శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 313-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 313-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 313-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 313-1🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀

🌻 313-1. 'రమా' 🌻

రమ అనగా శ్రీ- వాణి అని అర్థము. లక్ష్మీ సరస్వతి తత్త్వముల కలయికను రమ తత్త్వముగ సంహితలు తెలుపుచున్నవి. లక్ష్మి అనగా సృష్టి సంపద. సరస్వతి అనగా వాక్ సంపద లేక విద్యా సంపద. ఎక్కడ విద్య వుండునో అక్కడ లక్ష్మి వుండుట అరుదు. ఎక్కడ లక్ష్మి యుండునో అక్కడ సరస్వతి యుండుట కూడ అరుదే. అందు వలన లక్ష్మీ సరస్వతులను అత్తా కోడళ్ళుగ పురాణములు పేర్కొను చుండును.

అమిత ధనవంతులలో విద్యావంతులు అరుదు. అమిత విద్యావంతులలో ధనవంతులు అరుదు. ఇది లోక విదితము. ధన సంపాదనకు విద్యతో సంబంధము లేదు. లోక జ్ఞానమున్న చాలును. లోక జ్ఞానము కలవారు ధనవంతులు కాగలరు. విద్య మేధస్సునకు సంబంధించినది. మేధాబలమునకు అధిష్టాన దేవత సరస్వతి. విద్య యందు రతిగొనువారికి సంపద యందు మోజు ఉండదు. సంపద యందు మోజు గలవారికి విద్యయందు ఆసక్తి యుండదు. సంపద, విద్య ఒకచోట వుండుట వైభవము. ఈ వైభవము శ్రీదేవి అనుగ్రహము. యోగుల యందు కూడ భోగము గలవారు గలరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 313-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻

🌻 313. Ramā रमा (313)-1 🌻

Ramā means Lakṣmī, (consort of Viṣṇu) the goddess of wealth. She is in the form of Lakṣmī and bestows wealth on Her devotees. The wealth indicates both materialistic wealth and spiritual wealth. Nāma-s 313, 314 and 315 together form kāmakalā bīja ‘ īm‌ ’ (ईँ). This nāma gives the alphabet ‘Ī’ (ई).

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

16 Oct 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 80

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 80 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనిషి బయటి నించీ చూస్తే అత్యల్పుడు. చిన్ని ధూళి కణం. కానీ లోపలి నించి చూస్తే, అతని కేంద్రం నించీ చూస్తే అతను సమస్త విశ్వం. మనుషుల్ని బుద్దుల ద్వారా, కృష్ణుల ద్వారా, అర్థం చేసుకోవాలి. ధ్యానం ద్వారా అర్థం చేసుకోవాలి. 🍀

మనిషి అశాశ్వతంగా కనిపిస్తాడు. ఎంతో అత్యల్పంగా, ఒక మంచు బిందువులా అనిపిస్తాడు. కానీ సమస్త సముద్రాలు అతనిలో నిక్షిప్తమయి వున్నాయి. అన్ని ఆకాశాలు అతనిలో లీనమయి వున్నాయి. బయటి నించీ చూస్తే అతను అత్యల్పుడు. చిన్ని ధూళి కణం. ధూళిలో ధూళి. అంతే. కానీ లోపలి నించి చూస్తే, అతని కేంద్రం నించీ చూస్తే అతను సమస్త విశ్వం. సైన్సుని, మతానికి వున్న తేడా అది.

సైన్సు మనిషిని బాహ్యం నించీ చూస్తుంది. ఆధ్యాత్మికంగా చూడదు. దైవత్వాన్ని చూడదు. కేవలం భౌతికంగా, రసాయనికంగా, శారీరకంగా యింకో జంతువుని చూసినట్లు చూస్తుంది. అందుకనే సైంటిస్టులు ఎంత సేపు మనిషిని అర్థం చేసుకోవడానికి యితర జంతువుల్ని పరిశోధిస్తారు. జంతువులు సామాన్యమైనవి. సులభంగా వాటిని లొంగదీసుకోవచ్చు. అందుకని సైంటిస్టులు వాటిపై పరిశోధనలు చేస్తారు. వాటిని బట్టి వచ్చిన నిర్ణయాల్ని మానవజీవికి అంటగడతారు. సైంటిస్టులు మనుషుల్ని ఎలుకల స్థాయికి దిగజార్చారు. మనిషిని కుక్కల ద్వారా, ఎలుకల ద్వారా అంచనా వేస్తున్నారు.

