🌹 06, AUGUST 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం , భౌమ వాసర సందేశాలు🌹

🍀🌹 06, AUGUST 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం , భౌమ వాసర సందేశాలు🌹🍀
1) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 959 / Vishnu Sahasranama Contemplation - 959 🌹
🌻 959. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam 🌻
4) 🌹 సిద్దేశ్వరయానం - 117 🌹
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 13 🏵
5) 🌹. శివ సూత్రములు - 273 / Siva Sutras - 273 🌹
🌻 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 3 / 3 - 45. bhūyah syāt pratimīlanam - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 959 / Vishnu Sahasranama Contemplation - 959 🌹*

*🌻 959. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam 🌻*

*ఓం ప్రమాణాయ నమః | ॐ प्रमाणाय नमः | OM Pramāṇāya namaḥ*

*స్వయం ప్రమా ప్రమితిస్సంవిత్ప్రమాణమితీర్యతే ।*
*శ్రీచక్రపాణిః ప్రజ్ఞానం బ్రహ్మేతి శ్రుతివాక్యతః ॥*

*ఏది కలదో అదియే ఉత్తమమగు జ్ఞానము. అదియే స్వతఃసిద్ధమగు యథార్థానుభవాత్మక జ్ఞానము. దానినే ఇచట 'ప్రమాణమ్‍' అనగా ప్రకృష్టమయిన జ్ఞానము అను శబ్దముచే చెప్పియున్నారు. ఈ విషయమున 'ప్రజ్ఞానం బ్రహ్మ' (ఐత్తరేయ ఉపనిషత్ 3.5.3) - 'ప్రకృష్టమయిన జ్ఞానమే బ్రహ్మతత్త్వము' అను శ్రుతి ప్రమాణము.*

:: విష్ణు పురాణే ప్రథమాంశే ద్వితీయోఽధ్యాయః ::
జ్ఞానస్వరూపమత్యన్త నిర్మలం పరమార్థతః ।
తమేవార్థస్వరూపేణ భ్రాన్తిదర్శనతః స్థితమ్ ॥ 6 ॥

*పరమార్థమున వస్తుస్థితిలో జ్ఞానమాత్ర స్వరూపుడును, అత్యంత నిర్మలుడును, భ్రాంతి జ్ఞానముచే అవిద్యావశమున పదార్థ స్వరూపముననున్నవాడును అగు ఆ పరమాత్ముని నమస్కరించెదను.*

428. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 959🌹*

*🌻959. Pramāṇam🌻*

*OM Pramāṇāya namaḥ*

स्वयं प्रमा प्रमितिस्संवित्प्रमाणमितीर्यते ।
श्रीचक्रपाणिः प्रज्ञानं ब्रह्मेति श्रुतिवाक्यतः ॥

*Svayaṃ pramā pramitissaṃvitpramāṇamitīryate,*
*Śrīcakrapāṇiḥ prajñānaṃ brahmeti śrutivākyataḥ.*

*Pramiti is samvit or knowledge and is self-effulgent and self-certifying. It is Pramāṇam or authority vide 'प्रज्ञानं ब्रह्म / Prajñānaṃ brahma' (Aittareya upaniṣat 3.5.3) - "Wisdom is Brahman."*

:: विष्णु पुराणे प्रथमांशे द्वितीयोऽध्यायः ::
ज्ञानस्वरूपमत्यन्त निर्मलं परमार्थतः ।
तमेवार्थस्वरूपेण भ्रान्तिदर्शनतः स्थितम् ॥ ६ ॥

Viṣṇu Purāṇa - Part 1, Chapter 2
Jñānasvarūpamatyanta nirmalaṃ paramārthataḥ,
Tamevārthasvarūpeṇa bhrāntidarśanataḥ sthitam. 6.

