నమో భగవతే దత్తాత్రేయ స్మరణ మాత్రమున సంతుష్టాయ 'Namo Bhagavathe Dattatreya' (a devotional YouTube Short)




https://youtube.com/shorts/Kg4iMWfcUyw


🌹 నమో భగవతే దత్తాత్రేయ స్మరణ మాత్రమున సంతుష్టాయ Namo Bhagavathe Dattatreya దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹


శ్రీ దత్తాత్రేయ స్తోత్రం - సర్వ కష్టాల నివారణకు - Sri Dattatreya Stotram For Removal of All Obstacles



https://youtube.com/shorts/LsjW9iImWhc


🌹 శ్రీ దత్తాత్రేయ స్తోత్రం - సర్వ కష్టాల నివారణకు - SRI DATTATREYA STOTRAM FOR ALL OBSTACLES REMOVAL 🌹

తప్పక వీక్షించండి

🍀 మార్గశీర్ష పూర్ణిమ దత్తాత్రేయ జయంతి, కోరల పూర్ణిమ. ఈ పౌర్ణమి నాడు దత్తుని పాలతో అభిషేకించి దత్త స్తోత్రం చదువుకుని, మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు. శ్రీ దత్తడుని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొందగలము. 🍀

ప్రసాద్‌ భరధ్వాజ



Like, Subscribe and Share


https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹



శ్రీ దత్తాత్రేయ స్వామి విశిష్టత - దత్త జయంతి - కోరల పౌర్ణమి విశిష్టత - విధానము Dattatreya Jayanthi - Korala Purnima Significance



https://youtu.be/dS-eUPJGPM8


🌹 శ్రీ దత్తాత్రేయ స్వామి విశిష్టత - దత్త జయంతి - దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం - కోరల పౌర్ణమి విశిష్టత - విధానము DATTATREYA JAYANTHI - KORALA PURNIMA SIGNIFICANCE 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

తప్పక వీక్షించండి



🍀 మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు కనుక ఈ పౌర్ణమిని దత్త జయంతిగా జరుపుకుంటాము. నేడు దత్తుని విశిష్టత తెలుసుకోవడం, ఆయనను స్మరించడం సాధకులకు ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో దత్తావతారం ఆరోదని భాగవత పురాణం చెబుతోంది. దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించినదే దత్తావతారం. శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింప జేయుటయే దత్తమూర్తి అవతార కార్యక్రమము. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః 🍀

ప్రసాద్‌ భరధ్వాజ



Like, Subscribe and Share
https://youtube.com/@ChaitanyaVijnaanam


🌹🌹🌹🌹🌹

శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీ అన్నపూర్ణ జయంతి, కోరల పౌర్ణమి శుభాకాంక్షలు, Greetings on Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Korala Pournami



🌹. శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీ అన్నపూర్ణ జయంతి, కోరల పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి, Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Korala Pournami Greetings to All 🌹

4 December 2025

ప్రసాద్‌ భరధ్వాజ


🍀 దత్తాత్రేయ జయంతి విశిష్టత 🍀


దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం.

దత్త జయంతి రోజున తెల్లవారు జామునే భక్తులు నదీస్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, శ్రీదత్త దర్శనం వంటివి పారాయణ చేస్తారు. దత్తుని విశిష్టతను స్మరించుకుంటారు. ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. అవధూత దత్త పీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి.


🍀 కోరల పౌర్ణమి విశిష్టత 🍀

హిందూ పురాణాల ప్రకారం, కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడట! దీని అర్థం- ఈ సమయంలో యముడు భూలోకంలోని భక్తులపై కరుణ చూపుతాడని, వారి కర్మ ఫలాలను పక్కకు నెట్టి, సకల వ్యాధులు, అనారోగ్య సమస్యలను తన కోరల శక్తితో తొలగిస్తాడని ప్రగాఢ నమ్మకం. ఈ అపమృత్యు భయాన్ని తొలగించినందుకు కృతజ్ఞతగా మార్గశిర పౌర్ణమి రోజున యమధర్మరాజును ప్రత్యేకంగా పూజిస్తారు.

కోరల పౌర్ణమి రోజున ఆచరించాల్సిన అత్యంత విశేషమైన ఆచారం ఒకటుంది. ఆ రోజున మినప రొట్టెలు (కుడుములు) తయారుచేసి, ఆ నైవేద్యాన్ని తల్లి కోరలమ్మకు సమర్పిస్తారు. ఆ తర్వాత, ఆ రొట్టెలో నుంచి ఒక చిన్న ముక్కను కొరికి, శునకాలకు వేస్తారు.శునకం సాక్షాత్తు కాలభైరవుడి వాహనం. యమధర్మరాజుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే, శునకానికి నైవేద్యం పెట్టడం ద్వారా కాలభైరవుడి అనుగ్రహం లభించి, సమస్త దరిద్రాలు, దోషాలు నివారించ బడతాయి అని అంటారు.

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