మనుషుల్ని బుద్దుల ద్వారా, కృష్ణుల ద్వారా, అర్థం చేసుకోవాలి. ఇది ప్రాథమిక విషయంగా అవగాహన చేసుకోవాలి. ఉన్నతమైన దానిని అల్పమైన దాని ద్వారా అర్థం చేసుకోకుడదు. ఉన్నతమైన దాని ద్వారా అల్పస్థాయి లోనిది అర్థం చేసుకోవచ్చు కానీ అల్పమైన దాని ద్వారా ఉన్నతమైన దానిని అర్థం చేసుకోవటం కుదరదు. మనిషిని బయటి నించీ అర్థం చేసుకోవడం కుదర్దు. పరిశీలన ద్వారా కాదు. ధ్యానం ద్వారా అర్థం చేసుకోవాలి. వ్యక్తి లోపలికి, ఆత్మాశ్రయ తత్వంలోనికి అడుగు పెట్టాలి. అపుడు అక్కడికి వెళితే మనిషి దేవుడన్న రహాస్యాన్ని కనుక్కుంటాం.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

16 Oct 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 13

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 13 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 9. సౌకర్యము - సంస్కారము - 1 🌻

ఆధునిక యుగమున మానవుడు సాధించిన విజయములలో ప్రయాణ వాహనములు శ్లాఘింప దగినవి. చోటులోనికి చొచ్చుకు పోయినట్లు వేగముగ ప్రయాణము చేయు ఈ యంత్రములు చోటుపై మానవుడు సాధించిన మొదటి విజయము, ఆకాశములో ఎగురుట రెండవ విజయము. తత్కారణముగ సూక్ష్మ లోకములలో విహరించుట, వేగముగా విహరించుట, తేలికగ విహరించుట అను కుంభరాశీ తత్త్వమునకు శుభారంభము చేసెను.

కాని పై చెప్పిన విజయముల వెనుకనున్న ఉద్దేశ్యము మాత్రము స్వార్థచింతనయే. ఒకరిపై నొకరు అధిక్యతకు వీనిని వినియోగించుట ద్వారా ఈ సౌకర్యములు మానవ పతనమునకు, హానికి దారితీయును. సూక్ష్మమైన సౌకర్యములు కూడ స్వార్ధ పూరిత ఉద్దేశ్యములతో ముడి వేయబడుట చేత మానవ చేతస్సు పరిణితి చెందకపోగా పతనమగుటకు అవకాశమేర్పడును. విజ్ఞాన లోకములో మానవుడు పొందిన విజయములతో సమానముగ చేతన కూడ పెరుగవలెనన్న భావము ఆలోచనా పొరలలో కూడ కలుగుకుండుట దురదృష్టము.

దుర్జనుడగు తనయునికి సకలైశ్వర్యములు, సకలసౌకర్యములు కల్పించినచో ఏమగును? సౌకర్యములు పెరిగి సంస్కారము పెరుగకుండుట హానికరము. సంస్కారము పెరుగుచున్నను సౌకర్యములు లేనిచో జీవితమున అపాయమేమియు లేకున్నను, సంఘపరమైన అభివృద్ధి యుండదు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

16 Oct 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 496 / Vishnu Sahasranama Contemplation - 496

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 496 / Vishnu Sahasranama Contemplation - 496🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 496. గోప్తా, गोप्ता, Goptā 🌻

ఓం గోప్త్రే నమః | ॐ गोप्त्रे नमः | OM Goptre namaḥ

జగతో రక్షకో విష్ణుస్సర్వభూతాని పాలయన్ ।
గోప్తేతి కథ్యతే విశ్వసృష్టిస్థితివినాశకృత్ ॥

జగద్రక్షకుడైన విష్ణువు సర్వభూతములనూ పాలించుచుండును గనుక గోప్తా అని పిలువబడును. విశ్వమును సృజించుట త్రికృత్యములలో మొదటిది; సంహారము చివరిది. రెంటి నడుమ సాగెడి కృత్యము జగముల పాలకత్వము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 496 🌹

📚. Prasad Bharadwaj

🌻 496. Goptā 🌻

OM Goptre namaḥ

जगतो रक्षको विष्णुस्सर्वभूतानि पालयन् ।
गोप्तेति कथ्यते विश्वसृष्टिस्थितिविनाशकृत् ॥

Jagato rakṣako viṣṇussarvabhūtāni pālayan,
Gopteti kathyate viśvasr‌ṣṭisthitivināśakr‌t.