*In reality, the nature of knowledge is unblemished. By illusory sight, it takes forms of various objects.*

428. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥
Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr‌t prāṇajīvanaḥ,Tattvaṃ tattvavidekātmā janmamr‌tyujarātigaḥ ॥ 103 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 సిద్దేశ్వరయానం - 117 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 13 🏵*

*కొద్ది కాలం క్రింద మదరాసులో ఒక ప్రముఖుని ఇంటిలో పాదపూజ జరిగింది. మౌనస్వామి నామావళితో పీఠపాదుకలకు ఆగమోక్త విధానంలో అర్చన చేయటం జరిగింది. ఆ సమయంలో పూజ చేసే దంపతులు నా పాదములను కడిగి ఆనీరు శిరస్సుపై చిలకరించుకొని ఆ నీటి పళ్ళాన్ని ప్రక్కన పెట్టారు. పూజ పూర్తయిన తరువాత నేను మరొక గదిలోకి విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళాను. ఆ సమయంలో 'రేకీ' మార్గంలో సాధన చేసిన అతని మిత్రుడు యాదృచ్చికంగా వచ్చాడు. ఈ హడావుడి అంతా చూసి అడిగి విషయం తెలుకుకొన్నాడు.*

"నీవు చదువుకొన్న వాడవు, వివేకమున్నవాడవు. దేవాలయానికి వెళ్ళటం దేవునికి పూజచేయటం అంటే నేను అర్థం చేసుకోగలను కానీ, మనుష్యులకు పూజ చేయటం ఏమిటి ? వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్ళు నెత్తిన చల్లుకోవటం ఏమిటి? ఈ పద్ధతులు, ఈ ఆచారాలు అర్థం లేనివి" అని అతడు ఆక్షేపించాడు. మాట్లాడుతూ జేబులో ఉన్న ఏదో ఒక వస్తువు తీయటం కోసం దానిలో పైన ఉన్న వస్తువు ఒకటి చేతిలో పట్టుకొన్నాడు. అది స్ఫటికంతో చేసిన ఒక పరికరం. ఒక వస్తువులో కాని, మనిషిలో కాని ఉన్న దివ్యశక్తిని కొలిచే సాధనం. అది అతడు చేతిలో పట్టుకోగానే తీగకు వ్రేళాడుతున్న ఆ స్పటికం కాళ్ళు కడిగిన నీళ్ళున్న పళ్ళెం వైపు కదలటం మొదలు పెట్టింది. అతడికి ఆశ్చర్యం కలిగి ఆ పరికరాన్ని కొంచెం దగ్గరికి తీసుకువెళ్ళాడు. అదివర్తులాకారంలో గిరగిర తిరగటం మొదలు పెట్టింది.*

*“ఈ నీళ్ళలో ఏదో దివ్యశక్తి ప్రవేశించింది. ఆ చిహ్నాలను ఈ పరికరం చూపిస్తున్నది. స్వాముల వారి కాళ్ళు కడిగిన నీళ్ళలో ఇంత అద్భుత శక్తి ఉండటం విచిత్రంగా ఉన్నది" అన్నాడు అతడు. ఆ నీళ్ళలో అపూర్వమైన దైవచైతన్యమున్నట్లు గృహస్థు గ్రహించి ఒక గిన్నెలో ఆ నీళ్ళు పోసి ఫ్రిజ్లో పెట్టుకొని రోజూ తాను తన కుటుంబసభ్యులు శిరస్సున చల్లుకొంటున్నారు. అతడు కుర్తాళంలో ఉత్సవాలు జరిగినపుడు వచ్చి ఒక సమావేశంలో ఈ విషయాన్ని తెలియచేశాడు. భక్తులు సాధకులు అప్పుడప్పుడు ఇటువంటి అనుభవము లెన్నింటినో తెలియ చేస్తున్నారు.*

