వహించి సృష్టికార్యం నిర్వహించటానికి ఆసక్తుడైనాడు. తన కడుపులో దాచుకొని ఉన్న సకలలోకాలనూ తిరిగి సృష్టించాడానికి ఉపకరణమైన సూక్ష్మపదార్థాన్ని మనస్సులో భావించి, కాలానుగుణంగా రజోగుణాన్ని పుట్టించాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 303🌹

📚. Prasad Bharadwaj

🌻303. Naikamāyaḥ🌻

Yasyāsti mahadaśanaṃ sa mahāśana ucyate,
Yaḥ kalpaṃte’khilaṃ viśvaṃ grasati prabhuracyutaḥ.

यस्यास्ति महदशनं स महाशन उच्यते ।
यः कल्पंतेऽखिलं विश्वं ग्रसति प्रभुरच्युतः ॥

At the end of a kalpa, He swallows everything (all devouring). As His eating is big, He is Mahā’śanaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ॥ ౩౩ ॥

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

22 Feb 2021

ఇంద్ర కృత శ్రీ సురభి స్తోత్రం (Sri Surabhi Devi Stotram) కామధేను స్తోత్రం (Kamadhenu Stotram)

🌹. ఇంద్ర కృత శ్రీ సురభి స్తోత్రం (Sri Surabhi Devi Stotram) కామధేను స్తోత్రం (Kamadhenu Stotram) 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

నమో దేవ్యై మహా దేవ్యై సురాభయైచ నమో నమః

గవాంబీజ స్వరూపాయ నమస్తే జగదంబికే ||

నమో రాధ ప్రియయైచ పద్మాంశాయై నమో నమః

నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః ||

కల్పవృక్ష స్వరూపాయై పాద్మాక్షే సర్వ సంపదామ్

శ్రీ దాయె ధన ధాయై చ బుద్ద్ధి దాయై నమో నమః ||

శుభ దాయై ప్రసన్నయై గోప్రదయై నమో నమః

యశోదాయై సౌక్యదాయై దర్మజ్ఞాయై నమో నమః ||

ఇధ స్తోత్రం మహా పుణ్యంభక్త యుక్తస్చ యః పటేత్

సాగోమాన్ ధనవాంశ్చైవ కీర్తిమాన్ పుణ్య వాన్ భవేత్ ||

నుస్నాతః సర్వ తీర్ధే షు సర్వ యగ్నేతు దీక్షితః

ఇహ లోకే సుఖం చుక్‌త్వా యాం థ్యంతేకృష్ణ మందిరం ||

సుచిరం సవసే త్తత్ర కురుతే కృష్ణ సేవనం

నపునర్చ వనంతస్య బ్రహ్మపుత్ర భవే భవేత్ ||

🌹 🌹 🌹 🌹 🌹

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

22-FEB-2021 MORNING

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 646 / Bhagavad-Gita - 646🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 302, 303 / Vishnu Sahasranama Contemplation - 302, 303🌹
3) 🌹 Daily Wisdom - 65 🌹
4) 🌹. వివేక చూడామణి - 28🌹
5) 🌹Viveka Chudamani - 28 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 39 🌹
7)  🌹. ప్రధమం కోసం అన్వేషణ .. 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 216 / Sri Lalita Chaitanya Vijnanam - 216🌹 
9) 🌹 శ్రీమద్భగవద్గీత - 557 / Bhagavad-Gita - 557🌹 
🌹. సురభి స్తోత్రము - కామధేను స్తోత్రము 🌹
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 646 / Bhagavad-Gita - 646 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 63 🌴*

63. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా |
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ||

🌷. తాత్పర్యం : 
ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నీకు నేను వివరించితిని. దీనిని సంపూర్ణముగా విమర్శన కావించి, పిదప తోచిన రీతి ఒనరింపుము.

