మైత్రేయ మహర్షి బోధనలు - 13


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 13 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 9. సౌకర్యము - సంస్కారము - 1 🌻


ఆధునిక యుగమున మానవుడు సాధించిన విజయములలో ప్రయాణ వాహనములు శ్లాఘింప దగినవి. చోటులోనికి చొచ్చుకు పోయినట్లు వేగముగ ప్రయాణము చేయు ఈ యంత్రములు చోటుపై మానవుడు సాధించిన మొదటి విజయము, ఆకాశములో ఎగురుట రెండవ విజయము. తత్కారణముగ సూక్ష్మ లోకములలో విహరించుట, వేగముగా విహరించుట, తేలికగ విహరించుట అను కుంభరాశీ తత్త్వమునకు శుభారంభము చేసెను.

కాని పై చెప్పిన విజయముల వెనుకనున్న ఉద్దేశ్యము మాత్రము స్వార్థచింతనయే. ఒకరిపై నొకరు అధిక్యతకు వీనిని వినియోగించుట ద్వారా ఈ సౌకర్యములు మానవ పతనమునకు, హానికి దారితీయును. సూక్ష్మమైన సౌకర్యములు కూడ స్వార్ధ పూరిత ఉద్దేశ్యములతో ముడి వేయబడుట చేత మానవ చేతస్సు పరిణితి చెందకపోగా పతనమగుటకు అవకాశమేర్పడును. విజ్ఞాన లోకములో మానవుడు పొందిన విజయములతో సమానముగ చేతన కూడ పెరుగవలెనన్న భావము ఆలోచనా పొరలలో కూడ కలుగుకుండుట దురదృష్టము.

దుర్జనుడగు తనయునికి సకలైశ్వర్యములు, సకలసౌకర్యములు కల్పించినచో ఏమగును? సౌకర్యములు పెరిగి సంస్కారము పెరుగకుండుట హానికరము. సంస్కారము పెరుగుచున్నను సౌకర్యములు లేనిచో జీవితమున అపాయమేమియు లేకున్నను, సంఘపరమైన అభివృద్ధి యుండదు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


16 Oct 2021

No comments:

Post a Comment