*నేను మొదటిసారి చాతుర్మాస్యం కుర్తాళంలో చేస్తున్నపుడు వచ్చిన భక్తులు ఇక్కడ కొంతకాలం మీతో పాటు ఉంటూ సాధన చేసుకొంటాము. అందరూ కలసి చేసే యజ్ఞమేదైన నిర్దేశించండి అన్నారు. “సర్వదేవతామంత్రముల సిద్ధికి కారకమైనది- గురుకృప - ఇక్కడ దత్తస్వరూపుడైన మౌనస్వామి గురువు. కనుక గురుమంత్రంతో యజ్ఞం చేయండి అన్నాను. యజ్ఞం ప్రారంభించి హోమాగ్నిలో ఆవాహన చేయంగానే మౌనస్వామి యొక్క అవతరణాన్ని మొదటిసారి గమనించిన వారు రామకృష్ణానంద భారతీస్వామి. “అడుగో! మౌనస్వామి వచ్చాడు. హోమకుండంలో నాకు కన్పిస్తున్నాడు” అన్నాడు ఆయన. అందరూ ఎంతో భక్తి ప్రపత్తులతో చేసిన ఆ గురు యజ్ఞం సిద్ధగురు కరుణను అందరిమీద ప్రసరింపచేసింది. యజ్ఞసమయంలో ప్రతిరోజూ పగలు యజ్ఞం రాత్రి పూట ధ్యానం జరుగుతూండటం కుర్తాళంలో అలవాటుగా మారిపోయింది. ఒకనాటి అర్థనిశా సమయంలో ధ్యానం చేస్తున్న వారిలో ఉన్న ఒక సన్యాసిని ఉన్నట్లుండి కిందపడిపోయింది. ఎవరూ గమనించలేదు.ఆమెకు స్పృహ తప్పిపోయే స్థితి వచ్చింది. నెమ్మదిగా పాకుతూ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నది. ఒక్క క్షణం ఆమె వైపు చూచాను. ఒక భయంకరమైన పెద్ద కుక్క ఆమె గొంతు పట్టుకు కొరుకుతున్న దృశ్యం కన్పిస్తున్నది. నేను తీక్షణంగా చూడగానే ఆ కుక్క ఆమెను వదలి వెనక్కు వెళ్ళిపోయింది. చాలా కాలం క్రింద ఆమెను ప్రేమించిన ఒక యువకుడు ఆమె తిరస్కరించగా కోపం ద్వేషంగా మారి ఒక క్షుద్రమాంత్రికుని పట్టుకొని ప్రయోగం చేయించాడు. అది కాలభైరవ ప్రయోగం. ఆ ప్రయోగ పిశాచం శునక రూపంలో ఆమెను పీడిస్తున్నది. ఆ ప్రయోగ బాధా నివారణకు కావలసిన జప హోమములు చేయించి మౌనస్వామి అనుగ్రహం వల్ల ఆమెకు స్వస్థత చేకూర్చటం జరిగింది.*
 
*ఈ విధంగా ఇవాళ ఎందరో ఇక్కడకు వచ్చి, మౌనస్వామి అనుగ్రహం వల్ల తమ బాధల నుండి విముక్తులవుతున్నారు. తనకు సేవచేసిన ఒక వ్యక్తి ఇప్పుడొక తమిళునిగా జన్మించాడని, అతని పేరు చెప్పి అతడు వచ్చినపుడు మంత్రోపదేశం చేసి మంత్రసిద్ధి వేగంగా కలిగేలా ఆశీర్వదించమని చెప్పారు. ఆ తరువాత కొద్దిరోజులకే అతడు రావటం అతనికి చేయవలసిన ఉపదేశం చేయటం జరిగింది. దాని ఫలితంగా అతను తీవ్రసాధన చేసి ఎన్నో దివ్యానుభవాలను పొందుతున్నాడు. సిద్ధశరీరంతో మౌనస్వామి చేస్తున్న పనులు అసామాన్యమైనవి. ఆయన భౌతిక శరీరంతో ఉండగా తన పూర్వ పరజన్మల గురించి ఎవరితోనూ చెప్పినట్లు దాఖలాలు లేవు. నా మీద అభిమానం వల్ల, అనుగ్రహం వల్ల ఆయన సమాధి ముందు కూర్చొని ధ్యానం చేసినపుడు ఆయా విశేషాలను ఎన్నింటినో తెలియచేయటం వల్ల వాటిని ఉల్లేఖించే అవకాశం కలిగింది. వీటితో పాటు అక్కడకు అప్పుడప్పుడు వస్తున్న సిద్ధులు తోటలోని అయ్యప్ప గుడి దగ్గర కన్పిస్తున్న మళయాళ మాంత్రికుడు ఆశ్రమంలో అశరీరి అయి తిరుగుతున్న తంజావూరుస్వామి, వస్తూ పోతూ ఉన్న మహావతార్ బాబా, భాస్కరాచార్యుల వంటి మహనీయులు తెలిపిన విశేషాలెన్నో ఈ చరిత్ర కథనంలో చోటుచేసుకొన్నవి.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 273 / Siva Sutras - 273 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 3 🌻*