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు బ్రహ్మభూతజ్ఞానమును సంపూర్ణముగా ఇదివరకే వివరించెను. బ్రహ్మభూతస్థితి యందున్నవాడు సదా ఆనందపూర్ణుడై యుండును. అతడు శోకించుటను యొరుగడు మరియు దేనిని వాంచింపడు. అటువంటి దివ్యస్థితికి గుహ్యమైన బ్రహ్మభూతజ్ఞానమే కారణము. 

బ్రహ్మభూతజ్ఞానమునే గాక శ్రీకృష్ణుడు పరమాత్మ జ్ఞానము సైతము అర్జునునకు తెలియపరిచెను. అదియును బ్రహ్మజ్ఞానమేయైనను బ్రహ్మభూతజ్ఞానము కన్నను ఉన్నతమైనది.
ఇచ్చట “యథేచ్చసి తథా కురు” అను పదము శ్రీకృష్ణభగవానుడు జీవులకు గల అతిసూక్ష్మమైన స్వాతంత్ర్యముతో జోక్యము కలుగచేసికొనడని సూచించుచున్నది. 

మానవుడు ఏ విధముగా తన జీవనస్థితిని వృద్ధిచేసికొనగలడో శ్రీకృష్ణభగవానుడు అన్ని కోణముల నుండి భగవద్గీత యందు వివరిచియున్నాడు. హృదయస్థుడైన పరమాత్మునకు శరణుపొందుమని అర్జునునకు ఒసగిన ఉపదేశము వానిలో ముఖ్యమైనది. దానిని బట్టి సరియైన విచక్షణతో మనుజుడు పరమాత్మ నిర్దేశానుసారము వర్తించుటకు అంగీకరింపవలసియున్నది. 

అట్టి అంగీకారము మనుజుడు సదా మానవజన్మ యొక్క అత్యున్నత పూర్ణస్థితియైనటువంటి కృష్ణభక్తిభావనలో నిలిచియుండుటకు తోడ్పడగలదు. యుద్ధము చేయుమని అర్జునుడు శ్రీకృష్ణభగవానునిచే ప్రత్యక్షముగా ఆదేశింపబడినాడు. 

భగవానుని శరణువేడుట జీవుల లాభమునకే గాని, భగవానుని లాభము కొరకు కాదు. కాని శరణాగతికి ముందు తమ బుద్ధిననుసరించి ఆ విషయమును గూర్చి విమర్శన చేసికొనుటకు ప్రతియొక్కరు స్వాతంత్ర్యమును కలిగియున్నారు. అదియే దేవదేవుడైన శ్రీకృష్ణుని ఉపదేశమును ఆంగీకరించుటకు ఉత్తమమార్గము. అట్టి ఉపదేశము శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు నుండి కూడా లభింపగలదు.

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 646 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 63 🌴*

63. iti te jñānam ākhyātaṁ
guhyād guhya-taraṁ mayā
vimṛśyaitad aśeṣeṇa
yathecchasi tathā kuru

🌷 Translation : 
Thus I have explained to you knowledge still more confidential. Deliberate on this fully, and then do what you wish to do.

🌹 Purport :
The Lord has already explained to Arjuna the knowledge of brahma-bhūta. One who is in the brahma-bhūta condition is joyful; he never laments, nor does he desire anything. That is due to confidential knowledge. Kṛṣṇa also discloses knowledge of the Supersoul. This is also Brahman knowledge, knowledge of Brahman, but it is superior.

Here the words yathecchasi tathā kuru – “As you like, you may act” – indicate that God does not interfere with the little independence of the living entity. In Bhagavad-gītā, the Lord has explained in all respects how one can elevate his living condition. 

The best advice imparted to Arjuna is to surrender unto the Supersoul seated within his heart. By right discrimination, one should agree to act according to the order of the Supersoul. 

That will help one become situated constantly in Kṛṣṇa consciousness, the highest perfectional stage of human life. Arjuna is being directly ordered by the Personality of Godhead to fight. Surrender to the Supreme Personality of Godhead is in the best interest of the living entities. It is not for the interest of the Supreme. 