As the protector of worlds, Lord Viṣṇu sustains and protects all the beings. Sustenance is one of the three phases viz creation, sustenance and annihilation.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

16 Oct 2021

16-OCTOBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 16, శనివారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 99 / Bhagavad-Gita - 99- 2-52🌹*
3) 🌹. శ్రీమద్భగవద్గీత - 667 / Bhagavad-Gita - 667 -18-78🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 496 / Vishnu Sahasranama Contemplation - 496🌹
5) 🌹 DAILY WISDOM - 174🌹 
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 13🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 80🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 313-1/ Sri Lalitha Chaitanya Vijnanam - 313-1🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*16 శనివారం, అక్టోబర్‌ 2021*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ వేంకటేశ అష్టకం -2 🍀*

గోవిందో గోపతిః కృష్ణః కేశవో గరుడధ్వజః |
వరాహో వామనశ్చైవ నారాయణ అధోక్షజః || 3 ||

శ్రీధరః పుండరీకాక్షః సర్వదేవస్తుతో హరిః |
శ్రీనృసింహో మహాసింహః సూత్రాకారః పురాతనః || 4 ||
🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 17:39:17 వరకు తదుపరి శుక్ల ద్వాదశి
పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: ధనిష్ట 09:23:04 వరకు తదుపరి శతభిషం
యోగం: దండ 22:40:40 వరకు తదుపరి వృధ్ధి
కరణం: విష్టి 17:41:17 వరకు
వర్జ్యం: 16:43:18 - 18:21:22
దుర్ముహూర్తం: 07:43:13 - 08:30:11
రాహు కాలం: 09:05:24 - 10:33:26
గుళిక కాలం: 06:09:19 - 07:37:21
యమ గండం: 13:29:32 - 14:57:34
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24
అమృత కాలం: 26:31:42 - 28:09:46 
సూర్యోదయం: 06:09:19, సూర్యాస్తమయం: 17:53:40
వైదిక సూర్యోదయం: 06:12:53
వైదిక సూర్యాస్తమయం: 17:50:04
చంద్రోదయం: 15:26:52, చంద్రాస్తమయం: 02:18:39
సూర్య సంచార రాశి: కన్య, చంద్ర సంచార రాశి: కుంభం
ఆనందాదియోగం: వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం 
09:23:04 వరకు తదుపరి ఆనంద యోగం - కార్య సిధ్ధి 
పండుగలు : పాంపంకుశ ఏకాదశి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 99 / Bhagavad-Gita - 99 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 52 🌴

52. యదా తే మోహకలిలం 
బుద్ధిర్వ్యతితరిష్యతి ||
తదా గన్తాసి నిర్వేదం 
శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||

🌷. తాత్పర్యం :
ఎప్పుడు నీ బుద్ధి దట్టమైన మొహారణ్యమును దదాటునో అప్పుడు నీవు వినినదాని యెడ మరియు వినవలసిన దాని యెడ విరక్తిని కలిగిన వాడవగుదువు. 

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుని యెడ గల భక్తియుత సేవ ద్వారా వేదములందలి కర్మల యెడ విరాగామును పొందిన మహాభక్తుల ఉదాహరణములు పెక్కులు కలవు. కృష్ణుని గూర్చియు మరియు కృష్ణునితో తనకు గల సంబంధమును గూర్చియు మనుజుడు వాస్తవముగా నెరిగినప్పుడు తానూ అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడు అయినప్పటికిని అతడు సర్వవిధములైన కామ్యకర్మల యెడ విరక్తుడగును. పరమభక్తుడును మరియు భక్తిపరంపరలో ఆచార్యుడును అగు శ్రీమాధవేంద్రపురి ఈ క్రింది విధముగా పలికిరి. 