*🌴. చైతన్యం యొక్క ప్రకాశం వల్ల పరిమిత జీవి కరిగి పోవడంతో, స్వచ్ఛమైన స్వయం తిరిగి దాని అసలైన స్వచ్ఛమైన స్థితికి తిరిగి వస్తుంది. 🌴*

*విశ్వ వ్యవస్థ వెనక వున్న దైవం మానవ మనస్సులకు అర్థంకానిది కాబట్టి, మనం ఆయనను అతను, ఆమె లేదా అది అని పిలుస్తాము మరియు ఈ విధంగా మనకు భగవంతుని అనేక రూపాలు ఉన్నాయి. నిజమైన యోగి ఈ అజ్ఞానాన్ని అధిగమించి, ఈ అతీత భావనను పూర్తిగా అర్థం చేసుకుంటాడు. అతనికి దాని గురించి పూర్తిగా తెలుసు మరియు అతను ఎల్లప్పుడూ దానితో ఉండటానికి తన మనస్సును మెరుగుపర్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. నిజమైన యోగి అన్ని వేళలా దానితోనే జీవిస్తాడు. అతను అంతర్గతంగా లేదా బాహ్యంగా చూసినా, అది ప్రతిచోటా వ్యాపించి ఉందని అతను అర్థం చేసుకుంటాడు. అది ఒకే ప్రదేశంలో ఉండి పోతే, విశ్వం యొక్క వినాశనం జరుగుతుంది. పవిత్ర గ్రంథాలు ఈ దృగ్విషయాన్ని విపులంగా చర్చిస్తాయి మరియు భగవంతుడు మానవ గ్రహణశక్తికి అతీతుడు అని నిర్ధారించాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 273 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 3 - 45. bhūyah syāt pratimīlanam - 3 🌻*

*🌴. With the illumination of the consciousness and dissolution of the beingness, the pure-self reverts to its original, pure state again. 🌴*

*Since That is incomprehensible for human minds, we call Him as He, She or That and this is how we have so many forms of Lord. A true yogi overcomes this ignorance and fully understands this concept. He is fully aware of That and the he makes, all out efforts, to refine his mind to be with That always. A true yogi lives with That all the time. Whether he looks internally or externally, he understands that That pervades everywhere. If That does not exist in a single location, the annihilation of the universe happens. Sacred scriptures elaborately discuss this phenomenon and conclude that the Lord is beyond human perception.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

శివ సూత్రములు - 273 : 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 3 / Siva Sutras - 273 : 3 - 45. bhuyah syat pratimilanam - 3


🌹. శివ సూత్రములు - 273 / Siva Sutras - 273 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 3 🌻

🌴. చైతన్యం యొక్క ప్రకాశం వల్ల పరిమిత జీవి కరిగి పోవడంతో, స్వచ్ఛమైన స్వయం తిరిగి దాని అసలైన స్వచ్ఛమైన స్థితికి తిరిగి వస్తుంది. 🌴

విశ్వ వ్యవస్థ వెనక వున్న దైవం మానవ మనస్సులకు అర్థంకానిది కాబట్టి, మనం ఆయనను అతను, ఆమె లేదా అది అని పిలుస్తాము మరియు ఈ విధంగా మనకు భగవంతుని అనేక రూపాలు ఉన్నాయి. నిజమైన యోగి ఈ అజ్ఞానాన్ని అధిగమించి, ఈ అతీత భావనను పూర్తిగా అర్థం చేసుకుంటాడు. అతనికి దాని గురించి పూర్తిగా తెలుసు మరియు అతను ఎల్లప్పుడూ దానితో ఉండటానికి తన మనస్సును మెరుగుపర్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. నిజమైన యోగి అన్ని వేళలా దానితోనే జీవిస్తాడు. అతను అంతర్గతంగా లేదా బాహ్యంగా చూసినా, అది ప్రతిచోటా వ్యాపించి ఉందని అతను అర్థం చేసుకుంటాడు. అది ఒకే ప్రదేశంలో ఉండి పోతే, విశ్వం యొక్క వినాశనం జరుగుతుంది. పవిత్ర గ్రంథాలు ఈ దృగ్విషయాన్ని విపులంగా చర్చిస్తాయి మరియు భగవంతుడు మానవ గ్రహణశక్తికి అతీతుడు అని నిర్ధారించాయి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 273 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3 - 45. bhūyah syāt pratimīlanam - 3 🌻