Before surrendering, one is free to deliberate on this subject as far as the intelligence goes; that is the best way to accept the instruction of the Supreme Personality of Godhead. Such instruction comes also through the spiritual master, the bona fide representative of Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 302, 303 / Vishnu Sahasranama Contemplation - 302, 303 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 302. నైకమాయః, नैकमायः, Naikamāyaḥ 🌻*

ఓం నైకమాయాయ నమః | ॐ नैकमायाय नमः | OM Naikamāyāya namaḥ

నైకమాయః, नैकमायः, Naikamāyaḥ

బహ్వీర్మాయాః ప్రవహతః ఏకా మాయా న విద్యతే ।
ఇతి విష్ణుర్నైకమాయ ఇతి సంప్రోచ్యతే బుధైః ॥

ఇతనికి ఒకే మాయ కాదు ఉన్నది. అనేకములగు మాయా శక్తులను వహించుచున్నవాడు గనుక విష్ణువు నైకమాయః.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 302🌹*
📚. Prasad Bharadwaj 

*🌻302. Naikamāyaḥ🌻*

OM Naikamāyāya namaḥ

Bahvīrmāyāḥ pravahataḥ ekā māyā na vidyate,
Iti viṣṇurnaikamāya iti saṃprocyate budhaiḥ.

बह्वीर्मायाः प्रवहतः एका माया न विद्यते ।
इति विष्णुर्नैकमाय इति संप्रोच्यते बुधैः ॥

His māyā i.e., illusory energy is not one! But He wields many māyās; hence He is Naikamāyaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥
యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ || ౩౩ ||

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 303 / Vishnu Sahasranama Contemplation - 303🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 303. మహాఽశనః, महाऽशनः, Mahā’śanaḥ 🌻*

ఓం మహాఽశనాయ నమః | ॐ महाऽशनाय नमः | OM Mahā’śanāya namaḥ

మహాఽశనః, महाऽशनः, Mahā’śanaḥ

యస్యాస్తి మహదశనం స మహాశన ఉచ్యతే ।
యః కల్పంతేఽఖిలం విశ్వం గ్రసతి ప్రభురచ్యుతః ॥

కల్పాంతము నందు పరమాత్మ సర్వమును మ్రింగివేయును కావున ఇతడు ఆరగించునది గొప్పపరిమాణము కల ఆహారము.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
తే. యోగమాయా విదూరుఁడై యుగసహస్ర, కాలపర్యంత మఖిలలోకములు మ్రింగి
     పేర్చి మఱికాల శక్త్యుబృంహితమును, సమత సృష్టి క్రియా కలాపములఁ దగిలి. (273)
క. తన జఠరము లోపలఁ దాఁ, చిన లోక నికాయముల సృజించుటకును సా
     ధనమగు సూక్ష్మార్థము మన, సున గని కాలానుగత రజోగుణ మంతన్‍. (274)

యోగమాయకు కూడా దూరంగా వెయ్యియుగాల పర్యంతం సమస్తలోకాలను తన కడుపులో దాచుకొని వెలుగొందుతూ ఆ పైన కాలమూ శక్తీ చక్కగా అభివ్యక్తం కాగా సమత్వం వహించి సృష్టికార్యం నిర్వహించటానికి ఆసక్తుడైనాడు. తన కడుపులో దాచుకొని ఉన్న సకలలోకాలనూ తిరిగి సృష్టించాడానికి ఉపకరణమైన సూక్ష్మపదార్థాన్ని మనస్సులో భావించి, కాలానుగుణంగా రజోగుణాన్ని పుట్టించాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 303🌹*
📚. Prasad Bharadwaj 

*🌻303. Naikamāyaḥ🌻*

Yasyāsti mahadaśanaṃ sa mahāśana ucyate,
Yaḥ kalpaṃte’khilaṃ viśvaṃ grasati prabhuracyutaḥ.