సంధ్యావందన భద్రమస్తు భవతో భో:స్నాన తుభ్యం నమో భో దేవా: పితరశ్చ తర్పణవిధౌ నాహం క్షమ: క్షమ్యతామ్ |
యాత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్తమస్య కంసద్విష: స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేన మే ||

“ఓ సంధ్యావందనమా! నీకు భద్రమగుగాక! ఓ స్నానమా! నీకు నేను నమస్సులు అర్పింతును. ఓ దేవతలారా! ఓ పితృదేవతలారా! మీకు వందనములను అర్పింపలేని నా ఆశక్తతకు నన్ను మన్నింపుడు. ఇప్పుడు నేనెచ్చట నిలిచియున్నను కంసారియైన యాదవకులోత్తముని (శ్రీకృష్ణుని) తలచుచు సర్వపాపబంధముల నుండి విముక్తుడను కాగలను. ఇదియే నాకు చాలునని నేను భావించుచున్నాను.”

త్రిసంధ్యల యందును వివిధస్తుతులను కావించుట, తెల్లవారుఝామునే స్నానము చేయుట, పితృదేవతలకు వందనములొసగుట వంటి వేదవిహిత కర్మలు మరియు పద్ధతులు ప్రారంభదశలో నున్న భక్తులకు తప్పనిసరియైనవి. కాని కృష్ణభక్తిభావన యందు మనుజుడు పూర్ణుడైనప్పుడు మరియు ఆ దేవదేవుని ప్రేమయుత సేవలో నియుక్తుడైనపుడు పుర్ణత్వమును సాధించిన కారణమున ఈ విధివిధానముల యెడ విరాగామును పొందును. 

శ్రీకృష్ణభగవానుని భక్తి ద్వారా ఈ స్థితికి చేరగలిగినవాడు శాస్త్రమునందు తెలియజేయబడిన వివిధతపస్సులను, యజ్ఞములను నిర్వహింపవలసిన అవసరము లేదు. దీనికి విరుద్ధముగా వేదప్రయోజనము శ్రీకృష్ణుని చేరుటకే ననెడి విషయము తెలియక కేవలము వేదపరమైన కర్మల యందు మగ్నమైనవాడు ఆ కర్మల యందు కాలమును వృథాచేసినట్లే యగును. అనగా కృష్ణభక్తి యందున్నవారు “శబ్ధబ్రహ్మము” లేదా వేదోపనిషత్తులను అతిశయించుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 99 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 2 - Sankhya Yoga - 52 🌴

52. yadā te moha-kalilaṁ buddhir vyatitariṣyati
tadā gantāsi nirvedaṁ śrotavyasya śrutasya ca

🌷Translation :
When your intelligence has passed out of the dense forest of delusion, you shall become indifferent to all that has been heard and all that is to be heard.

🌷 Purport :
There are many good examples in the lives of the great devotees of the Lord of those who became indifferent to the rituals of the Vedas simply by devotional service to the Lord. When a person factually understands Kṛṣṇa and his relationship with Kṛṣṇa, he naturally becomes completely indifferent to the rituals of fruitive activities, even though an experienced brāhmaṇa. Śrī Mādhavendra Purī, a great devotee and ācārya in the line of the devotees, says:

sandhyā-vandana bhadram astu bhavato bhoḥ snāna tubhyaṁ namo
bho devāḥ pitaraś ca tarpaṇa-vidhau nāhaṁ kṣamaḥ kṣamyatām
yatra kvāpi niṣadya yādava-kulottaṁsasya kaṁsa-dviṣaḥ
smāraṁ smāram aghaṁ harāmi tad alaṁ manye kim anyena me

“O my prayers three times a day, all glory to you. O bathing, I offer my obeisances unto you. O demigods! O forefathers! Please excuse me for my inability to offer you my respects. Now wherever I sit, I can remember the great descendant of the Yadu dynasty [Kṛṣṇa], the enemy of Kaṁsa, and thereby I can free myself from all sinful bondage. I think this is sufficient for me.”

The Vedic rites and rituals are imperative for neophytes: comprehending all kinds of prayer three times a day, taking a bath early in the morning, offering respects to the forefathers, etc. But when one is fully in Kṛṣṇa consciousness and is engaged in His transcendental loving service, one becomes indifferent to all these regulative principles because he has already attained perfection.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 667 / Bhagavad-Gita - 667 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 78 🌴*

78. యత్ర యోగేశ్వర: కృష్ణో 
యత్ర పార్థో ధనుర్ధర: |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా 
నీతిర్మతిర్మమ ||

🌷. తాత్పర్యం : 
*యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు మేటి ధనుర్ధారియైన అర్జునుడు ఎచ్చట ఉందురో అచ్చట సంపద, విజయము, అసాధారణశక్తి, నీతి నిశ్చయముగా నుండును. ఇదియే నా అభిప్రాయము.*

🌷. భాష్యము :
భగవద్గీత ధృతరాష్ట్రుని విచారణలో ఆరంభమైనది. భీష్మ, ద్రోణ, కర్ణాది మహాయోధులచే సహాయమును పొందుచున్న తన కుమారులు విజయము పట్ల అతడు మిగుల ఆశను కలిగియుండెను. విజయము తన పక్షమునకే సిద్ధించునని అతడు భావించుచుండెను. 