🌴. With the illumination of the consciousness and dissolution of the beingness, the pure-self reverts to its original, pure state again. 🌴


Since That is incomprehensible for human minds, we call Him as He, She or That and this is how we have so many forms of Lord. A true yogi overcomes this ignorance and fully understands this concept. He is fully aware of That and the he makes, all out efforts, to refine his mind to be with That always. A true yogi lives with That all the time. Whether he looks internally or externally, he understands that That pervades everywhere. If That does not exist in a single location, the annihilation of the universe happens. Sacred scriptures elaborately discuss this phenomenon and conclude that the Lord is beyond human perception.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 117 Siddeshwarayanam - 117

🌹 సిద్దేశ్వరయానం - 117 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 13 🏵


కొద్ది కాలం క్రింద మదరాసులో ఒక ప్రముఖుని ఇంటిలో పాదపూజ జరిగింది. మౌనస్వామి నామావళితో పీఠపాదుకలకు ఆగమోక్త విధానంలో అర్చన చేయటం జరిగింది. ఆ సమయంలో పూజ చేసే దంపతులు నా పాదములను కడిగి ఆనీరు శిరస్సుపై చిలకరించుకొని ఆ నీటి పళ్ళాన్ని ప్రక్కన పెట్టారు. పూజ పూర్తయిన తరువాత నేను మరొక గదిలోకి విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళాను. ఆ సమయంలో 'రేకీ' మార్గంలో సాధన చేసిన అతని మిత్రుడు యాదృచ్చికంగా వచ్చాడు. ఈ హడావుడి అంతా చూసి అడిగి విషయం తెలుకుకొన్నాడు.

"నీవు చదువుకొన్న వాడవు, వివేకమున్నవాడవు. దేవాలయానికి వెళ్ళటం దేవునికి పూజచేయటం అంటే నేను అర్థం చేసుకోగలను కానీ, మనుష్యులకు పూజ చేయటం ఏమిటి ? వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్ళు నెత్తిన చల్లుకోవటం ఏమిటి? ఈ పద్ధతులు, ఈ ఆచారాలు అర్థం లేనివి" అని అతడు ఆక్షేపించాడు. మాట్లాడుతూ జేబులో ఉన్న ఏదో ఒక వస్తువు తీయటం కోసం దానిలో పైన ఉన్న వస్తువు ఒకటి చేతిలో పట్టుకొన్నాడు. అది స్ఫటికంతో చేసిన ఒక పరికరం. ఒక వస్తువులో కాని, మనిషిలో కాని ఉన్న దివ్యశక్తిని కొలిచే సాధనం. అది అతడు చేతిలో పట్టుకోగానే తీగకు వ్రేళాడుతున్న ఆ స్పటికం కాళ్ళు కడిగిన నీళ్ళున్న పళ్ళెం వైపు కదలటం మొదలు పెట్టింది. అతడికి ఆశ్చర్యం కలిగి ఆ పరికరాన్ని కొంచెం దగ్గరికి తీసుకువెళ్ళాడు. అదివర్తులాకారంలో గిరగిర తిరగటం మొదలు పెట్టింది.

“ఈ నీళ్ళలో ఏదో దివ్యశక్తి ప్రవేశించింది. ఆ చిహ్నాలను ఈ పరికరం చూపిస్తున్నది. స్వాముల వారి కాళ్ళు కడిగిన నీళ్ళలో ఇంత అద్భుత శక్తి ఉండటం విచిత్రంగా ఉన్నది" అన్నాడు అతడు. ఆ నీళ్ళలో అపూర్వమైన దైవచైతన్యమున్నట్లు గృహస్థు గ్రహించి ఒక గిన్నెలో ఆ నీళ్ళు పోసి ఫ్రిజ్లో పెట్టుకొని రోజూ తాను తన కుటుంబసభ్యులు శిరస్సున చల్లుకొంటున్నారు. అతడు కుర్తాళంలో ఉత్సవాలు జరిగినపుడు వచ్చి ఒక సమావేశంలో ఈ విషయాన్ని తెలియచేశాడు. భక్తులు సాధకులు అప్పుడప్పుడు ఇటువంటి అనుభవము లెన్నింటినో తెలియ చేస్తున్నారు.

నేను మొదటిసారి చాతుర్మాస్యం కుర్తాళంలో చేస్తున్నపుడు వచ్చిన భక్తులు ఇక్కడ కొంతకాలం మీతో పాటు ఉంటూ సాధన చేసుకొంటాము. అందరూ కలసి చేసే యజ్ఞమేదైన నిర్దేశించండి అన్నారు. “సర్వదేవతామంత్రముల సిద్ధికి కారకమైనది- గురుకృప - ఇక్కడ దత్తస్వరూపుడైన మౌనస్వామి గురువు. కనుక గురుమంత్రంతో యజ్ఞం చేయండి అన్నాను. యజ్ఞం ప్రారంభించి హోమాగ్నిలో ఆవాహన చేయంగానే మౌనస్వామి యొక్క అవతరణాన్ని మొదటిసారి గమనించిన వారు రామకృష్ణానంద భారతీస్వామి. “అడుగో! మౌనస్వామి వచ్చాడు. హోమకుండంలో నాకు కన్పిస్తున్నాడు” అన్నాడు ఆయన. అందరూ ఎంతో భక్తి ప్రపత్తులతో చేసిన ఆ గురు యజ్ఞం సిద్ధగురు కరుణను అందరిమీద ప్రసరింపచేసింది. యజ్ఞసమయంలో ప్రతిరోజూ పగలు యజ్ఞం రాత్రి పూట ధ్యానం జరుగుతూండటం కుర్తాళంలో అలవాటుగా మారిపోయింది. ఒకనాటి అర్థనిశా సమయంలో ధ్యానం చేస్తున్న వారిలో ఉన్న ఒక సన్యాసిని ఉన్నట్లుండి కిందపడిపోయింది. ఎవరూ గమనించలేదు.ఆమెకు స్పృహ తప్పిపోయే స్థితి వచ్చింది. నెమ్మదిగా పాకుతూ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నది. ఒక్క క్షణం ఆమె వైపు చూచాను. ఒక భయంకరమైన పెద్ద కుక్క ఆమె గొంతు పట్టుకు కొరుకుతున్న దృశ్యం కన్పిస్తున్నది. నేను తీక్షణంగా చూడగానే ఆ కుక్క ఆమెను వదలి వెనక్కు వెళ్ళిపోయింది. చాలా కాలం క్రింద ఆమెను ప్రేమించిన ఒక యువకుడు ఆమె తిరస్కరించగా కోపం ద్వేషంగా మారి ఒక క్షుద్రమాంత్రికుని పట్టుకొని ప్రయోగం చేయించాడు. అది కాలభైరవ ప్రయోగం. ఆ ప్రయోగ పిశాచం శునక రూపంలో ఆమెను పీడిస్తున్నది. ఆ ప్రయోగ బాధా నివారణకు కావలసిన జప హోమములు చేయించి మౌనస్వామి అనుగ్రహం వల్ల ఆమెకు స్వస్థత చేకూర్చటం జరిగింది.

ఈ విధంగా ఇవాళ ఎందరో ఇక్కడకు వచ్చి, మౌనస్వామి అనుగ్రహం వల్ల తమ బాధల నుండి విముక్తులవుతున్నారు. తనకు సేవచేసిన ఒక వ్యక్తి ఇప్పుడొక తమిళునిగా జన్మించాడని, అతని పేరు చెప్పి అతడు వచ్చినపుడు మంత్రోపదేశం చేసి మంత్రసిద్ధి వేగంగా కలిగేలా ఆశీర్వదించమని చెప్పారు. ఆ తరువాత కొద్దిరోజులకే అతడు రావటం అతనికి చేయవలసిన ఉపదేశం చేయటం జరిగింది. దాని ఫలితంగా అతను తీవ్రసాధన చేసి ఎన్నో దివ్యానుభవాలను పొందుతున్నాడు. సిద్ధశరీరంతో మౌనస్వామి చేస్తున్న పనులు అసామాన్యమైనవి. ఆయన భౌతిక శరీరంతో ఉండగా తన పూర్వ పరజన్మల గురించి ఎవరితోనూ చెప్పినట్లు దాఖలాలు లేవు. నా మీద అభిమానం వల్ల, అనుగ్రహం వల్ల ఆయన సమాధి ముందు కూర్చొని ధ్యానం చేసినపుడు ఆయా విశేషాలను ఎన్నింటినో తెలియచేయటం వల్ల వాటిని ఉల్లేఖించే అవకాశం కలిగింది. వీటితో పాటు అక్కడకు అప్పుడప్పుడు వస్తున్న సిద్ధులు తోటలోని అయ్యప్ప గుడి దగ్గర కన్పిస్తున్న మళయాళ మాంత్రికుడు ఆశ్రమంలో అశరీరి అయి తిరుగుతున్న తంజావూరుస్వామి, వస్తూ పోతూ ఉన్న మహావతార్ బాబా, భాస్కరాచార్యుల వంటి మహనీయులు తెలిపిన విశేషాలెన్నో ఈ చరిత్ర కథనంలో చోటుచేసుకొన్నవి.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 959 / Vishnu Sahasranama Contemplation - 959


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 959 / Vishnu Sahasranama Contemplation - 959 🌹

🌻 959. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam 🌻

ఓం ప్రమాణాయ నమః | ॐ प्रमाणाय नमः | OM Pramāṇāya namaḥ

స్వయం ప్రమా ప్రమితిస్సంవిత్ప్రమాణమితీర్యతే ।
శ్రీచక్రపాణిః ప్రజ్ఞానం బ్రహ్మేతి శ్రుతివాక్యతః ॥

ఏది కలదో అదియే ఉత్తమమగు జ్ఞానము. అదియే స్వతఃసిద్ధమగు యథార్థానుభవాత్మక జ్ఞానము. దానినే ఇచట 'ప్రమాణమ్‍' అనగా ప్రకృష్టమయిన జ్ఞానము అను శబ్దముచే చెప్పియున్నారు. ఈ విషయమున 'ప్రజ్ఞానం బ్రహ్మ' (ఐత్తరేయ ఉపనిషత్ 3.5.3) - 'ప్రకృష్టమయిన జ్ఞానమే బ్రహ్మతత్త్వము' అను శ్రుతి ప్రమాణము.


:: విష్ణు పురాణే ప్రథమాంశే ద్వితీయోఽధ్యాయః ::

జ్ఞానస్వరూపమత్యన్త నిర్మలం పరమార్థతః ।
తమేవార్థస్వరూపేణ భ్రాన్తిదర్శనతః స్థితమ్ ॥ 6 ॥

పరమార్థమున వస్తుస్థితిలో జ్ఞానమాత్ర స్వరూపుడును, అత్యంత నిర్మలుడును, భ్రాంతి జ్ఞానముచే అవిద్యావశమున పదార్థ స్వరూపముననున్నవాడును అగు ఆ పరమాత్ముని నమస్కరించెదను.


428. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 959🌹

🌻959. Pramāṇam🌻

OM Pramāṇāya namaḥ


स्वयं प्रमा प्रमितिस्संवित्प्रमाणमितीर्यते ।
श्रीचक्रपाणिः प्रज्ञानं ब्रह्मेति श्रुतिवाक्यतः ॥

Svayaṃ pramā pramitissaṃvitpramāṇamitīryate,
Śrīcakrapāṇiḥ prajñānaṃ brahmeti śrutivākyataḥ.


Pramiti is samvit or knowledge and is self-effulgent and self-certifying. It is Pramāṇam or authority vide 'प्रज्ञानं ब्रह्म / Prajñānaṃ brahma' (Aittareya upaniṣat 3.5.3) - "Wisdom is Brahman."


:: विष्णु पुराणे प्रथमांशे द्वितीयोऽध्यायः ::

ज्ञानस्वरूपमत्यन्त निर्मलं परमार्थतः ।
तमेवार्थस्वरूपेण भ्रान्तिदर्शनतः स्थितम् ॥ ६ ॥


Viṣṇu Purāṇa - Part 1, Chapter 2

Jñānasvarūpamatyanta nirmalaṃ paramārthataḥ,
Tamevārthasvarūpeṇa bhrāntidarśanataḥ sthitam. 6.


In reality, the nature of knowledge is unblemished. By illusory sight, it takes forms of various objects.

428. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।
तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr‌t prāṇajīvanaḥ,
Tattvaṃ tattvavidekātmā janmamr‌tyujarātigaḥ ॥ 103 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