यस्यास्ति महदशनं स महाशन उच्यते ।
यः कल्पंतेऽखिलं विश्वं ग्रसति प्रभुरच्युतः ॥

At the end of a kalpa, He swallows everything (all devouring). As His eating is big, He is Mahā’śanaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥
యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ॥ ౩౩ ॥
Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 65 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 5. The Sorrow has Not Come from Outside 🌻*

The Brihadaranyaka Upanishad, particularly, attempts to explain the various processes of bondage and liberation. It tells us how we are bound and how we are to get free; and it goes to the very cause ultimate of the bondage of the soul. 

Our bondage is not merely physical or social. It is a more deep-rooted condition which has been annoying us through centuries and through our repeated births and deaths. Anything that we do in the outer world does not seem to be an adequate remedy for this sorrow of ours, because the sorrow has not come from outside. 

We can have a bungalow to prevent us from suffering from rain and sun and wind; we can have daily food to eat; we can have very happy and friendly social relationships; but we can also die one day, even with all these facilities. Nobody can free us from this fear.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 28 / Viveka Chudamani - 28 🌹*
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀. మాయ 🍀*

108. అవిధ్య లేక మాయ అనునది పరమాత్మ యొక్క వ్యక్తీకరణమే. సత్వ, రజో, తమో గుణాల సమత్వ స్థితి బ్రహ్మము. సమత్వ స్థితి లోపించినప్పుడు మాయ వ్యక్తమవుతుంది. విశ్వ సృష్టికి కారణమైన ఈ మాయ త్రిగుణాతీత స్థితిలో లేదు. త్రిగుణములు సమత్వ స్థితిని కోల్పోయినప్పుడే సృష్టి ఏర్పడినది. అదే ప్రకృతి.

109. మాయ అనేది వ్యక్తము కాదు. అవ్యక్తము కాదు. లేక రెండు లక్షణాలు ఉన్నదికాదు, లేనిదికాదు. లేక కొన్ని లక్షణాలు విడివిడిగా లేక కలసి ఉన్నట్లు భావించ రాదు. ఇది చాలా ఆశ్చర్యకరమైనది. దానిని మాటలతో వర్ణించలేము.

110. మాయను జయించాలంటే కేవలము బ్రహ్మాన్ని తెలుసుకొని ఉండాలి. బ్రహ్మము లాంటిది వేరొకటి లేదు. ఎలా అంటే త్రాడును చూసి పాము అని భ్రమించి అది పాము కాదు తాడని గ్రహించినట్లు; దాని లక్షణాలైన సత్వ, రజో, తమో గుణాలు వానివాని స్వభావాన్ని బట్టి నిర్ణయించబడతాయి.

111. రాజస గుణములో నిక్షేపశక్తి అనగా తన యొక్క క్రొత్త ఆకారమును తెలుసుకొన్న వెంటనే వ్యక్తము చేయగలుగుతుందో అది ఆవరణములో బహిర్గతమవుతుంది. దీని నుండి కూడా మానసిక లక్షణములైన ఆకర్షణ, విచారము అనునవి నిరంతరముగా ఉత్పత్తి అవుతూనే ఉంటాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 28 🌹* 
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj 

*🌻 Illusion 🌻*

108. Avidya (Nescience) or Maya, called also the Undifferentiated, is the power of the Lord. She is without beginning, is made up of the three Gunas and is superior to the effects (as their cause). She is to be inferred by one of clear intellect only from the effects She produces. It is She who brings forth this whole universe.

109. She is neither existent nor non-existent nor partaking of both characters; neither same nor different nor both; neither composed of parts nor an indivisible whole nor both. She is most wonderful and cannot be described in words.

110. Maya can be destroyed by the realisation of the pure Brahman, the one without a second, just as the mistaken idea of a snake is removed by the discrimination of the rope. She has her Gunas as Rajas, Tamas and Sattva, named after their respective functions. 

111. Rajas has its Vikshepa-Shakti or projecting power, which is of the nature of an activity, and from which this primeval flow of activity has emanated. From this also, mental modifications such as attachment and grief are continually produced.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 39 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 28. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 1 🌻*

ఈ దివ్య కార్యమున నీవు పలు దేశములకు పయనించ గలవు. నీ గురువు నీకందించుచున్న ఈ ప్రణాళికను నీవుగా నిర్ణయించుకొని సమర్పించుకొనుము. నీ ప్రవర్తనమును సరిదిద్దు కొనుటకు నేటినుంచి చక్కని కృషి చేయుము.” 