కాని యుద్ధరంగమున జరిగిన సన్నివేశమును వివరించిన పిమ్మట సంజయుడు ధృతరాష్ట్రునితో “నీవు విజయమును గూర్చి ఆలోచించినను, నా అభిప్రాయము ప్రకారము శ్రీకృష్ణార్జునులు ఎచ్చట నుందురో అచ్చటనే సర్వశుభము కలుగగలదు” అని పలికెను. అనగా ధృతరాష్ట్రుడు తన పక్షమున విజయమును ఆశింపరాదని అతడు ప్రత్యక్షముగా నిర్ధారించినాడు. 

శ్రీకృష్ణుడు నిలిచియున్నందున అర్జునుని పక్షమునకే విజయము సిద్ధించుననుట నిశ్చయమైన విషయము. ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు అర్జునుని రథచోదకుడగుట ఆ భగవానుని మరొక విభూతియై యున్నది. శ్రీకృష్ణునకు గల పలువిభూతులలో వైరాగ్యము ఒకటి. 

శ్రీకృష్ణుడు వైరాగ్యమునకు సైతము ప్రభువైనందున అట్టి వైరాగ్యమును పలు సందర్భములలో ప్రదర్శించెను. వాస్తవమునకు రణము దుర్యోధనుడు మరియు ధర్మరాజు నడుమ సంభవించి యుండెను. అర్జునుడు కేవలము తన అగ్రజూడైన ధర్మరాజు తరపున పోరుటకు సిద్ధపడెను. ఆ విధముగా శ్రీకృష్ణార్జును లిరువురును ధర్మరాజు పక్షమున ఉండుటచే అతని విజయము తథ్యమై యుండెను. 

ప్రపంచమునెవరు పాలింపవలెనో నిర్ణయించుటకు ఆ యుద్ధము ఏర్పాటు చేయబడెను. అట్టి రాజ్యాధికారము యుధిష్టిరునకే సంప్రాప్తించునని సంజయుడు భవిష్యద్వాణిని పలికినాడు. అంతియేగాక యుద్ధ విజయానంతరము ధర్మరాజు మరింతగా సుఖసంపదలతో వర్థిల్లుననియు ఇచ్చట భవిష్యత్తు నిర్ణయింపబడినది. 

ధర్మరాజు ధర్మాత్ముడు మరియు పవిత్రుడే గాక గొప్ప నీతిమంతుడగుటయే అందులకు కారణము. అతడు జీవితమున ఎన్నడును అసత్యమును పలిగియుండలేదు.

భగవద్గీతను రణరంగమున ఇరువురు స్నేహితుల నడుమ జరిగిన సంభాషణగా భావించు మూఢులు పెక్కుమంది కలరు. కాని స్నేహితుల నడుమ జరిగెడి సాధారణ సంభాషణ లెన్నడును శాస్త్రము కాజాలదు. మరికొందరు అధర్మకార్యమైన యుద్ధమునకు శ్రీకృష్ణుడు అర్జునుని పురికొల్పెనని తమ అభ్యంతరమును తెలుపుదురు. కాని వాస్తవమునకు భగవద్గీత దివ్య ధర్మోపదేశమనెడి నిజస్థితి ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. 

దివ్య ధర్మోపదేశము గీత యందలి నవమాధ్యాయపు ముప్పదినాలుగవ శ్లోకమున “మన్మనాభవ మద్భక్త:”యని తెలుపబడినది. అనగా ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానునికి భక్తులు కావలసియున్నది. సర్వధర్మముల సారము శ్రీకృష్ణుని శరణుపొందుటయే (సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ). 

కనుక భగవద్గీత నీతి మరియు ధర్మముల దివ్య విధానములతో నిండియున్నది. ఇతరమార్గములు సైతము పవిత్ర్రీకరణమొనర్చునవే యైనను మరియు అంత్యమున ఈ మార్గమునకే మనుజుని గొనివచ్చునవైనను భగవద్గీత యందలి చివరి ఉపదేశమే నీతి మరియు ధర్మ విషయమున శ్రీకృష్ణభగవానుని శరణాగతి. 

అట్టి శరణాగతియే అష్టాదశాధ్యాయపు తుది నిర్ణయమై యున్నది.

🍀. సమాప్తం.... 🙏
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 667 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 78 🌴*

78. yatra yogeśvaraḥ kṛṣṇo
yatra pārtho dhanur-dharaḥ
tatra śrīr vijayo bhūtir
dhruvā nītir matir mama

🌷 Translation : 
*Wherever there is Kṛṣṇa, the master of all mystics, and wherever there is Arjuna, the supreme archer, there will also certainly be opulence, victory, extraordinary power, and morality. That is my opinion.*

🌹 Purport :
The Bhagavad-gītā began with an inquiry of Dhṛtarāṣṭra’s. He was hopeful of the victory of his sons, assisted by great warriors like Bhīṣma, Droṇa and Karṇa. 

He was hopeful that the victory would be on his side. But after describing the scene on the battlefield, Sañjaya told the King, “You are thinking of victory, but my opinion is that where Kṛṣṇa and Arjuna are present, there will be all good fortune.” He directly confirmed that Dhṛtarāṣṭra could not expect victory for his side. 

Victory was certain for the side of Arjuna because Kṛṣṇa was there. Kṛṣṇa’s acceptance of the post of charioteer for Arjuna was an exhibition of another opulence. Kṛṣṇa is full of all opulences, and renunciation is one of them. There are many instances of such renunciation, for Kṛṣṇa is also the master of renunciation.

The fight was actually between Duryodhana and Yudhiṣṭhira. Arjuna was fighting on behalf of his elder brother, Yudhiṣṭhira. Because Kṛṣṇa and Arjuna were on the side of Yudhiṣṭhira, Yudhiṣṭhira’s victory was certain. 

The battle was to decide who would rule the world, and Sañjaya predicted that the power would be transferred to Yudhiṣṭhira. It is also predicted here that Yudhiṣṭhira, after gaining victory in this battle, would flourish more and more because not only was he righteous and pious but he was also a strict moralist. He never spoke a lie during his life.

There are many less intelligent persons who take Bhagavad-gītā to be a discussion of topics between two friends on a battlefield. But such a book cannot be scripture. Some may protest that Kṛṣṇa incited Arjuna to fight, which is immoral, but the reality of the situation is clearly stated: Bhagavad-gītā is the supreme instruction in morality. 

The supreme instruction of morality is stated in the Ninth Chapter, in the thirty-fourth verse: man-manā bhava mad-bhaktaḥ. One must become a devotee of Kṛṣṇa, and the essence of all religion is to surrender unto Kṛṣṇa (sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja). The instructions of Bhagavad-gītā constitute the supreme process of religion and of morality. 

All other processes may be purifying and may lead to this process, but the last instruction of the Gītā is the last word in all morality and religion: surrender unto Kṛṣṇa. This is the verdict of the Eighteenth Chapter.

🍀 The End...🙏
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 496 / Vishnu Sahasranama Contemplation - 496🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 496. గోప్తా, गोप्ता, Goptā 🌻*

*ఓం గోప్త్రే నమః | ॐ गोप्त्रे नमः | OM Goptre namaḥ*

జగతో రక్షకో విష్ణుస్సర్వభూతాని పాలయన్ ।
గోప్తేతి కథ్యతే విశ్వసృష్టిస్థితివినాశకృత్ ॥

జగద్రక్షకుడైన విష్ణువు సర్వభూతములనూ పాలించుచుండును గనుక గోప్తా అని పిలువబడును. విశ్వమును సృజించుట త్రికృత్యములలో మొదటిది; సంహారము చివరిది. రెంటి నడుమ సాగెడి కృత్యము జగముల పాలకత్వము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 496 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 496. Goptā 🌻*

*OM Goptre namaḥ*

जगतो रक्षको विष्णुस्सर्वभूतानि पालयन् ।
गोप्तेति कथ्यते विश्वसृष्टिस्थितिविनाशकृत् ॥

Jagato rakṣako viṣṇussarvabhūtāni pālayan,
Gopteti kathyate viśvasr‌ṣṭisthitivināśakr‌t.

As the protector of worlds, Lord Viṣṇu sustains and protects all the beings. Sustenance is one of the three phases viz creation, sustenance and annihilation.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

 Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 174 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 22. There is an Unintelligible Relationship between Man and Nature 🌻*

We may be thinking that it is ours, but a time comes when those things assert their independence. “Oh, we are absolutely independent, just as you are. You think that we belong to you, as well as we may think that you belong to us. Why should I belong to you, sir? Why shouldn’t you belong to me?” Why do we say some objects are ‘mine’, some objects are ‘yours’? What makes us think like that? The others also may think that we belong to them. Instead of other things belonging to us, we may belong to something else. 

There is a relativity of belonging and relationship. Sometimes we are told that this is the world of relativity, one thing hanging on another and nothing absolutely independent by itself. We hang on something else, that thing hangs on us. This is a simple, crude explanation of the relativity of things, which will be more fully explained in the next lesson. There is an unintelligible relationship between man and nature.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 13 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 9. సౌకర్యము - సంస్కారము - 1 🌻*

ఆధునిక యుగమున మానవుడు సాధించిన విజయములలో ప్రయాణ వాహనములు శ్లాఘింప దగినవి. చోటులోనికి చొచ్చుకు పోయినట్లు వేగముగ ప్రయాణము చేయు ఈ యంత్రములు చోటుపై మానవుడు సాధించిన మొదటి విజయము, ఆకాశములో ఎగురుట రెండవ విజయము. తత్కారణముగ సూక్ష్మ లోకములలో విహరించుట, వేగముగా విహరించుట, తేలికగ విహరించుట అను కుంభరాశీ తత్త్వమునకు శుభారంభము చేసెను. 

కాని పై చెప్పిన విజయముల వెనుకనున్న ఉద్దేశ్యము మాత్రము స్వార్థచింతనయే. ఒకరిపై నొకరు అధిక్యతకు వీనిని వినియోగించుట ద్వారా ఈ సౌకర్యములు మానవ పతనమునకు, హానికి దారితీయును. సూక్ష్మమైన సౌకర్యములు కూడ స్వార్ధ పూరిత ఉద్దేశ్యములతో ముడి వేయబడుట చేత మానవ చేతస్సు పరిణితి చెందకపోగా పతనమగుటకు అవకాశమేర్పడును. విజ్ఞాన లోకములో మానవుడు పొందిన విజయములతో సమానముగ చేతన కూడ పెరుగవలెనన్న భావము ఆలోచనా పొరలలో కూడ కలుగుకుండుట దురదృష్టము. 

దుర్జనుడగు తనయునికి సకలైశ్వర్యములు, సకలసౌకర్యములు కల్పించినచో ఏమగును? సౌకర్యములు పెరిగి సంస్కారము పెరుగకుండుట హానికరము. సంస్కారము పెరుగుచున్నను సౌకర్యములు లేనిచో జీవితమున అపాయమేమియు లేకున్నను, సంఘపరమైన అభివృద్ధి యుండదు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 80 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. మనిషి బయటి నించీ చూస్తే అత్యల్పుడు. చిన్ని ధూళి కణం. కానీ లోపలి నించి చూస్తే, అతని కేంద్రం నించీ చూస్తే అతను సమస్త విశ్వం. మనుషుల్ని బుద్దుల ద్వారా, కృష్ణుల ద్వారా, అర్థం చేసుకోవాలి. ధ్యానం ద్వారా అర్థం చేసుకోవాలి. 🍀*

మనిషి అశాశ్వతంగా కనిపిస్తాడు. ఎంతో అత్యల్పంగా, ఒక మంచు బిందువులా అనిపిస్తాడు. కానీ సమస్త సముద్రాలు అతనిలో నిక్షిప్తమయి వున్నాయి. అన్ని ఆకాశాలు అతనిలో లీనమయి వున్నాయి. బయటి నించీ చూస్తే అతను అత్యల్పుడు. చిన్ని ధూళి కణం. ధూళిలో ధూళి. అంతే. కానీ లోపలి నించి చూస్తే, అతని కేంద్రం నించీ చూస్తే అతను సమస్త విశ్వం. సైన్సుని, మతానికి వున్న తేడా అది. 

సైన్సు మనిషిని బాహ్యం నించీ చూస్తుంది. ఆధ్యాత్మికంగా చూడదు. దైవత్వాన్ని చూడదు. కేవలం భౌతికంగా, రసాయనికంగా, శారీరకంగా యింకో జంతువుని చూసినట్లు చూస్తుంది. అందుకనే సైంటిస్టులు ఎంత సేపు మనిషిని అర్థం చేసుకోవడానికి యితర జంతువుల్ని పరిశోధిస్తారు. జంతువులు సామాన్యమైనవి. సులభంగా వాటిని లొంగదీసుకోవచ్చు. అందుకని సైంటిస్టులు వాటిపై పరిశోధనలు చేస్తారు. వాటిని బట్టి వచ్చిన నిర్ణయాల్ని మానవజీవికి అంటగడతారు. సైంటిస్టులు మనుషుల్ని ఎలుకల స్థాయికి దిగజార్చారు. మనిషిని కుక్కల ద్వారా, ఎలుకల ద్వారా అంచనా వేస్తున్నారు. 

మనుషుల్ని బుద్దుల ద్వారా, కృష్ణుల ద్వారా, అర్థం చేసుకోవాలి. ఇది ప్రాథమిక విషయంగా అవగాహన చేసుకోవాలి. ఉన్నతమైన దానిని అల్పమైన దాని ద్వారా అర్థం చేసుకోకుడదు. ఉన్నతమైన దాని ద్వారా అల్పస్థాయి లోనిది అర్థం చేసుకోవచ్చు కానీ అల్పమైన దాని ద్వారా ఉన్నతమైన దానిని అర్థం చేసుకోవటం కుదరదు. మనిషిని బయటి నించీ అర్థం చేసుకోవడం కుదర్దు. పరిశీలన ద్వారా కాదు. ధ్యానం ద్వారా అర్థం చేసుకోవాలి. వ్యక్తి లోపలికి, ఆత్మాశ్రయ తత్వంలోనికి అడుగు పెట్టాలి. అపుడు అక్కడికి వెళితే మనిషి దేవుడన్న రహాస్యాన్ని కనుక్కుంటాం. 

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 313-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 313-1🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*

*🌻 313-1. 'రమా' 🌻* 

రమ అనగా శ్రీ- వాణి అని అర్థము. లక్ష్మీ సరస్వతి తత్త్వముల కలయికను రమ తత్త్వముగ సంహితలు తెలుపుచున్నవి. లక్ష్మి అనగా సృష్టి సంపద. సరస్వతి అనగా వాక్ సంపద లేక విద్యా సంపద. ఎక్కడ విద్య వుండునో అక్కడ లక్ష్మి వుండుట అరుదు. ఎక్కడ లక్ష్మి యుండునో అక్కడ సరస్వతి యుండుట కూడ అరుదే. అందు వలన లక్ష్మీ సరస్వతులను అత్తా కోడళ్ళుగ పురాణములు పేర్కొను చుండును. 

అమిత ధనవంతులలో విద్యావంతులు అరుదు. అమిత విద్యావంతులలో ధనవంతులు అరుదు. ఇది లోక విదితము. ధన సంపాదనకు విద్యతో సంబంధము లేదు. లోక జ్ఞానమున్న చాలును. లోక జ్ఞానము కలవారు ధనవంతులు కాగలరు. విద్య మేధస్సునకు సంబంధించినది. మేధాబలమునకు అధిష్టాన దేవత సరస్వతి. విద్య యందు రతిగొనువారికి సంపద యందు మోజు ఉండదు. సంపద యందు మోజు గలవారికి విద్యయందు ఆసక్తి యుండదు. సంపద, విద్య ఒకచోట వుండుట వైభవము. ఈ వైభవము శ్రీదేవి అనుగ్రహము. యోగుల యందు కూడ భోగము గలవారు గలరు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 313-1 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya*
*Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻*

*🌻 313. Ramā रमा (313)-1 🌻*

Ramā means Lakṣmī, (consort of Viṣṇu) the goddess of wealth. She is in the form of Lakṣmī and bestows wealth on Her devotees. The wealth indicates both materialistic wealth and spiritual wealth. Nāma-s 313, 314 and 315 together form kāmakalā bīja ‘ īm‌ ’ (ईँ). This nāma gives the alphabet ‘Ī’ (ई). 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