ఆ వాక్యములు చాలా కాలము నా చెవులలో గుడిగంటలవలె మ్రోగుచుండేవి. వచ్చిన మహాపురుషుడు ఒక దివ్య అవకాశమును తెలిపి, అది నా ప్రవర్తనపై ఆధారపడి యున్నదని హెచ్చరించి వెళ్ళినాడు.

ప్రతి 7 సం||లకు తాను దర్శనమిత్తునని కూడ తెలిపినాడు. మా కలయిక కొన్ని నిముషములే జరిగినది. నేనేమియు మాట్లాడ లేకపోయితిని. అతని భాషణము అధికారికముగ నుండెను. ఆజ్ఞాపించుచున్నట్లు వుండెను. 

కానీ, అదే సమయమున ప్రేమ - వాత్సల్యము కూడా నన్ను స్పృశించెను. తాను తెలుపవలసినది క్లుప్తముగ తెలిపి, ప్రతిభాషణమునకు వేచియుండక, చటుక్కున నిలచి, సింహద్వారము వైపునకు సాగెను. 

ద్వారము దగ్గర నిలచి, వెనుతిరిగి, నా కన్నులలోనికి సూటిగ మెరపువలె ఒక చూపును ప్రసరించి కనుమరుగయ్యెను. ఆ చూపు నాటికిని, నేటికిని, జన్మ జన్మలకూ నన్ను వెలుగుదారిన నడిపించు కిరణము. జరిగిన సన్నివేశము మరల మరల తలచుకొంటిని.

ఒకమారు భయము కలిగినది. ఒకమారు మతిభ్రమించినదేమోయని దిగులు కలిగినది. ఒకమారు అమితోత్సాహము కలిగినది. ఆ సన్నివేశమును తలచుకొనునపుడల్లా హృదయము పులకించినది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. ప్రథమం కోసం అన్వేషణ 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

ఎలాంటి ఆశలు, అవసరాలు లేకుండా, పూర్తి సంతృప్తితో చాలా హాయిగా, సౌకర్యంగా జీవిస్తున్న ప్రపంచం నుంచి మరో ప్రపంచంలోకి గెంటివేయబడిన శిశువుకు అది మృత్యుసమానమైన అనుభవమే. అది వాడికే తెలుస్తుంది. కాబట్టి, వాడిలా ఆలోచిస్తేనే అది సత్యమని మీకు తెలుస్తుంది.

ఎందుకంటే, పూర్తి రక్షణతో కూడిన అత్యంత సౌకర్యవంతమైన ప్రపంచాన్ని వాడు కోల్పోయాడు. చివరికి శాస్తజ్ఞ్రులు కూడా మాతృగర్భం లాంటి మరొక ప్రపంచాన్ని సృష్టించలేమని ఒప్పుకున్నారు. 

కానీ, మనిషి తాను కోల్పోయిన మాతృగర్భానికి సమానమైన గృహాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేశాడు. నీటి పరుపులు, వేడి నీళ్ళ స్నానపు తొట్టెలు ఆ ప్రయత్నంలో భాగాలే. తెలివైనవాడు ఆ స్నానపుతొట్టెలలో ఉప్పుకూడా కలుపుతాడు. ఎందుకంటే, తల్లిగర్భంలో అలాగే ఉంటుంది. సముద్రపు నీటిలోని ఉప్పు సాంద్రత కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. 

కానీ, అలా సృష్టించుకున్న ఆ స్నానపు తొట్టెల్లో మీరు ఎంత కాలముండగలరు? తల్లి గర్భంలో ఉన్నట్లుగా మీరు వాటిలో కచ్చితంగా తొమ్మిది నెలలు ఉండలేరు.
సిగ్మండ్ ఫ్రాయిడ్ జ్ఞానోదయం పొందినవాడు కాదు. కానీ, నిజానికి, అతడు కాస్త కోకిల లాంటివాడు. కోకిలలు అప్పుడప్పుడు చక్కగా కూస్తాయి కదా! అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా అప్పుడప్పుడు చక్కని భావాలు చెప్పేవాడు. 

‘‘పురుషుడు సంగమించడం కేవలం మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించేందుకే’’ అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది చాలా లోతైన భావన. పైకి అది పిచ్చిగా అనిపించినా, అందులో సత్యముంది. కేవలం, సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి పిచ్చివాడే దానిని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకుంటాడు. పురుషుడు ఏ మార్గంనుంచి వచ్చాడో ఆ మార్గం నుంచే గర్భాన్వేషణ ప్రారంభిస్తాడు. అయినా అతడు గర్భాన్ని చేరుకోలేడన్నది వాస్తవం. 

అందుకే పురుషుడు గుహలు తవ్వడం, ఇళ్ళు కట్టడం, విమానాలు చెయ్యడం ప్రారంభించాడు. త్వరలో ఏదో ఒకరోజు విమానాలలో కూడా అందరూ ఉప్పుకలిపిన వేడి నీళ్ళ తొట్టెల్లో తేలినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఎందుకంటే, అవి మీకు తల్లి గర్భంలో ఉన్న అనుభూతిని అందిస్తాయి. మీట నొక్కగానే ‘‘విమాన పరిచారిక (ఎయిర్ హోస్టెస్)’’ వచ్చి మీకు కావలసినవి చేస్తుంది. అయినా మీకు తృప్తి లభించదు.

శిశువుకు తల్లిగర్భంలో సుఖంగా ఉండడం కన్నా ఏమీ తెలియదు. బయటపడ్డ శిశువుకు ఎన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటుచేసినా అవి తల్లి గర్భంలో ఉన్న సుఖానుభూతికి సమానం కావు. ఎందుకంటే, మీట నొక్కే అవసరం లేకుండానే తల్లి గర్భంలో మీకు కావలసినవన్నీ లభిస్తాయి. ఆకలి వేసేలోగానే ఆహారం మీకు అందుతుంది. అలాగే ‘గాలి కావాలి’ అనుకునే లోపే అది మీకు లభిస్తుంది. 

అక్కడ మీకు ఎలాంటి బాధ్యతలు ఉండవు. అందుకే తల్లి గర్భంనుంచి బయటకు రావడాన్ని శిశువు మరణంగా భావిస్తాడే కానీ, జననంగా ఎప్పుడూ భావించడు, భావించలేడు. బయట నుంచి చూసేవారు మాత్రమే దానిని జననమంటారు. అలా బయటపడ్డ శిశువు పెరిగి పెద్దవాడై భార్య, పిల్లలు, కుటుంబం, స్నేహితులు, సుఖంగా గడిపేందుకు ఒక చిన్న ఇల్లు, హాయిగా తిరిగేందుకు వాహనం లాంటివి సంపాదించేందుకు తన జీవితాన్ని ధారపోస్తాడు. 

అంతలోనే అకస్మాత్తుగా వాడు జీవితం నుంచి బయటపడే రోజు ముంచుకొస్తుంది. వెంటనే వైద్యుడు వస్తాడు. వాడు కూడా మీరు పుట్టగానే ఊపిరి పీల్చేందుకు మీ పిర్రపై కొట్టిన వైద్యుడు లాంటివాడే. కానీ, ఈసారి వాడు వచ్చినది మీకు ఊపిరి పోసేందుకు కాదని అందరికీ తెలుసు.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 216 / Sri Lalitha Chaitanya Vijnanam - 216 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |*
*మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖*

*🌻 216. “మహాసత్యా'' 🌻*

మహత్తరమైన సత్వము గలది శ్రీమాత అని అర్థము. 
సత్త్వ మనగా ఉనికి, వుండుట. సృష్టి స్థితిగొని వుండుటకు మూలకారణము శ్రీమాతయే. ఆమె సంకల్పించినచో మొత్తము సృష్టి తిరోధానము చెందగలదు. పురోగమనము కూడ చెందగలదు. స్థితియందుండ గలదు. సమస్త సృష్టిని తన యందు లయము చేసుకొని తానే కేవలముగ నుండగలదు. అట్టి ఉనికి మహాసత్త్వము. 

పరాప్రకృతిగ పరమ పురుషునియందు స్థితిగొని యుండుట, సంకల్ప మాత్రమున సృష్టి నిర్మాణము గావించి బ్రహ్మ నుండి చీమ వఱకు అన్నిటి యందు ఉనికిగ నుండుట కూడ చేయును. ఆమె మన యందు వుండుట వలననే మనము వున్నామని భావించుచున్నాము. 

ఆమె లేని మనము లేము - మనము లేని ఆమె యున్నది. మన మున్నామని మనకు
భ్రాంతి ఆమె మాయ నుండే కలుగుచున్నది. నిజమున కున్నది ఆమెయే. అల యందున్నది సముద్రమే కదా! సముద్రము లేక అల లేదు. కాని అలలేని సముద్ర ముండగలదు. అందుకని ఆమెయే మహాసత్త్వం మన ఉనికి రహస్యము మనకు తెలియుటయే నిజమగు జ్ఞానము. 

శ్రీమాతయే దీని ననుగ్రహించ గలదు. ఆమెను తెలిసినవాడే తెలిసినవాడు. ఆమె అనుగ్రహ పాత్రులగుటకు సాధకులు త్రిగుణములలో ప్రధానమైన సత్త్వగుణమున నిలువవలెను. శ్రీమాత సత్త్వ గుణమునకు కూడ అతీతమైనప్పటికిని ఆమెను చేరుమార్గము సత్త్వగుణమే.  

సత్త్వగుణము నిర్మలమగు నీరు వంటిది. రజస్తమో గుణములు కలతవారిన నీరు వంటివి; బురద నీరు వంటివి. సత్త్వగుణ లక్షణములు భగవద్గీతయందు 16వ అధ్యాయమున మొదటి మూడు
శ్లోకములలో తెలుపబడినవి. వానిని శ్రీమాత ఆరాధనతో జోడించి అభ్యసించినచో సాధకుడు సత్సాధకుడు కాగలడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 216 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Mahā-sattvā महा-सत्त्वा (216) 🌻*

Sattvā is one of the three guṇa-s, the other two being rajas and tamas. Out of the three, sattva guṇa is supreme. When this guṇa is dominant in a person, he cannot commit any sins either knowingly or unknowingly. She chooses these persons to shower on them Her special grace.  

Here She is referred to as an embodiment of the qualities of sattva guṇa such as understanding the reality, emitting positive energy from one’s own self, the mental and physical strength due to the positive vibrations etc. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 557 / Bhagavad-Gita - 557 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 20 🌴*

20. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని |
మామప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిమ్ ||

🌷. తాత్పర్యం : 
ఓ కొన్తేయా! అసురయోనుల యందే మరల మరల జన్మించి అట్టివారు నన్నెన్నడును పొందజాలక క్రమముగా అతి హేయమైన జన్మలకు పతనము నొందుదురు.

🌷. భాష్యము :
భగవానుడు పరమకరుణామయుడనెడి విషయము తెలిసినదే. కాని అతడు అసురస్వభావము గలవారి యెడ మాత్రము ఎన్నడును దయాస్వభావమును చూపడని ఈ శ్లోకమున మనము గాంచుచున్నాము. 

అసురస్వభావులు ప్రతిజన్మ యందును అవే అసురయోనుల యందు ఉంచబడుదురనియు, భగవానుని కరుణను పొందజాలక వారు పతనము నొందుదురనియు స్పష్టముగా తెలుపబడినది. ఆ విధముగా వారు చివరకు శునక, సూకర, మార్జాలముల వంటి హేయజన్మలను పొందుదురు. 

అట్టి దానవస్వభావులు తరువాతి జన్మలో ఎట్టి స్థితి యందును భగవత్కరుణను పొందు అవకాశమే లేదని ఇచ్చట స్పష్టముగా వివరింపబడినది. అట్టివారు క్రమముగా పతనము నొంది శునక, సూకరములుగా జన్మింతురని వేదములందు తెలుపబడినది. భగవానుడు దానవస్వభావుల యెడ దయాళువు కానిచో అతనిని దయాపూర్ణుడని ప్రకటించరాదు కదాయని ఎవరైనను వాదించు నవకాశము కలదు. 

అట్టి ప్రశ్నకు సమాధానముగా పరమపురుషుడు ఎవ్వరియెడను ద్వేషమును కలిగియుండడని వేదాంత సూత్రము లందు మనము గాంచవచ్చును. అనగా అసురస్వభావులను అతి నీచజన్మల యందు పడద్రోయుట యనునది ఆ భగవానుని కరుణకు వేరొకరూపమై యున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 557 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 20 🌴*

20. āsurīṁ yonim āpannā
mūḍhā janmani janmani
mām aprāpyaiva kaunteya
tato yānty adhamāṁ gatim

🌷 Translation : 
Attaining repeated birth amongst the species of demoniac life, O son of Kuntī, such persons can never approach Me. Gradually they sink down to the most abominable type of existence.

🌹 Purport :
It is known that God is all-merciful, but here we find that God is never merciful to the demoniac. It is clearly stated that the demoniac people, life after life, are put into the wombs of similar demons, and, not achieving the mercy of the Supreme Lord, they go down and down, so that at last they achieve bodies like those of cats, dogs and hogs. It is clearly stated that such demons have practically no chance of receiving the mercy of God at any stage of later life.

 In the Vedas also it is stated that such persons gradually sink to become dogs and hogs. It may be then argued in this connection that God should not be advertised as all-merciful if He is not merciful to such demons. In answer to this question, in the Vedānta-sūtra we find that the Supreme Lord has no hatred for anyone. 

The placing of the asuras, the demons, in the lowest status of life is simply another feature of His mercy. Sometimes the asuras are killed by the Supreme Lord, but this killing is also good for them, for in Vedic literature we find that anyone who is killed by the Supreme Lord becomes liberated. 

There are instances in history of many asuras – Rāvaṇa, Kaṁsa, Hiraṇyakaśipu – to whom the Lord appeared in various incarnations just to kill them. Therefore God’s mercy is shown to the asuras if they are fortunate enough to be killed by Him.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. ఇంద్ర కృత శ్రీ సురభి స్తోత్రం (Sri Surabhi Devi Stotram) కామధేను స్తోత్రం (Kamadhenu Stotram) 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

నమో దేవ్యై మహా దేవ్యై సురాభయైచ నమో నమః
గవాంబీజ స్వరూపాయ నమస్తే జగదంబికే ||

నమో రాధ ప్రియయైచ పద్మాంశాయై నమో నమః
నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః ||

కల్పవృక్ష స్వరూపాయై పాద్మాక్షే సర్వ సంపదామ్
శ్రీ దాయె ధన ధాయై చ బుద్ద్ధి దాయై నమో నమః ||

శుభ దాయై ప్రసన్నయై గోప్రదయై నమో నమః
యశోదాయై సౌక్యదాయై దర్మజ్ఞాయై నమో నమః ||

ఇధ స్తోత్రం మహా పుణ్యంభక్త యుక్తస్చ యః పటేత్
సాగోమాన్ ధనవాంశ్చైవ కీర్తిమాన్ పుణ్య వాన్ భవేత్ ||

నుస్నాతః సర్వ తీర్ధే షు సర్వ యగ్నేతు దీక్షితః
ఇహ లోకే సుఖం చుక్‌త్వా యాం థ్యంతేకృష్ణ మందిరం ||

సుచిరం సవసే త్తత్ర కురుతే కృష్ణ సేవనం
నపునర్చ వనంతస్య బ్రహ్మపుత్ర భవే భవేత్ ||
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భక్తిసందేశాలు
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